
హైదరాబాద్ : మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. గుంటూరు పోలీసుశాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్ కుమారుడు చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయబోతున్నారు. ఈ ఏడాదిలోనే వీరి వివాహం జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తన పెళ్లిపై నిహారిక కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే తాజాగా చైతన్య బర్త్ డేను పురస్కరించుకుని నిహారిక స్పెషల్ విషెస్ చెప్పారు. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన నిహారిక.. ‘హ్యాపీ బర్త్ డే లవ్’ అని పేర్కొన్నారు.(ఆగస్ట్‌లో నిశ్చితార్థం)
‘ఒక నవ్వు.. గది మొత్తం వెలుగులు నింపుతుంది, ఇంట్లో ఉన్న అనుభూతి కలిగేలా కౌగిలించుకుంటుంది. నవ్వు నా సంతోషపు చిరునామా చై. ఇది కేవలం మొదటిది మాత్రమే.. ఇంకా చాలా ఉన్నాయి. అన్నింటిల్లో నువ్వు ఉత్తమమైనవాడివి. హ్యాపీ బర్త్ డే లవ్’ అని నిహారిక పేర్కొన్నారు. నిహారిక పోస్ట్‌పై స్పందించిన చైతన్య.. నిహారికకు థ్యాంక్స్ చెప్పారు. ‘థ్యాంక్స్ నిహా.. జస్ట్ మేడ్ మై డే అగేన్’ అని కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment