ప్రత్యేకహోదాపై తమ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటం చూసాకే చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. లేకుంటే ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చేప్పేవారని అభిప్రాయపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలు నెరవర్చడానికి వైఎస్‌ఆర్‌సీపీ కట్టుబడి ఉంటుందని తెలిపారు.