ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ చేపట్టాలని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వి. విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి మరీ నిరసన తెలిపారు. రూల్ 267 కింద స్వల్పకాలిక చర్చకు పట్టుబట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో ఈ అంశంపై మంగళవారం చర్చ చేపట్టనున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.