పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానాలను కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తప్పుబట్టారు. ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించిందని ఆయన అన్నారు. పోలవరం పనులపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సర్కారు తప్పుడు నివేదికలు ఇచ్చిందని తెలిపారు.