
చైతన్య, దివీ ప్రసన్న జంటగా మహేశ్ దర్శకత్వంలో ఫిలిమ్ అండ్ రీల్స్‌పై ఆస్ట్రేలియాలో ఆరంభమైన చిత్రం ‘ప్రాజెక్ట్ సి 420’. మార్క్ కే రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్. ‘‘ఎక్కువమంది విదేశీయులు నటిస్తున్న తెలుగు చిత్రమిది. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో కానీ ఒక చిన్న తప్పు మాత్రం జీవితాన్ని తలకిందులు చేస్తుందన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. 80 శాతం ఆస్ట్రేలియన్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారు. అక్టోబర్ 30కి షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.