Top Stories
ప్రధాన వార్తలు

ఎన్నికల హామీలు.. మేనిఫెస్టో అమలే హీరోయిజం: వైఎస్ జగన్
మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లకు పైగా కోవిడ్‌తో ఇబ్బందులు ఎదురైనా సాకులు చెప్పలేదు. మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ గాలికొదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయడం లేదు. ⇒ మా పాలనలో ప్రతి ఇంటికీ మంచి చేశాం.. అది ప్రతి ఇంట్లో ఇంకా బతికే ఉంది ⇒ ఇవాళ్టికీ ప్రతి గడపకూ మా కార్యకర్తలు, నేతలు తలెత్తుకుని గర్వంగా వెళ్లగలరు.. ప్రజల ఆశీర్వాదం పొందగలరు ⇒ కోవిడ్ విపత్తులోనూ సాకులు వెతుక్కోకుండా ప్రతి హామీని నెరవేర్చాం.. ⇒ ప్రశ్నించే గొంతులను నొక్కేసేందుకే రెడ్‌బుక్ బెదిరింపులు.. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యంసాక్షి, అమరావతి: మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామా అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. తెలుగు డ్రామా పార్టీ (టీడీపీ) కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడులో సీఎం చంద్రబాబు ఫోజులిస్తూ.. బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. హీరోయిజం అంటే.. కడప జిల్లాలో మహానాడు నిర్వహించడం కాదు..! హీరోయిజం అంటే.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం అని చంద్రబాబుకు చురకలంటించారు. ‘‘సత్తా అంటే కడపలో మహానాడు నిర్వహించడం కాదు.. ఆ కార్యక్రమంలో జగన్‌ను తిట్టడం హీరోయిజం ఎలా అవుతుంది?’’ అని నిలదీశారు. ‘ఇదిగో మా మేనిఫెస్టో.. వీటిని నెరవేర్చామని రాష్ట్రంలో ఏ ఇంటికైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలను పంపి ఆశీర్వాదం కోరే ధైర్యం ఉందా చంద్రబాబూ? గడప గడపకూ తిరిగే సాహసం చేయగలరా?’ అని సూటిగా ప్రశ్నించారు. ఇవాళ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏ ఇంటికి వెళ్లినా మాకు ఇవ్వాల్సిన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్లు, అన్నదాతా సుఖీభవ, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని చిన్న పిల్లలు, చిన్నమ్మలు, అత్తమ్మలు, రైతన్నలు, నిరుద్యోగులు నిలదీస్తారని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ సాకులు వెతుక్కోకుండా చిత్తశుద్ధితో 99 శాతం హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. ఇవాళ్టికీ తమ పార్టీ కార్యకర్తలకు రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి మేం వైఎస్సార్సీపీ వాళ్లం అని తలెత్తుకుని గర్వంగా చెప్పే ధైర్యం ఉందని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీలు, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిమాణాలపై చర్చించి పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ బతికే ఉంది..ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి బతికే ఉంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి తర్వాత పగలు రాక తప్పదు. రెండు ప్రభుత్వాల మధ్య తేడాను ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. చిన్న హామీలనూ ఎగ్గొట్టారు..చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికొదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయడం లేదు. కడపలో మహిళలు చంద్రబాబు ఎప్పుడు ఉచిత బస్సు అని చెబుతారా..! విశాఖ వెళ్లి వద్దామా..! అని ఎదురు చూస్తున్నారు. మరో చిన్న హామీ ఉచిత గ్యాస్. కనీసం ఆ గ్యాస్ సిలిండర్లు కూడా సరిగా ఇవ్వలేకపోయారు. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు..ఈరోజు రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, కలియగ రాజకీయాలు ఎలా ఉన్నాయో సాక్షులుగా ఉన్న మీరే నా కన్నా బాగా చెబుతారు. రాజకీయాల్లో విలువలుండాలి. విశ్వసనీయతకు అర్ధం తెలుసుండాలి. అప్పుడే రాజకీయ వ్యవస్ధలో తులసి మొక్కలా నిలబడతాం. చంద్రబాబు తన పాలనలో రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు సహా అనేక పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులను చంద్రబాబు తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద గెలిపించుకునే పరిస్థితి లేకపోయినా.. వారంతా వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తులని తెలిసినా.. ముఖ్యమంత్రిగా తాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని తెలిసినా.. తానే దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు ఇది నిదర్శనం.కోవిడ్ ఇబ్బందుల్లోనూ..అప్పుడు మన ప్రభుత్వం జూన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తే.. కొద్ది నెలలకే మార్చి కల్లా కోవిడ్‌ను చూశాం. రాష్ట్ర చరిత్రలో అలాంటి విపత్తు ఎప్పుడూ చూడలేదు. రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. మరోవైపు అనుకోని ఖర్చులు పెరిగాయి. అన్ని రకాలుగా ఇబ్బందికర పరిస్థితులున్నా ఏ రోజూ సాకులు చెప్పలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కన పెట్టలేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. సీఎంవో మొదలు ప్రతి కార్యాలయంలోనూ హామీలను డిస్ప్లే చేశాం. ప్రతి రోజూ వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకున్నాం. అలా మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 99 శాతం హామీలను అమలు చేసిన పాలన వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. పాలన ఎలా ఉండాలో చూపాం..అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం కాబట్టే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం. 86 నుంచి 88 శాతం స్ధానాలను మనమే గెలిచాం. దాదాపు 120 చోట్ల క్లీన్ స్వీప్ చేయగా తాడిపత్రి, దర్శి రెండు చోట్ల మాత్రమే మనకు తక్కువ వచ్చాయి. తాడిపత్రిలో వాళ్లకు 18, మనకు 16 రావడంతో మన ఎమ్మెల్యే వాళ్లను లాగుదామన్నారు. కానీ నేను స్వయంగా మన ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేయించి అక్కడ ఎన్నిక సవ్యంగా జరిపించా. వైఎస్సార్ సీపీ హయాంలో అంతగా ప్రజాస్వామ్యానికి కట్టుబడ్డాం. ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా ఉన్న ముఖ్యమంత్రి స్ధానంలో వ్యక్తి పాలన ఎలా చేయాలో చూపించాం. మీ అందరికీ హ్యాట్సాఫ్..ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలు చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా ఇదే చేయమని తన ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో.. విలువలు, విశ్వసనీయత అనే పదానికి అర్థం చెబుతూ మన పార్టీలో చిన్న పదవుల్లో ఉన్నవారైనా.. ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తికి గట్టి గుణపాఠం నేర్పారు. రాజకీయాలంటే నీ మాదిరిగా కాదు.. మమ్మల్ని చూసి నేర్చుకో..! అని చంద్రబాబుకు గుణపాఠం చెప్పారు. అందుకు మీ అందరికీ నా హ్యాట్సాఫ్.విద్య, వైద్యం, వ్యవసాయం నిర్వీర్యం...⇒ ఈ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. ఇంగ్లీషు మీడియం పడకేసింది. గోరుముద్ద నాసిరకంగా మారి తినలేని పరిస్థితిలో ఉంది. మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫెల్ శిక్షణ ఇప్పిస్తూ ఒక పీరియడ్‌గా ఏర్పాటు చేస్తే వీళ్లు వస్తూనే దాన్ని ఎత్తేశారు. సీబీఎస్ఈ, నాడు–నేడు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు.. అన్నీ ఆగిపోయాయి. అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేదు. ఏడాది కావస్తోంది. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజులు సున్నా. మన హయాంలో క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. ఇవాళ ఫీజులు గురించి పట్టించుకునే నాథుడు లేడు. పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు మానిపిస్తున్న దుస్థితి నెలకొంది. ⇒ ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 1,000 ప్రొసీజర్లను మన హయాంలో 3,000కు తీసుకుని పోయి ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాం. గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అందుబాటులోకి తెచ్చాం. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. అలాంటి పాలన మనం అందిస్తే.. ఇవాళ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రూ.300 కోట్లు చొప్పున ఏడాదిగా దాదాపు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పేషెంట్లను చూడటం ఆపేశారు. ఇవాళ పేదలు వైద్యం కోసం అప్పుల పాలు అవుతున్నారు.⇒ ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్బీకేలు, ఈ–క్రాపింగ్, ఉచిత పంటల బీమాను గాలికి వదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ కింద సీజన్ ముగిసేలోగా రైతులకు తోడుగా నిలిచి సాయం చేసే కార్యక్రమం నిలిచిపోయింది. ఏడాదిగా రైతు భరోసా ఎగ్గొట్టారు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు లభించడం లేదు. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) మాత్రమే కాదు.. జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.10 వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో, పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా ఇవాళ రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. రైతుల కష్టం దళారీల పాలవుతోంది.వాళ్లు ఏ ఇంటికి వెళ్లినా నిలదీస్తారు..ఇవాళ టీడీపీ కార్యకర్తలు ఏ ఇంటికి వెళ్లినా వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి వీళ్లు చెప్పిన మాటలు ఇవాళ్టికీ ప్రజలకు గుర్తున్నాయి. అందుకే వాళ్లు ఏ ఇంటికైనా వెళ్లి ఆశీర్వదించమని కోరితే.. చిన్న పిల్లల నుంచి ప్రశ్నించడం మొదలవుతుంది. తల్లికి వందనం కింద ఇవ్వాల్సిన రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు అడుగుతారు. అదే ఇంట్లో నుంచి వాళ్ల అమ్మ, చిన్నమ్మ వచ్చి ఆడబిడ్డ నిధి కింద నాకు ఇస్తామన్న రూ.18 వేలు ఏమయ్యాయని ప్రశ్నిస్తారు. 50 ఏళ్లకు పెన్షన్ అన్నావ్.. మరి మా రూ.48 వేల సంగతేంటని ఆ తల్లుల అమ్మలు, అత్తలు నిలదీస్తారు. కండువా కప్పుకున్న ప్రతి రైతూ ఎన్నికలప్పుడు మాకు అన్నదాతా సుఖీభవ కింద రూ.26 వేలు ఇస్తానన్నావ్.. వాటి సంగతేంటని ప్రశ్నిస్తారు. అదే ఇంట్లో నుంచి ఉద్యోగం కోసం వేచి చూస్తున్న 20 ఏళ్ల యువకుడు నిరుద్యోగ భృతి కింద నాకు ఇస్తానన్న రూ.36 వేలు పరిస్థితి ఏమిటని నిలదీస్తాడు.వడ్డీతో సహా చెల్లిస్తాం...మన హయాంలో నిర్వహించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ద్వారా సమస్యలు చెప్పి ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వారే! నాడు ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. స్పందనలో అత్యధికంగా ఫిర్యాదులు చేసిందీ వాళ్లే. కానీ ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీతో సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు. రాష్ట్రం కూడా బాగు పడుతుంది.జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీటఈసారి జగన్ 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నాడు మనం అధికారంలోకి వస్తూనే కోవిడ్ వచ్చింది. రెండేళ్లు పూర్తిగా ప్రజల ఆరోగ్యం, వారికి మంచి చేయడంపైనే దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. ఈసారి జగన్ 2.0లో అలా ఉండదు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు.. కార్యకర్తలకూ ప్రాధాన్యం ఉంటుంది. కార్యకర్తలు అన్నింటికన్నా పైస్థాయిలో ఉంటారు. ఆ విధంగా వారి బాగోగులన్నీ చూసుకుంటాం.వారెక్కడున్నా చట్టం ముందు నిలబెడతాం..ఇప్పుడు మన పార్టీ కార్యకర్తల ప్రతి కష్టం, వారికి జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నా. మీ అందరికీ ఒకటే చెబుతున్నా. మనం ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో వారి పేర్లు రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తాం. చేసిన వాళ్లే కాదు... వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించిన వారినీ వదిలిపెట్టం. వారు సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయినా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం. అన్యాయాలు చేయడానికి వీరికి యూనిఫాం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా విధులు నిర్వర్తించడానికే యూనిఫాం ఇచ్చారు. ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే అక్రమ కేసులు..రాష్ట్రంలో లా ఆండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. చంద్రబాబు పాలనా వైఫల్యాలు, అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు.. ఆ గొంతు వినపడకుండా భయోత్పాతం సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో హత్యలు జరిగాయి. హత్యకు ఉపయోగించిన వాహనం ఎవరిదో తెలుసు. చంపిన వాళ్లు ఎవరో కూడా తెలుసు. టీడీపీలో గ్రూపు తగాదాలే దీనికి కారణమని ఎస్పీ స్వయంగా చెప్పారు. కానీ రెండు రోజుల తర్వాత మన పార్టీ ఇన్ఛార్జ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి మీద అక్రమంగా కేసులు పెట్టారు. మరోవైపు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు ఏ మాత్రం బేస్‌లేని పాత కేసు బయటకు తీశారు. గతంలో ఇల్లీగల్ మైనింగ్ లేదని అధికారులు రిపోర్టు ఇస్తే అదే అధికారులతో తప్పుడు ఫిర్యాదు చేయించి, తప్పుడు సెక్షన్లతో కేసు పెట్టి అరెస్టు చేశారు. 2023లో టీడీపీ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటన విషయంలో ఇప్పుడు 127వ ముద్దాయి కింద మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే మీద కేసు పెట్టారు. ఇలా చట్టం, రాజ్యాంగం దారుణ ఉల్లంఘనకు గురవుతోంది. గతంలో జరిగిన ఘటనల్లో మనవాళ్లను ఇరికించి జైల్లో పెట్టే కార్యక్రమం రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతోంది.3 లక్షల ఉద్యోగాలు ఊడగొట్టారుఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గమూ చంద్రబాబు ప్రభుత్వంపై సంతృప్తిగా లేదు. చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగమూ రాకపోగా ఉన్న వాటినే ఊడగొడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తూనే 2.6 లక్షల మంది వలంటీర్లు, 15 వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు, 9,800 రేషన్ వాహనాల (ఎండీయూ) మీద ఆధారపడ్డ 20 వేల మందితో కలిపి మొత్తంగా 3 లక్షల ఉద్యోగాలను ఊడగొట్టారు. మనం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఉద్యోగస్తుల్లో విషం నింపి, ఇవాళ వారినీ మోసం చేశాడు. వారికి మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చిన పాపాన పోలేదు. వేతనాల సవరణ (పీఆర్సీ) ప్రస్తావన లేదు. మూడు డీఏలు పెండింగ్. అందుకే ఇవాళ ఉద్యోగులు చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామా అని తల పట్టుకుంటున్నారు.విచ్చలవిడిగా అవినీతిమరోవైపు ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియా, సిలికా, క్వార్జ్ట్ అక్రమ తవ్వకాలు, రాజధాని పనులు.. ఇలా దేన్నీ వదల కుండా దోచేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో స్కామ్‌లు చేస్తున్నారు. ఇలాంటివి మన హయాంలో లేవు కాబట్టే బటన్ నొక్కి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)తో రూ.2.73 లక్షల కోట్లు ప్రజలకు పారదర్శకంగా అందించాం. ఆరోజు జగన్ చేశాడు... ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే కారణం ఇదే! నేను ఆశపడింది ఒక్కటే... నా మరణం తర్వాత కూడా ప్రతి ఇంట్లో బతికే ఉండాలని ఆశ పడ్డా. అందుకే ఎక్కడా రాజీ పడలేదు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నా. ఇవాళ చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కడం లేదంటే.. ప్రతి దాంట్లోనూ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం చేస్తున్నాడు కాబట్టే. అందుకే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 13 శాతం ఆదాయాలు పెరిగితే.. మనకు కేవలం 3 శాతమే పెరిగాయి. అలా ఎందుకు జరుగుతోందంటే.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం టీడీపీ గజదొంగల ముఠా జేబుల్లోకి పోతోంది. ఏ మంచి చేయని, అన్నీ అబద్ధాలు, మోసాలు చేసిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారికి డిపాజిట్లు రాని పరిస్థితులు ఖాయం.

యంగ్ ఇండియా నా బ్రాండ్.. మీరే నా అంబాసిడర్లు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పాతికేళ్లు వచ్చే వరకు కష్టపడిన ప్రతి వ్యక్తి జీవితంలో స్థిరపడతారని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ప్రతి మనిషికి మొదటి పాతిక సంవత్సరాలు ముఖ్య కాలమని, అందులోనూ 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అత్యంత కీలకమైనదని తెలిపారు. ఈ సమయంలో క్రమశిక్షణతో, నిబద్ధతతో ఉండాలని సూచించారు. రంగుల ప్రపంచానికి ఆకర్షితులు కాకుండా కెరీర్‌పై దృష్టి సారిస్తేనే జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటారని విద్యార్థులకు హితబోధ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ ఆడిటోరియంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిర్వహించిన 2024–25 ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి సీఎం ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు బహూకరించారు. గురుకులాల్లో ఇంటర్మీడియట్, పదోతరగతి చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులు బహూకరించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గురుకులాలను తయారు చేస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. యంగ్ ఇండియా తన బ్రాండ్ అని, గురుకుల విద్యార్థులే తన బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. కులవృత్తుల పేరుతో బీఆర్ఎస్ మోసం కులం పేరుతో ఎవరికీ అవకాశాలు రావని, కష్టపడి చదువుకున్న వాళ్లకు మాత్రమే అవకాశాలు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చదువు వల్ల వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు కులవృత్తుల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పేదలు, బడుగుల జీవితాలు మారుతాయని అందరూ భావించారు. కానీ పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ అన్ని వర్గాలను అణిచివేసింది. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని తెలిసినప్పటికీ.. మెరుగైన విద్య అందించకుండా కులవృత్తులు చేసుకోవాలని.. బర్రెలు, గొర్రెలు కాయాలంటూ వాటిని పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. కష్టపడి చదువుకున్న వాళ్లు ప్రభుత్వ కొలువుల కోసం ఏళ్లపాటు నిరీక్షించారు. కానీ, గత పాలకుడి ఇంట్లో ఒక్క మనిషికి ఉద్యోగం లేకపోతే ఆరు నెలల్లోనే ఎన్నికలు పెట్టి మరీ కొలువు ఇప్పించుకున్నారు’అని ధ్వజమెత్తారు. దళితులకు సముచిత స్థానం ఇచ్చాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 65 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు వెల్లడించారు. గ్రూప్–1 పరీక్షల ఫలితాలు ఇచ్చిన తర్వాత కొందరు ఉద్దేశపూర్వకంగా నియామకాలను ఆపారని విమర్శించారు. గ్రూప్–1 ఉద్యోగాలకు అర్హత సాధించిన వారిలో 89 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందినవారే ఉన్నారని తెలిపారు. ‘వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో ఒక్క దళితుడు కూడా వైస్ చాన్స్‌లర్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓయూకు వీసీగా దళిత మేధావిని నియమించింది. అంబేద్కర్ వర్సిటీ వీసీగా, ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా, విద్యా కమిషన్ చైర్మన్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గా దళిత బిడ్డలకు అవకాశాలు వచ్చాయి. హెచ్‌సీయూలో చదివిని మేధావి భట్టి విక్రమార్క ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థను క్రమపద్ధతిలో నడుపుతున్నారు’అని పేర్కొన్నారు. వాళ్లు ఎగ్గోడితే.. మేము ఖర్చు చేస్తున్నాం: భట్టి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సబ్‌ప్లాన్ చట్టాన్ని తీసుకువచ్చిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తుచేశారు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు చేయకుండా ఎగ్గొట్టిందని విమర్శించారు. అలా ఎగ్గొట్టిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కించి క్యారీ ఫార్వర్డ్ చేసి ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఎస్సీలకు రూ.13,223 కోట్లు, ఎస్టీలకు 1,296 కోట్లు క్యారీఫార్వర్డ్ చేసినట్లు వివరించారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వయం ఉపాధి కోసం ఏడాది కాలంలోనే రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 102 సమీకృత గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

కాటుక రంగులోకి కడలి!
ఆ చల్లని సముద్రగర్భం.. అంటూ సాగే దాశరథి పాట వినే ఉంటారు. ఇప్పుడు ఆ నల్లని సముద్రం అని కూడా పాడుకోవాలేమో. ప్రపంచవ్యాప్తంగా భూమినంతటినీ చుట్టేసిన సాగరజలం నెమ్మదిగా నీలి రంగు నుంచి నలుపు వర్ణంలోకి మారిపోతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ధరణిపై దాదాపు 71 శాతం ఉపరితలాన్ని సముద్రజలాలే కప్పేస్తున్నాయి. అంటే భూమిపై దాదాపు 36.1 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర సముద్రనీరే ఉంది. ఇందులో 21 శాతం అంటే 7 కోట్ల చదరపు కిలోమీటర్ల సముద్రజలాలు గతంలో ఎన్నడూలేనంతగా కొత్తగా నల్లగా మారిపోయాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మార్పు కేవలం గత 20 సంవత్సరాల్లో జరిగిందని గణాంకాలు స్పష్టంచేశాయి. సంబంధిత వివరాలు గ్లోబల్ చేంజ్ బయోలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సముద్రజలాలు నలుపు రంగులోకి మారడంతో సూర్యరశ్శి సాగర జలాల్లోకి సులభంగా చొచ్చుకెళ్లడం సాధ్యపడట్లేదు. దీంతో సముద్ర ఉపరితల జలాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. కాంతిమయ పరిస్థితులే 90 శాతం సముద్రజీవుల మనుగడకు ప్రాణాధారం. సూర్యరశ్శి సముద్ర ఉపరితల జలాలపై కొంతమేరకే పరిమితమైతే ఎన్నో రకాల సముద్రజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్ విశ్వవిద్యాలయం, ప్లైమౌత్ మెరైన్ లేబొరేటరీలోని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 2003 ఏడాది నుంచి 2022 ఏడాది దాకా అంతర్జాతీయంగా పలు ఉపగ్రహాల నుంచి సేకరించిన డేటాను సంఖ్యాశాస్త్ర నమూనాలతో సరిపోల్చి ఈ విపరిణామాన్ని కనుగొన్నారు. వేడినిచ్చే సూర్యకాంతితోపాటు చల్లని వెలుతురునిచ్చే చంద్రకాంతి సైతం పరోక్షంగా సముద్రజీవుల జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. లోతైన సముద్రజలాలతోపాటు తీరం వెంట జీవుల ఉనికికీ ఈ రెండు కాంతులూ ముఖ్యమే. భారీగా తగ్గిన కాంతి లోతు అలజడులు లేని, ప్రశాంతంగా ఉన్న సముద్రజలాల్లో తేటగా ఉన్న సందర్భాల్లో సూర్యకాంతి చాలాలోతుదాకా వెళ్లగలదు. కానీ గత 20 ఏళ్లలో గమనిస్తే ఆఫ్రికా ఖండం అంత పరిమాణంలో అంటే 9 శాతం సముద్రజలాల్లో సూర్యకాంతి చొచ్చుకెళ్లే ప్రాంతాలు బాగా తగ్గిపోయాయి. ఇక్కడ గతంతో పోలిస్తే సూర్యకాంతి 50 మీటర్లు తక్కువలోతుకే వెళ్లగల్గుతోంది. మరో 2.6 శాతం సముద్రజలాల్లో సూర్యకాంతి వెళ్లగలిగే లోతు ఏకంగా 100 మీటర్లు తగ్గిపోయింది. అయితే ఒక 10 శాతం సముద్రజలాల్లో మాత్రం గతంలో కంటే ఎక్కువ లోతులకు సూర్యకాంతి చొరబడగల్గుతోంది. సూర్యకాంతిలోనే మనగలిగే సముద్రజీవులు చాలా ఉంటాయి. ఎన్నో రకాల జలచరాల ఉనికి, పునరుత్పత్తి, ఆహారానికి ప్రత్యక్షంగా సూర్యకాంతి అత్యావశ్యకం. ‘‘కొన్ని చోట్ల సూర్యకాంతి లభ్యత తగ్గిపోవడంతో వేరే చోట్లకు జీవులు వలసపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇది ఆయా జీవావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది’’అని ప్లైమౌత్ విశ్వవిద్యాలయంలోని సముద్ర సంరక్షణ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ థామస్ డెవిస్ చెప్పారు.నల్లగా ఎందుకు మారుతోంది?పర్యావరణానికి సంబంధించి ఎన్ని దేశాల్లో ఎన్నెన్నో కఠిన చట్టాలున్నా అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను ఆయా సంస్థలు గుట్టుచప్పుడుకాకుండా నేరుగా నదుల్లో పారబోస్తున్నాయి. గరళంగా మారిన నదీజలాలు నేరుగా సముద్రాల్లో కలుస్తున్నాయి. వీటికి వ్యవసాయ వ్యర్థాలూ తోడవుతున్నాయి. వీటితో పోషణ సంబంధ మూలకాలు సముద్రంలోకి పోటెత్తుతున్నాయి. ఈ పోషకాలను సంగ్రహించిన నాచు వంటి అతిసూక్ష్మ మొక్కలు సముద్ర ఉపరితల జలాలపై ఏపుగా పెరుగుతున్నాయి. గనుల తవ్వకం తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలను వర్షపు నీరు నదుల ద్వారా సముద్రాల్లోకి కొట్టుకొచ్చేలా చేస్తోంది. ఇవికాక సూర్యకిరణాలను అడ్డుకునే జీవజాలం సముద్రఉపరితలంపై మరింతగా పేరుకుపోతోంది. ఇవన్నీ కలగలిసి సాగరాలను కాంతిహీనం చేస్తున్నాయి. అలా అవి నల్లరంగులోకి మారిపోతున్నాయి. శైశవాల పెరుగుదల, భూతాపోన్నతి కారణంగా అధికమవుతున్న సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రత సైతం తమ వంతుగా ఈ దుష్ప్రభావానికి ఆజ్యం పోస్తున్నాయి.మత్స్య పరిశ్రమకూ పెనుముప్పు లోతైన సముద్రాల వద్ద సూర్యకాంతి తగ్గిపోయి ఆహార లభ్యత కృశించిపోవడంతో దిక్కులేక పలు రకాల జలచరాలు తీరాలకు చేరి అక్కడి జీవులతో కలిసి ఆహారం కోసం పోటీపడుతున్నాయి. దీంతో ఆయా జీవుల ఆహార వనరుల కొరత ఏర్పడుతుంది. సముద్రచేపలు, రొయ్యలు, ఇతర జలచరాల లభ్యత తగ్గిపోయే వీలుంది. దీని ప్రభావం భవిష్యత్తులో అన్ని సముద్రతీర దేశాల మత్స్య పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ‘‘లోతైన సముద్ర ప్రాంతాల్లో సూర్యకాంతి చొచ్చుకుపోయే సామర్థ్యం మరో 50 మీటర్లు తగ్గిపోతే అక్కడి జీవులు తమ ఆవాసాలను సముద్రతీరాలకు మార్చుకుంటాయి. అప్పుడు యావత్ సాగర జీవావరణ వ్యవస్థలో శాశ్వత మార్పులు సంభవించే ప్రమాదం దాపురిస్తుంది’’అని ప్లైమౌత్ మెరైన్ లే»ొరేటరీలో ప్రొఫెసర్ టిమ్ స్మిత్ విశ్లేíÙంచారు. ‘‘సముద్రాల్లో సూర్యకిరణాలు లోపలికి వెళ్లలేకపోతే మనకొచ్చే నష్టమేమీ లేదని నింపాదిగా కూర్చునే కాలం కాదిది. ప్రభుత్వాలు తక్షణం మేల్కొనాలి. సముద్రాల్లోకి చేరే నదీజలాలు వీలైనంత వరకు పారిశ్రామిక వ్యర్థాలకు ఆవాసంగా మారకుండా చూసుకోవాలి. మురుగునీటి శుద్ధి కర్మాగారాల వ్యవస్థను మరింత పటిష్టంగా అమలుచేయాలి. వ్యర్థాల పారబోతపై పరిశ్రమలపై భారీ జరిమానాలు విధించాలి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్

పెరుగుతున్న చైనా ప్రాబల్యం
పహల్గామ్లో ఉగ్రదాడిపై భారత్ స్పందించిన తీరు, తదనంతర పరిణా మాలు ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో మౌలికంగా తీసుకొచ్చిన మార్పులేమీ లేకపోవచ్చు. కానీ, దక్షిణాసియాలో రూపు దిద్దుకుంటున్న ప్రాబల్య సమతూకానికి సంబంధించి అవి కొన్ని ముఖ్యమైన దృక్కోణాలను బయటపెట్టాయి. ఈసారి భారత్–పాకిస్తాన్ల మధ్య నెలకొన్న తాజా సైనిక ప్రతిష్టంభన మునుపటి దృష్టాంతాలకు భిన్నమైంది. భారత్ –పాక్‌ల మధ్య సైనిక ఘర్షణ పరస్పరం అణ్వాయుధాలను ప్రయో గించుకోగల స్థితికి చేరుతోందని అమెరికా పొరపడింది. ఘర్షణ తీవ్ర రూపం దాల్చకుండా రెండు దేశాల నాయకులకూ రాత్రికి రాత్రి అమె రికా ఫోన్లు చేసి ఉండవచ్చు. కానీ, ఒకటి మాత్రం స్పష్టం. ఇది ప్రాంతీయ ఆధిపత్య సమతూకపు స్థితిగతులను మార్చి వేసింది. సూటిగా చెప్పాలంటే, దక్షిణాసియాను అత్యంత ప్రభావితం చేయగలి గిన శక్తిగా అమెరికా స్థానాన్ని చైనా ఆక్రమించిందని చెప్పడం సబబు.ఇండియాకు గట్టి మద్దతివ్వని రష్యాప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైన సైనిక శక్తిగా అమెరికా ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయాలను ప్రభా వితం చేయగల అవకాశం సదరు దేశపు శక్తితోపాటు అభిమతంపైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి సంబంధించి స్పష్టమైన వ్యూహాత్మక ప్రయోజనం అమెరికాకు కొరవడినట్లుగా కని పిస్తోంది. ఫలితంగా, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని శాసించగల శక్తిగా ఉన్న అమెరికా ఇపుడు నామమాత్రపు పాత్రధారి స్థాయికి కుంచించుకుపోయింది. అటూఇటూగా వాషింగ్టన్ స్థానాన్ని బీజింగ్ ఆక్ర మించింది. ఆర్థికంగా బలమైన దేశంగా ఉన్న చైనా దౌత్యపరమైన యుక్తిని ప్రదర్శిస్తూ ఆయుధాల సరఫరాదారుగా, మధ్యవర్తిగా ఈ ప్రాంతపు పరిణామాలను నిర్దేశించగల స్థితిలో ఉంది. ప్రాంతీయ సైనిక ఘర్షణలు, దౌత్యపరమైన ప్రతిష్టంభనలు, రాజకీయ వాద వివాదాలకు తీర్పరిగా వ్యవహరించాలని చైనా కోరు కుంటోంది. ఇటీవల పాక్‌కు అందించినట్లుగానే హైటెక్ ఆయుధాల సరఫరా ద్వారా, లేదా దౌత్యపరంగా ప్రత్యక్షంగా జోక్యం చేసు కోవడం, ఆర్థికపరమైన ఒత్తిడిని తీసుకురావడంతో అది ఆ యా పను లను చక్కబెట్టాలని భావిస్తోంది. దక్షిణాసియా, ఇండో–పసిఫిక్‌లో పెరుగుతున్న చైనా ప్రాబల్యం ఇప్పటికే కనిపిస్తోంది. కానీ, అది సైనికపరంగా వత్తాసు ఇస్తానని పాక్‌కు చెప్పడం, తాజా భారత–పాక్ ఘర్షణలో ప్రధానాంశం.అలాగే, భారతదేశానికి వ్యూహాత్మక భాగస్వామిగా అండగా నిలవడంలో రష్యా సామర్థ్యం తగ్గిన సంగతిని గమనించవలసిఉంది. ఇటీవలి ప్రతిష్టంభనలో రష్యా వైఖరి సాధారణంగా ఇతర దేశాలు చూపే మాదిరిగానే ఉంది. అది భారతదేశానికి బాహాటంగా మద్దతు ప్రకటించలేదు. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు సరికదా, భారత సైనిక చర్యలకు ఆమోదం కూడా తెలుపలేదు. ‘‘ఉగ్రవాద చర్యలను రష్యా తీవ్రంగా ఖండిస్తోంది. అవి ఏ రూపంలో వ్యక్తమైనా వ్యతిరేకిస్తోంది. ఈ రాక్షసత్వంపై సమర్థంగా పోరాడటా నికి మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఏకోన్ముఖంగా ప్రయత్నాలు సాగించవలసిన అవసరం ఉందని భావిస్తోంది’’ అని రష్యా విదేశీ వ్యవ హారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఘర్షణలు మరింత ముదరకుండా సంయమనం పాటించవలసిందని రష్యా రెండు పక్షాలనూ కోరింది. ఒక రకంగా, రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఘర్షణ సందర్భంలో భారత్ ఏం చెప్పిందో, భారత్–పాక్ ఘర్షణపై రష్యా అదే చెప్పింది. రష్యా–పాశ్చాత్య దేశాల మధ్య భారత్ సమతూకం పాటించినట్లు గానే, భారత్–చైనాల మధ్య సమతూకం పాటించేందుకు రష్యా ప్రయత్నించింది. దక్షిణాసియాలో రష్యాకున్న ప్రయోజనాలు పరిమితమే కావచ్చు. కానీ, ఇస్లామాబాద్‌తో బీజింగ్ అంటకాగుతోంది. బీజింగ్‌తో సన్నిహితంగా మెలిగే మాస్కో, తీరా చైనా ప్రయోజనాలు పణంగా ఉన్నపుడు భారతదేశానికి వీలైనంత తక్కువ సహాయాన్నే అందిస్తుంది. దానర్థం – భారత్ ప్రాంతీయ ప్రయోజనాలకు భంగం కలిగించాలని రష్యా కోరుకుంటోందని కాదు. చైనా ప్రయోజనాలను తక్కువ చేసేదిగా కనబడటం రష్యాకు ఇష్టం లేదు. ఏమైతేనేం, అది పాకిస్తాన్‌కే ప్రయోజనకారి అవుతుంది. రష్యాతో ఉన్న దోస్తీని ఉపయోగించుకుని చైనా నడవడికలో మార్పు తేగలమని మనం ఒకప్పుడు అనుకున్న రోజులున్నాయి. బహుశా ఇప్పుడు భారత దేశంతో రష్యాకున్న మైత్రిని నిగ్రహించగల శక్తి తనకుందని చైనా చాటుకోవడాన్ని మనం చూస్తున్నాం. రష్యా పట్ల భారత ఆసక్తి సన్నగిల్లుతున్నట్లుగానే, భారత్ పట్ల రష్యా ఆసక్తి కూడా రంగు, రుచి కోల్పోతోంది. ఇది మనం అంగీకరించక తప్పని వాస్తవం. క్షీణిస్తున్న ఈ స్నేహ బంధాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఉన్న మార్గాలను మనం గుర్తించవలసి ఉంది. ఒంటరిగానే పోరాడగలగాలి!ఇక భారతదేశానికున్న బాహ్య సమతూక (అంటే ఇతర దేశాలతో చెప్పించడం లేదా వాటిని పావులుగా వాడుకునేందుకు ఉన్న) అవకాశాలు అంతర్నిహితంగా పరిమితంగానే ఉండటం ఇటీ వలి ప్రతిష్టంభనలో వెలుగు చూసిన మరో గణనీయమైన అంశం. దక్షిణాసియాలో అణు యుద్ధం సంభవించవచ్చనే (అటువంటి అవకాశం లేశ మాత్రంగానే ఉన్నప్పటికీ) భయాలు అంతర్జాతీయంగా భారతదేశంతో స్నేహంగా మెలిగే చాలా దేశాలకున్నాయి. ఘర్షణలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని మనం ఉక్రెయిన్ విషయంలో చెబుతూ వస్తున్నాం. పాశ్చాత్య దేశాలు ఇప్పుడు అదే పల్లవి అందుకుంటున్నాయి. ఇతరుల సంక్షోభ సమయాల్లో మనం ఎలా వ్యవహరిస్తామో వారూ మన పట్ల అలానే వ్యవహరిస్తారని ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఎటువంటి సైనిక కూటమిలోనూ చేరకూడదని మనం ఉద్దేశపూర్వకంగానే నిర్ణయించుకుని ఉండవచ్చు. బహుశా, అది సక్రమమైన నిర్ణయమే కావచ్చు కూడా! కానీ, దాని పర్యవసానాలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మన యుద్ధాలను మనమే చేయాలి. అందుకు అనుసరించవలసిన విధానం స్పష్టమవుతూనే ఉంది. జాతీయ భద్రత సన్నద్ధతకు గణనీయమైన మొత్తాలను వెచ్చించడం ద్వారా మనం మొదట అంతర్గత సమతూకానికి ప్రయత్నించాలి. ప్రైవేటు సంస్థలు రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మరింత ప్రోత్సాహం, అనువైన వాతావరణం అవసరం. స్థానిక, అంతర్జాతీయ భాగస్వాముల ద్వారా రక్షణ సామగ్రిని ఉత్పత్తి చేసుకోవాలి.ఉగ్రవాదంపై మనం స్పందించే తీరు ఇకపై ఇదే మాదిరిగా ఉండబోతోందని లిఖితపూర్వకంగా కాకపోయినా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది కనుక, ఆపరేషన్ సిందూర్‌ను వివిధ కోణాల నుంచి నిష్పక్షపాతంగా మదింపు చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కర్తవ్య నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. భవిష్యత్తులో పాటించవలసిన రక్షణ సన్నద్ధత, నిఘా, వ్యూహ్మాతక కమ్యూనికేషన్లు, ఇతర కీలక అంశాలపై ఈ బృందం అవసరమైన చర్యలను సూచిస్తుంది. ఇటీవలి పరిణామాలను నిష్పాక్షికంగా పరిశీ లించి, భవిష్యత్తుకు వ్యూహాత్మక దిశా నిర్దేశాలు చేసేందుకు కార్గిల్ సమీక్షా కమిటీ తరహాలో పహల్గామ్ సమీక్షా కమిటీని ఏర్పాటు చేసేందుకు సమయం ఆసన్నమైంది. చివరగా, ఇంత తీవ్రతతో కూడిన ఈ తరహా సైనిక ప్రతిష్టంభనలు దేశపు విశాల వ్యూహాత్మక లక్ష్యాలను కూడా పక్కనపెట్టేవిధంగా మన దృష్టిని మళ్ళించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నేటి భారతదేశం దక్షిణాసియాకు మాత్రమే పరిమితమై ఉండలేదు. కేవలం పాక్ పైనే మన దృష్టినంతటినీ నిలిపి ఉండలేం. ఇప్పటికే పరిమితంగా ఉన్న రాజకీయ, దౌత్య, సైనిక వనరులను ఇతర విశాల లక్ష్యాల వైపు మళ్ళించడానికి లేకుండా సతమతమవుతున్నాం. పాక్‌నే బూచిగా చూస్తూ కూర్చుంటే ఆ సామర్థ్యాలు మరింత పరిమిత మవుతాయి. పాక్ నుంచి తరచూ ఎదురుకాగల ఉద్రిక్తతల వలయంలో చిక్కుకుపోకుండా నిలవడమే భారత్ ముందున్న అతి పెద్ద వ్యూహాత్మక సవాల్!హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో ఇండియా విదేశాంగ విధాన బోధకులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)

1.5 అడుగుల ఎత్తులోగది నిండా నోట్లకట్టలే
న్యూఢిల్లీ: అడుగున్నర ఎత్తున. ఈ మూల నుంచి ఆ మూల దాకా. స్టోర్ రూమ్ నిండా నోట్ల కట్టలే. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు వెలుగు చూసిన ఉదంతంపై సుప్రీంకోర్టు కమిటీ పేర్కొన్న అంశాలివి! గత మార్చి 14న ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో అగ్నిప్రమాదం సంభవించడం, పోలీసులకు, మంటలార్పుతున్న సిబ్బందికి స్టోర్ రూమ్‌లో భారీ సంఖ్యలో కాలిపోయిన నోట్లకట్టలు కనిపించడం తెలిసిందే. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఆయన్ను విధులకు దూరం పెట్టడమే గాక ఆరోపణలపై విచారణకు ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఒక న్యాయమూర్తితో నాటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కమిటీ నియమించారు. అనంతరం కమిటీ సమర్పించిన నివేదికను రాష్ట్రపతికి, ప్రధానికి పంపారు. జస్టిస్ వర్మ వివరణను కూడా జతచేశారు. కమిటీ నివేదికలోని అంశాలను ఇండియాటుడే వార్తా సంస్థ బుధవారం వెల్లడించింది. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని కమిటీ నిర్ధారించింది. స్టోర్ రూములో భారీ సంఖ్యలో లెక్కచూపని నోట్ల కట్టలు బయటపడటం నిజమేనని పేర్కొంది. ‘‘అదంతా లెక్కచూపని డబ్బే. అదెక్కడిదో చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా జస్టిస్ వర్మదే. కానీ ఆ డబ్బుకు ఆధారాలు చూపడంలో ఆయన విఫలమయ్యారు. పైగా నోట్లకట్టలతో తనకు ఏ సంబంధమూ లేదని, అదంతా ఎవరో కుట్రపూరితంగా చేసిన పని అని చెప్పుకొచ్చారు’’ అని కమిటీ పేర్కొంది. ‘‘జస్టిస్ వర్మపై అభియోగాలు నిజమే అనేందుకు సరిపడా ఆధారాలు లభించాయి. ఈ అభియోగాలు ఆయన్ను అభిశంసించాల్సినంత తీవ్రమైనవి’’ అని స్పష్టం చేసింది. నివేదిక నేపథ్యంలో రాజీనామా చేయాల్సిందిగా కోరగా జస్టిస్ వర్మ నిరాకరించడం, దాంతో ఆయనను అభిశంసించాలంటూ కేంద్రానికి జస్టిస్ ఖన్నా సిఫార్సు చేయడం తెలిసిందే. అందుకోసం చట్టపరమైన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.నివేదిక ఏం చెప్పిందంటే... ‘‘అగ్నిప్రమాదం జరిగిన రాత్రి జస్టిస్ వర్మ నివాసంలో ఆయన కూతురితో పాటు మొత్తం 17 మంది ఉన్నారు. డబ్బు దొరికిన స్టోర్ రూమ్ పూర్తిగా జస్టిస్ వర్మ, ఆయన కుటుంబం నియంత్రణలోనే ఉంది. ప్రమాద సమయంలో దానికి లాక్ చేసి ఉంది. జస్టిస్ వర్మ, ఆయన కుటుంబానికి తప్ప ఇంకెవరూ దాన్ని తెరిచే అవకాశమే లేదు. పైగా ఆయన ఆరోపిస్తున్నట్టుగా ఎవరో బయటినుంచి స్టోర్ రూమ్‌లోకి ప్రవేశించే అవకాశం కూడా లేదు. నోట్ల కట్టలు స్టోర్ రూమ్ నిండా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అవి గది పొడవునా కనీసం అడుగున్నర ఎత్తున పరుచుకుని ఉన్నట్టు తుగ్లక్ నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. గదిలోని షెల్ఫ్ మీద సగం కాలిపోయిన నోట్లు కూడా అడుగున్నర ఎత్తున ఉన్నాయని చెప్పారు. గదిలో స్విచ్‌బోర్డు సమీపంలో ఉన్న మద్యం సీసాలకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత బాగా పెరిగింది. కాలిపోయిన నోట్ల కట్టలను వెంటనే గది నుంచి తొలగించేందుకు సిబ్బంది ప్రయతి్నంచారు. అగ్నిప్రమాదం గురించి జస్టిస్ వర్మకు ఆయన పీఏ రాజేందర్‌సింగ్ కర్కీ తొలుత సమాచారమిచ్చారు. ఆ రాత్రంతా ఆయనకు కాల్స్ చేస్తూ, ఎప్పటికప్పుడూ సమాచారమిస్తూనే ఉన్నారు. ఇంత జరిగినా నేరం జరిగినట్టు రుజువుల్లేవనే, జస్టిస్ వర్మ అందుబాటులో లేరనే కారణంతో ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అందుబాటులో ఉన్న ప్రత్యక్ష, ఎల్రక్టానిక్ సాక్ష్యాల ఆధారంగా జస్టిస్ వర్మపై అభియోగాలు నిజమేనని కమిటీ నిర్ధారణకు వచ్చింది.’’ఇప్పుడేం జరుగుతుంది? జస్టిస్ వర్మ అభిశంసనకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆ మేరకు సీజేఐ ఖన్నా చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవలే రాజ్యసభ చైర్మన్‌కు, లోక్‌సభ స్పీకర్‌కు పంపినట్టు తెలుస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఓ కమిటీ వేస్తారు. దాని నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తారు. అనంతరం ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్‌లో అభిశంసన తీర్మానం నెగ్గితే జస్టిస్ వర్మను న్యాయమూర్తి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు.

కేసీఆర్ ‘కాళేశ్వరం’ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు జూన్ 5న హాజరు కావాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. ఆ మేరకు కసరత్తు ప్రారంభించారు. బుధవారం కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి హరీశ్‌రావు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. మరో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 5న కేసీఆర్, 9న హరీశ్‌రావు కమిషన్ ముందు హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ వినిపించాల్సిన వాదనలు, ఇవ్వాల్సిన వివరణపై వారు చర్చించినట్లు సమాచారం. కమిషన్ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణ తీరుతెన్నులను కేసీఆర్ సమీక్షించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అందులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు క్రోడీకరించి నివేదిక సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి కొందరు సాగునీటి రంగ నిపుణులు, సాంకేతిక నిపుణుల నుంచి కూడా వివరాలు కోరినట్లు తెలిసింది. ఎన్డీఎస్ఏ నివేదికలో లోపాలపైనా చర్చ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదిక అశాస్త్రీయంగా ఉందని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చేసిన ప్రకటనపైనా ఈ భేటీలో లోతుగా చర్చించినట్లు తెలిసింది. ఎన్డీఎస్ఏ నివేదికలోని డొల్లతనాన్ని కమిషన్ ఎదుట ప్రస్తావించాలని నిర్ణయించినట్లు సమాచారం. కమిషన్‌కు అరకొర సమాచారం ఇవ్వకుండా పూర్తి స్థాయి ఆధారాలతో వివరణ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి గోదావరి నదుల విషయంలో పాలకులు చూపిన నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాగా తాము అన్ని విషయాలు వివరించేందుకు వీలుగా తగినంత సమయం ఇవ్వాలని కూడా కమిషన్‌ను కోరాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రాజకీయ దురుద్దేశంతో విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని మొదట్నుంచీ పేర్కొంటున్న నేపథ్యంలో.. తమ వాదన వినిపించేందుకు తగినంత సమయం ఇవ్వకపోతే అనుసరించాల్సిన వైఖరిపైనా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. నేడో రేపో పీపీ ప్రజెంటేషన్! విచారణ కమిషన్ ఎదుట హాజరవడానికి ముందే మీడియాకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వాపరాలు, స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని హరీశ్‌రావును కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని క్రోడీకరించే పనిలో హరీశ్ ఉన్నట్లు సమాచారం. కాగా ఒకటీ రెండు రోజుల్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సంబంధించిన తేదీని బీఆర్ఎస్ ప్రకటించే అవకాశముంది.

యూఎస్ కల.. వీసా ఎలా?
వీసా వస్తుందో లేదో..?నాకు అమెరికా యూనివర్సిటీలో సీటు ఖరారైంది. అప్పులు చేసి అన్ని విధాలుగా సిద్ధమయ్యా. ఆగస్టులో వెళ్లాలి. కానీ ఇంతవరకూ వీసా ఇంటర్వ్యూకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో మొదటి సెమిస్టర్‌కు వెళ్లగలనా? లేదా అనే భయం వెంటాడుతోంది. – శశాంక్ ఇరుకుపాటి (అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన మహబూబ్‌నగర్ విద్యార్థి)సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు భారతీయ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలవర పెడుతున్నాయి. స్టూడెంట్ వీసాలకు ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని కాన్సులేట్ అధికారులను అగ్రదేశం ఆదేశించడం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న వారిని గందరగోళానికి గురి చేస్తోంది. తమ దేశంలోని కొన్ని యూనివర్సిటీల్లో ఉగ్రవాద సమర్థనీయ చర్యలున్నాయని అమెరికా ప్రభుత్వం అనుమానిస్తుండటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అంటున్నారు. అమెరికా రావాలనుకునే ప్రతి విద్యార్థి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని అధికారులకు అమెరికా ఆదేశాలు ఇచ్చింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయోనని అమెరికా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ వీసా కోసం సిద్ధమైతే అమెరికా ప్రభుత్వం నుంచి రోజుకో నిర్ణయం వెలువడుతోందని కంగారు పడుతున్నారు. అయితే అమెరికా నిర్ణయాలు భారతీయ విద్యార్థులకు పెద్దగా ఇబ్బంది కల్గించవని ప్రవాస భారతీయులు అంటున్నారు. కానీ అమెరికా ఈ ఏడాది 41 శాతం విద్యార్థి వీసాలను తిరస్కరించింది. ఇందులో భారతీయుల వీసాలు 38 శాతం ఉండటం గమనార్హం. కాగా ఇప్పటికే వీసా ఇంటర్వ్యూకు తేదీ ఖరారైన వారిని అనుమతించాలని అమెరికా సూచించడం ఆయా విద్యార్థులకు ఊరటనిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికి 6 వేల మందికి తిరస్కరణ: భారత్ నుంచి ప్రతి ఏటా 7 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. ఇందులో 3 లక్షల మంది అమెరికా దేశానికే వెళ్తున్నారు. చదువు కోసం ఆ దేశానికి మన విద్యార్థులు ప్రతి ఏటా రూ.లక్ష కోట్లు చెల్లిస్తున్నారని భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికన్ యూనివర్సిటీలు ఆగస్టు–డిసెంబర్, జనవరి–మే సెమిస్టర్లకు రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. మనవారు మొదటి సెమిస్టరే ఎంపిక చేసుకుంటారు. దీంతో ఆరు నెలల ముందు నుంచే వీసా కోసం ప్రయత్నిస్తారు. విద్యార్థులకు ఎఫ్1 వీసా ఇస్తారు. దీన్ని నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అంటారు. అమెరికాలో ఫుల్ టైం విద్యకు ఇది అవకాశం కల్పిస్తుంది. కాగా 2023లో 1.03 లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు ఇచ్చినట్టు బ్యూరో ఆఫ్ కాన్సులేట్ అఫైర్స్ నెలవారీ నివేదిక పేర్కొంది. అయితే 2023–24లో ఎఫ్1 వీసాలను భారీగా తగ్గించారు. ప్రపంచ వ్యాప్తంగా 6.79 లక్షల మంది దరఖాస్తు చేస్తే ఇందులో 2.79 లక్షలు అప్లికేషన్లను అమెరికన్ కాన్సులేట్లు తిరస్కరించాయి. 2024 తొలి 9 నెలల్లోనే భారతీయ విద్యార్థులు 38 శాతం మందికి అమెరికా వీసాలు తిరస్కరించింది. ఈ ఏడాది తొలి సెమిస్టర్ కోసం దాదాపు 78 వేల మంది వీసా కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు 24 వేల మందికి ఇంటర్వ్యూ తేదీలు వచ్చాయి. కొందరి ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో 6 వేల మంది వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యారు. ఇక 54 వేలమంది ఇంటర్వ్యూ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిని అడ్డుకునేందుకే.. అమెరికన్ కాన్సులేట్ వర్గాలు, కన్సల్టెన్సీ సంస్థలు, ప్రవాస భారతీయుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. వీసాల విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నదే అమెరికా ఆలోచన. ఉద్రిక్తతతలు, అసాంఘిక కార్యకలాపాలు, సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలున్న వారిని తమ దేశంలోకి రాకుండా చేయాలని ఆ దేశం భావిస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలిస్తోంది. అమెరికా వెళ్ళే ముందు వారు ఎవరిని సంప్రదిస్తున్నారు? వారి నేపథ్యం ఏమిటి? ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఎవరితో ఉండాలనే ఆలోచనలో ఉన్నారు? ఏ కన్సల్టెన్సీని ఎంపిక చేసుకుంటున్నారు? ఆ కన్సల్టెన్సీ ద్వారా గతంలో ఎంతమందిని పంపారు? వాళ్ళ నేపథ్యం ఏమిటి? ఇలాంటి వివరాలు అమెరికా కన్సల్టెన్సీ వర్గాలు సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న తమ స్నేహితులు, బంధువులకు..అనుమానించదగ్గ వ్యక్తులు, రెడ్ లిస్ట్‌లో ఉన్న దేశాల వారితో సంబంధం ఉంటే మరింత లోతుగా పరిశీలించే అవకాశం ఉంది. భారతీయ విద్యార్థులకు ఇబ్బంది లేదు! ప్రస్తుతానికి భారతీయ విద్యార్థులకు పెద్దగా ఇబ్బందులెదురయ్యే అవకాశం లేదని కన్సల్టెన్సీల ప్రతినిధులు, విదేశీ విద్యకు సంబంధించిన నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి అమెరికా కొన్ని దేశాలపైనే దృష్టి పెట్టిందని అంటున్నారు. తమ దేశానికి వస్తున్న 41 దేశాల విద్యార్థులను కేటగిరీలుగా విభజించింది. రెడ్ కేటగిరీలో అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న దేశాలను చేర్చారు. ఇంకా చెప్పాలంటే ఇస్లాం వాదంతో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఆప్ఘనిస్తాన్, ఇరాన్, లిబియాతో పాటు భూటాన్, క్యూబా సహా 11 దేశాలున్నాయి. ఉగ్రవాద ప్రేరేపిత, ఆర్థిక ఆంక్షలు విధించిన దేశాలతో వాణిజ్య మైత్రి కొనసాగిస్తున్న 10 దేశాలను ఆరంజ్ కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీలో పాకిస్తాన్, రష్యా సహా పది దేశాలున్నాయి. వీటిపై కొంత సమయం తీసుకుని ఆంక్షలు విధిస్తారు. వైరి పక్ష దేశాలతో సంబంధాలున్నప్పటికీ, హెచ్చరికలు, చర్చల ద్వారా దారికొచ్చే 22 దేశాలను ఎల్లో కేటగిరీలో చేర్చారు. వీటిపై దశల వారీగా ఆంక్షలు పెట్టాలని భావిస్తున్నారు. ఇక భారత్ మిత్ర పక్షంలోనే ఉండటం వల్ల..ఇతరత్రా కారణాలతో తప్ప ఇక్కడి విద్యార్థులకు ఈ తరహా ఇబ్బందులేవీ లేనట్టేనని అంటున్నారు. అమెరికా స్నేహితులతో జాగ్రత్త అమెరికా రావాలనుకునే వాళ్ళు ముందుగా సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అక్కౌంట్స్ ఉన్నాయనేది చూసుకోవాలి. అనుమానం ఉన్న వ్యక్తులతో ఎలాంటి సామాజిక సంబంధం ఉన్నా, వీసా విషయంలో ఇబ్బందులు తప్పవు. సాధారణంగా అమెరికాలో ఉండే స్నేహితులను మనవాళ్ళు నమ్ముతారు. అయితే వాళ్ళ నేపథ్యం, వాళ్ళు అమెరికాలో ఎలా ఉంటున్నారనేది కూడా ముఖ్యమే. – సిరిమళ్ళ వీరేంద్ర (అమెరికాలో ఎంఎస్ చేస్తున్న భారతీయ విద్యార్థి) తప్పుడు సర్టిఫికెట్లు, పార్ట్టైమ్తోనే ఇబ్బంది వీసాలు పూర్తిగా ఆపేయలేదు. వ్యక్తిగత వివరాలు, వెళ్ళే వర్సిటీ గురించి వాకబు చేయమని మాత్రమే అమెరికా ఆదేశించింది. భారతీయుల పట్ల అమెరికాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కాకపోతే తప్పుడు ధ్రువపత్రాలతో వెళ్ళాలనుకున్నా,అక్కడికెళ్ళి పార్ట్‌టైం ఉద్యోగం చేస్తామన్నా, ఆ దిశగా లావాదేవీలున్నా వీసాకు ఇబ్బందులెదురవుతాయి. – జయవర్థన్ ఏకాటి (కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకుడు)

పాశ్చాత్య దేశాల ‘ప్రాయశ్చిత్తం’
గాజాలో కళ్లముందు 19 నెలలుగా మారణహోమం సాగుతున్నా గుడ్లప్పగించి చూసిన పాశ్చాత్య దేశాలు ఇప్పటికి తెలివి తెచ్చుకున్నాయి. ఇజ్రాయెల్ సాగిస్తున్న ఊచకోత ‘నైతికంగా సమర్థించ లేనిది, పూర్తిగా అసమతౌల్యమైనద’ంటూ కొత్త రాగం అందుకున్నాయి. మొదట బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు ఇజ్రాయెల్ తీరును వ్యతిరేకిస్తూ ప్రకటన చేయగా, కాస్త ఆలస్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ), జర్మనీ శ్రుతి కలపడం కొత్త పరిణామం. ఇన్నాళ్ల పాపానికిది ప్రాయశ్చిత్తం అనుకోవచ్చా? అనుమానమే. గాజాలో ఏణ్ణర్ధం నుంచి అదే పనిగా బాంబుల వర్షం కురి పిస్తూ వేలాదిమంది ప్రజలనూ... వారికి తిండి నీళ్లూ ఇచ్చేందుకూ, చికిత్స అందించేందుకూ వచ్చినవారిని సైతం హతమారుస్తుంటే ఈ దేశాల్లో ఎవరికీ నోరు పెగల్లేదు. ఇప్పటికీ వాటి వైఖరి పెద్దగా మారినట్టు కాదు. ఎందుకంటే... ఊచకోత సమర్థనీయం కాదంటూనే ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉన్నదని ఎప్పటిలా మర్కట తర్కానికి దిగుతున్నాయి. 2023 అక్టోబర్ 7న పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ప్రారంభించింది మొదలు పాశ్చాత్య దేశాలు ఈ వాదనే చేస్తున్నాయి. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి 1,200 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని కాల్చిచంపి, 251 మందిని అపహరించుకు వెళ్లినప్పటి నుంచీ ఇజ్రాయెల్ ప్రతీకారం మొదలైంది. ఆత్మరక్షణ చేసుకునే హక్కు ప్రతి దేశానికీ వుంటుంది. కానీ దానికుండే పరిమితి మాటే మిటి? ఎన్ని నెలలపాటు బాంబుల వర్షం కురిపిస్తే... ఎన్ని వేలమందిని చంపితే ఆత్మరక్షణ చేకూరు తుంది? 2,000 పౌండ్ల (907 కిలోల) బంకర్ బస్టర్ బాంబులు ఒక చిన్న ప్రాంతమైన గాజాపై ప్రయోగిస్తుంటే, ఆ దాడుల్లో వేలాదిమంది అమాయక పౌరులూ, ముఖ్యంగా పిల్లలూ, స్త్రీలూ చని పోతుంటే ఎవరూ మాట్లాడలేదు. ఇజ్రాయెల్ దళాలు మూడు నెలలుగా గాజాను పూర్తిగా దిగ్బంధించి అక్కడికి అంతర్జాతీయ సహాయ బృందాలు అడుగుపెట్టకుండా పహారా కాస్తున్నాయి. తామే ఆ సాయాన్ని అందిస్తామంటూ అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. అదెంత బూటకమో తరచూ మీడియాలో వస్తున్న కథనాలే చెబుతున్నాయి. రోజుల తరబడి ఆహారం, మంచినీరూ లభించక వేలాదిమంది మృత్యుముఖంలో వున్నారని ఆ కథనాలు వివరిస్తున్నాయి. ఆకలికి తాళలేక వాహ నాల వెంబడి పరుగులు తీస్తున్నవారిని కూడా నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపిన ఉదంతాలు వెలుగులో కొచ్చాయి. చివరకు అమెరికా–ఇజ్రాయెల్ సహాయ బృందాలను పర్యవేక్షించే చీఫ్ జేక్ ఉడ్ ఆ బాధ్య తల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ బృందాల సాయమంతా కూడా ఇజ్రాయెల్ అధీనంలోని దక్షిణ గాజాలో నాలుగు శిబిరాల ద్వారా మాత్రమే అందుతోంది. సాయం కావాల్సిన వాళ్లు కిలోమీటర్ల దూరం నడిచిపోవాల్సి వస్తోంది. ఉత్తర గాజాకు ఆ మాత్రం సాయం కూడా లేదు.నదురూ బెదురూ లేకుండా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండపై సంపన్న రాజ్యాలు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాయి? ఒక నెత్తుటి హోమానికి తాము మౌన సాక్షులుగా మిగిలిపోయా మన్న నింద పడకూడదని, తమ చేతులు కూడా నెత్తుట తడిశాయని చరిత్రలో నమోదు కారాదని అవి తహతహలాడుతున్నాయి. ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్‌కు ఎడాపెడా సైనిక సామగ్రి తరలించినవే. కోట్లాది డాలర్లు కుమ్మరించినవే. భద్రతా మండలిలో దాన్ని సమర్థించినవే. ఇప్పుడు బ్రిటన్ ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. కొనసాగుతున్న వాణిజ్య చర్చలను నిలుపుదల చేసింది. పాలస్తీనా ఏర్పాటు అంశంపై వచ్చే నెలలో సౌదీ అరేబియాతో కలిసి సదస్సు నిర్వహించ నున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. ఇవి నిజానికి కంటి తుడుపు చర్యలు. కానీ ఈమాత్రం చర్యలు కూడా సమ్మతం కాదంటోంది ఇజ్రాయెల్. బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు పరోక్షంగా హమాస్ బలపడేందుకు దోహదపడుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆరోపించారు. ఇప్పటికి 594 రోజులుగా ఏకపక్షంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథానికి ఇంతవరకూ 61,700 మంది మరణించగా, అందులో 20,000 మంది పసివాళ్లని అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద కన్నుమూసిన వారెందరో ఇంకా తెలియలేదు. వేలాదిమంది పిల్లలు అనాథలుగా మిగిలిపోగా, మరిన్ని వేలమంది పిల్లలు కాళ్లూ చేతులూ పోగొట్టుకుని వైద్యసాయం సక్రమంగా అందక రోదిస్తున్నారు. ఈ మారణహోమానికి ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రోజుల తరబడి ధర్నాలు సాగాయి. పాశ్చాత్య దేశాల్లో పాలస్తీనా ప్రధాన చర్చనీయాంశమైంది. కానీ ఇవేవీ ఇజ్రా యెల్‌నుగానీ, దానికి అండగా వుంటున్న సంపన్న రాజ్యాల పోకడలనుగానీ మార్చలేకపోయాయి. ఇజ్రాయెల్ వాణిజ్యంలో మూడోవంతు వాటా యూరప్ దేశాలదే. ఆ దేశాలు తల్చుకుంటే, చిత్త శుద్ధితో ఆంక్షలు అమలు చేస్తే ఇజ్రాయెల్ మనుగడ ఇబ్బందుల్లో పడుతుంది. మొదటి నుంచీ అండగా ఉంటున్న అమెరికా ఆ దేశాలతో చేతులు కలిపితే దాని పరిస్థితి మరింత దిగజారుతుంది. కనీసం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆదేశాలను పాటిస్తే ఇజ్రాయెల్‌కు ఊపిరాడదు. కానీ అవి నిజంగా అంత పని చేస్తాయా? అసలు ఇజ్రాయెల్‌లోనే నెతన్యాహూపై తీవ్ర వ్యతిరేకత బయల్దేరింది. ఇప్పుడు ఆయన్ను సమర్థించేవారు 25 శాతం మించరని చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ను ఏమాత్రం తక్కువ చేసినా అది ఇరాన్‌కు బలం చేకూరుస్తుందన్న భయం పాశ్చాత్య దేశాలకుంది. ఆ దేశాల్లో రెండో ప్రపంచ యుద్ధానంతర రాజకీయాలన్నీ ఇజ్రాయెల్‌తో ముడిపడి వున్నాయి. దాన్ని తెంచుకోవటమంటే ఒక కొత్త ఒరవడికి తెరతీయడమే. అంత సాహసం చేయలేక కంటితుడుపు చర్యలు ప్రకటించాయి. కానీ ఇప్పటికే సమయం మించిందని ఆ దేశాలు గ్రహిస్తే మంచిది.

ఫైనల్ వేటలో...
ముల్లాన్‌పూర్: ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ట్రోఫీ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న రెండు జట్లు... 18వ సీజన్ ఫైనల్ చేరేందుకు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గురువారం క్వాలిఫయర్–1లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ ఆరంభం నుంచి ఆడుతున్న ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయిన ఇరు జట్లు... ఈ సారి నిలకడైన ప్రదర్శనతో ‘ప్లే ఆఫ్స్’కు చేరాయి. లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన పంజాబ్ కింగ్స్ 9 విజయాలు, 4 పరాజయాలు, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 19 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. 2014 తర్వాత పంజాబ్ జట్టు ‘ప్లే ఆఫ్స్’కు చేరడం ఇదే తొలిసారి కాగా... అప్పుడు కూడా పట్టికలో అగ్ర స్థానంలో నిలిచిన పంజాబ్... తుదిపోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇక మరోవైపు 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 4 పరాజయాలు ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 19 పాయింట్లు సాధించిన బెంగళూరు రన్‌రేట్‌లో కాస్త వెనుకబడి రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు జరగగా... చెరొకటి గెలిచాయి. బెంగళూరులో జరిగిన పోరులో పంజాబ్ గెలవగా... ముల్లాన్‌పూర్‌లో జరిగిన పోరులో బెంగళూరు పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుండగా... ఓడిన జట్టుకు క్వాలిఫయర్–2 రూపంలో మరో అవకాశం ఉండనుంది. టాప్–3పైనే ఆశలు... ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’కు చేర్చిన కెప్టెన్‌గా ఘనత సాధించిన శ్రేయస్ అయ్యర్... పంజాబ్‌కు ప్రధాన బలం కానున్నాడు. మైదానం బయటి నుంచి రికీ పాంటింగ్ సలహాలు... లోపల శ్రేయస్ వ్యూహాలతో ఇప్పటికే పంజాబ్ కింగ్స్ అభిమానుల మనసులు గెలుచుకుంది. ముందుండి నడిపించే వాడే నాయకుడు అనే విధంగా శ్రేయస్ బ్యాట్‌తోనూ దుమ్మురేపుతున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 51.40 సగటుతో అతడు 514 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్ వస్తున్న శ్రేయస్ 171.90 స్ట్రయిక్‌రేట్‌తో ఈ పరుగులు చేయడం విశేషం. ఇక యువ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ 499 పరుగులు, ప్రియాన్ష్ ఆర్య 424 పరుగులతో సత్తా చాటారు. ఈ ఇద్దరు అందిస్తున్న శుభారంభాలతోనే పంజాబ్ భారీ స్కోర్లు చేయగలిగింది. ఈ సీజన్లో పంజాబ్ నిలకడైన విజయాలకు ఈ ముగ్గురి ఫామే ప్రధాన కారణం. ఇన్‌గ్లిస్ మంచి టచ్‌లో ఉండగా... నేహల్ వధేరా, శశాంక్, స్టొయినిస్ అవసరమైన సమయంలో సత్తా చాటుతున్నారు. బౌలింగ్‌లో అర్ష్ దీప్ సింగ్, కైల్ జేమీసన్, అజు్మతుల్లా కీలకం కానున్నారు. జాతీయ జట్టు అవసరాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ స్వదేశానికి తిరిగి వెళ్లడం జట్టుకు కాస్త ఇబ్బంది కాగా... గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేని చాహల్ రాకతో స్పిన్ విభాగం పటిష్టమైంది. విరాట్‌పై పెను భారం లీగ్ ఆరంభమైనప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్ కోహ్లి... 18వ సీజన్లో అయినా ట్రోఫీని ముద్దాడాలని తహతహలాడుతున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నా... అనధికారిక కెపె్టన్‌గా కోహ్లిపైనే జట్టు అధికంగా ఆధారపడుతోంది. అందుకు తగ్గట్లే ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన విరాట్... 13 మ్యాచ్‌ల్లో 60.20 సగటుతో 602 పరుగులు చేశాడు. 147.91 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబట్టిన కోహ్లి... 8 అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. తన వికెట్ విలువ అర్థం చేసుకొని ఆడుతున్న కోహ్లి... ఈ సీజన్లో అత్యధిక స్కోరు ముల్లాన్‌పూర్‌లోనే పంజాబ్‌పై నమోదు చేసుకోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. కోహ్లి, సాల్ట్ జట్టుకు శుభారంభాలు అందిస్తుండగా... మయాంక్ అగర్వాల్, రజత్ పాటీదార్, జితేశ్ శర్మ చక్కటి ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో ఆశలే లేని స్థితిలో అద్భుత ప్రదర్శన చేసిన జితేశ్ శర్మ నుంచి ఫ్రాంఛైజీ అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. గాయం కారణంగా టిమ్ డేవిడ్ అందుబాటులో లేకపోవడం జట్టుకు ఇబ్బందికరంగా మారగా... అతడి స్థానంలో లియామ్ లివింగ్‌స్టోన్ ఫినిషర్ పాత్ర పోషించనున్నాడు. ఫిట్నెస్ సాధించిన జోష్ హాజల్‌వుడ్ తిరిగి రావడం జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఎలాంటి బ్యాటర్‌నైనా ఇబ్బంది పెట్టగల హాజల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. భువనేశ్వర్, యశ్ దయాళ్‌తో కలిసి అతడు పేస్ భారాన్ని మోయనుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ (కెప్టెన్ ), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, జెమీసన్, హర్‌ప్రీత్, అర్ష్ దీప్, చాహల్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, జితేశ్, కృనాల్ పాండ్యా, లివింగ్‌స్టోన్, షెఫర్డ్, భువనేశ్వర్, యశ్ దయాళ్, హజల్‌వుడ్, సుయాశ్ శర్మ. పిచ్, వాతావరణం ముల్లాన్‌పూర్ మైదానంలో ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు జరగగా... అందులో మూడు ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లు 200 దాటాయి. మిగిలిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. బుధవారం పిచ్ ఎలా స్పందిస్తుందనేది కీలకం. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఐపీఎల్లో నేడు (క్వాలిఫయర్ –1)పంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్‌పూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

కంటితుడుపు ‘మద్దతు’
రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యేది వరి పంట. దీనికి ఈసారి మద్దతు ధరను క్వింటాకు రూ.69 (కిలోకు 69 పైసలు) మాత్రమే పెంచడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఎకరా సాగుకు రూ.28 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు వచ్చిందని చెబుతున్నారు. కూలీల వేతనాలు, ఎరువులు, పురుగుమందుల ధరల్లో పెరుగుదలతో ఈ ఏడాది ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.42 వేల వరకు ఖర్చు రానుందని అంచనా వేస్తున్నారు. సాక్షి, అమరావతి: పంటలకు ‘మద్దతు ధర’ ఏటా ఓ ప్రహసనంగా మారుతోంది. తాజాగా 2025–26 సీజన్‌కు సంబంధించి కేంద్రం చేసిన ప్రకటనపై రైతులు, రైతు సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటలకు చాలా స్వల్పంగా, అతి తక్కువగా పండించేవాటికి అరకొరగా మద్దతు ధర పెంచడం పట్ల మండిపడుతున్నారు. ఏటా ప్రకటిస్తున్న మద్దతు ధరలకు.. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు పొంతన లేకుండా పోతోందని విమర్శిస్తున్నారు. పైగా పంట చేతికొచ్చే సమయంలో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు.కంటితుడుపుగా..ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి సహా 14 పంటలకు కేంద్రం మద్దతు ధరలు వెల్లడించింది. అత్యధికంగా సాగయ్యే వరికి నిరుటితో పోలిస్తే సాధారణ, గ్రేడ్–ఎ క్వింటాకు రూ.69, మొక్కజొన్నకు రూ.175 పెంచింది. జొన్నలు రూ.328, సజ్జలు రూ.150, రాగులు రూ.596, కందులు రూ.450, పెసర రూ.86, మినుములు రూ.400, వేరుశనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, సోయాబీన్ రూ.436, కుసుమలు రూ.579, వలిశలు (గడ్డినువ్వులు) రూ.820, పత్తి రూ.589 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించారు. పెట్టుబడి ఖర్చులతో పోల్చుకుంటే ఇది తక్కువేనని రైతులు పెదవి విరుస్తున్నారు. కూలీల కొరతతో కోతలు, నూర్పిళ్లకు పూర్తిగా యంత్రాలపైనే ఆధారపడాల్సి వస్తోందని... పెట్రోల్ ధరల కారణంగా వీటి అద్దెలు భారీగా పెంచేశారని చెబుతున్నారు. మరోవైపు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రధాన పంటలకు సగటున ఉత్పత్తి ఖర్చులు ఎకరాకు 10–15 శాతం మేర అధికమయ్యాయి. ఆ స్థాయిలో మాత్రం మద్దతు ధరలు పెంచడం లేదని మండిపడుతున్నారు.వీటికి ఒక్క శాతానికి మించలేదు..ప్రధాన వాణిజ్య పంట అయిన మొక్కజొన్న సాగుకు నిరుడు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు ఖర్చు వచ్చింది. ఈ ఏడాది రూ.35 వేలు అవుతోంది. అంటే.. దాదాపు రూ.15 వేలు అధికం. పెరిగిన మద్దతు ధర మాత్రం 7.8 శాతమే. అపరాల పంటలన్నింటికీ పెట్టుబడి ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అధికం కానుండగా.. ఆ స్థాయిలో మద్దతు ధర పెంపు లేదని రైతులు విమర్శిస్తున్నారు. కందికి 1.1 శాతం, పెసరకు 0.9 శాతం, సజ్జకు 0.34 శాతం మాత్రమే పెంచడం గమనార్హం. ఏటా ధాన్యంతో సహా ఏ ఒక్క పంటకూ కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు దక్కడం లేదు. ఉదాహరణకు మినుములుకు రూ.7,400 కాగా రూ.7 వేలకు మించి కొనలేదు. వేరుశనగ రూ.6,783కు గాను దక్కింది రూ.5,500. చిరు ధాన్యాలకు సైతం క్వింటాకు రూ.2,500 దాటి ఇవ్వలేదు. కందులు మద్దతు ధర రూ.7,550 కాగా కొనేవారే కరువయ్యారు.ధాన్యానికి మద్దతు ధర పెంపు 3 శాతమా?గత ఏడాది ధాన్యం సాధారణ, ఏ గ్రేడ్ రకాలకు క్వింటాకు రూ.117 చొప్పున పెంచిన కేంద్రం ఈ ఏడాది మాత్రం ఆశలపై నీళ్లు చల్లింది. నిరుడు ప్రకటించిన ప్రకారం 75 కేజీల బస్తాకు రూ.1,725 దక్కాల్సి ఉండగా, రూ.1,100–రూ.1,400 మధ్య ధర పలికింది. మేలు రకాలకు సైతం రూ.1,400కు మించి దక్కలేదు. అంటే, మద్దతు ధరలోనే 30–40 శాతం మేర రైతులు నష్టపోయారు. కనీసం ఈ ఏడాదైనా క్వింటాకు రూ.500 తక్కువ కాకుండా పెంచుతారని భావించారు. కానీ, అన్నదాతల ఆశలను అడియాశలు చేస్తూ నిరుటితో పోలిస్తే ఈ ఏడాది మద్దతు ధర పెంపును 3 శాతానికి పరిమితం చేశారు. అంటే కిలోకు 69 పైసలకు మించలేదు. ఇలాగైతే బతికేది ఎలాగంటూ ధాన్యం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెట్టుబడి ఖర్చులకు, పెంపునకు సంబంధం ఉందా?పెట్టుబడులు అన్ని పంటలకు ఒకేలా పెరుగుతున్నాయి. దీనికి... ప్రకటించిన మద్దతు ధరలకు ఏమాత్రం సంబంధం లేదు. రాష్ట్రంలో అత్యధికంగా పండేది వరి. కానీ, ధాన్యం క్వింటాకు రూ.69 మాత్రమే పెంచడం దారుణం. పెసరకూ గత సంవత్సరం కంటే తక్కువ పెంచారు. మిగిలిన పంటలకు గత ఏడాది కంటే ఎంతో కొంత పెంపునకు అనుమతి ఇచ్చారు. – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ అగ్రి మిషన్
ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేం
రాబోయే ఐదేళ్లూ భగభగలే!
నిర్లక్ష్యం.. బుసలు కొడుతోంది!
ఆకాశహర్మ్యాల నడుమ... అద్భుత దృశ్యం!
సీజ్ ద థియేటర్.. అంటారేమో!
ఈ రాశి వారికి రుణాలు తీరతాయి.. ఆప్తులతో సఖ్యత
సత్వరం ఎన్నికలు
మా భూముల్లో జోక్యం చేసుకోకుండా..అధికారులను నిలువరించండి
ముక్కు కొరికేశాడు
మళ్లీ వచ్చింది కన్సల్టెంట్ల రాజ్యం
రిషబ్ పంత్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
Mahanadu: మహానాడు.. మాకెందుకయ్యా?
సభ సూపర్ సక్సెస్ మీదే దృష్టి పెట్టకుండా.. ‘సూపర్ సిక్స్’ను కూడా చూడండి!!
జైలర్-2లో విలన్‌గా తెలుగు అగ్ర హీరో
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)
నడిరోడ్డుపై పట్టపగలే దళిత, ముస్లిం యువకులపై రెడ్‌బుక్ కర్కశత్వం
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు.. వ్యాపారాలు లాభిస్తాయి
కరీంనగర్లో దరఖాస్తు.. మహబూబ్‌నగర్‌లో మంజూరు
ప్రముఖ సీరియల్ నటుడు కన్నుమూత
సాక్షి కార్టూన్ 27-05-2025
కన్నప్ప చిత్రం హార్డ్‌డ్రైవ్‌తో యువతి పరార్
NTR Jayanthi : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి (చిత్రాలు)
సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?
దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ ‘బూటు’ దెబ్బ
ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్
ఇక నుంచి భారత్ వస్తువులే కొందాం.. మేకిన్ ఇండియాను సాధిద్దాం: ప్రధాని మోదీ
భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమే- పాక్ ప్రధాని
ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేం
రాబోయే ఐదేళ్లూ భగభగలే!
నిర్లక్ష్యం.. బుసలు కొడుతోంది!
ఆకాశహర్మ్యాల నడుమ... అద్భుత దృశ్యం!
సీజ్ ద థియేటర్.. అంటారేమో!
ఈ రాశి వారికి రుణాలు తీరతాయి.. ఆప్తులతో సఖ్యత
సత్వరం ఎన్నికలు
మా భూముల్లో జోక్యం చేసుకోకుండా..అధికారులను నిలువరించండి
ముక్కు కొరికేశాడు
మళ్లీ వచ్చింది కన్సల్టెంట్ల రాజ్యం
రిషబ్ పంత్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ
కథ మొత్తం చెప్పినా భయపడను.. సందీప్ రెడ్డి వంగా కౌంటర్
Mahanadu: మహానాడు.. మాకెందుకయ్యా?
సభ సూపర్ సక్సెస్ మీదే దృష్టి పెట్టకుండా.. ‘సూపర్ సిక్స్’ను కూడా చూడండి!!
జైలర్-2లో విలన్‌గా తెలుగు అగ్ర హీరో
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
నడిరోడ్డుపై పట్టపగలే దళిత, ముస్లిం యువకులపై రెడ్‌బుక్ కర్కశత్వం
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వృత్తి, వ్యాపారాలలో పురోగతి
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు.. వ్యాపారాలు లాభిస్తాయి
కరీంనగర్లో దరఖాస్తు.. మహబూబ్‌నగర్‌లో మంజూరు
ప్రముఖ సీరియల్ నటుడు కన్నుమూత
సాక్షి కార్టూన్ 27-05-2025
కన్నప్ప చిత్రం హార్డ్‌డ్రైవ్‌తో యువతి పరార్
సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?
దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ ‘బూటు’ దెబ్బ
ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్
ఇక నుంచి భారత్ వస్తువులే కొందాం.. మేకిన్ ఇండియాను సాధిద్దాం: ప్రధాని మోదీ
భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధమే- పాక్ ప్రధాని
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
గిల్‌ను కాదు అతడిని కెప్టెన్‌గా సెలక్ట్ చేయాల్సింది: వీరేంద్ర సెహ్వాగ్
సినిమా

SSMB29: రూ.20 కోట్ల ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ నటుడు!
రాజమౌళి..ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడు. ఇందులో నో డౌట్. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే కచ్చితంగా అది రికార్డులు సృష్టిస్తుంది. అలాంటి దర్శక దిగ్గజం సినిమాలో నటించే అవకాశం వస్తే ఏ నటుడైనా వదులుకుంటాడా? కానీ బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మాత్రం రాజమౌళి ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట. రూ. 20 కోట్ల పారితోషికం ఇస్తానని చెప్పినప్పటికీ ఆయన ఒప్పుకోలేదట. నమ్మశక్యంగా లేనిఈ వార్తను బాలీవుడ్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది.న్యూస్ 18 కథనం ప్రకారం.. మహేశ్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం(SSMB 29)లో కీలక పాత్ర కోసం నానా పటేకర్‌ని తీసుకుందాం అనుకున్నారట. ఈ మేరకు రాజమౌళి పూణే వెళ్లి నానా పటేకర్‌కు స్క్రిప్ట్ మొత్తం వివరించారట. కథ, పాత్ర బాగున్నప్పటికీ.. దానికి నేను న్యాయం చేయలేనని నానా పటేకర్(Nana Patekar ) భావించారట. ఈ విషయం రాజమౌళి టీమ్‌కి చెప్పి.. సున్నితంగా తప్పుకున్నాడని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అంతేకాదు..ఇందులో నటించేందుకు నానా పటేకర్‌ని భారీగా పారితోషికం ఇస్తామని చెప్పారట. కేవలం 15 రోజుల షూటింగ్ కోసం దాదాపు రూ. 20 కోట్ల వరకు ఇస్తామని చెప్పినప్పటికీ, నానా పటేకర్ ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్టుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాత్ర నచ్చకపోవడంతోనే నానా పటేకర్ మహేశ్ సినిమాను రిజెక్టర్ చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇదంతా బాలీవుడ్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం అని, రాజమౌళి అడిగితే నానా పటేకరే కాదు అమితాబ్ లాంటి స్టార్స్ కూడా నటించేందుకు ముందుకు వస్తారని టాలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు. రాజమౌళి- మహేశ్ సినిమా విషయానికొస్తే.. SSMB 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యం తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఉన్ని ముకుందన్‌పై ఆరోపణలు.. అసలు విషయం బయటపెట్టిన హీరో!
మార్కోతో మోస్ట్ వయొలెన్స్‌ను అభిమానులకు పరిచయం చేసిన హీరో ఉన్ని ముకుందన్. గతేడాది థియేటర్లలో విడుదలైన మార్కో మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమాలో విపరీతమైన వయోలెన్స్ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమైంది. కొత్త ఏడాదిలో గెట్ సెట్ బేబీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తెలుగులో జనతా గ్యారేజ్, ఖిలాడి, యశోద చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగులోనూ ఉన్ని ముకుందన్‌కు ఫ్యాన్స్ ఉన్నారు.అయితే తాజాగా ఉన్ని ముకుందన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై మాజీ మేనేజర్ విపిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.చాలా కాలంగా ఉన్ని ముకుందన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పోలీసులకు తెలిపారు. తనపై నటుడు ఉన్ని ముకుందన్ దాడి చేయించారని విపిన్ కుమార్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.అన్నీ అవాస్తవాలే..తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై ఉన్ని ముకుందన్ స్పందించారు. అతను చేసేవన్నీ అసత్య ఆరోపణలేనని అన్నారు. అతనిపై ఎలాంటి భౌతిక దాడి జరగలేదని వెల్లడించారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అసలు దాడి చేసినట్లు చెబుతున్న విపిన్ కుమార్‌ను తన మేనేజర్‌గా కూడా నియమించలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. తాను దాడి చేయించానని వస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు.ఉన్ని ముకుందన్ తన పోస్ట్‌లో రాస్తూ.. "2018లో నా సొంత నిర్మాణంలో నా మొదటి చిత్రాన్ని నిర్మించబోతున్నప్పుడు విపిన్ కుమార్ నన్ను సంప్రదించాడు. ఆయనను నా వ్యక్తిగత మేనేజర్‌గా ఎప్పుడూ నియమించలేదు. అతను చెప్పినట్లుగా ఎలాంటి భౌతిక దాడి జరగలేదు. అతను చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం, అవాస్తవం. మేమున్న ప్రదేశమంతా సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయని' రాసుకొచ్చారు.అతని పరిశ్రమలోని కొంతమంది స్నేహితుల మద్దతు ఉందని చెబుతున్నారు.. నా డేటా అంతా అతని వద్ద ఉండటంతో.. నేను ఆయనను లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పమని అభ్యర్థించానని ఉన్ని ముకుందన్ తెలిపారు. కానీ అతని నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. కానీ నాపై న్యూస్ పోర్టల్స్, సోషల్ మీడియాలో పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఉన్ని ముకుందన్ వెల్లడించారు.

మంచు విష్ణు కన్నప్ప.. శ్రీకాళహస్తి ఫుల్ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన భక్తి సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ మూవీ నుంచి శ్రీకాళహస్తి అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ భక్తి గీతాన్ని విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. A song filled with devotion and power! 🔥 Sri-Kala-Hasti lyrical from #Kannappa🏹 is OUT NOW! 🎶✨ Feel the rhythm, embrace the energy! Watch & enjoy!Har Har Mahadev 🔱Har Ghar Mahadev 🔥#SriKalaHastiLyricalSong #Kannappa #Stalapurana #OmNamahShivaya🔗Telugu:… pic.twitter.com/e4ebn1Ypoh— Kannappa The Movie (@kannappamovie) May 28, 2025

జయం రవి విడాకుల కేసు.. అన్ని పోస్టులు డిలీట్ చేసిన భార్య!
కోలీవుడ్ హీరో జయం రవి ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా ఆయన భార్య, జయం రవి ఒకరిపై ఒకరు పెద్దఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. తనను వేధింపులకు గురి చేశారంటూ జయం రవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆ తర్వాత ఆయన భార్య ఆర్తి సైతం మూడో వ్యక్తి ప్రమేయం వల్లే విడాకులకు దారితీసిందని ఆరోపించింది. విడాకుల విషయంలో ఇప్పటికే వీరిద్దరు కోర్టుకు కూడా హాజరవుతున్నారు.ఈ నేపథ్యంలోనే జయం రవి భార్య ఆర్తి ఓ బిగ్ షాకిచ్చింది. ఈ వివాదం గురించి చేసిన పోస్టులన్నింటినీ తన సోషల్ మీడియా ఖాతా నుంచి తొలగించింది. దంపతులు ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే పోస్టులను పెట్టవద్దని హైకోర్టు ఆదేశించండంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రవి తన భార్య ఆర్తితో పాటు అత్త సుజాతకు నోటీసులు పంపారు. తమ విభేదాల గురించి మాట్లాడటం మానేయాలని వారిద్దరికీ లీగల్ నోటీసు పంపారు. అంతేకాకుండా నటుడికి పరువు నష్టం కలిగించే పోస్టులను తొలగించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పంపించారు.అదేవిధంగా ఆర్తి సైతం.. రవి మోహన్‌కు లీగల్ నోటీసులు పంపింది. ఆర్తితో పాటు అత్త సుజాతపై పోస్టులు చేయకుండా ఆపేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆర్తి హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపింది. న్యాయ వ్యవస్థ పరువు నష్టం నుంచి రక్షణ కల్పించడం.. అన్నింటికంటే ముఖ్యంగా న్యాయాన్ని కాపాడిందని ఆమె పోస్ట్‌కు క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. కాగా.. జయం రవి, ఆర్తి 16 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ ఉన్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ఎకరం వంద రూపాయలకే మెడికల్ కాలేజీ లీజు... నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను బేరం పెట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల బహిరంగ దాడి

ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ పేరుతో రైతుల భూములు స్వాహా.... బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవడానికి ప్రైవేట్ కంపెనీ ఎత్తుగడలు

అమరావతి నిర్మాణ పనుల్లో ముడుపుల దందా... భారీగా పెంచేసిన అంచనా వ్యయంపై ఇంజినీరింగ్ నిపుణుల విస్మయం.. ముఖ్య నేత జేబుల్లోకి కమీషన్ల సొమ్ము చేరుతున్నట్లు ఆరోపణలు

ఈశాన్య రాష్ట్రాల్లో అసాధారణ అభివృద్ధి జరుగుతోంది... అక్కడ పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి... ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

చంద్రబాబుదే మద్యం కుంభకోణం... గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్... మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మృతి... ఇది అసాధారణ విజయం అంటూ స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

హామీలు నెరవేర్చలేకే రెడ్‌బుక్ కుట్రలు... బరితెగించి తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?. బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడమా?

హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం... 17 మంది మృత్యువాత... మృతుల్లో 8 మంది చిన్నారులు
క్రీడలు

ఫైనల్ వేటలో...
ముల్లాన్‌పూర్: ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ట్రోఫీ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న రెండు జట్లు... 18వ సీజన్ ఫైనల్ చేరేందుకు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గురువారం క్వాలిఫయర్–1లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ ఆరంభం నుంచి ఆడుతున్న ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయిన ఇరు జట్లు... ఈ సారి నిలకడైన ప్రదర్శనతో ‘ప్లే ఆఫ్స్’కు చేరాయి. లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన పంజాబ్ కింగ్స్ 9 విజయాలు, 4 పరాజయాలు, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 19 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. 2014 తర్వాత పంజాబ్ జట్టు ‘ప్లే ఆఫ్స్’కు చేరడం ఇదే తొలిసారి కాగా... అప్పుడు కూడా పట్టికలో అగ్ర స్థానంలో నిలిచిన పంజాబ్... తుదిపోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇక మరోవైపు 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 4 పరాజయాలు ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 19 పాయింట్లు సాధించిన బెంగళూరు రన్‌రేట్‌లో కాస్త వెనుకబడి రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు జరగగా... చెరొకటి గెలిచాయి. బెంగళూరులో జరిగిన పోరులో పంజాబ్ గెలవగా... ముల్లాన్‌పూర్‌లో జరిగిన పోరులో బెంగళూరు పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుండగా... ఓడిన జట్టుకు క్వాలిఫయర్–2 రూపంలో మరో అవకాశం ఉండనుంది. టాప్–3పైనే ఆశలు... ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను ఐపీఎల్ ‘ప్లే ఆఫ్స్’కు చేర్చిన కెప్టెన్‌గా ఘనత సాధించిన శ్రేయస్ అయ్యర్... పంజాబ్‌కు ప్రధాన బలం కానున్నాడు. మైదానం బయటి నుంచి రికీ పాంటింగ్ సలహాలు... లోపల శ్రేయస్ వ్యూహాలతో ఇప్పటికే పంజాబ్ కింగ్స్ అభిమానుల మనసులు గెలుచుకుంది. ముందుండి నడిపించే వాడే నాయకుడు అనే విధంగా శ్రేయస్ బ్యాట్‌తోనూ దుమ్మురేపుతున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 51.40 సగటుతో అతడు 514 పరుగులు చేసి జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్ వస్తున్న శ్రేయస్ 171.90 స్ట్రయిక్‌రేట్‌తో ఈ పరుగులు చేయడం విశేషం. ఇక యువ ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ 499 పరుగులు, ప్రియాన్ష్ ఆర్య 424 పరుగులతో సత్తా చాటారు. ఈ ఇద్దరు అందిస్తున్న శుభారంభాలతోనే పంజాబ్ భారీ స్కోర్లు చేయగలిగింది. ఈ సీజన్లో పంజాబ్ నిలకడైన విజయాలకు ఈ ముగ్గురి ఫామే ప్రధాన కారణం. ఇన్‌గ్లిస్ మంచి టచ్‌లో ఉండగా... నేహల్ వధేరా, శశాంక్, స్టొయినిస్ అవసరమైన సమయంలో సత్తా చాటుతున్నారు. బౌలింగ్‌లో అర్ష్ దీప్ సింగ్, కైల్ జేమీసన్, అజు్మతుల్లా కీలకం కానున్నారు. జాతీయ జట్టు అవసరాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ స్వదేశానికి తిరిగి వెళ్లడం జట్టుకు కాస్త ఇబ్బంది కాగా... గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేని చాహల్ రాకతో స్పిన్ విభాగం పటిష్టమైంది. విరాట్‌పై పెను భారం లీగ్ ఆరంభమైనప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్ కోహ్లి... 18వ సీజన్లో అయినా ట్రోఫీని ముద్దాడాలని తహతహలాడుతున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నా... అనధికారిక కెపె్టన్‌గా కోహ్లిపైనే జట్టు అధికంగా ఆధారపడుతోంది. అందుకు తగ్గట్లే ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన విరాట్... 13 మ్యాచ్‌ల్లో 60.20 సగటుతో 602 పరుగులు చేశాడు. 147.91 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబట్టిన కోహ్లి... 8 అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. తన వికెట్ విలువ అర్థం చేసుకొని ఆడుతున్న కోహ్లి... ఈ సీజన్లో అత్యధిక స్కోరు ముల్లాన్‌పూర్‌లోనే పంజాబ్‌పై నమోదు చేసుకోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. కోహ్లి, సాల్ట్ జట్టుకు శుభారంభాలు అందిస్తుండగా... మయాంక్ అగర్వాల్, రజత్ పాటీదార్, జితేశ్ శర్మ చక్కటి ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో ఆశలే లేని స్థితిలో అద్భుత ప్రదర్శన చేసిన జితేశ్ శర్మ నుంచి ఫ్రాంఛైజీ అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. గాయం కారణంగా టిమ్ డేవిడ్ అందుబాటులో లేకపోవడం జట్టుకు ఇబ్బందికరంగా మారగా... అతడి స్థానంలో లియామ్ లివింగ్‌స్టోన్ ఫినిషర్ పాత్ర పోషించనున్నాడు. ఫిట్నెస్ సాధించిన జోష్ హాజల్‌వుడ్ తిరిగి రావడం జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఎలాంటి బ్యాటర్‌నైనా ఇబ్బంది పెట్టగల హాజల్‌వుడ్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. భువనేశ్వర్, యశ్ దయాళ్‌తో కలిసి అతడు పేస్ భారాన్ని మోయనుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. తుది జట్లు (అంచనా) పంజాబ్ కింగ్స్: శ్రేయస్ (కెప్టెన్ ), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ఇన్‌గ్లిస్, నేహల్ వధేరా, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, జెమీసన్, హర్‌ప్రీత్, అర్ష్ దీప్, చాహల్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, మయాంక్ అగర్వాల్, జితేశ్, కృనాల్ పాండ్యా, లివింగ్‌స్టోన్, షెఫర్డ్, భువనేశ్వర్, యశ్ దయాళ్, హజల్‌వుడ్, సుయాశ్ శర్మ. పిచ్, వాతావరణం ముల్లాన్‌పూర్ మైదానంలో ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు జరగగా... అందులో మూడు ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లు 200 దాటాయి. మిగిలిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. బుధవారం పిచ్ ఎలా స్పందిస్తుందనేది కీలకం. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఐపీఎల్లో నేడు (క్వాలిఫయర్ –1)పంజాబ్ X బెంగళూరువేదిక: ముల్లాన్‌పూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

మరోసారి తండ్రైన టీమిండియా క్రికెటర్
టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య రిన్నీ కంతారియా ఈ నెల 18న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉనద్కత్ ఇవాళ (మే 28) సాయంత్రం సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు. ఉనద్కత్, రిన్నీ 2021లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023 డిసెంబర్లో జేడన్ (మగబిడ్డ) జన్మించాడు.👼🏻❤️ pic.twitter.com/Maoc5AbA3h— Jaydev Unadkat (@JUnadkat) May 28, 202533 ఏళ్ల ఉనద్కత్ ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు. ఈ సీజన్లో అతను 7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఉనద్కత్ రంజీల్లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఆ జట్టుకు అతను కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు. అతని సారథ్యంలో సౌరాష్ట్ర 2020లో రంజీ ట్రోఫీ గెలిచింది. ఇది ఆ జట్టుకు తొలి టైటిల్. 2010లో టీమిండియా అరంగేట్రం చేసిన ఉనద్కత్.. మధ్యలో చాలాకాలం జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. 15 ఏళ్లలో అతను టీమిండియా తరఫున 4 టెస్ట్‌లు, 8 వన్డేలు, 10 టీ20లు మాత్రమే ఆడాడు. ఇందులో 26 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో ఉనద్కత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లోనూ 2010లోనే కెరీర్ ప్రారంభించిన ఉనద్కత్.. ఇప్పటివరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున 112 మ్యాచ్‌లు ఆడి 110 వికెట్లు తీశాడు.

విండీస్‌తో తొలి వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఐపీఎల్ స్టార్లకు చోటు
భారతకాలమానం ప్రకారం రేపు (మే 29) సాయంత్రం 5:30 గంటలకు వెస్టిండీస్‌తో జరుగబోయే తొలి వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఐపీఎల్-2025 స్టార్ త్రయం జోస్ బట్లర్ (గుజరాత్ టైటాన్స్), విల్ జాక్స్ (ముంబై ఇండియన్స్), జేకబ్ బేతెల్‌కు (ఆర్సీబీ) చోటు దక్కింది. వీరితో పాటు సీఎస్కే బౌలర్ జేమీ ఓవర్టన్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లిష్ జట్టుకు హ్యారీ బ్రూక్ నాయకత్వం వహిస్తున్నాడు. బట్లర్, బేతెల్, జాక్స్ ఐపీఎల్లో తమ జట్లు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉన్నా లీగ్ మ్యాచ్‌లు పూర్తి కాగానే జాతీయ విధులకు హాజరయ్యారు. ఈ ముగ్గురు లీగ్ దశలో తమతమ జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు.రేపు విండీస్‌తో జరుగబోయే మ్యాచ్‌లో జేమీ స్మిత్, బెన్ డకెట్ ఓపెనింగ్ చేస్తారు. వెటరన్ ఆటగాడు మూడో స్థానంలో, కెప్టెన్ బ్రూక్ నాలుగో స్థానంలో, బట్లర్, బేతెల్, జాక్స్, ఓవర్టన్ వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగుతారు. గాయం కారణంగా ఐపీఎల్ ప్రారంభానికి ముందే వైదొలిగిన బ్రైడన్ కార్స్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు.ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జోఫ్రా ఆర్చర్ కూడా తొలుత ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆర్చర్ ఐపీఎల్ సందర్భంగా గాయపడటంతో అతని స్థానంలో సాకిబ్ మహమూద్‌ను ఎంపిక చేసుకుంది ఇంగ్లిష్ మేనేజ్మెంట్. రేపటి మ్యాచ్‌కు అతను కూడా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మొత్తంగా చూస్తే, రేపు విండీస్‌తో తలపడబోయే ఇంగ్లిష్ జట్టు ఐపీఎల్ డూప్ జట్టుగా కనిపిస్తుంది.విండీస్‌తో తొలి వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టు..బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బేతెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్.ఇదిలా ఉంటే, రేపటి మ్యాచ్ కోసం విండీస్ తుది జట్టును ప్రకటించాల్సి ఉంది. మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం విండీస్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్, ఆతర్వాత టీ20 సిరీస్ జరుగుతాయి. మే 29, జూన్ 3 తేదీల్లో వన్డేలు.. 6, 8, 10 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి.పూర్తి జట్లు..వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, కీసీ కార్టీ, షాయ్ హోప్(w/c), అమీర్ జాంగూ, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, అల్జారి జోసెఫ్, గుడకేష్ మోటీ, షమర్ జోసెఫ్, జెడియా బ్లేడ్స్, జ్యువెల్ ఆండ్రూ, జేడెన్ సీల్స్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్, షిమ్రాన్ హెట్మైర్ఇంగ్లండ్: బెన్ డకెట్, జేమీ స్మిత్, జో రూట్, హ్యారీ బ్రూక్(c), జోస్ బట్లర్(wk), జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, బ్రైడాన్ కార్స్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ల్యూక్ వుడ్, టామ్ బాంటన్, మాథ్యూ పాట్స్, టామ్ హార్ట్లీ

IPL 2025: రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ.. ఆ హీరోలు వీరే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కొందరు క్రికెటర్లు అంచనాలకు మించి రాణించారు. వీరిలో కొందరు ఏమాత్రం అంచనాలు లేకుండానే అదరగొట్టారు. ఇలాంటి వారిపై ఫ్రాంచైజీలు చాలా తక్కువ పెట్టుబడి పెట్టి పైసా వసూల్ ప్రదర్శనలు చేయించుకున్నారు. ఇలా రేటు తక్కువ.. ప్రభావం చాలా ఎక్కువ చూపిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.ఈ జాబితాలో ముందొచ్చే పేరు వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ ఈ 14 ఏళ్ల కుర్ర చిచ్చరపిడుగును కేవలం రూ. 1.1 కోట్లకు సొంతం చేసుకుంది. తీసుకున్న డబ్బుకు వైభవ్ తొలి మ్యాచ్ నుంచే న్యాయం చేస్తూ వచ్చాడు. ఓ విధ్వంసకర సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 206.56 స్ట్రయిక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు.పైసా వసూల్ ప్రదర్శన చేసిన మరో చిచ్చరపిడుగు ప్రియాంశ్ ఆర్య. ఇతగాడిని పంజాబ్ వేలంలో రూ. 3.8 కోట్లకు సొంతం చేసుకుంది. తొలుత ప్రియాంశ్‌పై పంజాబ్ చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టిందని అంతా అనుకున్నారు. అయితే అతను ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఇరగదీశాడు. పంజాబ్ ఈ సీజన్లో టేబుల్ టాపర్‌గా నిలవడంలో ప్రియాంశ్ పాత్ర చాలా కీలకం. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో అతను 183.55 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 424 పరుగులు చేశాడు. రేటు తక్కువ, ప్రభావం ఎక్కువ చూపిన మరో ఆటగాడు ర్యాన్ రికెల్టన్. ముంబై ఇండియన్స్ ఇతన్ని కేవలం కోటి రూపాయలకే సొంతం చేసుకుంది. ఇతను దాదాపు ప్రతి మ్యాచ్‌లో ముంబైకు అద్భుతమైన ఆరంభాలు అందించాడు. ఈ సీజన్లో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరడంలో రికెల్టన్ కీలకపాత్ర పోషించాడు. ఇతను 14 మ్యాచ్‌ల్లో 150.97 స్ట్రయిక్‌రేట్‌తో 388 పరుగులు చేశాడు.ఈ సీజన్లో తక్కువ ధరకే అబ్బురపడే ప్రదర్శనలు చేసిన మరో ఆటగాడు అనికేత్ వర్మ. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతన్ని కేవలం 30 లక్షలకే సొంతం చేసుకుంది. ఇతను ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 166.20 స్ట్రయిక్‌రేట్‌తో 236 పరుగులు చేశాడు. లోయల్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగే అనికేత్ అంచనాలకు మించి భారీ హిట్టింగ్ చేసి తన జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడు. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, క్లాసెన్ లాంటి విధ్వంసకర వీరులు ఉన్న జట్టులో అనికేత్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.పైన పేర్కొన్న నలుగురే కాకుండా ఈ సీజన్లో రేటు తక్కువ, ప్రభావం చాలా ఎక్కువ చూపిన మరికొందరు ఆటగాళ్లు ఉన్నారు. సీఎస్కే తరఫున ఆయుశ్ మాత్రే (30 లక్షలు), డెవాల్డ్ బ్రెవిస్ (2.2 కోట్లు).. ఆర్సీబీ తరఫున కొద్ది మ్యాచ్‌లే ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ (2 కోట్లు), ఢిల్లీ ఆల్‌రౌండర్ విప్రాజ్ నిగమ్ (50 లక్షలు), బౌలర్లలో ఎల్ఎస్జీకి చెందిన దిగ్వేశ్ రాఠీ (30 లక్షలు), ముంబై బౌలర్లు అశ్వనీ కుమార్ (30 లక్షలు), కర్ణ్ శర్మ (50 లక్షలు) అంచనాలకు మించి రాణించి ఈ సీజన్లో మంచి పేరు తెచ్చుకున్నారు.
బిజినెస్

అడ్రస్ ఆధార్.. ప్రభుత్వం కొత్త కసరత్తు!
దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేకమైన అధికారిక గుర్తింపు రుజువు కోసం తీసుకువచ్చిన ఆధార్ మాదిరిగానే ప్రతి చిరునామాకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడీ ఉండే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇళ్లు, స్థలాలను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుంది. డోర్ డెలివరీ సేవలు మరింత సజావుగా అందించడానికి సహాయపడుతుంది.దుర్వినియోగం కట్టడి..ప్రస్తుతం, చిరునామా డేటా నిర్వహణకు సంబంధించి దేశంలో ఎటువంటి ప్రామాణిక వ్యవస్థా లేదు. స్పష్టమైన నిబంధనలు లేని కారణంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండా వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థకు భౌతిక చిరునామాలనూ జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తద్వారా తమ చిరునామా వివరాల వినియోగానికి సంబంధించిన అధికారం స్పష్టమైన వినియోగదారు చేతుల్లో పెట్టడం ఈ కొత్త చొరవ లక్ష్యం.ఆర్థిక వ్యవస్థకూ నష్టం ఈ-కామర్స్, లాజిస్టిక్స్, యాప్ ఆధారిత డెలివరీ సేవలు పెరుగుతున్న నేపథ్యంలో కచ్చితమైన, ప్రామాణిక చిరునామాలకు డిమాండ్ పెరిగింది. అయితే దేశంలోని చాలా చిరునామాలు అస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉంటున్నాయి. కొన్ని సమీప ల్యాండ్ మార్క్ లపై ఆధారపడున్నాయి. ఈ స్పష్టత లేకపోవడం వల్ల తప్పుడు డెలివరీలు, లాజిస్టిక్ అసమర్థతల కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఏటా 10–14 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ఇది దేశ జీడీపీలో సుమారు అరశాతం.👉ఇది చదివారా? ఆధార్ అప్డేట్ గడువు జూన్ 14 వరకే..ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందంటే..చిరునామాలను ఎలా రాయాలి.. నిల్వ చేయాలి... సురక్షితంగా యాక్సెస్ చేసుకోవాలో నిర్వచించడానికి ప్రతిపాదిత పరిష్కారం సమగ్ర 'డిజిటల్ అడ్రస్ సిస్టమ్'ను రూపొందించారు. ఒక వ్యక్తి చిరునామాను డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లలో వినియోగించాలంటే ఆ వ్యక్తి అనుమతి తప్పనిసరి. ఈ మేరకు ప్రైవసీ ప్రోటాకాల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు.ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో తపాలా శాఖ ఈ ప్రాజెక్టును అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది. ముసాయిదా పాలసీని త్వరలోనే ప్రజల సంప్రదింపుల కోసం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా కొత్త వ్యవస్థ తుదిరూపు దాల్చే అవకాశం ఉంది. ఈ డిజిటల్ అడ్రస్ ఫ్రేమ్‌వర్క్‌ను పర్యవేక్షించడానికి అధికారికంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయడానికి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.డిజిపిన్.. స్మార్ట్ అడ్రస్ కోడ్ఈ వ్యవస్థలో గుండెకాయ లాంటిది డిజిపిన్ (డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్). కచ్చితమైన మ్యాప్ కోఆర్డినేట్ల ఆధారంగా ప్రతి చిరునామాకు విశిష్టమైన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఇస్తారు. పెద్ద ప్రాంతాలను కవర్ చేసే సాంప్రదాయ పిన్ కోడ్ల మాదిరిగా కాకుండా డిజిపిన్‌లు వ్యక్తిగత గృహాలు లేదా వ్యాపారా సంస్థలకు స్పష్టమైన కచ్చితత్వాన్ని అందిస్తాయి. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అనధికారిక జనావాసాలు, సాంప్రదాయ చిరునామా వ్యవస్థలు లేని అడవులు, కొండలు వంటి భౌగోళిక సవాళ్లతో కూడిన ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

