రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీసీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కొని తన బినామీలకు కట్టబెట్టారని విమర్శించారు. రాజధాని నిర్మాణంపై చర్చ సందర్భంగా మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని పేరుతో డ్రామాలాడారే తప్ప ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదని మండిపడ్డారు. చంద్రబాబుకు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని విమర్శించారు.