సమంత, చైతు నిశ్చితార్థం డేట్ ఫిక్స్?
హైదరాబాద్: టాలీవుడ్ అందమైన జంటగా అభిమానులు యాక్సెప్ట్ చేసిన లవ్లీ కపుల్ నాగచైతన్య, సమంత నిశ్చితార్థానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైయిందట. ఈ మేరకు టాలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తమ అభిమాన జంటకు నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ అయిందన్నవార్తల అటు అభిమానులను, ఇటు ఫిలింనగర్ ను మురిపిస్తోంది.
ఇటీవల చైతూ ట్విట్టర్ లో చేసిన సందడి కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. మరోవైపు నాగర్జున చిన్నకుమారుడు అఖిల్ నిశ్చాతార్థం ఇప్పటికే పూర్తి కావడంతో.. ఈ శుభకార్యాన్ని కూడా తొందరగా జరిపించాలని నాగార్జున భావిస్తున్నారట!
చైతు, సమంతల నిశ్చితార్థ వేడుక జనవరి 29న నిర్వహించనున్నారనే ఫిలింనగర్ లో గుప్పుమంది. ఇప్పటికే ఏర్పాట్టు ముమ్మరంగా సాగుతున్నాయనీ, అతిథులను ఆహ్వానించే పనిలో నాగ్ దంపతులు బిజీగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ శుభఘడియకోసం ఎదురుచూస్తున్న ఈ జంట అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. అయితే దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు సస్పెన్స్ మాత్రం తప్పదు.