
మెగా డాటర్ నిహారిక కొణిదెల దంపతులు వేకేషన్‌లో ఉన్నారు. డిసెంబర్ 9న వారి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరి సందర్భంగా నిహారిక-చైతన్యలు ఇటీవల స్పెయిన్‌కు పయనయ్యారు. ఈ క్రమంలో ఈ జంట అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. స్పెయిన్, బార్సిలోనాలోని పర్యటక ప్రాంతాలను సందర్శిస్తూ అక్కడి అందమైన ప్రదేశాలను ఆస్వాధిస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు నిహారికి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. ఈ క్రమంలో నిహారిక-చైతన్యలు స్కై డైవింగ్ గురించి మాట్లాడుకుంటూ ఒకరిపై ఒకరూ కౌంటర్ ఇచ్చుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే వీరిద్దరూ విదేశీ పర్యటనకు వెళ్లిన డే వన్ నుంచి అక్కడ వారు ఎంజాయ్ చేస్తున్న ప్రతి మూమెంట్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో డిన్నర్ చేయడానికి నిహారిక-చైతన్యలు రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ తినకుండా నిహా తన ఫోన్‌లో బిజీగా ఉంది. తనని సెల్ఫీ తీస్తూ ‘ఎప్పుడు ఇదే పని, ప్రతి క్షణం ఫోన్‌లో ఇలా బిజీ ఉంటుంది’ అంటూ ఫిర్యాదు చేశాడు. నిహారిక అలాగే ఫోన్ చూస్తున్న మరో ఫొటోను కాసేపటికి షేర్ చేస్తూ ‘కొన్నిమిలియన్ క్షణాల తర్వాత’ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక వీరిద్దరి అల్లరి చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక త్వరలోనే వీరి మొదటి వివాహ వార్సికోత్సవం సందర్భంగా నెటిజన్లు ఈ జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment