Chaitanya
-
డిప్లొమా విద్యార్థి ఆత్మహత్య
మధురవాడ: టీడీపీ మాజీ ఎమ్మెల్సీకి చెందిన చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న డిప్లొమా విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పీఎంపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా నర్సిపురం బీజీ కాలనీకి చెందిన నిండుగొండ శంకరరావు, జ్ఞానేశ్వరి కుమారుడు జ్యోతి ప్రకాశ్ (16) విశాఖ నగర శివారు కొమ్మాది చైతన్య వ్యాలీలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లమా మెకానికల్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలోని బాయ్స్ హాస్టల్ బ్లాక్ ఎఫ్–7లో ఏడుగురు విద్యార్థులతో కలిసి ఉంటున్నాడు. శుక్రవారం తల్లితో ఫోన్లో మాట్లాడిన జ్యోతి ప్రకాశ్.. అక్టోబర్ మొదటి వారంలో పరీక్షలు ఉండడంతో ఆందోళనగా ఉందని చెప్పాడు. శనివారం ఉదయం కాస్త కడుపు నొప్పిగా ఉందని, క్లాసుకి వెళ్లలేనని తల్లికి మళ్లీ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె వార్డెన్‌కు ఫోన్ చేసి హాస్టల్లో ఉంచాలని చెప్పింది. మధ్యాహ్నం 1.30 సమయంలో ఇదే గదిలో ఉంటున్న సహచర విద్యార్థి తలుపు కొట్టగా తియ్యలేదు. దీంతో హాస్టల్ సిబ్బంది బలవంతంగా తలుపులు తీయగా.. జ్యోతిప్రకాశ్ ఫ్యాన్‌కి ఉరేసుకుని ఉన్నాడు. వైద్యం నిమిత్తం సమీపంలోని గాయత్రి హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియరాలేదని పీఎంపాలెం సీఐ గేదెల బాలకృష్ణ చెప్పారు. కాగా కొద్ది నెలల క్రితం ఇదే క్యాంపస్‌లో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒకే ఏడాదిలో ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తల్లి జ్ఞానేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
హృదయం ముక్కలయ్యాక మిగిలేది అదే!: నిహారిక మాజీ భర్త పోస్ట్
మెగా డాటర్ నిహారిక కొణిదెల- చైతన్య జొన్నలగడ్డ తమ వైవాహిక బంధాన్ని కాపాడుకోలేకపోయారు. పెళ్లయిన మూడేళ్లకే విడాకులు తీసుకున్నారు. విడాకుల గురించి చాలాకాలం మౌనంగా ఉన్న నిహారిక ఇటీవలే కాస్త ఓపెన్ అయింది. ఓ పాడ్‌కాస్ట్‌లో.. పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని.. అందరూ కన్నతల్లిదండ్రుల్లా ప్రేమగా మెదలరని చైతన్య గురించి చెప్పకనే చెప్పింది. మూడేళ్లకే విడాకులు పెళ్లి- విడాకుల వ్యవహారం ద్వారా ఎవరినీ నమ్మకూడదని తెలిసొచ్చిందని, ఇదొక గుణపాఠమని వ్యాఖ్యానించింది. దీనిపై చైతన్య జొన్నలగడ్డ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. పెళ్లి పెటాకులైతే ఆ బాధ ఇద్దరికీ ఉంటుంది.. దానినుంచి బయటపడటం కూడా రెండువైపులా ఒకేలా ఉంటుంది. ఒకరి వర్షనే మాట్లాడి దాన్ని హైలెట్ చేయడం గొప్ప కాదని విమర్శించాడు. తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. నిశ్శబ్దం ఎంత పదునైందో వివరిస్తూ ఓ లేఖ పంచుకున్నాడు. జీవితం ఎటు పోతోందో.. 'విశాల అంతరిక్షంలో నిశ్శబ్దం.. నీటి అడుగున ఉన్నప్పుడు అదే నిశ్శబ్దం.. చల్లని శీతకాలపు రాత్రుల్లో ఆవరించే నిశ్శబ్దం.. షో ముగియగానే చప్పట్లు కొట్టేముందు వచ్చే నిశ్శబ్దం.. మీ మనసును ముక్కలు చేసే విషయం విన్నప్పుడు వచ్చే నిశ్శబ్దం.. జీవితం ఎటు పోతోందో అర్థం కాని ఆలోచనల్లో అలుముకునే నిశ్శబ్దం.. ఈ సైలెన్స్ ప్రాణ శక్తి నుంచి ప్రకృతి శక్తిని దూరం చేస్తుందా..! భౌతిక రూపం నుంచి విముక్తి పొందండి.. అప్పుడు భగవంతుడితో మనల్ని కలిపే మాధ్యమే ఈ సైలెన్స్ అని మీరు తప్పక గుర్తిస్తారు' అని రాసుకొచ్చాడు. నిశ్శబ్దమే అన్నింటికంటే అతిపెద్ద ఆయుధమని పరోక్షంగా చెప్తున్నాడు. View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) చదవండి: ఇంత దారుణమైన ట్రోలింగ్ ఎప్పుడూ చూడలేదు.. నటి ఎమోషనల్ -
విడాకులపై నిహారిక కామెంట్లు.. ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ భర్త చైతన్య
నిహారిక కొణిదెల- చైతన్య జొన్నలగడ్డ అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన కొన్ని ఏళ్లకే విడాకులు తీసుకోవడంతో వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత నెట్టింట నిహారికను తప్పుబట్టినవారే ఎక్కువగా ఉన్నారు. ఆ సమయంలో అటువంటి వాటికి ఆమె ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో తన విడాకుల విషయం గురించి నిహారిక తొలిసారి మాట్లాడింది. ఒక యూట్యబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన కామెంట్లు ఆమె చేసింది. ఆ వీడియోను సదరు యూట్యూబర్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ విషయంలో నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ ఘాటుగానే స్పందించారు. నిహారిక ఇంటర్వ్యూపై చైతన్య రియాక్షన్ నిహారికపై ఇటీవల జరుగుతున్న అన్యాయమైన నెగటివిటీని దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. వ్యక్తిగతంగా వ్యవహరించేటప్పుడు ఇలాంటి నెగటివిటీని ఎదుర్కోవడం అంత సులభం కాదని నాకు తెలుసు. అయితే వివాహానికి సంబంధించి బాధితురాలి పక్షాన్నే మాట్లాడటం, వారి వెర్షన్ మాత్రమే బయటి ప్రపంచానికి వినిపించడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా విడాకుల విషయం గురించి ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు. వారి గురించి జోక్యం చేసుకోకూడదు. బాధ నుంచి ఎలా కోలుకున్నామన్నదాని గురించి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇటువంటి వన్‌సైడ్ వెర్షన్లను ఇతరులకు అటాచ్ చేయడం దాంతో మరింత రీచ్ పొందేందుకు ఇలాంటి ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడం మానేయాలి.ఇలా జరగడం ఇది రెండోసారి. వివాహ బంధం బద్దలయ్యాక దాని వల్ల కలిగే నొప్పి ఇద్దరికీ ఉంటుంది. ఇలాంటి సమయంలో కష్టం ఇద్దరికీ సమానంగానే ఉంటుంది. దాని నుంచి బయటపడడం అనేది కూడా రెండువైపులా ఒకేవిధంగా ఉంటుంది.' అని చైతన్య తీవ్రంగానే రియాక్ట్ అయ్యాడు. 'ఇద్దరి మధ్య జరిగిన విడాకుల తంతు ముగిసిన తర్వాత దాని గురించి అస్సలు చర్చించకూడదు. అలాంటిది ఇలాంటి వేదికలపై ఒకరివైపు నుంచే మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ పెళ్లిబంధం విఫలమైన తర్వాత కలిగే బాధ గురించి, దాని నుంచి బయటకురావడం గురించి మాట్లాడవచ్చు. ఆయా సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించవచ్చు. జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా ఇలా జడ్జ్ చేయడం ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పడం అంతే తప్పు. ఇలా అయితేనే ఇంటర్వ్యూలు చేయండి. విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా ప్రజలకు అసత్యాలను ప్రచారం చేయడం అనేది అన్యాయం. నాణేనికి ఒకవైపు మాత్రమే చూపించి నిజం అంటే ఎలా.. అదే నిజం అంటూ ప్రజల్లోకి అసత్యాలను ప్రచారం చేస్తే ఎలా..? అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేసిన వీడియోకు కింద చైతన్య రాసుకొచ్చారు. నిహారిక ఏం చెప్పింది 'నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. విడాకులు తీసుకున్నప్పుడు నన్ను చాలామాటలన్నారు. ఎంతో బాధేసింది, చాలా ఏడ్చాను. దాన్ని భరించడం అంత ఈజీ కాదు. ఎవరైనా జీవితాంతం కలిసుండాలనే పెళ్లి చేసుకుంటారు. ఏడాదిలో విడిపోతామని తెలిసి ఎవరూ అంత ఖర్చుపెట్టి ఘనంగా జరుపుకోరు. రిలేషన్షిప్ కొనసాగాలనే అందరూ కోరుకుంటారు. నేను కూడా అదే కోరుకున్నాను. అయితే నేను అనుకున్న విధంగా మాత్రం పరిస్థితులు లేవు. ఈ సందర్భంలో మనుషులను అంత ఈజీగా నమ్మకూడదనే విషయాన్ని అర్థం చేసుకున్నా. ఈ క్రమంలో నేనొక జీవిత పాఠం నేర్చుకున్నా. అన్నీ అనుకున్నట్లు జరగవు కదా.. ఇదీ అంతే! నా గురించి ఏం రాసినా పట్టించుకునేదాన్నే కాదు.' అని చెప్పుకొచ్చింది View this post on Instagram A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha) -
గ్లామర్ సీక్రెట్ ఏంటి?
-
ద్విచక్రవాహనంపై వెళ్తుండగా యువకుడి విషాదం!
కరీంనగర్: పెగడపల్లి మండలం ఆరవెల్లి గ్రామానికి చెందిన సిరిపురం చైతన్య(31) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామానికి చెందిన సిరిపురం శంకరయ్య–విజయల కొడుకు చైతన్య రెండేళ్లనుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొని చనిపోయాడు. మృతదేహం శనివారం రాత్రి గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఇవి చదవండి: దయచేసి 'న్యూ ఇయర్' రోజు ఇటువైపు వెళ్లకండి! -
ఫిదా అవ్వాల్సిందే చూస్తుంటే
-
మాది పోలీస్ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ
-
మూవీ ఎంట్రీపై నిహారిక భర్త చైతన్య క్లారిటీ
-
నా మీద ఊరికే అరుస్తూ ఉంటుంది: చైతన్య
-
ఇలా ప్రపోజ్ చేస్తే ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే..!
-
నిహారిక తన భర్తకు క్షమాపణ చెప్పింది ఎందుకంటే..?
-
రెండో పెళ్లికి రెడీ అయిన నిహారిక మాజీ భర్త!
మెగా డాటర్ నిహారిక,జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. 2020 డిసెంబర్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. కనీసం రెండేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నాళ్ల పాటు వేరు వేరుగా జీవించి.. ఈ మధ్యే అధికారికంగా విడాకులు తీసుకున్నారు. డైవర్స్ తర్వాత నిహారిక కెరీర్ పరంగా బిజీ అయింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ.. నిర్మాణం రంగంలో కూడా అడుగుపెట్టింది. అంతేకాదు విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇక చైతన్య కూడా విడాకులను మ్యాటర్‌ని మర్చిపోవడానికి కొన్నాళ్ల పాటు విహార యాత్రకు వెళ్లి వచ్చాడు. తిరిగి వచ్చాక తన కెరీర్‌పై దృష్టి పెట్టాడు. అయితే ఇద్దరూ కూడా మళ్లీ పెళ్లిపై ఆలోచనలు చేయలేదు. కొన్నాళ్ల పాటు ఇలాగే ఒంటరి జీవితాన్ని ఆస్వాదించి, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారట. అయితే చైతన్య కంటే ముందే నిహారిక పెళ్లి అవుతుందని అంతా భావించారు. కానీ నిహారిక మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకోనని ఇంట్లో తెగేసి చెప్పిందట. వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత నిహారిక పెళ్లి ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎవరా అమ్మాయి? ఇష్టపడి పెళ్లి చేసుకున్న నిహారిక దూరమవ్వడంతో ఆ బాధ నుంచి బయటపడేందుకు చైతన్య కొన్నాళ్ల పాటు విహారయాత్రలకు వెళ్లాడు. నిహారిక మాదిరే తాను కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకోవద్దని భావించాడట. కానీ ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేయడంతో రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరతోనే చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తన ఫ్యామిలీ అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ ఐపీఎస్ అధికారి కూతురితో చైతన్య రెండో పెళ్లి జరుగబోతుందట. ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారని, మంచి ముహుర్తం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో వాస్తమెంత అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: సత్యరాజ్ రెమ్యునరేషన్, ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. పెద్ద ఫ్యాక్టరీతో పాటు ఇవన్నీ కూడా..) -
ఆటతో...
చైతన్య పసుపులేటి, హీనా రాయ్ జంటగా నటించిన చిత్రం ‘జీటీఏ’. దీపక్ సిద్ధాంత్ దర్శకత్వంలో డా. సుశీల నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను రచయిత–దర్శకుడు కృష్ణ చైతన్య రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘క్రైమ్ యాక్షన్ డ్రామాగా జీటీఏ అనే ఆట ఆధారంగా ఈ చిత్రకథ సాగుతుంది’’ అన్నారు దీపక్ సిద్ధాంత్. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కామెరా: కేవీ ప్రసాద్. -
యూత్ టార్గెట్‌గా ‘జిటిఎ’
చైతన్య పసుపులేటి, హీనా రాయ్ హీరో హీరోయిన్లు గా నటించిన తాజా చిత్రం జిటిఎ(GTA). దీపక్ సిద్ధాంత్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. జిటిఏ గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ పోస్టర్ని రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న GTA సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. 90కిడ్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా క్యాచీ టైటిల్ తో ఈ సినిమా రాబోతోందని తెలిపారు. GTA అనే గేమ్ ను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తీయడం జరిగిందని దర్శకుడు దీపక్ సిద్ధాంత్ తెలిపారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
ఇంట్లో వాళ్లను కాదని యంగ్ డైరెక్టర్‌తో డేర్ చేస్తున్న నిహారిక
టాలీవుడ్ హీరోయిన్, నిర్మాత నిహారిక కొణిదెల .. చైతన్య జొన్నలగడ్డతో తన వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ విషయం నుంచి ఇప్పుడిప్పుడే ఆమె బయటపడుతుంది. నటనకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన నిహారిక డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. టాలీవుడ్లో నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా నిహారిక మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తుంది. అందుకోసం పలు వెబ్ సీరిస్‌లతో పాటు సినిమాలను ప్లాన్ చేస్తుంది. చైతన్యతో దూరం అవుతున్న సమయంలోనే ఆమె డెడ్ పిక్సెల్స్ సిరీస్‌ను తీసినా అది అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. (ఇదీ చదవండి: సౌత్ ఇండియాలో రిచ్చెస్ట్ హీరో ఆయనే.. ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే) దీంతో తాజాగ ఆమె మళ్లీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందని తెలిసింది. ఈ విషయంపై ఇప్పుడు ఇండస్ట్రీలో భారీగానే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆమె మొదట సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గానే ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఆమె సక్సెస్ కాలేకపోయింది. మళ్లీ ఇప్పుడు తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తుందట నిహారిక. (ఇదీ చదవండి: నయనతార ఇంతే.. ఆమెను ఏం చేయలేం: విశాల్) అందులో భాగంగానే ఒక యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తుందట నిహారిక. అందుకు సంబధించి కథను కూడా రెడీ చేసినట్లు సమాచారం. కానీ నిహారిక తీసుకున్న నిర్ణయానికి మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదట. హీరోయిన్గా ఆమె మళ్లీ సినిమాల్లోకి రావడం వారికి ఇష్టం లేదని ప్రచారం జరుగుతుంది. కానీ నిహారిక మాత్రం కుటుంబం సభ్యులకు ఇష్టం లేకున్నా తన కాళ్లపై తాను నిలబడాలని, అందుకోసం మళ్లీ సినిమాల్లో నటించాలని గట్టిగానే నిర్ణయం తీసుకుందట. త్వరలో తన సినిమాకు సంబంధించిన వివరాలన్నీ ఆమె ప్రకటించనున్నారని టాక్. అన్నీ అనుకూలిస్తే మళ్లీ సిల్వర్‌స్క్రీన్‌పై నిహారిక మెరవడం ఖాయం. -
నిహారికతో విడాకులు.. తొలిసారి పోస్ట్ చేసిన చైతన్య!
ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు ఇటీవలే తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ విడిపోతున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో డైవర్స్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. విడాకుల కోసం హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇది తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని.. తమ నిర్ణయాన్ని గౌరవించాలని అభిమానులను కోరారు. (ఇది చదవండి: బిగ్‌బాస్ 7లో బుల్లితెర నటి శోభా శెట్టి! ఎంట్రీ ఇస్తే..) అయితే విడాకుల తర్వాత నిహారిక ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటోంది. ఏదో ఒక పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తోంది. తన ఫ్రెండ్స్‌తో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటోంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత జొన్నలగడ్డ చైతన్య ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే చైతన్య ఎప్పుడో ఒకసారి అలా కనిపిస్తుంటారు. తాజాగా జొన్నలగడ్డ చైతన్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. విడాకుల తర్వాత తొలిసారి తన ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలతో పాటు 'ఆల్ త్రీస్ ఇన్ స్టైల్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే ఆ ఫోటోలను చూస్తే ప్రకృతిని ఉద్దేశించి పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలో పక్కనే సముద్రం, చెట్లు ఉండగా.. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చైతన్య కనిపించారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం 'బిగినింగ్ న్యూ లైఫ్ బ్రో' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక) View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) -
స్కూటీలో వెళ్తున్న భార్యను సుమోతో ఢీకొట్టించి...
యశవంతపుర: తల్లిదండ్రులనుంచి తనను వేరు చేసేందనే కసితో భార్యను అంతమొందించేందుకు పన్నిన పథకం బెడిసికొట్టి భర్త కటకటాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి అరవింద, ఉదయకుమార్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన చైతన్యను అరవింద్ ఏడాదన్నర క్రితం వివాహం చేసుకున్నాడు. ఆమె ఆరు నెలల గర్భిణి. వివాహం అనంతరం చైతన్య వేరు కాపురం పెట్టించింది. తల్లిదండ్రులనుంచి దూరంగా ఉండటంతో అరవింద్ మనోవేదనకు గురయ్యాడు. దీంతో చైతన్యనుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించగా ఆమె అంగీకరించలేదు. దీంతో చైతన్యను హత్య చేయాలని ప్లాన్ వేసి పాత టాటాసుమోను కోనుగోలు చేసి ఉదయకుమార్ అనే వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. చైతన్యను యాక్సిడెంట్ ద్వారా హత్య చేయాలని సుఫారీ ఇచ్చాడు. సీసీ కెమెరాలులేని స్థలాన్ని గుర్తించి అక్కడ యాక్సిడెంట్ చేయాలని ఉదయకుమార్‌కు సూచించాడు. వారం రోజుల క్రితం భరతనాట్యం ముగించుకొని బాగలూరు కెఐడీబి లేఔట్ సమీపంలో స్కూటీతో వెళ్తున్న చైతన్యను సుమోతో ఢీకొన్నారు. స్వల్పంగా గాయపడిన ఆమె బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కేమరాలను పరిశీలించగా అనవాళ్లు దొరకలేదు. అదే మార్గంలో పాత టాటా సుమో తిరిగిన అనవాళ్లను గుర్తించి ఆ వాహనం ఎవరిదనే వివరాలు సేకరించి ఉదయకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుట్ర వెలుగు చూసింది. దీంతో ఉదయ్‌కుమార్, అరవిందను అరెస్ట్ చేశారు. -
పూల బామ్మ పులకించిన వేళ
సంచలనాలు, అద్భుతాలు మాత్రమే ‘వైరల్’కి అర్హం కాదని నిరూపించిన వీడియో ఇది... పుణెలో ఒక బామ్మ తన పూలదుకాణంలో కూర్చొని పూలు అల్లుతుంది. నిజానికి ఇదొక సాధారణ దృశ్యం. అయితే ఈ దృశ్యంలో ఆర్టిస్ట్ చైతన్యకు శ్రమజీవన సౌందర్యం కనిపించింది. తన స్కెచ్‌బుక్ తీసి బామ్మను స్కెచ్ వేయడం ప్రారంభించాడు. స్కెచ్ పూర్తయిన తరువాత బామ్మకు చూపిస్తే... ఆమె కళ్లలో ఎంత సంతోషమో! బామ్మకు ఆ స్కెచ్ ఎంతగానో నచ్చేసింది. ‘ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందంటే... చుట్టుపక్కల ఎన్ని శబ్దాలు వినిపిస్తున్నా బామ్మ దృష్టి పూలమీద మాత్రమే ఉంది. పూల అల్లికలో అపారమైన ఆనందాన్ని పొందుతుంది’ అని రాశాడు చైతన్య. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో 2.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఇష్టమైన పనిలోనే అంతులేని సంతోషం దొరుకుతుంది అని చెప్పే వీడియో ఇది’ అని కామెంట్ సెక్షన్లో స్పందించిన వారు ఎందరో. -
నిహారిక విడాకులపై చైతన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు
-
నిహారికపై చైతన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. ఇది జరిగి పదిరోజులు దాటినా ఇప్పటికీ పలు యూట్యూబ్ ఛానల్స్‌లలో వీరిద్దరి టాపిక్ నడుస్తూనే ఉంది. అంతే కాకుండా సోషల్‌మీడియాలో కూడా కామెంట్ల రూపంలో చర్చ జరుగుతూనే ఉంది. వీరిద్దరూ ఎందుకు విడిపోయారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలయదు. వారి కుటుంబ సభ్యలు కూడా బహిరంగంగా ఎక్కడా మాట్లాడనూ లేదు. నిహారికతో పాటు చైతన్యపై కూడా పలువురు నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయంపై చైతన్య తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు తన సన్నిహితుల వద్ద ఇలా చెప్పారని ప్రచారం జరగుతుంది. (ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?) 'నేను ఉద్యోగరిత్యా గౌరవమైన హోదాలో ఉన్నాను.. ఇంట్లో పెద్ద వాళ్లతో నిహారిక ఒక్క రోజు కూడా గౌరవంగా మసులుకోలేదు.. అసలు భర్తతో కలిసి జీవించాలనే ఆలోచన తనకు లేదు.. తన భర్త పై ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. ఎప్పుడు చూసిన క్లబ్బులు, పబ్బులు అంటూ తిరగడమే తప్ప కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు మెగా అభిమానులు నా కుమారుడి గురించి చెడుగా ప్రచారం చేయడాన్ని చూసి సహించలేకపోతున్నాను' అని జొన్నలగడ్డ ప్రభాకర్ రావు చెప్పారట. (ఇదీ చదవండి: యువతికి కేక్ తినిపించిన బాలకృష్ణ.. ఆమె ఎవరంటూ..) ఈ స్టేట్మెంట్లోని మాటలు ఆయన అన్నారో లేదో తెలియదు కానీ గత వారం నుంచి వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయని కొందరు నెటిజన్లు తెలుపుతున్నా మరికొందరు మాత్రం ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదనే వారు కూడా ఉన్నారు. ఏదేమైనా వారి వ్యక్తిగత జీవితం గురించి నెగటివ్‌గా మాట్లాడటం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
అమ్మాయిలు నాలుగు రకాలు అంటూ నిహారిక పోస్ట్
టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. ఇద్దరి అంగీకారంతో విడాకులు తీసుకున్నామని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు కూడా. విడాకుల మూడ్ నుంచి తను ఇప్పుడిప్పేడే సినిమా షూటింగ్లపైపు వెలుతుంది అని చెప్పవచ్చు. తాజాగా నిహారిక ఒక వీడియో షేర్ చేసింది. అందులో మహాతల్లి యూట్యూబ్ ఫేమ్ కూడా ఉంది. (ఇదీ చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై బేబమ్మ రియాక్షన్) వీడియోతో పాటు అమ్మాయిలు ఇలా ఉంటారు అంటూ వాయిస్ వస్తుంది. అందులో ప్రతి అమ్మాయిల గ్యాంగ్‌లో ఇలా నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారని చెప్పుకొస్తూ... మొదట నిహారిక తనని తాను ఉద్దేశిస్తూ ఇలా చెప్పింది. ఒకరు ఎల్లప్పుడూ బెటర్ డ్రెస్సింగ్ వేసుకునేందుకు ఇష్టపడుతుంటారని చెప్పింది. మరోకరు ఏ డ్రెస్ వేసుకున్నా కాన్ఫిడెంట్‌గానే ఉంటారని చెప్పింది. మరొకరు.. కనీసం రెడీ అయ్యేందుకు కూడా ఆసక్తి చూపించరు అంటూ... చివరిగా ఓ 'మహాతల్లి' ఉంటుంది కానీ తనెప్పుడు కనిపించదని ఒక పన్నీ ఎమోజీని చూపుతుంది. నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత ఇలాంటి ఫన్నీ వీడియో పోస్ట్ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఆమె ఇప్పుడిప్పుడే విడాకుల మూడ్ నుంచి బయటపడుతున్నారని నెటిజన్లు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) (ఇదీ చదవండి: ‘డబుల్’ కిక్ ఇస్తున్న స్టార్ హీరోలు) -
చైతన్య, నేను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం :నిహారిక
-
అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక
ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇద్దరి అంగీకారంతో నెలరోజుల కిందటే విడాకుల కోసం హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు ఇటీవల వారిద్దరికి విడాకులు మంజూరు చేసింది. అయితే వీరి విడాకుల అంశంపై పలువురు నుంచి నెగటివ్ కామెంట్లు వస్తుండటంతో అఫిషియల్‌గా నిహారిక స్పందించింది. (ఇదీ చదవండి: సమంత కీలక నిర్ణయం.. షాక్‌లో అభిమానులు!) 'విడాకుల విషయంలో మేమిద్దరం పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా సున్నితమైన విషయం. తామిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితంలో ప్రైవసీని కోరుకుంటున్నాం. ఇంతటి ఇబ్బంది సమయంలో నా వెంట ఫ్యామిలీ, స్నేహితులు పిల్లర్స్‌లా నిలబడ్డారు. అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.. మాపై నెగటివ్‌గా ప్రచారం చేయకండి. ఇలాంటి సమయంలో తమను దకయచేసి ఇబ్బంది పెట్టకండి. ఇది ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగత విషయం. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.' అని తెలిపింది. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
విడాకులు తీసుకున్న మెగా డాటర్.. ట్రెండింగ్‌లో నిహారిక (ఫోటోలు)
-
విడాకుల తరువాత నిహారిక మొదటి పోస్ట్.. ఎవరి కోసమంటే..
సినిమా రంగంలోని సెలబ్రెటీల గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాల గురించి అయితే చెప్పనవసరం ఉండదు. తాజాగా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోవడంతో ప్రతి విషయం ఇప్పుడు వైరల్ అవుతూనే ఉంది. నిహారిక-చైతన్యల పెళ్లి 2020 డిసెంబర్ 9న గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. తాజాగా వారిద్దరి అంగీకారంతో కోర్టు నుంచి విడాకులు తీసుకున్నారు. (ఇదీ చదవండి: Niharika-Chaitanya Divorce: నిహారిక కోసం పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరంటూ..) పెళ్లి తర్వాత కూడా నిహారిక తన కెరీర్‌ను బిల్డప్ చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అంతకు ముందు అడపాదడపా సినిమాలు చేసిన నిహారిక, పెళ్లి తర్వాత నిర్మాతగా మారింది. ఈ మధ్యే సొంత బ్యానర్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరు మీద హైదరాబాద్‌లో ఆఫీస్ ఓపెన్ చేసింది. అలా చైతన్యకు దూరంగా ఉన్నా తను ఏదో ఒక సినిమా పనిలో బిజీగానే ఉండేది. (ఇదీ చదవండి: ఆయనంటే భక్తి.. అందుకే మా అబ్బాయికి 'నీల్' అని పేరు పెట్టాం: కాజల్) అయితే నిహారిక విడాకుల విషయం మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత.. తను ఏమైనా నోరు విప్పుతుందా? అని అందరూ భావించారు. కానీ నిహారిక మాత్రం వాటిని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఆమె విడాకులకు సంబంధించిన వార్తలు వైరల్ అయిన కొద్దిసేపటికి తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒకరికి పుట్టిన రోజు విషెస్ చెబుతూ స్టోరీ షేర్ చేసింది. నిహారిక సినిమాలకు అమెరికా నుంచి ప్రమోషన్స్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఆమె బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ విడాకుల వార్తల గురించి పలు రకాలుగా వార్తలు వస్తున్నా.. ఆమె స్పందించకపోవడంతో వీటిన లైట్ తీసుకున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నిహారిక-చైతన్యల విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరంటూ..
ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఇద్దరి అంగీకారంతో నెలరోజుల కిందటే విడాకుల కోసం హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కోర్టు ఇటీవల వారిద్దరికి విడాకులు మంజూరు చేసింది. అయితే తాజాగా వీరద్దరిలో ఎవరు ముందుగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు..? నిహారిక తరుపున కోర్టులో పిటిషన్ వేసిన అడ్వకేట్ ఎవరు..? అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో వెతకడం మొదలు పెట్టారు. (ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీకి దూరంగా అన్నా లెజినోవా?) ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ కూడా వేరుగానే ఉన్నారు కూడా. దీంతో మొదటగా విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది జొన్నలగడ్డ చైతన్యనే అని కోర్టు విడుదల చేసిన కాపీలో ఉంది. ఆపై నిహారిక తరుపున విడాకుల కోసం పిటిషన్ వేసింది అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర అని తెలుస్తోంది. అతను నాగబాబుకు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టే విడాకుల విషయాన్ని గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. 2020 డిసెంబర్లో చైతన్య జొన్నలగడ్డ - నిహారికల వివాహం జరిగింది. వీరిద్దరి అంగీకారం మేరకు జూన్ 5న కోర్టు విడాకుల ఉత్తర్వులు జారీ చేసింది. జొన్నలగడ్డ చైతన్య గుంటూరు మాజీ ఐజీ జే ప్రభాకర్ రావు కుమారుడు అనే విషయం తెలిసిందే. -
నిహారిక- చైతన్య విడాకులు.. అసలు కారణం అదేనా?
మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న నిహారిక తాజాగా కూకట్పల్లి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. 2020లో జొన్నలగడ్డ చైతన్యతో రాజస్థాన్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత రెండేళ్ల పాటు బాగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. (ఇది చదవండి: మెగా డాటర్ కొత్త ప్రాజెక్ట్.. సోషల్ మీడియాలో ప్రకటించిన నిహారిక) ఇటీవల జరిగిన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌లోనూ చైతన్య కనిపించలేదు. జొన్నలగడ్డ చైతన్య కూడా తన ఫ్యామిలీతో కలిసి తిరుమలలో కనిపించారు. దీంతో వీరిద్దరు డైవర్స్ తీసుకుంటున్నట్లు చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా నిహారిక పిటిషన్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు కన్ఫార్మ్ చేసింది. అయితే ఈ జంట ఇంత త్వరగా విడిపోవడానికి కారణాలేంటనేది ఇప్పటికి వరకు తెలియరాలేదు. అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనలే విడాకులకు దారితీసి ఉంటాయని నెట్టింట చర్చ మొదలైంది. మరికొందరు పరస్పర విభేదాలే ఈ జంట విడిపోవడానికి కారణమని చెబుతున్నారు. పెళ్లి తరువాత నిహారిక నిత్యం వివాదాలు తలెత్తాయి. ఒకసారి పబ్ పార్టీలో నిహారిక పేరు వినిపించడంతో ఆ వార్త పెద్దఎత్తున వైరలైంది. ఆ తర్వాత అపార్ట్మెంట్ వాళ్లతో గొడవ సందర్భంగా నిహారికను మరో వివాదం చుట్టుముట్టింది. దీంతో ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తి విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) -
అఫీషియల్: నిహారిక- చైతన్య డైవర్స్.. కోర్టు మెట్లెక్కిన మెగా డాటర్!
నాగబాబు కుమార్తె మెగాడాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతోందని గత కొంతకాలంగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. భర్తకు దూరంగా ఉంటున్న నిహారిక.. ఇటీవల వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్కు ఒంటరిగానే హాజరైంది. దీంతో విడాకుల రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిహారిక విడాకులపై వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ డైవర్స్ కోసం కోర్టు మెట్లెక్కింది. తాజాగా ఆమె కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. హిందూ వివాహా చట్ట ప్రకారం మెగా డాటర్ కోర్టును ఆశ్రయించింది. (ఇది చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) కాగా.. గత కొంతకాలంగా జొన్నలగడ్డ చైతన్య, నిహారిక విడివిడిగానే ఉంటున్నారు. ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో విడాకులు రూమర్స్ ఊపందుకున్నాయి. అంతేకాకుండా చైతన్య ఇటీవలే సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరలైన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక పిటిషన్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కాాగ.. 2020లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. చైతన్య ఇన్‌స్టా పోస్ట్ వైరల్? ఇటీవలే జొన్నలగడ్డ చైతన్య ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. 'ఈ స్థలం, నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. గత 10 రోజులుగా నా జీవితంలోకి వచ్చిన విపాసన ప్రక్రియ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. మనం ఓ చోటుకి ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లి, అద్భుతమైన జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది అలాంటిదే' అని చైతన్య రాసుకొచ్చాడు. ముంబయిలోని గ్లోబల్ విపాసన పగోడా అనేది ఓ మెడిటేషన్ సెంటర్. ప్రస్తుతం చైతన్య అక్కడే ఉన్నాడు. ఇదే విషయాన్ని బయటపెట్టాడు. ఈ పోస్ట్ తర్వాత విడాకులు ఖాయమేనంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. (ఇది చదవండి: వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్లో నిహారిక.. ఆ ఫోటో అర్థం అదేనా?) -
Nellore: 3 నెలల కిందటే పెళ్లి.. నారాయణ కళాశాలలో హౌస్‌సర్జన్ ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ పరిధి లోని చింతారెడ్డిపాళెంలో ఉన్న నారాయణ వైద్య కళాశాలలో ఓ హౌస్‌సర్జన్ తన రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. నెల్లూరు రూరల్ పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య(24) నారాయణ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. మూడు నెలల కిందట శ్రీకాకుళం జిల్లాకు చెందిన శరత్‌చంద్రతో ఆమెకు వివాహమైంది. శరత్చంద్ర విజయనగరంలోని వైద్య కళాశాలలో ఆర్థో విభాగంలో పీజీ చదువుతున్నాడు. పెళ్లయిన నాటి నుంచి చైతన్యను భర్త వేధింపులకు గురిచేసేవాడని, నగదు, కారు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెస్తుండేవాడని తెలుస్తోంది. భర్త నుంచి వేధింపులు అధికం కావడంతో మనస్తాపం చెందిన చైతన్య రూమ్‌లో తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చైతన్యకు తల్లి జ్యోతికుమారి ఫోన్ చేయగా ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో హాస్టల్ వార్డెన్‌కు కాల్ చేసింది. హాస్టల్ సిబ్బంది చైతన్య గది వద్దకు వెళ్లి రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా చైతన్య మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ ఉంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి -
మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!
మెగాడాటర్ నిహారిక అధికారికంగా చెప్పనప్పటికీ ప్రస్తుతం భర్తకు దూరంగానే ఉంటుంది. ఈ మధ్యే వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగ్గా.. ఈ వేడుకలో నిహారిక ఉంది తప్పితే, ఈమె భర్త చైతన్య ఎక్కడా కనిపించలేదు. దీంతో వీళిద్దరూ విడాకులు తీసుకున్నారని అందరూ అంచనాకు వచ్చేశారు. ఇప్పుడు చైతన్య తన ఇన్ స్టాలో సంచలన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది? నిహారిక-చైతన్య వివాదం మెగాడాటర్ నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. 'ముద్దపప్పు ఆవకాయ' సిరీస్ తో చాలా ఏళ్ల క్రితమే నటిగా కెరీర్ ప్రారంభించింది. 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్ అయింది. 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' తదితర చిత్రాల్లోనూ నటించింది. చిరంజీవి 'సైరా'లో అతిథి పాత్రలో మెరిసింది. 2020 డిసెంబరులో చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకుంది. ఓ రెండేళ్లపాటు ఈ జంట బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ ఇన్ స్టా అకౌంట్స్‌లో ఇద్దరూ కలిసున్న ఫొటోలని డిలీట్ చేశారు. (ఇదీ చదవండి: తెలుగు యువ నటుడు మృతి.. విడుదలకి ముందే విషాదం) విడాకులు నిజమేనా? నిహారికతో పాటు ఆమె భర్త చైతన్య.. తమ ఇన్ స్టా ఖాతాల్లో కలిసున్న ఫొటోలని తీసేశారు. దీంతో విడాకుల న్యూస్ బయటకొచ్చింది. ఓవైపు నిహారిక నటిస్తూ బిజీ అయిపోగా.. చైతన్య బయటఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేడు. ఫిబ్రవరి 15న ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఓ మెడిటేషన్ సెంటర్ లో ఉన్నట్లు ఫొటోలు చూస్తే అర్ధమవుతోంది. పోస్ట్ లో ఏముంది? 'ఈ స్థలం, నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. గత 10 రోజులుగా నా జీవితంలోకి వచ్చిన విపాసన ప్రక్రియ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. మనం ఓ చోటుకి ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లి, అద్భుతమైన జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది అలాంటిదే' అని చైతన్య రాసుకొచ్చాడు. ముంబయిలోని గ్లోబల్ విపాసన పగోడా అనేది ఓ మెడిటేషన్ సెంటర్. ప్రస్తుతం చైతన్య అక్కడే ఉన్నాడు. ఇదే విషయాన్ని బయటపెట్టాడు. View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) (ఇదీ చదవండి: డిప్రెషన్ బారిన పడ్డా.. ఆ విషయం బయటపెట్టిన కాజల్!) -
వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్లో నిహారిక.. ఆ ఫోటో అర్థం అదేనా?
మెగా ఇంట్లో మరో పెళ్లిసందడి షురూ అయింది. నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్- ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. వీరితో పాటు అల్లు అర్జున్, అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. అయితే ఈ వేడుకలో అందరి కళ్లు నిహారిక కొణిదెలపైనే ఉన్నాయి. (ఇది చదవండి: వెల్కమ్ టూ కొణిదెల ఫ్యామిలీ.. ఉపాసన ట్వీట్ వైరల్!) హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన అన్న ఎంగేజ్మెంట్కు సోదరి నిహారిక సింగిల్‌గానే హాజరైంది. దీంతో నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. ఇప్పటికే నిహారిక విడాకులు తీసుకోబోతోందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన నిశ్చితార్థ వేడుకలో జొన్నలగడ్డ చైతన్య కనిపించకపోవడంతో మరోసారి డైవర్స్ ఖాయమేనంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలే చైతన్య కూడా.. నిహారిక లేకుండానే తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. వరుణ్- లావణ్య నిశ్చితార్థ వేడుకల్లో దిగిన ఫోటోల్లో నిహారిక సింగిల్‌గానే కనిపించడంతో రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్' కోసం అల్లు అర్జున్ భారీ స్కెచ్) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!
మెగా డాటర్ నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత కొద్ది రోజులు యాక్టింగ్‌కు దూరంగా ఉన్న నిహారిక రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. (ఇది చదవండి: భర్తతో విడాకులు? నిహారికను సూటిగా ప్రశ్నించిన జర్నలిస్ట్) అయితే గత కొంతకాలంగా ఆమె డైవర్స్ తీసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తరచుగా వార్తల్లో నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటోందని.. త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వీటిపై ఇంతవరకు ఎవరూ కూడా స్పందించలేదు. అయితే తాజాగా నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మీడియా వారిని పలకరించగా ఫోటోలకు ఫోజులిచ్చారు. భర్త జొన్నలగడ్డ వెంట నిహారిక లేకపోవడంతో మరోసారి డైవర్స్ రూమర్స్ ఊపందుకున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిహారిక లేకుండా చైతన్య తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం మరోసారి అనుమానాలకు తావిస్తోంది. (ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్ నిశ్చితార్థం? నిహారిక ఏమందంటే?) అంతే కాకుండా ఈ మధ్యకాలంలో నిహారి-చైతన్య జంటగా ఎక్కడా కనిపించకపోవడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం మరో కారణం. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతోనే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. -
ఢీ షోకి వెళ్లాక రూ. 6 లక్షల దాకా డబ్బులిచ్చాను: చైతన్య తల్లి
కొరియోగ్రాఫర్ చైతన్య ఏప్రిల్ 30న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. జబర్దస్త్‌లో కన్నా ఢీలో తక్కువ పారితోషికం ఇస్తారని, ఇక్కడ పేరు మాత్రమే వస్తుందని ఆయన వాపోయాడు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం చైతన్యకు అప్పులుండే అవకాశమే లేదని చెప్తూ వస్తున్నారు. తాజాగా చైతన్య తల్లి లక్ష్మి రాయ్ ఓ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 'కాస్ట్యూమ్స్‌కు డబ్బులు కావాలంటూ రెండు, మూడు వేలు నా దగ్గర తీసుకునేవాడు. మీకు తెలియని ఇంకో విషయమేంటంటే.. ఢీ ఫైనల్ కోసం రూ.3,50,000 అడిగాడు. మా ఆయన్ని అడిగితే ఒప్పుకోలేదు. వాడిని చెడగొడుతున్నావు, డబ్బులివ్వను అన్నాడు. ఒక రోజంతా అలిగి కూర్చుంటే ఆ డబ్బంతా తెచ్చి ఇచ్చాడు. అమ్మ, నేను గెలిస్తే రూ.7,50,000 వస్తాయి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అన్నాడు. కానీ ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడో తెలియలేదు. ఇలా రెండుసార్లు జరిగింది. ఢీ షోకి వెళ్లిన తర్వాత దాదాపు రూ.6 లక్షల దాకా ఇచ్చాను. ఇంత చేసినదాన్ని ఏదైనా అప్పులున్నాయంటే తీర్చకపోయేదాన్నా? అప్పుల వల్ల చనిపోయాడనే మరక ఉండకూడదనే నా బాధ. ఢీ షోలో పేమెంట్స్ ఎలా ఇస్తున్నారో నాకు తెలియదు. కానీ ఢీ లేకపోతే మా అబ్బాయి లేడు. వాడికి ఇంత గుర్తింపు ఢీ వల్లే వచ్చింది' అని చెప్పుకొచ్చింది చైతన్య తల్లి. చదవండి: క్రికెట్ జట్టు కొనుగోలు చేయనున్న రామ్‌చరణ్ నావల్ల హీరోయిన్ ఆత్మహత్య చేసుకుందన్నారు: నవదీప్ -
అందుకే జబర్దస్త్‌లో ఎక్కువ పారితోషికం.. చైతన్య చివరి వీడియోపై అభి..
ఢీ షోలో కొరియోగ్రాఫర్‌గా పని చేసిన చైతన్య మాస్టర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే! మే 1న అప్పులు తీర్చలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి ప్రాణాలు తీసుకున్నాడు. ఢీ షో పేరు ఇస్తుంది కానీ జబర్దస్త్‌లో వచ్చినంత సంపాదన ఢీలో రాదని ఆయన వీడియోలో వాపోయాడు. తాజాగా చైతన్య మృతికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించిన కమెడియన్ అదిరే అభి జబర్దస్త్ వర్సెస్ ఢీ పారితోషికాలపై స్పందించాడు. అలాగే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారికి పలు సలహాలు, సూచనలు ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశాడు. సినిమా, టీవీ పరిశ్రమలో ఉండేవాళ్లను చూసి చాలామంది కొత్తగా ఈ ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. అలా వచ్చి సెటిలైన వాళ్లను చూసి.. మరింతమంది ఇన్స్పైర్ అయి వస్తుంటారు. అంటే.. మనం ఏం చేసినా దాని ప్రభావం తర్వాత వచ్చేవాళ్లపై పడుతుంది. కాబట్టి ఇండస్ట్రీలోకి రావాలనుకునేవాళ్లందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. ఇండస్ట్రీ గురించి ముందు అవగాహన తెచ్చుకుంటే మున్ముందు వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి మానసిక ధైర్యం వస్తుంది. ఇక్కడికి రాగానే ఎర్రతివాచీ పరిచి ఆఫర్లు ఇస్తారు, చాలా డబ్బులు వస్తాయి అని భ్రమపడితే పొరపాటే. కడుపు మాడ్చుకుని, ఎన్నో నిద్ర లేని రాత్రిళ్లు గడిపితేనే సక్సెస్ వస్తుంది. ఒక బ్రేక్ వచ్చాక దాన్ని మెయింటెన్ చేయడం కూడా చాలా పెద్ద విషయం! ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్‌గా వెలుగొందిన అమితాబ్ బచ్చన్ గతంలో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఆ బ్యానర్లో తీసిన సినిమాలన్నీ ఫ్లాపవడంతో వంద కోట్ల మేర నష్టం వచ్చింది. తన కార్లు కూడా అమ్మేసుకున్నాడు. కానీ.. కౌన్ బనేగా కరోడ్‌పతితో హోస్ట్‌గా మళ్లీ కెరీర్ మొదలుపెట్టి జీరో నుంచి మళ్లీ సూపర్ స్టార్ అయ్యాడు. అంటే పరిస్థుతులను ఎదుర్కొనేంత మానసిక ధైర్యం మనకు ఉండాలి. అందుకే ముందుగానే ప్లాన్ బి కూడా రెడీ చేసుకోవాలి. మనకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత దాచుకోవాలి. అప్పుడే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది మనకు సాయపడుతుంది. చిన్నవాటికే కుంగిపోయి ఆత్మహత్య చేసుకోకూడదు. ఇక షో రేటింగ్‌ను బట్టి ఆయా ప్రోగ్రామ్‌లో పని చేసే వాళ్లకు పారితోషికం ఇస్తారు. జబర్దస్త్‌కు రేటింగ్ ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు. అయినా వాటి మీద ఆధారపడకుండా బయట ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ద్వారా ఆర్టిస్టులు మరింత సంపాదిస్తారు. ఇక్కడ ఆఫర్లు రానప్పుడు వేరే దారి ఎంచుకుని జీవించడం బెటర్' అని చెప్పుకొచ్చాడు అభి. చదవండి: అక్కినేని కుటుంబాన్ని వెంటాడుతున్న ఫ్లాపులు.. చై ఆన్సరేంటంటే -
విడాకులపై ఇన్‌డైరెక్ట్ హింట్ ఇస్తున్న నిహారిక?.. పోస్ట్ వైరల్
మెగాడాటర్ నిహారిక కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టిన ఆమె పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా నిహారిక భర్త చైతన్యకు దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. చదవండి: నటి ఖుష్భూ కూతుర్ని చూశారా? గ్లామర్ షోతో రచ్చరచ్చ దీనికి తోడు భార్యభర్తలిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఇద్దరూ పెళ్లి ఫోటోలను డిలీట్ చేయటంతో విడాకుల రూమర్స్ తెరమీదకి వచ్చాయి. దీనిపై నిహారికతో పాటు మెగా ఫ్యామిలీ కూడా సైలెంట్‌గా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అంతేకాకుండా పెళ్లి తర్వాత యాక్టింగ్‌కి ఫుల్స్టాప్ పెట్టిన నిహారిక ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నిహారిక షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. జిమ్‌లో వర్కవుట్ వీడియోను షేర్ చేస్తూ.. మనసుకు తగిలిన అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుంది అంటూ కొటేషన్‌ను యాడ్ చేసింది. దీంతో భర్త జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు నిహారిక ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే వృత్తిపరంగా బిజీ అయ్యేందుకు చూస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత -
ఢీలా పడుతున్నారా?
-
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో
ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వారి కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. అయితే ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను తన సహచరులతో పంచుకున్నారు. (ఇది చదవండి: ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్ తల్లి) నెల్లూరులోని ఓ హోటల్లో బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆ వీడియోలో చైతన్య వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే అప్పుల బాధతోనే సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు. (ఇది చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?) -
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో
-
ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్ తల్లి
కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య ఘటన టాలీవుడ్లో సంచలనంగా మారింది. అప్పుల బాధలు తట్టుకోలేకనే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి, ఉరేసుకొని చనిపోయాడు. అయితే చైతన్య అప్పులపాలయ్యాడంటే స్నేహితులతో పాటు కుటుంబ సభ్యులు కూడా నమ్మడం లేదు. భారీగా అప్పులు చేసే అవసరం తనకు లేదని, ఒకవేళ అప్పులైనా తీర్చేంత ఆస్తులు తన కుటుంబానికి ఉన్నాయని చెబుతున్నారు. ఇక చైతన్య తల్లి లక్ష్మీ రాజ్యం అయితే తన కొడుకు అప్పుల బాధతో చనిపోయాడనేది అబద్దం అంటున్నారు. అన్ని సమస్యలు ఉన్నా.. తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆత్మహత్యకు 15 నిమిషాల ముందు నాతో మాట్లాడాడు. సన్మాన కార్యక్రమంలో డల్‌గా ఉన్నావ్.. నవ్వుతూ ఉండమని చెప్పా. ‘పెద్ద పెద్ద వాళ్లు నీకు సన్మానం చేస్తున్నారు. అందరితో పరిచయాలు పెంచుకొ’ చెప్పా. సరే అన్నారు. ఆ తర్వాత 15 నిమిషాలకే సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు. (చదవండి: చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్ మాస్టర్ మేనమామ) అంతకు ముందు టెంపుల్‌కి వెళ్లాలి ఇంటికి రా అంటే.. ‘నాక్కుడా చిరాకుగా ఉందమ్మా..గుడికి వెళ్దాం.. ప్లాన్ చెయ్’ అన్నాడు. ఇప్పుడు నన్ను వదిలి అన్యాయం చేశాడు. గతంలో ఒక్కసారి ఫోన్ చేసి ‘నువ్వు ఇంటికి రా లేదంటే చచ్చిపోతా’అంటే.. ‘నువ్వు చచ్చిపోతే నన్నెవరు చూస్తారమ్మా.. నీ పక్కన నాక్కుడా ఒక బెర్త్ కన్ఫామ్ చేయమని అన్నాడు. మరి ఇప్పుడు ఒక్కడే వెళ్లిపోయాడు. ‘నేను చనిపోతున్న.. నువ్వు కూడా రా అమ్మా’అంటే నేను కూడా వెళ్లేదాన్ని కదా’ అని చైతన్య తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. (చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్ ) ఇంకా మాట్లాడుతూ.. ‘డబ్బుల కంటే ఎక్కువగా ఆరోగ్యం కాపాడుకోవాలని తరచూ చెప్పేవాడు. ‘పిల్లలకు మంచి ఫుడ్ పెడితేనే మనల్ని గౌరవిస్తారు. డబ్బులదేముంది. ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు ’అని చెప్పేవాడు. ఇప్పుడు డబ్బులు వల్లే నేను చనిపోతున్నానని అనడమే నాకు నచ్చట్లేదు. అడిగితే నేను ఇవ్వానా? తనకు అప్పులున్నాయనే విషయం ఫ్రెండ్స్‌కి కూడా చెప్పకపోవడం బాధేస్తుంది. నన్నుమోసం చేసి పోయాడు. వాడు చేసిన పనికి ఏడుపు కూడా రావడం లేదు. ఇంత మోసం చేస్తాడనుకోలేదు. నా జీవితమే వాడు. వాడి కోసం ఎన్నో బాధలు పడ్డా. డబ్బుల విషయం ఏముంది? అది నాకో లెక్క కాదు. వాడు చనిపోయాడనే దానికంటే.. నాకు ద్రోహం చేశాడనే బాధే ఎక్కువగా ఉంది’అంటూ ఆమె ఎమోషనల్ అయింది. -
చైతన్యకు అప్పు లేదు, ఇంకేదో జరిగింది.. డ్యాన్స్ మాస్టర్ మేనమామ
కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! అప్పుల బాధ భరించలేకే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. అయితే తనకు తెలిసినంతవరకు చైతన్యకు ఎలాంటి అప్పులు లేవని ఆయన మేనమామ అంటున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. చైతన్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. అలాగని తనకు పెద్ద మొత్తంలో అప్పులున్నాయని కూడా నేను అనుకోవడం లేదు. తనకు లక్షల కొద్ది అవసరం ఏముంటుందని? అయినా అంత అప్పు ఎవరిస్తారు? మహా అయితే ఏదో పది, పదిహేను వేలు అప్పు చేసి ఉంటాడంతే! ఇంకేదో జరిగింది. చైతన్య చెల్లి పెళ్లి కూడా మేమే చేశాం. తను రూపాయి ఇవ్వలేదు. అతడు చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉన్నాడు. తన ఆదాయంపై కుటుంబం ఏనాడూ ఆధారపడలేదు. తను సంపాదించిందేమీ ఇంటికి పంపించేవాడు కాదు. పైగా తనకు అవసరమైనప్పుడల్లా వీళ్లే చైతూకు తిరిగిచ్చేవాళ్లు. తనకు ఊర్లో 30 ఎకరాల భూమి ఉంది. అప్పులు కాకుండా మరింకేదైనా కారణం ఉండొచ్చు' అని అనుమానం వ్యక్తం చేశాడు ఆయన మేనమామ. కాగా చైతన్య మరణంపై పలువురు డ్యాన్సర్లు, సెలబ్రిటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చైతన్య మాస్టర్ ఓ ఈవెంట్ ఒప్పుకున్నాడని, తీరా సమయానికి కొందరు డ్యాన్సర్లు ఆయనకు హ్యాండ్ ఇవ్వడంతో మేనేజ్మెంట్ టీమ్ పేమెంట్ ఇవ్వకుండా ఆపేసిందని డ్యాన్సర్, కండక్టర్ ఝాన్సీ పేర్కొంది. ఈవెంట్‌కు వచ్చిన మిగతా డ్యాన్సర్లకు డబ్బులు ఇచ్చేందుకు మాస్టర్ వేరే వాళ్ల దగ్గర అప్పు చేశాడని, బహుశా ఆ ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఆమె అభిప్రాయపడింది. చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య, గుండె బద్ధలైందన్న శేఖర్ మాస్టర్ రూ.7 లక్షలు రావాల్సి ఉంది.. పేమెంట్ ఇవ్వలేదు: కండక్టర్ ఝాన్సీ -
సంచలనంగా మారిన డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య
-
ఢీ షో డాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహత్య
-
చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్
ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే! అప్పుల బాధలు తాళలేకపోతున్నానంటూ ఉరేసుకుని చనిపోయారు. చైతన్య మాస్టర్ మరణంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్రమంలో నటి శ్రద్దా దాస్.. మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఎమోషనలైంది. 'పుట్టుక, చావు ఎప్పుడు? ఎందుకు? జరుగుతాయో అంతుచిక్కవు. కానీ జననమరణానికి మధ్యలో మనం ఎలా బతికామన్నదే మనల్ని గొప్పవారిలా చేస్తుంది. నిజంగా చెప్తున్నా.. చైతన్య మాస్టర్ చాలా మంచి వ్యక్తి, గొప్ప మనసున్న మనిషి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరు నవ్వుతూ అందరినీ నవ్వించేవాళ్లు. కానీ ఈరోజు నన్ను ఎంతగానో ఏడిపించారు. మీ స్మైల్ నాకెప్పటికీ గుర్తుండిపోతుంది' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ మేరకు అతడితో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. చైతన్య మరణంపై శేఖర్ మాస్టర్ స్పందిస్తూ.. నీలాంటి టాలెంటెడ్ డ్యాన్స్ మాస్టర్‌ను కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ వార్త వినగానే నా గుండె ముక్కలయింది. చాలా డిస్టర్బ్ అయ్యాను. నీ చిరునవ్వు ఎన్నటికీ మర్చిపోలేను. నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. యాంకర్ రష్మీ సైతం స్పందిస్తూ.. 'చావు అన్నింటికీ పరిష్కారం కాదు మాస్టర్. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా ఢీ షోలో కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న చైతన్య ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. 'అమ్మానాన్న, చెల్లి.. ఐ లవ్యూ.. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానివ్వలేదు. కుటుంబానికి చాలా చేద్దామనుకున్నాను. కానీ కుదురలేదు. అప్పులయ్యాయి. తీర్చగలను కానీ తీర్చలేకపోతున్నా. తట్టుకోలేకపోతున్నా. ఢీ పేరు ఇస్తుందని కానీ సంపాదన తక్కువ. జబర్దస్త్‌లో సంపాదన ఎక్కువ వస్తుంది. స్నేహితులు, తోటి డ్యాన్సర్లకు సారీ' అని వీడియోలో పేర్కొన్నారు. ఇది చూసిన చైతన్య అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. View this post on Instagram A post shared by Sekhar Vulli Vj (@sekharmaster) చదవండి: మొన్ననే నాకు మాటిచ్చాడు, అంతలోనే ఇంత దారుణం: ఝాన్సీ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య -
కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య
నెల్లూరు సిటీ: ‘అతను ఓ టీవీ షోలో డ్యాన్స్ మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్. మంచి పేరు వచ్చింది. కానీ సంపాదనలో మాత్రం వెనుకబడ్డాడు. కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని కలలు కన్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏమి చేయలేకపోయాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన అతను ఆత్మహత్యే శరణ్యం అనుకుని నిర్ణయించుకున్నాడు. ఫ్యాన్‌కు ఉరేసుకుని నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు.’ ఆదివారం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. లింగసముద్రం మండలంలోని ముత్తంవారిపాళేనికి చెందిన సుబ్బారావు, లక్ష్మి రాజ్యం దంపతులకు సి.చైతన్య (31), వినీల అనే పిల్లలున్నారు. చైతన్య హైదరాబాద్‌లో ఉంటూ ఐదేళ్లుగా ఢీ షోలో ఓ బృందానికి కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలో నెల్లూరు నగరంలోని టౌన్హాల్లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడు. అనంతరం నగరంలోని దర్గామిట్లలో ఉన్న నెల్లూరు క్లబ్లో గది తీసుకున్నాడు. చైతన్య తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు పంపాడు. ‘అమ్మా, నాన్న, చెల్లి ఐ లవ్ యూ.. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానివలేదు. చెల్లీ ఫీల్ కావద్దు. నువ్వంటే చాలా ఇష్టం. కుటుంబానికి చాలా చేద్దామనుకున్నాను. కుదరలేదు. అప్పులు అవుతాం. తీర్చుకునే సత్తా ఉండాలి. తీర్చగలను కానీ అంతా తీర్చ లేకపోతున్నా. ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నా. చాలా ప్రయత్నిస్తున్నా. కావట్లేదు. ఢీ పేరు ఇస్తుంది. కానీ సంపాదన తక్కువ ఇస్తుంది. జబర్దస్‌లో సంపాదన ఎక్కువ వస్తుంది. స్నేహితులు, తోటి డ్యాన్సర్లకు సారీ’ అని ఆ వీడియోలో ఉంది. కాగా చైతన్య స్నేహితులు వీడియో చూసి నెల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు చైతన్య ఉంటున్న గది వద్దకు చేరుకుని తలుపు తట్టారు. ఎంతకీ తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా అప్పటికే అతను ఉరేసుకుని ఉన్నాడు. దీంతో ధనలక్ష్మీపురంలో నివాసం ఉంటున్న చైతన్య మేనమామ మాల్యాద్రికి పోలీసులు సమాచారం అందించారు. మాల్యాద్రి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట ఎస్సై విజయకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నయ్య, ఎందుకింత పని చేశావు?: కండక్టర్ ఝాన్సీ ఎమోషనల్
ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధ తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఢీ షో వల్ల మంచి పేరు వచ్చింది, కానీ తగినంత సంపాదన రాలేదని ఆయన వాపోయారు. తాజాగా ఆయన మరణంపై డ్యాన్సర్ ఝాన్సీ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. 'చైతన్య అన్నయ్య తీసుకున్న నిర్ణయం వల్ల తన కుటుంబం బాధపడుతోంది. తను డబ్బులు ఇవ్వాల్సిన కళాకారులతో కూర్చుని మాట్లాడాల్సింది. ఎందుకంటే.. అందరూ తనతో కలిసి ప్రయాణం చేసినవాళ్లే! నా పరిస్థితి ఇలా ఉంది, చచ్చిపోవాలనిపిస్తోందని చెప్పుంటే ప్రతి ఒక్క డ్యాన్సర్ కరిగిపోయేవాళ్లు. మా కళాకారులు డబ్బులు ఇవ్వమని వేధించేంత కఠినమైనవాళ్లు కాదు. అన్నయ్య.. ఎందుకింత పని చేశావో అర్థం కావడం లేదు. మీరెంత మంచివాళ్లంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా తోటివారికి సాయం చేసేవాళ్లు. ఇటీవల జరిగిన ఓ ప్రోగ్రామ్‌లో అన్నయ్యకు కొంత డబ్బు రావాల్సి ఉంది. కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. కానీ మిగతా కొంతమంది ఆర్టిస్టులు అన్నయ్యకు హ్యాండిచ్చారు. దీంతో కమిటీ వాళ్లు రూ.6-7 లక్షలు పేమెంట్ ఇవ్వకుండా ఆపేశారు. అక్కడికి వచ్చిన ఆర్టిస్టులు తమకు డబ్బులివ్వకపోతే ఊరుకోరు కాబట్టి చైతన్య అన్నయ్య వేరే దగ్గర అప్పు తెచ్చి వాళ్లకు డబ్బులిచ్చారు. కళాకారులకు అన్యాయం చేయకూడదన్న మనస్తత్వం ఆయనది. ఇలా పేమెంట్ సర్దే క్రమంలో అప్పు మీద అప్పు చేస్తూ తను ఇబ్బందిపడ్డారు. నాలుగైదు రోజుల క్రితమే ఆయన్ని కలిశాను. నాకు ఢీ షోలో కనిపించాలనుంది, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్తే నెక్స్ట్ సీజన్లో ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన ఎంత ఎత్తులో ఉన్నా తన కింద ఉన్న కళాకారులకు ఎంతో మర్యాద ఇస్తారు' అని చెప్తూ భావోద్వేగానికి లోనైంది కండక్టర్ ఝాన్సీ. చదవండి: దుబాయ్‌లో లగ్జరీ విల్లా కొన్న మహేశ్‌బాబు డీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ ఆత్మహత్య -
ఢీ డ్యాన్స్ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్ చేసుకున్నారు. ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న చైతన్య అప్పుల బాధ తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెల్లూరు క్లబ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆత్మహత్యకు సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం ఇదే.. మోసం చేసిన సూపర్ స్టార్ ఎవరు?) 'మమ్మీ, డాడీ, చెల్లి నన్ను బాగా చూసుకున్నారు. ఏ కష్టం రానీయలేదు. చెల్లి ఫీల్ అవ్వొద్దు. లవ్ యూ అమ్మా. నా సహచరులందరికీ సారీ. నేను చాలామందిని ఇబ్బంది పెట్టేశా. మీ అందరికీ సారీ. డబ్బు విషయంలో నా మంచితనాన్ని కోల్పోయా. అప్పులు చేయడమే కాదు.. తీర్చే సత్తా ఉండాలి. సత్తా ఉంది.. కానీ నా వల్ల అవ్వట్లేదు. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నా. ఇది నా లాస్ట్ డే. అప్పుల బాధను తట్టుకోలేకపోతున్నా. నా వల్ల ఇబ్బంది పడిన వారందరికీ సారీ. డ్యాన్స్ షోతో నాకు పేరు వచ్చింది. కానీ తగినంత సంపాదన రాలేదు.' అంటూ సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. (ఇది చదవండి: మీకు హీరోలను అడిగే ధైర్యం ఉందా?.. శ్రియా కామెంట్స్ వైరల్) View this post on Instagram A post shared by ROCK N ROLL DANCE STUDIO (@team_rds_1) -
మెగా డాటర్ సింగిల్ స్టేటస్ మా విడాకులా..?
-
విడాకులు ఫిక్స్..?
-
విడాకుల రూమర్స్.. అదే సమస్య అంటూ ఓపెన్ అయిన నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. సినిమాల్లో కంటే ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన నిహారిక యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై దృష్టి పెట్టిన ఆమె పెళ్లి తర్వాత యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా నిహారిక భర్త చైతన్యకు దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు భార్యభర్తలిద్దదరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, మొదట చైతన్య పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేయడంతో విడాకుల రూమర్స్ తెరమీదకి వచ్చాయి. ఇక రీసెంట్గా నిహారిక కూడా ఒక్క ఫోటో మినహా పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేసేసింది. నెట్టింట వీరి విడాకుల రూమర్స్ హాట్‌టాపిక్‌గా మారినా ఇంతవరకు స్పందించని నిహారిక హాట్ ఫోటోషూట్స్‌తో మాత్రం రచ్చ చేస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్న ఆమె లేటెస్ట్ ఫోటోలతో ఫిదా చేస్తుంది. తాజాగా డెనిమ్ అవుట్‌ఫిట్‌లో గ్లామర్ ట్రీట్‌తో ఎక్స్‌పోజింగ్‌లో నో కాంప్రమైజ్ అంటూ ఫోటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
అనుకున్న పని చేసేసిన నిహారిక.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్
గత కొంతకాలంగా మెగాడాటర్ నిహారిక కొణిదెల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో మనస్పర్థల కారణంగా వీరి విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. ఇప్పటికే చైతన్య నిహారికను అన్‌ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేశాడు. ఇప్పుడు భర్త బాటలోనే నిహారిక కూడా ఇప్పటికే అతన్ని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయగా ఇప్పుడు చైతన్యతో దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసింది. దీంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా మారిన నిహారిక సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్ బ్యానర్‌కు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటినుంచో సొంతంగా ఆఫీస్ నెలకొల్పాలని కలలు కన్న నిహారిక తాజాగా ఆ పని పూర్తిచేసింది.దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీంతో పలువురు నిహారికకు కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. -
భర్తతో విడాకులు? ఒక్క ఫోటో తప్ప అన్నీ డిలీట్ చేసిన నిహారిక!
ప్రేమ, పెళ్లి, విడాకులు.. సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదాలు. చాలామంది సెలబ్రిటీలు ప్రొఫెషనల్ లైఫ్‌లో రాణించినా పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవితాంతం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసినప్పటికీ దాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమవుతుంటారు. మెగా డాటర్ నిహారిక- చైతన్య జొన్నలగడ్డ విషయంలోనూ ఇదే జరిగినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో హడావుడి చేసే ఈ జంట కొంతకాలంగా గప్‌చుప్ అయిపోయింది. గత నెలలో చైతన్య తమ పెళ్లి ఫోటోలు సైతం డిలీట్ చేశాడు. ఇద్దరూ ఒకరినొకరిని అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. దీంతో వీరి మధ్య వైరం నడుస్తోందని, విడాకులు తథ్యమని ప్రచారం జోరందుకుంది. తాజాగా నిహారిక కూడా తమ పెళ్లి ఫోటోలు, చైతన్యతో కలిసి దిగిన పిక్స్ డిలీట్ చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. అన్ని ఫోటోలు తొలగించిన నిహారిక ఒక్కటి మాత్రం అలాగే ఉంచేసింది. ఇందులో పెళ్లి మండంలో చైతన్య పక్కనే ఉంది నటి. కాకపోతే అందులో చైతన్యను కొంత బ్లర్ చేసినట్లుగా ఉంది. 'నా దగ్గర ఓ రహస్యం ఉంది. కానీ మీకు చెప్పేస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది? సారీయే, చెప్పలేను' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఈ ఒక్క ఫోటో మాత్రం ఎందుకు అలాగే ఉంచేశావ్? మర్చిపోయావా? అని ఆరా తీస్తున్నారు. ఇకపోతే నిహారిక తన పెళ్లి వేడుకల్లో చైతన్యతో కాకుండా ఫ్యామిలీతో దిగిన ఫోటోలను సైతం అలాగే ఉంచేసింది. కాగా 2020 ఆగస్టు 13న చైతన్య, నిహారికల నిశ్చితార్థం జరిగింది. కరోనా కారణంగా పెళ్లి కొంతకాలం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు అదే ఏడాది డిసెంబర్ 9న వీరు పెళ్లిపీటలెక్కారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
నాలుగు నెలల తర్వాత ఫోటోలు షేర్ చేసిన నిహారిక..
మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య మధ్య విభేదాలు వచ్చాయంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. పైగా చైతన్య పెళ్లి ఫోటోలన్నింటనీ డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. దీనికితోడు గతంలో సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే నిహారిక కొంతకాలం నుంచి సైలెంట్ అయిపోయింది. డిసెంబర్లో చివరిసారిగా వీడియో షేర్ చేసిన ఆమె ఇటీవలే తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను సైతం పంచుకుంది. వీడియోల సంగతి పక్కనపెడితే నిహారిక చివరిసారిగా నవంబర్ 9న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసింది. ఆ తర్వాత ఎటువంటి పిక్స్ పోస్ట్ చేయలేదు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ ఫోటోస్ అప్లోడ్ చేసింది నిహారిక. లంగా వోణీలో ట్రెడిషనల్‌గా రెడీ అయిన పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తన ఫోటోలు చూసి ఎంతందంగా ఉన్నావో అని అభిమానులు కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం నీ భర్త ఎక్కడ? మీరు ఎందుకు అన్‌ఫాలో చేసుకున్నారు? చైతన్య మీ ఫోటోలను ఎందుకు డిలీట్ చేశారు? అంటూ తన వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీస్తున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం.. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం.. మళ్లీ విడాకులు తీసుకోవడం.. ఏంటో! అని వ్యంగ్యాస్త్రాలు సంధించగా ఆమె పెట్టిన ఫోటోలకు నీ కామెంట్‌కు ఏమైనా సంబంధం ఉందా? అంటూ నిహారిక ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
భర్తతో విడాకుల రూమర్స్.. వైరల్ అవుతున్న నిహారిక పోస్ట్
మెగా డాటర్ నిహారిక విడాకుల రూమర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2020లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య కొంతకాలంగా విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ పార్టీలకు జంటగా వెళ్లే నిహారిక-చైతన్యలు ఈమధ్య అస్సలు కనిపించడం లేదు.దీనికి తోడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, నిహారికతో ఉన్న ఫోటోలు సహా పెళ్లి ఫోటోలన్నింటిని చైతన్య డిలిటీ చేసేయడంతో నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయ్యింది. విడాకుల వార్తల నేపథ్యంలో నిహారిక తాజాగా ఇన్‌స్టాలో ఓ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రోమోను షేర్ చేసింది. `డెడ్ పిక్సెల్స్`అనే టైటిల్ తో తెరకెక్కుతున్నఈ ప్రాజెక్ట్‌ను స్వయంగా నిహారిక నిర్మించడమే కాకుండా నటించిందట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
ఆ ఒక్క ఫోటో మాత్రం డిలీట్ చేయని చైతన్య..
మెగా డాటర్ నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడిపోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే నిహారిక ఈ మధ్య తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయడమే లేదు. అటు చైతన్య కూడా నిహారికతో ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు. దీనికితోడు సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. పైగా చైతన్య పెళ్లి ఫోటోలు సైతం డిలీట్ చేశాడు. నిహారికతో కలిసి దిగిన పిక్స్ కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తొలగించాడు. అయితే ఒక్క ఫోటో మాత్రం అలాగే ఉంచాడు. తను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న గోల్డెన్ రిట్రైవర్ జాతికి చెందిన కుక్కపిల్ల బజ్‌తో నిహారిక దిగిన ఫోటో అతడి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికీ ఉంది. ఈ ఫోటో 2020 డిసెంబర్ 18న అప్లోడ్ చేశాడు. ఈ జంట విడిపోతుందంటూ పుకార్లు మొదలైన నేపథ్యంలో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా నిహారిక, చైతన్య 2020 ఆగస్టు 13న నిశ్చితార్థం చేసుకున్నారు. కరోనా కారణంగా పెళ్లి కొంత ఆలస్యమైంది. ఎట్టకేలకు అదే ఏడాది డిసెంబర్ 9న ఈ జంట పెళ్లి పీటలెక్కింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వీరి వివాహానికి వేడుకగా మారింది. View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) -
నిహారిక, చైతన్యల మధ్య పెరుగుతున్న దూరం ? అందుకే పెళ్లి ఫోటోలు డిలీట్!
టాలీవుడ్‌లోని స్వీట్ కపుల్లో మెగా డాటర్ నిహారిక- చైతన్య జొన్నలగడ్డ జంట ముందువరుసలో ఉంటుంది. నాగబాబు ముద్దుల కూతురైన నిహారిక, వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డ వివాహం 2020 డిసెంబర్లో అంగరంగ వైభవంగా జరిగింది. చైతన్య కామ్ అండ్ కంపోజ్డ్ అయితే నిహారిక తెగ అల్లరి పిల్ల. వీరి ఈడూజోడీ చూసి అందరూ ముచ్చటపడ్డారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే వీరిద్దరూ తరచూ తమ ఫోటోలను అభిమానులతో పంచుకునేవారు. ఏమైందో ఏమో కానీ, ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ దంపతులు కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. వెకేషన్స్, పార్టీలంటూ జంటగా తిరిగే వీళ్లిద్దరూ బయట కలిసి కనిపించడం లేదు. అటు సోషల్ మీడియాలో కూడా సింగిల్‌గానే ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. చైతన్య అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలను డిలీట్ చేశాడు. నిహారికతో కలిసి ఉన్న పిక్స్ సైతం డిలీట్ చేయడంతో నెట్టింట బ్రేకప్ రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ జంట విడిపోతుందనే వార్తలు చూసి మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలా విడాకుల రూమర్లు రావడం కొత్తేమీ కాదు. గతేడాది సైతం నిహారిక, చైతన్య విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. నిహారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడంతో వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, విడిపోతున్నారేమోనని అంతా భావించారు. ఆ సమయంలో చైతన్య ఈ రూమర్లకు చెక్ పెడుతూ తామిద్దరూ కలిసి దిగిన ఫోటో షేర్ చేయడంతో ఆ ప్రచారానికి తెర పడింది. కానీ ఈసారి ఏకంగా చైతన్యే.. పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో ఇదేదో సీరియస్ విషయంలా ఉందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. ఇకపోతే చైతన్య జొన్నలగడ్డ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిబ్రవరి 15న చివరిసారి ఓ ఫోటో షేర్ చేశాడు. దీని కింద అందరూ బ్రేకప్ చెప్పుకున్నారా? పెళ్లి ఫోటోలు ఎందుకు డిలీట్ చేశారు? నిహారిక ఎక్కడ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) -
నేరుగా ఓటీటీలోకి వస్తున్న ‘జగమేమాయ’.. రిలీజ్ ఎప్పుడంటే?
చైతన్య, తేజ, ధన్య బాలకృష్ణన్ కీలక పాత్రల్లో సునీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జగమేమాయ'. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అయింది. నేరుగా ఓటీటీలోనే ఈ మూవీ విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా డిసెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే.. 'నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను.' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ సమాజంలో మనుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? డబ్బు కోసం ఎలాంటి పనులు చేస్తారు? వంటి అంశాలను ‘జగమేమాయ సినిమాలో చాలా విలక్షణంగా ఆవిష్కరించినట్లు అర్థమవుతోంది. ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్న రిలేషన్‌పై డబ్బు ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. -
మూవీ ఎంట్రీపై మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య క్లారిటీ!
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె నటిగా రాణించింది. ఇక పెళ్లి అనంతరం ప్రొడ్యూసర్‌గా మారిపోయింది. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్, సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆమె భర్త గురించి ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కాగా పెళ్లి అనంతరం నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య సినిమాల్లోకి రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. చదవండి: విజయ్, రష్మిక డేటింగ్? హింట్ ఇచ్చిన అనన్య పాండే దీంతో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నాడంటూ అందరు చర్చించుకున్నారు. చైతన్య హైట్, పర్సనాలిటి కూడా హీరోకు ఏమాత్రం తీసిపోకుండ ఉండటంతో అంతా అతడి ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తన మూవీ డెబ్యూ చైతన్య సన్నిహితుల నుంచి ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా చైతన్యకు సినిమాలు, నటన అంటే పెద్ద ఆసక్తి లేదని, అతడి వ్యాపారం అంటనే ఇష్టమని చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: రష్మికపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు నిహారికి పెళ్లి అనంతరం ఎక్కడికి వెళ్లిన చైతన్యకు తన సినీ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురవుతున్నాయట. వాటికి విసిగిపోయిన చైతన్య తనకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదని, ప్రస్తుతం తాను చేస్తున్న వ్యాపారం పట్ల సంతృప్తిగా ఉన్నానని కుండలు బద్ధలు కొట్టినట్లు సన్నిహితుల నుంచి సమాచారం. కాగా నిహారిక-చైతన్యలు 2020 లాక్డౌన్లో డిసెంబర్ 9న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. -
భర్తతో నిహారిక రొమాంటిక్ ఫోటో లీక్
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా రాణిస్తుంది. ఈ మధ్యకాలంలో వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్న నిహారిక పేరు మరోసారి హాట్‌టిపిక్‌గా మారింది. భర్తతో నిహారిక లిప్‌లాక్ ఫోటో ఒకటి బయటికొచ్చింది. విడిపోని బంధం అంటూ నిహారిక భర్తతో దిగిన రొమాంటిక్ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. గత కొంతకాలంగా నిహారిక పర్సనల్ లైఫ్‌కి సంబంధించి రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి చెక్ పెట్టేందుకే నిహారిక ఇలాంటి ఫోటోతో సమాధానమిచ్చిందంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఇంత బోల్డ్ అవసరమా అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఈ ఫోటోను నిహారిక షేర్ చేయలేదు. అంతేకాకుండా ఇది లేటెస్ట్ పిక్ కూడా కాదు. నిహారిక కొణిదెల పేరుతో ఎవరో ఓ అకౌంట్‌ను క్రియేట్ చేసి ఈ బోల్డ్ పిక్‌ను షేర్ చేశారు. కాసేపట్లో ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. -
పబ్ ఇన్సిడెంట్ తర్వాత తొలిసారి భర్తతో కనిపించిన నిహారిక
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఫుడింగ్ అండ్ మింక్ పబ్ రైడ్‌లో నిహారిక ఉండటం సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో నిహారికతో పాటు బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు ప్రముఖుల పిల్లలు ఉండటం అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. చదవండి: హీరోయిన్ మాట్లాడుతుంటే చై ఏం చేస్తున్నాడో చూడండి.. అయితే ఆ ఇన్సిడెంట్ తర్వాత నిహారిక బయట పెద్దగా కనిపించలేదు. దీనికి తోడు అంతకుముందే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడంతో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లయ్యింది. అయితే ఈ వివాదం తర్వాత తొలిసారిగా నిహారిక తన భర్తతో కలిసి ఓ ఈవెంట్లో కనిపించింది. ‘హలో వరల్డ్ ‘పేరుతో నిహారిక నిర్మిస్తున్న ఓ వెబ్‌సిరీస్ ఓపెనింగ్ ఈవెంట్లో భర్తతో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: లీకైన నిహారిక న్యూలుక్ ఫోటోలు.. నెట్టింట వైరల్ View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) -
'30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య హీరోగా ఇంట్రెస్టింగ్ మూవీ..
30 Weds 21 Fame Chaitanya Movie With Pelli Chupulu Producer: '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ ఫేమ్ చైతన్య రావ్ మాధాడి బంపర్ ఆఫర్ కొట్టేశాడు. గతేడాది యూట్యూబ్‌లో విడుదలై ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌లలో ‘30 వెడ్స్ 21’ ఒకటి. ఈ వెబ్‌సిరీస్ ఎంతలా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల యువతిని ఇచ్చి పెళ్లి చేస్తే వారి మధ్య ఉండే భావేద్వేగాలు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దిన ఈ వెబ్‌సిరీస్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో చైతన్య రావ్ మాధాడి, అనన్య శర్మ జోడి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సిరీస్‌తో వచ్చిన ఫేమ్‌తో హీరోగా మారాడు చైతన్య. పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, ఏబీసీడీ వంటి పలు హిట్ చిత్రాలకు బిగ్‌బెన్ సినిమాస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. భారత జాతీయ అవార్డు గుర్తింపుతో మంచి కంటెంట్‌తో చిత్రాలు తీసే నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. న్యూ టాలెంట్ డైరెక్టర్లకు అవకాశమిస్తూ సినిమాపై తనకున్న ప్యాషన్ చూపిస్తున్నారు నిర్మాత యశ్ రంగినేని. ఈ క్రమంలోనే 'పిట్ట కథ' మూవీ డైరెక్టర్ చెందు ముద్దు దర్శకత్వంలో చైతన్య హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తోపాటు ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. త్వరలో నటీనటులు, సాంకేతిక నిపుణల వివరాలను తెలియజేస్తామని నిర్మాత పేర్కొన్నారు. Delighted to announce our next 🙏@IamChaitanyarao #ChenduMuddu@GskMedia_PR @YashBigBen pic.twitter.com/LqJ8q6vXrP — BIGBEN Cinemas (@BigBen_Cinemas) March 9, 2022 -
‘30 వెడ్స్ 21’వెబ్‌సిరీస్ సీజన్-2 రెడీ.. ఫస్ట్‌లుక్ రిలీజ్
గతేడాది యూట్యూబ్‌లో విడుదలైన ‘30 వెడ్స్ 21’వెబ్‌సిరీస్ ఎంతలా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల యువతిని ఇచ్చి పెళ్లి చేస్తే వారి మధ్య ఉండే భావేద్వేగాలు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దిన ఈ వెబ్‌సిరీస్ అప్పట్లో యూట్యూబ్‌ను షేక్ చేసింది. చైతన్య, అనన్య జోడి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఫ్రెష్ కాన్సెప్ట్‌తో యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసిన ఈ వెబ్‌సిరీస్ ఇప్పుడు రెండో సీజన్‌కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా సీజన్-2 సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్‌ను రేపు(జనవరి31)విడుదల కానుంది. This valentine's month, Meet our most loved married couple, Meghana and Prudhvi again 💝 Presenting the first look of #30Weds21 season 2 Teaser out on 31 Jan@ananyaontweet @IamChaitanyarao @prithvi_vanam@anuragmayreddy @SharathWhat @scaler_official pic.twitter.com/EahWAhhNLh — ChaiBisket (@ChaiBisket) January 30, 2022 -
నిహాకు ఎప్పుడు అదే పని.. ఫొటోతో బుక్ చేసిన భర్త చైతన్య
మెగా డాటర్ నిహారిక కొణిదెల దంపతులు వేకేషన్లో ఉన్నారు. డిసెంబర్ 9న వారి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరి సందర్భంగా నిహారిక-చైతన్యలు ఇటీవల స్పెయిన్‌కు పయనయ్యారు. ఈ క్రమంలో ఈ జంట అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. స్పెయిన్, బార్సిలోనాలోని పర్యటక ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడి అందమైన ప్రదేశాలను ఆస్వాధిస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు నిహారికి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. ఈ క్రమంలో నిహారిక-చైతన్యలు స్కై డైవింగ్ గురించి మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరూ కౌంటర్ ఇచ్చుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) అయితే వీరిద్దరూ విదేశీ పర్యటనకు వెళ్లిన డే వన్ నుంచి అక్కడ వారు ఎంజాయ్ చేస్తున్న ప్రతి మూమెంట్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో డిన్నర్ చేయడానికి నిహారిక-చైతన్యలు రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ తినకుండా నిహా తన ఫోన్లో బిజీగా ఉంది. తనని సెల్ఫీ తీస్తూ ‘ఎప్పుడు ఇదే పని, ప్రతి క్షణం ఫోన్లో ఇలా బిజీ ఉంటుంది’ అంటూ ఫిర్యాదు చేశాడు. నిహారిక అలాగే ఫోన్ చూస్తున్న మరో ఫొటోను కాసేపటికి షేర్ చేస్తూ ‘కొన్నిమిలియన్ క్షణాల తర్వాత’ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక వీరిద్దరి అల్లరి చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక త్వరలోనే వీరి మొదటి వివాహ వార్సికోత్సవం సందర్భంగా నెటిజన్లు ఈ జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
నా భర్తకు నేను సినిమాలు చేయడం ఇష్టం: నిహారిక
Niharika Konidela About Quitting Movies: మెగా తారల గారాల పట్టి నిహారిక కొణిదెల. అల్లరితో, యాక్టింగ్‌తో అలరించిన ఈ నటి నిర్మాతగానూ సత్తా చాటుతోంది. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న నిహారిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఒక యాక్టర్‌గా తనకు చిరంజీవిగారే స్ఫూర్తి అని చెప్పింది. హీరోయిన్లకు పెళ్లయినా కెరీర్ ఏం మారడం లేదని అందుకు సమంతను ఉదాహరణగా పేర్కొంది. సమంతకు పెళ్లికి ముందు ఎంత క్రేజ్ ఉండేదో, పెళ్లయ్యాక కూడా అలాగే ఉందని చెప్పుకొచ్చింది. ఇక తన గురించి చెప్తూ భర్త చైతన్యకు తాను సినిమాలు చేయడం ఇష్టమని, అందుకే మూవీస్ కంటిన్యూ చేశానంది. సినిమాలు కాకుండా ఏదైనా చేద్దామని టీచ్ ఫర్ ఇండియా అనే కార్యక్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పానంది. అయినా మూవీస్‌పై ఇష్టంతో ప్రొడక్షన్ స్టార్ట్ చేశానని చెప్పుకొచ్చింది. ముద్దపప్పు ఆవకాయ్, నాన్నకూచీలతో పాటు యంగ్‌స్టర్స్‌తో కలిసి స్నేహంపై ఓ వెబ్‌సిరీస్ తీశానన్న నిహారిక ఇటీవలే 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ప్రొడక్షనే కాకుండా యూట్యూబర్ నిఖిల్‌తో కలిసి ఓ సూపర్ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నానన్న ఆమె దానికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. చదవండి: Uttej Very Emotional Words: చాలా నొప్పిగా ఉంది పద్దూ.. ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్ -
అపార్ట్మెంట్ న్యూసెన్స్ కేసు : నిహారిక భర్త చైతన్య క్లారిటీ
Niharika Husband Chaitanya Clarity On Case Filed: షేక్‌పేట్‌లోని అపార్ట్మెంట్ వాసులతో జరిగిన వివాదంపై నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య క్లారిటీ ఇచ్చారు. అపార్ట్మెంట్ వాసులు గొడవ చేయడం వల్లే పీఎస్‌లో ఫిర్యాదు చేశానని తెలిపిన చైతన్య.. అందరం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నట్లు తెలిపారు. అయితే ముందు తనమీదే కేసు నమోదైనట్లు వార్తలు రావడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఆగస్టు 10లోగా ఫ్లాట్ ఖాళీ చేస్తున్నట్లు ముందే ఓనర్‌కి చెప్పినట్లు పేర్కొన్నారు. 'ఫ్లాట్ తీసుకున్నప్పుడే ఆఫీస్ పర్పస్ కోసమని ఓనర్‌కి చెప్పాం, అయితే అపార్ట్మెంట్ అసోసియయేషన్‌కు క్లారిటీ లేకపోవడంతో వాదనకు దిగారు' అని చైతన్య గొడవపై వివరణ ఇచ్చారు. ఇక ఇదే విషయంపై అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. అపార్ట్‌మెంట్‌ను నిహారిక దంపతులు కమర్షియల్‌గా వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆఫీస్ కోసమని ఫ్లాట్ తీసుకున్న విషయం తమకు తెలియదని, దీంతో వాదన జరిగినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు అందరం కలిసి సమస్యను పరిష్కరించుకున్నామని వివరించారు. కాగా చైతన్య అర్ధరాత్రిపూట గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న చైతన్య అక్కడే ఆఫీస్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడట. గత కొన్ని రోజులుగా ఫ్లాట్‌కు కొంతమంది యువకులు వస్తున్నారని, వారు మద్యం తాగి నానా హంగామా సృష్టిస్తున్నట్లు అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ వాసులపై కూడా చైతన్య తిరిగి ఫిర్యాదు చేశాడు. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్మెంట్ వాసులు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇరువురి వాదనలు విన్న పోలీసులు విచారణ జరిపి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.కాగా చైతన్య జొన్నలగడ్డతో నిహారిక కొణిదెల వివాహం డిసెంబర్ 9న ఉదై విలాస్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. -
నిహారిక ఇంట్లో అర్ధరాత్రి గొడవ
-
అర్ధరాత్రి గొడవ, నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు?
