టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. గాయం కారణంగా కుల్దీప్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయినా కుల్దీప్ వార్తల్లో నిలిచాడు. మైదానం బయట కూర్చొని కుల్‌దీప్ చేసిన కొన్ని సైగలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. భారత్ విజయం కాయమన్న సందర్బంలో కెమెరామెన్ డగౌట్‌లో ఉన్న కుల్దీప్‌ను పదే పదే చూపించాడు. దీన్ని గమనించిన కుల్దీప్ ఫన్నీగా చేతులతో సైగలు చేశాడు. ఈ సైగలపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.