నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాయన్న విమర్శలకు కేంద్రం ఘాటుగా సమాధానమిచ్చింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తొలి త్రైమాసికంలో దేశీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) దారుణంగా పడిపోయిన దరిమిలా ఆర్థిక వ్యవస్థపై భయాందోళనలు అవసరం లేదని భరోసా ఇస్తూ.. ఉపాధి కల్పనకు ప్రణాళికను ప్రకటించింది.