సాక్షి, హైదరాబాద్: మెగా డాటర్ నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య అర్ధరాత్రిపూట గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం అర్ధరాత్రి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఇంట్లో గొడవ జరిగింది. దీంతో కంగారుపడ్డ అపార్ట్మెంట్ వాసులు వారింటికి వెళ్లగా చైతన్య వారి మీద కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడంటూ అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అపార్ట్మెంట్ వాసులపై చైతన్య కూడా తిరిగి ఫిర్యాదు చేశాడు. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్మెంట్ వాసులు భంగం కలిగిస్తున్నారని ఆరోపించాడు. దీంతో ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. కాగా మెగా డాటర్ నిహారిక- జొన్నలగడ్డ చైతన్యల వివాహం డిసెంబర్ 9న జరిగిన విషయం తెలిసిందే. -
పార్ధూ ఇంకోసారి చూసి చెప్పు: నిహారిక వైరల్ పోస్ట్
నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి తర్వాత మరింత యాక్టివ్‌గా కనిపిస్తోంది. భర్త జొన్నలగడ్డ చైతన్యతో కలిసి టూర్లు చుట్టోస్తూ.. మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. అత్తారింట్లో అడుగుపెట్టిన అనంతరం మెగా డాటర్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారిపోయింది. నిత్యం ట్రెండీ లుక్‌లోనే దర్శనమిస్తుంది. ఎక్కడికెళ్లినా తమ జంట దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా చైతన్య- నిహారిక జంట వెకేషన్ ట్రిప్‌లో భాగంగా పాండిచ్చేరి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ హోటల్ రూమ్‌లో దిగిన ఓ హాట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫోటోకు పెట్టిన కామెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అద్దంలో తనను తానే చూసుకుంటున్న ఈ ఫోటోపై 'పార్ధు ఇంకోసారి చూసి చెప్పు' అంటూ అతడు సినిమాలో త్రిష చెప్పిన డైలాగ్‌ను గుర్తుచేస్తూ కామెంట్‌గా పెట్టింది. అయితే ఇక్కడే ఓ షరతు పెట్టింది ఈ బ్యూటీ. ఈ డైలాగ్ ఏ సినిమాలో ఉందో గుర్తురాని వాళ్ళు దయచేసి కామెంట్ చేయొద్దు అని ఆమె పేర్కొంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. పెళ్లి తర్వాత నిహారిక గ్లామర్ డోస్ పెంచిదని కొందరు, అయినా ఏం బాలేదని మరికొందరు బదులిస్తున్నారు. కాగా ప్రస్తుతం నిహారిక పాండిచ్చేరిలో దిగిన ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
30 Weds 21: నెలకు 3 లక్షల జీతం.. అయినా వద్దనుకున్నా: చైతన్య
హీరో చైతన్య రావు తెలుసా మీకు.. అబ్బే.. ఈ పేరు ఎక్కడ వినలేదండి అంటారా? ఆగండి అయితే.. 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ పేరు విన్నారా? వినడమేంటండి అల్రెడీ 6 ఎపిసోడ్స్ చూసేశాం అంటారా? అందులో 30 ఏళ్ల బ్యాచిలర్ పృథ్వి గుర్తు ఉన్నాడు కదా.. ఆ క్యారెక్టర్ చేసిన వ్యక్తే చైతన్య. తనదైన శైలీలో సహజంగా, అద్భుతంగా నటించి సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కొత్తగా పెళ్లైన కుర్రాడిగా, అమాయకపు భర్తగా, ఉద్యోగిగా, మంచి స్నేహితుడిగా అందరికి కనెక్ట్ అయ్యాడు చైతన్య. తాజాగా ఆయన తన వ్యక్తిగత విషయాలను ఓ మీడియాతో పంచుకున్నాడు. తనకు సినిమాలంటే పిచ్చి అని, అందుకే నెలకు మూడు లక్షలకు పైగా జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకోని వచ్చానని చెప్పాడు. ‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. అమ్మ నాన్న మాట కాదనలేక అస్ట్రేలియాకు వెళ్లి ఎంబీఏ పూర్తి చేశాను. అక్కడే ఓ ఎమ్మెన్సీలో ఉద్యోగంలో చేరాను. నెలకు మూడు లక్షల జీతం వచ్చేది. అయినా సంతృప్తిగా అనిపించలేదు. సినిమాలపై పిచ్చితో ఆ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్‌కి వచ్చాను. అప్పుడు అందరూ నన్ను తిట్టారు. కానీ నేను మాత్రం మొండిగానే సినిమాల కోసం ప్రయత్నించాను. అలా 2016లో ‘బందూక్’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. నటనకి మంచి పేరు వచ్చినా అది పెద్దగా ఆడలేదు. అయినా నేను ప్రయత్నాలు ఆపలేదు. ప్రేమమ్, శమంతకమణి, గువ్వా గోరింక, హవా, సినిమాల్లో రెండో హీరోగా వకీల్‌సాబ్‌లో చిన్న పాత్ర చేశాను. ఇక ఇప్పుడు ఈ సిరీస్ హిట్ అవ్వడంతో అందరూ ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. అమ్మాయిల నుంచి ప్రపోజల్స్ వస్తున్నాయి. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. హీరోగా సెటిల్ అయ్యాకనే పెళ్లి చేసుకుంటా’అని చైతన్య చెప్పుకొచ్చాడు. చదవండి: ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్ రివ్యూ నేను చిన్నపిల్లని, బ్రేకప్ లాంటివి లేవు: అనన్య -
భార్య కోసం వంట చేసిన నిహారిక భర్త
మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పుటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం నిహారిక-చైతన్య తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. భర్తతో గడిపిన ప్రత్యేక క్షణాలను నిహారిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. అలాగే ఫన్నీ వీడియోలు, కొత్తరకం వంటకాల వీడియోaను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. అయితే ఈసారి నిహారిక కోసం ఆమె భర్త చైతన్య వంటగదిలోకి దూరిపోయాడు. భార్య కోసం చోరిజో స్పానిష్ రైస్ అనే డిష్‌ను స్వయంగా తన చేత్తో వండి తినిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక తేడాది డిసెంబర్9న నిహారిక-చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఇక పెళ్లి తర్వాత వృత్తిపరంగానూ ఫోకస్ పెట్టిన నిహారిక ఇప్పటికే ఓ వెబ్‌సిరీస్‌కు సైన్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి :నిహారిక పోస్ట్‌పై భర్త షాకింగ్ కామెంట్స్ ! నిహారిక కాలికి గాయం..సేవలు చేస్తున్న చైతన్య -
నేను చిన్నపిల్లని, బ్రేకప్ లాంటివి లేవు: అనన్య
30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల యువతికి వివాహం జరిగితే ఎలా ఉంటుంది? పెళ్లి తర్వాత వారి మధ్య చోటు చేసుకునే సన్నివేశాలు, భావోద్వేగాలు, చిలిపి తమాషాలు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‌తో వచ్చింది "30 వెడ్స్ 21". 'నో ప్రెజరమ్మా..', 'మోకాల్ చిప్పలు పగలగొడ్త..' వంటి హీరోయిన్ డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా 'జీవితమే ఒక సముద్రమైతే అందులో ఉప్పు నా దరిద్రం' అన్న కొటేషన్‌ను బీభత్సంగా వాడేస్తున్నారు. తాజాగా 30 వెడ్స్ 21 టీమ్ చైతన్య, అనన్య, శరత్ సాక్షి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయని చెప్పారు. దీనికి భీమవరం అబ్బాయి జోస్ జిమ్మీ సంగీతం అందించాడని, ఈ టీమ్‌లో అందరూ కొత్తవాళ్లేనని పేర్కొన్నారు. ఇక హీరో చైతన్యది కరీంనగర్ కాగా హీరోయిన్ అనన్య వరంగల్ పుట్టి కరీంనగర్లో పెరిగానని చెప్పింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తను ఈసీఎమ్ చదువుతున్నానని, కాలేజీ డేస్ నుంచే నాటకాల్లో పాల్గొనేదాన్నని తెలిపింది. తనింకా చిన్నపిల్ల అని, బ్రేకప్లాంటివి ఏమీ లేవని చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలో ఆన్లైన్ క్లాసులు వింటూ యాక్టింగ్ చేసేదాన్నని చెప్పింది. మరి వాళ్లు ఇంకా ఏమేం విషయాలు చెప్పారో తెలియాలంటే కింది ఇంటర్వ్యూ చూసేయండి.. చదవండి: మహేశ్ 'పార్థు' మూవీ! ఫారిన్లో షూట్? -
అల్లుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు.. ఏంటో తెలుసా!
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లి జొన్నలగడ్డ చైతన్యతో గత డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం నిహారిక-చైతన్య తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. భర్తతో గడిపిన ప్రత్యేక క్షణాలను నిహారిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా నాగాబాబు తన ఒక్కగానొక్క అల్లుడికి ఓ లగ్జరీ గిఫ్ట్‌ను అందించారు. అల్లుడు చైతన్యకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు. రేంజ్ రోవర్ డిస్కవర్ తెలుపు రంగు కారును అల్లుడికిస్తూ.. నిహారిక, చైతన్యలను సర్ప్రైజ్ చేశారు. ఈ విషయాన్ని నాగబాబు శనివారం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. నా అల్లుడికి ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ ఇన్‌స్టాలో పేర్కొన్నారు. ఈ మేరకు కూతురు నిహారిక, చైతన్యకు కారును డెలివరీ చేస్తున్న ఫోటోను షేర్ చేశారు. దీని ఖరీదు దాదాపు 70 లక్షలు ఉంటుదని అంచనా. అయితే వాస్తవానికి ఇది ఉగాదికి ఇవ్వాల్సిన కానుక అని.. కానీ కాస్త ఆలస్యం అయ్యిందని నాగబాబు తన యూట్యూబ్ చానల్లో తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. -
నిహారిక పోస్ట్‌పై భర్త షాకింగ్ కామెంట్స్ !
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక..గతేడాది డిసెంబర్9న మిసెస్ నిహారికగా మారిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం భర్త చైతన్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. అలాగే వృత్తిపరంగానూ ఫోకస్ పెట్టింది. పెళ్లి తర్వాత ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిహారిక..ఇటీవలె ఓ సినిమాకి కూడా సైన్ చేసిందని సమాచారం. తాజాగా ఓ షోటోషూట్‌లో పాల్గొన్న నిహారిక దానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే ఈ పోస్టును పూర్తిగా తెలుగులో టైప్ చేయడం విశేషం. నిహారిక చేసిన ఈ పోస్ట్‌కు భర్త చైతన్య స్పందిస్తూ..'గులాబి కళ్ళు రెండు ముల్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే' అంటూ తన బావ రామ్‌చరణ్ పాటతో శ్రీమతిని పొడగ్తలతో ముంచెత్తాడు. మరోవైపు ఎలాంటి తప్పులు లేకుండా నిహారిక చేసిన ఈ తెలుగు పోస్ట్‌పై కల్యాణ్ దేవ్ సహా పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) చదవండి: మెగాస్టార్‌తో ఉన్న ఈ చిచ్చరపిడుగులను గుర్తుపట్టారా? మాల్దీవుల్లో టాలీవుడ్ జంటల రచ్చ.. వైరలైన ఫోటోలు -
నిహారిక కాలికి గాయం..సేవలు చేస్తున్న చైతన్య
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం గతేడాది డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మెగా డాటర్ భర్త చైతన్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. అలాగే వృత్తి పరంగాను బిజీగా ఉంది. పెళ్లి తర్వాత తొలి వెబ్ సిరీస్ మొదలు పెట్టిన నిహారిక ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్‌తో బిజీగా ఉంది. అయితే షూటింగ్ సమయంలో నిహారిక కాలికి గాయం అయినట్లు తెలుస్తోంది. కాలికి పట్టి కట్టిన ఫోటోని తన ఇన్‌స్ట్రాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన నిహారిక.. ‘భార్యను భర్త బుజ్జగిస్తున్న కార్యక్రమంలో నేటి ఎపిసోడ్ ఏంటంటే.. ''కాటన్ క్యాండీ'' అని క్యాప్షన్ ఇచ్చింది. ఆ ఫొటో తన చేతిలో ఓ బాక్స్ కనిపించింది. అందులో కాటన్ క్యాండీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన కాలికి గాయం అయిన విషయాన్ని మాత్రం నిహారికగా డైరెక్ట్‌గా చెప్పలేదు. అసలు ఆ గాయం ఎందుకు అయిందో కూడా పేర్కొనలేదు. కానీ ఫొటోలో ఆమెకు కాలికి ఉన్న పట్టీ చూసి.. ఖచ్చితంగా గాయపడిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె రాయుడు చిత్రాలు బ్యానర్‌పై భాను రాయుడు దర్శక నిర్మాతగా రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో మరో కీలక పాత్రలో యాంకర్ అనసూయ నటిస్తోంది. -
భర్త ప్రేమ సందేశం: నిహారిక భావోద్వేగం
నాగబాబు ముద్దుల కూతురు కొణిదెల నిహారిక ఇటీవలే పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టి విషయం తెలిసిందే. నిహారిక, చైతన్యల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో డిసెంబర్ 9న వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తూ చైతన్యపై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు నిహారిక. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లిలో జరిగిన కొన్ని కీలకమైన దృశ్యాలను కట్ చేసి ఓ వీడియో రూపంలో షేర్ చేశారు. ఇందులో నిహారికను పెళ్లి కూతురిని చేస్తున్నప్పటి నుంచి తాళి కట్టే సందర్భం, పెళ్లి వేడుకలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు, ఇలా ఎన్నో మధుర క్షణాలను ఈ వీడియోలో పంచుకున్నారు. ఇక తాళి కడుతున్న సందర్భంలో నిహారిక తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు వీడియో చూస్తే తెలుస్తోంది. చదవండి: మాటలు తగ్గించేసింది: నాగబాబు ఎమోషనల్ అలాగే పెళ్లి కుమార్తెగా సిద్ధమవుతున్న సమయంలో కాబోయే భర్త చైతన్య పంపించిన ఓ సందేశంతో నిహారిక కన్నీళ్లు పెట్టుకున్నారు. ''డియర్ నిహా.. మూడు ముళ్ల బంధంతో మన ప్రయాణాన్ని మొదలుపెడుతున్న ఈ సమయంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటాను. 30 ఏళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని.. నా జీవితానికి అర్థం నువ్వేనని కూడా తెలిసింది'' అని పేర్కొన్నారు చైతన్య. ఇక కాబోయే వాడు అంతా ప్రేమగా ఈ మాటలు చెప్పడంతో అది విన్న నిహారిక పట్టరానంత ఆనందంతో ఏడ్చేశారు. కళ్యాణ తిలకం దిద్దుతున్న చిరంజీవి కూతూరు సుష్మితను హత్తుకొని చాలా ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి : హ్యాపీ బర్త్‌డే బంగారు.. ఐ లవ్ యూ.. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
నిహారిక దంపతుల హనీమూన్ ప్లాన్
కొణిదెల వారింటి గారాల పట్టి, నటి నిహారిక వివాహం జొన్నలగడ్డ చైతన్యతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు మెగా హీరోలు హాజరయ్యారు. స్టార్ హీరోలు ఒకేచోట చేరి సందడి చేయడంతో దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి తర్వాత నూతన దంపతులు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ మధ్యే మెట్టినింట్లో అడుగు పెట్టిన నిహా తొలిసారి భర్తతో కలిసి బర్త్‌డే జరుపుకుంది. ‘నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్’ అంటూ నిహారికకు చైతన్య వినూత్నంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: మెట్టినింట్లో నిహారిక ఫస్ట్ బర్త్‌డే.. పార్టీ ఎక్కడంటే) తాజాగా ఈ జంట హనీమూన్‌కు ప్లాన్ చేస్తోందట. సెలబబ్రిటీల ఫేవరెట్ స్పాట్ అయిన మాల్దీవులకు వెళ్లడానికి ఈ దంపతులు ఆసక్తి చూపిస్తున్నారట. అయితే ఈ హనీమూన్ 2020 చివర్లో ఉంటుందా? కొత్త సంవత్సరం ప్రారంభంలో ఉంటుందా? అనేది ఈ కొత్త జంట క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా ఎందరో సెలబ్రిటీలతో పాటు హీరోయిన్ కాజల్ దంపతులు కూడా హనీమూన్‌కు మాల్దీవులు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే చైతన్య హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే మెగా ఫ్యామిలీ నుంచే కాక, మెగా అభిమానుల నుంచి కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ లభించనుంది. (చదవండి: మెగా పెళ్ళి సందడి) -
శ్రీమతిగా నిహారిక ఫస్ట్ బర్త్‌డే.. పార్టీ ఎక్కడంటే
టాలీవుడ్ నటి, మెగా డాటర్ నిహారిక నేడు(శుక్రవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. నేటితో ఈ కొత్త పెళ్లి కూతురు 28వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య త్రిపాఠి, కాజల్ అగర్వాల్ విషెస్ తెలిపారు. ఇక మెట్టినింట్లో అడుగుపెట్టాక నిహారిక జరుపుకుంటున్న మొదటి పుట్టిన రోజు ఇదే కావడం విశేషం. ఈ క్రమంలో తన భార్యకు చైతన్య జొన్నలగడ్డ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్’ అంటూ పొద్దుతిరుగుడు పూవుతో నిహారికను పోల్చాడు. సూర్య కాంతితోనే సన్ ఫ్లవర్ వికసిస్తోందన్న నేపథ్యంలో నిహారిక తన జీవితంలో అడుగుపెట్టడంతో చైతన్య జీవితం కూడా వికిసించిందని ప్రేమగా వివరించాడు. చదవండి: ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోను: నిహారిక కాగా నిహారిక తన బర్త్‌డేను నేడు భర్త చైతన్యతో కలిసి ఫలక్నామ ప్యాలెస్‌లో జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే ఫలక్నామ ప్యాలెస్‌కు ఈ జంట చేరుకున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు గత రాత్రి నిహారిక.. తండ్రి నాగబాబు, బుల్లితెర షో ‘అదిరింది’ కమెడీయన్స్‌తో కలిసి సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో యాంకర్ రవి, రాఘవ, పలువురు జబర్ధస్త్ నటులు, అదిరింది నటులు హాజరయ్యారు. ప్రస్తుతం నిహారిక బర్త్‌డేకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కాగా ఇటీవల నిహారిక పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. డిసెంబర్ 9న జొన్నలగడ్డ చైతన్యతో ఆమె ఏడడుగులు వేశారు. ఉదయ్‌పూర్‌లో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి హడావిడి చేయడం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. చదవండి: ఘనంగా నిహారిక-చైతన్య రిసెప్షన్ View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
శ్రీవారిని దర్శించుకున్న నిహారిక, చైతన్య ఫొటోలు
-
ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోను: నిహారిక
హైదరాబాద్: ‘‘ఒట్టు.. నిన్నిలా నవ్వించే ఏ ఒక్క అవకాశాన్ని నేను వదులుకోను. అంటే ఇలా కొట్టే అవకాశాన్ని కూడా.. ఇక వెనక్కి చూసే అవసరం లేదు. హై చై’’ అంటూ నటి, మెగా డాటర్ నిహారిక కొణిదెల తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యపై ప్రేమను చాటుకున్నారు. తమ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో తాజాగా షేర్ చేశారు. హజ్బండ్ అంటూ భర్తతో కలిసి ఉన్న ఫొటోలతో పాటు.. ‘‘నా కుటుంబాన్ని గర్వపడేలా చేశాను’’ అని ఉంగరం ఆటలో తాను గెలుపొందిన మధుర జ్ఞాపకాలు పంచుకున్నారు. ఈ క్రమంలో నిహారిక దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందమైన జంట అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: ‘బంగారు తల్లి.. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను’) కాగా నటుడు నాగబాబు కుమార్తె నిహారిక- జొన్నలగడ్డ వెంకట చైతన్య బుధవారం వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. మెగా కుటుంబమంతా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ క్రమంలో నిశ్చయ్ జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(చదవండి: శ్రీవారిని దర్శించుకున్న నిహారిక దంపతులు) -
ఘనంగా నిహారిక-చైతన్య రిసెప్షన్ ఫొటోలు
-
ఘనంగా నిహారిక-చైతన్య రిసెప్షన్
చైతన్య జొన్నలగడ్డ, నిహారిక రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఈ నెల 9న రాజస్తాన్ ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ లో చైతన్య,నిహారికల వివాహం జరిగింది. మెగా హీరోలంతా ఫ్యామిలీతో ఈ శుభకార్యానికి హాజరై సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రామ్‌చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. (చదవండి : నా బంగారు తల్లి.. డాషింగ్ బావ: వరుణ్ తేజ్) శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్ వేడుకలో మెగా కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నూతన వధు వరులను ఆశీర్వదించారు. ఇండస్ట్రీ నుంచి పలువరు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. జేఆర్సీ కన్వెన్షన్ లోపలికి వెళ్లడానికి పాస్ వర్డ్‌ని క్రియేట్ చేశారు కుటుంబసభ్యులు. వేడుక కోసం జేఆర్సీ ప్రాంగణాన్ని గ్రాండ్‌గా డెకరేట్ చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
ప్యాలెస్‌లో పెళ్లి
నటి, నాగబాబు కుమార్తె నిహారిక వివాహం డిసెంబర్లో ఉంటుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. ఆగస్ట్‌లో ప్రముఖ బిజినెస్‌మ్యాన్ చైతన్యతో నిహారిక నిశ్చితార్థం జరిగింది. ఈ ఇద్దరూ డిసెంబర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని టాక్. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ ప్రముఖ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి జరగనుందట. డిసెంబర్ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ముహూర్తం కుదిరిందని సమాచారం. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది బంధువుల మధ్య ఈ వేడుక జరగనుంది. -
మిసెస్ గ్లోబల్ షో టాపర్‌గా చైతన్య
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన చైతన్య పోలోజు ప్రతిష్టాత్మకమైన మిసెస్ గ్లోబల్ షో టాపర్–2020గా నిలిచారు. అమెరికాలో వర్చువల్‌గా నిర్వహించిన మిసెస్ గ్లోబల్ షో పోటీల్లో తెలంగాణకు చెందిన ఎన్నారై మహిళ చైతన్య ఈ కిరీటాన్ని అందుకున్నారు. 2019లో జరిగిన మిసెస్ భారత్ న్యూయార్క్ పోటీల్లోనూ ఆమె విజేతగా నిలిచారు. ప్రస్తుతం ప్రపంచ తెలుగు కల్చరల్ ఫెస్టివల్‌కు ఆమె అందాల సుందరి కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. మై డ్రీం గ్లోబల్ ఫౌండేషన్ వర్జీనియా చాప్టర్ కో ఆర్డినేటర్‌గానూ సేవలందజేస్తున్నారు. టాటా వారి “తారల ఇంట్లో సందడి’ షోలో స్పెషల్ గెస్ట్‌గా, జ్యూరీగానూ వ్యవహరించారు. బంజారా మహిళా ఎన్జీవో వంటి సంస్థలతో కలిసి అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
వైరల్: కొత్త పెళ్లి కూతురుగా నిహారిక
ఇప్పటికే దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగగా త్వరలోనే మెగా ఫ్యామిలీలోనూ పెళ్లి పనులు మొదలవ్వనున్నాయి. కొణిదెల నాగబాబు కూతురు, హీరోయిన్ నిహారిక తన మెడలో కోరుకున్న వరుడితో మూడు ముళ్లు వేయించుకోనున్నారు. తన చేయి పట్టి ఏడడుగులు నడవబోయే ఆ పెళ్లి కొడుకు గుంటూరు పోలీసు శాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్ కుమారుడు చైతన్య జొన్నలగడ్డ అని సోషల్ మీడియాలో ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు ప్రేమ జంట ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే పెళ్లి తేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ ఓ షోలో పెళ్లి కూతురుగా ముస్తాబైన నిహారిక తెగ సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె తండ్రి నాగబాబే జడ్జి కావడం విశేషం. వినాయక చవితి సందర్భంగా "బాపు బొమ్మకు పెళ్లంట" అని ప్రత్యేక కార్యక్రమం రాబోతోంది. (హ్యాపీ బర్త్‌డే.. లవ్ : నిహారిక) దీనికి సంబంధించిన ప్రోమోలు యూట్యూబ్‌లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ షోలో నిహారిక పల్లకి నుంచి దిగారు. ఎప్పుడూ పంచ్‌లతో ఎదుటివారిని మాట్లాడకుండా చేసే నిహారిక కాబోయే భర్త గురించి అడిగేసరికి సిగ్గుల మొగ్గయ్యారు. భర్తతో కలిసి ప్రోగ్రామ్‌కు విచ్చేసిన యాంకర్ అనసూయ.. నిహారికకు ముందస్తు కానుకను కూడా అందించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో జానీ మాస్టర్‌తో పాటు బిగ్‌బాస్ కంటెస్టెంట్ బాబా భాస్కర్ కూడా పాల్గొన్నారు. ఇదిలా వుంటే నిహారిక, చైతన్యల నిశ్చితార్థం నేడు జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆరణాల అచ్చ తెలుగు అమ్మాయి నిహారిక కొత్త పెళ్లి కూతురిగా తయారైన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (కుమారి శ్రీమతి కానుంది) -
సింగర్ సునీత ఫిర్యాదు.. చైతన్య అరెస్ట్
-
సింగర్ సునీత ఫిర్యాదు.. చైతన్య అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా వేదికగా తన పేరును వాడుకుని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తిపై గాయని సునీత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు అనంతపురానికి చెందిన చైతన్య అనే వ్యక్తిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చైతన్య అనే వ్యక్తి సింగర్ సునీత మేనళ్లుడినంటూ చెప్పుకుంటూ సోషల్ మీడియా వేదికగా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. సునీత పేరుతో తాను స్వచ్ఛందంగా సేవ చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. దీంతో సునీత పేరు చూసి ఆమె అభిమానులు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారు. కాగా గతవారం సునీత ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడుతూ.. చైతన్య అనే అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదని.. అభిమానులెవరు వాడి వలలో పడొద్దని హెచ్చరించారు. తాజాగా సునీత ఫిర్యాదుతో చైతన్యను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.(ఫేక్ సింగర్‌పై గాయని సునీత సీరియస్) -
ఫేక్ సింగర్‌పై గాయని సునీత సీరియస్
-
వాడి పళ్లు రాలగొడతా: సింగర్ సునీత
సాక్షి, హైదరాబాద్: తన పేరు వాడుకుని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న ఓ వ్యక్తిపై గాయని సునీత సీరియస్ అయ్యారు. అనంతపూర్‌కు చెందిన చైతన్య అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు ఆమె ఫేస్బుక్ లైవ్‌లో వెల్లడించారు. సింగర్‌గా చలామణి అవుతూ చైతన్య ఇప్పటికే చాలా మందిని చీట్ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. అభిమానులెవరూ వాడి వలలో పడొద్దని సునీత హెచ్చరించారు. చైతన్య ఎవరో తనకు తెలియదని, అతన్ని ఇంత వరకూ చూడలేదని పేర్కొన్నారు. సెలబ్రిటీల పేర్లు వాడుకుని లాభం పొందేందుకు చాలామంది కుట్రలు చేస్తారని, జాగ్రత్తగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆ చీటర్ తన కంటబడితే వాడి పళ్లు రాలగొడతానని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టనని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని సునీత చెప్పారు. (చదవండి: నటుడు కిక్ శ్యామ్ అరెస్ట్, కారణం?) -
హ్యాపీ బర్త్‌డే.. లవ్ : నిహారిక
హైదరాబాద్ : మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరు పోలీసుశాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్ కుమారుడు చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయబోతున్నారు. ఈ ఏడాదిలోనే వీరి వివాహం జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తన పెళ్లిపై నిహారిక కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే తాజాగా చైతన్య బర్త్ డేను పురస్కరించుకుని నిహారిక స్పెషల్ విషెస్ చెప్పారు. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన నిహారిక.. ‘హ్యాపీ బర్త్ డే లవ్’ అని పేర్కొన్నారు.(ఆగస్ట్‌లో నిశ్చితార్థం) ‘ఒక నవ్వు.. గది మొత్తం వెలుగులు నింపుతుంది, ఇంట్లో ఉన్న అనుభూతి కలిగేలా కౌగిలించుకుంటుంది. నవ్వు నా సంతోషపు చిరునామా చై. ఇది కేవలం మొదటిది మాత్రమే.. ఇంకా చాలా ఉన్నాయి. అన్నింటిల్లో నువ్వు ఉత్తమమైనవాడివి. హ్యాపీ బర్త్ డే లవ్’ అని నిహారిక పేర్కొన్నారు. నిహారిక పోస్ట్‌పై స్పందించిన చైతన్య.. నిహారికకు థ్యాంక్స్ చెప్పారు. ‘థ్యాంక్స్ నిహా.. జస్ట్ మేడ్ మై డే అగేన్’ అని కామెంట్ చేశారు. View this post on Instagram A smile that’ll light up the whole room, and hugs that feel like home. You are my happy place chay. Here’s to the first of many! You deserve the best of everything! Happy birthday,love. ❤️ @chaitanya_jv A post shared by Niharika Konidela (@niharikakonidela) on Jul 26, 2020 at 1:23am PDT -
ఆగస్ట్‌లో నిశ్చితార్థం
హీరోయిన్ నిహారికకు కాబోయే భర్త ఎవరో అధికారిక ప్రకటన వెల్లడైంది. గుంటూరు పోలీసుశాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్ కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయబోతున్నారు. ‘నా మిగతా జీవితం సంతోషంగా గడిచేందుకు తగ్గ వ్యక్తి (చైతన్యను ఉద్దేశిస్తూ) నాకు దొరికారు. ఈ క్షణాలు చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. మా నిశ్చితార్థం త్వరలో జరగబోతోందని చెప్పడానికే గురువారం సోషల్ మీడియాలో అలా హింట్ ఇచ్చాను. ప్రస్తుతం ఇంతకన్నా నేనేం చెప్పలేను’’ అని పేర్కొన్నారు నిహారిక. ‘‘చైతన్య, నిహారికలది అరేంజ్డ్ మ్యారేజ్. నిజంగా చైతన్య, నిహారికలకు ఒకరికొకరు పరిచయం లేదు. గత వారం వారి ఫ్యామిలీని కలిశాం. చైతన్య, నిహారికలు పర్ఫెక్ట్ కపుల్ అవుతారని భావించాం. మంచి ముహూర్తం కోసం చూస్తున్నాం. మంచి తేదీ కుదిరితే ఈ ఏడాదే వివాహం జరగవచ్చు. వారు (నిహారిక ఫ్యామిలీ) త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తారు’’ అని ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు ప్రభాకర్. చైతన్య – నిహారికల నిశ్చితార్థం ఈ ఏడాది ఆగస్టులో జరగనుందని సమాచారం. ఇక చైతన్య విషయానికి వస్తే... హైదరాబాద్‌లోని ఓ ఎమ్ఎన్సీ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన చైతన్య బిట్స్ పిలానీలో మాస్టర్స్ ఇన్ మ్యాథమ్యాటిక్స్ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎమ్బీఏ పూర్తి చేశారు. -
కుమారి శ్రీమతి కానుంది
‘పెళ్లికి బాజా మోగింది.. కుమారి శ్రీమతి కానుంది’ అని ‘జయం మనదేరా’ సినిమాలో వెంకటేశ్ ఆడిపాడారు. ఇప్పుడు నిహారికాకు ఈ పాట బాగా సూట్ అవుతుంది. కుమారి కొణిదెల నిహారిక త్వరలో శ్రీమతి కానున్నారు. నటుడు నాగబాబు కుమార్తె, హీరో వరుణ్ తేజ్ చెల్లెలిగానే కాదు నటిగా తనకంటూ గుర్తింపు పొందారు నిహారిక. పెళ్లి నిశ్చయమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపి, ఒక ఫొటోను కూడా షేర్ చేశారు నిహారిక. అయితే కాబోయే భర్త గురించిన వివరాలేమీ చెప్పలేదు. అబ్బాయిది గుంటూరు అని, హైదరాబాద్‌లోని ఓ ఎమ్ఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారని సమాచారం. అలాగే అబ్బాయి తండ్రి పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిసింది. పెళ్లి వచ్చే ఏడాది జరుగుతుందట. అబ్బాయి పేరు చైతన్య అనే ప్రచారం జరుగుతోంది. ‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం’ వంటి చిత్రాల్లోనూ నటించారు. అశోక్ సెల్వన్ హీరోగా నటించనున్న తమిళ చిత్రంలో హీరోయిన్గా నటించనున్నారు నిహారిక. -
నిహారిక పెళ్లి చేసుకోబోయేది ఇతడినే..!
మెగా డాటర్ నిహారిక పెళ్లి గురించి పలువార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె తన పెళ్లి విషయమై అభిమానులకు హింట్లు ఇస్తూ వచ్చారు. ఇందులో భాగంగా ఓ వ్యక్తితో కలిసి దిగిన ఫొటోను కూడా నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘పీక్ ఏ బూ’ అని పేర్కొన్నారు అయితే అతని ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. నిహారిక ఆ పోస్ట్ చేసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. మరికొందరు ఫేస్ చూపించాలని కోరారు. (చదవండి : కాబోయే భర్త ఫోటో షేర్ చేసిన నిహారిక!) అయితే తాజాగా నిహారిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఫొటో బయటకు వచ్చింది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లాడనున్నట్టుగా తెలుస్తోంది. వీరిద్దరు కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్టులో నిహారిక, చైతన్యల నిశ్చితార్థం జరపాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
‘హవా’ చూపిస్తోంది : హీరో చైతన్య
క్రైమ్ కామెడీ సినిమాలకు డిమాండ్ తగ్గలేదు, ప్రేక్షకుల నుండి ఆదరణ తగ్గలేదు అని నిరూపిస్తున్న సినిమా ‘హవా’ కొత్త కాన్సెప్ట్ తో ఎప్పుడూ చూడని లొకేషన్స్‌లో నిర్మాణం జరుపుకున్న హవా ఈ రోజు రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంటుంది. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది. శుక్రవారం రిలీజ్ అయిన ‘హవా’ సినిమా ప్రేక్షకుల మద్య చూసిన చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో చైతన్య మాట్లాడుతూ... ‘మా నమ్మకాన్ని ప్రేక్షకుల నుండి వస్తున్న స్పందన నిలబెట్టింది. థియేటర్లో ఈ సినిమా చూస్తున్నప్పుడు పడ్డ కష్టం, టెన్షన్ అంతా పోయింది. మేము పెద్దగా ఎక్స్పెక్ట్ చేయని సన్నివేశాలకు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అయి నవ్వుతున్నారు. ఈ సినిమా చాలా మంది కల. ఆస్ట్రేలియాలో షూటింగ్ అప్పుడు మేము ఏదైతే నమ్మి అడుగు ముందకు వేసామో ఆ నమ్మకం ఈ రోజు నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. డైరెక్టర్ మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన మాకు ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ చాలా ధైర్యాన్నిచ్చింది. ఈ సినిమా మా టీం మొత్తానికి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా కోసం మేము చాలా ట్రావెల్ చేసాము. మేము నమ్మిన కథకు తెరమీద ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే విధానం చాలా పాజిటివ్‌గా ఉంది. థియేటర్లో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించిన చైతన్య, దివి పాత్రలకు చాలా మంచి రెస్సాన్స్ వస్తుంది. ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్’అన్నారు. -
కాచిగూడ కార్పొరేటర్ చైతన్యకు ఊరట
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్యకు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు సంతానం కలిగి ఉన్నారంటూ ఆమెను అనర్హురాలుగా నాంపల్లి కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు తీర్పుపై కార్పొరేటర్ చైతన్య హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బుధవారం నాంపల్లి కోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. కాగా ఎక్కాల చైతన్య ముగ్గురు సంతానం ఉన్నారని, ఆ విషయాన్ని దాచిపెట్టారంటూ బీజేపీ మాజీ కార్పొరేటర్ ఉమాదేవీ భర్త రమేష్‌యాదవ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు విచారణలో కన్నాచైతన్య తనకు ముగ్గురు సంతానం ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టినట్టు తేలింది. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ.. రెండోస్థానంలో ఉన్న ఉమాదేవీ రమేశ్‌యాదవ్‌ను కార్పొరేటర్‌గా కొనసాగించాలని కోర్టు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దాన్ని సవాల్‌చేస్తూ కార్పొరేటర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. -
ప్రకటనలు.. ప్రచారం ఒక్క చోటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏ ఉత్పత్తయినా లకి‡్ష్యంచిన కొనుగోలుదారులకు చేరాలంటే నాణ్యతతో పాటూ బ్రాండ్ ఇమేజ్ తప్పనిసరి! దీనికోసం సెలబ్రిటీల ఎంపిక, ప్రకటనలు, ప్రచారం... ఇవన్నీ పెద్ద టాస్కే. కానీ, విజయవాడకు చెందిన రీసెర్చ్ మీడియా గ్రూప్ దీన్ని సులభతరం చేసింది. సెలబ్రిటీల ఎంపిక కోసం సెలబ్రిటీ హబ్, ప్రకటనల కోసం న్యూవేవ్ అడ్వర్టయిజింగ్, ప్రొడక్షన్ హౌస్ సేవల కోసం రీసెర్చ్ మీడియా ఎంటర్టైన్మెంట్, ఈవెంట్ల నిర్వహణ కోసం మ్యాజిక్ మంత్ర... ఇలా అన్ని సేవలనూ అందిస్తున్న రీసెర్చ్ మీడియా గ్రూప్. మరిన్ని వివరాలు సంస్థ చైర్మన్ జే చైతన్య ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. చిన్న ప్రకటనల సంస్థగా మా ప్రస్థానం మొదలైంది. ఇపుడు కార్పొరేట్ ఈవెంట్స్, సెలబ్రిటీ మేనేజ్మెంట్ స్థాయికి చేరాం. ప్రస్తుతం రీసెర్చ్ మీడియా గ్రూప్‌లో సెలబ్రిటీ హబ్, మేజిక్ మంత్ర, న్యూవేవ్ అడ్వర్టయిజింగ్, రీసెర్చ్ మీడియా గ్రూప్ ఎంటర్టైన్మెంట్స్, పింక్ పీఆర్ లైన్స్, కీ హైట్స్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. ఇప్పటివరకు రీసెర్చ్ మీడియా గ్రూప్‌కు 18 వేల మంది కార్పొరేట్స్ క్లయింట్లున్నారు. వీటిలో రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి కార్పొరేట్ ఆసుపత్రులు, ఉత్పత్తుల తయారీ కంపెనీల వరకూ అన్నీ ఉన్నాయి. త్వరలోనే కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ), కామినేని, కేర్ ఆసుపత్రులు, ప్రక్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మా క్లయింట్ల జాబితాలో చేరనున్నాయి. ఇదీ... మా కంపెనీల తీరు సెలబ్రిటీ హబ్: 2014లో విజయవాడ కేంద్రంగా ప్రారంభమైంది. దీనికి విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, గోవా, బెంగళూరు, ముంబైలో బ్రాంచీలున్నాయి. సెలబ్రిటీల ఎంపిక కోసం ముంబైకి చెందిన సిమ్కామ్ మోడల్, చిరాక్ మేనేజ్మెంట్స్, జాకీ ఫెర్నాండెస్, పినాకిల్ రూడ్జ్, ది క్వీన్స్, ఎవాన్ ఎంటర్టైన్మెంట్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం సెలబ్రిటీ హబ్‌లో 40 వేల మంది సినీ ప్రముఖులున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, దుబాయ్, మలేషియా, బ్యాంకాక్, శ్రీలంక వంటి దేశాల్లోని కార్యక్రమాలకూ తారలను అందించాం. మ్యాజిక్ మంత్ర: 2012లో ప్రారంభమైన ఈ సంస్థ కార్పొరేట్, వ్యక్తిగత ఈవెంట్లను నిర్వహిస్తుంది. గతేడాది రూ.40 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. న్యూవేవ్: విజువల్ యాడ్స్ రూపకల్పన కోసం న్యూవేవ్ అడ్వర్టయిజింగ్ పనిచేస్తుంది. టీవీ సీరియల్స్, సినిమాల చిత్రీకరణ కోసం అవసరమైన ప్రొడక్షన్ హౌస్ సేవల కోసం రీసెర్చ్ మీడియా ఎంటర్టైన్మెంట్ పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 16 టీవీ సీరియల్స్‌కు సేవలందించాం. రూ.100 కోట్లు లక్ష్యం.. ప్రస్తుతం రీసెర్చ్ మీడియా గ్రూప్‌లో 300 మంది ఉద్యోగులున్నారు. గతేడాది రూ.60 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.100 కోట్లు లకి‡్ష్యంచాం. త్వరలోనే సొంత బ్యానర్‌పై తెలుగు, హిందీ చిత్రాల నిర్మాణంతో పాటూ జాతీయ స్థాయిలో మిస్ ఇండియా పోటీలను నిర్వహించనున్నాం’’ అని చైతన్య వివరించారు. -
వార్ డ్రామాలో నారా రోహిత్
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో అలరిస్తున్న నటుడు నారా రోహిత్. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా మారి తన అభిరుచికి తగ్గ సినిమాలను స్వయంగా నిర్మిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం సీనియర్ నటుడు జగపతి బాబుతో కలిసి ఆటగాళ్లు సినిమాలో నటిస్తున్న రోహిత్ త్వరలో పీరియాడిక్ వార్ డ్రామాకు అంగీకరించనట్టుగా తెలుస్తోంది. యువ దర్శకుడు చైతన్య 1971 యుద్ధ నేపథ్యంలో రెడీ చేసుకున్న కథ నారా రోహిత్‌కు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను పెద్ద బడ్జెట్‌తో నారా రోహిత్ స్వయంగా నిర్మిత్చేందుకు రెడీ అవుతున్నారు. తన మార్కెట్ రేంజ్‌ను కూడా పక్కన పెట్టి భారీ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు నారా రోహిత్. ప్రస్తుతం చర్చల దలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
ప్రచారానికి సెలబ్రిటీలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సెలబ్రిటీలతో ప్రచారం అంటే కార్పొరేట్ సంస్థలకో లేక పెద్ద కంపెనీలకో పరిమితమైన విషయం. కానీ, దీన్నిప్పుడు చాలా సులభతరం చేసేసింది సెలబ్రిటీ హబ్! జస్ట్ మన బడ్జెట్‌ను ఎంటర్ చేస్తే చాలు అందుబాటులో ఉండే సెలబ్రిటీలు, ప్రముఖులను తెచ్చేస్తుంది. మరిన్ని వివరాలు సెలబ్రిటీ హబ్ చైర్మన్ జే చైతన్య ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ఈ రోజుల్లో బ్రాండింగ్, ప్రచారం లేకపోతే వస్తువులు, ఉత్పత్తులను ప్రజలు ఆదరించట్లేదు. మరి, సెలబ్రిటీలు, ప్రముఖులతో ప్రచారం చేయించాలంటే వాళ్లు ఎక్కడుంటారో తెలియదు? ఎలా కలవాలో తెలియదు? ఒకవేళ కలిసినా మనకు టైమిస్తారో లేదో తెలియదు? ఇలా రకరకాల సమస్యలుంటాయి. వీటన్నింటికీ పరిష్కరించడమే సెలబ్రిటీ హబ్ ప్రత్యేకత. ప్రారంభోత్సవాలకు, బ్రాండింగ్ ప్రమోషన్ చేయించడం మా పని. 40 వేల మంది సెలబ్రిటీల నమోదు.. 2014లో విజయవాడ కేంద్రంగా సెలబ్రిటీ హబ్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం 40 వేల మంది సెలబ్రిటీలతో ఒప్పందం చేసుకున్నాం. ఇందులో మోడల్స్లతో పాటూ టీవీ, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలున్నారు. ఉత్తరాది టీవీ, చిత్ర పరిశ్రమలోని ఆర్టిస్టులు, సెలబ్రిటీల కోసం ముంబైకి చెందిన సిమ్కామ్ మోడల్ మేనేజ్మెంట్, జాకీ ఫెర్నాండెజ్, పినాకిల్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రారంభ ధర రూ.50 వేలు.. ప్రస్తుతం నెలకు 25 కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, ముంబై, చెన్నై, బెంగళూరు, గోవా, మలేషియా, శ్రీలంక, దుబాయ్, అమెరికా దేశాల్లో సేవలందించాం. త్వరలోనే మలేషియా తెలుగు అసోసియేషన్ కార్యక్రమాన్ని, ఏలూరు ఓ రియల్టీ సంస్థతో బ్రాండింగ్ కార్యక్రమానికి ఒప్పందం కుదిరింది. టీవీ ఆర్టిస్ట్‌ల ప్రారంభ ధర రూ.50 వేల నుంచి ఉన్నాయి. సినీ సెలబ్రిటీలైతే రూ.లక్ష నుంచి రూ.2 కోట్ల వరకుంది. క్రీడా ప్రముఖులైతే రూ.15 లక్షల నుంచి మొదలవుతుంది. వసతులు, ప్రయాణ ఖర్చులు, భద్రత, ఇతరత్రా అవసరాలన్నీ కూడా సెలబ్రిటీ హబ్బే కల్పిస్తుంది. రూ.30 కోట్ల వ్యాపార లక్ష్యం ప్రస్తుతం మా కంపెనీలో 16 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. గతేడాది రూ.15 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.30 కోట్లు లకి‡్ష్యంచాం. -
’చై-నా’ మరణ మృదంగం
-
ప్రాజెక్ట్ మిస్టరీ ఏంటి?
ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అసలు ఆ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటి? ప్రాజెక్ట్ వెనుక దాగున్న మిస్టరీ ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలను త్వరలోనే స్క్రీన్‌పై చూపిస్తామంటున్నారు దర్శకుడు మహేశ్‌రెడ్డి. చైతన్య, దివీ ప్రసన్న జంటగా ఆయన దర్శకత్వంలో ఫిల్మ్ ఎన్ రీల్స్ బ్యానర్‌పై ‘ప్రాజెక్ట్ సి 420’ వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం రూపొందుతోంది. రాబిన్ కె మార్క్స్ స్వరకర్త. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ‘‘ఎనభై శాతం షూటింగ్ పూరై్తంది. ఈ నెల ఎండింగ్‌కి షూటింగ్ కంప్లీట్ చేస్తాం. ఆస్ట్రేలియా, చైనాకి చెందిన నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. 80 శాతం మంది ఆస్ట్రేలియన్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారు’’ అన్నారు మహేశ్ రెడ్డి. ఈ చిత్రానికి ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్. -
ఒక్క తప్పు చేస్తే...
చైతన్య, దివీ ప్రసన్న జంటగా మహేశ్ దర్శకత్వంలో ఫిలిమ్ అండ్ రీల్స్‌పై ఆస్ట్రేలియాలో ఆరంభమైన చిత్రం ‘ప్రాజెక్ట్ సి 420’. మార్క్ కే రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్. ‘‘ఎక్కువమంది విదేశీయులు నటిస్తున్న తెలుగు చిత్రమిది. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో కానీ ఒక చిన్న తప్పు మాత్రం జీవితాన్ని తలకిందులు చేస్తుందన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. 80 శాతం ఆస్ట్రేలియన్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారు. అక్టోబర్ 30కి షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
పెళ్లికి ముందు కసరత్తులు
-
చైతూ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నాగ్..!
హైదరాబాద్: కుమారుల పెళ్లిళ్ల విషయంలో నిర్ణయాన్ని వారికే వదిలేసిన టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తాజాగా పెద్ద కుమారుడు, టాలీవుడ్ స్టార్ నాగచైతన్య, హీరోయిన్ సమంత పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చారు. వారు ఎపుడు చేసుకుంటానంటే అపుడు తాను కూడా సై అంటానని తేల్చేశారు. అంతా చైతూ ఇష్టప్రకారమే జరుగుతుందని వివరించారు. ఆయన తాజా చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ విశేషాలను మీడియాకు వివరించిన నాగ్ ఈ ఇంట్లో పెళ్లి ముచ్చట్లనుకూడా పంచుకున్నారు. చైతూ కోరుకున్నట్టుగానే జనవరిలో నిశ్చితార్థం చేశామని, మిగిలిన ఆ శుభకార్యాన్ని కూడా వారి ఇష్ట ప్రకారమే చేస్తామన్నారు. నాగ చైతన్య, సమంత లు ఎక్కడ, ఎప్పుడు ఎలా వివాహం చేసుకుంటామన్నా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. త్వరలో విడుదల కానున్న ఓం నమో వెంకటేశాయ మూవీ విశేషాలను వివరించిన ఆయన శ్రీవెంకటేశ్వరుడికి గొప్ప భక్తుడు అయిన హాథీరాం బాబా గురించి తనకు ఎక్కువగా తెలియదని చెప్పారు. అయినా ఈ పాత్ర ఇంత గొప్పగా రావడానికి చిత్ర యూనిట్ బాగా సహకరించిందని చెప్పారు. ఆయన గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న మఠాలన్నింటిని చిత్ర బృందం పర్యటించి, వివరాలను సేకరించినట్టు చెప్పారు. ఈ చిత్రంలో తన పాత్రకు, వెంకటేశ్వరుడి పాత్ర ధారికి మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నారు. కాగా జనవరి 29న గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్న తమ అభిమాన నటుల పెళ్లి కబురుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రేమపక్షులు ఆ శుభవార్త కాస్త ఎపుడు చెవిన వేస్తారో..వేచి చూడాలి. -
సమంత, చైతు నిశ్చితార్థం డేట్ ఫిక్స్?
హైదరాబాద్: టాలీవుడ్ అందమైన జంటగా అభిమానులు యాక్సెప్ట్ చేసిన లవ్లీ కపుల్ నాగచైతన్య, సమంత నిశ్చితార్థానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైయిందట. ఈ మేరకు టాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తమ అభిమాన జంటకు నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ అయిందన్నవార్తల అటు అభిమానులను, ఇటు ఫిలింనగర్ ను మురిపిస్తోంది. ఇటీవల చైతూ ట్విట్టర్ లో చేసిన సందడి కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. మరోవైపు నాగర్జున చిన్నకుమారుడు అఖిల్ నిశ్చాతార్థం ఇప్పటికే పూర్తి కావడంతో.. ఈ శుభకార్యాన్ని కూడా తొందరగా జరిపించాలని నాగార్జున భావిస్తున్నారట! చైతు, సమంతల నిశ్చితార్థ వేడుక జనవరి 29న నిర్వహించనున్నారనే ఫిలింనగర్ లో గుప్పుమంది. ఇప్పటికే ఏర్పాట్టు ముమ్మరంగా సాగుతున్నాయనీ, అతిథులను ఆహ్వానించే పనిలో నాగ్ దంపతులు బిజీగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ శుభఘడియకోసం ఎదురుచూస్తున్న ఈ జంట అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. అయితే దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు సస్పెన్స్ మాత్రం తప్పదు. -
పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడు యువతి ఆత్మహత్య
నిజామాబాద్ క్రైం : రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు.. పెళ్లి చేసుకుందా మంటే కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంటున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిజామాబాద్ నగరం అంబేద్కర్‌కాలనీకి చెందిన (21) బాసర పుణ్యక్షేత్రం వద్దకు వెళ్లి నిద్రమాత్రలు మింగి ప్రియుడికి సమాచారం అందించింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిజామాబాద్ క్రైం: ప్రేమించిన యువ కుడు పెళ్లికి నిరాకరించడంతో నిజా మాబాద్ నగరంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన యువతి లంగాల చైతన్య(21) శనివారం ఆత్మహత్య చేసుకుంది. చైతన్య, ఆమె ఇంటి పక్కనే ఉండే వినోద్‌కుమార్‌లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చైతన్య బ్యూటీషీయన్‌గా పనిచేస్తుండగా, వినోద్ గతంలో మెడికల్‌షాప్‌లో పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని కొంత కాలంగా వినోద్‌ను చైతన్య అడుగుతోంది. పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రతిసారి వినోద్ ఏదో వంకతో తప్పించుకోవటంతో చైతన్య మనస్తాపానికి గురైయింది. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నిర్మల్ జిల్లా బాసర దేవ స్థానానికి వెళ్లింది. అక్కడి నుంచి వినోద్‌కు ఫోన్‌చేసి తనను పెళ్లి చేసు కోకుంటే చనిపోతానని చెప్పింది. వినోద్ స్పందించక పోవటంతో మళ్లీ ఫోన్ చేసి తాను నిద్రమాత్రలు మింగినట్లు చెప్పింది. వినోద్ వెంటనే బాసర్‌కు వెళ్లగా, ఆమె గుడి మెట్లపై కూర్చొని కనిపించింది. ఆటోలో నవీపేట ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే శనివారం రాత్రి 2 గంటలు దాటగా.. అక్కడి సిబ్బంది బాధితురాలి తల్లిదండ్రుల గురించి నిలదీయగా, ఫోన్ చేసి విషయాన్ని వారికి చెప్పాడు. వారు ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో చైతన్య చనిపోయింది. చైతన్య తండ్రి రాంచం ద్రబాబు తన కూతురి మృతికి వినోద్‌కుమారే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
సమంత మళ్లీ మాయ చేస్తుందట..!
హైదరాబాద్: టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రంతోనే టాప్ లెవల్ కి ఎదిగిన హీరోయిన్ సమంత రుతు ప్రభు(29). ఫస్ట్ మూవీతోనే యూత్ లో మాంచి క్రేజ్ కొట్టేసిన సామ్ తన మొదటి రీల్ హీరోనే రియల్ హీరోగా ఎంచుకుంది. అయితే మళ్లీ 'ఏ మాయ చేశావే' లాంటి లవ్ స్టోరీ మూవీని త్వరలోనే చేయబోతోందిట. అక్కినేని నట వారసుడు, టాలీవుడ్ టాప్ స్టార్ నాగచైతన్యతో నటించిన'ఏ మాయ చేశావే' లాంటి మరో సినిమాను చేయబో్తోందిట. తొలి సినిమాతోనే మాయ చేసిన ఈ అమ్మడు త్వరలోనే అలాంటి సినిమా చేయబోతున్నానంటూ స్వయంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని చెప్పింది. ఏ మాయ చేశావే లాంటి అద్భుతమైన ప్రేమ కథా చిత్రం మళ్లీ ఎపుడు చేయబోతున్నారని పుప్పాల గౌతం ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. దానికి సమంత సూన్ అని సమాధానం చెప్పింది. దీంతో మరోసారి లవ్ స్టోరీ చేయనుందనే ఆనందంలో మునిగిపోయారట అభిమానులు. మరోవైపు సూన్ అని సింపుల్ గా తేల్చేసిందా? లేక రీల్ లైఫ్ లో నిజంగానే మరోసారి మాయ చేయనుందా అనే డైలమాలో పడిపోయారట. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సమంత.. తనకు వర్క్ పవరంగా 2017 కొంచెం కష్టమైన సంవత్సరమని చెప్పింది. పెళ్లి తరువాత సినిమాల్లో నటిస్తానని స్పష్టంచేసిన ఈ ఏడాది5,6 సినిమాలు చేస్తున్నట్టు వెల్లడించింది. దీంతోపాటు 2016 లో తనకిష్టమైన మూవీ దంగల్ అని చెప్పింది. కాగా ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమ్మూ బృందావనం, దూకుడు ఈగ ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది , 24, అ ఆ తదితర చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. మరోవైపు టాలీవుడ్ సూపర్ స్టార్స్ సమంత- నాగచైతన్య ప్రేమ, పెళ్లి ఇండస్ట్రీలో హాట్ టాపిక్. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. Soon -
ఏంచేశారని జనచైతన్య యాత్రలు?
ఇళ్లు, ఇళ్ల స్థలాలకోసం ఎమ్మెల్యే అనంతలక్షి్మని నిలదీసిన మహిళలు ∙చేసింది తక్కువ–చెప్పేది ఎక్కువ ∙వేములవాడవాసుల అసంతృప్తి వేములవాడ (కరప) : మండలంలోని వేములవాడలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పార్టీనాయకులు, కార్యకర్తలతో కల్సి నిర్వహించిన జన చైతన్యయాత్రలో మహిళల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. గురువారం వేములవాడలో జరిగిన జన చైతన్యయాత్రలో గ్యాస్ కనెక్షన్లు, పెట్టుబడి నిధి చెక్కులు పంపిణీచేసున్నారని చెపితే మహిళాశక్తి సంఘ సభ్యులు తరలివచ్చారు. ఎమ్మెల్యే అనంతలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు బుంగా సింహాద్రి తదితరులు కాలనీవద్ద ఈ మేరకు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అనంతలక్ష్మి దంపతులతో పాటు పలువురు నాయకులు ఊకదంపుడు ప్రసంగాలిచ్చారు. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాకా ఏం చేశారని చైతన్య యాత్రలు నిర్వహిసున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపించినందుకు మీరుణం తీర్చుకునేందుకు ఏపనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పగా కొంతమంది మహిళలు ఏదో అడగడానికి ప్రయత్నించగా స్థానిక నాయకులు వారిని అడ్డుకున్నారు. పంపిణీకార్యక్రమం అయినతర్వాత మహిళలు ఎమ్మెల్యే చుట్టుముట్టి తమ సమస్యలను ఏకరువుపెట్టారు. రెండేళ్లుగా తిరుగుతున్నా హౌసింగ్‌లోన్ ఇవ్వలేదని, మరుగుదొడ్డి బిల్లులు ఇవ్వడంలేదని, ఇంటి స్థలం ఇవ్వలేదని అడుగుతుండగా స్థానికనాయకులు అక్కడనుంచి జారుకున్నారు. ఇప్పటికే కొంతమందికి ఇచ్చామని, రానున్నరోజుల్లో అర్హులందరికీ గృహరుణాలు ఇస్తామన్నారు. ఇవ్వడంజరుగుతుందని సద్దిచెప్పి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ప్రచురించిన కరపత్రంలో అవాస్తవాలు ఉన్నాయని వారు వివరిచారు. ఈ సందర్భంగా హైస్కూలులో మూడేళ్లుగా గదుల నిర్మాణం పూర్తికాక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కాపుకార్పొరేషన్ ద్వారా 14 మందికి ఇచ్చామన్న రుణాలు ఎవరికి ఇచ్చారో చెప్పాలన్నారు. ఈసారి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెపుతామని ప్రజలు తెలిపారు. -
సమస్యలు చెబుతుంటే పోలీసులను ఉపయోగిస్తున్నారు..!
వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి కూనవరం (సీతానగరం) : టీడీపీ చేపట్టిన జన చైతన్య యాత్రలో ప్రజలు తమ సమస్యలను చెబుతుంటే పోలీసులతో వారిని అడ్డుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. బుధవారం కూనవరంలో చౌటిపల్లి లాల్‌బాబు ఇంటివద్ద జరిగిన విందు కార్యక్రమంలో రాజా పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుప మేరకు చేపట్టిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా జనచైతన్య యాత్రలు టీడీపీ చేపట్టిందన్నారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 650 హామీలలో ఒకటి అమలు జరపలేదని ప్రజలు తమ వద్ద వాపోతున్నారని, ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జనచైతన్య యాత్రలో ప్రజలు స్పందించి, ఎక్కడకక్కడ ఖండిస్తుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులో 90 ఇల్లు కాలిపోతే అక్కడకు వెళ్లిన ఎమ్మెల్యే బుచ్చియ్యచౌదరి వారే ఇళ్ల కాల్చుకున్నారని అనడం అధికారం అహంకారంతో ఉన్నారని రుజువైందన్నారు. రెండేళ్ళ క్రితం ఇళ్లను వేరే ప్రాంతంలో ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చిన బుచ్చియ్య చౌదరి దానిని మర్చారన్నారు. దేశంలో గత ప్రభుత్వంలో 47 లక్షల గృహాలు కడితే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాష్ట్రంలో 48 లక్షల ఇల్లు కట్టారని గుర్తు చేశారు. రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టిన దాఖలాలు లేవన్నారు. మోదీ ప్రకటనతో ప్రజల ఇబ్బందులు ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జక్కంపూడి రాజా అన్నారు. చంద్రబాబు పట్టిసీమ, దేవుడు భూములు అమ్ముకున్న డబ్బు, అమరావతి ద్వారా సంపాదించిన నల్లదనాన్ని ఏవిధంగా మారుస్తావని ప్రశ్నించారు. పెద్దనోట్లు రద్దు చేయమని మేమే చెప్పామని టీడీపీ నాయకులు చంద్రబాబును తెగపొగుడుతుంటే, చంద్రబాబు మాత్రం ఇంటిలో కూర్చుని డబ్బులు ఏవిధంగా మార్చాల అని మదనపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వేల కోట్లు రూపాయల అవినీతి జరుగుతుందని, ప్రజలే త్వరలో గట్టిగా బుద్ధిచెబుతారని రాజా హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అద్యక్షుడు పెదపాటి డాక్టర్‌బాబు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చళ్లమళ్ల సుజీరాజు, జిల్లా కమిటీ కార్యదర్శి వలవల వెంకట్రాజు, మండల సేవాదళ్ అద్యక్షుడు ఆళ్ళ కోటేశ్వరావు, బంక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బ్లూ టీమ్ కెప్టెన్‌గా చైతన్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం అండర్-23 ప్రాబబుల్స్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో తలపడే జట్లను శుక్రవారం ఎంపిక చేసింది. బ్లూ టీమ్, రెడ్ టీమ్, ఎల్లో టీమ్, గ్రీన్ టీమ్‌లుగా ఆటగాళ్లను విభజించింది. బ్లూ టీమ్ కెప్టెన్‌గా వై. చైతన్య కృష్ణ, రెడ్ టీమ్ కెప్టెన్‌గా బి. యతిన్ రెడ్డి, ఎల్లో టీమ్ కెప్టెన్‌గా పి.ఎస్.చైతన్య రెడ్డి, గ్రీన్ టీమ్ కెప్టెన్‌గా తనయ్ త్యాగరాజన్ వ్యవహరిస్తారు. బ్లూ టీమ్: వై. చైతన్య కృష్ణ, కె. రోహిత్, డి. అరుణ్, ఎ. వంశీ వర్ధన్, రాకేశ్, కేఎస్కే చైతన్య, మోహిత్ సోని, రజనీశ్ యాదవ్, సయ్యద్ చాంద్‌పాషా, అనిరుధ్, రాధకృష్ణ, బరణ్ కుమార్, త్రినాథ్ (వికెట్‌కీపర్), అకాశ్, సందీప్ మనోహర్, టి. దిలీప్ (కోచ్). రెడ్ టీమ్: బి. యతిన్ రెడ్డి, ఎస్. విక్రమ్, జె. మల్లికార్జున్, బి. చంద్రశేఖర్, అకేందర్, పి.రోహిత్, విష్ణు, సారుు అనూప్, టి.వి. కృష్ణ చరిత్, పి. ప్రణీత్, యశ్వంత్, శ్రావణ్ కుమార్, సాత్విక్, ఫైజల్ (వికెట్ కీపర్), రిషబ్ శర్మ. ఎల్లో టీమ్: చైతన్య రెడ్డి, సమర్థ్ సింగ్, అభిరథ్, రోహన్, బెనిటో, వివేక్, సుఖేన్ జైన్, సయ్యద్ అహ్మద్, కార్తీకేయ, రవితేజ, అజారుద్దీన్, మనీశ్ కుమార్, సారుు శ్రవణ్, రాజేశ్, ప్రతీక్ పవార్, గణేశ్ (కోచ్). గ్రీన్ టీమ్: తనయ్, డి.లోహిత్, శశిధర్, అంకుర్, ఆశిష్, హర్ష్, రవీందర్, ప్రశాంత్, జి. విదత్, శ్రీధరహాస్ రెడ్డి, షేక్ ఇబ్రహీం, సారుుతేజ, భిక్షపతి సంకేత్, ప్రణవ్ (వికెట్‌కీపర్). -
తల్లికి తెలిస్తే ఏమైపోతుందో...?
వేదసమాజం వీధిలో అలముకున్న విషాదచాయలు శోకసంద్రంలో మునిగిన కుటుంభసభ్యులు తల్లికి మరణవార్త తెలియకుండా జాగ్రత్తపడ్డ కుటుంభం విజయనగరం జిల్లా ; రాజమహేంద్రవరంలోని గోదావరి నదిలోని కోటిలింగాల రేవుకు స్నానానికి వెళ్లిన సాలూరుకు చెందిన సిగడాపు చైతన్య(19) శవమై తేలాడు. రాజమహేంద్రవరంలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న చైతన్య గురువారం తన స్నేహితులతో కలసి స్నానానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఐదుగురిలో ఇద్దరు నదిలో గల్లంతుకాగా ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో గురువారం సాయంత్రం 6గంటల వరకు గాలించారు. మరలా శుక్రవారం ఉదయం నదిలో గాలింపు చర్యలు ప్రారంభించగా, చైతన్య మృతదేహం లభ్యమైంది. దీంతో నదిలో కొట్టుకుపోయిన తమ బిడ్డ, ఎక్కడో ఒకచోట క్షేమంగా ఒడ్డుకు చేరుకుని వుంటాడన్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. విషాదంలో వేదసమాజం వీధి చైతన్య నదిలో శవమై తేలాడన్న విషయం తెలియడంతో స్థానిక వేదసమాజం వీధిలో విషాదచాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న చైతన్య బందువులు, స్నేహితులు అదిక సంఖ్యలో అతని ఇంటికి చేరుకున్నారు. చైతన్య గళ్లంతైన విషయం తెలుసుకున్న అతని పెదనాన్న బంగారయ్య తదితరులు రాజమహేంద్రవరంకు చేరుకుని, మృతదేహాన్ని సాలూరు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసారు. స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు ఇంటికి పెద్దదిక్కవుతాడనుకున్న బిడ్డ అర్దాంతరంగా తనువు చాలించాడన్న విషయం తెలిస్తే తల్లి శ్రీదేవి ఏమైపోతుందోనని, చైతన్య మరణ వార్త సాయంత్రం వరకు తెలియకుండా మృతుని కుటుంభసభ్యులు, బందువులు జాగ్రత్తపడ్డారు. తన బిడ్డను కాపాడంటూ ఆతల్లి ముక్కోటి దేవుళ్లకు మొక్కుకుంటుంటే, పరామర్శించేందుకు వస్తోన్న బందువులు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. కొడుకుపైనే ఆశలు పెట్టుకుని బతుకీడుస్తున్న చైతన్య తండ్రి సూర్యనారాయణ, తన బిడ్డ ప్రాణం పోయిందని తెలిసి కూడా, బార్యకు ఆవిషయం తెలిస్తే ఎక్కడ ఆమె గుండె ఆగిపోతుందోనన్న బెంగతో కడుపులోనే దుఃఖాన్ని దిగమింగుకుని బార్యకు దైర్యం చెబుతోన్న ఘటణ చూపరులను కలచివేసింది. వ్యవసాయం చేసుకుంటూ అతికష్టంమీద సూర్యనారాయణ తన కొడుకు చైతన్యను ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు. మరో ఏడాది కష్టపడితే చిన్నదో, పెద్దదో ఉద్యోగం వస్తే తమ కష్టాలన్నీ తీరిపోతాయని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇంతలో గోదావరి రూపంలో మృత్యువు కాటేయడంతో ఆకుటుంభంలో అల్లకల్లోలం రేగింది. -
20న బీసీ చైతన్య సదస్సు
కోరుట్ల : జగిత్యాలలోని విరూపాక్షి గార్డెన్స్‌లో ఈనెల20వ తేదీన జరిగే బీసీల చైతన్య సదస్సును విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ముల్క ప్రసాద్, మండల అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడారు. సదస్సుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ .కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ హాజరవుతారన్నారు. బీసీ సంఘం ప్రతినిధులు, బీసీలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో నాంతాబాద్ రాకేశ్, సురేందర్, నవీన్, గంగాదర్, శ్రీనివాస్, మనోహర్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
‘నారాయణ, చైతన్య’లపై సీఐడీ దాడులు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని పలు ప్రైవేటు కళాశాలలపై సీఐడీ అధికారులు శుక్రవారం రాత్రి దాడులు జరిపారు. ద్వితీయ పీయూసీ రసాయన శాస్త్రం ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి దర్యాప్తులో భాగంగా ఈ దాడులు నిర్వహించారు. బెంగళూరు, బళ్లారిలోని నారాయణ, చైతన్య కళాశాలలతోపాటు తుమకూరు, మంగళూరులో ఉన్న మొత్తం 11 ప్రైవేటు కళాశాలల్లో సోదాలు చేశారు. దాడుల్లో ప్రశ్నపత్రం లీకుకు సంబంధించి పలు ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
స్నేహితుడిని విడిచి పెట్టి వస్తూ...
ట్రాక్టర్ ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం మంగళగిరిటౌన్:ట్రాక్టర్ ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలోని మల్లెంపూడి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. తాడేపల్లి పోలీసుల కథనం మేరకు... ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ముప్పా వెంకట భవానీ శంకర్ (18) తాడేపల్లి మండలం వడ్డేశ్వరం కేఎల్‌యూలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన స్నేహితుడిని బస్‌స్టాప్ వద్ద దించి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. శుక్రవారం కళాశాలలో తరగతులు ముగించుకుని తెనాలికి చెందిన తన స్నేహితుడు చైతన్యను తన ద్విచక్ర వాహనంపై రేవేంద్రపాడు బస్‌స్టాప్ వద్ద దించేందుకు బయలుదేరి వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి భవానీ శంకర్ తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మెల్లెంపూడి వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న బ్రిక్స్ లోడు ట్రాక్టర్ ఢీకొట్టి భవానీ శంకర్ తలపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం
హైదరాబాద్: హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు బుధవారం బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. చైతన్య అనే యువకుడు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి చికాగో వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. ఆ క్రమంలో అతడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. లగేజీలో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బుల్లెట్‌ను స్వాధీనం చేసుకుని చైతన్యను ప్రశ్నిస్తున్నారు. -
నాగ్ నా నగ
అమల ప్రేమకు నిర్వచనం చెప్పలేం. ఆమె అనుబంధానికి పేరు పెట్టలేం. అనురాగానికి వెల కట్టలేం. అభిమానానికి తూకం వెయ్యలేం. ఆత్మీయతకు కొలమానం కనిపెట్టలేం. ఆరాధనకు అంచులు కుట్టలేం. ఆప్యాయతలకు ఆదిని అన్వేషించలేం. అన్యోన్యతకు అంతం వెతకలేం. ఈ ఏడు వారాల నగలు ఉండగా... వేరే ఆభరణాలెందుకు? అలంకారాలెందుకు? ► పెళ్లయ్యి ఈ జూన్‌కి ఇరవైమూడేళ్లయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కాకుంటే, కొన్నేళ్ళు మీరు నం.1గా ఉండేవారేమో. కానీ, కెరీర్‌ని త్యాగం చేసేశారే? అమల: పెళ్లి చేసుకుందామని నాగ్ నన్ను అడిగినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నేను కలలో కూడా ఊహించనంత అందమైన జీవితాన్నిచ్చాడు. నన్ను సినిమాలు చేయొద్దని తను చెప్పలేదు. పెళ్లయిన తర్వాత కూడా నేను వర్క్ చేస్తున్నాను. కాకపోతే సినిమాలు కాదు.. సామాజిక కార్యక్రమాల కోసం పని చేస్తున్నాను. సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నది నేనే. త్యాగం లాంటి పెద్ద మాటలు మాట్లాడను. కథానాయికగా ఎందుకు కొనసాగలేదని ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. ► సినిమాలకు దూరంగా ఉండాలని ఎందుకనుకున్నారు? పెళ్లయ్యాక పదిహేనేళ్ల వరకూ కెరీర్ గురించి ఆలోచించేంత తీరిక లేదు. పిల్లలు పెరుగుతున్నప్పుడు తల్లి అవసరం ఉంటుంది. అఖిల్ ఆలనాపాలనా చూసుకునేదాన్ని. ఇంటి బాధ్యతలతో పాటు బ్లూ క్రాస్ కృషితోనే నాకు సరిపోయేది. ఇప్పుడు అఖిల్ సొంత నిర్ణయాలు తీసుకునేంత ఎదిగాడు. అందుకని, నాకు ఒక్కసారిగా స్వేచ్ఛ లభించినట్లుంది. ఎక్కడికైనా ట్రావెల్ చేసేంత, నాకు నచ్చిన పనులు చేసేంత వీలు చిక్కింది. అందుకే, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’కి శేఖర్ కమ్ముల అడిగినప్పుడు చేశా. తమిళ సీరియల్ ‘ఉయిర్‌మై’లో నటించా. ► సినిమాల్లోకి వచ్చినప్పటిలానే ఇప్పుడూ ఉన్నారే? ఒకప్పుడు బొద్దుగానే ఉండేదాన్ని. ఆ తర్వాత సన్నబడ్డా. సినిమా తారలంటే మరీ సన్నగా, చాలా లావుగా... కాకుండా మధ్యస్తంగా ఉండేలా జాగ్రత్తపడాలి. ఇన్నేళ్లూ సినిమాలకు దూరంగా ఉన్నా.. ఆరోగ్యం కోసం చేస్తున్న వ్యాయామాలు, యోగా, మంచి డైట్.. నేనిలా ఉండడానికి కారణం అయ్యాయి. ► డైట్ అంటే గుర్తొచ్చింది మీరు ‘వేగన్’ కదా. వేగన్ అంటే తెలియనివారికి కొన్ని విషయాలు చెబుతారా? ‘వేగన్’ అంటే మూగజీవాల నుంచి వచ్చే దేన్నయినా ఆహారంలో చేర్చుకోకపోవడం. నేను పాలు తాగను. తేనెకి దూరం. మాంసం జోలికెళ్లను. పదకొండేళ్ల వయసులోనే మాంసాహారం మానేశా. ఎనిమిదేళ్ల క్రితం వేగన్‌గా మారా. పాలు మానేసినప్పట్నుంచీ ఆరోగ్యం ఇంకా బాగుంటోంది. ► వయసు పెరిగాక, ఎముకలు బలహీనమవుతాయనీ, క్యాల్షియమ్ కోసం లేడీస్ పాలు తాగాలనీ డాక్టర్లు చెబుతారే? చాలామందికి తెలియని విషయం ఏంటంటే... పాలల్లోకన్నా నువ్వులలో క్యాల్షియమ్ ఎక్కువుంటుంది. గ్లాసుడు పాలల్లో 10 మిల్లీగ్రాములు కాల్షియమ్ ఉంటే.. 100 గ్రాముల నువ్వులలో వెయ్యి మిల్లీగ్రాములుంటుంది. కానీ, పాలలో క్యాల్షియమ్ ఎక్కువగా ఉంటుందని డైరీ ఫామ్స్ ప్రకటనలిచ్చి, ఆకర్షిస్తుంటాయి. నువ్వులు మంచివని ప్రకటించుకోవడం పాపం వాటిని పండించే రైతులకు తెలియదుగా. అలాగే వేరుసెనగపప్పు కూడా మంచిదే. ఇవాళ మనందరం ఏదైనా కొనాలంటే ప్రకటనలు చూసే కొంటున్నాం కానీ, నిజంగా అవి మంచివేనా? అనేది ఆలోచించలేకపోతున్నాం. భారీ ప్రకటనలతో చాలామంది వ్యాపారస్థులు ప్రలోభపెట్టేస్తున్నారు. ► నాగార్జున మీ సొంతం కావడంపై చాలామంది అసూయపడతారు. హ్యాండ్సమ్గా కనిపించే నాగార్జున ఎలాంటి వ్యక్తి? నాగ్ చాలా చాలా స్పెషల్. తనను పెళ్లి చేసుకోవడం ఆ దేవుడి ఆశీర్వాదం. వ్యక్తిగా నాగ్ మంచి హ్యూమన్ బీయింగ్. అందుకే తనంటే ప్రేమ, ఆరాధన, గౌరవం. ► భర్త అందగాడైతే వేరే అమ్మాయిల దృష్టి పడకుండా కాపాడుకోవాల్సొస్తుంది. ఈ విషయంలో మీకు టెన్షన్ తప్పదేమో? మానసిక పరిణతి లేని, సున్నితమైన మనస్కులైతే టెన్షన్ పడతారేమో. నేను అభద్రతాభావానికి గురయ్యేలా నాగ్ ఎప్పుడూ ప్రవర్తించలేదు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన మహిళను నేనే అనే నమ్మకాన్ని కలిగించాడు. ఎంతమంది అందమైన అమ్మాయిలు చుట్టూ ఉన్నా, ‘నువ్వంటే నాకు చాలా ప్రేమ’ అనే విధంగా ప్రవర్తించడంతో పాటు ‘నువ్వు మాత్రమే నాకు ప్రత్యేకం’ అనే ఫీల్‌ని కలగజేస్తాడు. నేను నెగటివ్ ఎమోషన్స్‌కి విలువ ఇవ్వను. ఇస్తే అసూయ, అభద్రత, కోపం... కలుగుతాయి. ► మీరెక్కువగా చేనేత చీరలే వాడతారెందుకని? ఖర్చు తక్కువ కాబట్టి షాపింగ్‌లో నాగ్‌కి ఇబ్బంది ఉండదేమో? అది నిజమే. నా డ్రెస్‌ల ఖర్చు తక్కువే అయినప్పటికీ... ప్రయోజనాత్మక కార్యక్రమాల కోసం నాగ్ ఇచ్చే భారీ చెక్స్‌ని కాదనను. నాగ్‌ది చాలా పెద్ద మనసు. కాదనుకుండా ఇచ్చేస్తాడు. చేనేత చీరలు బాగుంటాయి. మనం కనుక నెలకు రెండు చేనేత చీరలు కొంటే.. దాని చేనేతనే నమ్ముకున్న తయారీదారుల కుటుంబం నెలసరి ఖర్చులకు దాదాపు సరిపోతుంది. పైగా అవి మెత్తగా ఉంటాయి, హాయిగా ఉంటుంది. ► నగలు కూడా పెద్దగా వాడరనిపిస్తోంది. మరి... నాగార్జున మీకిచ్చిన మొదటి ఆభరణం గురించి? నాకో అందమైన ఎంగేజ్మెంట్ రింగ్ ఇచ్చాడు. అయితే నీళ్లల్లో డైవింగ్ చేస్తున్నప్పుడు నా చేతి మీద ట్యాంక్ పడింది. దాంతో ఆ ఉంగరానికి ఉన్న రాయి పగిలిపోయింది. అది పగిలినందువల్ల నా వేలికి ఏమీ కాలేదు. సో.. నాగ్ ఇచ్చిన ఆ ఉంగరం నా వేలును కాపాడినట్లుగా నేను భావిస్తాను. ఓ బర్త్‌డేకి నాకు మంచి ఇయర్ రింగ్స్ బహుమతిగా ఇచ్చాడు. ఆ తర్వాత నాకు నగలేవీ వద్దని చెప్పడంతో మానేశాడు. ► బలమైన కుటుంబం ఏ స్త్రీకైనా కొండంత అండ. ‘అక్కినేని’ మీ ఇంటి పేరుగా మారినందుకు ఎలా అనిపిస్తోంది? అక్కినేని కుటుంబంలో ఉండడం నా అదృష్టం.. ఆ దేవుడి ఆశీర్వాదం. ఎక్కడికెళ్లినా ప్రేమాభిమానాలు, గౌరవం దక్కుతున్నాయి. మారుమూల ప్రజలను కలవడానికి వెళ్లినప్పుడు పెద్దవాళ్లందరూ మా మావయ్య సంగతులు, తర్వాతి తరంవారు నాగ్‌ను, యూత్ ఏమో నాగచైతన్య, అఖిల్ గురించి అడుగుతుంటారు. మా పట్ల వాళ్ల ప్రేమకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ► మీ అత్తగారు స్వర్గీయ అన్నపూర్ణ గురించి రెండు మాటలు? ఆమెలో నేను అమ్మను చూసుకున్నా. పెళ్లయిన కొత్తలో తెలుగు సంప్రదాయాల గురించి ఆమే చెప్పింది. తెలుగు నేర్పిందీ అత్తగారే. ఆమె లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ► పెళ్లయిన కొత్తలో అక్కినేనితో మూవ్ కావడానికి ఏమైనా...? మావయ్యగారు చాలా గొప్ప వ్యక్తి. చాలా పద్ధతిగా ఉండేవారు. క్రమశిక్షణ గల వ్యక్తి. ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి. ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి, అందర్నీ అర్థం చేసుకుంటారు. కాబట్టి నాకేం ఇబ్బంది అనిపించలేదు. మావయ్యగారి ప్రేమాభిమానాల్ని మర్చిపోలేను. ఆయన మా మనసుల్లో ఉన్నారు. ► మీ అమ్మానాన్నలతో, బ్రదర్, సిస్టర్‌తో నాగ్ ఎలా...? నాకు మా అమ్మా, నాన్న, బ్రదర్, సిస్టర్ మాత్రమే కాదు.. ఓ స్టెప్ మామ్ కూడా ఉంది. మా వాళ్లతో నాగ్ చాలా బాగుంటాడు. వాళ్లెప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు చాలా కేరింగ్‌గా ఉంటాడు. మా వాళ్ల నుంచి ఏమీ ఎదురుచూడడు. ఎలాంటి నిబంధనలూ లేకుండా స్వచ్ఛంగా అభిమానిస్తాడు. ► నాగచైతన్యకు మీరు తల్లి స్థానాన్ని ఇచ్చారా? అలా ఎదురు చూడటం తప్పు. ఎందుకంటే, తనకో అమ్మ ఉంది. ఆ అమ్మ స్థానాన్ని నేను లాక్కోలేను. చైతన్య మా కుటుంబ సభ్యుడే. తనంటే నాకు చాలా ఇష్టం. ‘వండర్ఫుల్ బాయ్’. ► మీ స్టెప్ మదర్ మీతో ఎలా ఉంటారు? బాగానే ఉంటారు. నాకు మా అమ్మగారు ఉన్నారు కాబట్టి నా స్టెప్ మామ్‌ని నేను అమ్మగా అంగీకరించలేదు. అవిడ కూడా మా అమ్మ స్థానాన్ని లాక్కోవడానికి ప్రయత్నించలేదు. ఆమె మా కుటుంబ సభ్యురాలే. ఆమె అంటే నాకిష్టమే. మా మధ్య మంచి అనుబంధం ఉంది. ► అఖిల్‌ని తెరపై చూడడానికి ఓ తల్లిగా...? ఎస్.. తనను హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై చూసుకోవాలనే కోరిక ఉంది. ► మరో జన్మ అంటూ ఉంటే... మీరేం అడుగుతారో తెలుసు.. అవును.. నాగ్‌కి భార్యగానే ఉండాలని కోరుకుంటున్నాను. - డి.జి. భవాని ఫోటో: శివ మల్లాల లవ్ లైఫ్, మ్యారీడ్ లైఫ్... నాగ్ చాలా రొమాంటిక్. నా దగ్గర తన ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు చాలా కేర్ తీసుకున్నాడు. ఎంతో ప్లాన్ చేసుకుని, ఆ ఫీలింగ్‌ను చాలా అందంగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఆ సమయంలో తను చెప్పిన మాటలు పూర్తిగా నా వ్యక్తిగతం. నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయే ఆ మాటలను బయటికి చెప్పను. పెళ్లనేది అందమైన పూలవనం లాంటిది. ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులిస్తాయి. కొన్ని కలుపు మొక్కలు మంచి చెట్లను నాశనం చేస్తాయి. పెళ్లి కూడా అంతే. మన బంధం ఇతరుల కారణంగా నాశనం కానివ్వకూడదు. ‘నువ్వు నాకు చాలా ప్రత్యేకం.. నువ్వంటే నాకు ప్రేమ’ అనే నమ్మకాన్ని జీవిత భాగస్వామికి కలిగించాలి. లేకపోతే ఆ బంధంలో జీవం ఉండదు. మా ప్రతి పెళ్లి రోజునాడు మా ప్రమాణాలను పునరుద్ధరించుకుంటాం. అలాగే.. ప్రతి ఏడాదీ మాకు కొత్తగా ఉంటుంది. రామ్ ఎడిటర్, ఫీచర్స్ -
మాటల్లో కాదు... చేతల్లో చూపు
* నాది.. మనదిగా మారాలంటే.. చాలా మారాలి... * ముఖ్యంగా మనసు.. మెదడు. సమస్యపై స్పందించే మనసు, పరిష్కారం * ఆలోచించే మెదడు ఉంటే చాలు... మాకున్నవి ఈ రెండే.. అందుకే ఈ మార్పు.. మీరూ చూడండి అంటున్నారు ‘హైదరాబాద్ రైజింగ్’ (ఫేస్బుక్ పేజ్) బృంద సభ్యులు. యూత్ అంటే ఫేస్బుక్లో సెల్ఫీల అప్డేట్లూ, సొల్లు కామెంట్ల పోస్ట్‌లు మాత్రమే కాదని నిరూపించారు. ‘ద అగ్లీ ఇండియన్’ అనే ఫేస్బుక్ పేజ్ నుంచి స్ఫూర్తి పొందిన నగర యువతీ యువకులు.. ‘హైదరాబాద్ రైజింగ్’ అనే కమ్యూనిటీని ప్రారంభించారు. తమ వంతుగా ఒక మంచి ‘మార్పు’కు దోహదపడదామని ఆలోచించి, దీనికి వేదికగా చందానగర్‌లో అత్యంత దుర్గంధభరితంగా, సిటీలో సగటు రోడ్డుకుండే అవలక్షణాలన్నీ సొంతం చేసుకున్న రోడ్లను ఎంచుకున్నారు. నవ్వుతూ తుళ్లుతూ రిపేర్ చేయడం మొదలెట్టారు. ఒక్క రోజులోనే... ఆ రోడ్లు కళకళలాడుతున్నాయి. చెత్త, కంపు, మాయమై మా సొగసు చూడతరమా అంటున్నాయి. ‘మాటలు చాలు.. చేతల్లో చూపు’ (కామ్ చాల్... మూ బంద్) అని చెప్పకనే చెప్పిన ఈ యువత సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పనిని చేశాం అనే ఆనందంతో వెలిగే వదనాలతో మురిసిపోయారు. నలుగురికీ ఉపయోగపడే పనిని చేశామంటూ సగర్వంగా ఫేస్బుక్లో ఫొటోలు అప్లోడ్ చేసుకున్నారు. - చైతన్య.జి -
విజయాన్నియాడ్ చేసుకున్నారు...
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే యువకులు జేబు నిండా డబ్బులతోనో, రకరకాల ఆశలతోనో వస్తారు. కృష్ణాజిల్లా, చల్లపల్లిలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన సుమన్, విజయవాడకు చెందిన చైతన్యలు మాత్రం బుర్ర నిండా ఐడియాలతో వచ్చారు. సృజనాత్మక ఆలోచనలే ఆసరాగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నారు. సినిమాలను ‘నెట్’లో ప్రమోట్ చేయడం అనే ప్రయోగంతో తొలి విజయం సాధించిన సుమన్ (28) చైతన్య (28)లు స్వల్పకాలంలోనే అగ్రస్థాయి యాడ్ ఏజెన్సీగా తమ ‘జాన్‌రైజ్’ను తీర్చిదిద్దారు. ఆ విజయప్రస్థానం గురించి వారి మాటల్లోనే... ‘‘బి.టెక్(సుమన్) ఎం.బి.ఎ (చైతన్య) డిగ్రీలు పుచ్చుకుని హైదరాబాద్‌కు వచ్చాం. ఉద్యోగం వెతుక్కుంటామని ఇంట్లో చెప్పామేగాని నెలవారీ జీతం, నైన్ టు ఫైవ్ జాబ్ దగ్గర ఆలోచనలు ఆగలేదు. ఏదో సాధించాలనే తపనతో తెలిసిన పరిచయాలను ఉపయోగించుకుని సినిమాల్లో ప్రయత్నించాం. అలా మాలో ఒకరు (సుమన్) ‘గమ్యం’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు. సినిమా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో మా గమ్యం ఏమిటో తెలిసింది. సినిమా ప్రమోషన్‌కి ‘నెట్’వర్క్... నెట్ విప్లవం మొదలైంది. మెయిల్స్ ఇచ్చి పుచ్చుకోవడాలు బాగా అలవాటవుతున్నాయి. అప్పుడు ‘ సినిమాలకు నెట్లో ప్రచారం’ ఆలోచన వచ్చింది. తేలికగా, చాలా చౌకగా, ప్రభావవంతంగా ప్రచారం చేయవచ్చని భావించాం. ‘ఒక హోర్డింగ్ ఏర్పాటు చేసే ఖర్చుతో డిజిటల్ మీడియా ప్రచారం మొత్తం పూర్తి చేయవచ్చు’ అని ఒక పెద్ద నిర్మాతకు సలహా ఇవ్వబోతే ఆయన మమ్మల్ని కోపగించుకున్నారు కూడా. ఇలాంటివి ఎదురైనా...మేం వెనుకడుగు వేయలేదు. ఎట్టకేలకు హీరో రామ్ నటించిన ‘గణేశ్’కు డిజిటల్ మీడియా ప్రచారం చేసే అవకాశం లభించింది. ఆసక్తి రేకెత్తించేలా సినిమాకు పేజ్ రూపొందించడం, వేలాది ఇ-మెయిల్స్ సేకరించి, వాటి కి ఈ సైట్ లింక్ పంపించడం లాంటివి చేశాం. ఆ ఆలోచన సూపర్‌హిట్ కావడంతో సినిమా ప్రచారంలో సరికొత్త ధోరణి పుంజుకుంది. ‘గణేశ్, బృందావనం, ఖలేజా, రక్తచరిత్ర, గాయం 2...’ ఇలా పలు సినిమాలకు పనిచేశాం. ఆయా సినిమాలకు ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడం, డైలీ షూటింగ్ పురోగతి వివరాలు ఇవ్వడం ద్వారా అభిమానులకు ఆసక్తి పెంచేవాళ్లం. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇవ్వని ఫొటోలు, కంటెంట్లను ప్రొడ్యూసర్స్ దగ్గర తీసుకుని వాటికి ఆసక్తికరమైన అంశాలను జోడించి పోస్ట్ చేయడంతో నెటిజన్ల ఆసక్తి రెట్టింపు అయ్యేది. అలా అలా ‘రైజ్’ంగ్... సినిమాలకే పరిమితం కాకూడదని ‘జాన్‌రైజ్’ని విభిన్న రంగాలకు విస్తరించాం. సినీరంగం ద్వారా మంచి గుర్తింపు లభించడంతో కార్పొరేట్ కంపెనీలు మా వర్క్ పట్ల ఆసక్తి చూపించాయి. తొలుత మూడున్నర లక్షల రూపాయల పెట్టుబడి, నలుగురు సిబ్బందితో మొదలైన మా సంస్థ దినదినప్రవర్ధమానమైంది. జాన్‌రైజ్ ఫిలిమ్స్, జాన్‌రైజ్ హెల్త్, జాన్‌రైజ్ డిజిటల్, జాన్‌రైజ్ అడ్వర్టయిజింగ్... సేవల్ని బట్టి నాలుగు సంస్థలుగా విభజించుకున్నాం. మాలో ఒకరు (చైతన్య) మార్కెటింగ్, మరొకరు (సుమన్) క్రియేటివ్ సైడ్ చూసుకుంటున్నాం. వైవిధ్యభరితమైన లోగోలు, ప్రకటనలు, బ్రాండింగ్... సేవలతో క్లయింట్స్ సంఖ్యను బాగా పెంచుకోగలిగాం. ఆంధ్రాబ్యాంక్ వంటి బ్యాంకుల దగ్గర్నుంచి జివికె మాల్ వంటి మాల్స్ దాకా... కార్పొరేట్ ఆసుపత్రులు, స్కూల్స్... ఇలా విభిన్న రంగాలకు చెందిన సంస్థలకు పనిచేస్తున్నాం. సామాజిక బాధ్యతగా... పేపర్‌ను పొదుపుగా వాడమని చెప్పడం కోసం ఒక ప్రచారం చేశాం. దీని కోసం ఒక రూ.1000 నోటులా అనిపించేవి ప్రింట్ చేయించి మా వాలంటీర్ల ద్వారా రోడ్ల మీద పడేయించాం. ‘అరె మీ నోటు పడిపోయిందంటూ’ అనగానే దారిన పోయేవారు ఆ నోటు తీసి జేబులో పెట్టుకున్నారు. ఆ తర్వాత తీసి చూస్తే ఆ నోట్ మీద ఒకసైడ్ మాత్రమే ప్రింట్ చేసి ఉంటుంది. రెండో వైపు ‘‘రెండో వైపు ఉపయోగించకపోతే అది కరెన్సీ అయినా వృథాయే’’ అని రాసి ఉంటుంది. అలాగే ఇటీవల వాలంటైన్స్‌డే సందర్భంగా... ‘నో స్మోకింగ్’ అంటూ ప్రచారం చేశాం. పొగతాగడం మానకపోతే ‘‘ప్రేమించడానికి హృదయం ఉండదు’’ అని పరోక్షంగా చెప్పాం. ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలకు మా క్లయింట్లను ఒప్పించి వారితో కలిసి నిర్వహిస్తాం. మూలాలు మరవకుండా... ‘నథింగ్ ఈజ్ అన్క్రియేటివ్’ అనే సిద్ధాంతం మాది. మేం చేసిన వర్క్స్‌కు సంబంధించి పలు సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్నాం. బెస్ట్ క్యాప్షన్ అవార్డ్లు కూడా వచ్చాయి. మాలో ఒకరు (సుమన్)కి చిన్నప్పుడు అభిమాననటుడి సినిమా పేర్లు రాసి వాటికింద ట్యాగ్లైన్లు రాయడం అలవాటు. అదే అలవాటు ఇప్పుడు ఆదరణ పొందే అక్షరాలను అల్లేందుకు కారణమవుతోంది. ప్రస్తుతం మా సంస్థ టర్నోవర్ కోట్ల రూపాయలకు చేరింది. ఒకప్పుడు అమీర్‌పేటలో బ్యాచిలర్ రూమ్‌లో రోజువారీ అద్దెకు కంప్యూటర్లు తెచ్చుకుని వర్క్ చేసుకున్న రోజుల్ని మరిచిపోకుండానే... ఆ కష్టమే స్ఫూర్తిగా అత్యుత్తమ యాడ్ ఏజెన్సీగా ఎదగాలని ఆశిస్తున్నాం. - ఎస్. సత్యబాబు -
కాళిచరణ్ సినిమా ప్రెస్ మీట్