Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Mahanadu Day 3 Updates: Even Police Faced Troubles In Mahanadu1
మహానాడు ఎఫెక్ట్‌.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: తెలుగు దేశం పార్టీ మహానాడు(TDP Mahanadu) కార్యక్రమం మాటేమోగానీ.. జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు జనాల్ని తరలించలేక, సభకు వచ్చినవాళ్లను నిలువరించలేక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తొలిరెండు రోజులు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడం, నేతలు మాట్లాడుతుండగానే మధ్యలో జనాలు వెళ్లిపోవడాన్ని సాక్షి హైలైట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడోరోజు మహానాడు బహిరంగ సభనైనా జనంతో నింపేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. మహానాడు సభ కోసం ఆర్టీసీ నుంచి భారీగా టీడీపీ బస్సులను వినియోగించుకుంటోంది. చాలా గ్రామాలకు ఉదయమే బస్సులు చేరుకుని జనాల్ని తరలిస్తున్నాయి. దీంతో డిపోల్లో బస్సుల్లేక.. సరిపడా బస్సుల్లేక గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు అగచాట్లు పడుతున్నారు. చాలా బస్టాండుల్లో బస్సుల్లేవ్‌ అనే బోర్డులు సైతం దర్శనమిస్తుండడం గమనార్హం. నంద్యాల జిల్లా నుంచి, శ్రీశైలం నుంచి మహానాడు కోసం బస్సులు తరలించారు. ఆత్మకూరు డిపోలో బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు.. కడప మహానాడు (Kadapa Mahanadu)ను ఎలాగైనా ‘సక్సెస్‌’ చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జనసేకరణ చేపట్టింది. అన్నమయ్య జిల్లాలో మహానాడు కోసం ఓబులవారిపల్లి హరిజన వాడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే.. అది బలవంతపు తరలింపు అని ఇప్పుడు తేలింది. డ్వాక్రా మహిళలు మహానాడుకు కచ్చితంగా రావాలని, సమావేశానికి రాకపోతే లోన్లు ఇవ్వమంటూ బెదిరించిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది.మహానాడు కారణంగా చివరకు పోలీసులు(AP Police) సైతం పడుతున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేయించుకుంది టీడీపీ. అయితే కనీసం తిండి కూడా పెట్టడం లేదంటూ ఓ ఎస్సై పడిన ఆవేదన వీడియో రూపేణా బయటకు వచ్చింది. మహానాడులో రకరకాల రుచులతో భోజనాలు ఘనంగా పెడుతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ఎంతలా ప్రచారం చేసుకుందో తెలిసిందే. కానీ, తాము ఏ పూట వెళ్లినా తమకు తిండి మాత్రం దొరకడం లేదని ఆయన అక్కడికి వచ్చిన వాళ్లకు చెప్పుకుంటూ వాపోయారు. ఇదీ చదవండి: మహానాడులో ఎన్టీఆర్‌ స్పీచ్‌.. నవ్వుకున్న టీడీపీ కార్యకర్తలు

YS Jagan Family Participated In Raja Reddy Jayanthi Celebrations2
వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి.. నిర్మలా శిశు భవన్‌కు వైఎస్‌ జగన్‌ దంపతులు

సాక్షి, విజయవాడ: నేడు దివంగత మహానేత వైఎస్సార్‌ తండ్రి, దివంగత వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్‌ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.వైఎస్‌ రాజారెడ్డి జయంతి నేపథ్యంలో సతీసమేతంగా వైఎస్‌ జగన్‌ గురువారం.. విజయవాడలోని నిర్మల శిశు భవన్‌కు విచ్చేశారు. ఈ సందర్బంగా నిర్మల శిశు భవన్‌లో ఉన్న పిల్లలతో వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సోదరి వైఎస్‌ విమలారెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు.. పార్టీ అధినేత విజయవాడకు వస్తున్నారన్న విషయం తెలిసి వైఎస్సార్‌సీపీ పార్టీశ్రేణులు అక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసి వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు.మరోవైపు.. పులివెందులలో రాజారెడ్డి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో వైఎస్‌ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.తన తాత వైఎస్ రాజారెడ్డి శత జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్.. శిశు భవన్‌లో దివ్యంగ చిన్నారులతో గడిపిన వీడియో, ఫోటోలను ఎక్స్‌లో షేర్ చేశారు. Cherishing and honouring the 100th anniversary of my late grandfather's memory. pic.twitter.com/CS6IyD08pi— YS Jagan Mohan Reddy (@ysjagan) May 29, 2025

Maoist Key Leader Most Wanted Hidma Arrested3
మావోయిస్టు ​కీలక నేత హిడ్మా అరెస్టు

కోరాపుట్‌: మావోయిస్టు ​కీలక నేత హిడ్మా అరెస్టయ్యాడు. మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న హిడ్మాను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్‌లో హిడ్మాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో హిడ్మా హతమైనట్లు వార్తలు వచ్చినా అది వాస్తవం కాదని తేలింది. అయితే అప్పట్నుంచి మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్న హిడ్మా తాజాగా ఒడిశా పోలీసులకు చిక్కాడు. చాలాకాలం పాటు కనీసం ఫోటో కూడా లేకుండా తిరిగిన నేపథ్యం హిడ్మాది.5 వరకే చదువుకున్న హిడ్మా.. 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు 44 ఏళ్లు. మావోయిస్టు పార్టీ పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)–1వ బెటాలియన్‌కు కమాండర్‌గా.. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలో సభ్యుడిగా పనిచేశాడు. మావోయిస్టుల టాక్టికల్‌ కౌంటర్‌ అఫెన్సివ్‌ క్యాంపెయిన్‌ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు నిర్వహిస్తోంది.చేతిలో నెంబర్ వన్ బెటాలియన్దాదాపు మూడు దశాబ్దాలుగా ఛత్తీస్ఘడ్ మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన హిడ్మా... ఆర్మీ స్ట్రాటజీలలో దిట్ట. మావో సిద్ధాంతాన్ని పెద్దగా చదువుకోకపోయినా... తుపాకి ద్వారా పార్టీలో హిడ్మా పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. సుక్మా జిల్లాలో పుట్టిన హిడ్మా 17ఏళ్ల వయసులోనే... పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా పార్టీలో చేరాడు. ఆ తరువాత మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ఉన్న నెంబర్-1 బెటాలియన్ ప్రస్తుతం హిడ్మా చేతిలో ఉంది. హిడ్మా ఆదేశాలు ఇస్తే ఈ బెటాలియన్ ఎక్కడైనా విరుచుకుపడుతుంది. మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత భయంకరమైన బెటాలియన్‌గా సుగ్మా టీంకు పేరుంది. ఆ దాడికి హిడ్మానే నాయకత్వం..2011లో ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన చింతల్నార్ దాడిలో దాదాపు 75మంది CRPF జవాన్లు చనిపోయారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ దాడికి హిడ్మా నాయకత్వం వహించాడు. ఇక 2017లో జరిగిన బూర్కపాల్ దాడిలోనూ హిడ్మా పాత్ర ఉందని మావోయిస్టు పార్టీయే ప్రకటించింది. వందలమంది మిలిటెంట్లను గెరిల్లా ఆర్మీతో ఏకం చేసి దాడి చేయడం ఇతడి ప్రత్యేకత. హిడ్మా దాడి చేస్తే ఎవరూ తప్పించుకోరని మావోయిస్టు పార్టీలో ఒక నమ్మకం. ఛత్తీస్‌ఘడ్‌లో గత రెండు దశాబ్దాల్లో జరిగిన ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే కారణం అని అక్కడి పోలీసులు చెబుతారు. చాలాకాలం వరకూ హిడ్మా గురించి మావోయిస్టు క్యాడర్లోనే చాలా మందికి తెలియదు. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీలోకి హిడ్మాను తీసుకోవడంపై పార్టీలో అప్పట్లో చాలా విబేధాలు వచ్చాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత నిర్ణాయకమైన కేంద్రకమిటీలోకి ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడం అంటే హింసను ప్రోత్సహించడమే అని కొంత మంది మావోయిస్టు సానుభూతిపరులు విమర్శించారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలి పూర్తిగా హింసామార్గాన్ని అందుకుందని హిడ్మాకు వ్యతిరేకంగా వాదనలు వచ్చాయి. మనుషుల్ని చంపడంలో హిడ్మా చేసే హింస ఎంతో భయంకరంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడినట్లు చాలా చర్చ ఉంది. తన నీడను కూడా హిడ్మా నమ్మడని... దాదాపు 10మంది వరకు రాత్రింభవళ్లు హిడ్మాకు పహరా కాస్తారని మాజీ మావోలు చెబుతారు. హిడ్మా భార్య కూడా మావోయిస్టు పార్టీలోనే పనిచేస్తున్నారు..పీఎల్‌జీఏ సభ్యులకు శిక్షణ ఇచ్చేది హిడ్మానే. ఒక్కో బెటాలియన్‌ 200 మంది మావోయిస్టులుంటారు. కొత్తగా ఏ బెటాలియన్‌ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్‌ ఉంటుంది. పీఎల్‌జీఏతోపాటు మిలీíÙయా సభ్యులకు కూడా ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన 25కుపైగా ఘటనలకు హిడ్మానే సూత్రధారి అని చెబుతారు.

MLC Kavitha Serious Comments On BRS Party4
కేటీఆర్‌పై విరుచుకుపడ్డ కవిత.. నాతో పెట్టుకోవద్దు..

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న కోవర్టులే తనను ఓడించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ ఇంటి ఆడ బిడ్డపైనే పేయిడ్‌ వార్తలు రాయిస్తున్నారు. లేఖ ఎవరు బయటపెట్టారో చెప్పమంటే నాపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు చేశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని ప్రశ్నించారు. తనది బీఆర్‌ఎస్‌ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్‌ను కాపాడుకుంటే సరిపోతుంది. లీక్ వీరులను బయట పెట్టండి అంటే గ్రీక్ వీరులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత తాజాగా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఏది ఉన్నా నేను సూటిగానే మాట్లాడతాను. వెన్నుపోటు రాజకీయాలు చేయను. నేను కేసీఆర్‌ లాగే నేను ఏదైనా సూటిగానే మాట్లాడతాను. తిక్క తిక్కగానే ఉంటాను. పార్టీని నడిపించే సత్తా మీకు లేదు.. నాకు నీతులు చెబుతున్నారా?. వరంగల్‌ మీటింగ్‌ సక్సెస్‌ అయ్యిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏమైనా ఉంటే.. పార్టీ ఫోరమ్‌ లోపల మాట్లాడాలి అన్నారు. నేను బయటే మాట్లాడతాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సోయితో పరిపాలన జరగట్లేదు అని అన్నారు. నాకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదు.. ఏది ఉన్నా నేను ముక్కు సూటిగానే మాట్లాడతాను.ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?..అంతర్గత విషయాలపై లేఖ రాస్తే ఎందుకు బయటపెట్టారు. నేను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారు. బీఆర్‌ఎస్‌లో నాకు ఒకే నాయకుడు కేసీఆర్‌.. నాకు ఇంకెవరూ నాయకులు లేరు. పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని నేను అంగీరించను. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేయాల్సిన పనులు చేయాలి.. కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా?. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆయన చేసే కార్యచరణ చేయనివ్వండి. నాది బీఆర్‌ఎస్‌ పార్టీనే. కొత్త పార్టీలు ఎందుకు?. ఉన్న పార్టీని, కేసీఆర్‌ను కాపాడుకుంటే సరిపోతుంది. నేను కాంగ్రెస్‌తో 2013లోనే మాట్లాడాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడలేదు. కాంగ్రెస్‌ మునిగిపోయే నావ అని సెటైర్లు వేశారు. బీజేపీ వాళ్లు కట్టిన ఆసుపత్రి ఓపెనింగ్‌కి వెళ్ళిన వాళ్ళు బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నారని అన్నారు. నేను అసలే మంచి దాన్ని కాదు..డబ్బులు ఇచ్చి నాపై తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసే సమయంలో కేసీఆర్‌ వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అని అడిగితే కేసీఆర్‌ వద్దని చెప్పినట్టు తెలిపారు. పార్టీ చేయలేని పనులను జాగృతి తరఫున నేను చేసి చూపించాను. కేసీఆర్ తప్ప ఇప్పుడు నన్ను విమర్శిస్తున్న వారు ఏం చేశారో చెప్పాలి. నేను ఎప్పుడూ పదవులు అడగలేదు. కేసీఆరే నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పార్టీ నడిపించే సత్తా లేదు.. నాకు నీతులు చెబుతున్నారా అని మండిపడ్డారు. నేను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం పోరాటం చేశాను. నేను మంచి దాన్ని కాదు.. నాతో పెట్టుకోవద్దు అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపే ప్లాన్‌.. అలాగే, పార్టీ చేసే పనులు నేను సగం చేస్తున్నాను. అందుకే తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుంది. కేసీఆర్‌కి కాళేశ్వరం నోటీసులు ఇస్తే.. పార్టీ పరంగా ఏం చేశారు?. తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే.. ఈ బీఆర్‌ఎస్‌ పార్టీ ఏం చేసింది?. అదానీ టీ షర్ట్స్ వేసుకొని హంగామా చేసి వదిలేశారు.పార్టీ కోసం కేసీఆర్‌కు వంద లేఖలైనా రాస్తాను. నేను 25 ఏళ్ల నుంచి కేసీఆర్‌కు లేఖలు రాస్తున్నాను. ప్రతీసారి లేఖలు చూడగానే కేసీఆర్‌ వాటిని చించేస్తారు.. కానీ, ఈసారి ఏమైందో లేఖ బయటకు వచ్చింది. అలాంటి లేఖను ఎందుకు బయట పెట్టారు. నేను జైలులో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ, నేను బీజేపీలో​ కలపవద్దని చెప్పాను. వందకు 101 శాతం బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతోంది. నేను పార్టీలో ఉంటే బీఆర్‌ఎస్‌.. బీజేపీలో కలిసే అవకాశం ఉండదు. నేను ఉంటే అది కుదరని పని.. అందుకే నన్ను కేసీఆర్‌కు దూరం చేయాలని చూస్తున్నారు. నేను కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తాను. ఇవాళ తెలంగాణ వ్యతిరేకులు పనిచేస్తున్నారు. అది అడ్డుకునే ప్రయత్నం పార్టీ చేయట్లేదు. కేసీఆర్‌ను ఎప్పుడు కలిసేది ఇప్పుడు చెప్పలేను.. డెడ్‌లైన్‌ అంటూ ఏమీ లేదు’ అని చెప్పుకొచ్చారు.

N Chandrasekaran Resign To Director and Chairman of Tata Chemicals5
టాటా గ్రూప్‌లో కీలక పరిణామం: చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా

దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ 'ఎన్ చంద్రశేఖరన్' టాటా కెమికల్స్ డైరెక్టర్ అండ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పకున్నారు. బుధవారం ఈ విషయాన్ని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్‌లో కంపెనీ వెల్లడించింది."నా ప్రస్తుత.. భవిష్యత్తు నిబద్ధతలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, నేను బోర్డు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. టాటా కెమికల్స్ బోర్డుకు అధ్యక్షత వహించడం గౌరవంగా ఉంది. అంతే కాకుండా నా పదవీకాలంలో నాకు మద్దతు.. సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'' అంటూ.. టాటా సన్స్ చైర్మన్ మే 28న కంపెనీ డైరెక్టర్ల బోర్డును ఉద్దేశించి ప్రసంగించారు.ఎన్ చంద్రశేఖరన్ పదవి నుంచి వైదొలిగిన తరువాత.. 2025 మే 30 నుంచి 'ఎస్. పద్మనాభన్‌' కొత్త చైర్మన్ బాధ్యతలను తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే.. నామినేషన్, వేతన కమిటీ సిఫార్సుల ఆధారంగా, మే 28, 2025 నుంచి అమలులోకి వచ్చేలా 'మోదన్ సాహా'ను అదనపు డైరెక్టర్ (నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్)గా నియమించడానికి బోర్డు ఆమోదం తెలిపింది.ఎవరీ ఎన్ చంద్రశేఖరన్?తమిళనాడులోని నామక్కల్‌లోని మోహనూర్‌లోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఎన్ చంద్రశేఖరన్.. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, తరువాత కోయంబత్తూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తరువాత తిరుచిరాపల్లిలోని రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) డిగ్రీని పూర్తిచేశారు.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకిటాటా గ్రూప్‌తో ఆయన ప్రయాణం 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఇంటర్న్‌గా చేరడంతో ప్రారంభమైంది. సెప్టెంబర్ 2007లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) స్థాయికి త్వరగా ఎదిగారు. అక్టోబర్ 2009లో, కేవలం 46 సంవత్సరాల వయసులో టీసీఎస్ సీఈఓగా నియమితులయ్యారు.

Telangana Government Issues Gaddar Awards6
'గద్దర్‌ అవార్డ్స్‌' ప్రకటించిన తెలంగాణ.. ఉత్తమ నటుడిగా 'అల్లు అర్జున్‌'

తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్‌ అవార్డులను (Gaddar Awards) ప్రకటించింది. తెలుగు సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్‌ నటి జయసుధ (Jayasudha), ఎఫ్‌డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అవార్డ్స్‌ కోసం ఎంపికైనా వారి జాబితాను విడుదల చేశారు. 2014 నుంచి 2023 వరకు సెన్సార్‌ అయిన చిత్రాలను అవార్డ్స్‌ కోసం ఎంపిక చేశారు. అయితే, ప్రస్తుతం 2024 ఏడాదికి సంబంధించి అన్ని విభాగాల్లో అవార్డ్స్‌ అందుకున్న వారి వివరాలు ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం నుంచి చలన చిత్ర అవార్డులను ఇస్తున్నట్టు దిల్‌ రాజు గుర్తుచేశారు. చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు టెక్నికల్‌ టీమ్‌, ఫీచర్‌ ఫిల్మ్‌, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలన చిత్ర విభాగం, హెరిటేజ్‌, చరిత్రపై తీసే చిత్రాలకు పురస్కారాలు అందజేశారు. గద్దర్ అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వస్తే.. వ్యక్తిగత కేటగిరీలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి తదితర విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. 2024 విజేతలు ఉత్తమ చిత్రం : కల్కీ 2898ఉత్తమ రెండో చిత్రం ‌: పోటేల్‌ఉత్తమ మూడో చిత్రం: లక్కీ భాస్కర్‌ఉత్తమ బాలల చిత్రం : 35- చిన్న కథకాదుఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఆయ్‌హిస్టరీ ఫీచర్‌ విభాగంలో ఉత్తమ హెరిటేజ్‌ చిత్రం- రజాకార్‌ ఉత్తమ నటుడు‌: అల్లు అర్జున్‌ (పుష్ప 2)ఉత్తమ నటి: నివేధా థామస్‌ ( 35 చిన్న కథ కాదు)ఉత్తమ దర్శకుడు: నాగ అశ్విన్‌ (కల్కి 2898 ఏ.డీ)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌ : యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)ఉత్తమ సంగీత దర్శకుడు :భీమ్స్‌ (రజాకార్‌)ఉత్తమ సహాయ నటుడు : ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ : చంద్రశేఖర్‌ (గ్యాంగ్‌స్టర్‌ )ఉత్తమ కొరియోగ్రాఫర్‌ : గణేష్‌ ఆచార్య (దేవర)ఉత్తమ కమెడియన్‌: సత్య, వెన్నెల కిశోర్‌ (మత్తువదలరా 2)ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ : సిద్‌ శ్రీరామ్‌ (ఊరుపేరు భైరవకోన)ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ ఫిమేల్‌: శ్రేయ ఘోషాల్ (పుష్ప2/ సూసేకి అగ్గిరవ్వ)ఉత్తమ కథా రచయిత- శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయిత- వెంకి అట్లూరి (లక్కీ భాస్కర్‌)ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్‌ (రాజూ యాదవ్‌)ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌- విశ్వనాథ్‌రెడ్డి (గామి)ఉత్తమ బాలనటులు- మాస్టర్‌ అరుణ్‌ దేవ్‌, బేబీ హారిక (35 చిన్న కథ కాదు)ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: నితిన్ జిహానీ చౌదరీ (కల్కి)ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: నల్ల శ్రీను (రజాకార్‌)ఉత్తమ కాస్టూమ్‌ డిజైనర్‌: అర్చనా రావు, అజయ్‌ కుమార్‌ (కల్కి) బెస్ట్ బుక్ ఆన్ సినిమా - మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)స్పెషల్‌ జ్యూరీ అవార్డ్స్‌ విజేతలు దుల్కర్‌ సల్మాన్‌: లక్కీ భాస్కర్‌అనన్య నాగళ్ల: పొట్టేల్‌దర్శకులు సూజిత్‌, సందీప్‌ (క) నిర్మాతలు ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ (రాజూ యాదవ్‌)స్పెషల్‌ జ్యూరీ : ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)

My husband not driver : Polish woman slams stereotypes faced in India7
గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్‌ భర్తలందరూ డ్రైవర్లేగా!

సాధారణంగా ఒక యువతి, యువకుడు కనిపించగానే వాళ్లిద్దరూ, భార్యాభర్తలనో లేదా లవర్స్ అనో అనేసుకుంటారు చాలామంది. అయితే పోలిష్ మహిళ ఇతను నా భర్త మొర్రో మొత్తుకుంటోంది. అదేంటో తెలుసుకుందాం రండి!పోలెండ్‌ దేశానికి చెందిన గాబ్రియెలా డూడా (Gabriela Duda) ఉత్తర ప్రదేశ్‌కు చెందిన హార్దిక్ వర్మా (Hardik Varma)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2023 నవంబర్ 29న ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలో హిందూ ఆచారాల ప్రకారం సాంప్రదాయ బద్ధంగా వీరు పెళ్లి చేసుకున్నారు. భారతదేశంలోని పలు ప్రదేశాల్లో, ఇతర దేశాల్లో ప్రయాణం చేస్తూ, భారతీయ సంస్కృతిని తెలుసుకుంటూ , అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు. అయితే ఏంటి.. అనుకుంటున్నారా? ఈ పయనంలో తమ కెదురవుతున్న ఒక వింత అనుభవాన్ని గురించి సోషల్‌మీడియాలో ఒక వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. కంటెంట్‌ క్రియేటర్‌ అయిన గాబ్రియేలా భర్త హార్దిక్ వర్మతో కలిసి టూరిస్టులుగా ఆనందంగా గడుపుతున్న క్షణాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటంది. ఇద్దరూ అనేక ప్రదేశాల్లో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలు తన భర్తను తన టూర్ గైడ్ లేదా డ్రైవర్‌గా తరచుగా తప్పుగా భావిస్తుంటారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Gabriela & Hardik Varma | Travel & Indian Culture (@hardikandgabi) "భారతదేశంలో కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడల్లా అత్యంత ఇబ్బందికరమైన క్షణం. ఎప్పుడో ఒకసారి జరిగేదికాదు. ప్రతీ షాపు వాడు, లేదా ఆటో/టాక్సీ డ్రైవర్ హార్దిక్ నా టూర్ గైడ్ అని అనుకుంటారు. అవునబ్బా కొన్నిసార్లు అతను నా నా డ్రైవర్ కూడా.. అయితే ఏంటి’’ ప్రశ్నించింది. ఏ అమ్మాయైనా డ్రైవర్‌ చేతులు పట్టుకుని తిరుగుతుందా? లేదంటే, తన టూర్ గైడ్‌తో వేల ఫోటోలు తీసుకుంటుంది, లిప్ లాప్‌ ఇస్తుంది... ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంటూ చికాకు పడింది. అంతేకాదు తన భర్తతో వీడియోను షేర్‌ చేసింది. ఈ వీడియో నాలుగు లక్షలకు పైగా వ్యూస్‌ సాధించింది. అయితే ఆమె అసహనంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. "గైడ్ అని పిలవడంలో తప్పేముంది’’, ‘‘మీ మోటార్‌ లాగా మీరు మళ్లీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలి’’, నిజం చెప్పాలంటే.. ఆయన అలాగే కనిపిస్తున్నాడు.. నీట్‌గా షేవ్‌ చేసుకుంటే బెటర్‌’’, ‘‘ పెళ్లాం పిల్లలకు, భర్తలందరూ బై డిఫాల్ట్‌ టూర్‌ గైడ్లు, డ్రైవర్లే ఇలా రకరకాల కమెంట్లు, జోక్స్‌ వెల్లువెత్తాయి."నేను నా భార్యపిల్లలతో కలిసి నా స్వస్థలాన్ని సందర్శించినప్పుడు నాకు కూడా అదే జరిగింది. కొంతమంది స్థానికులు నన్ను వారి టూర్ గైడ్ అని అనుకున్నారు" అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు.

Predicted RCB Playing XI vs PBKS, Qualifier 1: Josh Hazlewood returns8
క్వాలిఫ‌య‌ర్‌-1.. ఆర్సీబీకి అదిరిపోయే న్యూస్‌

ఐపీఎల్‌-2025 క్వాలిఫ‌య‌ర్‌-1కు స‌ర్వ‌సిద్ద‌మైంది. చంఢీగ‌డ్‌లోని ముల్లాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైన‌ల్లో అడుగుపెట్టాల‌ని ఇరు జ‌ట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇరు జ‌ట్లు స‌మ ఉజ్జీల‌గా ఉండ‌డంతో గెలుపు ఎవ‌రిదో క్రికెట్ నిపుణులు సైతం అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి గుడ్‌న్యూస్ అందినట్లు తెలుస్తోంది.హాజిల్ వుడ్ రీ ఎంట్రీ?గాయం కార‌ణంగా గ‌త కొన్ని మ్యాచ్‌ల‌కు దూరంగా ఉన్న జోష్ హాజిల్‌వుడ్ తిరిగి ఆర్సీబీ తుది జ‌ట్టులోకి రావ‌డం దాదాపు ఖాయ‌మైంది. భుజం నొప్పితో బాధ‌ప‌డుతున్న ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. రొమిరియో షెఫ‌ర్డ్ స్దానంలో ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి హాజిల్‌వుడ్ రానున్న‌ట్లు ఆర్సీబీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.హాజిల్‌వుడ్ తిరిగొస్తే బెంగ‌ళూరు బౌలింగ్ విభాగం మ‌రింత ప‌టిష్టం కానుంది. ఇప్ప‌టికే భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, నువాన్ తుషారా వంటి స్పీడ్ స్టార్లు ఆర్సీబీ జ‌ట్టులో ఉన్నారు. మ‌రోవైపు గ‌త రెండు మ్యాచ్‌ల‌లో ఇంప్టాక్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన ఆర్సీబీ కెప్టెన్ ర‌జిత్ పాటిదార్ సైతం ఈ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాడు. అయితే విధ్వంస‌క‌ర ఆట‌గాడు టిమ్ డేవిడ్ మాత్రం ఈ మ్యాచ్‌లో కూడా ఆడేది అనుమాన‌మే. డేవిడ్ ప్ర‌స్తుతం తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. అత‌డు కోలుకోవడానికి మ‌రి కొంత స‌మయం ప‌డుతోంది.పంజాబ్‌తో మ్యాచ్‌కు ఆర్సీబీ తుది జట్టు(అంచనా)ఫిల్ సాల్ట్‌, విరాట్ కోహ్లి, మ‌యాంక్ అగ‌ర్వాల్‌, ర‌జిత్ పాటిదార్‌(కెప్టెన్‌), లివింగ్‌స్టోన్‌, జితేష్ శ‌ర్మ‌(వికెట్ కీప‌ర్‌), కృనాల్ పాండ్యా, యశ్ దయాల్‌, జోష్ హాజిల్‌వుడ్‌, భువనేశ్వర్ కుమార్‌, నువాన్ తుషారాచదవండి: ENG vs IND: 'శ్రేయ‌స్ ఏమి త‌ప్పు చేశాడు.. కావాల‌నే ఎంపిక చేయ‌లేదు'

KSR Comments On Chandrababu Mahanadu9
బాబూ.. ఎంత అదిరిందో వారినే అడగాల్సింది!

ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఒక సభ పెట్టారు. సూపర్‌ సిక్స్‌ అంటూ కొన్ని ఎన్నికల హామీలను ప్రకటించిన తరువాత ఆయన ‘‘అదిరిందా తమ్ముళ్లూ.. అదిరిందా’’ అని ఒకటికి రెండుసార్లు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. తాజాగా ఇప్పుడు కడపలో జరిగిన మహానాడులోనూ వాటిని ప్రస్తావించారు. అలాగే.. పాలన అదురుతోందా? రాజమండ్రిలో చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం కదా. ప్రజలంతా అదిరిపోతున్నారా? అని కార్యకర్తలను అడగాలి కదా! కానీ ఎందుకో మరి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఆ సాహసం మాత్రం చేయలేకపోయారు!. ఎందుకు జరుగుతోందో? ఏమి సాధించాలని అనుకుంటున్నారో తెలియకుండా సాగిన మహానాడు బహుశా ఇదేనేమో!.సాధారణంగా మహానాడు కార్యక్రమాల్లో విధానాలపై చర్చ జరిగేది. పాలనలోని మంచిచెడు గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడలా కాదు.. స్వోత్కర్ష, గప్పాలు కొట్టుకోవడం, అతిశయోక్తులతో ప్రసంగాలు ఒకవైపు, అంతా లోకేశ్‌ మయం అన్నట్లుగా మరోవైపు ఈ సభ జరిగింది. లోకేశ్‌ నా తెలుగు కుటుంబం అని సొంత లోగోని ఏర్పాటు చేసుకోవడం, ఆయన కొత్తగా కనిపెట్టినట్లు చెప్పుకుంటున్న ఆరు శాసనాలు ప్రచారం కోసం ఈ సభలు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ పెత్తనం చేస్తున్న సంగతి తెలిసిందే. కారణం ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముందని అంటూనే పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని చెప్పడం ద్వారా ఆయన మనసులోని మాట చెప్పకనే చెప్పినట్లయింది.జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదిహేనేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒకటికి, రెండుసార్లు అనడం ద్వారా లోకేశ్‌కు బ్రేక్ వేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఆలోచన వచ్చింది కానీ, దానికి పవన్ కళ్యాణ్, జనసేన కేడర్‌ సుముఖంగా లేరని చెబుతున్నారు. పవన్ స్థాయి తగ్గినట్లవుతుందని వారి బాధ. దీనిని గమనిస్తే, వారిద్దరి మధ్య ఇంకా డీల్ కుదరలేదేమో అన్న సందేహం వస్తుంది. ఈ సంగతి పక్కన బెడితే చంద్రబాబు స్పీచ్ అంతా ఎప్పటి మాదిరి అసత్యాలు, అర్ధసత్యాలు, జగన్ ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలతో పేలవంగా సాగింది. రాజమండ్రిలో ఆయన చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించినట్టు కనిపిస్తోంది. పెన్షన్ రూ.వెయ్యి పెంచడం, గ్యాస్ సిలిండర్ల పథకం అరకొర అమలు మినహా మిగిలిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారో వివరించాలి కదా!. పోనీ ఫలానా అభివృద్ది సాధించామని చెప్పగలిగారా? నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు, స్కూల్‌కు వెళ్లే ప్రతీ విద్యార్ధికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సూపర్ సిక్స్ లో ప్రధానంగా ఉన్నాయి.ఇవి కాకుండా షణ్ముక వ్యూహం అంటూ, ఎన్నికల ప్రణాళిక పేరుతో దాదాపు 200 హామీలు ఇచ్చారు. జూన్‌లో తల్లికి వందనం, ఆగస్టులో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తామని అంటున్నారే తప్ప, ఈ సంవత్సరం అంతా ఎందుకు ఇవ్వలేదో, అది తమ వైఫల్యమో కాదో చంద్రబాబు మాట మాత్రం చెప్పలేకపోయారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామని తమ మేనిఫెస్టోలో రాసినప్పటికీ, ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బుతో కలిసి మూడు విడతలుగా ఇస్తామని అంటున్నారు. వేరే హామీలలో వలంటీర్ల కొనసాగింపు, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ వంటివి చాలానే ఉన్నాయి. ఎల్లో మీడియాలో కవరేజీకి అవసరమైన డైలాగులు మాత్రం చెప్పారనిపిస్తుంది. రాష్ట్రం దశ, దిశ మార్చే విధంగా అవసరమైన విధానాలు రూపొందిస్తామని చంద్రబాబు ఇప్పుడు చెప్పడం ఏమిటి?.గత మహానాడు అనండి, పార్టీ సభ అనండి.. లేదా తాము విడుదల చేసిన మేనిఫెస్టోలో చెప్పిన విధానాలు కాకుండా కొత్త విధానాలు ఏం తీసుకువస్తారు?. అంటే మేనిఫెస్టోలోని అంశాలన్నిటినీ గాలికి వదలివేసినట్లేనా!. కార్యకర్తల ద్వారా రాజకీయ పాలన చేస్తారట. ఈ ఏడాది కాలం టీడీపీ కార్యకర్తలు, నేతలు సాగించిన అరాచకాలు, ఎమ్మెల్యేలు చేసిన దందాలు సరిపోలేదని భావిస్తున్నారా? లేక అవినీతి పథకాలతో కార్యకర్తల జేబులు నింపుతారా!. గతంలో జన్మభూమి కమిటీల మాదిరి వారు ప్రజలపై పెత్తనం చేస్తూ సంపాదించుకోవచ్చని చెబుతున్నారా?. ఆ డబ్బుతో ఎన్నికలలో గెలవవచ్చన్నది వీరి ఉద్దేశమా?.గత ముఖ్యమంత్రి జగన్ ఆయా స్కీములలో కులం, మతం, పార్టీ, ప్రాంతం ఏవీ చూడవద్దని అధికారులకు చెబితే, ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు మాత్రం సంకుచిత ధోరణితో టీడీపీ కార్యకర్తలకే పనులు చేయమని చెప్పడం సముచితమేనా!. వైఎస్సార్‌సీపీ పాలనలో అవినీతి జరిగిందని.. గాడి తప్పిన నేతలను, అధికారులను శిక్షిస్తామని ఆయన అంటున్నారు. అవినీతిని సహించబోమని, అవినీతిపై పోరాడిన పార్టీ తెలుగుదేశం అని ఆయన చెబితే సభికులు చెవిలో పూలు పెట్టుకుని విని ఉండాలి. జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై, కొందరు అప్పటి మంత్రులపైన అవినీతి కేసులు ఆధార సహితంగా వచ్చాయి కదా!. అప్పటి దర్యాప్తు అధికారులు చూపించిన ఆధారాలు సరైనవా? కావా? అన్నవాటిపై చంద్రబాబు కానీ, మరే టీడీపీ నేత అయినా మాట్లాడారా!. అవన్ని ఎందుకు టీడీపీ ఖాతాలోకి అక్రమ సొమ్ము చేరిందని ఆరోపణలు వచ్చాయి.అలాగే కేంద్ర ప్రభుత్వ సీబీటీడీనే చంద్రబాబు కార్యదర్శి ఇంటిలో సోదాలు జరిపి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ప్రకటించిందా? లేదా?. ఆదాయ పన్ను శాఖ ఎందుకు నోటీసు ఇచ్చింది?. వాటి గురించి ఎన్నడైనా చంద్రబాబు వివరణ ఇచ్చారా!. కాకపోతే ఆయనకు మేనేజ్ మెంట్ స్కిల్‌ ఉంది కనుక ఆ కేసులు ముందుకు వెళ్లకుండా చూడగలిగారు. జగన టైమ్ లో హత్యా రాజకీయాలు జరిగాయట. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, పార్టీ రంగు పులిమి రాజకీయం చేసిన సంగతి ఆయన ఆత్మకు తెలియదా!. మాచర్ల వద్ద హత్యకు గురైన ఒక టీడీపీ కార్యకర్త కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించడం సరైనదేనా?. అది కొలమానం అయితే ఈ మహానాడులో ప్రసంగాల ప్రకారం వెయ్యి మందికి పైగా హత్యలకు గురయ్యారని చెప్పారు కదా!. మరి ఆ వెయ్యి మందికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా?. నిజానికి మాచర్ల హత్య కూడా వ్యక్తిగత కక్షలతో జరిగినదే. కాని రాజకీయ లబ్దికోసం టీడీపీ గేమ్ ఆడిందని అంటారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు?. ఎందరు పోలీసుల వేధింపులు ఎదుర్కుంటున్నారు.మహిళలు, చిన్నారులపై జరుగుతున్న ఘోరాల మాటేమిటి!. తెనాలిలో దళిత, ముస్లిం యువకులు ముగ్గురిని పోలీసులు బహిరంగంగా అరికాళ్లపై ఇష్టారాజ్యంగా కొట్టడమే టీడీపీ ప్రభుత్వ విధానమా?. ఇక అక్రమ కేసుల సంగతి సరే సరి. ఇన్ని చేస్తూ జగన్ ప్రభుత్వంలో అది జరిగింది.. ఇది జరిగింది అంటూ అసత్యాలు, అర్ధ సత్యాలు వల్లే వేస్తున్నారు. ఇక లోకేష్ చెబుతున్న ఆరు శాసనాలు మరీ విడ్డూరంగా ఉన్నాయనిపిస్తుంది. తెలుగు జాతి విశ్వ ఖ్యాతి అంటూ పేర్కొన్న అంశంలో 1984లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేస్తే ఢిల్లీ పెద్దల మెడలు వంచి మళ్లీ సీఎం పదవి చేపట్టారని అన్నారు. బాగానే ఉంది. మరి 1995లో స్వయంగా అల్లుడు అయిన చంద్రబాబే ఎందుకు ఎన్టీఆర్‌ను పదవిచ్యుతిడిని చేశారు కదా? చంద్రబాబును అప్పట్లో ఎన్టీఆర్‌ ఎన్ని విధాలుగా దూషించారన్నది కూడా విశ్వ విఖ్యాతమైనవే కదా!.తెలుగుదేశంలో యువతకు పెద్దపీట వేసే యువగళం అన్నారు. అభ్యంతరం లేదు. వారిష్టం. స్త్రీ శక్తి మూడో శాసనమని తెలిపారు. ఎన్టీఆర్‌ మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇస్తే, చంద్రబాబు వారికి ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చారట. అదేమిటో? మరి ఆడబిడ్డ నిధి, ఈ ఏడాది తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు? పేదల సేవలో సోషల్ ఇంజినీరింగ్ అనేది మరో శాసనమట. వృద్దులకు రూ.నాలుగు వేలు ఫింఛన్‌ ఇస్తున్నారు. దాంతోనే పేరికం పోతుందా!. పీ-4 పేరుతో పేదలను పెట్టుబడిదారులకు వదలి వేయడం తెలుగుదేశం పాలసీగా మారింది కదా!.2029 నాటికి పేదరికం లేకుండా చేస్తామని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకు ఉండే విలువ ఎంతో తెలియదు. అన్నదాతకు అండగా ఉండటం మరో శాసనం అని చెప్పారు. వారికి ఇవ్వవలసిన రూ.ఇరవై వేలు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? చివరి శాసనం కార్యకర్తే అధినేత అని పేర్కొన్నారు. వారిని సొంతకాళ్లపై నిలబడేలా ఆర్థికంగా బాగు చేస్తారట. అంటే ప్రభుత్వ సొమ్మును వారికి దోచిపెడతామని పరోక్షంగా చెప్పడమే కదా అని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నిటినీ మించి టీడీపీ పేదల పార్టీ అట. ఆ పేదల పార్టీకి ఒక్క రోజులో సుమారు రూ.22 కోట్ల విరాళం వచ్చిందట. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది.1987 మహానాడు విజయవాడ కృష్ణా తీరంలో జరిగింది. అందులో ఒక హుండీ పెట్టారు. విరాళాలు ఇవ్వదలిచిన వారు అందులో వేయవచ్చని ప్రకటించారు. ఆ హుండీ వద్దకు ఎవరూ వెళ్లినట్లు కనిపించలేదు. కాని తెల్లవారే సరికల్లా భారీ మొత్తాలు వచ్చాయని ప్రకటించేవారు. ఇందులో మతలబు ఏమిటని అప్పట్లో కథనాలు వచ్చాయి. మరి ఇప్పుడు నిజంగానే అభిమానులు, పార్టీ నేతలు విరాళాలు ఇస్తుంటే మంచిదే. ఏది ఏమైనా వైఎస్ జగన్ సొంత ప్రాంతమైన కడపలో మహానాడు పెట్టి చంద్రబాబు, లోకేశ్‌లు తమ అహం చల్లబరుచుకుని ఉండవచ్చు కానీ, రాయలసీమకు గానీ, రాష్ట్ర ప్రజలకు కానీ.. ఈ మహానాడు వల్ల ఒరిగింది ఏమిటి అన్న దానికి జవాబు దొరుకుతుందా?. అందుకే జగన్ ఒక మాట అన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తే హీరోయిజం కాని, కడపలో మహానాడు పెడితే హీరోయిజం ఏముందని అడిగారు. దానికి ఎవరు సమాధానం ఇవ్వగలరు!.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

AP High Court stays removal of Kadapa Mayor10
కడప మేయర్‌ తొలగింపుపై హైకోర్టు స్టే

సాక్షి, అమరావతి: కడప మేయర్‌ సురేశ్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ని పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తొలగింపుపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గురువారం స్టే విధించింది. కడప మేయర్‌(Kadapa Mayor) సురేష్‌ బాబుపై సంచలన ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వరుస ఫిర్యాదులు చేశారు. ఆయన కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, సురేష్‌ బాబును మేయర్‌ పదవి నుంచి ఏకపక్షంగా తొలగిస్తూ జీవో జారీ చేశారు. అయితే.. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సురేష్‌ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ‘‘ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని విజిలెన్స్‌ ఎంక్వైరీకి ఆదేశించారు. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా మున్సిపల్ కమిషనర్‌ నోటీసు ఇచ్చారు. వీటి ఆధారంగా మేయర్‌ను డిస్‌ క్వాలిఫై చేశారు. కానీ, ఎమ్మెల్యే తన ఫిర్యాదును సీఎం కార్యాలయంలో ఇచ్చారు. సీఎం కార్యాలయం నోట్‌ను ప్రిన్సిపల్‌ సెక్రటరీ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు రిఫర్‌ చేశారు. వివరణ ఇచ్చుకోవడానికి మేయర్‌ సురేష్‌ బాబుకు తగిన సమయం కూడా ఇవ్వలేదు. ఈలోగా ఆయన్ని డిస్‌క్వాలిఫై చేశారు’’ అని సురేష్‌ బాబు తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. కడప మేయర్‌ తొలగింపునపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది: సురేష్‌బాబున్యాయ వ్యవస్థ పై పూర్తి నమ్మకం ఉందని.. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు. ‘‘కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుట్ర పూర్వకంగా చేసిన కుట్రలు బట్టబయలు అయ్యాయి. న్యాయస్థానం సరైన తీర్పు ఇవ్వడం సంతోషకరం. ఎప్పటికైనా వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన ఉంటుంది. కడప అభివృద్ధికి మేయర్‌గా ఎంతో కృషి చేశా. ఎమ్మెల్యే చేసిన కుయుక్తులు ఏవీ ఫలించలేదు’’ అని సురేష్‌ బాబు అన్నారు. ఇదీ చదవండి: ఎంత అదిరిందో బాబుగారినే అడగాలి!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement