దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్‌కు జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించిన ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌పై జీవితకాల నిషేధం విధించనున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ టెస్ట్ మ్యాచ్ నిషేధంతో పాటు, మ్యాచ్ ఫీజు 100 శాతం కోత వేసినట్లు ఐసీసీ ప్రకటించి అతడిపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్ తగిలింది. త్వరలో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -11వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్సీ నుంచి స్టీవ్ స్మిత్‌ను యాజమాన్యం తప్పించింది. నూతన కెప్టెన్‌గా టీమిండియా క్రికెటర్, అజింక్యా రహానేను నియమించింది