కొత్త ఈపీఎఫ్‌వో.. ఫిక్స్డ్ డిపాజిట్లు.. జూన్ 1 నుంచి కీలక మార్పులు
మే నెల ముగింపునకు వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో జూన్ నెల ప్రారంభం కాబోతోంది. దేశంలో అనేక ముఖ్యమైన ఆర్థిక మార్పులు జూన్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇవి మీ పొదుపు, క్రెడిట్ కార్డు వాడకం, ప్రావిడెంట్ ఫండ్ రాబడిని ప్రభావితం చేస్తాయి. జూన్ 1 నుంచి ఏయే మార్పులు అమల్లోకి రానున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..ఈపీఎఫ్ఓ 3.0ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO) జూన్ 1 నుంచి అప్‌గ్రేడ్ చేసిన నూతన ఈపీఎఫ్ఓ 3.0 వ్యవస్థను ప్రారంభించనుంది. పీఎఫ్ ఉపసంహరణలను సులభతరం చేయడం, కేవైసీ అప్డేట్లను క్రమబద్ధీకరించడం, క్లెయిమ్ ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడం ఈ కొత్త విధానం లక్ష్యం. ఈపీఎఫ్ నిధులను సులభంగా, వేగంగా పొందేందుకు వీలుగా ఏటీఎం తరహా కార్డులను ప్రవేశపెట్టడం ఇందులో ప్రధాన ఆకర్షణ.క్రెడిట్ కార్డ్ రూల్స్🔸యాక్సిస్ బ్యాంక్ జూన్ 20 నుంచి క్రెడిట్ కార్డు లావాదేవీల వర్గీకరణలో సవరణలు చేయనుంది. రివార్డ్ పాయింట్లు, ఫీజు మినహాయింపులు ఏ లావాదేవీలకు వర్తిస్తాయో కొత్త అప్ డేట్ స్పష్టం చేస్తుంది.🔸కోటక్ మహీంద్రా బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్‌లు, ఫీజులలో జూన్ 1 నుండి మార్పులను అమలు చేస్తుంది. ఖర్చు కేటగిరీలలో సంపాదించిన రివార్డ్ పాయింట్లపై కొత్త పరిమితులు రానున్నాయి. అలాగే కొన్ని క్రెడిట్ కార్డ్ ఫీజులు పెరుగుతాయి. ఇవి కార్డు రకాన్ని బట్టి మారుతాయి. సవరించిన బెనిఫిట్ లు, ఖర్చులకు అనుగుణంగా కార్డుదారులు తమ కార్డు వినియోగాన్ని మార్చుకోవాలి.ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల సవరణలుహెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఇప్పటికే తమ ఎఫ్డీ వడ్డీ రేట్లను తగ్గించాయి. మరిన్ని బ్యాంకులు జూన్ 1 నుండి వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. ప్రస్తుత రేట్లు 6.5 శాతం నుంచి 7.5 శాతం మధ్య ఉన్నందున, రేట్ల కోతకు ముందు అధిక రాబడిని పొందడానికి ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను ఇప్పుడే లాక్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.సెబీ మ్యూచువల్ ఫండ్ కటాఫ్ టైమింగ్ మార్పులుసెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) జూన్ 1 నుండి ఓవర్ నైట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ (ఎంఎఫ్ఓఎస్) కటాఫ్ సమయాలను సవరించనుంది. ఈ మార్పు క్లయింట్ ఫండ్స్ తాకట్టు ఆధారిత అప్ స్ట్రీమింగ్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ఒక రోజులో మెచ్యూరిటీ అయ్యే రిస్క్ లేని ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే ఓవర్‌నైట్ ఫండ్లు సర్దుబాటు చేసిన రిడంప్షన్, లావాదేవీ సమయాలను కలిగి ఉంటాయి. ఇది నెట్ అసెట్ వాల్యూ (ఎన్ఏవీ) లెక్కలను ప్రభావితం చేస్తుంది.

‘కొత్త సీఈఓ నియామకానికి పకడ్బందీ ప్రక్రియ అవసరం’
ఇండస్ఇండ్ బ్యాంక్‌లో అకౌంటింగ్ సంబంధిత వ్యత్యాసాలు బయటపడుతున్న నేపథ్యంలో బ్యాంకుకు కొత్త సీఈఓను నియమించేందుకు ఆర్బీఐ మరింత పకడ్బందీ ప్రక్రియ చేపట్టాలని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త సీఈఓ నియామకం కోసం బ్యాంక్ బోర్డు ఆర్బీఐకి చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా బ్యాంకు నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ (ఎన్ఆర్సీ) నేతృత్వంలో స్వతంత్ర ఉప సంఘం సీఈఓ పేర్లను పరిశీలిస్తే మేలని తెలిపారు.‘బ్యాంక్‌లో భారీ అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎన్ఆర్సీ స్వతంత్ర ఉపసంఘం ఆధ్వర్యంలో సీఈఓ అభ్యర్థి సిఫార్సులకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది’ అని ఉన్నత స్థాయి నియామకాలతో సంబంధం ఉన్న ఒక సీనియర్ బ్యాంకర్ తెలిపారు. జూన్ 30లోగా కొత్త సీఈఓ నియామకానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్బీఐ ఇప్పటికే బ్యాంకుకు సూచించింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ విక్రయాలకు ప్రత్యేక అవుట్లెట్లుసీఈఓ ఎంపిక ప్రక్రియలో తమ బ్యాంక్ బోర్డు అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉందని, నిర్ణీత గడువుకు ముందే సిఫార్సులను ఆర్బీఐకి సమర్పిస్తామని బ్యాంక్ తెలిపింది. గ్లోబల్ సెర్చ్ సంస్థలు షార్ట్ లిస్ట్ చేసిన పేర్లను బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం కలిగినవారు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్‌లతో కూడిన ప్యానెల్ క్షుణ్ణంగా పరిశీలించాలని బ్యాంకింగ్ నిపుణులు తెలుపుతున్నారు. అకౌంటింగ్ అవకతవకల నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంక్ ఎండీ, సీఈవో సుమంత్ కథ్పాలియా ఇటీవల రాజీనామా చేశారు. అంతకన్నా ముందే డిప్యుటీ సీఈవో అరుణ్ ఖురానా తన స్థానం నుంచి తప్పుకున్నారు. దానికంటే ముందే బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) గోవింద్ జైన్ వైదొలిగారు.

పెట్రోల్, డీజిల్ విక్రయాలకు ప్రత్యేక అవుట్లెట్లు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అనుబంధ సంస్థగా ఉన్న చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్) రిటైల్ ఇంధన మార్కెట్లోకి ప్రవేశించడానికి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభించాయి. దీంతో సీపీసీఎల్ ప్రత్యేకంగా తన సొంత బ్రాండెడ్ అవుట్లెట్ల ద్వారా పెట్రోల్, డీజిల్‌ను విక్రయించనుంది.ప్రస్తుతం సీపీసీఎల్ చెన్నైలోని మనాలిలో సంవత్సరానికి 10.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సామర్థ్యంతో క్రూడాయిల్ రిఫైనరీని నిర్వహిస్తోంది. ఇప్పటివరకు కంపెనీ మొత్తం ఉత్పత్తులను రిటైల్ అమ్మకాలను నిర్వహించే ఐఓసీకి సరఫరా చేసింది. సొంత రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఐఓసీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), రిలయన్స్, షెల్, నయారా ఎనర్జీ వంటి ప్రధాన ఇంధన రిటైలర్లతో సీపీసీఎల్ పోటీ పడనుంది.ఇదీ చదవండి: బ్యాంకుల మొండిబాకీలు ‘రైట్ఆఫ్’కంపెనీ ఉత్పత్తుల పంపిణీ కోసం గతంలో ఐఓసీపై ఆధారపడిన సీపీసీఎల్ రిటైల్ రంగంలోకి ప్రవేశించడం దాని సొంత ఇంధన ధరలు, అమ్మకాల వ్యూహాలను నియంత్రించడం ద్వారా లాభాలు ఆర్జించనుంది. భవిష్యత్తులో ప్రీమియం ఇంధన ఆఫర్లు, ప్రత్యామ్నాయ ఇంధన పరిష్కారాలను విస్తరించడానికి ఈ చర్యలు వీలు కల్పిస్తున్నాయి. అయితే సీపీసీఎల్ తన రిటైల్ అవుట్లెట్ల సంఖ్యను, వాటి లోకేషన్లను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కంపెనీ తన మార్కెట్ ఉనికిని విస్తరించడానికి ప్రధాన పట్టణ కేంద్రాలు, రహదారుల సమీపంలో వ్యూహాత్మకంగా అవుట్లెట్లను ఏర్పాటు చేస్తుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫ్యామిలీ

Mangoes ఆర్గానిక్..ఆన్‌లైన్‌కే సై.. ధరలు డౌన్.. సేల్స్ అప్..!
భాగ్య నగరం మామిడి ప్రియత్వంతో ఉవ్విళ్లూరుతోంది. పండ్ల సీజన్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. విభిన్న రకాల మామిడి వెరైటీలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మామిడి విక్రయాల విషయంలో ఆఫ్ లైన్ మార్కెట్‌తో ఆన్లైన్ పోటీపడే స్థాయికి చేరుకోవడం ఈ సీజన్ విశేషం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నగర మామిడి మార్కెట్ స్థితిగతుల పై ఓ విశ్లేషణ.... – సాక్షి, సిటీబ్యూరో తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మామిడి పండ్లతో పాటు, హిమాయత్, దాసేరి, బెనిషాన్, అల్ఫోన్సో, రసాలు వంటి రకాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి నగరానికి వస్తాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో అకాల వర్షాలు, ఈదురు గాలులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను తాకాయి. ఇది నగర ప్రాథమిక మామిడి సరఫరాదారులపై తీవ్ర ప్రభావం చూపింది. హోల్‌సేల్ మార్కెట్లను పండని, పక్వానికి రాని పండ్లు ముంచెత్తడానికి కారణమైంది. ఇదీ చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్ధరలు డౌన్.. సేల్స్ అప్.. నగరంలోని మామిడి కేంద్రమైన బాటసింగారం, పీక్ సీజన్లో ప్రతిరోజూ 3,000 నుంచి 5,000 క్వింటాళ్ల పండ్ల క్రయవిక్రయాలు నిర్వహిస్తోంది. సగటు ధరలు క్వింటాకు రూ.2,345గా ఉన్నాయి. మరో మార్కెట్ అయిన జాంబాగ్, సీజన్ ప్రారంభ రోజుల్లో 500–800 క్వింటాళ్లు ఏప్రిల్‌లో 1,000–1,500 క్వింటాళ్లు ప్రాసెస్ చేస్తుంది. రిటైల్ మార్కెట్ విషయానికి వస్తే సీజన్ ప్రారంభంలో పండ్ల ధరలు కిలో రూ.200, రూ.400 వరకూ పలికాయి. అయితే రానురానూ తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం మామిడి విక్రయాలు బాగా ఊపందుకున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ధరలు స్థిరంగా ఉన్నాయి. రకాన్ని బట్టి కిలోకు రూ.70 నుంచి రూ.200 వరకూ ఉన్నాయి. చదవండి: వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదాపచ్చడి మామిడిదీ అదే దారి..‘గతానికి భిన్నంగా పచ్చడి, ఇతర అవసరాల కోసం కూడా సిటిజనులు ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తుండడం కనిపిస్తోంది. ‘ఈ సీజన్లో పచ్చి మామిడి పండ్ల అమ్మకాలు రోజుకు 30–40 సంచుల నుంచి 20 సంచులకు తగ్గాయి. దీనికి కారణం నగరవాసులు నేరుగా ఆంధ్రాకు వెళ్లి తెచ్చుకోవడమే.. లేకుంటే ఆన్లైన్లోనే పచ్చళ్లు ఆర్డర్ చేస్తున్నారు’ అని కూకట్పల్లి రైతుబజార్లో పండ్ల దుకాణం యజమాని పవన్ చెబుతున్నారు. ఊరగాయల కోసం టాంజీ, తెల్లగులాబి, షెల్ఫ్ లైఫ్ కోసం కొత్తపల్లి కొబ్బరి, సీజన్ చివరి రుచి కోసం జలాలు.. వంటివన్నీ నూజివీడు, కాకినాడ, విజయవాడ నుంచి వస్తాయి. ఆర్గానిక్.. ఆన్లైన్లో క్లిక్.. కృత్రిమంగా పండించడం గురించిన ఆందోళనలు నగరవాసుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇది కొత్త కొత్త విక్రయ మార్గాలను తెరుస్తోంది. అదే క్రమంలో పొలం నుంచి నేరుగా ఇంటికి వచ్చే ప్రత్యామ్నాయాలను ఇష్టపడే వినియోగదారులు కూడా పుట్టుకొచ్చారు. పెరిగిన డిమాండ్‌తో రిటైల్ దుకాణాలు సేంద్రీయ బంగినపల్లి రకాన్ని కిలోకు రూ.150 నుంచి రూ.400 చొప్పున విక్రయిస్తుండగా ఆన్లైన్లో అంతకన్నా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఆన్లైన్ స్టోర్ నడుపుతున్న రాఘవేంద్ర, తాను 2011లో ఆన్లైన్లో మామిడి పండ్లను అమ్మడం ప్రారంభించానని అంటున్నారు. ఆయన సదాశివపేట, షామిర్‌పేట నుంచి మామిడి పండ్లను సేకరించి నగరంలోని ఇళ్లకు డెలివరీ చేస్తున్నాడు. ఇతర నగరాలకు ఆర్డర్లు కార్గో బస్సుల ద్వారా సరఫరా చేస్తున్నాడు. ‘ఆన్లైన్ సేవలు విశ్వసించగల సురక్షితమైన, సేంద్రీయ పండ్లను అందిస్తాయి’ అని అత్తాపూర్‌కు చెందిన కస్టమర్ తహ్సీన్ ఫర్హా అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ మార్కెట్ ఒకప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితం. ప్రస్తుతం సామాన్యులకు సైతం ప్రత్యేకమైన పండూరి వంటి తక్కువ–తెలిసిన రకాలను కూడా అందిస్తోంది.

Vishwanath Karthikey అమ్మమాటతో శిఖరాలకు, అరుదైన రికార్డు
సాధారణంగా స్కూల్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఎత్తయిన శిఖరాల గురించి చదువుకుంటుంటారు.. అయితే నగరానికి చెందిన పడకంటి విశ్వనాథ కార్తికే ఆ చిన్న ప్రాయంలోనే వివిధ ఖండాల్లోని, ప్రపంచంలోనే ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించడం ప్రారంభించాడు. ఈ అద్భుత ప్రయాణంలో విశ్వనాథ కార్తికే (Vishwanath Karthikey) తన 16 ఏళ్ల వయసులోనే 7 ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను (7 సమ్మిట్స్) అధిరోహించి చరిత్ర సృష్టించాడు. కార్తికే దేశంలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగానే కాకుంగా ప్రపంచంలో రెండో అతిచిన్న వయసు్కడిగా చరిత్ర సృష్టించాడు. – సాక్షి, సిటీబ్యూరో బాల్యం నుంచే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతారోహణ ప్రారంభించిన కార్తికే ఈ ఏడాది జనవరిలోనే దక్షిణ అమెరికాలోని అకోంకాగువా పర్వతాన్ని (6,961 మీ/22,838 అడుగులు) ఎక్కి తన ఆరవ ఎత్తయిన పర్వతారోహణను పూర్తి చేశాడు. ప్రస్తుతం తన పర్వతారోహణ ప్రయాణంలో కీలక లక్ష్యమైన మౌంట్ ఎవరెస్ట్ (8,848 మీ/29,029 అడుగులు)ను అధిరోహించి రికార్డు సృష్టించాడు. గతంలో అకోంకాగువా (దక్షిణ అమెరికా)తో పాటు ప్రపంచంలో ఎత్తయిన పర్వతాలైన డెనాలీ (ఉత్తర అమెరికా), కిలిమంజారో (ఆఫ్రికా), ఎల్బ్రస్ (యూరప్), విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా), కోసియస్కో (ఆస్ట్రేలియా)ను అధిరోహించాడు. చదవండి: పాపులర్ యూ ట్యూబర్ సీక్రెట్ వెడ్డింగ్ : స్టూడెంట్స్‌కి సర్ప్రైజ్అమ్మ మాటే ప్రేరణ..ఈ సాధన వెనుక ఉన్న శ్రమ, కృషి మాటల్లో చెప్పలేనిది. ‘ఈ ప్రయాణం నన్ను శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా పరీక్షించింది. ఎవరెస్ట్ శిఖరంపై నిలిచిన ఆ క్షణం, నా కల నిజమవుతున్న అనుభూతి ఇచ్చింది’ అని విశ్వనాథ్ కార్తికే తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఈ విజయం వెనుక తన కుటుంబం, తల్లిదండ్రులు పడకంటి రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి తన వెన్నుతట్టి ప్రోత్సహించారని పేర్కొన్నారు. ‘నీకు నచ్చింది చేస్తే.. జీవితం ఆనందంగా ఉంటుంది’ అని తల్లి చెప్పిన మాటలే ఆత్మస్థైర్యాన్నిచ్చాయని అన్నాడు. చదవండి: వోగ్ బ్యూటీ అవార్డ్స్: సమంతా స్టన్నింగ్ లుక్, ఫ్యాన్స్ ఫిదాఈ తరానికి స్పూర్తి.. ఈ పయనంలో విశ్వనాథ్‌కు శిక్షణ ఇచ్చిన కోచ్‌లు భరత్, లెఫ్టినెంట్ రోమిల్ బారాథ్వల్ (ఇండియన్ ఆర్మీ రిటైర్డ్) పాత్ర కీలకం. రోమిల్ స్వయంగా ఒక ప్రఖ్యాత పర్వతారోహకుడు. వీరి మార్గదర్శకత్వం విశ్వనాథ్‌కి పర్వతారోహణలో నైపుణ్యం, మానసిన దృఢత్వాన్ని అందించాయి. లక్ష్యాలను ఎంచుకుని, కష్టపడి సాధించగలిగే అనేకమంది యువతకు ప్రేరణగా నిలిచారు. పర్వతాలను అధిరోహించడం అంత సులభం కాదు. ఇది శరీరానికే కాదు, మనసుకు కూడా పరీక్షే. కానీ తాను 16 ఏళ్ల వయసులో ఈ ప్రయాణం పూర్తి చేయడం విశేషం.

అంధత్వం కాదు అక్షర బంధుత్వం..
అక్షరం ఆయుధమే కాదు చీకటి నుంచి వెలుగులోకి తీసుకువెళ్లే కాంతిపుంజం. ‘నేను అంధురాలిని’ అని ఎప్పుడూ నిరాశపడలేదు సాయిజ్యోతి. ఆమె ఉత్సాహం పేరు... అక్షరం. ఆమె శక్తి పేరు... పుస్తకం. గుంటూరు జిల్లా పాత మంగళగిరికి చెందిన చింతకింది సాయిజ్యోతి అంధుల్లో సానుకూల దృక్పథాన్ని కలిగించే లక్ష్యంతో కవితల నుంచి నవలల వరకు ఎన్నో ప్రక్రియలలో రచనలు చేస్తోంది...పదేళ్ల వయసు వచ్చేవరకూ లోకాన్ని అందరిలాగే చూసింది సాయిజ్యోతి. ఉపాధ్యాయులు చెప్పేది విని నోటు పుస్తకంలో రాసుకునేది. కానీ జన్మతః వచ్చిన లోపం కారణంగా ఆ తరువాత కంటిచూపును కోల్పోయింది. అప్పటివరకూ అందంగా కనిపించిన రంగుల ప్రపంచం ఒక్కసారిగా చీకటైపోయింది. స్థానిక విజయమేరి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో హైస్కూలు విద్య, హైదరాబాద్‌లోని చిన్న జీయర్ స్వామి నేత్ర విద్యాలయంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. మంగళగిరిలో డిగ్రీ, నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జ్యోతి ప్రస్తుతం నూతక్కి జిల్లా పరిషత్ హైస్కూలులో జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం చేస్తోంది.అక్షరాల తోటలోకి...సాహిత్యంపై చిన్నప్పటి నుంచే సాయిజ్యోతికి ఆసక్తి ఉండటతో చిన్న చిన్న రచనలు చేసేది. ఆ తరువాత తన సాహిత్యానికి సోషల్ మీడియాను వేదిక చేసుకుంది. వివిధ సాహిత్య వేదికలకు చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లాంటి గ్రూపులతో పరిచయం అయింది. ‘చైత్రశ్రీ’ అనే కలం పేరుతో రచనలకు శ్రీకారం చుట్టింది. తొలి కవితా సంకలనం ‘కవితాంజలి’ ఈ ఏడాది వెలువడింది.తన జీవితమే తన నవల‘మంచు తాకిన ప్రేమ‘ నవలకు మంచి పేరు వచ్చింది. ‘ఎవరు అతను?’ పేరుతో రెండో నవల రాసింది. మూడవ నవల ‘అన్వేషిత’ తన జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకొని రాసింది. కుటుంబంలో ఒక అమ్మాయి అంధురాలిగా పుడితే ఆమెను కుటుంబం ఏ విధంగా చూసుకుంది? సమాజంలో తనని తాను ఏ విధంగా నిరూపించుకుంది? తోటి అంధులకు ఆమె ఏ విధంగా సహాయపడింది? స్ఫూర్తిని ఇచ్చింది? అంధుల జీవితం ఎలా ఉంటుంది.. మొదలైన అంశాలను తీసుకొని నవల రాసింది. అరవై భాగాలు ఉన్న ‘అన్వేషిత’ నవలను పుస్తక రూపంలోకి తీసుకు రానున్నారు. ఇవేకాక ఏడు చిన్న కథలు, ఆరు పాటలు రాసింది. అవి స్నేహితుల ద్వారా యూ ట్యూబ్ వరకూ చేరి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.అందుకోసమే నా రచనలుసానుకూల దృక్పధాన్ని ఎలా అలవర్చుకోవాలి, ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలిలాంటి అంశాలే నా రచనకు మూలం. సమస్యలకు కుంగిపోకుండా పరిష్కారాలను అన్వేషించాలని నేను గట్టిగా నమ్ముతాను. సమాజంలో అంధుల పట్ల ఉన్న ఆలోచన ధోరణిని మార్చాలనేది నా ప్రయత్నం. అందుకోసమే రచనలు చేస్తున్నాను. అద్బుత విజయాలు సాధించడానికి అంధత్వం అడ్డుకాదని చరిత్ర నిరూపించింది. నిరూపిస్తూనే ఉంది. – చింతకింది సాయిజ్యోతి – బోణం గణేష్, సాక్షి, అమరావతి(చదవండి: ఇద్దరు పిల్లలున్న అమ్మలకు గుడ్‌న్యూస్..! ఇక నుంచి..)

డిష్ వాష్‌బార్‌లతో చేతులు పాడవ్వుతున్నాయా..?
మార్కెట్లో దొరికే డిష్ వాష్బార్లు, లిక్విడ్లు మన చేతులకు హాని చేస్తాయి. రసాయనాలతో తయారయ్యే ఈ వాష్బార్లు మన చర్మంలోని తేమని హరించి వేసి వివిధ రకాల చర్మసమస్యలకు దారి తీస్తాయి. అందువల్ల వీటికి ప్రత్యామ్నాయంగా గంజినీళ్లు, బేకింగ్ సోడా, నిమ్మరసాన్ని గిన్నెలు తోమడానికి వాడుకోవచ్చు. అవేంటో చూద్దాం...వెనిగర్‌లో పదినిమిషాలు గిన్నెలను నానబెట్టి తరువాత కొబ్బరిపీచుతో బేకింగ్ సోడాని అద్దుకుని తోమితే చక్కగా శుభ్రపడతాయి.గంజినీళ్లలో బేకింగ్ సోడా వేసి పదినిమిషాలు ఉంచాలి. తరువాత ఈ నీటితో గిన్నెలను తొమితే మురికితోటు, జిడ్డు కూడా పూర్తిగా పోతుంది.బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో గిన్నెలు తోమితే మురికి వదలడమే గాక మంచి వాసన కూడా వస్తాయి.గోరంత అందం..గోళ్ల రంగుని శుభ్రంగా తొలగించి.. గోరువెచ్చని జొజోబా నూనెను గోళ్లమీద, చుట్టూ్ట ఉన్న చర్మంపైన వేసి గుండ్రంగా మర్దన చేయాలి. దీనివల్ల గోళ్లకు రక్త సరఫరా జరిగి చక్కగా పెరుగుతాయి. రాత్రి పడుకునే ముందు మర్ధన చేసి ఉదయం కడిగేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల గోళ్లు అందంగా పెరుగుతాయి. (చదవండి: ఈతరంలో కొరవడుతున్న కనీస జీవన నైపుణ్యాలివే..!)
ఫొటోలు


జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)


కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)


మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)


పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సందర్శించారా? (ఫొటోలు)


NTR Jayanthi : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి (చిత్రాలు)


వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)


భర్త బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)


మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)


సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)


ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)
అంతర్జాతీయం

ఎలాన్ మస్క్.. స్టార్ షిప్ ప్రయోగం విఫలం
టెక్సాస్: బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన స్టార్ షిప్ రాకెట్ మరోసారి పేలిపోయింది. టెక్సాస్‌లోని స్పేస్ ఎక్స్ నుంచి ప్రయోగించిన స్టార్ షిప్ విఫలమైంది. స్టార్‌షిప్ రాకెట్ ఇలా పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం.. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సుదూర అంతరిక్ష యాత్రల కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన స్టార్ షిప్ ప్రయోగం మరోసారి విఫలమైంది. టెక్సాస్‌లోని స్పేస్ ఎక్స్ నుంచి ప్రయోగించిన స్టార్ షిప్ తొమ్మిదో ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా చివరి దశలో ఇంధనం లీక్ కావడంతో నియంత్రణ కోల్పోయింది. తొలుత ఇది విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లినా.. దాదాపు అరగంట తర్వాత అది గాల్లోనే పేలిపోయింది. దీంతో, స్టార్ షిప్ శకలాలు సముద్రంలో పడిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.Starship Flight 9: Ship 35 has lost attitude control. pic.twitter.com/GLEg2cQx12— NSF - NASASpaceflight.com (@NASASpaceflight) May 28, 2025#STARSHIP 🙆🏻♂️🫵🏻 pic.twitter.com/RKjHaZK2p8— ChrisRetro (@BlanquitoPerla_) May 28, 2025Pretty excellent melting shot in the last moments of Starship pic.twitter.com/vebHysj6XE— johnboiles (@johnboiles) May 28, 2025the remnants of starship 9 burning up on re-entry 🥹 so hauntingly beautiful to witness. pic.twitter.com/IddJTXWpVz— All day Astronomy (@forallcurious) May 28, 2025

ట్రంప్ మరో సంచలనం.. విద్యార్థి వీసా ఇంటర్వూలకు బ్రేక్
వాషింగ్టన్: అమెరికాలో విద్యాభ్యాసానికి సంబంధించి విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపేయాలని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో అమెరికా వ్యతిరేక, హమాస్ అనుకూల భావజాలం పెరిగిపోతోందన్న ట్రంప్ ప్రభుత్వం ఆందోళనల నడుమ విదేశాంగ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇక, ఇప్పటికే షెడ్యూలింగ్ అయిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను కొనసాగించవచ్చని, ఈరోజు నుంచి కొత్త ఇంటర్వ్యూలను షెడ్యూలింగ్ చేయొద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు అత్యయిక ఉత్తర్వుపై మార్కో రూబియో సంతకం చేశారు. విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందించిన వివరాలతో వారి సోషల్‌మీడియా అకౌంట్లలో అమెరికా వ్యతిరేక భావజాలం తాలూకు వివరాలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగ నిపుణులు విశ్లేషించచనున్నారు. ఎఫ్, ఎం, జే కేటగిరీ దరఖాస్తుల సోషల్‌మీడియా ఖాతాల పాత పోస్ట్‌లు, వ్యాఖ్యానాలను అధికారులు నిశితంగా గమనించనున్నారు.అమెరికా వ్యతిరేక ధోరణి ఎవరి సోషల్‌మీడియా ప్రొఫైల్, హిస్టరీలో కనిపిస్తే వారిని ఇంటర్వ్యూలదాకా రానివ్వకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విదేశీ విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిచిపోవడంతో స్టూడెంట్ వీసాల జారీ ప్రక్రియ మరింత ఆలస్యంకానుంది. అంతర్జాతీయ విద్యార్థుల చేరిక, వారి ట్యూషన్ ఫీజులపై ఆధారపడిన పలు అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆర్థిక కష్టాలు మరింత ఎక్కువ కానున్నాయి. విదేశీ విద్యార్థుల అమెరికా కల సైతం కాస్తంత చెదిరిపోయే ప్రమాదం పొంచి ఉంది. క్లాసులు డుమ్మా కొడితే వీసా రద్దు.. ఇదిలా ఉండగా.. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరగతులకు డుమ్మా కొట్టినా లేక కోర్సులు మధ్యలో వదిలేసినా వీసా రద్దు కావడం ఖాయం. భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా ఉండదు. విద్యాసంస్థకు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తరగతులకు గైర్హాజరు కావడం లేదా కోర్సును మధ్యలోనే వదిలేయడం వంటివి చేస్తే విద్యా వీసా రద్దవుతుందని ఇండియాలోని అమెరికా ఎంబసీ తేల్చి చెప్పింది. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. వీసా నిబంధనలకు ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టుబడి ఉండాలని తేల్చి చెప్పింది. అమెరికాలో చదువుకుంటున్న కాలంలో సమస్యలేవీ రాకుండా ఉండాలంటే స్టూడెంట్ స్టేటస్ కోల్పోకుండా జాగ్రత్తపడాలని పేర్కొంది. అమెరికాలో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతిఏటా వీరి సంఖ్య పెరుగుతోంది.

ఎవరెస్ట్ మాన్ కొత్త రికార్డు
కఠ్మాండు: ఎవరెస్ట్ మాన్‌గా పేరు తెచ్చుకున్న నేపాలీ పర్వతారోహకుడు 55 ఏళ్ల కామి రీటా కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోకెల్లా ఎత్తైన ఆ శిఖరాన్ని 31వసారి అధిరోహించాడు. ఎవరెస్టును అత్యధికసార్లు అధిరోహించిన వ్యక్తిగా సొంత రికార్డునే బద్దలు కొట్టారు. భారత సైనికాధికారుల బృందానికి మార్గనిర్దేశం చేస్తూ మంగళవారం తెల్లవారుజా మున 4 గంటలకు కామి ఎవరెస్టును అధిరోహించాడు. కామి నేపాల్‌లోని సోలుకుంబ్ సమీపంలోని థామే గ్రామంలో జన్మించాడు. తన జీవితాన్ని పర్వతారోహణకే అంకితం చేశాడు. 1994లో ఒక వాణిజ్య యాత్రకు మార్గదర్శకునిగా తొలిసారి ఎవరెస్టును అధిరోహించారు.అప్పటి నుంచి దాదాపు ఏటా ఆ ఘనత సాధిస్తూ వచ్చారు. 2023, 2024ల్లోనైతే రెండేసిసార్లు ఎక్కారు. మరో నేపాలీ షెర్పా పసంగ్ దావా 29సార్లు ఎవరెస్టును ఎక్కారు. ‘‘నారికార్డులతో సంతోషంగా ఉన్నా. కానీ రికార్డులు చివరికి బద్దలవుతాయి. నా రికార్డులు ప్రపంచ వేదికపై నేపాల్ గుర్తింపుకు దోహదపడటం సంతోషంగా ఉంది’’ అని కామి అన్నాడు. బ్రిటిష్ పర్వతారోహకు డు కెంటన్ కూల్ ఇటీవలే 19వసారి ఎవరెస్టు ఎక్కారు.దాన్ని అత్యధికసార్లు అధిరోహించిన షెర్పాయేతర వ్యక్తిగా స్వీయ రికార్డునే బద్దలు కొట్టారు. ఎవరెస్టు ఎక్కే సీజన్ త్వరలో ముగియనుంది. ఈ ఏడాది 500 మందికి పైగా ఎవరెస్టును విజయవంతంగా అధిరోహించారు. ఎవరెస్ట్ తో సహా పలు ఇతర శిఖరాలను ఎక్కడానికి నేపాల్ ఈ సీజన్లో 1,000కి పైగా పర్మిట్లు జారీ చేసింది. ఇటీవల ఎవరెస్ట్ ఎక్కేవారి సంఖ్య పెరగడం పర్యావరణ ఆందోళనలకు దారితీసింది.

బంగ్లాలో నిరసనల హోరు
ఢాకా: బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతోంది. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సర్కారుపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే సైన్యం నుంచి తీవ్ర రాజకీయ ఒత్తిడి ఎదుర్కొంటున్న సర్కారుకు ఇది రోకటిపోటుగా పరిణమించింది. పౌర సేవకుల సమ్మె నాలుగో రోజుకు చేరగా వేతన పెంపు డిమాండ్‌తో టీచర్లు కూడా నిరసన బాట పట్టారు.వారు వేల సంఖ్యలో నిరవధిక సమ్మెకు దిగారు. మే 5 నుంచి పాక్షికంగా పని చేస్తున్నవారు కూడా సోమవారం నుంచి పూర్తిగా విధులు నిలిపేశారు. దీనిపై యూనస్ సర్కారు మండిపడింది. ఆందోళనలను తక్షణం కట్టిపెట్టాలంటూ సోమవారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వ చర్యపై ఉద్యోగులు మరింత మండిపడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విస్తరిస్తామని హెచ్చరించారు.రాజకీయ గందరగోళంకొన్ని వారాలుగా యూనస్ ప్రభుత్వం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో పడిపోయింది. భారత్‌లో ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ప్రజల్లో అశాంతి పెరిగింది. వచ్చే డిసెంబర్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ పట్టుబడుతుండగా 2026 జూన్‌కు ముందు కుదరదని సర్కారు అంటోంది.మరోవైపు కీలక సంస్కర ణలకు పార్టీలు మద్దతివ్వకపోవడంతో యూనస్ అలిగా రు. రాజీనామా చేస్తానని బెదిరించినా తర్వాత వెనక్కు తగ్గారు. అధికారాన్ని నిలుపుకోవడానికే తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలను ఆలస్యం చేస్తోందంటూ బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఢాకాలో భారీ నిరసనలకు దిగింది. దాంతో యూనస్‌కు మద్దతుగా ఆయన అనుయాయులు విద్యార్థుల సారథ్యంలో మే 24న మార్చ్ నిర్వహించారు.
జాతీయం

రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్
సాక్షి,ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారీ ఎత్తున పాకిస్తాన్ తన సైన్యాన్ని భారీ ఎత్తున మొహరించింది. దీంతో భారత్ అప్రమత్తమైంది. రేపు (మే29న) పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూలో మాక్ డ్రిల్‌ను నిర్వహించనుంది. అయితే, మాక్ డ్రిల్ జరిగే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లను పూర్తి చేసింది. The grand welcome for the #PakistanArmy in Pakistan Occupied Jammu & Kashmir. pic.twitter.com/znELGTYUN7— Lt Col Vikas Gurjar 🇮🇳 (@Ltcolonelvikas) May 27, 2025 ఇదే తరహా మాక్ డ్రిల్ ఈ నెల ప్రారంభంలో జరిగింది. ఏప్రిల్ 22న మినీ స్విట్జర్లాండ్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ మే 6, 7 తేదీల మధ్య పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించింది. BIG BREAKING NEWS 🚨 India to conduct mock drills tomorrow in 4 states, UT.Mock drills will be conducted in Gujarat, Rajasthan, Punjab, and Jammu and Kashmir tomorrow.The drills will be held in districts bordering Pakistan.This comes weeks after India launched ‘Operation… pic.twitter.com/GbWJkDB1nr— Times Algebra (@TimesAlgebraIND) May 28, 2025 భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు, మే 7న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్‌ను నిర్వహించించింది. ఆపరేషన్ అభ్యాస్ కొన్ని వారాల తర్వాత ఈ గురువారం పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మరోసారి కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది. కాగా, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరడంతో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించడమే మాక్ డ్రిల్ ఉద్దేశం. ఇటీవల పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన మిలటరీ ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్ ముందు కంటే 1971లో పాకిస్తాన్‌తో పోరాడాల్సి రావడం, అంతకుముందు 1962,1965 యుద్ధ సమయంలో మాక్ డ్రిల్ జరిగింది. మళ్లీ దాదాపూ 50ఏళ్ల తర్వాత పౌరుల భద్రత దృష్ట్యా కేంద్రం ఆపరేషన్ సిందూర్‌కు ముందు మాక్ డ్రిల్స్ చేపట్టింది.

గులాం నబీ ఆజాద్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, డెమోక్రటిక్ ప్రోగ్రసీవ్ ఆజాద్ పార్టీ చీఫ్, మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు. ఎంపీ బృందంతో సౌదీ పర్యటనలో ఉన్న ఆజాద్ అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ జయంత్ పాండా వెల్లడించారు.వివరాల ప్రకారం.. ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్‌ను ఎండగట్టేందుకు వివిధ పార్టీల ఎంపీల నాయకత్వంలోని బృందాలు ప్రపంచదేశాలకు వెళ్లాయి. బీజేపీ నేత బైజయంతి పాండా నేతృత్వంలోని బృందం బహ్రెయిన్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా బృంద సభ్యుల్లో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సౌదీలో పర్యటిస్తున్న సందర్బంగా ఆజాద్ అస్వస్థతకు గురయ్యారు.అనంతరం, ఆజాద్‌కు రియాజ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ బైజయంతి పాండా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ క్రమంలో ఆజాద్ ఆరోగ్యం.. ఇప్పుడు స్థిరంగా ఉంది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కొన్ని టెస్టులు చేయాల్సి ఉంది. సౌదీ పర్యటనలో ఉండగా ఆయన అనారోగ్యనికి గురి కావడం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఆయన సహాకారంతో ఇప్పటి వరకు బహ్రెయిన్, కువైట్లలో జరిగిన పర్యటనలు పూర్తిగా ఫలవంతమయ్యాయి. అల్జీరియా పర్యటనలో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చారు.Halfway into our delegation's tour Ghulam Nabi azad has had to be admitted to hospital.His contributions to the metin Bahrain.Kuwait were highly impactful.he is disappointed at being bedridden.We will deeply miss his presence in Saudi Arabia,Algeria BJP MP Jay Panda @asadowaisi pic.twitter.com/YMDD4Qruch— Mohd Ateeq (@MohdAte48016039) May 27, 2025

OP Sindoor: పాక్ ఎయిర్‌బేస్‌పై భారత్ గట్టి దెబ్బ
పహల్గాం దాడికి ప్రతీకారంగా.. ఉగ్ర శిబిరాల నాశనమే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు సంబంధించి తాజాగా మరికొన్ని చిత్రాలు బయటకు వచ్చాయి. ఇందులో పాకిస్థాన్‌లోని మురిద్ వైమానిక స్థావరంపై జరిగిన దాడికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు ఉన్నాయి.తాజా శాటిలైట్ ఫొటోల ప్రకారం.. మురిద్ ఎయిర్‌బేస్(Murid Airbase) లోని ఒక కీలకమైన కమాండ్ అండ్ కంట్రోల్ భవనంపై భారత వైమానిక దళం కచ్చితమైన దాడి జరిపింది. అందులో ఆ భవనం దెబ్బతిన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘భవనం పైకప్పులోని ఒక భాగం కూలిపోయింది. తద్వారా బిల్డింగ్ లోపల కూడా నష్టం జరిగే అవకాశం లేకపోలేదు’’ జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. మే 23న తీసిన ఈ చిత్రాలను 'ది ఇంటెల్ ల్యాబ్'కు డామియన్ సైమన్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.This report spotlights damage at Pakistan’s Murid Airbase - the Indian Air Force strike has caused structural damage to a Command & Control building, a section of the roof has collapsed as well, likely causing internal damage @TheIntelLab #Skyfi pic.twitter.com/k7O4FO0tKS— Damien Symon (@detresfa_) May 26, 2025 ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నా సమయంలో.. జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు(Pahalgam Terror Attack). ఈ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే 7న ‘‘ఆపరేషన్ సిందూర్’’ను భారత్ ప్రారంభించింది. ఇందులో భాగంగా.. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత దళాలు దాడులు చేసి నాశనం చేశాయి.మురిద్ కీలకమేఆపరేషన్ సిందూర్‌లో భాగంగా.. భారత సాయుధ దళాలు పాక్ పంజాబ్‌లోని రఫీకి, మురిద్, నూర్ ఖాన్, చునియన్‌తో పాటు సుక్కూర్‌లోని వైమానిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. ఇందులో మురిద్ వైమానిక స్థావరం, భారత్‌తో సరిహద్దు ప్రాంతంలో పాక్‌కు ఎంతో కీలకమైనది. ఇక్కడ అనేక అత్యాధునిక ఫైటర్ జెట్లు, డ్రోన్లు మోహరించి ఉన్నాయి. ఈ స్థావరంలో పాకిస్థాన్‌కు చెందిన షాపర్ 1, షాపర్ 2, బుర్రాక్, ఫాల్కో, బేరక్తార్ టీబీ2ఎస్, బేరక్తార్ అకింజీ, సీహెచ్-4, వింగ్ లూంగ్ 2 వంటి అత్యాధునిక డ్రోన్లు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ దాడి పాకిస్థాన్ సైనిక సామర్థ్యానికి గట్టి దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.A review of Nur Khan Airbase, Pakistan reveals the entire complex near India's strike location has now been demolished, suggesting the strike’s effect went beyond the two special-purpose trucks - possibly presenting a broader footprint of the damage @TheIntelLab #SkyFi pic.twitter.com/gUhqG3nemL— Damien Symon (@detresfa_) May 25, 2025ఇక.. ఆపరేషన్ సిందూర్ తర్వాత అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి భారత నగరాలపై పాకిస్థాన్ రెచ్చగొట్టే దాడులకు పాల్పడటంతో ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర స్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. మే 12న కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ, కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో.. భారత్ దౌత్య యుద్ధం ప్రారంభించింది. పాక్ సీమాంతర ఉగ్రవాదంపై పోరును ప్రపంచదేశాలకు తెలియజేసేందుకు ప్రత్యేక బృందాలను విదేశాలకు పంపింది.మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించిన ఆర్మీ చీఫ్భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) ఉత్తర ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు వెళ్లారు. అక్కడ దేశీయంగా రూపొందించిన మానవ రహిత వైమానిక వ్యవస్థను పరిశీలించారు. శత్రు దేశాలు ప్రయోగించే మానవ రహిత వైమానిక వ్యవస్థను అడ్డుకోవడానికి సరికొత్త డ్రోన్లు, ఆయుధాలను భారత్ రూపొందించింది.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్

కన్నడ, తమిళ భాషపై కమల్ వ్యాఖ్యలు.. కర్ణాటకలో దుమారం
చెన్నై: కన్నడ భాషకు తమిళమే మాతృక అంటూ ప్రముఖ నటుడు కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కమల్ వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. కమల్ కార్యక్రమానికి కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఆదివారం చెన్నైలో జరిగిన తన సినిమా థగ్‌లైఫ్ ఆడియో విడుదల వేడుకలో కమల్ హాసన్, శివరాజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కమల్ మాట్లాడుతూ.. కన్నడ భాషకు తమిళమే మాతృక. ఇక్కడ ఉన్నది నా కుటుంబం. అందుకే ఆయన (శివరాజ్ కుమార్) ఇక్కడకి వచ్చారు. అందుకే నా జీవితం, బంధం, తమిళ్ అని మొదలుపెట్టాను. మీ భాష (కన్నడ) తమిళం నుంచి పుట్టింది కాబట్టి మీరు కూడా దానిలో భాగమే’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో కమల్ వ్యాఖ్యలను పలు కన్నడ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. లేదంటే కర్ణాటకలో కమల్ సినిమాలను బహిష్కరిస్తామని కన్నడ రక్షణ వేదిక హెచ్చరించింది. బెంగళూరు వ్యాప్తంగా థగ్‌లైఫ్ సినిమా బ్యానర్లను నిరసన కారులు చించేశారు. ఆ సినిమాను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బెంగళూరులో జరిగిన థగ్‌లైఫ్ ప్రీ రిలీజ్ కార్యక్రమ వేదిక వద్ద భారీ సంఖ్యలో గుమిగూడారు. కమల్‌పై నల్ల ఇంకు పోస్తామంటూ హెచ్చరించారు. తమకు భయపడి ఆయన వేడుకకు గైర్హాజరయ్యారని ఎద్దేవా చేశారు.Kamal Haasan says Kannada came from TamilHello @ikamalhaasan before making such claims, learn some real history. This land doesn’t need language lessons from Periyar fanatics🤡Kannada has a history spanning over 2,000 years, one of the world’s oldest living languages, with… pic.twitter.com/BQFUloI0Sg— Akshay Akki ಅಕ್ಷಯ್🇮🇳 (@FollowAkshay1) May 27, 2025మరోవైపు.. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప, తదితరులు కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విజయేంద్ర యడియూరప్ప స్పందిస్తూ..‘కమల్ హాసన్ సంస్కారం లేని వ్యక్తి. కన్నడ భాషను అవమానించారు. మాతృ భాషను ప్రేమించడం మంచిదే కానీ, ఇతర భాషలను అవమానించడం సంస్కారం కాదు. కన్నడ, సహా అనేక భారతీయ భాషల్లో నటించిన కమల్ హాసన్, తన ప్రసంగంలో తమిళాన్ని గొప్పగా చెబుతూ శివరాజ్‌కుమార్‌ను అందులో భాగం చేయడం కన్నడను అవమానించడమే కాదు.. అహంకారం ఉన్నట్టు స్పష్టమవుతోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ಮಾತೃಭಾಷೆಯನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು, ಆದರೆ ಅದರ ಹೆಸರಿನಲ್ಲಿ ದುರಭಿಮಾನ ಮೆರೆಯುವುದು ಸಂಸ್ಕೃತಿ ಹೀನ ನಡವಳಿಕೆಯಾಗುತ್ತದೆ. ಅದರಲ್ಲೂ ಕಲಾವಿದರಿಗೆ ಪ್ರತಿಯೊಂದು ಭಾಷೆಯನ್ನೂ ಗೌರವಿಸುವ ಸಂಸ್ಕಾರ ಇರಬೇಕು. ಕನ್ನಡವೂ ಸೇರಿದಂತೆ ಅನೇಕ ಭಾರತೀಯ ಭಾಷೆಗಳಲ್ಲಿ ನಟಿಸಿರುವ ನಟ @ikamalhaasan ತಮ್ಮ ತಮಿಳು ಭಾಷೆಯನ್ನು ವೈಭವಿಕರಿಸುವ ಮತ್ತಿನಲ್ಲಿ ನಟ… pic.twitter.com/PrfKX099lZ— Vijayendra Yediyurappa (@BYVijayendra) May 27, 2025
ఎన్ఆర్ఐ

వైఎస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ సమావేశంలో ఆలూరు సాంబశివారెడ్డి
వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను అడ్డుకుంటూ.. సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేద్దామని ఆ పార్టీ ఎన్నారై గ్లోబల్ వింగ్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆక్లాండ్ (న్యూజిలాండ్)లోని మౌంట్ రోస్కిల్ వార్ మెమోరియల్ హాల్లో గ్లోబల్ కనెక్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై సోషల్ మీడియా పోస్టింగ్‌లు.. ఇప్పుడు ప్రజలకు నిజం చెప్పే ఆయుధాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పడంతో పాటు.. వైఎస్ జగన్ అందించిన సుపరిపాలన, నాయకత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు. నిజం మాట్లాడే గొంతులుగా, అభివృద్ధిని ప్రదర్శించే వేదికలుగా ఎన్నారైలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ యెద్దుల, బుజ్జె బాబు నెల్లూరి, సమంత్ డేగపూడి, విజయ్ అల్లా, బాల శౌర్య, రాజా రెడ్డి, గీతారెడ్డి, సంకీర్త్ రెడ్డి, రమేశ్ పానాటి, జిమ్మీ, బాలవేణు బీరం, కృష్ణారెడ్డి, జగదీశ్వరరెడ్డి, రఘునాథరెడ్డి, గోవర్ధన్ మల్లెల తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తల కోం ఇక్కడ క్లిక్ చేయండిచదవండి: మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్

యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు
లండన్: ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. హౌస్ ఆఫ్ లార్డ్స్ గా పిలువబడే యూకే పార్లమెంట్ ఎగువ సభలో రోహాంప్టన్ విశ్వవిద్యాలయ చాన్సలర్, యూకే మాజీ మంత్రి బారోనెస్ వర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు.. ఈ కార్యక్రమానికి చిలీ, బెలిజ్ జపాన్ తదితర దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, రాయబారులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు.ఈ సందర్బంగా వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన కళాకారులు ప్రార్థన నృత్యం, మోహినీ అట్టం, కరగట్టం, మిథిలా, జిజియా నృత్యం, గోవా సాంగ్స్ తో అలరించారు. దీనిలో భాగంగా భారత మాజీ రాయభారి అభయకుమార్ రాసిన ఆన్ ఎర్త్ గీతానికి హైదరాబాద్‌కు చెందిన రాగసుధ వింజమూరి భరతనాట్యం ప్రదర్శించారు. ఇక చిలీ సంప్రదాయ నృత్యాన్ని డేనియల్ పెరెజ్ మున్స్టర్ ఆధ్వర్యంలో ఆ దేశ రాయబార కార్యాలయం అధికారులు ప్రదర్శించారు. దీనిలోభాగంగా బారోనెస్ వర్మ ప్రసంగిస్తూ.. సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంతో పాటు, అందులో శాంతిని పెంపొందించడానికి దోహద పడే అంశాల గురించి ప్రస్తావించారు. ఇందుకు వివిధ దేశాలకు చెందిన భిన్న సంస్కృతులను ఏకతాటిపై తీసుకురావడానికి చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఇది ప్రస్తుత సమాజంలో ఆహ్వానించదగ్గ పరిణామమని ఆమె స్పష్టం చేశారు.

డాక్టర్ సతీష్‌కు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు
ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ కత్తులకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు-2025 వరించింది. అమెరికాలో గ్లోబల్ హెల్త్‌కేర్ లీడర్స్ ఫౌండేషన్ వార్షిక లీడర్షిప్ గాలా 2025 నిర్వహించింది. ఇందులో భాగంగా డాక్టర్ సతీష్ కత్తుల సేవలను గుర్తించిన గ్లోబల్ హెల్త్‌కేర్ లీడర్స్ ఫౌండేషన్ ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ 2025 అవార్డును ప్రదానం చేసి సత్కరించింది.తన సేవలను గుర్తించి అవార్డును బహూకరించడం పట్ల డాక్టర్ సతీష్ కత్తుల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ తరపున చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. డాక్టర్ సతీష్ కత్తుల తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. 30 ఏళ్లుగా ఆయన అమెరికాలో వైద్య సేవలందిస్తున్నారు. డేటన్, ఒహియోలో నివసిస్తున్న డాక్టర్ సతీష్ కత్తుల ప్రఖ్యాత హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్. 2024- 2025 సంవత్సరానికి గాను అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్- AAPI కి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. జూలై 2024లో AAPI అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన భారత్‌లో మూడు ప్రధాన ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సమావేశాలకు నాయకత్వం వహించారు. AAPI నిర్వహించిన అనేక అంతర్జాతీయ ఆరోగ్య శిఖరాగ్ర సమావేశాలలో ఆంకాలజీ ట్రాక్స్‌కు అధ్యక్షత వహించారు.డాక్టర్ సతీష్ కత్తుల ఇటీవల జీవనశైలి మార్పులు, టీకాల ద్వారా క్యాన్సర్ నివారణపై దృష్టి సారించిన “స్టాప్ 3 అండ్ స్టార్ట్ 3” అనే పరివర్తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన నాయకత్వంలో, AAPI విద్య, స్క్రీనింగ్ మరియు రోగనిరోధకతలో సమగ్ర ప్రయత్నాల ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ -GAIMS తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.

అమెరికాలో ఘోరం : భారత సంతతి పర్వతారోహకుడి సహా ముగ్గురు దుర్మరణం
అమెరికాలోని వాషింగ్టన్లో పర్వతారోహణ చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డితో సహా ముగ్గురు పర్వతారోహకులు మరణించారు. అయితే, నాల్గవ సహచరుడు తీవ్రంగా గాయపడ్డాడు. పర్వతారోహణంపై ఆసక్తితో ఎంతో ఉత్సాహంగా మొదలైన వీరి ప్రయాణం విషాదాంతమైంది. దీంతో బాధిత కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.పశ్చిమ ఉత్తర అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ కాస్కేడ్స్ పర్వతాలపై ఈ ప్రమాదంచోటు చేసుకుంది. ఈ క్లైంబింగ్ ప్రమాదంలో మరణించిన ముగ్గురిలో భారత సంతతికి చెందిన టెక్కీ విష్ణు ఇరిగిరెడ్డి కూడా ఉన్నారు. సియాటిల్ నివాసి అయిన 48 ఏళ్ల విష్ణు తన ముగ్గురు స్నేహితులు టిమ్ న్గుయెన్ (63), ఒలెక్సాండర్ మార్టినెంకో (36) ఆంటన్ సెలిక్‌లతో (38), త్సేలిఖ్ లతో కలిసి శనివారం కాస్కేడ్స్‌లోని నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్ ప్రాంతాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని NBC న్యూస్ నివేదించింది. అయితే ఈ ఘోర ప్రమాదంనుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక అధిరోహకుడు త్సేలిఖ్,తన ముగ్గురు స్నేహితుల మరణానికి దారి తీసిన ప్రమాదం గురించి అధికారులకు తెలియజేయడానికి 64 కిలోమీటర్లు ప్రయాణించాడు. త్సేలిఖ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు ,అంతర్గత రక్తస్రావం, మెదడు గాయానికి చికిత్స పొందుతున్నాడు.అయితే పైకి ఎక్కుతున్నపుడు తుఫాను ప్రమాదాన్ని గుర్తించిన వీరు వెనక్కి తగ్గినప్పటికీ ఫలితం లేకపోయింది. కిందికి దిగుతున్న సమయంలో జట్టు యాంకర్ పాయింట్ విఫలం కావడంతో వారు 200 అడుగుల కిందకు పడిపోయారని క్లైంబింగ్ వెబ్సైట్ నివేదించింది. ఈ ప్రమాదంలోపై విష్ణు స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర విచారాన్ని వ్యకతం చేశారు. విష్ణు అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడని ప్రకృతిని బాగా ఇష్టపడేవారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు సియాటిల్‌లో అత్యంత నైపుణ్యమున్న టెక్నీషియన్లలో గొప్పవాడని, తనదైన విలువలతో జీవితాన్ని నిర్మించు కున్నాడంటూ కంట తడిపెట్టుకున్నారు. విష్ణు గౌరవార్థం అతని స్నేహితులు , కుటుంబ సభ్యులు రెండు లాభాపేక్షలేని సంస్థలకు విరాళాలు అందించనున్నారు. అలాగే మే 22 వరకు ఆ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వాలని వారు ఇతరులకు విజ్ఞప్తి చేశారు.విష్ణు గ్రేటర్ సియాటిల్ ప్రాంతంలోని టెస్ట్ పరికరాల తయారీ సంస్థ ఫ్లూక్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. విష్ణు గొప్ప టీం లీడర్ అనీ, ఆయన మరణం తీరని లోటు అంటూ కంపెనీ కూడా నివాళులర్పించింది. నార్త్ కాస్కేడ్స్‌లోని లిబర్టీ బెల్ సమూహంలోని గ్రానైట్ శిఖరం, నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్, అనుభవజ్ఞులైన పర్వాతారోహకులకు ప్రసిద్ధి చెందింది.
క్రైమ్

12 టీబీ డాటా డిలీట్ చేసి.. ఐఎస్ఐ ఏజెంట్లతో ముచ్చట్లు
పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసిందన్న అభియోగాలు ఎదుర్కొంటున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో.. తాజాగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పాక్ నిఘా సంస్థ.. కరడుగట్టిన ఐఎస్ఐ(Inter-Services Intelligence) అధికారులతో ఆమె నేరుగా పరిచయాలు కలిగి ఉందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.33 ఏళ్ల జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra) ఏమాత్రం భయం లేకుండా వాళ్లతో పరిచయాలు పెంచుకుంది. ఒకరి తర్వాత మరొకరితో మాట్లాడింది కూడా. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సందర్శన సందర్భంగా ఆమె వాళ్లను కలిసినట్లు తెలుస్తోంది. అయితే ఐఎస్ఐలో వాళ్లు ఏం పని చేసేవాళ్లో కనుగొనే పనిలో దర్యాప్తు అధికారులు తలమునకలయ్యారు. అంతకు ముందు..జ్యోతి వ్యక్తిగత డివైజ్‌లను(ఫోన్లు, ల్యాప్‌ట్యాప్) పోలీసులు సీజ్ చేశారు. ఆ డివైజ్‌ల్లో భారీగా మెసేజ్‌లు, డాటా డిలీట్ అయినట్లు గుర్తించారు. ఆ డిలీట్ డాటానే సుమారు 12 టీబీ(12 terabyte) దాకా ఉండొచ్చని తెలుస్తోంది. అందులోని సమాచారం ఈ కేసుకు ఉపకరించే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు రికవరీకి ప్రయత్నిస్తున్నారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) పేరిట భారత సైన్యం పాక్ భూభాగంతో పాటు పీవోకేలో వైమానిక దాడులు జరిపింది. ఆపై వారానికి(మే 15వ తేదీన ) యూట్యూబ్‌లో ట్రావెల్ వ్లోగింగ్ చానెల్ నడిపించే జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్‌కు గూఢచర్యం జరిపి ఉంటుందనే అనుమానిస్తున్నారు. పాక్, చైనాలో పర్యటనలతో పాటు పాక్‌లో జరిగిన హైప్రొఫైల్ ఈవెంట్లకు ఆమె హాజరు కావడం, కేవలం 4 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఆమె విచ్చలవిడిగా అక్కడ ఖర్చులు చేయడం, అలాగే గన్మెన్లతో వీవీఐపీ ట్రీట్మెంట్ పొందిందన్న విషయం వెలుగులోకి రావడంపై దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతానికి.. అఫీషియల్స్ సీక్రెట్స్ యాక్ట్, భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఆమెపై హర్యానా పోలీసులు కేసులు నమోదు చేశారు. పాక్‌లో ఆమె అసలు వీఐపీ ట్రీట్మెంట్ ఎందుకు పొందింది? ఎలా పొందగలిగింది? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అలాగే.. డిలీట్ చేసిన డాటాలో గనుక కీలక సమాచారం ఉన్నట్లయితే ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. ఆమె ఆర్థిక లావాదేవీలపై విచారణ కోసం పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థల సాయం కోరే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: విదేశీ భార్యల మోజు వద్దు!

మోసాలకు పాల్పడుతున్న యువతి అరెస్టు!
మిర్యాలగూడ అర్బన్: తాను డాక్టర్, ఐఏఎస్ అధికారిని అంటూ డబ్బున్న యువకులను గుర్తించి మోసాలకు పాల్పడుతున్న యువతిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. మిర్యాలగూడ మండలం లావుడితండాకు చెందిన ఓ యువతి కొంత కాలంగా డబ్బున్న యువకులను బ్లాక్మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఆమెపై మలక్‌పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్లగొండ టూటౌన్, మిర్యాలగూడ వన్‌టౌన్, నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజుల క్రితం యువతి మర్డర్ అంటూ హైదరాబాద్‌లోని ఓ డీఎస్పీకి, మిర్యాలగూడ సబ్‌డివిజన్ పరిధిలో ఓ సీఐకి ఫోన్‌చేసి స్వీచ్ ఆఫ్ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం ఓ వైద్యుడిని బెదిరించి అతడి నుంచి రూ.5లక్షలు వసూలు చేసి ఉడాయించినట్లు సమాచారం. ఇటీవల ఓ యువకుడిని డబ్బులు డిమాండ్ చేయడంతోపాటు డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించడంతో సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు యువతి బాగోతం వెలుగుచూడటంతో నివ్వెరపోయారు. యువతిని అరెస్టు చేసిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్ చేసినట్లు తెలిసింది.

విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. ఆ 20 మంది ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదం, పేలుళ్ల కుట్ర కేసులో విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఐదో రోజు పోలీస్ కస్టడీలో సిరాజ్, సమీర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. మరో 20 మంది సభ్యులు ఉన్నట్టు ధ్రువీకరించిన సిరాజ్, సమీర్.. ఆ 20 మంది పేర్లు తెలిసినా.. వారు ఎక్కడున్నారనేది చెప్పడం లేదు. ఆ 20 మంది కోసం తెలంగాణ పోలీసులు వేట మొదలుపెట్టారు. సిరాజ్ అరెస్ట్ తర్వాత విజయనగరంలో అదృశ్యమైన వారు ఎవరు?. హైదరాబాద్‌లో సమీర్ ఇంట్లో సమావేశమైన వారు ఇప్పుడు ఎక్కడ?’’ అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన సూత్రధారి సిరాజేనని, దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు వ్యూహరచన చేశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచారణలో తేలినట్టు సమాచారం. ఉగ్రవాద భావజాలం, పేలుడు పదార్థాలు కలిగిన హైదరాబాద్‌కు చెందిన సమీర్, విజయనగరం జిల్లా ఆబాద్‌వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్‌ను ఈ నెల 16న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు వీరిద్దరినీ వారం రోజులు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఎన్ఐఏ, స్థానిక పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.గత మూడురోజులుగా నోరు విప్పని సమీర్.. సోమవారం పలు విషయాలు బహిర్గతం చేసినట్టు సమాచారం. పేలుళ్లకు పథక రచన చేసింది సిరాజేనని చెప్పినట్టు తెలిసింది. అహీం గ్రూప్‌నకు అడ్మిన్ కూడా సిరాజ్ అని, అతనితోపాటు మరో 20 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని చెప్పినట్టు సమాచారం. సౌదీలో పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన సిరాజ్, హైదరాబాద్‌లో ఉంటూ తరచూ సౌదీతోపాటు ఓమెన్ దేశాలకు వెళ్లినట్టు ఎన్ఐఏ గుర్తించింది. వరంగల్‌కు చెందిన ఫర్హన్, ఢిల్లీకి చెందిన బాదర్, సౌదీకి చెందిన ఇమ్రాన్‌తో మిలాఖత్ అయ్యి పాకిస్థాన్‌కు చెందిన ఓ ముస్లిం సంస్థతో టై అప్ అయినట్టు సమాచారం. అహీం గ్రూప్ ద్వారా ఆ సంస్థతో సిరాజ్ సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది.

అమ్మా.. లేమ్మా.. ఇంటికెళ్దాం..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో విషాదం అలుముకుంది. కళ్ల ముందే కన్న తల్లి ప్రాణాలు పోతుంటే లోకం పోకడ తెలియని చిన్నారుల ఆర్తనాదాలు అందరినీ కదిలించాయి. తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించడం.. తండ్రి బతుకుదెరువు రీత్యా గల్ఫ్‌లో ఉండడంతో చిన్నారులు అనాథలయ్యారు. రాజన్నపేటకు చెందిన చొట్టి కీర్తన, మహేందర్ దంపతులకు ఇద్దరు కుమారులు అన్వేశ్(6), శివాన్‡్ష(3) ఉన్నారు. మహేందర్ ప్రస్తుతం గల్ఫ్‌లో ఉండగా.. కీర్తన తన ఇద్దరు కుమారులతో కలిసి పుట్టింటికి బయలుదేరింది. మాచారెడ్డిలో బస్సు దిగి తన తండ్రికి ఫోన్ చేసి తమను తీసుకుపోవడానికి ద్విచక్ర వాహనంపై రమ్మంది. మాచారెడ్డికి వచి్చన తండ్రి కూతురు కీర్తనతోపాటు ఇద్దరు మనుమళ్లను వాహనంపై ఎక్కించుకొని స్వగ్రామమైన లచ్చపేటకు వెళ్తుండగా.. లచ్చపేట మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీర్తన తీవ్ర గాయాలకు గురై మరణించింది. ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన తాతతోపాటు ఇద్దరు చిన్నారులు గాయాలకు గురయ్యారు. అమ్మా.. లేమ్మా.. గాయపడ్డ చిన్నారులు తల్లి వద్దకు వెళ్లి అమ్మా.. లేమ్మా.. అంటూ తట్టి లేపడం అక్కడున్న వారందరినీ కదిలించింది. వారి రోదనలు కట్టతడి పెట్టించాయి. కీర్తన మృతదేహాన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు గల్ఫ్‌లో ఉన్న మహేందర్‌కు సమాచారమందించారు. సంఘటనా స్థలానికి రాజన్నపేట మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ముక్క శంకర్ వెళ్లి క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వీడియోలు


Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం


విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై అవినాష్ రెడ్డి ఫైర్


కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు


Mahanadu: డ్వాక్రా సంఘాలకు బెదిరింపులు


ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్


మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదిక అంతా బూటకం: కేటీఆర్


సినిమాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు


రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి: YS జగన్


అల్లు అరవింద్ లీజు థియేటర్లన్నింటిలోనూ తనిఖీలు


కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...