‘‘ఏమన్న చేయాలె.. టీఆర్‌ఎస్‌ను ఓడగొట్టాలె. ఎన్ని అబద్ధాలైనా చెప్పాలని కుట్రలు పన్నుతున్నరు. కుట్రల్లో కొత్త కుట్ర.. సిగ్గు, శరం, పౌరుషం లేకుండా హీనాతి హీనంగా చంద్రబాబును తోలుకొస్తుండ్రు. ఆమోదిస్తదా తెలంగాణ? చిల్లర రాజకీయం కోసం నీచాతినీచంగా దిగజారి చంద్రబాబును తొలుకొచ్చి ఆయనకున్న హాఫ్ పర్సెంటో, జీరో పర్సెంటో ఓట్లుంటే దాంతోని గండం గట్టెక్కాలని కాంగ్రెస్ నేతలు చూస్తుండ్రు. సిగ్గు కూడా లేదు. చంద్రబాబు నిన్న విజయవాడలో ఒక మాట మాట్లాడిండు. అదో తమాషా. తెలుగోళ్లం ఒక్కటి అని కేసీఆర్‌కు చెప్పిన.. ఇద్దరం ఒక్కటైతే ఢిల్లీలో ఫలితం ఉంటదని చెప్పిన.. నా వెంట కేసీఆర్ రాలేదు. అందుకే మహాకూటమి వెంట వచ్చినన్నడు.