Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AP Police Over Action At Sakshi Editor Dhanunjaya Reddy1
పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ‘సాక్షి’పై ఏపీ సర్కార్‌ కక్ష సాధింపు

సాక్షి, విజయవాడ: ఏపీలో పత్రికా స్వేచ్చకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో సాక్షిపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసినందుకు సాక్షి పత్రిక ఎడిటర్‌ ధనుంజయ రెడ్డిపై పోలీసులు వేధింపు చర్యలకు దిగారు. సోదాల పేరుతో ఏపీ పోలీసులు గురువారం ఉదయం.. సాక్షి ఎడిటర్‌ ధనుంజయ రెడ్డికి చేరుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండానే ధనుంజయ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేశారు. ఇంట్లోకి వెళ్లిన పోలీసులు.. కాసేపటికే ఇంటి తలుపులు మూసివేసి గంటల తరబడి సోదాలు చేశారు. అయితే, గతంలోనూ ధనుంజయ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తూ కథనాలు రాసిన పలువురు సాక్షి విలేకర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.ఏసీపీ ప్రవర్తన దుర్మార్గం: ధనుంజయ రెడ్డి అనంతరం, సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 9:45కి పది మంది పోలీసులు ఇంటికి వచ్చారు. సోదాలకు సంబంధించి‌ నోటీసులు లేకుండా ఇంట్లోకి దూసుకొచ్చేశారు. ఏసీపీ మరింత దుర్మార్గంగా ప్రవర్తించారు. నోటీస్ కూడా ఇవ్వకుండా సోదాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తాయి. ప్రజల గొంతుకై ‘సాక్షి’ నిలుస్తుంది అని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు కేసులు పెట్టారు. ప్రస్తుతం హైకోర్టు పరిధిలో కేసు ఉంది. సంబంధం లేదని వాళ్లే చెబుతారు. మళ్లీ వారే సోదాలు చేస్తారు. ప్రెస్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకి కూడా మేము ఫిర్యాదు ఇస్తాం. మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ పద్ధతిని ఖండించాలి’ అని అన్నారు. ఖండించిన పాత్రికేయులుఏపీలో ఎమ‌ర్జెన్సీ నాటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని పాత్రికేయులు మండిప‌డుతున్నారు. కూటమి ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను, ప్ర‌జా వ్య‌తిరేక చ‌ర్య‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నందుకే సాక్షిపై చంద్ర‌బాబు స‌ర్కారు క‌క్ష సాధిస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌ను ప్ర‌జాసంఘాల‌తో పాటు ప్ర‌జ‌లు ముక్త కంఠంతో వ్య‌తిరేకిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న అక్ర‌మాల‌ను నిగ్గ‌దీసి అడుగుతున్నందుకు, క‌క్ష గ‌ట్టి ప్ర‌జల గొంతును నొక్కాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నంలో భాగంగానే కూట‌మి స‌ర్కారు ఇదంతా చేస్తోంద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తూనే ఉంటామ‌ని, ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకునేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి కొన‌సాగిస్తామ‌న్నారు. సాక్షిపై కక్ష సాధింపు చ‌ర్య‌ల‌ను ప‌త్రికా స్వేచ్ఛ‌పై జ‌రిగిన దాడిగా పాత్రికేయులు పేర్కొన్నారు. ప్ర‌భుత్వం రాజ్యాంగ‌బ‌ద్దంగా న‌డుచుకోవాల‌ని కక్ష సాధింపు చ‌ర్య‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

Centre holds all-party meeting to brief Operation Sindoor2
ఆపరేషన్ సిందూర్‌ కొనసాగుతుంది.. కేంద్రం ప్రకటన

ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఆపరేషన్‌ సిందూర్‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు. వివిధ రాజకీయ పార్టీలకు ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలియజేశారు. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఇక, వైఎస్సార్‌సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు.అఖిలపక్ష సమావేశంలో భాగంగా రాజ్‌నాథ్‌ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌లో కనీసం 100 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని అన్నారు. అనంతరం, కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌ను అన్ని పార్టీలు సమర్థించాయి. కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతం. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్‌ వివరాలు ఇవ్వలేం. పాకిస్తాన్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దు’ అని చెప్పుకొచ్చారు.పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట భారత్‌ గట్టిగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆపరేషన్ గురించి వివరించేందుకు ప్రభుత్వం తాజాగా అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దేశమంతా ఐక్యంగా నిలబడాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని వినిపించింది. ఈ భేటీకి ముందు ప్రధాని మోదీ నివాసానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చారు. ప్రస్తుత భద్రతా పరిస్థితులను ప్రధానికి వెల్లడించారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరగడం ఇది రెండోసారి. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ భేటీకి కేంద్రం తరఫున మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, ఎస్‌.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్‌, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించారు.#WATCH | Centre holds all-party meeting to brief all political parties on #OperationSindoor pic.twitter.com/q96NZnhUY6— ANI (@ANI) May 8, 2025

Kommineni Srinivasa Rao Comments On Revanth Reddy3
చంద్రబాబు బాటలో​నే రేవంత్‌.. ఇదేం రాజకీయం!

ఆర్థిక పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేవంత్‌ వ్యాఖ్యల్లో వాస్తవమున్నప్పటికీ ఆయన కూడా తన రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాటే పట్టారేమో అనిపిస్తుంది. ఎన్నికల ముందు ఆకాశం మీ చేతుల్లోకి తెచ్చేస్తానన్న రీతిలో హామీలివ్వడం.. తీరా అధికారం చేపట్టిన తరువాత ఖజానా చూస్తే హామీల అమలుపై భయమేస్తోందని సన్నాయి నొక్కులు నొక్కడంలో చంద్రబాబు ఆరితేరిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రేవంత్‌ కూడా అదే మాదిరిగా.. అప్పులు కూడా పుట్టడం లేదని చెబుతున్నట్లు అనిపిస్తోంది.నిజానికి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇంత బహిరంగంగా మాట్లాడడం సరికాకపోవచ్చు. వాస్తవాలు చెబుతున్న కారణంగా అంతా సర్దుకు పోతారని ఆయన భావన కావచ్చు. కాని దీనివల్ల రాష్ట్రం పరపతి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు అప్పులు నిజంగానే పుట్టడం లేదా అంటే ఆంధ్రప్రదేశ్‌లో పదకుండు నెలల్లోనే రూ.1.5లక్షల కోట్ల అప్పు చేస్తే, తెలంగాణలో రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేశారు. అదనంగా అప్పులకు వెళితే ఇస్తున్నట్లు లేరు. దేనికైనా పరిమితులు ఉంటాయి. తోచినట్లు వాగ్దానాలు చేసి,అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అప్పులు పుట్టడం లేదని, బ్యాంకులు తమను దొంగల్లా చూస్తున్నాయని అంటే ప్రజలు ఏమని అనుకుంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులకు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని, తీరు చూస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతారేమో అన్నట్లుగా పరిస్థితి దేశం ముందట ఉందని రేవంత్ అన్నారు.ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. దీనికంతటికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడని రేవంత్ చెప్పవచ్చు. కాని అది పరిష్కారం కాదు. సరైన జవాబు కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే రాష్ట్ర అప్పులపై రేవంత్ కాని, ఇతర కాంగ్రెస్ నేతలు కాని అనేక విమర్శలు చేశారు. అయినా అధికారం రాబట్టుకోవడం కోసం ఎన్ని అసాధ్యమైన హామీలు ఇచ్చారో గుర్తులేదా? ఆరు గ్యారంటీలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియకుండానే వాగ్దానం చేశారా? అలా చేస్తే అది బాధ్యతారాహిత్యం కాదా? అదేమంటే రేవంత్ ఇచ్చిన సమాధానం చూడండి. ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మూడు లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి ఇదెంత సంసారం. చక్కదిద్దవచ్చని అనుకున్నానని ఆయన చెప్పారు. తీరా చూస్తే మూడు లక్షల కోట్ల ఆదాయం లేదు.. రెండు లక్షల కోట్లే ఆదాయం, అప్పు ఎనిమిది లక్షల కోట్లు ఉంది అని ఆయన వివరిస్తున్నారు.సరిగ్గా చంద్రబాబు కూడా ఏపీలో ఇలాగే మాట్లాడారు. తనకు ఎన్నికల ముందు అన్నీ ఇవ్వవచ్చని అనుకున్నానని, కాని లోపలికి వెళ్లి చూస్తే ఏమీ లేదని, ఖజానా ఖాళీగా కనబడస్తా ఉందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ముందు రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేసిన చంద్రబాబు తీరా బడ్జెట్‌లో రూ. ఆరున్నర లక్షల కోట్లే ఉందని అంగీకరించారు. అయినా హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టడానికి ఈ కబుర్లు చెబుతున్నారన్న సంగతి ఏపీ ప్రజలకు అర్థమైంది. అదే ధోరణిలో రేవంత్ కూడా ఎన్నికలకు ముందు వంద రోజులలో అన్ని హామీలు చేసి చూపిస్తామని, రైతులకు రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఎవరైనా అప్పు చేయకపోతే బ్యాంకులకు వెళ్లి అప్పు తీసుకోండని చెప్పారా? లేదా? అది బాధ్యతారాహిత్యం కాదా? ఇప్పుడేమో తాను 18 గంటలు కష్టపడుతున్నానని, ఒక్క రోజైనా, ఒక్క గంట సెలవైనా తీసుకోలేదని సానుభూతి కోసం మాట్లాడుతున్నారు. నిజానికి ఏ సీఎం అయినా 18 గంటలు పనిచేస్తున్నానని చెబితే ఆ ప్రభుత్వం పద్దతిగా లేదని అర్థం.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. మిగిలినవారిని పని చేయనివ్వకుండా తానే పని చేస్తున్నానని చెప్పుకోవడానికి ఇలాంటి మాటలు పనికి వస్తాయి తప్ప జనానికి ఏమి ఉపయోగం? ఇది కూడా చంద్రబాబు తరహా మాటే.ఆయన కూడా తాను ఎంతలా కష్టపడుతున్నది పదే, పదే జనానికి చెబుతుంటారు. రేవంత్ కొత్తగా సీఎం అయి ఉండవచ్చు.ఆయన కొన్ని వాగ్దానాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయకపోలేదు. అయినా అన్నిటిని అమలు చేయడం కష్టం కనుక ఈ కొత్తరాగం ఎత్తుకున్నారు. అప్పులు, వాయిదాలకే రూ.7500 కోట్లు అవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటివారు రేవంత్‌కు మద్దతుగా మాట్లాడుతున్నా, అవి అంత కన్విన్సింగా కనిపించవు. ఏ ప్రభుత్వం ఉన్నా, రుణాలు చెల్లించవలసిందే కదా! ఒక్కసారి గతానికి వెళితే చంద్రబాబు నాయడు 1996 లోక్ సభ ఎన్నికలకు ముందు టీడీపీ అత్యధిక లోక్ సభ స్థానాలు గెలిస్తేనే కిలో రెండు రూపాయల బియ్యం, మద్య నిషేధం, మొదలైనవి కొనసాగుతాయని ప్రచారం చేశారు.ఎన్నికలు అయ్యాక మాత్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, మార్పులు చేయాలని, బియ్యం రేట్లు పెంచాలని, మద్య నిషేధం ఎత్తివేయాలంటూ ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఒక తంతు సాగించారు. ప్రతి ఎన్నికకు ముందు ఇదే తతంగం ఆయన సాగిస్తుంటారు. 2014లో రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని, బ్యాంకులలో తనఖాలో ఉన్న రైతుల భార్యల బంగారం కూడా విడిపిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆయన ఏదో అరకొర చేసి చేతులెత్తేశారు. 2024లో కూడా సూపర్ సిక్స్ అంటూ మరోసారి జనాన్ని మభ్య పెట్టడానికి వెనుకాడలేదు. ఈ రకంగా గురు, శిష్యులైన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకే బాటలో పయనించడం విశేషం.ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా అంత సహేతుకంగా అనిపించవు. తమ డిమాండ్లు నెరవేర్చాలన్న ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి ఎవరిపై మీ సమరం అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ఏమి ప్రయోజనం? తెలంగాణ రాష్ట్రం దివాళా తీయడానికి ఉద్యోగులు బాధ్యులు అవుతారా? లేక పాలన చేస్తున్న నేతలా?‘‘నన్ను కోసినా రూపాయి రాదు..ప్రభుత్వం అంటే నేను ఒక్కడినే కాదు..ప్రజా ప్రతినిధులు,, ప్రభుత్వ ఉద్యోగులు అంతా కలిస్తేనే ప్రభుత్వం’’ అంటూ సూత్రాలు చెబితే ఏమి లాభం. రేవంత్ ఒక్కసారి కాంగ్రెస్ మానిఫెస్టోని తిరిగి చదువుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని రకాల హామీలు ఇచ్చింది మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ చదివి వినిపించారు. వాటన్నిటిని ఏ బాధ్యతతో చేశారు? ఇప్పుడు వాటిని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అడిగితే ‘‘ఎవరిపై మీ సమరం?’’ అంటే వారేమి జవాబు ఇస్తారు! ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, తదితర వాగ్దానాలు చేశారా? లేదా? రేవంత్ తాను అన్ని నిజాలే చెప్పినట్లు అనుకోవచ్చు.కాని అది చెప్పిన తీరు బాగోలేదు. ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని అంతరంగికంగా చర్చలు జరిపి వారికి నచ్చ చెప్పి ఉండవచ్చు. ఫలానా సమయానికి తాను హామీలు అమలు చేయగలుగుతామని చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా ఇంత బహిరంగంగా వేరే కార్యక్రమంలో ఉద్యోగులను బెదిరించే రీతిలో మాట్లాడడం వల్ల ఆయనకే నష్టం. రేవంత్ తీరువల్ల రాష్ట్ర పరువు పోయిందని బీఆర్‌ఎస్‌, బీజేపీలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ముఖ్యమంత్రి పై మండిపడ్డారు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ తాను నిజాలే మాట్లాడుతున్నానులే అనుకుని సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ సీఎంకు చేతకావడం లేదని ప్రజలు అనుకునే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్‌లో కూడా దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి.కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు వెళతాయి. కుల గణన ద్వారా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయిందని ప్రచారం చేసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ దివాళా తీసిందని చెప్పడం ద్వారా దేశానికి ఏమి సంకేతం ఇచ్చినట్లయింది? అసలే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో రేటింగ్ తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డే దానిని మరింత తగ్గించుకున్నట్లుగా ఉంది. ఎన్నికలకు ముందు పొలిటికల్ సైన్స్, ఎన్నికల తర్వాత ఎకనామిక్స్ చెబితే జనం నమ్ముతారా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

He Is Batting Better Than Karun Nair: Aakash Chopra Suggests Change in DC XI4
కరుణ్‌ నాయర్‌ కంటే బెటర్‌.. అతడిని ‘తుదిజట్టు’లోకి తీసుకోండి!

ఐపీఎల్‌-2025 (IPL 2025) ఆరంభంలో వరుస విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిట.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అక్షర్‌ సేన.. ఆరింట గెలిచి.. నాలుగు ఓడిపోయింది.ఐదో స్థానంలోఇక చివరగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో వెనుకబడ్డ ఢిల్లీ.. అదృష్టవశాత్తూ వర్షం వల్ల గట్టెక్కింది. ఉప్పల్‌లో వాన తెరిపినిచ్చినా ఆట సాగేందుకు వీలు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్‌ రాగా.. ఢిల్లీ ఖాతాలో ఓవరాల్‌గా 13 పాయింట్లు చేరాయి.తద్వారా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్‌ టైటాన్స్‌, ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ తర్వాత.. ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం మరో కీలక పోరుకు ఢిల్లీ సిద్ధమైంది.పటిష్ట పంజాబ్‌ కింగ్స్‌ (PBKS vs DC)తో ధర్మశాల వేదికగా తలపడనుంది. ఇందులో గెలిస్తేనే ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సులభతరంగా మారతాయి. లేదంటే.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇంతటి కీలక మ్యాచ్‌కు ముందు భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) ఢిల్లీ యాజమాన్యానికి కీలక సూచన చేశాడు.కరుణ్‌, అభిషేక్‌ల కంటే బెటర్‌పవర్‌ హిట్టర్‌ అశుతోష్‌ శర్మను తుదిజట్టులోకి తీసుకోవాలని ఆకాశ్‌ చోప్రా సూచించాడు. ‘‘అశుతోష్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా కాకుండా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఆడించండి. మీరు తొలుత బ్యాటింగ్‌ చేసినట్లైతే ఇదే సరైన వ్యూహం.విప్రాజ్‌ నిగమ్‌ తర్వాత అతడిని పంపండి. నిజానికి కరుణ్‌ నాయర్‌, అభిషేక్‌ పోరెల్‌ కంటే అశుతోష్‌ మెరుగ్గా, నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. కాబట్టి అందరూ అవుటైన తర్వాత కాకుండా ముందే అతడిని బ్యాటింగ్‌కు పంపండి.మ్యాచ్‌ మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకుని.. మలుపు తిప్పగల సత్తా అతడికి ఉంది’’ అని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎందుకు మారుతుందో తనకైతే అర్థం కావడం లేదని ఈ కామెంటేటర్‌ పేర్కొన్నాడు.వారి వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు‘‘ఇప్పటికి దాదాపు ఆరు ఓపెనింగ్‌ జోడీలను మార్చి ఉంటారు. దీని వెనుక వారి వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదు. ఓపెనర్ల విషయంలోనే స్పష్టత లేకపోతే.. ప్లే ఆఫ్స్‌ చేరడం కూడా కష్టమే అవుతుంది’’ అని ఆకాశ్‌ చోప్రా విమర్శలు గుప్పించాడు.ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫినిషర్‌గా అశుతోష్‌ శర్మ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్‌ ఆడి 186 పరుగులు చేశాడు. మరోవైపు.. కరుణ్‌ నాయర్‌ 7 ఇన్నింగ్స్‌ ఆడి 154 పరుగులు చేయగా.. అభిషేక్‌ పోరెల్‌ 11 ఇన్నింగ్స్‌లో 265 రన్స్‌ సాధించాడు.చదవండి: KKR vs CSK: పో.. పో!.. వరుణ్‌ చక్రవర్తికి షాకిచ్చిన బీసీసీఐ

Colonel Sofiya Father Taj Mohammed Qureshi Said I am proud of my daughter.5
'అస్సలు ఇది ఊహించలేదు చాలా గర్వంగా ఉంది'..! సోఫియా తండ్రి భావోద్వేగం

పహల్గాం ఉగ్రవాద దాడికి భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్‌' చేపట్టి తగిన రీతీలో బదులిచ్చింది. దీనిపై యావత్ దేశం హర్షాతీరేకాలు వ్యక్తం చేసింది. అన్నింటికంటే ఈ ఆపరేషన్‌ సిందూర్‌ గురించి మీడియా ముందు వెల్లండించిన ఇద్దరు మహిళా అధికారులు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇది ఒకరకంగా భారత రక్షణదళం ఎవరి సారథ్యంలో కొనసాగుతోంది అనేది ప్రపంచానికి తెలిసేలా చేసింది. వారే కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్‌లు. అయితే తాతా ముత్తాతల నుంచి ఆర్మీలో సేవలందిస్తున్న సోఫియా కుటుంబం తమ కుమార్తె చేసిన పనికి ఆనందపారవశ్యంలో మునిగితేలుతోంది. 'ఇది మాకెంతో గర్వం' అని భావోద్వేగంగా చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆమె తండ్రి తాజ్ మొహమ్మద్ ఖురేషి సైతం ఇలాంటి గొప్ప అవకాశం తన కుమార్తెకు వస్తుందని కల్లో కూడా ఊహించలేదన్నారు. ఆమె కారణంగా ఈ రోజు యావత్ దేశానికి తమ కుటుంబం గురించి తెలిసేలా వార్తల్లో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో సోఫియాకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఆమె కుటుంబసభ్యుల మాటల్లోనే చూద్దామా..!.తమ కుమార్తె భారత ఆర్మీ, నేవీ, వైమానిక బలగాలు సంయుక్తంగా నిర్వహించి ఈ సిందూర్‌ ఆపరేషన్‌ గురించి మీడియా ముందుకు వచ్చి చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు కల్నల్‌ సోఫియా తల్లి హనిమా ఖురేషి. అంతేగాదు తమ కుమార్తె సోపియా కొడుకు(18) కూడా ఐఏఎఫ్‌(IAF)లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడని అన్నారామె. ఇక కల్నల్‌ సోషియా తండ్రి తాజ్‌ ఖురేషి మాట్లాడుతూ.."నా కుమార్తె పట్ల నాకు గర్వంగా ఉంది" నా కుటుంబం ఎల్లప్పుడూ 'వయం రాష్ట్రే జాగ్రయం ( జాతి మొత్తాన్ని సజీవంగా, జాగరూకతతో ఉండేలా చేస్తాం)' అనే సూత్రాన్ని పాటిస్తుంది. 'ముందు మేము భారతీయులం ఆ తర్వాతే ముస్లీంలం' అని సగర్వంగా అన్నారు తాజ్‌ మొహ్మద్‌ ఖురేషి. అంతేగాదు ఆమె తాతతో ప్రారంభమైన ఈ దేశ సేవను..సోపియా మూడవ తరం సైనిక అధికారిగా ముందుకు తీసుకెళ్తుందన్నారు. Meet Taj Qureshi, the proud father of Colonel Sofiya Qureshi 🇮🇳“My grandfather, father & I were all in the #IndianArmy If I get a chance today, I will destroy Pakistan”Imagine RW & Godi Media question their patriotism everyday 💔Mad respect for the REAL HEROES OF INDIA 🫡🇮🇳 pic.twitter.com/CDHH2XoJkt— Ankit Mayank (@mr_mayank) May 7, 2025 ఇక సోఫియా తండ్రి తాజ్‌ ఖురేషి వడోదరలో ఎలక్ట్రానిక్ అండ్‌ మెకానికల్‌ ఇంజనీర్స్‌ కార్ఫ్స్‌ పనిచేయడమే గాక 1971 యుద్ధంలో సేవలందించారు. అలాగే సోఫియా తండ్రి (తాజ్‌)గారి అమ్మమ్మ తాతయ్య బ్రిటిష్ సైన్యంలో పనిచేయడమే గాక 1857 స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు కూడా. ఇక ఆమెకు ముగ్గురు సోదరులు కూడా ఉన్నారు. వారిలో ఒకరైన మొహమ్మద్ సంజయ్ ఖురేషి మాట్లాడుతూ..'దేశ భక్తి మా రక్తంలోనే ఉంది' అని సగర్వంగా చెప్పారు. ఎందుకంటే సోఫియా ప్రొఫెసర్‌ కావాలనుకుంని, అనివార్య కారణాలతో భారత ఆర్మీ యూనిఫాం ధరించిందని అన్నారు. అలా ఆమె కుటుంబ సంప్రదాయన్ని పుణికి పుచ్చుకుందని అన్నారు. ఇక ఆమె భర్త తాజుద్దీన్‌ ఆర్మీ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారి కావడం విశేషం. చివరిగా కుటుంబ సభ్యులంతా.."ఆమె మాకు ఆదర్శం... ప్రతీకారం తీర్చుకోవడానికి మేము చాలా కాలంగా ఎదురుచూశామం కానీ, ఇలాంటి అద్భుత అవకాశం మా కుటుంబ సభ్యల్లో ఒకరికి దక్కడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ పహల్గాం ఘటనలో భర్తలను కోల్పోయిన సోదరీమణులు, తల్లుల ఆక్రందనలకు సిందూరంతో ప్రతీకారం తీర్చుకున్నాం" అని అన్నారు. కాగా, సోఫియా పేరు మీద అనేక అవార్డులు కూడా ఉన్నాయట. అలాగే భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక కవాతులో పాల్గొన్న 18 కంటింజెంట్లలో ఏకైక మహిళా కమాండర్‌ సోఫియానే అట.విద్యా నేపథ్యం:కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్‌ మీడియంలో పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ తర్వాత 1995లో బీఎస్సీ, 1997లో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరేందుకు తన పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ని మధ్యలోనే విడిచిపెట్టినట్లు వివరించారు. ఇక సైన్యంలో చేరాక తన కెరీర్‌లో ఆరేళ్లు యూఎన్‌ శాంతి పరిరక్షక దళాలలో పని చేయడం, సంఘర్షణ ప్రాంతాలలో పనిచేయడం, మానవతా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం వంటి ఎన్నో అద్భుత సేవలందించారామె.(చదవండి: నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా..)

Uttarakhand Helicopter crash in Uttarkashi6
ఉత్తరాఖండ్‌ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ సోదరి మృతి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఉత్తర కాశీ జిల్లాలో హెలికాప్టర్‌ కూలిపోయిన (Chopper Crashes) ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.వివరాల ప్రకారం.. ఉత్తర కాశీ జిల్లాలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో కొందరు పర్యాటకులతో గంగోత్రికి వెళ్తున్న హెలికాప్టర్‌ భగీరథి నది (Bhagirathi River) సమీపంలో కుప్పకూలిపోయింది. కాగా, ప్రమాద సమయంలో అందులో ఏడుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు.అయితే, ఈ ప్రమాదంలో టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ సోదరి వేదవతి కుమారి (48) మృతిచెందారు. ఈ ఘటనలో అంబికా లక్ష్మీ నారాయణ బావ భాస్కర్ (51) గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడిన భాస్కర్‌ను రిషికేష్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ రుషికేశ్‌ బయలుదేరారు. A Helicopter carrying devotees to Gangotri crashed near Gangnani in Uttarakhand's Uttarkashi; 5 dead, 2 injuredRescue operations are underway, Administration and relief teams are present at the crash site.#Uttrakhand #Uttarkashi pic.twitter.com/3bix32iBnN— Ishani K (@IshaniKrishnaa) May 8, 2025విమాన ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, జిల్లా పరిపాలన బృందాలు సహాయక చర్యల కోసం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంపై దర్యాప్తు చేయాలని ఆదేశించినట్టు తెలిపారు.

AP High Court Key Orders On IPS Kanthi Rana And Vishal Gunni7
జత్వానీ కేసు.. ఐపీఎస్‌ కాంతిరాణా, విశాల్‌ గున్నీకి ఊరట

సాక్షి, అమరావతి: సినీ నటి జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్‌ గున్నీలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జత్వానీ వ్యవహారంలో కేసులను క్వాష్‌ చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో పోలీసుల తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను జూన్‌ 30వ తేదీకి వాయిదా వేసింది. గత విచారణలో ఇలా..కొద్ది రోజుల క్రితం డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో విచారణ చేసి అరెస్ట్‌ చేసినందుకే సినీనటి కాదంబరి జత్వానీ కక్షపూరితంగా తమపై తప్పుడు కేసు పెట్టారని ఐపీఎస్‌ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణలు హైకోర్టుకు నివేదించారు. కాంతిరాణా టాటా తదితరులపై కేసు నమోదు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని వారి తరఫు సీనియర్‌ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌కుమార్‌ దేశ్‌పాండే వివరించారు.జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోసం కాంతిరాణా టాటా, విశాల్‌ గున్నీ, కె.హనుమంతరావు, ఎం.సత్యనారాయణ, న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్‌ కృపాసాగర్‌ మరోసారి విచారణ జరిపారు. కాంతిరాణ టాటా తదితరుల తరఫు సీనియర్‌ న్యాయవాదులు సుబ్రహ్మణ్య శ్రీరాం, వేములపాటి పట్టాభి, వినోద్‌ కుమార్‌ దేశ్‌పాండే వాదనలు వినిపిస్తూ.. ‘పోలీసు అధికారులుగా తమకు వచ్చిన ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్ట ప్రకారం జత్వానీని విచారించడమే తప్పు అన్నట్లుగా పిటిషనర్లపై కేసులు నమోదు చేశారు. విధి నిర్వహణలో భాగంగా చేసిన చర్యలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు. కేసు కట్టి విచారణ జరపడాన్ని నేరంగా పరిగణించిన దాఖలాలేవీ గతంలో లేవు.చట్ట ప్రకారం నిందితులను విచారించడం నేరం ఎలా అవుతుంది? జత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో పేర్లు లేకపోయినప్పటికీ పోలీసులు కొందరిని నిందితులుగా చేర్చారు. ఆమెను విచారించిన పోలీసు అధికారులు ఎవరో కూడా జత్వానీకి తెలియదు. అలాంటప్పుడు పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారు?. జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో ఇదే హైకోర్టు ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలి..’ అని కోర్టును కోరారు.అనంతరం సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ జత్వానీ విషయంలో పిటిషనర్లందరూ కుట్ర పూరితంగా వ్యవహరించారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తేల్చేందుకు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జత్వానీ తరఫు న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభునాథ్, నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు.

humanoid robot malfunctioned during testing8
చిర్రెత్తిన యంత్రుడు.. ఎవరికీ చిక్కడు

కృత్రిమ మేధ ఎంత ప్రయోజనకరమో అంత ప్రమాదకరమని కొందరు భావిస్తున్నారు. ప్రపంచంలో నిత్యం జరుగుతున్న కొన్ని సంఘటనలే అందుకు కారణం. రజనీకాంత్‌ రోబో సినిమాలో విలన్‌ సైంటిస్ట్‌ తయారు చేసిన రోబో టేబుల్‌పై నుంచి బన్‌ తీయమంటే గన్‌ తీస్తుంది కదా. అంతటితో ఆగకుండా ఏకంగా ఆ విలన్‌నే గన్‌తో చంపాలనుకుంటుంది. దాదాపు అలాంటి సంఘటనలే ప్రస్తుతం జరుగుతున్నాయి. హ్యుమనాయిడ్‌ రోబోల పరీక్ష సమయంలో చాలా ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి.యునిట్రీ అనే కంపెనీ రూపొందించిన హ్యుమనాయిడ్‌ రోబోను ఇటీవల పరీక్షిస్తున్న సమయంలో ప్రమాదకర సంఘటన జరిగింది. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో విడుదలైన వీడియో వైరల్‌గా మారింది. అందులోని వివరాల ప్రకారం.. చైనా ఫ్యాక్టరీలో ఈ హ్యుమనాయిడ్‌ రోబోను క్రేన్‌ ఆసరాతో నిలబెట్టారు. టెస్టింగ్‌ సమయంలో ఒక్కసారిగా రోబో ఉన్నట్టుండి తన చేతులతో దాడికి పాల్పడింది. క్రేన్‌కు వేళాడుతున్నా ఆ రోబో చుట్టూ కదులుతూ, క్రేన్‌ను సైతం లాగుతూ సమీపంలోని వస్తువులను చిందరవందర చేసింది. వెంటనే దాన్ని పరీక్షించే వ్యక్తి రోబో కనెక్షన్‌ కట్‌ చేయడంతో నిదానించింది.An AI robot attacks its programmers as soon as it is activated in China. pic.twitter.com/d4KUcJQvtD— Aprajita Nefes 🦋 Ancient Believer (@aprajitanefes) May 2, 2025ఇదీ చదవండి: గూగుల్‌ 200 ఉద్యోగాల్లో కోత!ఇతర కంపెనీ రోబోలు కూడా..యునిట్రీ రోబోలు మాత్రమే కాదు.. ఇంతర కంపెనీలకు చెందిన రోబోలు ఇలా విచిత్రంగా ప్రవర్తించిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ ప్రదర్శనలో హ్యూమనాయిడ్ రోబోలు గుంపులుగా వెళ్తూ ఒకటి మానవులపైకి దూసుకొస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈశాన్య చైనాలోని టియాంజిన్‌లో జరిగిన స్ప్రింగ్ ఫెస్టివల్ గాలాలో తీసిన వీడియోలో జాకెట్ ధరించిన రోబో అకస్మాత్తుగా బారికేడ్ వెనుక గుమిగూడిన ప్రేక్షకుల గుంపు వైపు దూసుకెళ్లింది. గతంలో ఓ కంపెనీ కర్మాగారంలో రోబోట్ ఇంజినీర్‌పై దాడి చేసిందని వార్తలొచ్చాయి. సాఫ్ట్‌వేర్‌ లోపాలు, అంతర్లీనంగా ఉండే కారణాలతో కొన్నిసార్లు ఇలా ప్రవర్తిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. ఏదేమైనా మానవుల సమూహంతో కలిసి వీటిని వాడుకలోకి తీసుకురావాలంటే కచ్చితమైన, స్పష్టమైన ఎన్నో పరీక్షలు నిర్వహించాలని, వీటి పాలసీల్లో పక్కా నిబంధనలు రూపొందించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Srinidhi Shetty Got Emotional In A Interview Telling About Her Mother9
ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు.. డిప్రెషన్‌లోకి వెళ్లా: శ్రిధి శెట్టి

తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించిన నటి శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty ). యష్ నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఈ కన్నడ భామ, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’తో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గడించింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత శ్రీనిధికి వరుసగా అవకాశాలు వచ్చాయి. తమిళంలో విక్రమ్‌తో ‘కోబ్రా’ చిత్రంలో నటించగా, నాని నటించిన ‘హిట్: ది థర్డ్ కేస్’(HIT3)తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఎదగాడానికి శ్రీనిధి చాలానే కష్టపడింది. ఎన్నో బాధలను అదిగమించి ఈ స్థాయికి చేరుకుంది. చిన్నతనంలోనే ఆమె అమ్మను కోల్పోయింది. కొన్నాళ్ల పాటు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిందట. బెంగళూరికి వచ్చిన తర్వాతే తన జీవితం మారిపోయిందంటోంది శ్రీనిధి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడుతూ..ఎమోషనల్‌ అయింది.‘నేను పదో తరగతి చదువుతున్న సమయంలో మా అమ్మ చనిపోయింది. ఆ షాక్‌ను నేను తట్టుకోలేకపోయాను. కొన్నాళ్లపాటు డిప్రెషన్‌లోకి వెళ్లాను. ఆ ఇంట్లోనే ఉండాలనిపించలేదు. గతాన్ని మర్చిపోయేందుకు బెంగళూరుకు వెళ్లిపోయాను. అయినా, అమ్మను మర్చిపోలేకపోయాను. చాలా రోజులు ఆమెను తలుచుకుంటూ ఏడ్చాను. ఈ ఘటన నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టింది. బెంగళూరుకు వచ్చిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. జైన్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత, కొంతకాలం అక్సెంచర్‌లో ఉద్యోగం చేశా. మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టాను. 2016లో మిస్ సుప్రానేషనల్ టైటిల్‌ గెలవడం.. అక్కడ సినిమాల్లోకి రావడం..పాన్‌ ఇండియా సినిమాల్లో నటించడం..ఇవన్నీ ఓ కలలా అనిస్తున్నాయి’ అని శ్రినిధి చెప్పుకొచ్చింది. ఇక తండ్రి గురించి మాట్లాడుతూ.. నాన్నతో ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాను. ఆయన నాకు చాలా సపోర్ట్‌గా ఉన్నారు’అని చెప్పింది.శ్రినిధి సినీ కెరీర్‌ విషయానికొస్తే..‘హిట్: ది థర్డ్ కేస్’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమెకు..తొలి సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం, సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘తెలుసు కదా’, కిచ్చా సుదీప్‌తో ‘కిచ్చా 47’ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇటీవల నితేష్ తివారీ రామాయణంలో సీత పాత్ర కోసం ఆమెకు అవకాశం రాగా, ‘కేజీఎఫ్’లో యష్‌తో జంటగా నటించిన కారణంగా ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది.

High alert in rajasthan punjab and borders sealed after Operation Sindoor10
దేశ సరిహద్దుల్లో హైఅలర్ట్‌.. సిద్ధంగా క్షిపణులు

ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) తర్వాత భారత్‌, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఉగ్రవాదదేశం ఏవిధంగా స్పందిస్తుందనే విషయమై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.పాక్‌ వైపు నుంచి ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు భారత త్రివిధ దళాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌తో సరిహద్దు కలిగి ఉన్న రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాలలో హై అలర్ట్‌ ప్రకంటించారు. రిహద్దులను మూసివేసి గస్తీని ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడవద్దని ఆదేశాలు జారీచేశారు.పాకిస్థాన్‌తో రాజస్థాన్‌ 1037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది. దీనిని పూర్తిగా మూసివేశారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే స్పాట్‌లోనే కాల్చివేసేలా భద్రతా బలగాలకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హైఅలర్ట్‌ ప్రకటించింది. ఫైటర్‌ జెట్స్‌ ప్రొటోకాల్‌ నేపథ్యంలో జోధ్‌పూర్‌, కిషన్‌గఢ్‌, బికనీర్‌లో విమానాల రాకపోకలపై ఈ నెల 9 వరకు నిషేధం విధించారు.సరిహద్దుల్లో యాంటీ డ్రోన్‌ వ్యవస్థతోపాటు మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థను యాక్టివేట్‌ చేశారు. గంగానగర్‌ నుంచి రాణా ఆఫ్‌ కట్‌ వరకు సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానాలు ఎయిర్‌ పొట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో బికనీర్‌, గంగానగర్, జైసల్మేర్‌, బర్మేర్‌లో జిల్లాల్లో స్కూళ్లను మూసివేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదావేశారు. అత్యవసర సేవల్లో ఉండే ఉద్యోగుల సెలవులను రద్దుచేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement