Top Stories
ప్రధాన వార్తలు

అంతా ఎల్లో మాయ.. రుషికొండా గోంగూరా అంటున్న కూటమి!
రుషికొండ నిర్మాణాల విషయంలో ఎల్లోమీడియా చేసిన రాద్ధాంతం గుర్తుందా?. టూరిజం శాఖ ఆధ్వర్యంలోని పాత భవనాలను తొలగించి అత్యాధునిక సదుపాయాలతో కొత్త భవనాలను నిర్మించే యోచన చేసినందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి నానా విమర్శలూ చేశాయి. పర్యావరణం నాశనమైపోతోందని గగ్గోలు పెట్టారు. రిషికొండకు గుండు కొడుతున్నారని దుర్మార్గపు ప్రచారం చేశారు.సీన్ కట్ చేస్తే.. ఆ అభిప్రాయాలు ఇప్పుడు మారిపోయాయి. రుషికొండ వృథాగా పడి ఉన్న భూమి అయిపోయింది. రుషులు నడయాడిన భూమి కాస్తా ప్రైవేటు సంస్థలకు సంపద సృష్టించే కొండలయ్యాయి. ఆ ప్రాంతాన్ని బోడిగుండు చేసినా, పర్యావరణం విధ్వంసమైనా ఫర్వాలేదు. అది అభివృద్ది కింద లెక్క. జగన్ ప్రభుత్వం తరఫున భవనాలు నిర్మిస్తే అదంతా ఆయన వ్యక్తిగత అవసరాల కోసం కడుతున్నట్లు. ప్రస్తుతం వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఉత్తపుణ్యానికి ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతుంటే అది గొప్ప పని.అదేమిటి! మీరే కదా.. రిషికొండపై ఎలాంటి నిర్మాణాలు జరగరాదని చెప్పారే! అని ఎవరైనా ప్రశ్నిస్తే, లోపల నవ్వుకుని పిచ్చోళ్లారా? మేము ఏది రాస్తే దానిని నమ్మాలి?. మళ్లీ మేము మాట మార్చి అబద్దాలు రాస్తే అవే నిజమని నమ్మాలి.. అన్న చందంగా ఎల్లో మీడియా కథనాలు ఉంటున్నాయి. ఎల్లో మీడియా ఇప్పుడు ఏం రాస్తోందో చూశారా!. రిషికొండ భూముల గురించి ప్రశ్నించినా, అమరావతి రాజధానిలో లక్ష ఎకరాల పచ్చటి పంట భూములను ఎందుకు నాశనం చేస్తున్నారని అడిగినా.. అది రాష్ట్ర ప్రగతిపై పగ పట్టినట్లట.. గతంలో ఏ మీడియా అయితే తెలుగుదేశం, జనసేన వంటి పార్టీల కోసం దారుణమైన అసత్యాలు ప్రచారం చేశాయో, ఇప్పుడు అదే మీడియా మొత్తం రివర్స్‌లో రాస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదట. వారు ఎకరా 99 పైసలకు ప్రైవేటు వారికి, ఉర్సా కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నా అడిగితే విషనాగు బుసలు కొడుతున్నట్లట. ఇలా నీచంగా తయారైంది వీరి జర్నలిజం.ఒకప్పుడు పవిత్రమైన వృత్తిగా ఉన్న ఈ పాత్రికేయాన్ని వ్యభిచార వ్యాపారంగా మార్చేశారన్న బాధ కలుగుతుంది. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరు ఏమీ చేయలేరు. రిషికొండపై ఐదెకరాల భూమిలో భవనాలు కడితేనే విధ్వంసం అయితే, మరి రాజధాని పేరుతో లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసం జరుగుతుంటే ఎవరూ ప్రశ్నించకూడదట. అది పెట్టుబడులను అడ్డుకోవడమట. ఊరూపేరులేని ఉర్సా కంపెనీకి సంబంధించి ప్రభుత్వమే ఇంతవరకు వివరణ ఇవ్వలేకపోయినా, తెలుగుదేశం పక్షాన ఎల్లో మీడియా మాత్రం భుజాన వేసుకుని అది గొప్ప కంపెనీ అని చెబుతోంది. రెండు నెలల క్రితం ఏర్పడిన సంస్థకు ఏకంగా మూడు వేల కోట్ల విలువైన అరవై ఎకరాల భూమిని ఎవరైనా ఇస్తారా?. అదానీకి గత జగన్ ప్రభుత్వం డేటా సెంటర్ నిమిత్తం ఎకరా కోటి రూపాయల చొప్పున భూమి ఇస్తే ఏపీని అదానీకి జగన్ రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేసిన వారికి, బోగస్ అని ఆరోపణలు ఎదుర్కుంటున్న కంపెనీ మాత్రం అంతర్జాతీయ సంస్థ. వినేవాడు ఉంటే చెప్పేవాడు ఏమైనా చెబుతాడని సామెత.ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా రీతి అలాగే ఉంది. జగన్ ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వార్తలు ఇస్తే తప్పు కాదు. కానీ, ఉన్నవి, లేనివి రాసి పాఠకులను మోసం చేసి, ప్రజలను ప్రభావితం చేయడానికి పత్రికలను పార్టీ కరపత్రాలుగా, టీవీలను బాకాలుగా మార్చేసుకుని నిస్సిగ్గుగా పనిచేస్తుండటమే విషాదకరం. అదే చంద్రబాబు ప్రభుత్వం రాగానే అంతా బ్రహ్మండం, భజగోవిందం అని ఒకటే భజన చేస్తున్నారు. ఇక, అమరావతి విషయానికి వద్దాం. అమరావతి రాజధానికి ఏభై వేల ఎకరాలు సరిపోతుందనే కదా గత ప్రభుత్వ హయాంలో చెప్పింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాలు ఎందుకు అని అడిగితే అంతర్జాతీయ నగరం కావాలా? మున్సిపాల్టీగానే ఉంచాలా అన్నది తేల్చుకోవాలన్నట్లుగా ముఖ్యమంత్రే బెదిరిస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం లేకపోతే అది ప్రపంచ నగరం కాదట. అంతర్జాతీయ స్టేడియం లేకపోతే గుర్తింపు ఉండదట. 2014 టర్మ్‌లో నవ నగరాలు అంటూ ఓ పెద్ద కాన్సెప్ట్ చెప్పారు కదా? అందులో క్రీడా నగరం కూడా ఉంది కదా? అప్పుడు కూడా స్టేడియం ప్లాన్ చేశారు కదా? మళ్లీ ఇప్పుడు ఈ పాట ఏమిటి అని అడగకూడదు. అడిగితే అమరావతికి అడ్డుపడినట్లు అన్నమాట.లక్ష ఎకరాలు, లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ ప్రకటించారు. లక్ష కోట్ల రూపాయల విలువైన పనులు కేవలం రాజధాని పేరుతో ఉన్న ఆ ముప్పై, నలభై గ్రామాలలోనే చేపడితే, మిగిలిన ప్రాంతం పరిస్థితి ఏమిటని ఎవరూ ప్రశ్నించకూడదు. అందుకే వ్యూహాత్మకంగా రాయలసీమకు ఏదో ఇస్తున్నామని, ఉత్తరాంధ్రకు ఇంకేదో ఇస్తున్నామని ఆ ప్రాంత ప్రజలను భ్రమలలో పెట్టడానికి కొన్ని కార్యక్రమాలు చేయడం, ప్రచారం సాగించడం జరుగుతోంది.ఉదాహరణకు ఎప్పటి నుంచో కడప సమీపంలోని కొప్పర్తి పారిశ్రామిక వాడను కొత్తగా ఇవ్వబోతున్నట్లు ఎల్లో మీడియా రాసింది. ఇదంతా డైవర్షన్ రాజకీయం అన్నమాట. మరో వైపు అమరావతి అంటే ఎంత విస్తీర్ణం, పరిధులు ఏమిటి అన్నదానిపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నోటిఫై చేయలేదట. ఇప్పుడు దానిపై ఆలోచన చేస్తారట. ఇంకో సంగతి చెప్పాలి. గత టర్మ్‌లో మోదీ శంకుస్థాపన చేయడానికి ముందు, ఆ తర్వాత, ఆయా నిర్మాణాలకు స్వయంగా చంద్రబాబు తన కుటుంబ సమేతంగా పూజలు, పునస్కారాలు చేసి మళ్లీ శంకుస్థాపనలు చేశారు. కేంద్రం నుంచి కొందరు ప్రముఖులను కూడా అందులో భాగస్వాములను చేశారు. గతంలో మాదిరే ఇప్పుడు కూడా ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకో మాట చెప్పాలి.తెలంగాణలో హైదరాబాద్‌లో 400 ఎకరాల భూమిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో నిర్మాణాలు చేయతలపెడితే పర్యావరణం విధ్వంసం అయిందని మోదీనే నానా యాగీ చేశారు. అలాంటిది ఏపీలో లక్ష ఎకరాలలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంటే, పచ్చటి పంట భూములను బీడులుగా మార్చుతుంటే, అదంతా అభివృద్ది అని మోదీ కూడా భావిస్తున్నారేమో తెలియదు. చంద్రబాబు, మోదీ.. 2019 టైమ్ లో తీవ్రంగా ఒకరినొకరు విమర్శించుకున్నారు. దేశ ప్రధానిని ఉగ్రవాది అని చంద్రబాబు అంటే, ఈయనను పెద్ద అవినీతిపరుడని, పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ ధ్వజమెత్తారు. 2024 నాటికి మళ్లీ సీన్ మారింది. వీరిద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. ఇదేమిటి.. ఇంత సీనియర్ నేతలు ఇలా చేయవచ్చా అని ఎవరైనా అమాయకులు అడిగితే అది వారి ఖర్మ అనుకోవాలి.గతసారి మోదీ అమరావతి వచ్చి చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి ఇచ్చి వెళ్లారని అప్పట్లో చంద్రబాబు నిందించేవారు. ప్రస్తుతం కేంద్రం బ్రహ్మాండంగా సాయం చేస్తోందని చెబుతున్నారు. అది నిజమో కాదో అందరికీ తెలుసు. రిషికొండ అయినా, అమరావతి అయినా తమ రాజకీయ అవసరాలకు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు అయినా ఆడగలుగుతున్నారు. అదే వారి గొప్పదనం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

సింహాచలం విషాదం.. గోడ నిర్మాణం వద్దని వైదికులు, అర్చకులు వారించినా..
విశాఖ: సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.సింహాచలం గోడ నిర్మాణంలో ఎలాంటి టెండర్ లేదు. నోటి మాటతో నిర్మాణం జరిగింది. దీంతో పాటు వైదిక నిబంధనలను ఉల్లంఘించినట్లు సింహాచలం చందనోత్సవంలో జరిగిన దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ చేపట్టిన రెండో రోజు విచారణలో తేలింది. విచారణలో భాగంగా త్రిసభ్య కమిషన్ విషాదానికి సంబంధించి ఆలయ అర్చకులు, వైదికుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. సింహగిరిలో కూలిన గోడపై త్రిసభ్య కమిటీ సభ్యుల విచారణలో.. దేవాలయంలో నోటి మాటతో గోడ నిర్మాణం చేపట్టారని, అనుమతులు, ప్రొసీజర్ ఫాలోకాలేదని స్పష్టమైంది. పైగా వైదిక నిబంధనలు సైతం ఉల్లంఘించారని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్‌కు సింహాచలం ఆలయ అర్చకులు వివరించారు. ‘మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టొద్దని ముందే చెప్పాం. అయినా మా మాట వినకుండా గోడ నిర్మాణం చేపట్టారని’ సింహాచలం వైదికులు, అర్చకులు వివరించారు. అర్చకులు, వైదికులు ఇచ్చిన సమాచారాన్ని, వివరణలను ఇవాళ ఏపీ ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో త్రిసభ్య కమిషన్ పొందుపరచనుంది.

CIA: ట్రంప్ ఎఫెక్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వేలాడుతున్న లేఆప్స్ కత్తి..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టారు.అమెరికా గూఢాచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)లో 1200 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.JUST IN: The CIA plans to cut 1,200 employees as the Trump admin eyes downsizing of thousands across the U.S. intelligence community. Keep cutting and downsizing the government!— Gunther Eagleman™ (@GuntherEagleman) May 2, 2025సీఐఏలో ఉద్యోగుల తొలగింపుపై ట్రంప్ పరిపాలన విభాగం చట్టసభ సభ్యులకు సమాచారం అందించింది. అయితే, సీఐఏ సంత్సరాలుగా తొలగింపులకు బదులుగా నియామకాల్ని నిలిపి వేసిన విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. సీఐఏ ఉద్యోగుల తొలగింపులపై ట్రంప్ పరిపాలన విభాగం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదే అంశంపై సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ మాట్లాడుతూ జాతీయ భద్రతా ప్రాధాన్యతలకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయి. ఈ చర్యలు సీఐఏ పటిష్టతకు దోహదం చేకూర్చడమే కాదు..ఏజెన్సీలో కొత్త శక్తిని నింపడానికి.. మరింత మెరుగ్గా మార్చడానికి చేపట్టిన వ్యూహంలో భాగం’ అని చెప్పారు.దేశంలో అనవసర ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ డోజ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఉద్యోగుల్నితొలగిస్తుంది. ఇప్పటికే పలు రంగాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించింది. కొద్ది రోజుల క్రితం ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్‌కు (ఐఆర్ఎస్) చెందిన 20000 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా, సీఐఏ ఉద్యోగుల్ని సైతం తొలగించే దిశగా చర్యలకు ఉపక్రమించింది.

టైటిల్ గెలిచేది ఆ జట్టే.. తొలిసారి ట్రోఫీని ముద్దాడుతారు: భారత దిగ్గజం
ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకోగా.. మిగతా తొమ్మిది జట్లు పదేసి మ్యాచ్‌లు ఆడేశాయి. ఈ క్రమంలో ముంబై, రాజస్తాన్‌కి ఇంకో మూడు.. మిగతా జట్లకు మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.అగ్రస్థానంలోఇక ఇప్పటికి పదకొండింట ఏడు గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు కూడా ఏడేసి మ్యాచ్‌లు గెలిచినా.. రన్‌రేటు పరంగా వెనుకబడి వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.ఇక పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో ఆరు మ్యాచ్‌లు గెలిచి ఇదే తరహాలో నాలుగు, ఐదు ర్యాంకుల్లో ఉన్నాయి. మరోవైపు.. లక్నో సూపర్ జెయింట్స్ ఐదు గెలిచి ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు విజయాలతో ఏడు, రాజస్తాన్ రాయల్స్ మూడు గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది.అట్టడుగునఅదే విధంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు , చెన్నై సూపర్ కింగ్స్ రెండు మాత్రమే గెలిచి అట్టడుగున తొమ్మిది, పది స్థానాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కాగా ఐపీఎల్-2024లో కేకేఆర్ విజేతగా నిలవగా.. సన్‌రైజర్స్ రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.ఈసారి ఈ రెండు జట్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాయి. మరోవైపు.. ఇంత వరకు టైటిల్ గెలవని ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మాత్రం అదరగొడుతున్నాయి.ముఖ్యంగా కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ సరికొత్త ఉత్సాహంతో వరుస విజయాలతో ఆకట్టుకుంటోంది. విరాట్ కోహ్లికి ఓపెనింగ్ జోడీగా వచ్చిన ఫిల్ సాల్ట్ అదరగొడుతుండగా.. బ్యాటర్‌గానూ రజత్ రాణిస్తున్నాడు. మరోవైపు.. దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్ అవసరమైనప్పుడల్లా జట్టును ఆదుకుంటున్నాడు.ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ ప్రభావం చూపుతుండగా.. స్పిన్నర్ కృనాల్ పాండ్యా ఈసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. సమిష్టి ప్రదర్శనకు నిదర్శనంఇప్పటికి గెలిచిన ఏడు మ్యాచ్‌లలో ఐదుగురు వేర్వేరు ప్లేయర్లు (కోహ్లి, కృనాల్ పాండ్యా (3), పాటిదార్ (2), ఫిల్ సాల్ట్, హాజిల్‌వుడ్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలవడం వారి సమిష్టి ప్రదర్శనకు నిదర్శనం. మొత్తానికి ఈసారి కలిసికట్టుగా రాణిస్తూ ఆర్సీబీ టైటిల్ గెలవాలన్న కలను సాకారం చేసుకునే దిశగా పయనిస్తోంది.టైటిల్ గెలిచేది ఆ జట్టే.. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఆర్సీబీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోంది.వాళ్ల ఫీల్డింగ్ కూడా సూపర్. ముంబై ఇండియన్స్ కూడా అదరగొడుతోంది. అయితే, మిగతా మ్యాచ్‌లలో కూడా వారు రాణిస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము.అయితే, ఇదే జోరు కనబరిస్తే వాళ్లకు తిరుగు ఉండదు. కానీ.. ఈసారి మాత్రం ఆర్సీబీనే టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది’’ అని గావస్కర్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తున్న ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడబోతోందని సన్నీ జోస్యం చెప్పాడు.చదవండి: Shubman Gill: అంపైర్‌తో గొడవపడి.. అభిషేక్‌ను కాలితో తన్ని!

భారత్‌తో దాయాది యుద్ధం.. బలం కోసం పాక్ ప్రధాని కొత్త ఎత్తులు!
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్ర దాడిలో కారణంగా ఈ పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, పాక్ ఆర్మీ సైనికులు ఈ ఘటనలో భాగం కావడంతో దాయాదిపై దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు చెక్ పెడుతూ.. ఎప్పటికప్పడు భారత్ బలగాలు యుద్దానికి సిద్ధమవుతున్నాయి. దీంతో, భారత్ చర్యలపై భయంతో వణికిపోతున్న పాక్.. రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ దేశాలతో పాక్ ప్రధాని మంతనాలు జరుపుతున్నారు.వివరాల ప్రకారం.. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్‌కు భారత్ భయం పట్టుకుంది. భారత్ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందో తెలియక భయంతో వణికిపోతోంది. మరోవైపు.. దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అనేక దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా సైతం చేతులు కలిపింది. దీంతో, పాకిస్తాన్‌కు మరింత ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో పాక్ సర్కార్.. ప్రపంచ దేశాల సాయం చేతులు చాస్తోంది. సాయం చేయాలని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మంతనాలు జరుపుతున్నారు.నేతలతో పాక్ ప్రధాని చర్చలు..తాజాగా ప్రధాని షహబాజ్ షరీఫ్.. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్‌తో మాట్లాడి రెండు దేశాల మధ్య ఘర్షణను తగ్గించాలని కోరారు. ఉద్రిక్తతలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని అరేబియా, యూఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాధినేతలతో భేటీ అయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హమర్ ఒబైద్ ఇబ్రహీం అల్ జాబీతో పాక్ ప్రధాని సమావేశమయ్యారు. కువైట్ రాయబారి నాసన్ రెహ్మన్ జాసన్‌ను కూడా పాక్ ప్రధాని కలిసి విజ్ఞప్తి చేశారు.Chinese Ambassador in Pakistan, H.E Jiang Zaidong calls on Prime Minister Muhammad Shehbaz Sharif in Islamabad.May 1, 2025. pic.twitter.com/wmJlR2b0gk— Prime Minister's Office (@PakPMO) May 2, 2025ఈ మేరకు పాక్ పీఎంఓ ఓ ప్రకటనలో.. పాకిస్తాన్‌లోని సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయిద్ అల్ మాలికితో షహబాబ్ సమావేశమైన ఫొటోను విడుదల చేసింది. ఈ సందర్బంగా దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కోసం పాకిస్తాన్ కృషి చేస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారని తెలిపింది. ఇదిలా ఉండగా.. భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పటికే చైనా, రష్యాలను అభ్యర్థించింది. ఈ దాడిపై నిష్పక్షపాత విచారణకు సహకరిస్తామని పాక్ చెప్పుకొచ్చింది.Ambassador of UAE to Pakistan H.E. Hamad Obaid Ibrahim Salem Al-Zaabi called on Prime Minister Muhammad Shehbaz Sharif.May 2, 2025. pic.twitter.com/c2KGCrKvbB— Prime Minister's Office (@PakPMO) May 2, 2025పాక్‌కు మద్దతిచ్చే దేశాలు ఇవే..ఇక, పాకిస్తాన్‌పై భారత్ దాడులు చేస్తే.. దాయాది కొన్ని దేశాలు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. చైనా, టర్కీ, అజర్ బైజాన్, బంగ్లాదేశ్, కొన్ని ముస్లిం లీగ్ దేశాలు పాక్‌కు అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు టర్కీ సైతం మద్దతు తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ కు మద్దతుగా పలుమార్లు టర్కీ నిలిచింది. భారత్‌తో వైరం కారణంగా చైనా.. పాక్‌కు అండగా ఉండనుంది. ప్రస్తుతం భారతదేశంలో అంతగా సఖ్యతలేని బంగ్లాదేశ్ కూడా పాక్‌కు మద్దతుగా నిలిచి అవకాశం కనిపిస్తున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో భాగంగా అక్కడ మారిన ప్రభుత్వం భారత్ కు అనుకూలంగా లేదు. కనుక ఈ దాయాది దేశం కూడా మనకు వ్యతిరేకంగా నిలిచి అవకాశం ఉంటుంది.

భారత్ రోడ్లపై టెస్లా కారు.. మొదటి ఓనర్ ఈయనే..
అమెరికాలో టాప్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారుగా ఉన్న టెస్లా సంస్థ కార్లు భారత్‌లోకి ప్రవేశించాయి. సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లవ్జీ దాలియా టెస్లా సైబర్‌ట్రక్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. వారం రోజులుగా టెస్లా సైబర్‌ట్రక్ సూరత్ రోడ్లపై కనిపిస్తూ సందడి చేస్తుంది. అయితే ఈ వాహనాన్ని దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు దాలియా కుమారుడు పీయూష్ తెలిపారు.ధర రూ.60 లక్షలు..లావ్జీ దాలియా కొనుగోలు చేసిన టెస్లా సైబర్‌ట్రక్ భారత్‌లోనే మొదటిదని పీయూష్ పేర్కొన్నారు. ‘మేము ఆన్లైన్లో తనిఖీ చేసిన దాని ప్రకారం, ఈ సైబర్‌ట్రక్ దేశంలోనే మొదటిది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న టెస్లా షోరూమ్‌లో ఆరు నెలల క్రితం ఈ కారును బుక్ చేశాం. కొద్దీ రోజుల కిందటే దీన్ని దుబాయ్‌లో డెలివరీ చేశారు. అక్కడి నుంచి భారత్ తీసుకొచ్చాం’ అని స్పష్టం చేశారు. ఈ సైబర్‌ట్రక్ వేరియంట్ ధర సుమారు రూ.60 లక్షలు ఉందని సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది.ఇదీ చదవండి: కథన రంగంలో ఏఐ చిందులుఎవరీ లవ్జీ దాలియా?‘లవ్జీ బాద్షా’గా పేరొందిన లవ్జీ దాలియా సూరత్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దాంతోపాటు వజ్రాల వ్యాపారిగా, పవర్ లూమ్ యజమానిగా లావ్జీకి గుర్తింపు ఉంది. ఆయన చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలకు గుర్తింపుగా స్థానికులు తనను బాద్షాగా పిలుస్తున్నారు. గోపీన్ డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించారు. లాభాపేక్ష లేని సంస్థ గోపీన్ ఫౌండేషన్ ద్వారా దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోను కూడా గతంలో షేర్ చేశారు.

సింహాచలం ఘటనపై అశోక్ నోరిప్పలేదేం
సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు వచ్చిన తరుణంలో ఏర్పాట్లు... భద్రత వంటి చర్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఏడుగురు భక్తుల ప్రాణాలను గాలిలో కలిపేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు బయటపడుతున్న పలు లోపాలు చూస్తూ భక్తులు విష్టి పోతున్నారు. అతి తక్కువ సమయంలో గోడ నిర్మించలేనని కాంట్రాక్టర్ చెప్పినప్పటికీ పరవాలేదు మేము చూసుకుంటాం ఏదోలా పూర్తిచేసేయ్ అంటూ దేవాలయ యాజమాన్యం మంత్రులు తనపై ఒత్తిడి చేసి తూతూ మంత్రంగా పనులు పూర్తి చేయించారని కాంట్రాక్టర్ అంగీకరించారు. ఇదిలా ఉండగా ఉత్సవానికి ముందు పలువురు మంత్రులు సింహాచలాన్ని సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించినట్లు పరిశీలించినట్లు సూచనలు సలహాలు ఇచ్చినట్లు పత్రికల్లో కథనాలు ఫోటోలు అయితే వేయించుకున్నారు కానీ వారు ఎక్కడ ఏమి చూసినట్లు లేదు. అలా వచ్చి మామూలుగా అధికారులతో సమావేశమై జ్యూస్ తాగి స్నాక్స్ తిని వెళ్లిపోయారు అన్నది ఈ సంఘటన తర్వాత అర్థమవుతుంది. ఇదంతా ఎలా ఉండగా సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనువంశిక ధర్మకర్త ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు ఈ అంశంపై ఇంతవరకు కిక్కురుమనలేదు. గతంలో ఆయన ధర్మకర్తృత్వం లోని రామతీర్థం గుట్టపై శ్రీరాముని విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేసిన ఘటన కు సంబంధించి ఆయన స్పందన విపరీతంగా ఉండేది. కళ్ళు ఎగరేస్తూ గాలిలో చేతులు తిప్పుతూ నాటి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తూలనాడారు. చైర్మన్ అయిన తనకు కూడా ఏమాత్రం సమాచారం లేదని బాధ్యత వహిస్తే పరిస్థితి వేరుగా ఉండేది అన్నట్లుగా ఆయన మాట్లాడారు. నాటి సంఘటనకు వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి బాధ్యత అని దుమ్మెత్తి పోశారు.నేడు సౌండ్ లేదేం అశోక్ రాజానేడు సింహాచలం అప్పన్న స్వామికి చందనోత్సవం సందర్భంగా తొలి దర్శనం చేసుకుని పట్టు వస్త్రాలు సమర్పించేది కూడా విజయనగరం పూసపాటి కుటుంబీకులే. గతంలో ఆనందగజపతి రాజు ఈ సాంప్రదాయం పాటించగా నేడు అశోక్ గజపతి అప్పన్నకు చైర్మన్ హోదాలో పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. మరి దేవాలయ చైర్మన్‌గా ఆయనకు ఈ దుర్ఘటనతో సంబంధం లేదా..? బాధ్యత లేదా ? అంత పెద్ద ప్రమాదం జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయి మరికొందరు ఆసుపత్రిపాలవగా ఆయన మాత్రం ఏ మాత్రం నోరు విప్పడం లేదు. ఉత్సవాలకు ముందు మంత్రులతో పాటు ఆయన కూడా సమీక్షలో పాల్గొని ఆహా ఓహో అది చేశాను ఇది చేశాం అంటూ ఫోటోలు ప్రకటనలు ఇచ్చి ఇంటికి వచ్చారు తప్ప ప్రమాదం జరిగి ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఆయన ఏమాత్రం స్పందించడం గాని.. దేవాలయ ట్రస్ట్ బోర్డు తరఫున ఓ ప్రకటన కానీ ఇవ్వలేదు.. అసలు ఆ సంఘటన జరిగినట్లే ఆయన గుర్తించినట్లు కనిపించలేదు. ఎందుకంటే తాను కొనసాగుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏ ఆలయంలో ఏం జరిగినా ఆయనకు కనిపించదు.. వినిపించదు. అదే వైయస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా చిత్ర విచిత్రమైన అభినయాలతో అశోక్ గజపతి మీడియా ముందుకు వచ్చేస్తారు.. ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు కూడా ఆయన నోరు విప్పితే తన హుందాతనానికి మరింత గౌరవం వచ్చేదని ప్రజలు అంటున్నారు::సిమ్మాదిరప్పన్న

'విజయ్' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. నిజమే అంటూ 'రష్మిక' హింట్
వెండితెరపై విజయ్ దేవరకొండ-రష్మికలది (Rashmika) ప్రత్యేకమైన జోడీ అని చెప్పవచ్చు. వారిద్దరు మరో సినిమాలో కలిసి నటించాలని కోరుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో ‘గీత గోవిందం’తో హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట రెండోసారి ‘డియర్ కామ్రేడ్’తో అభిమానులను మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమాల తర్వాత వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ, వాటిపై వారిద్దరూ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ సంగతి కాస్త పక్కన పెడితే.. మరోసారి రష్మికతో కలిసి విజయ్ దేవరకొండ(Vijay devarakonda) స్క్రీన్‌పై కనిపించనున్నాడని అర్థం అవుతుంది.విజయ్ పుట్టినరోజు సందర్భంగా కొద్దిరోజుల క్రితం ఒక కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రానుంది. గతంలో ఆయన తెరకెక్కించిన టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు విజయ్‌తో మరో సినిమాను ప్లాన్ చేశాడు. ఇందులో హీరోయిన్గా రష్మిక నటించనుంది. అందుకు సంబంధించిన ఒక హింట్‌ను మొదటగా మైత్రి మూవీస్, రాహుల్ సంకృత్యాన్ #HMMLetsee అంటూ ఎక్స్ పేజీలో పోస్ట్ చేస్తూ.. రష్మికను ట్యాగ్ చేశారు. దానికి ఆమె నిజమే గాయ్స్ అంటూ సమాధానం ఇచ్చింది. ఇదంతా విజయ్- రష్మికల సినిమా గురించే అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ, HMMLetsee అనే దానికి అర్థమేంటి..? అన్నది మాత్రం క్లారిటీ లేదు. త్వరలోనే ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఇప్పుడు మరోసారి విజయ్- రష్మికలతో ఒక పెద్ద ప్రాజెక్ట్‌కు ప్లాన్ చేశారని తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందిన రష్మక చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయినప్పటికీ ఆమె విజయ్‌తో ఉన్న స్నేహం వల్ల తేదీలు సర్ధుబాటు చేయనుందట. VD14 అనే వర్కింగ్టైటిల్తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రానుంది. 18వ శతాబ్దంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. అందుకే రష్మిక అయితే బాగుంటుందని ఫైనల్ చేశారని టాక్. రష్మికతో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు గతంలో విజయ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ బిగ్ ప్రాజెక్ట్‌తో ఆయన కోరిక తీరబోతుందని అభిమానులు చెబుతున్నారు. #HmmLetsSee @iamRashmika 😉— Mythri Movie Makers (@MythriOfficial) May 2, 2025

Summer Care సన్‌స్క్రీన్ వాడాలా? వద్దా?
సమ్మర్ (Summer)లో సన్‌స్క్రీన్ (Sunscreen) లోషన్ వాడడం సర్వసాధారణం. 2030 నాటికి భారత సన్‌స్క్రీన్ మార్కెట్ బాగా పెరగనుందని ఒక నివేదిక అంచనా వేసింది. అయితే మరోవైపు చూస్తే... ఇంటర్నెట్లో ఒకవర్గం సన్‌స్క్రీన్ వాడొద్దు అని, వాటివల్ల జరిగే నష్టాలు ఇవి... అంటూ ప్రచారం చేస్తోంది. అందులో నిజం ఎంత?ప్రధానంగా రెండు రకాల సన్స్క్రీన్లు ఉన్నాయి. 1. మినరల్ 2. కెమికల్‌మినరల్ సన్‌స్క్రీన్‌లో జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్‌లాంటి క్రియాశీల ఖనిజ పదార్థాలు ఉంటాయి. ఇవి యువి కిరణాలను నిరోధిస్తాయి. ఇక కెమికల్ సన్స్క్రీన్లు అధికశక్తి గల యూవీ కిరణాలను గ్రహిస్తాయి. చర్మాన్ని దెబ్బతీయకుండా నిరోధిస్తాయి. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రియాశీల పదార్థాలు ఉంటాయి. ఇవేకాకుండా మార్కెట్లో కాంబినేషన్ సన్స్క్రీన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.డెర్మటాలజిస్ట్‌లు ‘సన్‌స్క్రీన్ వాడడం మంచిదే’ అని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.‘సన్‌స్క్రీన్‌లోని ఇన్‌గ్రేడియెంట్స్ థైరాయిడ్ హార్లోన్లు, టెస్టోస్టెరాన్, ప్రొజెస్టెరాన్ స్థాయులను దెబ్బతీస్తాయని కొన్ని అధ్యయాలు సూచిస్తున్నాయి. అయితే ఇవి తక్కువస్థాయి ఆధారాలతో కూడిన ప్రాథమిక అధ్యయనాలు మాత్రమే. అందువల్ల సన్స్క్రీన్లు ఎండోక్రైన్ డిస్ట్రప్టర్లు అని నిర్దారించడానికి ఈ ఆధారాలు సరిపోవు’ అంటున్నారు డెర్మటలాజిస్ట్, ఇన్‌ఫ్లూయెంజ్ స్కిన్ అండ్ హేర్ క్లినిక్ ఫౌండర్ గీతికా శ్రీవాస్తవ.ఇదీ చదవండి: హల్దీ వేడుకలో వధువు చేసిన పనికి దెబ్బకి అందరూ షాక్!జింక్‌ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ ఇన్‌గ్రేడియెంట్స్ ఉపయోగించే ఫిజికల్ సన్‌స్క్రీన్స్ (మినరల్ సన్‌స్క్రీన్స్) సురక్షితమైనవని, ప్రభావ వంతవైనవని ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్–రిసెర్చ్) నిర్ధారించింది. చదవండి : నిశ్చితార్థం రద్దు, ప్రేమ వివాహం, డైమండ్స్ షూస్ : ఎవరీ అందాల రాణి?

మోదీ.. నాకు ఆత్మాహుతి బాంబు ఇవ్వండి.. పాక్‌పై దాడి చేస్తా: కర్ణాటక మంత్రి
బెంగళూరు: పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్‌పై యుద్ధం చేసేందుకు తనకొక సూసైడ్ బాంబ్ (Suicide Bomb) ఇవ్వాలన్నారు. తాను ఆ బాంబును పాకిస్తాన్‌పై వేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు బీజడ్ జమీర్ అహ్మద్‌ఖాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అమాయక ప్రజలపై జరిగిన అమానవీయ చర్య ఇది. పాకిస్తాన్ (Pakistan) ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అంగీకరిస్తే.. ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధం. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి. బాంబ్ ఇస్తే దానిని తీసుకుని పాక్‌పై దాడి చేస్తాను. ఇలాంటి సమయంలో ప్రతీ భారతీయుడు ఐక్యంగా నిలబడాలని, జాతి భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Karnataka Minister BZ Zameer Ahmed Khan says, "...We are Indians, we are Hindustanis. Pakistan never had any relations with us. Pakistan has always been our enemy...If Modi, Amit Shah and the Central government let me, I am ready to go to battle. (02.05.2025) pic.twitter.com/HdYiZcYBIC— ANI (@ANI) May 3, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం నాటి పాకిస్తాన్ సైనిక విన్యాసాలకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. నడిరోడ్డుపైనా యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరిపి వాయుసేన సత్తా చాటింది. అత్యంత అధునాతన శత్రు భీకర రఫేల్‌తో పాటు సుఖోయ్–30, ఎంకేఐ, మిరాజ్–2000, మిగ్–29, జాగ్వార్, సీ–130జే సూపర్ హెర్క్యులస్, ఏఎన్–32 విమానాలతో పాటు ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లను కూడా ఈ అధునాతన ఎయిర్ర్‌స్టిప్‌పై ల్యాండింగ్, టేకాఫ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఈ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు వేదికైంది.📍Shahjahanpur: The Indian Air Force (IAF) is conducting take-off and landing exercises on the Ganga Expressway in Uttar Pradesh — even at night #GangaExpressway #aircraft #AirForce #IndiaPakistan #ind pic.twitter.com/nN8EyzpNQl— Geopolitics news (@rat92553) May 3, 2025పగటి పూటే గాక అవసరమైతే కారుచీకట్లోనూ నిర్భీతిగా యుద్ధవిమానాలను రోడ్లపై కూడా దింపగలమని వాయుసేన నిరూపించింది. 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్ వేలో జలాలాబాద్ సమీపంలోని పిరూ గ్రామం వద్ద నిర్మించిన 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌స్టిప్‌పై శుక్రవారం రాత్రి ఎయిర్‌ఫోర్స్ యుద్ధవిమానాలు ఇలా ల్యాండై అలా టేకాఫ్ తీసుకున్నాయి. తద్వారా దేశంలో పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా ఫైటర్జెట్ల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనువైన తొలి ఎక్స్‌ప్రెస్‌వే గా ఈ మార్గం నిలిచింది. అందుకు క్యాట్–2 ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ సాంకేతికతను వినియోగించారు. మంచు, వర్షం, పొగమంచు, తక్కువ దృగ్గోచరత వంటి సందర్భాల్లోనూ ల్యాండింగ్, టేకాఫ్ సాధ్యమయ్యేలా ఎక్స్‌ప్రెస్ వేలో ఎత్తయిన, అనువైన ప్రదేశంలోనే స్ట్రిప్‌ను నిర్మించారు. వరదలు, భూకంపం వంటి విపత్తుల వేళ సైన్యాన్ని వెంటనే రంగంలోకి దించడానికీ ఈ స్ట్రిప్ ఉపయోగపడనుంది. అత్యంత తక్కువ ఎత్తులో దూసుకొస్తూ ల్యాండింగ్‌నూ పరీక్షించారు.उत्तर प्रदेश: शाहजहांपुर (Indian Air Force)शाहजहांपुर Ganga Expressway पर भारत वायु सेना की Exercise जारी है।यहाँ राफेल जैसे युद्धक विमानों की भीड़ है। pic.twitter.com/khEHUDrCzD— Shubhangi Pandit (@Babymishra_) May 3, 2025
CIA: ట్రంప్ ఎఫెక్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వేలాడుతున్న లేఆప్స్ కత్తి..
నాన్న చూపునకూ నోచుకోకుండానే..!
అభిమాని కోరికను ‘పహల్గాం’ఘటనతో పోల్చిన సింగర్.. కేసు నమోదు!
టైటిల్ గెలిచేది ఆ జట్టే.. తొలిసారి ట్రోఫీని ముద్దాడుతారు: భారత దిగ్గజం
Summer Care సన్‌స్క్రీన్ వాడాలా? వద్దా?
భారత్ రోడ్లపై టెస్లా కారు.. మొదటి ఓనర్ ఈయనే..
అంతా ఎల్లో మాయ.. రుషికొండా గోంగూరా అంటున్న కూటమి!
బంగారం మళ్లీ తగ్గిందా.. పెరిగిందా?
భారత్‌తో దాయాది యుద్ధం.. బలం కోసం పాక్ ప్రధాని కొత్త ఎత్తులు!
వీగన్..వీగన్.. : ముద్దముద్దకీ ఆరోగ్యం, ఉల్లాసంగా, ఉత్సాహంగా!
నా కొడుకును సంపేయండి
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
బంగారం భారీగా పడిపోతుంది!
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
ఇంట్లో పాముల కలకలం
‘ఛీ’నా రాజకీయం...
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్‌లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
మూడో పంటగా సౌర విద్యుత్తు!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
3 నిమిషాలకో మరణం
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
ఒకే ఇల్లు.. ఒకే వంట
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
CIA: ట్రంప్ ఎఫెక్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వేలాడుతున్న లేఆప్స్ కత్తి..
నాన్న చూపునకూ నోచుకోకుండానే..!
అభిమాని కోరికను ‘పహల్గాం’ఘటనతో పోల్చిన సింగర్.. కేసు నమోదు!
టైటిల్ గెలిచేది ఆ జట్టే.. తొలిసారి ట్రోఫీని ముద్దాడుతారు: భారత దిగ్గజం
Summer Care సన్‌స్క్రీన్ వాడాలా? వద్దా?
భారత్ రోడ్లపై టెస్లా కారు.. మొదటి ఓనర్ ఈయనే..
అంతా ఎల్లో మాయ.. రుషికొండా గోంగూరా అంటున్న కూటమి!
బంగారం మళ్లీ తగ్గిందా.. పెరిగిందా?
భారత్‌తో దాయాది యుద్ధం.. బలం కోసం పాక్ ప్రధాని కొత్త ఎత్తులు!
వీగన్..వీగన్.. : ముద్దముద్దకీ ఆరోగ్యం, ఉల్లాసంగా, ఉత్సాహంగా!
నా కొడుకును సంపేయండి
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్‌తో తెరమరుగు..
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు వైభవ్ సూర్యవంశీ..
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్‌లు
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్‌లైన్ ఆపరేటర్
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
బాలకృష్ణ విలన్‌ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
బంగారం భారీగా పడిపోతుంది!
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్‌లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
ఇంట్లో పాముల కలకలం
‘ఛీ’నా రాజకీయం...
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
కొందరికే ‘భరోసా’
శ్రీకృష్ణ లీలలు
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్‌లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
మూడో పంటగా సౌర విద్యుత్తు!
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
నచ్చిన వారితో శృంగారం.. అజిత్‌పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
3 నిమిషాలకో మరణం
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
పాక్ నడ్డి విరిగేలా..
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్ రివల్యూషన్..!
ఒకే ఇల్లు.. ఒకే వంట
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
వాడికి ఏడాదిన్నర వయసు.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
చిన్నప్పటి నుంచి చదువులో టాప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
అమ్మానాన్నా క్షమించండి.. వెళ్లిపోతున్నా..
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
సినిమా

బకాసుర రెస్టారెంట్లో వినోదం
హాస్య నటుడు ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’(Bhakasaura Restaurant). ఈ సినిమా ద్వారా ఎస్జే శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వైవా హర్ష, కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, ‘కేజీఎఫ్’ గరుడరామ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఎస్జే శివ మాట్లాడుతూ– ‘‘హంగర్ కామెడీ ఎంటర్టైనర్గా ‘బకాసుర రెస్టారెంట్’ రూపొందింది. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రవీణ్‌లోని మరో కోణాన్ని చూపిస్తుంది’’ అన్నారు.

ఆసక్తి గొలిపే చర్చలతో వేవ్స్
‘వేవ్స్’లో హీరో నాగార్జున మాట్లాడుతూ– ‘‘పుష్ప’ సిరీస్ సినిమాలు తెలుగు కంటే వేరే భాషల్లో ఎక్కువగా వసూళ్లు సాధించాయి. వందలో దాదాపు తొంభై మంది తమ ఒత్తిడి పొంగొట్టుకునేందుకు తెరపై జరిగే మ్యాజిక్ (సినిమాలు) చూసేందుకు ఇష్టపడుతుంటారు. నేటితరం ప్రేక్షకులు కథానాయకులను పుష్పరాజ్ (‘పుష్ప’లో అల్లు అర్జున్), రాఖీ భాయ్ (‘కేజీయఫ్’లో యశ్), బాహుబలి (‘బాహుబలి’లో ప్రభాస్) లాంటి లార్జర్ దేన్ లైఫ్ రోల్స్‌లో చూడాలనుకుంటున్నారు. నేనూ దాన్నే ఇష్టపడతాను. కేవలం హీరోల ఎలివేషన్ ఒక్కటే కాదు.. బలమైన కథలతోనే ఆయా చిత్రాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. రాజమౌళి ‘బాహుబలి’ సినిమాని తెలుగులోనే తెరకెక్కించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఆదరించారు’’ అన్నారు.భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నాలుగు రోజుల వరల్డ్ ఆడియో, విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) – 2025 రెండో రోజు సైతం అట్టహాసంగా సాగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జాతీయ, అంతర్జాతీయ సినీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు, ఔత్సాహిక సినీ రూపకర్తలు శుక్రవారం పెద్ద ఎత్తున సమ్మిట్‌కు హాజరయ్యారు. వివిధ వేదికలపై చర్చాగోష్ఠులు, ముఖాముఖీలు కొనసాగాయి.మీడియా – వినోద రంగంలో వివిధ దేశాల్లో అనుసరిస్తున్న విధానాలనూ, వ్యూహాలనూ పరస్పరం పంచుకొనేందుకు వీలుగా గ్లోబల్ మీడియా డైలాగ్ అలాగే, క్రియేట్ ఇండియా ఛాలెంజ్ పొంటీలోని విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. వేవ్స్ బజార్ వేదికగా వివిధ చిత్ర నిర్మాణ సంస్థలు, వ్యక్తుల మధ్య కంటెంట్ మార్కెటింగ్ అవకాశాల అన్వేషణ నడిచింది.భవిష్యత్తులో స్టూడియోలు, సాఫ్ట్ పవర్‌గా సినిమా, డిజిటల్ యుగంలో మారుతున్న కథాకథన రీతులు, మారుతున్న భారతీయ సినిమా ముఖచిత్రం తదితర అంశాలపై చర్చాగోష్ఠులు జరిగాయి. దక్షిణాది సినీ ప్రముఖులు నాగార్జున, విజయ్ దేవరకొండ, అమల అక్కినేని, సుప్రియ యార్లగడ్డ, ఖుష్బూ, కార్తి, రవి మోహన్, హిందీ చిత్ర సీమ నుంచి అనుపమ్ ఖేర్, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, సోనాలీ కులకర్ణి, ‘ఆదిపురుష్’ చిత్రదర్శకుడు ఓం రౌత్, ఆస్కార్ అవార్డు గెల్చిన మహిళా నిర్మాత గునీత్ మోంగా సదస్సుప్రాంగణంలో ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు.కృత్రిమ మేధ (ఏఐ) రాకపై ఆసిడెంట్ రిచర్డ్ జి. కెర్రీస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో ఆసక్తికరంగా వివరించారు. హాలు మొత్తం ప్రేక్షకులతో కిక్కిరిసి పొంగా, మీడియా దిగ్గజం అరుణ్ పురీ సహా పలువురు కెర్రీస్ తెరపై చూపిన ఏఐ ఆధారిత సినిమా వీడియోలను చూశారు. ఫుగటో లాంటి సాఫ్ట్ వేర్లతో ఆడియోలో సౌండ్ ఎఫెక్ట్‌ల మొదలు సంగీత బాణీల దాకా ఎలా మార్చుకోవచ్చో సమావేశంలో వివరించిన తీరు హర్షధ్వానాలు అందుకుంది. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చేరువ చేయడమనే అంశంపై నీతా అంబానీ ఇచ్చిన కీలకోపన్యాసం ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.‘‘ఇవాళ మన దేశానికి అతి పెద్ద మార్కెటింగ్ సాధనం... సినిమా. నేను కశ్మీర్లో షూటింగ్ చేస్తున్నా, నన్ను జనం గుర్తు పడుతున్నారంటే దానికి సినిమాయే కారణం! మనం మన (సినీ) సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవాల్సి ఉంది. దేశం సరిహద్దులు దాటి మన సినిమా ముందుకు వెళ్ళాలంటే, అక్కడా మన సినిమాల డిస్ట్రిబ్యూషన్‌ను పెంచుకోవడమే మార్గం. అలాగే, బాక్సాఫీస్ వద్ద మన సినిమాల జోరు పెరగాలంటే, వివిధ భాషల నటులు కలసి సినిమాలు చేయాలి’’. – హీరో విజయ్ దేవరకొండహీరో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఇండియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉండాలి. విదేశాల్లో డిస్ట్రిబ్యూషన్ గురించి మన నిర్మాతలు ఆలోచిస్తే మార్పు మొదలవుతుంది. దేశవ్యాప్తంగా మరిన్ని స్క్రీన్ ్స పెంచేందుకు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది’’ అన్నారు.‘‘లార్జర్ దేన్ లైఫ్ పాత్రలతో పాటు కుటుంబాన్ని ప్రేమిస్తూ, కుటుంబ సభ్యుల కోసం ఏమైనా చేసే పాత్రలనూ ప్రేక్షకులు ఇవాళ ప్రేమిస్తున్నారు. ఇవాళ ప్యాన్ ఇండియా అనేది ఫ్యాషన్ అయిపొంయింది. అసలు ఈ కంగాళీ పదం రాక ముందే మన మణిరత్నం తీసిన ‘రోజా, బొంబాయి’ లాంటివి అఖిల భారత చిత్రాలే కదా. అవన్నీ భాష,ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి’’. – నటి ఖుష్బూ‘‘ఇవాళ ఓటీటీ సహా అనేక రకాల కంటెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రేక్షకులు హీరో వీరోచిత విన్యాసాలు, ఊహల్లో విహరింపజేసే భారీ పాటలు, డ్యాన్సులు చూసేందుకు సినిమా హాళ్ళకు వస్తున్నారు. అయితే, ప్రతిదీ భారీ, ప్యాన్ ఇండియా సినిమా కావాల్సిన పని లేదు. మంచి కథతో, చిన్న సినిమాలూ రావాలి’’. – హీరో కార్తి‘‘ఏ తెరపై ఏ కథ చెప్పినా... నిజాయతీగా, భావోద్వేగభరితంగా చెప్పడం కీలకం. ప్రేక్షకులు తెరపై ఎంత భారీతనాన్ని ఇష్టపడినప్పటికీ, సినిమా రూపకర్తలోని ఆ నిజాయతీ, నిబద్ధతను ఇట్టే గమనిస్తారు. ఆస్వాదిస్తారు, అభినందిస్తారు. సినిమా విజయానికి అదే ప్రధాన సూత్రం’’. – నటుడు అనుపమ్ ఖేర్‘‘స్టోరీ టెల్లింగ్, కంటెంట్ క్రియేషన్ లాంటి పెద్ద పెద్ద మాటలు చెబుతాం కానీ, ప్రేక్షకులకు నచ్చిందా, లేదా అన్నదే ఆఖరికి మిగిలే అసలు పాయింట్. అంతే. ఎంచుకున్న ఆలోచనను బలంగా నమ్మాలి. అలా నమ్మిన ఆలోచనతో ముందుకు వెళ్ళాలి’’. – సుప్రియ యార్లగడ్డ, నిర్మాత, అన్నపూర్ణా స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‘‘ఉత్తరాది, దక్షిణాది లాంటి చీలికలు, భేదాల చుట్టూ తిరగకుండా, ఏది గొప్ప, ఏది తక్కువ అనే వాదన కన్నా, మనది భారతీయ సినిమా అనే భావన చాలా ముఖ్యం. భారతీయ సినిమా అంటే ఇదీ అని చూపాలంటే, నేను గురుదత్ తీసిన ‘కాగజ్ కే ఫూల్, ప్యాసా’ లాంటి సినిమాలు ప్రపంచానికి చూపాలంటాను’’. – దర్శక – నిర్మాత కరణ్ జోహార్‘‘కరోనా తర్వాత తమిళ సినిమాను తీసే విధానం, జనం చూసే విధానం కూడా మారాయి. రకరకాల వేదికలపై ఇప్పుడు కంటెంట్ అందుబాటులో ఉంది. మొబైల్‌తో కూడా సినిమా తీసేయచ్చు. అందులోనే రిలీజ్ చేయవచ్చు. చూడవచ్చు. అది ఒక మార్గం, అదనపు చేర్పు. అంతే తప్ప భారీ వెండితెర వినోదం మాత్రం ఎన్నటికీ చెరిగిపొందు, కరిగిపొందు’’. – తమిళ హీరో ‘జయం’ రవి

శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట తీవ్ర విషాదం
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి నిర్మల్ కపూర్(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కాగా.. ఆమెకు ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్, నటుడు సంజయ్ కపూర్ కూడా సంతానం. వీరితో పాటు రీనా కపూర్ ఆమె ఓ కుమార్తె కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే శ్రీదేవి భర్త బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తో పాటు శిఖర్ పహరియా, షనాయా కపూర్ల ముంబయి లోఖండ్‌వాలాలోని అనిల్ కపూర్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. గతేడాది సెప్టెంబర్‌లో నిర్మల్ కపూర్ 90వ పుట్టినరోజు వేడుకను అందరూ కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.కాగా.. నిర్మల్ కపూర్ ప్రముఖ నిర్మాత సురీందర్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ అనిల్ కపూర్, బోనీ కపూర్, సంజయ్ కపూర్, రీనా కపూర్ అనే నలుగురు జన్మించారు. అంతే కాకుండా ఆమెకు అర్జున్ కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్, హర్ష్ వర్ధన్ కపూర్, జాన్వీ కపూర్, అన్షులా కపూర్, ఖుషీ కపూర్, మోహిత్ మార్వా అనే మనవలు, మనవరాళ్లు ఉన్నారు.

సురేఖా వాణి బర్త్ డే సెలబ్రేషన్స్.. చీరలో ట్రెండింగ్ బ్యూటీ
తల్లి సురేఖావాణి పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన సుప్రీతచీరలో ట్రెండింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేటోపీతో టూర్ లో చిల్ అవుతున్న కాయదు లోహర్ఎర్రటి డ్రస్సులో రచ్చ లేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్అందాల్ని ఎర వేస్తూ రెచ్చగొట్టేస్తున్న కేతిక శర్మఫ్యామిలీతో కలిసి శ్రియ శరణ్ హ్యాపీ మూమెంట్స్చీరలో చాలా నిండుగా బాలయ్య బ్యూటీ హనీరోజ్ View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Pepper Trail, Wayanad (@peppertrail) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla)
న్యూస్ పాడ్‌కాస్ట్

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!

పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.

ఏపీ రాజధానిలో దోపిడీ ఐకానిక్.. 5 టవర్ల నిర్మాణ వ్యయం పెంపు

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు

పాకిస్తాన్‌కు భారత్ పంచ్.. పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్
క్రీడలు

IPL 2025 RCB vs CSK: కోహ్లి X ధోని
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్లో మెరుగైన ఆటతీరు కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు శనివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో తలపడనుంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బెంగళూరు ‘ప్లే ఆఫ్స్’ బెర్తు ఖరారు చేసుకోవడంపై దృష్టి పెడితే... ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబర్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి తప్పుకుంది. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులోనూ ఆర్సీబీ విజయం సాధించగా... సొంతగడ్డపై జరగనున్న పోరులో అదే జోరు కొనసాగించాలని బెంగళూరు భావిస్తోంది. ఈ సీజన్లో 10 మ్యాచ్‌లాడిన బెంగళూరు 7 విజయాలు, 3 పరాజయాలతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరో విజయం సాధిస్తే ఇక ‘ప్లే ఆఫ్స్’కు చేరినట్లే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి 8 మ్యాచ్‌ల్లో ఓడింది. ఎలాగో ఇప్పటికే రేసు నుంచి తప్పుకున్న సీఎస్కే ‘పోరాడితే పోయేదేముంది’ అన్న తరహాలో విజృంభించాలని చూస్తోంది. దిగ్గజ ఆటగాళ్లు ధోని, కోహ్లి బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం వచ్చే ఏడాది ధోని ఐపీఎల్ ఆడటంపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ధోనీ, కోహ్లి కలిసి మైదానంలో కనిపించడం ఇదే చివరిసారి కావొచ్చని సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది! మరి ఈ పోరులో ధోని సేనను విజయం వరిస్తుందా... బెంగళూరు ‘ప్లే ఆఫ్స్’ బెర్తు ఖరారు చూసుకుంటుందా చూడాలి. జోరు మీదున్న కోహ్లి... అంతర్జాతీయ టి20ల నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లి... ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడుతూ ముందుకు సాగుతున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 63.29 సగటుతో 443 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధశతకాలు ఉన్నాయి. ఈ సీజన్లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న కోహ్లి... ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో ముందున్నాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఎక్కువసేపు నిలవలేకపోతుండగా... దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్ మంచి టచ్‌లో ఉన్నారు. ముఖ్యంగా వన్‌డౌన్‌లో పడిక్కల్ ధనాధన్ షాట్లతో చెలరేగుతున్నాడు. కెప్టెన్ రజత్ పాటీదార్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. పెద్దగా ప్రభావం చూపలేకపోతున్న చెన్నై బౌలర్లపై బెంగళూరు బ్యాటర్లంతా కలిసికట్టుగా కదంతొక్కితే భారీ స్కోరు ఖాయమే. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్, హాజల్‌వుడ్, యశ్ దయాళ్ పేస్ భారం మోస్తుండగా... కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ స్పిన్ బాధ్యతలు పంచుకుంటున్నారు. సమష్టిగా సత్తా చాటితేనే! ఐపీఎల్ టోర్నమెంట్ ఆరంభం (2008) నుంచి ఆడుతున్న ధోని... వచ్చే ఏడాది ఆటగాడిగా లీగ్‌లో పాల్గొనక పోవచ్చనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ సీజన్ మధ్యలో చెన్నై పగ్గాలు అందుకున్న ధోని... జట్టు విజయాల బాట పట్టించలేకపోయాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సీఎస్కే ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లనే తేడా లేకుండా అంతా విఫలమవుతున్నారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఓపెనర్ షేక్ రషీద్... వచ్చిన అవకాశాలను వృథా చేసుకుంటుండగా... మరో యంగ్‌స్టర్ ఆయుశ్ మాత్రే ఫర్వాలేదనిపిస్తున్నాడు. స్యామ్ కరన్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా సమష్టిగా రాణించాల్సిన అవసరముంది. ఇక బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ కాస్త నయం కాగా... మిగిలిన వాళ్లు కూడా సత్తా చాటాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ప్రస్తుత స్థితిలో బెంగళూరు బ్యాటింగ్ జోరును అడ్డుకోవడం చెన్నై బౌలర్లకు కత్తిమీద సామే! తుది జట్లు (అంచనా) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్, హాజల్‌వుడ్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ. చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్ ), షేక్ రషీద్, ఆయుశ్ మాత్రే, స్యామ్ కరన్, రవీంద్ర జడేజా, బ్రెవిస్, శివమ్ దూబే, దీపక్ హూడా, అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పతిరణ. 21 ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, చెన్నై జట్ల మధ్య మొత్తం 34 మ్యాచ్‌లు జరిగాయి. చెన్నై జట్టు 21 మ్యాచ్‌ల్లో, బెంగళూరు 12 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఒక మ్యాచ్ రద్దు అయింది. బెంగళూరుపై చెన్నై అత్యధిక స్కోరు 226 కాగా, అత్యల్ప స్కోరు 82 పరుగులు. చెన్నైపై బెంగళూరు అత్యధిక స్కోరు 218 కాగా, అత్యల్ప స్కోరు 70 పరుగులు.

అమెరికాతో భారత్ ‘సై’
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్, అమెరికాల మధ్య చెస్ టోర్నమెంట్ జరగనుంది. ఇరు దేశాలకు చెందిన టాప్ స్టార్ ప్లేయర్లందరూ ఈ టోర్నీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించిన ‘డ్రా’ తదితర వివరాలను శుక్రవారం వెల్లడించారు. అక్టోబర్ 4న అర్లింగ్టన్లోని ఇ–స్పోర్ట్స్ స్టేడియంలో చెస్ పోటీలు జరుగనున్నాయి. ఇరు దేశాల నుంచి ఐదుగురు చొప్పున ఆటగాళ్లు ఇందులో పాల్గొంటారు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు. అమెరికన్ సూపర్ గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురను గుకేశ్ ‘ఢీ’కొంటాడు. గుకేశ్‌తో పాటు తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్, సాగర్ షా, కుర్రాడు ఎథన్ వాజ్‌తో పాటు భారత మహిళా ప్లేయర్, అంతర్జాతీయ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్‌లు బరిలో ఉన్నారు. మొదటి బోర్డులో గుకేశ్, నకముర తలపడతారు. రెండో బోర్డులో అర్జున్... గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాను ఎదుర్కొంటాడు. మూడో బోర్డులో సాగర్ షా, లెవి రొజ్మన్ పోటీపడనుండగా, మిగతా పోటీల్లో దివ్యతో కారిస్సా యిప్, ఎథన్ వాజ్‌తో టానిటొలువా అడ్యూమి తలపడతారు. టోర్నీ నిబంధనల విషయానికొస్తే బోర్డులోని ఇరు ఆటగాళ్ల మధ్య ఐదు రౌండ్ల గేమ్‌లు జరుగుతాయి. పది నిమిషాల్లో గేమ్‌ను ముగించాల్సి ఉంటుంది. అప్పటికీ ‘డ్రా’ అయితే మరో 5 నిమిషాల ఆటను కొనసాగిస్తారు. షూటౌట్‌కు వస్తే మరో నిమిషం అదనంగా కేటాయిస్తారు. అప్పటికీ సమఉజ్జీలుగా నిలిస్తే మాత్రం విజేత తేలే వరకు పోటీ కొనసాగుతుంది.

క్రీడా గ్రామంలో కాదు... క్రూజ్ షిప్లో
టోక్యో: కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్లు జరిగితే ప్రపంచ వ్యాప్తంగా పాల్గొనే అంతర్జాతీయ అథ్లెట్ల కోసం ఆధునిక హంగులతో, సకల సౌకర్యాలతో క్రీడా గ్రామాన్ని నిర్మించడమేది ఆనవాయితీ. ఇప్పటి వరకు జరిగిన ప్రతీ మెగా ఈవెంట్లోనూ ఇదే జరిగింది. కానీ వచ్చే ఏడాది జపాన్ ఆతిథ్యమిచ్చే ఆసియా క్రీడల్లో మాత్రం క్రీడా గ్రామం కనిపించదు. దీని స్థానంలో ఫ్లోటింగ్ విలేజ్‌కు నిర్వాహకులు మొగ్గు చూపారు. అంటే నీటిపై తెలియాడే విలేజ్ అన్నమాట! ఇందుకోసం భారీ ఓడను వినయోగించనుంది. క్రూజ్ షిప్ తెలుసుగా... అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ఓడ. నీటిపై కదలాడే నగరాన్ని తలపించే క్రూజ్షిప్లో ఏషియాడ్‌కు విచ్చేసే అథ్లెట్లకు బస కల్పించే ఏర్పాట్లను జపాన్ నిర్వాహకులు చేస్తున్నారు. వచ్చే ఏడాది సెపె్టంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ ఆసియా క్రీడల్లో ఆసియా దేశాలకు చెందిన 15 వేల మంది అథ్లెట్లు పాల్గొంటారు. వీరందరి బసకోసం రోటీన్‌గా క్రీడా గ్రామాన్ని నిర్మించకుండా క్రూజ్షిప్లోనే బస ఏర్పాట్లు చేయనున్నారు. ఇదే జరిగితే అథ్లెట్లకు ఇదో సరికొత్త అనుభూతిని అందిస్తుంది. జపాన్‌లోని అయిచి రాష్ట్రంలోని నగోయా నగరంలో ఆసియా క్రీడలతో పాటు పారా ఆసియా క్రీడలు జరుగుతాయి. దీనికి సంబంధించిన ఆర్గనైజింగ్ కమిటీ నగోయా రేవు సమీపంలోని కింజో పీర్ వద్ద క్రూజ్షిప్ను ఫ్లోటింగ్ విలేజ్‌గా వాడుకోనుంది. ఆర్చరీ, బాస్కెట్‌బాల్ 3్ఠ3, కనోయింగ్ –కయాకింగ్, సైక్లింగ్, మౌంటెన్ బైక్ సైక్లింగ్, రేసింగ్ ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, జూడో, కబడ్డీ, కురాష్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, రోయింగ్, రగ్బీ, సెపక్తక్రా, స్పోర్ట్ క్లైంబింగ్, స్క్వాష్, టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, వుషు తదితర పోటీల్లో పాల్గొనేందుకు 4600 మంది అథ్లెట్లు వస్తారని నిర్వాహకులు అంచనా వేశారు. ఈ 20 క్రీడాంశాలకు సంబంధించిన వేదికలన్నీ (స్టేడియాలు) కూడా నగోయా పోర్ట్‌కు అతి దగ్గరలోనే ఉండటంతో నిర్వాహకులు ఫ్లోటింగ్ విలేజ్ (క్రూజ్షిప్పై) వైపు మొగ్గినట్లు తెలిసింది. ఇంతకు ముందెన్నడూ చూడని గ్రామాన్ని ఆవిష్కరించనున్నామని, ఇది అథ్లెట్ల జీవితాల్లో చిరకాలం నిలిచిపోయే వినూత్న వేదికని ఆసియా క్రీడల సాంకేతిక అధికారి ఒకరు తెలిపారు. భారీ ఓడలో కంటెయినర్లతో తయారు చేసిన విల్లాలు ఉంటాయి. అంతేకాదు జిమ్, స్విమ్మింగ్‌పూల్ సదుపాయలెన్నో ఉంటాయి.

శ్రీశాంత్‌పై మూడేళ్ల నిషేధం
తిరువనంతపురం: భారత మాజీ పేస్ బౌలర్ ఎస్.శ్రీశాంత్‌పై కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) తీవ్ర చర్యలు తీసుకుంది. క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు అతనిపై మూడేళ్ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. కేరళ ఆటగాడు సంజు సామ్సన్ చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులోకి ఎంపిక కాకపోవడంతో శ్రీశాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఒక మళయాళ టీవీ చానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ... సామ్సన్ను విజయ్ హజారే వన్డే టోర్నీకి కేరళ క్రికెట్ సంఘం ఎంపిక చేయకపోవడం తప్పుడు నిర్ణయమని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు. దీని వల్లే అతను చాంపియన్స్ ట్రోఫీ అవకాశాలు కోల్పోయాడని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో కేరళ సంఘంపై పలు ఆరోపణలు చేసిన అతను... సామ్సన్తో పాటు ఇతర కేరళ క్రికెటర్లకు తాను అండగా ఉంటానని, కేరళ సంఘం నుంచి వారిని రక్షిస్తానని అతను పేర్కొన్నాడు. ఇదే కారణంగా శ్రీశాంత్‌పై వేటు పడింది. ఈ వివాదం మొదలైన సమయంలో శ్రీశాంత్‌తో పాటు కేరళ క్రికెట్ లీగ్‌లో అతను సహ యజమానిగా ఉన్న కొల్లామ్ ఏరీస్ టీమ్‌కు కూడా కేసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘నేను తప్పు చేయలేదు’ కేసీఏ తనపై నిషేధం విధించడంపై స్పందిస్తూ తాను ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టం చేశాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే అసలు నేను ఏం తప్పు చేశానో అర్థం కావడం లేదు. సామ్సన్ మనవాడు. అందుకే ఒక మంచి ఉద్దేశంతో అతడికి మద్దతు పలికానంతే. కేసీఏను ఎక్కడా విమర్శించలేదు. అసోసియేషన్‌లో ఉన్నవారు కాస్త పెద్ద స్థాయిలో క్రికెట్ ఆడిన వారైతే బాగుండేది అని మాత్రమే అన్నాను. సామ్సన్ మాత్రమే కాదు కేరళ ఆటగాళ్లు ఎవరికైనా మనం అండగా నిలవాలి నాపై నిషేధం వెనక ఎలాంటి కారణం ఉందో నాకు అర్థం కాలేదు. కేరళ అభిమానులే దీనిని నిర్ణయించండి’ అని శ్రీశాంత్ చెప్పాడు. భారత్ తరఫున 90 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన శ్రీశాంత్ టి20, వన్డే వరల్డ్ కప్‌లు గెలిచిన జట్లలో భాగంగా ఉన్నాడు.
బిజినెస్

స్టాక్ మార్కెట్లో కొత్త ఇండెక్స్
ముంబై: స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా నిఫ్టీ వేవ్స్ ఇండెక్స్‌ను ప్రవేశపెట్టింది. మీడియా, ఎంటర్టైన్మెంట్, గేమింగ్ పరిశ్రమలకు ప్రాతినిధ్యం వహించే 43 లిస్టెడ్ కంపెనీలతో ఇండెక్స్‌ను రూపొందించింది. తద్వారా ఫిల్మ్, టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, మ్యూజిక్, గేమింగ్ తదితర వివిధ పరిశ్రమలకు చోటు కల్పించింది.స్టోరీలు, మ్యూజిక్, ఇన్నోవేషన్, క్రియేటివ్ స్పిరిట్ ఇకపై దేశం నుంచి భారీగా ఎగుమతికానున్నట్లు 2025 వేవ్స్‌లో ఎన్ఎస్ఈ ఇండెక్స్‌ను విడుదల చేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. 2005 ఏప్రిల్1 ఇండెక్స్‌కు బేస్కాగా.. ప్రాథమిక విలువను 1,000గా నిర్ధారించారు.దేశీయంగా అత్యంత డైనమిక్ రంగాలలో ఒకటైన మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ లోతును ప్రతిబింబించే విధంగా నిఫ్టీ వేవ్స్ ఇండెక్స్‌కు తెరతీసినట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ తెలియజేశారు.

వర్షాలతో సాగు సమృద్ధి
ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే అధికంగా నమోదు కావచ్చంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వేసిన అంచనాలు వ్యవసాయ రంగానికి సానుకూలమని.. ఉత్పాదకత పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) పేర్కొంది. దీనికితోడు వడ్డీ రేట్ల తగ్గింపు వినియోగానికి ఊతమిస్తాయని.. ప్రతీకార సుంకాలతో పడే ప్రభావాన్ని ఎదుర్కొని భారత్ బలంగా నిలబడగలదని అంచనా వేసింది. ఐఎండీ అంచనాలు కేవలం రైతులకే కాకుండా, ఆర్థిక వ్యవస్థకూ అనుకూలమేనని తెలిపింది. అయితే మొత్తం మీద వర్షపాతం ఎలా ఉంటుందన్న దానిపైనే ఈ ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది.వాతావరణ మార్పులతో వర్షాల పరంగా ఎలాంటి ఊహించని షాక్‌లు లేకుండా సాధారణంగా ఉంటే మరో ఏడాది వ్యవసాయ రంగం స్థూల విలువ జోడింపు (జీవీఏ) 4 శాతం స్థాయిలో ఉంటుందని ఇండ్-రా అంచనా వేసింది. ‘2024 ఖరీఫ్, రబీ పరంగా మంచి సాగును చూశాం. 2025–26లోనూ రెండు సానుకూల పంట సీజన్లు, ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్షిత స్థాయికి దిగువన ఉండడం, ద్రవ్య పరపతి విధాన సరళీకరణ అన్నవి ప్రతీకార సుంకాల ప్రభావాన్ని భారత్ తట్టుకుని నిలిచేలా చేస్తాయి’ అని ఇండ్–రా ప్రతినిధి దేవేంద్ర కుమార్ పంత్ తెలిపారు. ఈ ఏడాది జూన్–సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాలు భౌగోళికంగా వివిధ ప్రాంతాల్లో ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంటుందని ఇండ్–రా తెలిపింది. ఇదీ చదవండి: భారత్–అమెరికా మధ్య డీల్..?ఉపాధి కల్పనలో కీలక పాత్ర2022–12 నాటికి జీడీపీ జీవీఏలో సాగు రంగం వాటా 18.5 శాతం ఉంటే, 2024–25లో 14.5 శాతానికి తగ్గినట్టు ఇండ్–రా తన నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ దేశ ఆరి్థక వ్యవస్థలో ఉపాధి కల్పన పరంగా కీలక భూమిక పోషిస్తున్నట్టు తెలిపింది. సాగు రంగం నుంచి ఉపాధి కల్పన వాటా 2018 మార్చి నాటికి 44.1 శాతంగా ఉంటే, 2025 మార్చి నాటికి 46.1 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. ఇది వినియోగ డిమాండ్‌పై, ముఖ్యంగా గ్రామీణ డిమాండ్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపింది.

అది ఇల్లీగల్.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: భూషణ్ స్టీల్ అండ్ పవర్ (బీపీఎస్ఎల్)ను దక్కించుకోవడానికి సంబంధించి జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కంపెనీ సమర్పించిన పరిష్కార ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఇది దివాలా చట్టానికి (ఐబీసీ) విరుద్ధమని, అక్రమమని స్పష్టం చేసింది. ఐబీసీ కింద బీఎస్పీఎల్ లిక్విడేషన్ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ని (ఎన్సీఎల్టీ) సుప్రీం కోర్టు ఆదేశించింది.వివరాల్లోకి వెళ్తే, దివాలా చట్టం కింద 2021లో బీఎస్‌పీఎల్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 49% వాటా దక్కించుకుంది. తర్వాత దీన్ని 83%కి పెంచుకుంది. అయితే, ఇందుకు అనుసరించిన విధానం, నిబంధనలకు విరుద్ధంగా ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అలాగే, నిర్దేశిత గడువులోగా పరిష్కార ప్రణాళికను అమలు చేయలేదని పేర్కొంది.ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని, పూర్తి ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఎక్స్చేంజీలకు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తెలిపింది. ఈ వార్తలతో శుక్రవారం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేరు సుమారు 5% క్షీణించి రూ. 972 వద్ద ముగిసింది.

భారత్–అమెరికా మధ్య డీల్..?
ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి (బీటీఏ) సంబంధించి చర్చించాల్సిన అంశాలు (టరమ్స్ ఆఫ్ రెఫరెన్స్) ఖరారైనట్లు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) జేమీసన్ గ్రీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో సమతౌల్యం సాధించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని పేర్కొన్నారు.భారత్ నిర్మాణాత్మకంగా వ్యవహరించడాన్ని స్వాగతిస్తున్నామని, ఇరు దేశాల వర్కర్లు, రైతులు, ఆంత్రప్రెన్యూర్లకు కొత్తగా అవకాశాలను కల్పించడంపై ఆసక్తిగా ఉన్నామని గ్రీర్ వివరించారు. బీటీఏపై చర్చలు జరపనున్నట్లు ఫిబ్రవరి 13న ఇరు దేశాలు ప్రకటించాయి. తొలి దశను ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాయి. భారత్‌లో తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు మరింతగా అవకాశమివ్వాలని, టారిఫ్‌లను తగ్గించాలని, టారిఫ్యేతర అవరోధాలను తొలగించాలని అమెరికా కోరుతోంది. తద్వారా భారత్‌తో గణనీయంగా ఉన్న వాణిజ్య లోటును భర్తీ చేసుకోవాలని భావిస్తోంది.ఇదీ చదవండి: చిన్న సంస్థలపై తీవ్ర ఒత్తిడిఅమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) భారత ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ప్రపంచ టారిఫ్ అనిశ్చితుల మధ్య గేమ్ ఛేంజర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఇది ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ఎలా ప్రభావితం చేస్తుందో నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 191 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని ఈ ఒప్పందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణ ప్రపంచ సరఫరా గొలుసులలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తుంది.రంగాలవారీ ప్రయోజనాలుటెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్స్, బొమ్మల తయారీలో భారతదేశం టారిఫ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. కానీ రత్నాలు, ఆభరణాలు, వ్యవసాయం, చేపల పెంపకంలో సవాళ్లను ఎదుర్కొంటుందని అంచనా. అమెరికా-చైనా వాణిజ్య వివాదం తీవ్రతరం కావడంతో భారతదేశం అమెరికాకు నమ్మకమైన వాణిజ్య భాగస్వామిగా ఎదుగుతోంది. ఇది యూరోపియన్ యూనియన్, యూకేతో ఒప్పందాలు జరుపుకునేందుకు కారణమవుతుంది. తయారీ, క్లీన్ ఎనర్జీ, రక్షణ రంగాల్లో అమెరికా పెట్టుబడులను ఆకర్షించడం, టెక్నాలజీ బదిలీ, ఉద్యోగాల కల్పనను వేగవంతం చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఫ్యామిలీ

The Midnight Walk’ అ ‘మాయ’కుడు ఎవరు
డార్క్ ఫాంటసీ అడ్వెంచర్ గేమ్.... ది మిడ్నైట్ వాక్. ప్లేయర్స్‌ను ఈ గేమ్ భయానక ప్రపంచంలోకి ఆహ్వానిస్తుంది. ఆ ప్రపంచంలోకి వెళ్లే ధైర్యసాహసాలు ఉంటే క్రూరమైన రాక్షసులతో ΄ోరాడాలి. ఎన్నో రహస్యాలను వెలికితీయాలి. కోర్ గేమ్‌ప్లే ఫీచర్స్ఆకట్టుకుంటాయి. ఈ గేమ్ కోసం ఎన్నో సర్రియల్ క్రియేచర్లను సృష్టించారు. ప్రతి ఫ్రేమ్ స్టాప్ మోషన్ మ్యాజిక్‌తో ప్రాణం పోశారు.‘సూర్యుడిని ఎవరు మాయం చేశారు? ఎందుకు?’ అనేది గేమ్‌లో సెంట్రల్ మిస్టరీ.‘ఈ గేమ్ ఇండి గేమింగ్ ప్రపంచంలో ప్రత్యేకతను చాటుకుంటుంది. మిడ్నైట్ వాక్ అనేది డార్క్ ఫాంటసీ, స్టాప్–మోషన్ మ్యాజిక్ సమ్మేళనం’ అంటున్నారు గేమ్ మేకర్స్.విడుదల తేది: 8 మే ప్లాట్‌ఫామ్స్: ప్లేస్టేషన్ 5, మైక్రోసాప్ట్ విండోస్ జానర్స్: అడ్వెంచర్ గేమ్, ఇండి గేమ్ఇదీ చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా? అవును... ఇది నిజమే! ∙1904లో అమెరికన్ టీ వ్యాపారి ఒకరు చిన్న సిల్క్ సంచులలో టీ పొడిని ఐరోపాకు రవాణా చేశాడు. అయితే....కొందరు తెలియక వాటిని మరుగుతున్న నీటిలో ముంచారు. అలా టీ బ్యాగ్ ఐడియా పుట్టింది! ∙‘ఏ ఇద్దరు వ్యక్తుల వేలి ముద్రలు ఒకేరకంగా ఉండవు’ అనేది నాలుకకు కూడా వర్తిస్తుంది. ప్రతి వ్యక్తి ‘టంగ్ ప్రింట్’కు దాని స్వంత, విలక్షణమైన ఆకారం, పరిమాణం, రంగు ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. ఫోరెన్సిక్ పరిశోధనలలో ‘టంగ్ ప్రింట్’లు కూడా ఉపయోగపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

‘భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’
భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కలగలిసిన దేశం. ఈ దేశం తీరు నచ్చిందని ఎందరో విదేశీయులు తన పర్యాటన అనుభవాలను షేర్ చేసుకున్నారు. కొందరు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారు కూడా. తాజాగా మరో విదేశీయుడు మన భారత్‌ని ఆకాశానికి ఎత్తేలా ప్రశంసల జల్లు కురిపించాడు. అంతేగాదు తాను కచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలను ఎన్నో నేర్పిందని చెబుతున్నాడు. అవేంటో అతడి మాటల్లోనే చూద్దామా..!.కెనడియన్ ట్రావెల్ కంటెంట్ సృష్టికర్త విలియం రోస్సీ మన భారతదేశం అంతటా ఐదు వారాలు పర్యటించాడు. ఈ సుడిగాలి పర్యటనలో తాను ఎలాంటి అనుభవాన్ని పొందానో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. తాను 37 దేశాలకు పైగా పర్యటించాను గానీ భారత్ లాంటి ఆశ్చర్యకరమైన దేశాన్ని చూడలేదన్నారు. ఇక్కడ పీల్చే గాలి, వాసన, కనిపించే దృశ్యాలు, రుచి అన్ని అనుభూతి చెందేలా.. ఆలోచించేలా ఉంటాయని అన్నాడు. అలా అని ఈ దేశంలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకోలేనని అన్నారు. అయితే ఈ ఐదు వారాల సుదీర్ఘ జర్నీలో భారతదేశ పర్యటన భావోద్వేగ, మానసిక మేల్కొలుపులా అనిపించిందని చెప్పారు. ఇక్కడ ఉండాలని భావించలేకపోయినా..ఏదో తెలియని భావోద్వేగం.. ఉండిపోవాలనే అనుభూతి అందిస్తోందన్నారు. వ్యక్తిగతంగా తాను తప్పక నేర్చుకోవాల్సిన పాఠాలను కూడా బోధించిందన్నారు. ఇక్కడ పర్యటించడంతోనే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ప్రభావితం చేసిందన్నారు. ఇక్కడి కొత్త ప్రదేశాలు వాటి మాయజాలంతో కట్టిపడేశాయి. భారత్ ప్రజల దినచర్యలు అలవాటు చేసుకోమనేలా ఫోర్స్‌చేస్తున్నట్లు అనిపిస్తాయన్నారు. కృతజ్ఞత..ఒకే ప్రపంచంలో రెండు వాస్తవాలను చూపిస్తుందన్నాడు. ఇక్కడ ప్రజలందరూ భిన్నమైన పరిస్థితుల్లో జీవిస్తునన్నారు. ఒక్కరోజు సెలవుతో మిగతా రోజులన్ని కష్టపడి పనిచేయడం తనని ఆశ్చర్యపరిచిందన్నారు. అప్పుడే తనకు కృతజ్ఞత విలువ తెలిసిందన్నారు. ఎందుకంటే విశ్రాంతి తీసుకోవడం పట్ల చాలా కృతజ్ఞతగా ఉండాలని గట్టిగా తెలుసుకున్నా అన్నారు. అంతేగాదు నిద్రకు ఉపక్రమించేందుకు సురక్షితమైన స్థలం, ఆహారం నిల్వ చేసుకునే ఫ్రిడ్జ్ తదితరాలతో హాయిగా జీవితం గడిపేయగలమనే విషయం కూడా తెలుసుకున్నాని అన్నారు. షాకింగ్ గురిచేసే సంస్కృతులు ఆచారాలు.. ఇక్కడ ఉండే విభిన్న సంస్కృతులు ఆచారాలు గందరగోళానికి గురిచేసేలా షాకింగ్ ఉంటాయి. అయితే ఒక సంబరం లేదా వేడుక జరిగినప్పుడూ.. ఇచ్చే అందం, ప్రత్యేకత చాలా గొప్పదని అన్నారు. స్థానిక వంటకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ఇక్కడ భారతీయ సుగంధద్రవ్యాలు ఇంతకు ముందెన్నడూ అనుభవించని శక్తిని అందిస్తాయని అన్నారు. ఐకానిక్ తాజ్‌మహల్ గురించి ఒక పట్టాన అంచనా వేయడం సాధ్యం కాదన్నారు. అయితే ఇక్క ఏ ఫోటో అయినా అద్భుతంగా ఉంటుందన్నారు. మరో ముఖ్యమైన విషయం ప్రజల దయ తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ఇక్కడ ఆతిథ్యం మాత్రం సాటిలేనిదని ప్రశంసించాడు. ఎవరీ విలియం రోస్సీలింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, విలియం ఒకప్పుడూ ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా ఆరు అంకెలా జీతంతో పనిచేసేవారు. తర్వాత పూర్తి సమయం పర్యాటనలు, కంటెంట్ క్రియేటర్‌గా రాణించేందుకు మంచి ఉద్యోగ ఆఫర్లను వదులుకున్నాడు. ప్రస్తుతం తన వ్యక్తిగత అభివృద్ధి బ్రాండ్ స్ప్రౌట్ నడుపుతూ..వృద్ధి, మనస్తత్వం, అనుభవాల శక్తిపై దృష్టిసారిస్తున్నాడు. కాగా, నెటిజన్లు మా భారతదేశ సంక్లిష్టతను గౌరవించినందుకు ధన్యవాదాలు. అలాగే నిజాయితీగా అనుభవాలను పంచుకున్నందుకు అభినందించకుండా ఉండలేకపోతున్నాం అంటూ విలియంపై ప్రశంసల జల్లు కురిపించారు. View this post on Instagram A post shared by William Rossy (@sprouht) (చదవండి: స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!)

నేచర్ క్యాంప్, ఫారెస్ట్ ట్రెకింగ్ అంటే ఇష్టమా..?
గచ్చిబౌలి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డెక్కన్ వుడ్స్, ట్రైల్స్ పేరిట వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీజీఎఫ్డీసీ ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ తెలిపారు. 3వ తేదీ నుంచి మంరేవులలోని ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో సాయంత్రం 4 నుం మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు రాక్ బే నేచర్ క్యాంప్ ఉంటుందన్నారు. టీం బిల్డింగ్, టెంట్ పిచింగ రాత్రి పూట అడవిలో నడక, నైట్ క్యాపింగ్, క్యాంప్ ఫైర్, ఉదయం బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్, నేచర్ ట్రయల్ వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. (Summer Vacation వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం)కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు ఎకో బస్ టూర్లో ఆడియో, వీడియో హాల్లో చెట్ల ప్రాముఖ్యతను వివరిస్తారు. సీతాకొక చిలుకల మీద ప్రజెంటేషన్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికిల్‌పై 75 థీమ్ పార్క్‌లు, వృక్ష పరిచయ క్షేత్రం చూపిస్తారు. అనంతరం జీవవైవిద్యంలో పాముల ప్రాముఖ్యతపై ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వివరిస్తుంది. వర్చువల్ వైల్డ్‌లైఫ్ సఫారీ, గిరిజన జీవన శైలి, సంస్కృతి, వెస్ట్రన్గార్డ్స్, ఈస్ట్రన్స్ గార్డ్స్, 9డి సినిమా, స్పేస్ అక్వైరియం, థీమ్ ఫారెస్ట్‌ను వీక్షించవచ్చు. ఏసీ బస్సులో మృగవని నేషనల్ పార్క్‌కు తీసుకెళ్తారు. 4వ తేదీన ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో బర్డ్స్ వాక్ నిర్వహిస్తారు. (అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్)బొటానికల్ గార్డెన్లో సమ్మర్ డే క్యాంప్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. బర్డ్స్ వాక్, స్నేక్ షో, థీమ్ పార్క్‌లు, వైల్డ్ లైఫ్ సఫారీలను చూపిస్తారు. వివరాల కోసం ఫోన్: 9493549399, 9885298980.

Summer Vacation వాయిద్యాలను పలికించడం ఆరోగ్యకరం
నగరంలో సంగీత వాయిద్యాలలో ప్రావీణ్యం సంపాదించడం పట్ల ఆసక్తి బాగా పెరుగుతోంది. సెలవుల్లో అందివచ్చిన సమయాన్ని సది్వనియోగం చేసుకునే క్రమంలో మ్యూజిక్‌కి జై కొడుతున్నారు స్టూడెంట్స్.. ముఖ్యంగా కోవిడ్ సమయంలో లాక్డౌన్ సమయం సంగీత వాయిద్యాల సాధనను ఎంచుకోవడానికి లేదా తిరిగి తమ అభిరుచులను సానబట్టడానికి దారితీసింది. అదే సమయంలో ఆన్లైన్ అభ్యాస వేదికలు విరివిగా అందుబాటులోకి రావడం ఈ అభిరుచికి ఆజ్యం పోసింది. దీని వలన విద్యార్థులు ఇంట్లో నుంచి కదలకుండానే వాయిద్యాలను నేర్చుకోవడం సులభమైంది. -సాక్షి,సిటీబ్యూరో ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో సంగీత శైలులపై అవగాహన పెరిగింది. వాయిద్యాల సాధనపై ఆసక్తికి పాశ్చాత్య సంగీతానికి పెరుగుతున్న ఆదరణ కూడా కారణమే. రాక్, పాప్, జాజ్ వంటి పాశ్చాత్య శైలులకు పెరుగుతున్న ప్రజాదరణ గిటార్లు, కీబోర్డులు, డ్రమ్స్ వంటి వాయిద్యాలకు డిమాండ్ పెంచింది. అదేవిధంగా కొరియన్ పాప్ కల్చర్ పట్ల పెరుగుతున్న మోజు కూడా మరో కారణం. పాశ్చాత్య వాయిద్యాలు ప్రజాదరణ పొందుతున్నప్పటికీ, ముఖ్యంగా ఫ్యూజన్ సంగీతాన్ని అన్వేషించే యువతలో భారతీయ శాస్త్రీయ వాయిద్యాలపైనా బలమైన ఆసక్తి ఉంది.సాధనకు సరైన సమయం.. తల్లిదండ్రులు సంగీత విద్య ప్రయోజనాలను గతంలో కన్నా ఎక్కువగా తెలుసుకున్నారు. వేసవి సెలవుల్లో తమ పిల్లలను అర్థవంతమైన కార్యకలాపాల్లో నిమగ్నం చేయడంలో సంగీతాన్ని మించింది లేదని భావిస్తున్నారు. విద్యార్థులకు అత్యంత ఆసక్తి ఉన్న వాయిద్యం కీబోర్డ్ కాగా ఆ తర్వాత స్థానాల్లో గిటార్, డ్రమ్స్, వయోలిన్, పియానోలు ఉన్నాయి. ఇక గాత్ర శిక్షణ పట్ల కూడా ఆసక్తి పెరుగుతోంది.పరికరం.. ఆరోగ్యకరం..సంగీత వాయిద్యం పలికించడం ద్వారా మెదడు ఆరోగ్యం బలోపేతమై ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి పనితీరుపై సానుకూల ప్రభావాలను చూపుతుందని, అభ్యాస ఆసక్తిని మరింత ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎక్సెటర్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనంలో సంగీత వాయిద్యం వాయించడం తదుపరి జీవితంలో మెరుగైన మెదడు ఆరోగ్యం ఏర్పడటం మధ్య సంబంధం ఉందని కనుగొంది. సంగీతానికి విశ్రాంతి కలిగించే శక్తి ఉంది. అందుకే చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆందోళన చెందుతున్నప్పుడు వాయిద్యం వాయించడం వైపు మొగ్గు చూపుతారు. ఫ్లూట్ నేర్చుకుంటున్న నగరానికి చెందిన ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యారి్థని లక్ష్మీ ‘వేణువు ఒక మధురమైన విశ్రాంతినిచ్చే వాయిద్యం’ అంటోంది. వేణువు వాయించడం మానసిక ఉద్రిక్తతను తగ్గిస్తుందని ఆమె చెప్పింది. ప్రతిరోజూ అరగంట సాధన చేస్తానని.. అది తన చదువుపై మరింత దృష్టి పెట్టడానికి సహాయ పడిందని చెప్పింది. వాయిద్యం వాయించడం భావోద్వేగ వ్యక్తీకరణకు సహాయపడుతోంది. భావోద్వేగాలకు ఒక మార్గాన్ని అందించడం ద్వారా ఆందోళనను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది అని మానసిక వైద్యులు డా.పరమేష్ వివరించారు. ఇదీ చదవండి: Good Health: వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా?వేసవిలో సంగీత ప్రయాణం చదువుకునే ఒత్తిడి లేని వేసవిలో విద్యార్థులు సంగీత ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా మంది. ఇది సరైన ప్రారంభంగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా, ప్రస్తుత సంగీత వేసవి కోర్సులు సాధారణ పాఠ్యాంశాల్లో అనుసంధానించడానికి అనుకూలంగా రూపొందిస్తున్నారు. ఇది స్కూల్స్/కాలేజీలు ప్రారంభింన తర్వాత కూడా విద్యార్థులు ఎటువంటి అంతరాయం లేకుండా సాధన కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. – లక్ష్మీనారాయణ యేలూరి, వ్యవస్థాపకులు ముజిగల్ అకాడమీ గిటార్ సాధన చేస్తున్నా.. పాశ్చాత్య సంగీతం అంటే ఇష్టం. రాక్ బ్యాండ్స్ ప్రదర్శనలకు హాజరవుతుంటాను. మంచి రాక్ బ్యాండ్ లో చేరాలని ఆలోచన ఉంది. అయితే కాలేజీలో క్లాసెస్ ఉన్నప్పుడు కుదరదు కాబట్టి.. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసెస్‌లో గిటార్ నేర్చుకుంటున్నా. – విప్లవ్, విద్యార్థి మణికొండచదవండి: Vaibhav Gautam వైకల్యానికి ‘చెక్’ పెట్టాడు!
ఫొటోలు


శ్రీవిష్ణు #Single మూవీ ట్రైలర్ ఈవెంట్లో కేతిక శర్మ సందడి (ఫొటోలు)


హైదరాబాద్ : గోల్కొండ కోటలో పర్యాటకుల సందడి (ఫొటోలు)


యువరాణిలా ముస్తాబైన హీరోయిన్ నభా నటేష్ (ఫొటోలు)


వేవ్స్ సమ్మిట్ లో శోభిత.. ఎంత అందంగా ఉందో? (ఫొటోలు)


దిల్ రాజు కూతురి 10వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)


పూర్ణ కుమారుడి సెకండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)


శిఖర్ ధావన్‌తో ప్రేమలో ఐరిష్ బ్యూటీ.. ఈమె గురించి తెలుసా? (ఫొటోలు)


స్టెప్పులేస్తే ఆ సంతోషమే వేరంటున్న నిక్కీ గల్రానీ (ఫోటోలు)


'మ్యాడ్ స్క్వేర్' స్వాతిరెడ్డికి పెళ్లయిపోయిందా? భర్త ఇతడే (ఫొటోలు)


న్యూయార్క్ వీధుల్లో హీరో రానా దంపతులు (ఫోటోలు)
అంతర్జాతీయం

భారత్ యుద్ధానికి దిగితే.. మీరు వెళ్లకండి: వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే భారత తన బలగాలను సిద్ధం చేసి పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొడుతోంది. ఒకవేళ పాకిస్తాన్ హద్దు మీరితే భారత్ సైన్యం ఇప్పటికే రెడీగా ఉంది. అటు నావీ, ఇటు ఎయిర్స్ ఫోర్స్, మిలటరీ దళాలు తమ తమ ఏర్పాట్లలో ఉన్నారు.ఈ క్రమంలోనే ఖలిస్తాన్ అనుకూల వేర్పాటువాది గుర్ పత్వాంత్ సింగ్ పన్నూ.. భారత సైన్యంలో ఉన్న సిక్కు మతస్తులను ఉద్దేశించి ఒక వీడియో రీలీజ్ చేశారు. ఒకవేళ పాకిస్తాన్ తో భారత్ సైన్యం యుద్ధానికి దిగితే ఇండియన్ ఆర్మీలో ఉన్న సిక్కు మతస్తులు ఎవ్వరూ ఆ యుద్ధం పాల్గొనవద్దంటూ వివాదాస్పద వీడియో రిలీజ్ చేశారు. యుద్ధానికి రంగం సిద్ధమైతే భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీకి మీరు నో చెప్పాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ మనకు స్నేహ పూర్వక దేశమని, శత్రుదేశం కాదని పొగడ్తలు కురిపించారు. ఖలిస్తాన్ కు, సిక్కు మతస్తులకు పాకిస్తాన్ అనేది ఒక మిత్ర దేశమంటూ చెప్పుకొచ్చారు. ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

ఇజ్రాయెల్‌లో భీకర కార్చిచ్చు.. జెరూసలెంను కమ్మేసిన పొగ
జెరూసలెం శివారులోని అడవుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో వేలాది మంది తమ నివాసాలను ఖాళీ చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. కార్చిచ్చు కారణంగా 13 మంది గాయపడినట్లు సమాచారం. ప్రాణనష్టంపై వివరాలు ఇంకా తెలియరాలేదు. వాతావరణం పొడిగా ఉండటం, బలమైన గాలులతో ఈ మంటలు వేగంగా చెలరేగుతున్నాయి.మంటలకు సంబంధించిన వీడియోలు, రోడ్లపై పలువురు తమ వాహనాలు విడిచి.. పరుగులు పెడుతున్నా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జెరూసలెం చుట్టుపక్కల కొండలపై దట్టమైన పొగ అలముకుంది. దీంతో దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. దేశ చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా అధికారులు చెబుతున్నారు.ఈ మంటలు జెరూసలెం నగరానికి చేరుకోవచ్చని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే హెచ్చరికాలు జారీ చేశారు. రహదారులపై దట్టమైన పొగ కమ్ముకోవడంతో టెల్ అవీవ్, జెరూసలెంను కలిపే రహదారిని మూసేశారు. సహాయక చర్యల కోసం సైన్యం కూడా రంగంలోకి దిగింది. మంటలు చెలరేగుతున్న ప్రాంతాలలోని పర్యాటక ప్రదేశాలను మూసివేశారు.📹1-The fires are spreading over increasingly larger areas as Israeli firefighting units are unable to bring them under control. https://t.co/Ls6gBs07h0📹2-A major highway of the occupying state was closed after #wildfires engulfed it with flames & smoke, forcing drivers &… pic.twitter.com/Ena9kmPjOS— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) May 1, 2025

పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా!
వాషింగ్టన్ : జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి అంశంపై పాకిస్తాన్‌కు అమెరికా షాకిచ్చింది. మతిలేని చర్యను వెనకేసుకు రావొద్దని హెచ్చరించింది. పహల్గాం దాడి విషయంలో చేపట్టే దర్యాప్తులో భారత్‌కు సహకరించాలని సూచించింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ - పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం.. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాక్ ప్రధాని హహబాద్ షరీఫ్‌తో ఫోన్లో మాట్లాడారు.ఫోన్ సంభాషణలో రూబియో.. ఉగ్రవాదంపై భారత్ తీసుకునే ప్రతి చర్యలో అమెరికా పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. అదే సమయంలో పహల్గాంలో 26 మంది ప్రాణాలు తీసిన అమానుష చర్యపై భారత్ చేపట్టే దర్యాప్తుకు సహకరించాలని సూచించినట్లు సమాచారం.Today, Secretary Marco Rubio spoke with Pakistan's Prime Minister Muhammad Shehbaz Sharif and encouraged Pakistan to work with India to de-escalate tensions, re-establish direct communications, and maintain peace and security in South Asia: US State Department spokesperson Tammy…— ANI (@ANI) April 30, 2025Secretary of State Marco Rubio spoke with Indian External Affairs Minister Dr S Jaishankar today. The Secretary expressed his sorrow for the lives lost in the horrific terrorist attack in Pahalgam, and reaffirmed the United States' commitment to cooperation with India against…— ANI (@ANI) April 30, 2025 జైశంకర్‌తో మాట్లాడిన సమయంలో మార్కో రూబియో పహల్గాం దాడి బాధితులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై జరిపే పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముందు నుంచి పహల్గాం ఉగ్రదాడి విషయంలో పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈ విషయంలో ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతి భద్రతలను కాపాడుకోవడానికి పాకిస్తాన్‌తో కలిసి పనిచేయాలని భారత్ కృషి చేయాలని కోరారు. Discussed the Pahalgam terrorist attack with US @SecRubio yesterday. Its perpetrators, backers and planners must be brought to justice.— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 1, 2025అందుకు ప్రతిస్పందనగా ఎక్స్ వేదికగా జైశంకర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో దాడికి పాల్పడ ఉగ్రవాదుల్ని, వాళ్లను పెంచి పోషిస్తున్న వారిని, పహల్గాం ఉగ్రదాడికి ప్రణాళిక వేసిన వారిని న్యాయం ముందు నిలబెట్టాలి’ అని పేర్కొన్నారు. రుబియో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌తో జరిపిన సంభాషణల్లో పాకిస్తాన్ పహల్గాం దాడిని ఖండించాలని, దర్యాప్తులో సహకరించాలని కోరారు. ఈ దాడిపై పాకిస్తాన్ బాధ్యత వహించాలని, భారత్‌తో నేరుగా సంభాషణలు పునరుద్ధరించి శాంతి దిశగా కృషి చేయాలని సూచించినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరి తాజా పరిణామలపై భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

భయపెట్టిన భారత్.. పాక్ సైన్యంలో పెను మార్పులు
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో పాక్ సైన్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అసిమ్ మాలిక్‌ను ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)గా నియమిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 2024 సెప్టెంబర్ నుంచి ఐఎస్ఐ చీఫ్‌గా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అసిమ్ మాలిక్‌కు ఎన్ఎస్ఏగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడితో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేలా భారత్ సామ, ధాన ,బేధ దండోపాయలను ఉపయోగిస్తోంది. వరుస కఠిన నిర్ణయాలతో అంతకంత దెబ్బతీస్తూనే ఉంది. ఈ క్రమంలో భారత ప్రధాని మోదీ బీహార్ వేదికగా బహిరంగంగా ఉగ్రమూకలకు హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని, వారిని పెంచి పోషిస్తున్నది ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే వెలికి తీసి మట్టిలో కలిపేస్తామన్నారు. అందుకు ఊతం ఇచ్చేలా ప్రధాని మోదీ నివాసంలో రక్షణశాఖ, భారత సైన్యంలో త్రివిధ దళాలతో జరిపిన కీలక సమావేశంలో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఉగ్రవాదం అణచివేతలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాక్ సైన్యంలో ఆందోళన మొదలైంది. భారత్.. తమపై ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని పాక్ మంత్రులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీనికి తోడు ఆ దేశ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ ఆచూకీ గల్లంతైంది. భారత్ దెబ్బకు దెబ్బ తీయొచ్చనే ఊహాగానాల నడుమ మునీర్ దేశం విడిచి భార్య పిల్లలతో పరాయి దేశంలో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం కొనసాగుతున్న వరుసర పరిణామలు, యుద్ధ భయాలతో పాక్ సైన్యంలో సైతం భయాందోళనలు మొదలయ్యాయి. బతికుంటే బలుసాకు తిని బతుకొచ్చు.. భారత్‌తో తలపడలేమనే సంకేతాలిస్తూ రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులకు రాజీనామ చేశారు. ఈ క్రమంలో రక్షణ పరంగా పాక్ ప్రధాని,రాష్ట్రపతులకు సలహాలు, పాక్ సైన్యం, ఇతర దర్యాప్తు, ఇంటెలిజెన్స్ సంస్థల్ని సమన్వయం చేసేలా అసిమ్ మాలిక్‌కు పాక్ ప్రభుత్వం ఎన్ఎస్ఏ అడ్వైజర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం.
జాతీయం

ప్రపంచానికి ఇదే సందేశం ఇచ్చాం: మల్లికార్జున ఖర్గే
ఢిల్లీ : దేశ భద్రత విషయంలో మొత్తం విపక్షం కేంద్రానికి మద్దతుగా నిలుస్తుందన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రపంచానికి కూడా ఇదే సందేశం ఇచ్చామన్నారాయన. ఈరోజు(శుక్రవారం) జరిగిన సీడబ్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ‘ పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిగా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన వ్యూహం కనిపించలేదు. రాహుల్ గాంధీ కాన్పూర్ లో చనిపోయిన శుభం ద్వివేదీ కుటుంబాన్ని కలిశారు. చనిపోయిన వారికి ‘అమరుల’ హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.దేశ భద్రత విషయంలో మొత్తం విపక్షం కేంద్రానికి మద్దతుగా నిలుస్తుంది. ప్రపంచానికి ఇదే సందేశం ఇచ్చాం. మోదీ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. ఇది రాహుల్ గాంధీ దీర్ఘకాలిక ఉద్యమ ఫలితమే. ఆయన “భారత్ జోడో న్యాయ యాత్ర” ద్వారా దీనిని ప్రధాన అజెండాగా మార్చారు. తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటికే కుల సర్వే పూర్తి చేశాయి.50% రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేయాలి. గణన నుండి వచ్చిన సమాచారాన్ని ప్రభుత్వం మంచి పాలన కోసం ఉపయోగించాలి.కులగణన కచ్చితంగా జరగాలి. ఫలితాలను అమలు చేయాలి. పాలసీలు, చట్టాలు దానికి అనుగుణంగా ఉండాలి. 2021 సాధారణ జనగణన కూడా జరగలేదు. ఇప్పటికీ 2011 డేటానే ఉపయోగిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క రిజర్వేషన్ వ్యతిరేక దృక్పథమే ఈ ఆలస్యం వెనుక కారణం’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

పాక్ వెళ్లిపోవాలన్న కేంద్రం ఆదేశాలపై ఓ కుటుంబానికి సుప్రీంలో ఊరట
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ జాతీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.. ఇలాంటి పరిస్థితుల్లో కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యులున్న అహ్మద్ తారిక్ బట్ కుటుంబం కూడా తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. అయితే, వారు వేసిన పిటిషన్‌పై శుక్రవారం.. వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం.. ఆ కుటుంబానికి తాత్కాలిక ఊరటనిచ్చింది. వీసా గడువు ముగిసినా వీరు ఇంకా భారత్‌లోనే ఉన్నట్లు తేలింది. ఆ కుటుంబం కశ్మీర్లో ఉండగా.. కుమారుడు బెంగళూరు యాక్సెంచర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తాము భారత జాతీయులమేనని అయినా మమ్మల్ని అరెస్టు చేశారంటూ వాదనలు వినిపించారు. తమ వద్ద అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆధార్, పాన్, ఓటర్ ఐడీ ఉన్నాయని కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ఈ కుటుంబంలో ఒకరు పాకిస్థాన్‌లో జన్మించినా.. ఆ తర్వాత భారత్‌కు వలసవచ్చి ఆ దేశ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఈ అంశంలో ధ్రువీకరించాల్సిన అంశాలున్నాయని.. ఈ పిటిషన్ దాఖలు చేయడంలోనే లోపాలున్నాయని పేర్కొంది. దీని మెరిట్‌పై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా పిటిషన్‌ను కొట్టేస్తున్నామన్న ధర్మాసనం.. అధికారులకు ఓ సూచన చేసింది. ఏ నిర్ణయం తీసుకోబోయే ముందైనా.. వారు చూపుతున్న పత్రాలను ధ్రువీకరించాలని.. ఈ కేసులో ఉన్న కొన్ని విచిత్ర పరిస్థితుల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకొనేవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల చర్యలతో సంతృప్తి లేకపోతే పిటిషనర్లు జమ్మూకశ్మీర్ హైకోర్టును ఆశ్రయించవచ్చంటూ కూడా ధర్మాసనం సూచించింది.

బీజేపీ మహిళా మంత్రికి వేధింపులు.. మేసేజ్‌లు.. యువకుడు అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకురాలు పంకజా ముండే (Pankaja Munde)ను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పూణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే (Pankaja Munde)ను కొద్దిరోజులుగా నిందితుడు వేధిస్తున్నాడు. తరచూ ఆమెకు ఫోన్లు చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అలాగే, అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడు. దీంతో, మహారాష్ట బీజేపీ కార్యాలయానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ నిఖిల్ భమ్రే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ట్రాక్ చేసి పట్టుకున్నారు.మహారాష్ట్ర (Maharastra) నోడల్ సైబర్ పోలీసులు (Nodal Cyber Police) అతడిని అరెస్ట్ చేశారు. ఇక, సదరు వ్యక్తిని పూణేకు చెందిన అమోల్ కాలే(25) గుర్తించారు. ఈ నేపథ్యంలో నిందితుడు ఎందుకు పంకజా ముండేను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడ్డాడు?. ఇందులో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Breaking News 🚨A man, Amol Kale (25), was arrested for harassing Maharashtra Minister Pankaja Munde with obscene calls and messages. The accused, from Pune, admitted to the acts, and he was sent to police custody for further investigation under the IT Act: Maharashtra Cyber… pic.twitter.com/slTDkbntOc— The Statesman (@TheStatesmanLtd) May 2, 2025

మంగళూరులో హై అలర్ట్.. పోలీసుల కంట్రోల్లో సిటీ
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. రౌడీ షీటర్ హత్య కారణంగా పోలీసుల హై అలర్ట్ ప్రకటించి.. నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మత ఘర్షణలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులను టార్గెట్ చేసిన బీజేపీ.. కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని ఆరోపిస్తున్నారు.వివరాల ప్రకారం.. మంగళూరులో రౌడీషీటర్ సుహాస్ శెట్టి హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న సుహాస్‌పై అటాక్ జరిగింది. నిన్న రాత్రి 8:30 గంటలకు సుహాస్ తన స్నేహితులతో కలిసి బాజ్‌పేలోని కిన్నికంబ్లాలో కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఆరుగురు ప్రత్యర్థులు కారును అడ్డగించి వాహనంపై దాడి చేశారు. అనంతరం, కారులోంచి సుహాస్ శెట్టిని బయటకు లాగి విచక్షణారహితంగా కత్తులతో, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దాడి తర్వాత.. సుహాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సుహాస్ మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మత ఘర్షణలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు. భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళూరు ఏడీజీపీ హితేంద్ర మాట్లాడుతూ.. ‘సుహాస్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోస్ట్‌మార్టం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి నిందితులను గుర్తించాం. పోలీస్ బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి. మంగళూరు పౌరులు ప్రశాంతంగా ఉండాలి. ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇది శాంతిభద్రతల వైఫల్యం కాదు’ అని అన్నారు.ఇదిలా ఉండగా.. సుహాస్ శెట్టిపై కనీసం ఐదు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2022లో బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య జరిగిన కొద్ది రోజులకే సూరత్కల్లో 23 ఏళ్ల యువకుడు ఫాజిల్‌ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్నాడు. ఫాజిల్ హత్యకు ప్రతీకారంగానే ప్రస్తుతం ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు.. సుహాస్ శెట్టి హత్య నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ నేతలు ఆరోపించారు. సుహాస్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, వీహెచ్‌పీ నేతలు.. మంగళూరులో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో, మంగళూరులో పలుచోట్ల దుకాణాలను మూసివేశారు. బస్సు సర్వీసులను నిలిపివేశారు. *Murder accused Suhas Shetty killing at BajpeProhibitory orders imposed under Section 163 of the BNS in Mangaluru City Commissionerate limits between 6am on May 2 to 6am on May 6VHP has given bandh call in DK condemning murder @XpressBengaluru @ramupatil_TNIE @vinndz_TNIE pic.twitter.com/2QTIpMBy8H— Divya Cutinho_TNIE (@cutinha_divya) May 2, 2025
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

నన్నే నీ భర్త అనుకో.. భర్త ఎదుటే భార్యపై వేధింపులు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందుబాబులు తాగిన మత్తులో రెచ్చిపోయి హల్చల్ చేశారు. రాత్రి వేళ దారిలో వెళ్తున్న భార్యాభర్తలను అడ్డుకుని.. మహిళను వేధింపులకు గురిచేశారు. నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు.. అంటూ వేధించారు. టచ్‌లో ఉండాలంటూ ఓవరాక్షన్‌కు దిగారు. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు ఆకతాయిలను అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఏపీలోని ఒంగోలుకు చెందిన యువతి (29) తన భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి హైదరాబాద్ రహ్మత్ నగర్‌లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం సాయంత్రం ఆ యువతి తన భర్త, మరిది, ఆడపడుచు, బంధువు స్నేహితుడితో కలిసి బేగంపేటలోని క్లబ్–8 పబ్‌కు వెళ్లారు. రాత్రి 11.40 గంటల సమయంలో పబ్ నుంచి ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో ఆమెను చూసిన ముగ్గురు యువకులు అడ్డగించారు. అప్పుడు తాను తన భర్తతో కలిసి వచ్చానని చెప్పినా మందుబాబులు పట్టించుకోలేదు.మరింత ఓవరాక్షన్ చేస్తూ.. నన్నే నీ భర్త అనుకో.. ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ వేధింపులకు గురిచేశారు. ఆమె శరీరాన్ని తాకే ప్రయత్నం చేశారు. చేతుల్లో బీర్ బాటిళ్లు పట్టుకుని బెదిరింపులకు దిగారు. అనంతరం, వారిద్దరూ అక్కడి నుంచి వెళ్తుండగా.. బేగంపేట నుంచి రహ్మత్ నగర్‌కు వచ్చే దాకా వెకిలి చేష్టలతో వెంబడించి వేధింపులకు గురిచేశారు.అయితే, వివాహితను ఇంట్లో దిగబెట్టిన తర్వాత తన స్నేహితుడిని డ్రాప్ చేసేందుకు భర్త మాదాపూర్ వెళ్తుండగా, ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర వారిని అడ్డగించి ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణించే బైక్‌తో పాటు ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. దీంతో వారు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వివాహితను వేధించిన వారిని పంజాగుట్టకు చెందిన డి.సంపత్ (28), సందీప్ (28), కూకట్ పల్లికి చెందిన ఉమేష్ (28)లుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Banjara Hills: బాలుడిపై బాలిక లైంగికదాడి
బంజారాహిల్స్(హైదరాబాద్): మైనర్ అయిన తన కుమారుడిపై బ్రదర్ అంటూనే ఓ బాలిక లైంగిక దాడికి పాల్పడిందంటూ బాలుడి తల్లి ఇచి్చన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో పనిమనిషిగా ఉన్న ఓ మహిళ తన భర్తతో పాటు కుమారుడితో కలిసి అక్కడే సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉంటుంది. స్కూల్ సెలవులు కావడంతో కుమారుడు ఇంటి వద్ద ఉంటున్నాడు. ఇదిలా ఉండగా వీరి క్వార్టర్స్ పక్క గదిలో ఉండే మరో పనిమనిషి అయిన బాలిక ఉంటుంది. సదరు బాలిక మహిళ కుమారుడిని బ్రదర్ అని, ఆమె కుమారుడు ఆ బాలికను సిస్టర్ అంటూ పిలుచుకునేవారు. ఒకసారి సదరు బాలిక తన కుమారుడిని ముద్దు పెట్టుకోవడంతో అతడిని నిలదీసింది. మార్చి నెలలో తాను గదిలో ఒంటరిగా ఉండగా బాలిక తనను ముద్దు పెట్టుకుందని చెప్పాడు. నిన్ను ఇష్టపడుతున్నానని, నిన్ను ఏమి చేసినా మౌనంగా ఉండాలని, లేకపోతే దొంగతనం కేసు పెట్టి మీ తల్లి ఉద్యోగం తీయిస్తానని బెదిరించిందని చెప్పుకొచ్చాడు. దీంతో ఆమె చెప్పినట్లు బాలుడు చేసేవాడు. ఈ క్రమంలో బాలుడిపై ఆమె లైంగిక దాడికి పాల్పడింది. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నాలుగుగంటలపాటు అఘోరి విచారణ
శంకర్పల్లి/షాద్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అఘోరి అలియాస్ శ్రీనివాస్‌ను శుక్రవారం మోకిల పోలీసులు విచారించారు. మంచిర్యాల జిల్లా, కృష్ణపల్లికి చెందిన అఘోరి శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్‌లో ఉంటున్న ఓ మహిళా సినీ నిర్మాతను పూజల పేరుతో మోసి చేసి, చంపుతానని బెదిరించి రూ.9.80 లక్షలు వసూలు చేసిన వ్యవహారంలో ఫిబ్రవరి 25న మోకిల పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత నెల 22న అతడిని ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. 23న చేవెళ్ల జూనియర్ ఫస్ట్‌క్లాస్ జడ్జి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. అప్పటి నుంచి చంచల్‌గూడ జైలులో ఉన్న అఘోరిని మూడు రోజుల కస్టడీకి అనుమతించాలని మోకిల పోలీసులు చేవెళ్ల కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో.. కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతించింది. ప్రశ్నల పరంపర.. కోర్టు ఒకరోజు మాత్రమే అనుమతి ఇవ్వడంతో అఘోరి పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న విషయం, సీన్ రీకన్స్ట్రక్షన్, రిమాండ్ తరలింపు తదితర అంశాలను చివరి నిమిషం వరకు పోలీసులు గోప్యంగా ఉంచారు. మోకిల సీఐ వీరబాబు సుమారు నాలుగు గంటల పాటు అఘోరిని విచారించారు. సదరు మహిళా సినీ నిర్మాత ఎలా పరిచయం అయ్యారు? మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? ఎన్ని రోజులు వాళ్లతో ఉన్నావు? పూజలు ఎక్కడ చేశారు? ఆమె వద్ద నుంచి ఎన్ని లక్షలు తీసుకున్నావు? తీసుకున్న డబ్బుతో ఏం కొనుగోలు చేశావుŒ ? మిగిలిన డబ్బు ఇప్పుడు ఎక్కడుంది? ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నీ వెనకాల ఎవరన్నా ఉండి చేయిస్తున్నారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అడిగిన ప్రశ్నలకు అఘోరి ఓపిగ్గా సమాధానం చెబుతూ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. షాద్‌నగర్ కోర్టుకు అఘోరి కస్టడీ సమయం ముగిసిన అనంతరం చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండడటంతో షాద్‌నగర్ కోర్టుకు తీసుకొచ్చి జడ్జి ఎదుట హాజరుపరిచారు. అఘోరి తరపు న్యాయవాదులు బెయిల్ పిటీషన్ దాఖలు చేసి వాదనలు వినిపించారు. బెయిల్ పిటీషన్‌ను సోమవారానికి వాయిదా వేసినట్లు అఘోరి తరపు న్యాయవాది కుమార్ తెలిపారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు అఘోరిని చంచల్‌గూడ జైలుకి తరలించారు.

వైఎస్సార్సీపీ నేతలపై కక్ష
రేణిగుంట/కొలిమిగుండ్ల: వైఎస్సార్సీపీ నేతలపై కక్ష గట్టి నష్టం చేకూర్చిన ఘటనలు తిరుపతి, నంద్యాల జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ చెలికం నాగరాజురెడ్డి తన పొలం (లీజు)లో ఉన్న 100 టన్నుల టేకు కొయ్యలను కట్ చేయించి గ్రామ శివారులో ఉన్న తన స్థలంలో నిల్వ చేశారు. ఇది తెలుసుకున్న కొందరు గురువారం అర్ధరాత్రి వాటికి నిప్పు పెట్టారు. టేకు కలప ఉంచిన ప్రాంతంలో మంటలు ఎగుస్తుండటంతో స్థానికులు గుర్తించి నాగరాజురెడ్డికి సమాచారం ఇచ్చారు.మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. అవి పూర్తిగా కాలిపోవడంతో రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు తనను భయభ్రాంతులకు గురిచేసేందుకు తగులబెట్టారని ఆయన మండిపడ్డారు. ఇందుకు కారకులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో నంద్యాల జిల్లా హనుమంతుగుండంలో వైఎస్సార్సీపీ నేత పాణ్యం ఖాన్బాదర్కు చెందిన పొలానికి కొందరు వ్యక్తులు శుక్రవారం నిప్పు పెట్టారు.గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి గుండం వద్ద ఉన్న ఎకరం పొలంలో పశువుల మేత కోసం గడ్డి సాగు చేశాడు. కొందరు ఉద్దేశ పూర్వకంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది. బోరులో నుంచి తీసి పక్కన పెట్టిన 40 పైపులు దగ్ధమయ్యాయి. నీళ్లు పారించేందుకు ఏర్పాటు చేసిన పది లింక్ పైపులు, స్టార్టర్ బాక్స్, విద్యుత్ తీగ కాలిపోయింది. రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఖాన్బాదర్, రమీజాబి దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. పక్కనే ఉన్న గడ్డివామికి కూడా నిప్పంటించి వెళ్లారు. అయితే అదే సమయంలో పొలంలోకి వచ్చిన రమీజాబి గమనించి మంటలను ఆర్పేసింది. బాధితుడు వైఎస్సార్సీపీ తరఫున 2024 ఎన్నికల్లో ఏజెంట్‌గా కూర్చున్నాడు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత డిసెంబర్లో టీడీపీ నాయకులు పట్టుబట్టి ఇతన్ని వీఓఏగా తొలగించారు. భార్య రమీజాబి చాలా ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో మేటీగా పని చేస్తోంది. ఆమెను మేటీగా తొలగించాలని టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా తమను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో టీడీపీ నాయకులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని ఖాన్బాదర్ దంపతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొలిమిగుండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.పాలన మరచి పగబట్టారు : ఎంపీ గురుమూర్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పాలనను మరచి కేవలం వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. ఇనగలూరు సర్పంచ్ చెలికం నాగరాజురెడ్డికి చెందిన టేకు కొయ్యలకు నిప్పంటించిన ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. బాధితుడు నాగరాజు రెడ్డికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మరచి, రెడ్ బుక్ రాజ్యాంగ పాలనను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
వీడియోలు


జగన్ 3,648 కిలోమీటర్లు పాద యాత్ర ఓటు కోసం కోదు..


450 ఎకరాల చెరువు కబ్జా.. ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతల ఫిర్యాదు


యుద్ధ భయంతో పాకిస్థాన్ లో హై అలర్ట్


భారత్ ను నిలువరించాలని అరబ్ దేశాలకు పాక్ విజ్ఞప్తి


అర్చకుల మాట వినకుండా గోడ నిర్మాణం.. ఇంత నిర్లక్ష్యమా?


KSR Live Show: అమరావతి కేరాఫ్ అవినీతి


తూర్పుగోదావరిజిల్లా అనపర్తి నియోజకవర్గంలో కూటమి అరాచక రాజ్యం


కూటమి కుట్రలపై మండిపడ్డ ఎంపీ గురుమూర్తి


గోవాలోని దేవి లయిరాయ్ దేవాలయంలో తొక్కిసలాట


అమరావతి సభలో పాచిపోయిన భోజనం.. కూటమిపై మహిళలు ఫైర్