ఘనంగా నిహారిక-చైతన్య రిసెప్షన్ | Niharika Konidela And Chaitanya Reception Photos Goes Viral | Sakshi
Sakshi News home page

ఘనంగా నిహారిక-చైతన్య రిసెప్షన్

Published Fri, Dec 11 2020 9:07 PM | Last Updated on Fri, Dec 11 2020 9:08 PM

Niharika Konidela And Chaitanya Reception Photos Goes Viral - Sakshi

చైతన్య జొన్నలగడ్డ, నిహారిక రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఈ నెల 9న రాజస్తాన్ ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ లో చైతన్య,నిహారికల వివాహం జరిగింది. మెగా హీరోలంతా ఫ్యామిలీతో ఈ శుభకార్యానికి హాజరై సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు.  
(చదవండి : నా బంగారు తల్లి.. డాషింగ్‌ బావ: వరుణ్‌ తేజ్‌)

శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్ వేడుకలో మెగా కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నూతన వధు వరులను ఆశీర్వదించారు. ఇండస్ట్రీ నుంచి పలువరు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. జేఆర్సీ కన్వెన్షన్‌ లోపలికి వెళ్లడానికి పాస్‌ వర్డ్‌ని క్రియేట్‌ చేశారు కుటుంబసభ్యులు. వేడుక కోసం జేఆర్సీ ప్రాంగణాన్ని గ్రాండ్‌గా డెకరేట్ చేశారు.  కరోనా‌ నిబంధనలకు అనుగుణంగా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement