న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా కళ్లుచెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో నిషేదానికి గురై భారత జట్టులో స్థానం కోల్పోయిన పాండ్యా.. రీఎంట్రీలో అదరగొట్టాడు. మైమరిపించే ఫీల్డింగ్‌తో మైదానంలోని ఆటగాళ్లను.. అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. చహల్ వేసిన 17వ ఓవర్ తొలి బంతిని కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ముందుకొచ్చి షాట్ ఆడగా.. ఫార్వార్డ్ ఫీల్డింగ్ ఉన్న పాండ్యా సూపర్ డైవ్‌తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. రెప్పపాటులోనే పాండ్యా సూపర్ క్యాచ్ అందుకోవడంతో విలియమ్సన్(28) నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో కివీస్‌కు పెద్ద దెబ్బపడింది.
పాండ్యా ఈజ్ బ్యాక్..
Published Mon, Jan 28 2019 9:53 AM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
Advertisement