Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

After Waqf Bill Clears Huge Protests In Kolkata, Chennai1
వక్ఫ్ బిల్లు ఆమోదంపై భారీ ఎత్తున నిరసనలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం ముద్ర పడిన కొన్ని గంటల వ్యవధిలోనే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. పార్లమెంట్ లో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్, తమిళనాడులో నిరసన గళం వినిపిస్తూ నిరసనకు దిగాయి ముస్లిం సంఘాలు. .‘వక్ఫ్ సవరణ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం’ అంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా, తమినాడులోని చెన్నై, గుజరాత్ లోని అహ్మదాబాద్ లో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళలన్నీ జాయింట్ ఫారమ్ ఆఫ్ వక్ఫ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలోని జరిగినట్లు జాతీయ న్యూస్ ఏజెన్నీ ఏఎన్ఐ తెలిపింది.Bengal: Muslim outfits protest against Waqf Amendment Bill in KolkataRead @ANI Story | https://t.co/JTMcg1k79U#WaqfAmendmentBill #Kolkata pic.twitter.com/iCkDlnuYFp— ANI Digital (@ani_digital) April 4, 2025 అహ్మదాబాద్‌లో తీవ్రరూపం#WATCH | Ahmedabad: Various Muslim organisations hold protests against the Waqf Amendment Bill. pic.twitter.com/viavsuqf3D— ANI (@ANI) April 4, 2025వక్ఫ్ బిల్లుపై నిరసన కార్యక్రమం అహ్మదాబాద్ లో తీవ్రరూపం దాల్చింది. రోడ్లపై కూర్చొని పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే పోలీసులు వారిని బలవంతంగా తొలగించే ప్రయత్నం చేసే క్రమంలో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.తమినాడు వ్యాప్తంగా విజయ్ తమిళగ వెట్రి కజగం నిరసనచెన్నైలో కూడా ఇలాంటి దృశ్యాలు కనిపించాయి, అక్కడ ఇటీవలే పార్టీ స్థాపించిన నటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ రాష్ట్రవ్యాప్త నిరసనను ప్రకటించింది. చెన్నై కోయంబత్తూర్, తిరుచిరాపల్లి వంటి ప్రధాన నగరాల్లో టీవీకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. చేతిలో ఫ్లకార్డులతో తమ నిరసన తెలిపారు. ముస్లింల హక్కులను హరించవద్దు అంటూ నిరసన వ్యక్తమైంది.కాగా, రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్‌ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోద ముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్‌ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది.#WATCH | West Bengal: Members of the Muslim community take to the streets in Kolkata to protest against the Waqf Amendment Bill. pic.twitter.com/pKZrIVAYlz— ANI (@ANI) April 4, 2025 దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్‌ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్‌ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే

IPL 2025: Lucknow Super Giants vs Mumbai Indians Live Updates2
IPL 2025: ల‌క్నో వ‌ర్సెస్ ముంబై లైవ్ అప్‌డేట్స్‌

LSG vs MI Live Updates: ఐపీఎల్‌-2025లో భాగంగా ల‌క్నో వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి.దూకుడుగా ఆడుతున్న ల‌క్నో..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓపెన‌ర్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో వికెట్ న‌ష్ట‌పోకుండా 32 ప‌రుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్‌(26), మార్‌క్ర‌మ్‌(5) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో భాగంగా ల‌క్నో వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ శ‌ర్మ దూర‌మ‌య్యాడు. ప్రాక్టీస్ సెష‌న్‌లో మోకాలికి గాయ‌మైంది. అత‌డి స్ధానంలో రాజ్ అంగ‌ద్ తుది జ‌ట్టులోకి బావా వ‌చ్చాడు.తుది జ‌ట్లు లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్‌), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, దీపక్ చాహర్, విఘ్నేష్ పుత్తూర్

Ysrcp Ambati Rambabu Fires On Chandrababu And Sharmila3
చంద్రబాబుతో కలిసి షర్మిల డైవర్షన్‌ పాలిటిక్స్‌: అంబటి

సాక్షి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఏపీకి అన్యాయం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. ప్రత్యేక హోదా ఎగిరిపోయింది. ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అంటూ చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారు. పోలవరాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు’’ అంటూ అంబటి రాంబాబు దుయ్యబట్టారు.‘‘పోలవరం ప్రాజెక్టు 47.72ను ఎత్తు నుంచి 41.15 ఎత్తుకు తగ్గించారు. చంద్రబాబు దీనికి ఒప్పుకున్నాడు. కేంద్ర జల శక్తి వార్షిక నివేదికలో కూడా ఇదే పేర్కొంది. పోలవరాన్ని41.15 తగ్గించి కేంద్రం 25 వేల నుంచి 30 వేల కోట్లు ఎగ్గొడుతుంది. లోకేష్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి చంద్రబాబు దీనికి ఒప్పుకున్నాడు. ఇది దారుణమైన అంశం. వైఎస్సార్‌సీపీపై విరుచుకుపడి కథనాలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈ కథనాన్ని ఎందుకు రాయరు?’’ అంటూ అంబటి ప్రశ్నించారు.‘‘పోలవరం ఎత్తును తగ్గించారని నేను చెబుతున్న మాటలు తప్పయితే కేంద్ర మంత్రులు గాని రాష్ట్ర మంత్రులు చెప్పాలి. పోలవరం ఎత్తు తగ్గిస్తే మంత్రులు ఎందుకు మాట్లాడలేదు. షర్మిల చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో షర్మిల సింహభాగం పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు కలిసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరి, చంద్రబాబుతో కలిసి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతుంది’’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘ఆస్తి తగాదాలుంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాలి. చంద్రబాబుకి చెల్లెలు ఉన్నారు. వాళ్లకి హెరిటేజ్‌లో భాగం ఇవ్వమంటే ఇస్తాడా?. వైఎస్‌ జగన్‌ను దెబ్బతీయడానికి షర్మిలతో మాట్లాడిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Indias IT services industry likely to face Challenges due to Trump reciprocal tariffs4
ట్రంప్‌ టారిఫ్‌లు.. ‘ఇండియన్‌ ఐటీ’కి గట్టి దెబ్బే..

డొనాల్డ్‌ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రతీకార సుంకాలు ప్రపంచ ఆర్థిక కారిడార్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివిధ దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులు, సేవలకు అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతీకార సుంకాలు నిర్ణయించారు. దీని ప్రభావం భారత్‌లోని అనేక రంగాలపై పడనుంది. ముఖ్యంగా 280 బిలియన్ డాలర్ల విలువైన భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకంటే దీనికి యునైటెడ్ స్టేట్స్‌ కీలకమైన ఆదాయ వనరు.యూఎస్-ఇండియా టెక్ బంధందశాబ్దాలుగా భారతదేశంలో ఐటీ సేవల రంగం అభివృద్ధి చెందింది. యూఎస్ కంపెనీలతో దాని భాగస్వామ్యం, డిజిటల్ పరివర్తనతో నడిచే ప్రాజెక్టుల స్థిరమైన ప్రవాహం ఇందుకు తోడ్పాటు అందిస్తున్నాయి. భారత ఐటీ పరిశ్రమకు ఆదాయంలో దాదాపు 50% అమెరికన్ మార్కెట్ నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో యూస్‌ ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు అమెరికా-భారత్‌ టెక్‌ బంధానికి విఘాతం కలిగిస్తాయన్న ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఈ టారిఫ్‌లు భారతీయ ఐటీ సేవలపై ఆధారపడిన యూఎస్ సంస్థలకు ఖర్చులను పెంచబోతున్నాాయి.తక్షణ పరిణామాలు కొత్త సుంకాలు అమెరికాకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. కంపెనీలు బడ్జెట్లను కఠినతరం చేయవలసి వస్తుంది. విచక్షణతో కూడిన సాంకేతిక వ్యయంలో వృద్ధి సాధించిన భారత ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి మందగించవచ్చు. 2026 ఆర్థిక సంవత్సరానికి 6-8 శాతం అత్తెసరు వృద్ధి రేటు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇండస్ట్రీ రెస్పాన్స్..యూఎస్‌ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా, భారతీయ ఐటీ సంస్థలు తమ భౌగోళిక పరిధి, క్లయింట్ స్థావరాలను వైవిధ్యపరచడంపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇంకా, కాస్ట్ ఆప్టిమైజేషన్ వ్యూహాలు, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఐరోపా, ఆసియా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో అవకాశాలను అన్వేషిస్తూ అమెరికా నుంచి డిమాండ్ క్షీణతను పూడ్చడమే ఈ చర్యల లక్ష్యం.కొత్త అవకాశాలూ..ఈ కల్లోలం భారత ఐటీ కంపెనీలకు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్గం సుగమం చేస్తుంది. యూఎస్ తయారీ, ఆటోమేషన్ రంగాలకు అనుగుణంగా సృజనాత్మక డిజిటల్ పరిష్కారాలను అందించడం ద్వారా, ఐటీ పరిశ్రమ అమెరికన్ మార్కెట్లో తన ప్రాముఖ్యతను తిరిగి స్థాపించడానికి మార్గాలను కనుగొనవచ్చు.ముందున్న మార్గం తక్షణ సవాళ్లు గణనీయంగా ఉన్నప్పటికీ, భారత ఐటీ సేవల పరిశ్రమ స్థితిస్థాపకతను తక్కువ అంచనా వేయలేము. గతంలో ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ మార్పుల సమయంలోనూ మన ఐటీ పరిశ్రమ నిలదొక్కుకుంది. అలాగే ప్రస్తుత తుఫానులను కూడా ఎదుర్కోవడమే కాకుండా ఆవిష్కరణ, వైవిధ్యీకరణ ద్వారా మరింత బలంగా ఎదిగే ఈ రంగం సామర్థ్యానికి రాబోయే సంవత్సరాలు పరీక్షగా నిలవనున్నాయి.

Key Points In The Remand Report In Rajahmundry Naganjali Case5
రాజమండ్రి నాగాంజలి కేసు.. రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యకు కారణమైన నిందితుడు దీపక్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నాగాంజలిని పెళ్లి చేసుకుంటానని చెప్పి దీపక్ లైంగికదాడికి పాల్పడ్డాడు. పెళ్లి పేరుతో విషయం బయటకు చెప్పకుండా బాధితురాలిని కట్టడి చేశాడు. దీపక్ మాటలను అమాయకంగా నమ్మిన బాధితురాలు.. వివాహం చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమెను దీపక్‌ రెండు,మూడు సార్లు కొట్టాడు. దీపక్ అకృత్యాలను తండ్రికి, రూమ్మేట్లకు సైతం నాగాంజలి తెలియనివ్వలేదు.ఈ నెల 23న దీపక్‌కు కాల్ చేసి పెళ్లి చేసుకోవాలని ఆమె కోరింది. చనిపోవాలంటే చనిపోవచ్చని.. తనకు ఇబ్బందిగా ఉందంటూ దీపక్ కర్కశంగా వ్యవహరించాడు. తాను మోసపోయినట్టు గుర్తించిన నాగాంజలి.. తీవ్ర మానసిక వేదన అనుభవించింది.కాగా, దీపక్‌కు పెళ్లయి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 2010లో బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో దీపక్ చేరాడు. ప్రస్తుతం నిందితుడు రిమాండ్‌లో ఉన్నాడు.రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న నాగాంజలి శుక్రవారం ఉదయం మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, గత 28 నుంచి నాగాంజలిని వ్యైదుల బృందం పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. నాగాంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు ఉదయమే పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇప్పటివరకు ఫార్మసీ విద్యార్థిని ఘటనకు సంబంధించి ప్రభుత్వం, మంత్రులు స్పందించకపోవడం గమనార్హం.

No Varma Nagababu Now Officially Became Pithapuram Zamindar6
పిఠాపురం జమీందారుగా కొణిదెల నాగబాబు!

పిఠాపురం జమీందారుగా మెగా బ్రదర్ నాగబాబుకు పట్టాభిషేకం అయినట్లేనా?.. ఇక ఆ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు శంకు స్థాపనలు .. రివ్యూలు అన్నీ నాగబాబే చూసుకుంటారా? తెలుగుదేశం నాయకుడు వర్మను పూర్తిగా పక్కనబెట్టేసినట్లేనా?. పరిస్థితులు.. పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏ పనుల్లో ఉంటారో కానీ నిత్యం బిజీగా ఉంటారు. అటు సినిమాలు.. వైద్యం చికిత్స.. బిజినెస్ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉంటారు. గెలిచారే కానీ పిఠాపురం మీద ఏమీ దృష్టి సారించడం లేదు. అక్కడ అభివృద్ధి వంటి పనుల పర్యవేక్షణ.. సమీక్షలకు ఆయనకు టైం చిక్కడం లేదు. పోనీ అలాగని తనను గెలిపించిన తెలుగుదేశం వర్మకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన పరపతి పెరిగిపోతుందని, ప్రజల్లో ఆయన పలుకుబడి ఇనుమడిస్తుంది అని భయం!. అసలే గెలవక గెలవక పవన్ పిఠాపురం(Pithapuram)లో వర్మ పుణ్యమా గెలిచారు. ఇప్పుడు వర్మకు ప్రాధాన్యం ఇవ్వడానికి పవన్ కు ధైర్యం చాలడం లేదు. దీంతో పిఠాపురం బాధ్యతలు చూసేందుకు పవన్ కు ఎలాంటి ఇబ్బంది లేని.. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది..ముప్పు లేని వ్యక్తి కావాలి. సరిగ్గా ఆ ప్లేసులోకి నాగబాబు వచ్చి పడ్డారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు.. ఎంపీలకు ఒక నిర్దిష్ట నియోజకవర్గం ఉంటుంది. ఆ ప్రాంతంలో వారు రాజకీయ కార్యకలాపాలు చేస్తారు కానీ ఎమ్మెల్సీలకు అదేం ఉండదు. దీంతో వాళ్లు తమకు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ రాజకీయం చేస్తారు.పైగా నాగబాబుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో రాజకీయంగా పట్టుంది అని చెప్పేందుకు అవకాశం లేదు. దీంతో ఆయన ఏకంగా పిఠాపురంలో పాగావేసి తమ్ముడు పవన్ తరఫున పెద్దరికం..పెత్తనం చేస్తారన్నమాట. ఈ మేరకు పార్టీ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది. పిఠాపురంలో ఇకపై అధికారిక రివ్యూలు.. సమీక్షలు..అభివృద్ధిపనుల పర్యవేక్షణ కూడా నాగబాబే చేపడతారని పార్టీ ఒక ప్రకటన చేసింది.వాస్తవానికి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని ప్రారంభించాలంటే ఎమ్మెల్యేలు.. మంత్రులే చేయాలి కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు అన్నీ నాగబాబు చూస్తారని పార్టీ చెబుతోంది. ఇకముందు పిఠాపురంలో నాగబాబు(Naga Babu)కు ప్రాధాన్యం తప్ప ఆ ప్రకటనలో ఎక్కడా వర్మ ప్రస్తావన లేకుండా కుట్ర పన్నారు. అంటే రాజకీయంగా వర్మను ఇక తెరమరుగు చేయడమే లక్ష్యంగా పవన్.. నాగబాబు ముందుకు వెళ్తున్నారు.ఇకక ముందు వర్మ తనవాళ్ళకు ఒక పెన్షన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి తీసుకొచ్చేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో ఇటు వర్మ వర్గీయులు లోలోన రగిలిపోతూ బయటకు కక్కలేక.. మింగలేక ఊరుకుంటున్నారు. మున్ముందు వర్మకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం కూడా అనుమానమే. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాము అని ఆనాడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ ఇద్దరూ మాట నిలబెట్టుకున్నట్లయితే నిన్న నాగబాబుతో బాటు వర్మ కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది. కానీ ఆ ఇద్దరూ నమ్మించి వెన్నుపోటు పొడవడంతో వర్మకు ఆశాభంగం మిగిలింది. ఇక ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ ఇప్పించడం ఆయన్ను ప్రాధాన్యమైన పోస్టింగులో ఉంచడం అనేది బ్రదర్స్ కు కూడా ప్రమాదమే. ఎందుకంటే వర్మ స్థానికుడు కాబట్టి ఆయనకు ఏదైనా పదవి దక్కితే ఆయన దూకుడు వేరేగా ఉంటుంది. ప్రజల్లో ఇమేజ్‌ పెరుగుతుంది. ఇదంతా పవన్ కు, నాగబాబుకు సైతం ఇబ్బందికరమే. అందుకే వర్మకు ఈ ఐదేళ్లలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న పదవి దక్కడం కలలో కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. వర్మ భుజాల మీదుగా నడిచివెళ్ళి అసెంబ్లీలో కూర్చున్న పవన్ ఇప్పుడు వర్మను పూర్తిగా అణగదొక్కేందుకే అన్నయ్య నాగబాబును పిఠాపురంలో ప్రతిష్టించినట్లు వర్మ అభిమానులు లోలోన మధనపడుతున్నారు. :::సిమ్మాదిరప్పన్న

RGV Saaree Movie Review And Rating In Telugu7
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ

ఆర్జీవి డెన్‌ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘శారీ’(Saaree Movie Review ). ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. నేడు(ఏప్రిల్‌ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్‌ చేసి ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్‌ సంభ్యాల్‌)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘నాకు నచ్చినట్లుగా సినిమా తీస్తా.. ఇష్టం అయితే చూడండి లేదంటే వదిలేయండి’ అని డైరెక్ట్‌గా చెప్పే ఏకైక డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ. ఒకప్పుడు ఆయన సినిమాలు ట్రెండ్‌ని క్రియేట్‌ చేశాయి. కానీ ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా తీయడం లేదు. గత కొన్నాళ్లుగా ఆర్జీవీ డెన్‌ నుంచి వచ్చే చిత్రాలేవి బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. మరి ‘శారీ’ అయినా ఆడుతుందా అంటే.. ‘సారీ’ అనక తప్పదు. అయితే ఇటీవల ఆర్జీవి నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే.. ఇది కాస్త బెటర్‌ అనే చెప్పాలి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తొలిసారి ఆర్జీవి తన చిత్రంతో ఓ సందేశం అందించాడు. సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జరిగే దారుణాలు.. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్‌ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ చిత్రంలో చూపించారు. అయితే దర్శకుడు మాత్రం తన దృష్టిని సందేశంపై కాకుండా చీరలోనే ఆరాధ్యను ఎంత అందంగా చూపించాలి అనే దానిపైనే ఎక్కువ పెట్టాడు. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా? అనేలా సినిమాను తెరకెక్కించారు. ఆర్జీవి గత సినిమాల మాదిరే అందాల ప్రదర్శనపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. కానీ అది వర్కౌట్‌ కాలేదు.(Saaree Movie Review ) తెరపై ఆరాధ్యను చూసి ఒకనొక దశలో చిరాకు కలుగుతుంది. సత్య యాదు పాత్ర కూడా అంతే. ప్రతిసారి ఫోటో తీయడం.. చీరలో ఆరాధ్యను ఊహించుకోవడం.. ఓ పాట.. ఫస్టాఫ్‌ అంతా ఇలానే సాగుతుంది. ఇక సెకండాఫ్‌ ప్రారంభంలో కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సైకో చేసే పనులు పాత చిత్రాలను గుర్తుకు తెస్తాయి. కిడ్నాప్‌ తర్వాత ఆరాధ్య, సత్య యాదుల మధ్య వచ్చే సన్నివేశాలు బోర్‌ కొట్టిస్తాయి. కథంతా అక్కడక్కడే తిప్పుతూ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. మితీమీరిన వయోలెన్స్‌ని పెట్టి భయపెట్టె ప్రయత్నం చేశారు. అంతకు మించి కథ-కథనంలో కొత్తదనం ఏమి లేదు. ఆర్జీవి నుంచి అది ఆశించడం కూడా తప్పే సుమా..!ఎవరెలా చేశారంటే.. శారీ సినిమా టైటిల్‌కి తగ్గట్లుగానే శారీలో ఆరాధ్య అదరగొట్టేసింది. వర్మ మెచ్చిన నటి కాబట్టి.. ఆయనకు ‘కావాల్సినట్లుగా’ తెరపై కనిపించి కనువిందు చేసింది. యాక్టింప్‌ పరంగానూ పర్వాలేదనిపించింది. ఇక సైకో కిట్టుగా సత్య యాదు అదరగొట్టేశాడు. ఒకనొక దశలో తన నటనతో భయపెట్టేశాడు. మిగిలిన నటీనటులకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శశిప్రీతమ్ రీరికార్డింగ్‌ కొన్ని చోట్ల మోతాదును మించి పోయింది. పాటలు అంతగా గుర్తుండవు. శబరి సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ఆరాధ్యను అందంగా చూపించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. ఆర్జీవీ సినిమాలకు పెద్ద బడ్జెట్‌ ఉండడు. రెండు మూడు పాత్రలు, ఒక ఇళ్లు చాలు.. సినిమాను చుట్టేస్తాడు. ఈ సినిమా కూడా అలానే ఉంది. పెద్దగా ఖర్చు పెట్టలేదు కానీ సినిమాను ఉన్నంతలో రిచ్‌గానే తీర్చిదిద్దారు.

YSRCP MP YV Subba Reddy Challenges TDP On Waqf Bill8
ఆ దమ్ము మీకుందా..? టీడీపీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్‌

తాడేపల్లి : వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ లో తాము(వైఎస్సార్సీపీ) వ్యతిరేకించలేదని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా అంటూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేయాలని తమ పార్టీ విప్ జారీ చేసిన సంగతిని వైవీ సుబ్బారెడ్డి మరోసారి గుర్తు చేశారు. వక్ఫ్ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకించలేదని టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఈ మేరకు ‘ ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు వైవీ సుబ్బారెడ్డి. ‘మేం వ్యతిరేకించామనడానికి లోక్ సభ, రాజ్యసభల్లో రికార్డయిని ఉభయసభల కార్యాకలాపాలే సాక్ష్యం. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై నేను చేసిన ప్రసంగం మరొక ప్రత్యక్ష సాక్ష్యం. బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకించలేదని అని నిరూపించే దమ్ము టీడీపీకి ఉందా?, నిరూపించమని సవాల్ విసురుతున్నా. ఫేక్ న్యూస్ ల మీద రాజకీయాలు చేసే అలవాటు మీకు ఎలాగూ ఉంది’ అంటూ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారువక్ఫ్ బిల్లులో ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోలేదు: వైఎస్సార్‌సీపీ@JaiTDP బిల్లును మేం వ్యతిరేకించలేదు అని నిరూపించే దమ్ము మీకు ఉందా? నిరూపించమని సవాల్‌ విసురుతున్నాం. ఫేక్‌ న్యూస్‌ల మీద రాజకీయాలు చేసే అలవాటు మీకు ఎలాగూ ఉంది.— Y V Subba Reddy (@yvsubbareddymp) April 4, 2025.

Annamalai Backs Out Of Tamil Nadu Party Chief Race9
తమిళనాట కీలక పరిణామం.. సంచలనంగా అన్నామలై ప్రకటన

కోయంబత్తూర్‌: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అన్నామలై ప్రకటన సంచలనంగా మారింది. తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం ఆయన బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు. బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన అన్నామలై.. పార్టీకి జోష్‌ తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు.ఆయన పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలం కొంత మేరకు పెరిగిందనే వాదన కూడా ఉంది. ఆయనకు అన్నాడీఎంకేతో వైర్యం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ పార్టీకి, బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తున్న కారణంగా, ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం.రాజీనామా చేసే ముందు శుక్రవారం ఆయన కోయంబత్తూర్‌లో మాట్లాడుతూ.. మంచి వ్యక్తులు ఉండే పార్టీ బీజేపీ.. ఈ పార్టీ బాగుండాలి. బీజేపీ ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తినంటూ చెప్పుకొచ్చారు. బీజేపీలో, నాయకులు పార్టీ నాయకత్వ పదవికి పోటీ చేయరు. మనమందరం కలిసి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటాము. నేను ఆ పదవి రేసులో లేను’’ అంటూ అన్నామలై స్పష్టం చేశారు.‘‘పార్టీకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను తదుపరి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో లేను. నేను ఎలాంటి రాజకీయ ఊహాగానాలకు స్పందించబోవడం లేదు. నేను ఏ రేసులో లేను’’ అని అన్నామలై పేర్కొన్నారు.Coimbatore, Tamil Nadu: State BJP chief K Annamalai says, "There is no contest in Tamil Nadu BJP, we will select a leader unanimously. But I am not in the race. I am not in the BJP state leadership race." pic.twitter.com/7OjdbOoTWR— ANI (@ANI) April 4, 2025

Husband left his wife speechless after he brought a surprise guest to their wedding10
ఏ భర్తా ఇవ్వలే(కూడ)ని వెడ్డింగ్‌ డే గిఫ్ట్‌ : కళ్లు చెమర్చే వైరల్‌ వీడియో

పెళ్లిళ్లలో బహుమతులు ఇవ్వడం అనేది ఒక మంచి సంప్రదాయం. సాధారణంగా నూతన వధూవరులకు బంధువు, సన్నిహితులు అనేక రకాల బహుమతులు,కానుకలు ఇస్తూ ఉంటారు. తద్వారా వారిని సంతోష పెట్టడంతోపాటు, వార్య మధ్య బంధాలు, అనుబంధాలు బలోపేతమవుతాయని పె ద్దలు చెబుతారు. అలాగే పెళ్లింటి వారికి డబ్బులను చదివింపుల రూపంలో కానుకగా ఇస్తే వారికి కొంత ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని కూడా విశ్విసిస్తారు. అయితే మారుతున్న కాలంతోపాటు, బహుమతులు సంప్రదాయాలు కూడా మారుతూ వచ్చాయి. గతంలో పెళ్లి రోజులు లేదా వెడ్డింగ్‌ డేలకు ప్రాధాన్యత నామమాత్రమే అని చెప్పవచ్చు. ప్రస్తుత యానివర్సరీ పార్టీలు, గిప్ట్‌ల ట్రెండ్‌నడుస్తోంది. అరుదైన, అపురూపమైన కానుకలివ్వడం ఆనవాయితీ మారిపోయింది. వెడ్డింగ్‌ డే రోజున డైమండ్‌ రింగో, ఖరీదైన చీరో, కారో ఏదో ఒకటి తాహతుకు తగ్గట్టు తమ జీవిత భాగస్వామికి కానుకలివ్వడం చాలా కామన్‌. అలాగే తన భార్యకు అద్భుత కానుక ఇచ్చాడో భర్త. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది. ఇంతకీ ఆ బహుమతి ఏంటంటే..సన్నిహితుల సమక్షంలొ ఆ జంట పెళ్లి రోజు వేడుకలకు సిద్ధమైనారు. దీంతో అక్కడి వాతావరణమంతా సందడి మారి పోయింది. అంతా ఆ జంటను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. మంద్రమైన సంగీత ధ్వనుల పూలబొకేలతో వారిని అభినందిస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా లిప్తకాలం పాటు అంతా నిశ్శబ్దం ఆవరించింది. అనుకోని అతిధి అక్కడికి వచ్చాడు. దీంతో పట్టలేని సంతోషంతా ఉక్కిరిబిక్కిరైంది భార్య బెక్కీ. అతణ్ణి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకుంది. తమ పెళ్లి రోజున ఇంత అద్భుతమైన కానుకను అందించిన భర్తకు కన్నీళ్లతో థ్యాంక్స్‌ చెప్పుకుంది బెక్కీ. ఇంతకీ ఎవరా అతిథి?Husband left his wife speechless after he brought a surprise guest to their wedding pic.twitter.com/4V91B6jVEO— internet hall of fame (@InternetH0F) April 3, 2025కొడుకు గుండెను తన ‘గుండె’గా దాచుకున్న వ్యక్తి. 19 ఏళ్ల కుమారుడు ట్రిస్టన్‌ కన్నుమూశాడు. దీంతో ట్రిస్టన్ అవయవాలను దానం చేశారు తల్లిదండ్రులు. అలా ట్రిస్టన్‌ గుండెను అమర్చుకున్న వ్యక్తిని ఆమె ముందు నిలిపి భార్యతోపాటు, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వారు కలిసి క్షణాలు అక్కడున్నవారందరి గుండెల్ని తడి చేశాయి. ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్‌ అయిన ఈ వీడియో 50.4 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించు కోవడం విశేషం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement