house arrest
-
కర్నూలులో కాటసాని రాంభూపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
భూమన అభినయ్ రెడ్డిను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
-
సూపర్ సిక్స్‌పై ప్రశ్నిస్తే కేసులు.. అడుగేస్తే నిర్భంధం
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో రెడ్‌బుడ్ రాజ్యాంగం అమలవుతోంది. ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ట్ అరెస్ట్, అరెస్ట్‌లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు భూమన అభినయ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డిని గురువారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్బంగా అభినయ్ రెడ్డి మాట్లాడుతూ..‘ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా చంద్రబాబు ఉచిత బస్సు హామీ గాలికి వదిలేశారు. సూపర్ సిక్స్ అమలు చేయాలని కోరితే హౌస్ అరెస్టు చేస్తారా?. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వాలని మహిళలు అడిగితే వారిని అరెస్టు చేస్తారా?.బడ్జెట్లో సూపర్ సిక్స్‌కు ఏ మాత్రం నిధులు కేటాయించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వైఎస్సార్సీపీ శాంతియుతంగా వినతిపత్రం అందచేయాలని అనుకున్నాం. దానికి ఎందుకు హౌస్ అరెస్టు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రజా గొంతుకను నులిమేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు?. వినతి పత్రం ఇచ్చేందుకు సైతం అనుమతించడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలని చూస్తారా? అని ప్రశ్నించారు. -
చలో తుని.. వైఎస్ఆర్సీపీ నేతలు హౌస్ అరెస్ట్
-
జక్కంపూడి రాజాను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
-
వీడియో: పోలీసుల అత్యుత్సాహం.. పేర్ని నాని హౌస్ అరెస్ట్
సాక్షి, కృష్ణా: ఏపీలో కూటమి సర్కార్ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ పాలన చేస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.వంశీ అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం పేర్ని నాని ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఏఆర్ ఏఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మోహరించారు. ఈ క్రమంలో నానిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల తీరుపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పేర్ని నాని హౌస్ అరెస్ట్...
-
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హౌస్ అరెస్టు
తాడిపత్రిటౌన్: అనంతపురం జిల్లా, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు సోమవారం హౌస్ అరెస్టు చేశారు. శింగనమల నియోజకవర్గ పరిధిలోని యల్లనూరు మండలం, తిమ్మంపల్లిలోని స్వగృహంలో నిర్బంధించారు. 41 సెక్షన్ కింద నోటీసు జారీ చేశారు. తాడిపత్రిలోని పెద్దారెడ్డి నివాసానికి రాకుండా మరోమారు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేతిరెడ్డిని తాడిపత్రిలోకి అడ్డుపెట్టకుండా పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారు. తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి..వివిధ కారణాలు చూపుతూ ఆయన్ను నిలువరిస్తున్నారు.మొన్నటి వరకు కేతిరెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. తాడిపత్రిలో సొంతిల్లు కూడా ఉంది. అయినా శాంతిభద్రతల సమస్యను సాకుగా చూపి తాడిపత్రికి రానివ్వడం లేదు. సోమవారం తాడిపత్రికి వస్తున్నట్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. వస్తే అడ్డుకుంటామని జేసీ అనుచరులు హెచ్చరించడంతో తాడిపత్రిలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి దాదాపు 150 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జేసీ, కేతిరెడ్డి ఇళ్ల మధ్య ఉన్న కళాశాల ఆట స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాలతో పట్టణమంతా నిఘా ఉంచారు. రెండు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద ఉన్న దుకాణాలను మూసివేయించారు. జనం గుంపులుగా ఉండకుండా చెదరగొట్టారు. ఉదయం 11 గంటల వరకు ఉద్రిక్తత కొనసాగింది. చివరకు తిమ్మంపల్లిలో పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారన్న సమాచారంతో పోలీస్ బలగాలు వెనుదిరిగాయి.నా ఇంటికి వెళ్లాలన్నా వీసా కావాలా? కేతిరెడ్డి‘నేను తాడిపత్రిలోని సొంతింటికి వెళ్లాలన్నా వీసా కావాలేమో చెప్పండి..అప్లై చేసుకుంటా’ అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. సాధారణంగా వేరే దే«శానికి వెళ్లాలంటే వీసా కావాలని, కానీ ఇప్పుడు పోలీసుల తీరు చూస్తుంటే తాడిపత్రికి వెళ్లాలన్నా వీసా తీసుకోవాలేమోనన్న అనుమానం వస్తోందని ఎద్దేవా చేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగడాలు శ్రుతిమించాయన్నారు. తనను నమ్మి తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు 80 వేల మంది ఓట్లు వేశారని, వారి బాగోగులు చూసేందుకు తాడిపత్రికి వచ్చి తీరుతానని స్పష్టం చేశారు. -
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
-
పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
వీడియో: పాడి కౌశిక్‌రెడ్డి హౌస్ అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామునే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్(KTR) విచారణ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఈరోజు ఉదయం 5:30కి తన కమ్యూనిటీలో జిమ్ చేయడానికి వెళ్తున్న సమయంలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని ఈరోజు ఉదయం 5:30 కి తన కమ్యూనిటీలో జిమ్ చేయడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చెయ్యడం జరిగింది. @BRSparty pic.twitter.com/bFtbUFGYt0— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 6, 2025ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు(Formula E-car Race) కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్(BRS Party) ఎమ్మెల్యే కేటీఆర్ ఈకేసులో నేడు సీబీఐ ఎదుట విచారణకు హాజరుకున్నారు. దీంతో, కేటీఆర్ విచారణకు వెళ్తారా? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కేటీఆర్ విచారణకు వెళ్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పోలీసులను అడ్డుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇందులో భాగంగా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. -
YS అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
కడపలో పోలీసుల ఓవరాక్షన్.. అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, వైఎస్సార్: కూటమి సర్కార్ పాలనలో వైఎస్సార్సీపీ నేతల టార్గెట్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. సాగునీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ నేతలు తాము ఎన్నికలను బహిష్కరించామని చెప్పినా అరెస్ట్‌ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం తెల్లవారుజామునే అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.వైఎస్సార్ జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు మోహరించాయి. ఎక్కడికక్కడ వీఆర్వోల నుంచి వైఎస్సార్సీపీ మద్దతుదారులైన రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చారు. చక్రాయపేట, వేముల, వేంపల్లెల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వేంపల్లెలో నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్దమైన వీఆర్వోలను మండల టీడీపీ నాయకుడి కుమారుడు బూతు పురాణం అందుకున్నారు.జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియంలో వీఆర్వోలందరినీ ప్రత్యేక వాహనంలో ఎక్కించుకుని టీడీపీ నేతలు సమయం ముగిసేంతవరకు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. అలా చేయడంపై ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు.నీటి తీరువా బకాయిలు ఉంటే పోటీకి నో..సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలంటే నీటి తీరువా బకాయిలు ఉండకూడదు. ఎన్నికల్లో పోటీ చేసే వారు నీటి తీరువా బకాయిలు లేవని వీఆర్వోల నుంచి నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకోవాలి. సాధారణంగా నో డ్యూ సర్టిఫికెట్లను ఆ సాగునీటి సంఘాల పరిధిలోని గ్రామ సచివాలయాల్లో వీఆర్వోలు జారీ చేస్తారు.అయితే ఇప్పుడు సాగు నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో నో డ్యూ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని వీఆర్వోలకు కూటమి ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారు. దాంతో నో డ్యూ సర్టిఫికెట్ల కోసం ఆ మండల తహసిల్దార్ కార్యాలయాలకు వెళ్లిన ఇతర పార్టీల మద్దతుదారులపై పోలీసుల సమక్షంలోనే కూటమి శ్రేణులు దాడులు చేసి.. భయోత్పాతానికి గురిచేస్తున్నాయి.ఇక, రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. సాగు నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను తమ మద్దతుదారులకే కట్టబెట్టి, దోచుకోవాలనే దురాలోచనతో అరాచకాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే ‘చేతులెత్తి ఎన్నుకునే విధానం’ ద్వారా వాటికి ఎన్నికలు నిర్వహించేలా చట్టాన్ని సవరించింది. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఏకాభిప్రాయం వ్యక్తం కాని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.ఇతర పార్టీల మద్దతుదారులు పోటీకి సిద్ధమైతే రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అలా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది గుర్తెరిగిన కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెరతీసింది. ఇతర పార్టీల మద్దతుదారులు సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుని కుట్ర చేస్తోంది. -
కడపలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
HYD: ఎమ్మెల్యే రాజాసింగ్ హౌజ్ అరెస్ట్
సాక్షి,హైదరాబాద్:గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్‌ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడికి వెళ్లకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. హౌజ్అరెస్ట్పై రాజాసింగ్ స్పందించారు.‘అందరూ గుడికి వెళ్తున్నారు.నన్ను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారు.నన్ను ఇవాళ హౌజ్ అరెస్టు చేసినా రేపైనా గుడికి వెళ్తాను. హిందువులకు అండగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. హిందువుల గుళ్ల మీదనే దాడులు జరుగుతున్నాయి. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు అతడి మానసిక స్థితి సరిగా లేదని చెబుతున్నారు.ఇది సరికాదు. ఈ ఘటనలో మిగిలిన నిందితులను కూడా వెంటనే అరెస్టు చేయాలి.కఠిన చర్యలు తీసుకోవాలి’అని రాజాసింగ్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: టెన్షన్..టెన్షన్ -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ హౌస్ అరెస్ట్
-
మతి భ్రమించి వెంకన్నతో రాజకీయం.. బాబుకు రోజులు దగ్గరపడ్డాయి
-
అధికారిక అరాచకం.. వైఎస్సార్సీపీ నేతల హౌస్ అరెస్ట్‌లు
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోంది. తిరుపతికి ఎవరూ రావద్దంటూ వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.ఆదోనిలో పోలీసుల అత్యుత్సాహంకర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ తిరుపతి వెళ్లకుండా హౌస్ అరెస్టు చేశారు. నేటి నుండి నెల రోజుల పాటు తిరుమల వెళ్లకూడదంటూ ఆంక్షలు విధించారు. చట్టానికి విరుద్ధంగా నోటీసులు ఇవ్వడం మంచి పద్దతి కాదంటూ మధుసూదన్ మండిపడ్డారు.ప్రజాస్వామ్యం అపహాస్యం: సతీష్కుమార్రెడ్డివైఎస్సార్ జిల్లా: తిరుమలకు వెళ్లకూడదంటూ పోలీసులు నోటీసులు ఇవ్వడం దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుమలకు వెళ్లొద్దంటూ నోటీసులు తీసుకుని కడపలోని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా నివాసానికి పోలీసులు వెళ్లారు. తిరుమలకు వెళ్లొద్దంటూ నోటీసులు ఇవ్వడానికి మీరెవరూ అంటూ పోలీసులను నిలదీయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆకేపాటి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులుఅన్నమయ్య జిల్లా: రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. తిరుమల వైఎస్ జగన్ పర్యటనకు వెళ్లడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.ఎమ్మెల్యే విరూపాక్షికి పోలీసులు నోటీసులుకర్నూలు జిల్లా: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. తిరుమలకు వెళ్లకుండగా ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వం తీరు విరూపాక్షి మండిపడ్డారు. అక్రమ అరెస్ట్‌తో తిరుమల నిజాన్ని దాచలేవు చంద్రబాబూ అంటూ ధ్వజమెత్తారు. మా నాయకుడు ఏ తప్పు చేయలేదని ధైర్యంగా తిరుమలకు వస్తున్నారని విరూపాక్షి అన్నారు.అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడెందుకు?: ఎస్వీ మోహన్రెడ్డిస్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు.. తిరుపతి వెంకటేశ్వరస్వామితో చెలగాటమాడుతున్నారని కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలతో తిరుపతి ఉన్న పవిత్రతను దెబ్బ తిశారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై విఘాతం కలిగించేందుకు పవన్, చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.మాజీ సీఎం వైఎస్ జగన్ అనేక సార్లు తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడెందుకు?. లడ్డు కల్తీపై ఇంత వరకు నిజానిజాలను ప్రభుత్వం ప్రజలకు తెలియజేయడం లేదు. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు, పవన్ లడ్డూ పేరుతో రాజకీయాలు చేస్తున్నారు.ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతల నిర్బంధంతిరుపతి జిల్లా నగరి నియోజకవర్గంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ తిరుమల పర్యటనకు వైఎస్సార్సీపీ నేతలను వెళ్లనీయకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నాయకులను నిర్బంధిస్తున్నారు. మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ 30 అమలులో ఉందంటూ వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. -
బీఆర్ఎస్ నేతల గృహనిర్బంధం
సాక్షి, హైదరాబాద్/ దుండిగల్/ గచ్చిబౌలి: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంపై దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. మాజీ మంత్రి హరీశ్‌రావును, ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్టు చేసి, నివాసం నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. నేతలతోపాటు క్షేత్రస్థాయి క్రియాశీల నాయకులు, కార్యకర్తలను కూడా పోలీస్స్టేషన్లకు రావాలంటూ ఆదేశించడం గమనార్హం. ఎక్కడికక్కడ బలగాల మోహరింపుతో.. ఫిరాయింపుల అంశంపై వివాదం, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసంపై దాడి నేపథ్యంలో.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ గురువారం రాత్రి ప్రకటించింది. దీనితో అప్రమత్తమైన పోలీసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచే భారీగా మోహరించారు. జిల్లాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేసేందుకు ప్రయతి్నంచగా.. అడ్డుకుని అరెస్టులు చేశారు. ఆస్పత్రికి వెళ్లకుండా అడ్డుకుని.. మంత్రి హరీశ్‌రావు కేశంపేట పోలీసు స్టేషన్ నుంచి విడుదలయ్యాక శుక్రవారం తెల్లవారుజామున కోకాపేటలోని తన నివాసానికి చేరుకున్నారు. అప్పట్నుంచే అక్కడ పోలీసులు మోహరించారు. పార్టీ నేతలెవరూ హరీశ్‌రావు ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. గురువారం నాటి తోపులాటలో భుజానికి గాయమై నొప్పితో బాధపడుతున్న హరీశ్‌రావు.. ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. దీంతో హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు భుజానికి గాయమైన హరీశ్‌రావును పరామర్శించేందుకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి,, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, పార్టీ నేతలు జైపాల్‌రెడ్డి తదితరులు ఆయన ఇంటి వద్దకు రాగా పోలీసులు అడ్డుకున్నారు.దీంతో వారు పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం తర్వాత పోలీసులు హరీశ్‌రావును ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించారు. దీంతో ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఎడమ భుజానికి స్కానింగ్‌తోపాటు ఇతర వైద్య పరీక్షలు చేశారు. పదిహేను రోజుల పాటు ఫిజియోథెరపీ తీసుకోవాలని హరీశ్‌కు వైద్యులు సూచించారు.శంభీపూర్ రాజు నివాసం వద్ద ఉద్రిక్తత మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు నివాసం నుంచి అరికెపూడి ఇంటికి వెళతామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో.. శుక్రవారం తెల్లవారుజాము నుంచే అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అప్పటికే శంభీపూర్ రాజు ఇంటికి చేరుకున్నారు. ఈ ఇద్దరినీ పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఆ ఇంటి పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో శంభీపూర్ రాజు నివాసం వద్ద పాడి కౌశిక్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి తనను హత్య చేయించేందుకు ప్రయతి్నంచారని, తన ఇంటిపై దాడికి ఉసిగొల్పాడని ఆరోపించారు.హైడ్రా పేరిట ఇష్టానుసారం బిల్డింగులను కూల్చివేస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి తరలించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తనకు దూకుడు ఎక్కువని అంటున్న దానం నాగేందర్‌కు గోకుడు ఎక్కువని వ్యాఖ్యానించారు. అరికెపూడి గాం«దీకి నీతి, నిజాయతీ ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద గురువారం బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తన విధులకు కౌశిక్‌రెడ్డి ఆటంకం కలిగించారని, బెదిరింపులకు పాల్పడ్డారని సైబరాబాద్ అడ్మిన్ ఏడీసీపీ రవి చందన్‌రెడ్డి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో కౌశిక్‌రెడ్డిపై బీఎన్ఎస్ 132, 351(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫిరాయింపుదారులను 4 వారాల్లో డిస్క్వాలిఫై చేయాలన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని అన్నారు. అరికెపూడి గాంధీ తన సంగతి చూస్తామంటున్నారని.. తెలంగాణ కోసం నేను చావడానికైనా సిద్ధమని తెలిపారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇబ్బందులు పెడుతున్నారన్న కౌశిక్ రెడ్డి.. తెలంగాణ ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను, మాజీ మంత్రులను హౌస్ అరెస్టులు చేశారన్నారు కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్దామని తాను,ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు బయలుదేరగా.. హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. తన ఇంటిపై దాడికి పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటిపై దాడి చేయాలని చెప్పారని ఆరోపించారు.తనపై హత్యాయత్నం చేశారని చెప్పారు. తెలంగాణలో ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డి.. తానుచేసిన తప్పు ఏంటని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..అరికెపూడి గాంధీ భాషను శేరిలింగంపల్లి ప్రజలు గమనించాలి.స్వయంగా అరికెపూడి గాంధీ నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు.అరికేపూడి గాంధీ భాషను సమాజం అంగీకరిస్తుందా?నేను ఉండేడే విల్లాలో మొత్తం 69 కుటుంబాలు ఉంటాయి.అదే విల్లాలో ఏపీ మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు ఉంటారు.నేను వ్యక్తిగతంగా అరికెపూడి గాంధీని అన్నాను.ఆంధ్రా వాళ్ళు అంటే మాకు గౌరవం ఉంది.చిల్లర రాజకీయాల కోసం ఆంధ్రా,తెలంగాణ అంటూ రెచ్చగొడుతున్నారు.హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రజలను భయపెడుతున్నారు.రేవంత్ రెడ్డి కుట్రతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి తరలిస్తున్నారు.రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారురేవంత్ రెడ్డికి ఇక నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అవసరం లేదుకౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు.బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కొట్లాడుతాను.కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయా?కేసీఆర్,తెలంగాణ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చునేవారా?రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు బంద్ చేయాలి.మీ రౌడీయిజాన్ని ప్రజలు చూశారు.నిన్న హరీష్ రావును అరెస్టు చేసి షాద్ నగర్‌కు తీసుకువెళ్లారు.బిఆర్ఎస్ పార్టీ నేతలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది.పోలీసు రాజ్యంతో ప్రభుత్వాన్ని నడపలేరు.ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు.నాకు అండగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కార్యకర్తలకు ధన్యవాదాలు.హైకోర్టు తీర్పు తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు.పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా.కేసీఆర్ పెట్టిన భిక్షతో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అయ్యారు.ఇప్పటికైనా సిగ్గు, శరం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలి.నేను అడిగిన ప్రశ్నలకు అరికేపూడి గాంధీకి ఎందుకు భయంపీఏసీ చైర్మన్‌గా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు పేరును ఇచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకునేందుకు మేము దాడులు చేయడం లేదు.దానం నాగేందర్‌కు గోకుడు ఎక్కువ ఉంది.దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి.నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడా వాడలేదు.నేను ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడితే అది నాకు గాంధీకి వ్యక్తిగతం మాత్రమే.కేసీఆర్ సీఎంగా వున్నప్పుడు ఆంధ్రా సెటిలర్స్ ను మంచిగా చూసుకున్నారు.ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్స్ బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు.సెటిలర్స్‌ను మా నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.కాగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శంభీపూర్ రాజు నివాసం నుంచి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి బయల్దేరిన ఇద్దరిని అడ్డుకున్నారు. వారిద్దరిని గృహనిర్భంధంలో ఉంచారు. ఈ సందర్భంగా పోలీసులతో కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ వాళ్లకు ఓ చట్టం.. తమకో చట్టమా అని నిలదీశారు. గాంధీ ఇంటికి పోతామంటే ఎందుకు ఆపుతున్నారని అడిగారు.మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. దానం నాగేందర్‌కు అనుమతించి తమను అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. ఇది ప్రజా పాలన కాదని, కంచెల పాలన అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు శంభీపూర్ రాజు ఇంట్లో గృహనిర్భందం చేశారు. కాగా శుక్రవారం సాయంత్రం వరకు కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్టు చేస్తున్నామని డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు. -
వైఎస్ఆర్ జయంతి.. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్
-
KSR Live Show: టీడీపీ అరాచకం.. అరెస్టుకైనా.. ప్రాణ త్యాగానికైనా సిద్ధం
-
తిరుపతిలో పోలీసుల ఓవరాక్షన్.. ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
పుంగనూరుకు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు: ఎంపీ మిథున్ రెడ్డి
సాక్షి, తిరుపతి: తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. మిథున్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లోకి కొత్త వారిని రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.కాగా, ఆదివారం తెల్లవారుజామునుంచే ఎంపీ మిథున్ రెడ్డి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. మిథున్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. అనంతరం, ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అయితే, నేడు మిథున్ రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనను అడ్డుకునేందుకు ముందస్తుగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి ఏఎస్పీ కులశేఖర్, ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి నోటీసులు ఇచ్చారు.ఇక, మిథున్ రెడ్డి ఇంట్లోకి కొత్త వారిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఎవరైనా వస్తే వారికి అడ్డుకుంటున్నారు. ప్రజలను కలిసేందుకు కూడా మిథున్ రెడ్డిని అనుమతించడం లేదు. దీంతో, భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ అభిమానులు మిథున్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సీరియస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘గతంలో ఎప్పుడూ లేని విధంగా పేదలు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకుల మామిడి తోటలు, ఆస్తులు, కుటుంబ సభ్యుల వాహనాలు ధ్వంసం చేస్తున్నారు. పుంగనూరు నియోజక వర్గంలో పేదలు ఆవులు ఎత్తుకుని పోతున్నారు. నియోజకవర్గంలో ప్రజల్ని కలవడానికి కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు.నా నియోజకవర్గంలో ప్రజల్ని కలవకుండా అడ్డుకుంటున్నారు.. ఇదే విషయం స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తాను. రాష్ట్రంలో 40 శాతం ప్రజలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. వీళ్లందరినీ రాష్ట్రం నుంచి బయటకు పంపించి వేస్తారా?. గతంలో ఎప్పుడూ ఈ సంస్కృతి లేదు. రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాము. పుంగనూరు నియోజక వర్గంపై కక్ష సాధిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ బస్ కంపెనీ రాకుండా, పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు .పదవులు కావాలి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని తిడితే వస్తాయి అనుకుంటున్నారు. టీడీపీ పుంగనూరు ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల్ని భయపెడుతున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు. నన్ను చంపినా పర్వాలేదు, మేము ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం’ అని చెప్పారు.అలాగే, బీజేపీలో చేరుతున్నారు అంటూ చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మిథున్ రెడ్డి. కొందరు పనిగట్టుకుని నాపై విష ప్రచారం చేస్తున్నారు. పుంగనూరులో ఫ్యాక్షన్ తరహాలో రాజకీయాలు చేస్తున్నారు. పార్టీ మారకుండా కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. జేసీబీలతో ఇళ్లను కూలుస్తున్నారని అన్నారు. -
మహిళా వలంటీర్లపై గూండాగిరి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకులందరినీ గుండాలు, రౌడీలంటూ నోరు పారేసుకుంటుంటారు. కానీ, ఆయన పార్టీ అభ్యర్థులు, నాయకులు మహిళా వలంటీర్ల పైన కూడా దౌర్జన్యానికి దిగి, గృహ నిర్బంధానికి పాల్పడ్డారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ సహా ఆ పార్టీ నాయకులు గురువారం సాగించిన గూండాగిరీతో మహిళా వలంటీర్లు బెంబేలెత్తిపోయారు. ఓ మహిళా వలంటీరు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటుండగా ఆ భవనంలోకి చొరబడటమే కాకుండా, ఆమెతో పాటు వేడుకలకు వచ్చిన మిగతా మహిళా వలంటీర్లపై దౌర్జన్యం చేసి, కుర్చిలు విరగ్గొట్టి, వారిని గృహ నిర్బంధం చేసి భయభ్రాంతులకు గురి చేశారు. భయంతో మహిళలు కేకలు వేసినా, గర్భిణి ఉందని మొత్తుకున్నా ఖాతరు చేయలేదు. గంటన్నర పాటు మహిళలు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రాణ భయంతో పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి ఆ మహిళలను విడిపించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహిళా వలంటీరు మొయ్యా దుర్గా భవాని కాకినాడ రూరల్ నియోజకవర్గం వినాయక కేఫ్ సమీపంలోని ఓ భవనంలో గురువారం ముందస్తు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకలకు ఆమె స్నేహితురాళ్లైన పలువురు మహిళా వలంటీర్లు హాజరయ్యారు. పుట్టిన రోజు కేకు, కూల్ డ్రింక్‌లు సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే హఠాత్తుగా 30 మందిని వెంట బెట్టుకుని కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) అక్కడకు వచ్చారు. ఇక్కడ పార్టీ సమావేశం పెట్టుకుంటున్నారంటూ పెద్దగా కేకలు వేస్తూ వారిపై విరుచుకుపడ్డారు. పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నామని చెబుతున్నా వినకుండా తలుపులు తన్నుకుంటూ లోపలకు వెళ్లి వీరంగం సృష్టించారు. దీంతో మహిళా వలంటీర్లు భయాందోళనలకు గురయ్యారు. తమతో పాటు గర్భిణి ఉన్నారని, ఆమె భయపడిపోతున్నారని, కేకలు వేయవద్దని బతిమిలాడారు. అయినా వారు వినలేదు. నానా రచ్చ చేసి, వలంటీర్లు కూర్చున్న కుర్చిలను ధ్వంసం చేశారు. మహిళా వలంటీర్లు లోపల ఉండగానే నానాజీ కనుసైగలతో ఆ పార్టీ కార్యకర్తలు గది తలుపులు మూసేసి గొళ్లేలు పెట్టేసి, భవనం కింది భాగంలోకి వెళ్లిపోయారు. మహిళా వలంటీర్లు కిటికీల వద్దకు వచ్చి తలుపులు తీయాలని, ఊపిరి ఆడటంలేదని ఎంతసేపు అర్థించినా వినిపించుకోలేదు. జనసేన నాయకుల విధ్వంసంతో గర్భిణి నున్న చిట్టమ్మ గదిలోనే సొమ్మసిల్లి పడిపోవడంతో అంతా భయకంపితులయ్యారు. వారిలో ఒక వలంటీరు తన మొబైల్ ఫోను ద్వారా కాకినాడ డీఎస్పీ హనుమంతరావుకు సమాచారం అందించింది. దీంతో సర్పవరం సీఐ వైఆర్‌కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడకు చేరుకున్నాయి. పోలీసులు తలుపులు తెరిచి మహిళా వలంటీర్లను విడిపించారు. అక్కడ రాజకీయ పార్టీ సమావేశం జరుగుతోందంటూ పంతం నానాజీ పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆ కార్యాలయంలో రాజకీయ పార్టీకి సంబంధించి ఎటువంటి ఆధారాలూ లేవని ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్చార్జి బీబీబీ రాజు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీశామని, అన్ని వివరాలు రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్‌కు నివేదిస్తామని రాజు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు జనసేన నాయకుల దాడిపై రమణయ్యపేట కూరగాయల మార్కెట్ వీధికి చెందిన బాధిత వలంటీరు దుర్గాభవాని సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు జనసేన అభ్యర్థి పంతం నానాజీతో పాటు పలువురిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మహిళల గృహ నిర్బంధం, భయభ్రాంతులకు గురి చేయడం, మూకుమ్మడిగా వచ్చి దౌర్జన్యం చేశారనే అభియోగాలపై ఐపీసీ 143, 452, 341, 342, 506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. భయంతో వణికిపోయాం ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి పడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. నాకు ఏడో నెల. గర్భిణి అని కూడా కనీసం జాలి, కరుణ కూడా లేకుండా గదిలో నిర్బంధించి తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోయాం. తీవ్ర ఆందోళనతో సొమ్మసిల్లి పడిపోయాను. – నున్న చిట్టమ్మ, రమణయ్యపేట మహిళలని కూడా చూడలేదు జనసేన నాయకులు, కార్యకర్తలు అమానుషంగా ప్రవర్తించారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్న వారు మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారు. కుర్చీలు విరగ్గొట్టేశారు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే దౌర్జన్యం చేసి, తలుపు గడియ పెట్టేసి వెళ్లిపోయారు. ఏ రాజకీయ పార్టీ సమావేశం పెట్టుకోవడంలేదని ఎంత చెప్పినా వినలేదు. – కుసనం శాంతకుమారి, రమణయ్యపేట పుట్టిన రోజు చేసుకుంటుంటే నిర్బంధించారు నా పుట్టిన రోజు శుక్రవారం అయినప్పటికీ స్నేహితులందరూ అందుబాటులో ఉండరని చెప్పడంతో గురువారమే వేడుకలు చేసుకునేందుకు వారందరినీ ఆహా్వనించాను. కేకు తెచ్చుకొని పార్టీ సిద్ధమవుతుండగా ఒకేసారి గుంపుగా వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మా కార్యాలయం గది తలుపులు మూసేసి, గడియ పెట్టి నిర్బంధించారు. ఎంత వేడుకున్నా తలుపులు తీయలేదు. – మొయ్యా దుర్గాభవాని, రమణయ్యపేట, కాకినాడ రూరల్ -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల అల్లర్లు చోటు చేసుకున్న చెంగిచెర్లకు గురువారం సాయంత్రం వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. దీంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రాజాసింగ్‌ను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. అనంతరం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ఇది మంచిది కాదని తెలిపారు. బాధితులపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. హిందువులపై దాడి చేస్తే ఊరుకోమని అన్నారు. కాగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో హోలీ పండగ సందర్భంగా హోలీ అడుకుంటున్న మహిళలపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని తెలిపారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన -
హౌస్ రిమాండ్ పిటిషన్ తిరస్కరించిన ఏసీబీ కోర్టు
-
నైరాశ్యంలో టీడీపీ నేతలు
సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ తమ అధినేత నిప్పులాంటి వాడని పదేపదే డప్పు కొట్టిన టీడీపీ శ్రేణులు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లడంతో తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయాయి. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పలు అవినీతి ఆరోపణలు, కేసుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఆయన తొలిసారి జైలుకు వెళ్లడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వ్యవహారంలో రెండు రోజులుగా పలు నాటకీయాలు పరిణామాలు చోటు చేసుకుంటున్నా పార్టీ శ్రేణులు, నాయకులు బయటకు రావడానికి ఇష్టపడడంలేదు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి పదేపదే ఫోన్లు చేసి ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, నిరసనలకు దిగాలని సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో స్పందన శూన్యం. అక్కడక్కడా ఒకటీ అరా ప్రచారం కోసమేనని స్పష్టమవుతోంది. ఆదివారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు చేయాలని పార్టీ పిలుపు ఇచ్చినా పట్టుమని పది చోట్ల కూడా జరగలేదు. తమను పోలీసులు హౌస్ అరెస్టు చేశారని చెబుతూ నియోజకవర్గ ఇన్చార్జీలు బయటకు రావడంలేదు. కనీసం పది మంది అయినా బయటకు రాకపోవడంతో ఏం చేయాలో తోచక ముఖ్య నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ద్వితీయ, తృతీయ స్థాయి క్యాడర్ సైతం పట్టించుకోకపోవడంపై పారీ్టలో ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణా, గుంటూరులో మరీ తీసికట్టు టీడీపీకి బాగా పట్టుందని చెప్పుకునే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కనీస స్పందన లేకపోవడం పార్టీ ముఖ్య నాయకులకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబును విచారించిన సిట్ కార్యాలయం ఉన్న తాడేపల్లి, విజయవాడ కోర్టు పరిసరాల్లో అలజడి సృష్టించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. విజయవాడ నగర నాయకులు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, కేశినేని చిన్ని, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలకు చెందిన బొండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు లాంటి నేతలు గృహ నిర్బంధం పేరుతో బయట కనపడకపోవడం చర్చనీయాంశమైంది. ముఖ్య నాయకులు ఫోన్లు చేసి ఏదో ఒక కార్యక్రమం చేయాలని వారిని కోరుతున్నా ఒక్కరు కూడా స్పందించలేదు. రకరకాల కారణాలు చెబుతూ ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. కళ్లెదుట పక్కా ఆధారాలు.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని సీఐడీ సాక్ష్యాధారాలతో వివరంగా బయట పెట్టడం, చంద్రబాబు అవినీతి చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుండడం టీడీపీ యంత్రాంగానికి ఇబ్బందిగా మారింది. దీన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక నేతలు సతమతమవుతున్నారు. పక్కా ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుండడంతో అవినీతిని కొట్టి పారేయలేకపోతున్నారు. తమ నేత నిజాయితీపరుడని, దార్శనికుడని, చాణక్యుడని చెప్పుకునే వారంతా తాజా పరిణామంతో డీలా పడిపోయారు. రాజకీయాల్లో మర్రిచెట్టులా పాతుకుపోయి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడంలో నైపుణ్యం కలిగిన తమ అధినేతను రాష్ట్ర ప్రభుత్వం జైలుకు పంపించిందనే విషయాన్ని టీడీపీ నేతలు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఏ రకంగానూ చంద్రబాబు అవినీతి సమర్థిచలేమని నాయకులు మదనపడుతున్నారు. అందుకే బయటకు రావడానికి ఇష్టపడడంలేదు. -
నేనంటే కేసీఆర్‌కు భయం
సాక్షి, హైదరాబాద్: తనను చూసి కేసీఆర్ భయపడుతున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలో దళిత బంధు అక్రమాలపై నిరసన తెలపడానికి బయలుదేరిన ఆమెను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయంటూ జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామస్తులు ఇటీవల ఆందోళన చేశారు.ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్న షర్మిలను, అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల పోలీసులకు హారతి ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. గజ్వేల్‌లో నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. పోలీసులు సీఎం కేసీఆర్ తొత్తుల్లా పని చేయడం మానుకోవాలన్నారు. తనను అడ్డుకున్నందుకు నిరసనగా లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు కొనసాగిన ఆమె దీక్షను తీగుల్ గ్రామస్తులు వచ్చి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. షర్మిల నిరాహార దీక్షకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మద్దతు తెలిపారు తొమ్మిదేళ్లుగా గుడిసెల్లోనే.. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తాను వెళ్లాలనుకున్న తీగుల్ గ్రామంలో దళితులు తమ ఇళ్ల ఫొటోలు పంపి, వారి కోసం కొట్లాడాలని వినతి పత్రం పంపించారన్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు ఓట్లేసి గెలిపించినా.. తొమ్మిదేళ్లుగా ఈ ప్రజలు ఇంకా గుడిసెల్లోనే ఉంటున్నారన్నారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్‌లోనే దళిత బంధు ఇంత దరిద్రంగా అమలవుతుంటే ఇతర నియోజకవర్గాల్లో ఎలా అమలవుతుందో ఊహించుకోవచ్చన్నా రు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలుంటే.. ఇప్పటి వరకు 38 వేల కుటుంబాలకే దళిత బంధు అమలైందన్నారు. ప్రతి ఒక్కరికీ దళితబంధు పథకం అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. -
వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత!
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో లోటస్ పాండ్‌లోని ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వైఎస్ షర్మిలను పోలీసులు శుక్రవారం ఉదయం హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే, షర్మిల నేడు సిద్దిపేటలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. కాగా, జగదేవ్‌పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో షర్మిల పర్యటించాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయమే పోలీసులు ఆమె నివాసానికి చేరుకున్నారు. అనంతరం, జవదేవ్‌పూర్ వెళ్లకుండా షర్మిలను హౌజ్ అరెస్ట్ చేశారు. కాగా, దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయని ఇటీవల తీగుల్ గ్రామ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈనేపథ్యంలో వారిని కలిసేందుకు షర్మిల ప్లాన్ చేసుకున్నారు. దీంతో, పోలీసులు వైఎస్ షర్మిలను అడ్డుకున్నారు. ఇది కూడా చదవండి: వర్షాలపై అప్రమత్తంగా ఉండండి: హైకోర్టు ఆదేశాలు -
చలో బాటసింగారం నేపథ్యంలో బీజేపీ నేతల హౌస్ అరెస్టులు
-
కేసీఆర్ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైంది: కిషన్ రెడ్డి ఫైర్
Updates.. ► కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉంది. అందుకే మా పట్ల దారుణంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ చర్యలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. సమాధానం చెప్పలేని నిస్సహాయస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైంది. ►పేదలు, బడుగు, బలహీన వర్గాల తరఫున ప్రశ్నిస్తాం. బీఆర్ఎస్ సర్కార్‌పై శాంతియుతంగా యుద్దం చేస్తాం. ► అనంతరం.. వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. ► కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావును బీజేపీ పార్టీ ఆఫీసు వద్ద దింపిన పోలీసులు. ► ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వానికి ఇంత భయమెందుకు?. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేంద్రం నిధులు ఇచ్చిన నిధులేవి?. కేంద్రమంత్రి అని కూడా చూడకుండా పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. ► ఇలాంటి అణిచివేత ధోరణి మంచిది కాదు. కేంద్రమంత్రిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించే హక్కు కిషన్‌రెడ్డికి లేదా?. కిషన్‌రెడ్డితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకుకెళ్తాం అని అన్నారు. ► కిషన్ రెడ్డి కారులోనే ఆయనను పోలీసు స్టేషన్‌కు తరలింపు. ► కిషన్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు. తన వాహనంలో ఆయనను కూర్చోబెట్టేందుకు పోలీసులు యత్నించారు. కారులో కూర్చునేందుకు కిషన్‌రెడ్డి నిరాకరించారు. ► ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నన్ను చంపేయండి. ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. కచ్చితంగా బాట సింగారం వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. ► నేనేమైనా ఉగ్రవాదినా?.. టెర్రరిస్టునా?. నేను ఎక్కడికైనా వెళ్లే హక్కు నాకుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ► బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ► పోలీసులతో కిషన్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. ► రఘునందన్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు. ► శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాట సింగారం వెళ్తున్న కిషన్‌రెడ్డి కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ సహా బీజేపీ నేతలు వర్షంలో తడుస్తూ రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సర్కార్, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ► అలాగే, బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇక, ఛలో బాట సింగారం నేపథ్యంలో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక, బీజేపీ ఆఫీసు ముందు రెండు ప్లాటూన్స్‌తో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ► మరోవైపు.. బీజేపీ నేతల అక్రమ అరెస్ట్‌లను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఖండించారు. ఈ క్రమంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హౌస్ అరెస్ట్‌లు బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూడటానికి వెళ్తుంటే బీఆర్ఎస్కు ఉలికిపాటెందుకు?. ఇదేమైనా ఉద్యమమా? లేక తిరుగబాటా?. కేవలం ఇళ్లు చూడటానికి వెళ్తుంటే భయమెందుకు?. బీఆర్ఎస్ను గద్దె దింపేవరకు ఉద్యమం ఆగదు. గొప్పగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తే అక్రమ అరెస్ట్‌లు ఎందుకు?. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ► మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావును తార్నాకలోని నివాసంలో పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని లక్షల మంది డబుల్ బెడ్ రూమ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు ఆగిపోయాయో చూడడానికే మేము వెళ్తున్నాము. మేము ఇళ్లను చూడడానికి వెళ్లకూడదా?. తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ నేతల హౌస్ అరెస్ట్‌లను ఆయన ఖండించారు. డబుల్ ఇండ్ల పేరుతో కేసీఆర్ సర్కార్ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. ► అధికార బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ, పలువు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: అందుకే కేసీఆర్‌ను కలవలేదు.. భవానీ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ -
జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
పోలీసులతో షర్మిల వాగ్వాదం
-
జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలు.. తాడిపత్రిలో హైటెన్షన్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో సోమవారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇసుక రవాణా వాహనాలను తగలబెడతానంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాత్మక వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం. ఈ వ్యాఖ్యల అనంతరం జేసీ తన వర్గీయులతో వీరంగం సృష్టించేందుకు యత్నించారు. ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండడంతో.. పోలీసులు జేసీ ప్రభాకర్‌ను తొలుత హౌస్ అరెస్టు చేశారు. ఈలోపు జేసీ నివాసం వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో డీఎస్పీ చైతన్య జోక్యం చేసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇంతలో జేసీ ప్రభాకర్ పోలీసుల కళ్లుగప్పి బయటకు రావాలని యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. (చదవండి: యువతితో వీడియో కాల్: మీ ఇంటికొచ్చి మీ భార్యకు అన్నీ చెబుతా.. ) -
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో ఉద్రిక్తత..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు అభివృద్ధిపై వైఎస్సార్సీపీ నేతలు సిద్దమయ్యారు. టీడీపీ నేతల సవాళ్లకు ధీటుగా వైఎస్సార్సీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే, తిరువూరు అభివృద్ధిపై వైఎస్సార్సీపీ నేతలు సిద్దమయ్యారు. టీడీపీ సెల్ఫీ ఛాలెంజ్‌కు ధీటుగా వైఎస్సార్సీపీ కౌంటర్ ఇచ్చింది. దీంతో, బోసుబొమ్మ సెంటర్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు ఇరు పార్టీల నేతలు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు పార్టీలకు చెందిన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. తాడేపల్లి: తిరువూరులో జరిగిన అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే రక్షణనిధి పేర్కొన్నారు. అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘రూ.14వందల కోట్లతో చేసిన అభివృద్ధి వారికి కనపడదు. డయాలసిస్ సెంటర్లు నిర్మిస్తున్నాం. సీఎం సభకు వచ్చిన జనాన్ని చూశాక టీడీపీ పని అయిపోయిందని వారికి అర్థం అయింది. అందుకే మాపై సవాల్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టీడీపీ ఎంపి కేశినేని నాని ఈ నాలుగేళ్లలో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడ టీడీపీ లేదని ఆయనకి బాగా అర్థం అయింది. ఇవ్వాళ మా సెకండ్ క్యాడర్ వస్తేనే బోస్ సెంటర్ కిటకిటలాడింది. ఇక నేను కూడా వెళ్తే పరిస్థితి ఇంకోలా ఉండేది. మాపై ప్రజలకు ఉన్న ప్రేమ అలాంటిది. పోలీసులు వారి పని వారు చేసుకుపోతారు. నేను నిత్యం నియోజకవర్గంలోనే తిరుగుతూ ఉంటాను. మేము చేసిన అభివృద్ధి సాక్ష్యాధారాలతో సహా చూపించటానికి ఎప్పుడైనా సిద్దమే అని పేర్కొన్నారాయన. -
అడ్వొకేట్ అరాచకం
విజయనగరం (క్రైమ్): నలుగురికీ న్యాయం చేయాల్సిన న్యాయవాదే భార్యను హింసకు గురిచేశాడు. 11 ఏళ్లపాటు భార్యను బాహ్య ప్రపంచానికి దూరం చేశాడు. తమ కుమార్తె అసలు బతికి ఉందో లేదోనన్న సందేహంతో ఆమె తల్లిదండ్రులు విజయనగరం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ ఎం.దీపికను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఇంటికి వెళ్లిన పోలీసులపైనా కేసు పెడతానంటూ న్యాయవాది బెదిరించడంతో చేసేది లేక మేజిస్ట్రేట్ జారీ చేసిన సెర్చ్ వారెంట్‌తో వెళ్లి గృహ నిర్బంధం నుంచి ఆమెను విడిపించారు. సీఐ బి.వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలోని మార్వాడి వీధిలో ఉంటున్న న్యాయవాది గోదారి మధుసూదనరావు శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన సాయిసుప్రియ అనే మహిళను 2008లో వివాహం చేసుకున్నాడు. 2009లో వీరికి పాప పుట్టింది. డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన సుప్రియ ఆ తరువాత భర్త దగ్గరకు వచ్చేందుకు నిరాకరించింది. నువ్వు లేకపోతే ఉండలేనంటూ భర్త చెప్పిన మాయమాటలు నమ్మి విజయనగరం వచ్చింది. అప్పటినుంచి భార్యను ఇంట్లోనే బంధించిన మధుసూదనరావు తల్లిదండ్రులతో మాట్లాడటానికి, చూడటానికి కూడా అనుమతించలేదు. ఆమె తల్లిదండ్రులు ఎంత బతిమాలినా బయటినుంచే పంపించేసేవాడు. ఇలా 11 ఏళ్లపాటు ఈ తంతు సాగింది. దీంతో తమ కుమార్తె సుప్రియ అసలు బతికి ఉందో లేదోనని అనుమానించిన తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతూ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా.. మీరు దొంగపోలీసులని, ఎఫ్ఐఆర్ ఉంటేనే రావాలని చెప్పి లోపలికి రానీయలేదు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఎస్పీ ఎం.దీపికను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు కోర్టునుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని బుధవారం ఆ ఇంటికి వెళ్లి మహిళను గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. -
అఖిలప్రియ హౌస్ అరెస్ట్
ఆళ్లగడ్డ(నంద్యాల): నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు శనివారం హౌస్ అరెస్టు చేశారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, నంద్యాల గాంధీ చౌక్‌కు వచ్చి వాటిని బయటపెడతానని, తమపై చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే కూడా ఆధారాలతో రావాలని అఖిలప్రియ సవాల్ విసిరారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆమె ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి తన సిబ్బందితో అఖిలప్రియ ఇంటికి వెళ్లి హౌస్ అరెస్టు చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. -
టి కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
-
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్‌లకు మద్దతుగా ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వీహెచ్, కోదండరెడ్డి, మల్లురవి సహా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య నేతలను సోమవారం ఉదయం నుంచే హౌస్ అరెస్ట్‌లు చేపట్టారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నాకు అనుమతులు లేవని, ఎవరైనా బయటకువచ్చి నిరసనలు చేస్తే అరెస్టులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పంచాయతీలకు నిధుల అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని, సర్పంచులందరినీ ఏకం చేయాలని నేతలకు సూచించింది. అయితే, ఈ ధర్నాలకు పోలీసులు అనుమతులు లేవని తెలపడం, గృహనిర్బంధం చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామని టీకాంగ్రెస్ నేతలు అంటున్నారు. ధర్నాను అడ్డుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: మైనార్టీలపై కాంగ్రెస్ ‘నజర్’ -
అప్పు చెల్లించలేదని గృహ నిర్బంధం
కోవెలకుంట్ల: అప్పు తీర్చలేదని ఓ కుటుంబాన్ని గృహ నిర్బంధం చేసిన ఘటన శనివారం నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జరిగింది. బొగ్గరపు చంద్రశేఖర్ స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట కిరాణాషాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన హోల్‌సేల్ వ్యాపారి రాధాకృష్ణ వద్ద కిరాణాషాపునకు సరుకులు అప్పుగా తీసుకున్నాడు. రెండు నెలల కిందట చంద్రశేఖర్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందాడు. తీసుకున్న సరుకులకు సంబంధించి రూ.60 వేలు చెల్లించకపోవడంతో వ్యాపారి గత కొన్ని రోజుల నుంచి మృతుడి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నాడు. కుటుంబాన్ని పోషించే యజమాని మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు ఆ ఘటన నుంచి కోలుకోలేని స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో వ్యాపారి శనివారం వారి ఇంటి వద్దకు వెళ్లి డబ్బులివ్వాలని వాగ్వాదానికి దిగాడు. మృతుడి భార్య గీతావాణి, అత్తమామలు సుబ్బరత్నమ్మ, రామసుబ్బయ్యను ఇంట్లో పెట్టి తాళం వేశాడు. పోలీసులు వచ్చి వారిని విడిపించి వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. వారి మధ్య సయోధ్య కుదుర్చి సమస్యను తీర్చారు. -
టీడీపీ నేత దాష్టీకం
కుప్పం: చీటీ డబ్బులు సకాలంలో చెల్లించలేదనే కారణంతో ఏడేళ్ల బిడ్డతో సహా తల్లిని గృహనిర్బంధం చేసిన ఓ టీడీపీనేత నిర్వాకం వెలుగుచూసింది. శాంతిపురం మండలంలోని ఎం.కె.పురం పంచాయతీ కృష్ణాపురంలో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణాపురానికి చెందిన టీడీపీ బూత్ కమిటీ నాయకుడు ప్రకాష్ గ్రామంలో చీటీలు నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన పాండురంగ ఇతని వద్ద చీటీ వేసి పాడుకున్నాడు. ఇందుకు సంబంధించిన డబ్బులు సకాలంలో ఇవ్వలేదని మంగళవారం రాత్రి పాండురంగ ఇంటి వద్దకు వెళ్లిన ప్రకాష్ గొడవకు దిగాడు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న పాండురంగ గుడిలో ఉన్నాడని భార్య భవాని (26) చెప్పినా వినిపించుకోకుండా వీధిలో నిలబడి నానా బూతులు తిట్టాడు. భవాని, తన కూతురు చిద్విలాసిని (7) వెంటనే ఇల్లు విడిచిపోవాలని హుకుం జారీ చేశాడు. ఎలాగోలా అప్పు తీర్చేస్తామని ఆమె వేడుకున్నా కనికరించకుండా తల్లీబిడ్డలు ఇంట్లో ఉండగానే ఇంటి బయట తాళం వేసుకుని వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో బాధితులు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం ఇచ్చారు. రాళ్లబూదుగూరు పోలీసులు తాళాలు తెరిపించి తల్లీబిడ్డలకు గృహనిర్బంధం నుంచి విముక్తి కలిగించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ మునిస్వామి తెలిపారు. -
నవ్లఖా గృహ నిర్బంధానికి సుప్రీం అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: రెండేళ్లుగా జైలులో గడుపుతున్న ఎల్గార్ పరిషత్–మావో సంబంధాల కేసులో నిందితుడు, సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్లఖా గృహ నిర్బంధానికి సుప్రీంకోర్టు అనుమతించింది. రూ.2.4 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. గృహ నిర్బంధంపై 14 షరతులు విధించింది. 70 ఏళ్ల నవ్లఖా అనారోగ్య పరిస్థితి దృష్ట్యా గృహ నిర్భంధానికి అనుమతిస్తున్నామని తెలిపింది. ఈ ఆదేశాలు తాత్కాలికమని నెల రోజుల తర్వాత సమీక్షిస్తామంటూ కేసు తదుపరి విచారణను డిసెంబర్ రెండో వారానికి వాయిదా వేసింది. గృహనిర్భంధానికి అనుమతి ఇవ్వాలన్న నవ్లఖా పిటిషన్‌ను గురువారం జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌ల సుప్రీం ధర్మాసనం విచారించింది. ‘నిందితుడు 2020 నుంచి కస్టడీలో ఉన్నారు. గతంలో గృహనిర్బంధం దుర్వినియోగం చేసిన ఫిర్యాదులేవీ లేవు. ఈ కేసు మినహా మరో నేరపూరిత ఆరోపణలు లేవు. అందుకే హౌస్అరెస్ట్కు అనుమతినిస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. సీసీటీవీల ఏర్పాటు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నిఘా తదితరాల ఖర్చు మొత్తం నవ్లఖా భరించాలని ఆదేశించింది. కోర్టు విధించిన షరతులు.. ► పోలీసుల సమక్షంలో వారిచ్చిన ఫోన్ నుంచి రోజుకు 10 నిమిషాలు మాట్లాడొచ్చు. ► సహచరుడి ఇంటర్నెట్లేని ఫోన్ వాడొచ్చు. ఎస్ఎంఎస్లు, కాల్స్‌కు అనుమతి. వాటిని డిలీట్ చేయకూడదు. ముంబై వదిలి వెళ్లొద్దు. ► గరిష్టంగా ఇద్దరు కుటుంబ సభ్యులు వారానికి ఒకసారి 3 గంటల పాటు సందర్శించొచ్చు. ► కేబుల్ టీవీ చూడొచ్చు. కేసులో సాక్షులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించవద్దు. -
షాకింగ్.. గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు!
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగడం సంచలనం రేకెత్తిస్తోంది. జిన్‌పింగ్‌ను కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా, చైనా ఆర్మీ చీఫ్‌గా తొలగించారనే వార్తలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు నియంత్రణ అంతా చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) చేతుల్లోనే ఉందని వదంతులు వ్యాపించాయి. అంతేకాదు చైనా కొత్త అధ్యక్షుడిగా లీ కియామింగ్‌ను ఆర్మీ ఎంపిక చేసిందని వార్తలు రావడం హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. జిన్‌పింగ్‌ను చైనా కమ్యూనిస్టు పార్టీ ఆర్మీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆ తర్వాత హౌస్ అరెస్టు చేశారు. ఈ రూమర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ సారి చెక్ చేయండి. అని సుబ్రహ్మణ్య స్వామి రాసుకొచ్చారు. New rumour to be checked out: Is Xi jingping under house arrest in Beijing ? When Xi was in Samarkand recently, the leaders of the Chinese Communist Party were supposed to have removed Xi from the Party’s in-charge of Army. Then House arrest followed. So goes the rumour. — Subramanian Swamy (@Swamy39) September 24, 2022 కొందరు చైనీయులు కూడా ఇలాంటి పోస్టులే చేశారు. జిన్‌పింగ్‌ను ఆర్మీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిందని, ఆయన స్థానంలో లీ కియామింగ్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించిందని పేర్కొన్నారు. అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ గానీ, ఆ దేశ అధికారిక మీడియా గానీ ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ఇది నిజమేనా? లేక రూమారా? అనే విషయంపై అయోమయం నెలకొంది. వీడియో వైరల్ చైనా ఆర్మీ వాహనాలు సెప్టెంబర్ 22న బీజింగ్ చేరుకున్నాయని, హువాన్‌లై కౌంటీ నుంచి హిబే ప్రావిన్సు ఝాంగ్జియాకో సిటీ వరకు 80 కీలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లాయని ఓ చైనా మహిళ వీడియోను షేర్ చేసింది. జిన్‌పింగ్ హౌస్ అరెస్ట్ అయ్యారనే వార్తలకు ఇది బలం చేకూరుస్తోందని పేర్కొంది. #PLA military vehicles heading to #Beijing on Sep 22. Starting from Huanlai County near Beijing & ending in Zhangjiakou City, Hebei Province, entire procession as long as 80 KM. Meanwhile, rumor has it that #XiJinping was under arrest after #CCP seniors removed him as head of PLA pic.twitter.com/hODcknQMhE — Jennifer Zeng 曾錚 (@jenniferatntd) September 23, 2022 అకస్మాతుగా ఎందుకీ రూమర్? చైనా కమ్యూనిస్టు పార్టీ ఇటీవల అవినీతి వ్యతిరేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఇద్దరు మాజీ మంత్రులకు ఉరి శిక్ష విధించింది. మరో నలుగురు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ ఆరుగురు జిన్‌పింగ్ రాజకీయ ప్రత్యర్థి వర్గానికి చెందినవారని తెలుస్తోంది. దీంతో కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేతలు ఆయనపై ఆగ్రహంతో పదవి నుంచి తప్పించారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జిన్‌పింగ్‌ను ఆర్మీ గృహ నిర్బంధం చేసిందనే వదంతిని మొదటగా ఆయన రాజకీయ ప్రత్యర్థి వర్గమే వ్యాపింపజేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జిన్‌పింగ్ ఇటీవలే ఉజ్బెకిస్థాన్ సామర్కంద్లో జరిగిన షాంఘై సహకార సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పాల్గొన్నారు. చదవండి: ఘోర ప్రమాదం.. 77 మంది వలసదారులు మృతి -
ఇంకా గృహ నిర్బంధంలోనే బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడికి నిరసనగా జనగామ స్టేషన్ ఘన్పూర్ పరిధిలోని పాంనూరులో ఆయన చేపట్టిన ధర్మధీక్షను భగ్నం చేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని ఆయన నివాసానికి తరలించి గృహ నిర్భంధంలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే.. టీఆర్ఎస్ ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ.. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలకు పిలుపు ఇచ్చింది. దీక్షలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా తన నివాసంలోనే నిరసన దీక్ష చేపట్టనున్నారు బండి సంజయ్. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎండగట్టాలని బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది. హైకోర్టుకు బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి లేదని, రెచ్చగొట్టే ప్రసంగాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, వీటితో పాటు ప్రస్తుత రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలంటూ తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై బీజేపీ నేతలు నేడు హైకోర్టుకు వెళ్తున్నారు. ఈ మేరకు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తద్వారా యాత్ర కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఇదీ చదవండి: ఒక్కసారిగా హీటెక్కిన తెలంగాణ! -
ఆంగ్‌సాన్ సూకీకి గృహ నిర్బంధం నుంచి జైలు నిర్బంధం
బ్యాంకాక్: గతేడాది తిరుబాటు చేసిని ఆంగ్ సాన్ సూకీని గృహ నిర్బంధం నుంచి సైనిక నిర్మిత జైలు కాంపౌండ్‌లోకి తరలించినట్లు మయన్మార్ జుంటా అధికార ప్రతినిధి తెలిపారు. క్రిమినల్ చట్టాల ప్రకారం ఆంగ్ సాన్ సూకీని రాజధాని నైపిడావ్లోని జైలులో ఏకాంత నిర్బంధంలో ఉంచామని జుంటా అధికారి జా మిన్ తున్ పేర్కొన్నారు. ఐతే ఆమె తిరుబాటు చేసినప్పటి నుంచి నేపిడావ్‌లోని ఒక అజ్ఞాత ప్రదేశంలో తన కుక్కతో కలిసి గృహ నిర్బంధంలో ఉన్నారు. ప్రస్తుతం ఆమెను కోర్టులో విచారణకు హజరుపరచడం కోసం ఈ ప్రాంతం నుంచి తరలించారు. పైగా ఆమెకి 150 ఏళ్లకు పైనే శిక్ష విధించారు. అంతేకాదు సూకీ తరుఫున న్యాయవాదులు మీడియాతో మాట్లాడకుండా నిషేధం విధించారు. జర్నలిస్టులు సైతం ఆమెతో మాట్లాడేందుకు వీల్లేదు. ఇంతకుముందు కూడా ఆమె మయాన్మార్లో అతిపెద్ద నగరమైన యాంగాన్‌లోని తన ఇంటిలోనే చాలాఏళ్లు గృహనిర్బంధంలో ఉంది. ఆమె అవినీతి, మిలటరీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు, కోవిడ్-19 ప్రోటోకాల్, టెలికమ్యూనికేషన్స్ చట్టం ఉల్లంఘన తదితర ఆరోపణలతో ఆమెను దోషిగా నిర్థారించారు. పైగా కోర్టు సూకీకి ఇప్పటివరకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. (చదవండి: రాజకీయ ప్రత్యర్థులకు ఉరిశిక్ష ... వద్దని హెచ్చరించిన యూఎన్) -
కేఏ పాల్ గృహ నిర్బంధం
సనత్‌నగర్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు మంగళవారం గృహ నిర్బంధం చేశారు. రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండంలోని బస్వాపూర్ రైతులను పరామర్శించేందుకు ఆయన వెళ్తుండగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతుండగా తనపై టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేసిన విషయమై ఫిర్యాదు చేసేందుకు మంగళవారం డీజీపీ కార్యాలయానికి వెళ్లాలని పాల్ భావించారు. సమాచారం అందుకున్న పోలీసులు అమీర్‌పేట అపరాజిత కాలనీలోని ఆయన పార్టీ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. డీజీపీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తారన్న సమాచారం మేరకు పోలీసులు ఆయనను గృహనిర్బంధం చేసినట్లు తెలుస్తోంది. గృహనిర్బంధంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై దాడిని తెలంగాణ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా కేసీఆర్ గూండాయిజం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు 28 సీట్లు కూడా రావని పాల్ జోస్యం చెప్పారు. ‘మళ్లీ సిరిసిల్లకు వస్తున్నా. దమ్ముంటే నన్ను ఆపండి. ’అంటూ సవాల్ విసిరారు. తనపై దాడి ఘటనలో సిరిసిల్ల ఎస్పీ, డీఎస్పీ, సీఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
కేఏ పాల్ హౌజ్ అరెస్ట్.. ‘కేసీఆర్, కేటీఆర్‌లకు భయపడేది లేదు’
సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అమీర్‌పేట్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్ధిపేటలో సోమవారం తనపై జరిగిన దాడి గురించి డీజీపీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. సిరిసిల్ల ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేయాలని కోరుతూ కేఏ పాల్ డీజీపీని కలవాలని అనుకున్నారు. కేఏ పాల్ వస్తుండటంతో డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మరికాసేపట్లో డీజీపీ కార్యాలయానికి బయలుదేరుతారనే క్రమంలో పోలీసులు ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిన్న(సోమవారం) బ్లాక్ డే అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ తనపై దాడి చేయించారని ఆరోపించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గుండాగిరి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ చేస్తున్నారని విమర్శించారు. సిద్ధిపేటలో జరిగిన సంఘటన కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అన్నారు. కేటీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వ్యక్తే తనపై దాడి చేశారని తెలిపారు. 150 దేశాలను వణికించి వచ్చానని చెప్పిన కేఏ పాల్.. కేసీఆర్, కేటీఆర్‌లకు నేను బయపడేది లేదని స్పష్టం చేశారు. ‘రైతులు పిలిస్తే నేను వెళ్ళాను. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 150 ఎకరాలు పంట నష్టం వాటిల్లిందని నేను వెళ్ళాను. సిరిసిల్ల వెళ్తుండగా మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత టిఆర్ఎస్ నేతలు రావడం జరిగింది. రైతులను నేను దూషించాను అని అంటున్నారు. అది అవాస్తవం. నేను ఎవ్వరిని దూషించలేదు. నాపై జరిగిన దాడి ని ప్రతి ఒక్క కుల సంఘాలు, వివిధ పార్టీలు ఖండించారు. ప్రత్యేక రాష్టం కావాలని నేను కోరుకున్నా. నేను ఆంధ్ర వాడిని అని అంటున్నారు. మరి కేసీఆర్ ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకోవాలి. నా పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు, అన్ని చారిటీల మీద ఉన్నాయి. డీజీపీ మహేందర్ రెడ్డికి నిన్నటి నుండి కాల్ చేస్తుంటే ఇప్పటి వరకు కాల్ లిఫ్ట్ చెయ్యడం లేదు. డీజీపీ దగ్గరకు వెళ్లకుండా నన్ను ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు. నన్ను ఎంతకాలం నిర్భంధిస్తారు. నాపై తెలంగాణ వ్యతిరేకి ముద్ర వేస్తున్నారు. రైతులను కలవడం తప్పా. సిరిసిల్ల రైతులకు అండగా నిలవడం నేను చేసిన తప్పా. నాపై జరిగిన దాడి తెలంగాణ ప్రజల మీద జరిగిన దాడి. పీకేతో నేను టచ్‌లో ఉన్నాను. అన్ని పార్టీలను కలపాలని ముఖ్యమంత్రి చెప్పారని పీకే నాతో చెప్పాడు. అన్ని పార్టీలకు సభలకు అనుమతులు ఇస్తున్నారు నాకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఆరు నెలల్లో నేను లక్ష ఉద్యోగాలు ఇస్తాను. అలా ఇవ్వకపోతే నా పాస్ పోర్టును సీజ్ చేసుకోండి. మళ్లీ సిరిసిల్ల వస్తున్నా దమ్ముంటే ఆపు.. నా ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటా’ అని సవాల్ విసిరారు. -
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అడ్డుకుంటాం
సాక్షి, హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, ఇతర నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడంపై రాష్ట్ర బీజేపీ భగ్గుమంది. జనగామలో బుధవారం టీఆర్ఎస్–బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పార్టీ నేతలు పరామర్శించడానికి వీల్లేకుండా అడ్డుకో వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం సీఎం కేసీఆర్ జనగామ, ఇతర జిల్లాల పర్యటన నేపథ్యంలో బీజేపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేల కదలికలపై ఆంక్షలు విధించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్యం మంటగలిసింది తెలంగాణలో ప్రజాస్వామ్యం మంట కలిసిందని బండి సంజయ్ విమర్శించారు. 317 జీవోపై ప్రజా స్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు.. టీఆర్ఎస్ నిరసనలకు అనుమతిని వ్వడం సిగ్గుచేటన్నారు. జనగామలో గాయాలపా లైన కార్యకర్తలు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. వారి ప్రాణాల కంటే పోలీసులకు సీఎం సభే ముఖ్యమైందా అని సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బీజేపీ అడ్డుకుని తీరుతుందని, ఇందుకోసం ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. నియంతృత్వానికి నిదర్శనం ఎమ్మెల్యేలను గృహ నిర్బంధంలో ఉంచడం అప్రజాస్వామిక చర్యకు, నియంతృత్వానికి నిదర్శనమని ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఖబడ్దార్ కేసీఆర్.. ఈట్ కా జవాబ్.. పత్తర్ దీయెంగే’ (ఇటుకకు జవాబు రాయి ఇస్తుంది) అంటూ హెచ్చరించారు. -
గుప్కార్ నేతల గృహనిర్బంధం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలకు నిరసనగా ర్యాలీ తలపెట్టిన ముగ్గురు మాజీ సీఎంలు సహా గుప్కార్ కూటమి రాజకీయ నేతలను పోలీసులు శనివారం గృహనిర్బంధంలో ఉంచారు. ‘గుడ్‌మార్నింగ్, 2022కు స్వాగతం. సాధారణ ప్రజాస్వామ్య కార్యకలాపాలకు భయపడిన జమ్మూకశ్మీర్ పోలీసులు చట్టవిరుద్ధంగా మళ్లీ ప్రజలను గృహనిర్బంధం చేశారు’అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా శనివారం ఉదయం ట్విట్టర్లో పేర్కొన్నారు. తన తండ్రి, మాజీ సీఎం ఫరూక్ ఇంటి లోపలి గేటును పోలీసులు మూసివేశారన్నారు. మరో మాజీ సీఎం మెహబూబా ముఫ్తీని పోలీసులు నిర్బంధంలో ఉంచారు. -
కర్కోటక తండ్రి.. కుమారుని గృహ నిర్బంధం
సాక్షి, తుమకూరు: డబ్బులు, ఆస్తి కోసం సొంత కొడుకునే తల్లిదండ్రులు పిచ్చివానిగా ప్రచారం చేసి ఇంట్లో బంధించి హింసించిన అమానవీయ ఘటన ఇది. ఈఘటన తిపటూరు తాలూకా నొణవినకెరె హోబళి నెల్లికెరె గ్రామ పంచాయతీ పరిధిలోని చిగ్గావి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సోమశేఖరయ్య కుమారుడు మంజునాథ్ (23) బాధితుడు. సోమశేఖరయ్య మంజునాథ్‌ను సరిగా చూసుకునేవాడు కాదు. ఇటీవల కొబ్బరి పంట అమ్మగా వచ్చిన రూ.3 లక్షలను కూడా కూతురు, అల్లునికి ఇచ్చాడు. మంజునాథ్ ఖర్చుల కోసం రూ.2 వేలు ఇమ్మని ప్రాధేయపడితే రూపాయి కూడా ఇవ్వనని చెప్పి కొట్టి గదిలో వేసి బంధించారు. అతనికి పిచ్చిపట్టిందని అందరికీ చెప్పారు. ఈ నెల 23న సీనియర్ సివిల్ జడ్జి నూరున్నీసాకు ఒక వ్యక్తి మంజునాథ్ దీనగాథను వివరించాడు. వెంటనే జడ్జి, పోలీసులతో కలిసి వచ్చి మంజునాథ్‌ను గృహ నిర్బంధం నుంచి విడిపించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కర్కోటక తండ్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. చదవండి: (ఉషా అందుకు నిరాకరిచండంతో.. చెరువు వద్దకు పిలిచి..) -
నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!
రోమ్: కొంతమంది తమ ఇంటి బాధ్యతల నుంచి తప్పించకుని స్వేచ్ఛగా ఉండటానికే ఇష్టపడుతుంటారు. అంతేకాదు ఏ బాధ్యతలు లేకుండా హాయిగా గడపటం కోసం ఏం చేయడానికైనా లేదా ఎలాంటి చోట ఉండటానికైనా సిద్దపడతారు. అచ్చం ఇలాగే ఇటలీకి చెందిన ఓ వ్యక్తి స్వేచ్చగా ఉండటం కోసం కుటుంబానికీ దూరంగా జైల్లో ఉండాలనుకుంటున్నాడు. అంతేకాదండోయ్ నన్ను జైల్లో పెట్టండి అంటూ పోలీసులను కూడా అభ్యర్థించాడు. (చదవండి: బాబోయ్ ముఖం అంతా టాటులే!) వివరాల్లోకెళ్లితే.....గైడోనియా మాంటెసిలియోలో నివసిస్తున్న 30 ఏళ్ల అల్బేనియన్ అనే వ్యక్తి ఇంట్లో తన భార్యతో కలిసి జీవించలేనని, చాలా నరకప్రాయంగా ఉందని కారబినీరి పోలీసులకు తెలిపాడు. అంతేకాదు ఈ కుటుంబ జీవితంతో విసుగు చెందానని, నా భార్య నుంచి తప్పించుకోవడం కోసం నన్ను జైల్లో పెట్టండి అంటూ అభ్యర్థించాడని పోలీసలు చెబుతున్నారు. ఈ మేరకు టివోలి కారబినీరికి చెందిన పోలీస్ కెప్టెన్ ఫ్రాన్సిస్కో గియాకోమో ఫెర్రాంటే మాట్లాడుతూ...అల్బేనియన్ చాలా నెలలుగా మాదకద్రవ్యాల నేరం కింద గృహ నిర్బంధంలో ఉన్నాడని పైగా ఆ శిక్ష ఇంకా ముగియలేదని చెప్పారు. అంతేకాదు తాను ఇక గృహ నిర్భంధంలో కొనసాగాలేనని అది చాలా నరకప్రాయం ఉందని చెప్పడన్నారు. ఈ మేరకు తాను జైలుకు వెళ్లాలనకుంటున్నానని తనను జైల్లో పెట్టండి అంటూ అభ్యర్థించాడని కూడా అన్నారు. ఈ క్రమంలో పోలీసులు గృహ నిర్భంధాన్ని ఉల్లంఘించినందుకు సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడమే కాక అతడిని జైలుకు తరలించాలని న్యాయశాఖ అధికారులు ఆదేశించారని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: అమేజింగ్ ఆర్ట్ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో!) -
ఎన్నికల్లో అధిక ఖర్చు: సర్కోజీని దోషిగా తేల్చిన కోర్టు
పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని ఆ దేశంలోని ఓ కోర్టు దోషిగా తేల్చింది. ఎన్నికల ప్రచారంలో నిర్ణయించిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తం ఖర్చు చేయడం ద్వారా ఆయన నేరానికి పాల్పడినట్లు తేల్చింది. శిక్షగా ఏడాదిపాటు గృహ నిర్బంధంలోనే ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఎల్రక్టానిక్ మానిటరింగ్ బ్రేస్లెట్ ధరించి ఇంట్లో ఉండాలని తీర్పు చెప్పింది. ఈ శిక్షను ఆయన తిరిగి అప్పీల్ చేసే అవకాశం ఉంది. 2007 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా పని చేసిన సర్కోజీ, 2012 ఎన్నికల్లో నిర్ణయించిన ఆర్థిక మొత్తం కన్నా రెండింతలు ఎక్కువ ఖర్చు చేశారని కోర్టు తేలి్చంది. -
లాక్డౌన్లో అందరూ అలా ఫీలయ్యారు: దర్శకుడు ఎన్. శంకర్
శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, రవిప్రకాశ్, రవిబాబు, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ – ‘‘కరోనా కారణంగా విధించబడిన లాక్‌డౌన్స్‌తో ప్రజలందరూ చెప్పలేని హౌస్ అరెస్ట్‌ను ఫీలయ్యారు. కరోనా టైమ్‌లో స్క్రిప్ట్‌ను ఓకే చేయించుకుని శేఖర్ సినిమాను పూర్తి చేయడం విశేషం’’ అన్నారు. (చదవండి: మహేశ్ బాబు బ్యాక్ టూ హైదరాబాద్) ‘‘పిల్లలతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసి హిట్ చేయాలి’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘‘చిన్న పిల్లలతో చేసిన హిలేరియస్ ఎంటర్టైనరే ఈ చిత్రం’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ‘‘పిల్లలంటే దేవుళ్లతో సమానం. వారికోసమైనా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు సప్తగిరి. ‘‘ఈ జనరేషన్లో పిల్లలు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారనే విషయాన్నే ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు శేఖర్. ఈ కార్యక్రమంలో కౌశిక్, సోహైల్ తదితరులు పాల్గొన్నారు. -
143 కేసులు: జనాలను ఇళ్లలో పెట్టి తాళం వేస్తున్న అధికారులు
బీజింగ్: కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలిన చైనాను ఇప్పుడు డెల్టా వేరియంట్ బెంబెలెత్తిస్తోంది. తాజాగా డ్రాగన్ దేశంలో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో పోలిస్తే డెల్టా వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా, ప్రమాదకరంగా ఉండటంతో.. వైరస్ కట్టడి కోసం అధికారులు వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ జనాలను బయటకు రానివ్వకుండా.. ఇళ్లలో పెట్టి తాళం వేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వీడియోలో చైనా సోషల్ మీడియా యాప్ వీబోలో కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. డెల్టా కేసులు ఎక్కువగా కనిపిస్తున్న వుహాన్‌లో ఈ తరహా చర్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయిని ఓ ట్విట్టర్ యూజర్ తెలిపారు. ఇక వీబో, ట్విట్టర్, యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోల్లో.. పీపీఈ కిట్లు ధరించిన కొందరు వ్యక్తులు.. జనాల ఇళ్ల దగ్గరకు వెళ్లి.. వారిని లోపలకి పంపి.. బయట నుంచి తాళం వేయడమే కాక ఇనుపరాడ్లు పెట్టి.. సీల్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ‘‘జనాలు రోజులో మూడుసార్లు మాత్రమే డోర్ తెరిచి బయటకు రావాలి. కాదని ఎక్కువసార్లు లాక్ ఓపెన్ చేయడం.. బయటకు రావడం చేస్తే వారిని క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తాం. ఇక ఏ అపార్ట్‌మెంట్‌లోనైనా కేసులు బయటపడితే.. దాన్ని మూడు వారాల పాటు సీల్ చేస్తాం’’ అని తెలిపారు. ఇక ఆగస్టు 9 చైనా ఆరోగ్యశాఖ అధికారులు ప్రస్తుతం తమ దేశంలోని 17 ప్రాంతాలలో 143 కొత్త కేసులు రికార్డయ్యాయని తెలిపారు. వీటిలో 35 కేసులు విదేశాల నుంచి వచ్చినవారిలో వెలుగు చూడగా.. 108 స్థానికంగా నమోదయిన కేసులని తెలిపారు. ఇవేకాక నాన్జింగ్ సిటీలో మరో 48 కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. -
రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డిని సోమవారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కోకాపేట భూముల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్త గా ఆయన్ను హౌస్ అరెస్టు చేశారు. పార్ల మెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఎంపీ హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డిని గృహ నిర్బంధం చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటు సభ్యుడిగా సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురావడం తన హక్కు అని, దీన్ని కాపాడేలని కోరారు. భట్టితో సహా పలువురు నేతలు కోకాపేట భూముల పరిశీలనకు టీపీసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముం దుజాగ్రత్తగా రేవంత్‌తోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఆలిండియా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, మాజీమంత్రి షబ్బీర్ అలీని వారి ఇళ్లలోనే పోలీసులు నిర్బంధించారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ పోలీసుల కళ్లు గప్పి ఢిల్లీ వెళ్లిపోయారు. మాకేం అభ్యంతరం లేదు: ఏసీపీ రేవంత్ గృహనిర్బంధంపై హైదరాబాద్ పోలీసులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశా రు. ఎంపీ రేవంత్‌రెడ్డిని పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశం తమకు లేదని బంజారాహిల్స్ ఏసీపీ ఎం.సుదర్శన్ వెల్లడించారు. కోకాపేట భూముల విషయంలో ఆందోళన నిర్వహించా లని కాంగ్రెస్ పిలుపునిచ్చినందునే రేవంత్ ఇంటి ముందు పోలీసులను ఉంచామని పేర్కొన్నారు. మేం అధికారంలోకి వస్తే తీసుకుంటాం.. కోకాపేటలో భూములు కొన్న కంపెనీలను వదిలిపెట్టేది లేదని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ భూములను తిరిగి తీసుకుంటామని చెప్పారు. సోమవారం సాయంత్రం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ బంధువులు, సన్నిహితులకు భూములను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. కేసీఆర్ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారు: మాణిక్యం సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నాయకుల హౌస్ అరెస్టును ఏఐసీసీ తీవ్రంగా ఖం డించింది. సీఎం కేసీఆర్ హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్‌కు వచ్చే సభ్యుడిని అడ్డుకోవడం సరికా దని ధ్వజమెత్తారు. రేవంత్ అక్రమ అరెస్ట్‌ను లోక్‌సభ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తామని మాణిక్యం ఠాగూర్ తెలిపారు. -
నన్ను అడ్డుకున్నారు: స్పీకర్‌కు ఎంపీ రేవంత్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారని స్పీకర్‌కు ఎంపీ రేవంత్ ఫిర్యాదు చేశారు. కాగా ఈ విషయంలో రేవంత్‌రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు వివరణ ఇస్తూ.. పార్లమెంట్‌కు వెళ్లకుండా అడ్డుకునే ఉద్దేశం మాకు లేదని, రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లడాన్ని మేం ఎక్కడా అడ్డుకోలేదని తెలిపారు. రేవంత్‌రెడ్డి సోమవారం కోకాపేట భూముల సందర్శనకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రోజు తెల్లవారుజామున నుంచి ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మొహరించి రేవంత్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. -
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కోకాపేట భూముల సందర్శనకు ఈరోజు వెళతానని ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజామున నుంచి భారీగా పోలీసులు మొహరించారు. రేవంత్‌రెడ్డి గృహ నిర్బంధం చేసి.. ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు రేవంత్ రెడ్డిని,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ని హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేట వేలం భూముల వద్ద నిరసన నేపథ్యంలో వీరిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కోకాపేటలో వేలం వేసిన భూముల వద్ద కాంగ్రెస్ నేతలు నిరసనకు ప్లాన్ చేశారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. కోకాపేట భూముల వద్ద పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మద్య తోపులాట టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు కొకాపేట భూములను ముట్టడించి కాంగ్రెస్ జెండాలను పాతారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి తదితర నాయకులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిని గచ్చిబౌలి పోలిస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం తక్కువ ధరలకు టిఆర్ఎస్ అనుచరులు, కేసీఆర్ బినామీలు వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడారని వారు ఆందోళన చేశారు. కాగా పోలీసుల తోపులాటలో కింద పడి పోయిన మహేష్ కుమార్ గౌడ్ కాలికి గాయాలయ్యాయి. -
ప్రజల ఎదుట ప్రిన్స్ హమ్జా ప్రత్యక్షం
జెరూసలేం: జోర్డాన్ రాజు అబ్దుల్లా–2 సవతి సోదరుడు ప్రిన్స్ హమ్జా ఆదివారం ఒక కార్యక్రమంలో ప్రజలకు దర్శనమిచ్చారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నుతున్నాడన్న ఆరోపణలతో ఏప్రిల్ 3న ఆయనను గృహనిర్బంధంలోకి తరలించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ప్రజలకు కనిపించడం ఇదే మొదటిసారి. కింగ్ అబ్దుల్లా–2, ప్రిన్స్ హమ్జా ఒకే వేదికను పంచుకోవడం గమనార్హం. అయితే, వారి మధ్య విభేదాలు సమసిపోయాయా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. రాజధాని అమన్ నగరంలో కింగ్ తలాల్ సమాధి వద్ద అబ్దుల్లా–2, ప్రిన్స్ హమ్జా, క్రౌన్ ప్రిన్స్ ముస్సేన్, ఇతర కుటుం సభ్యులు కలిసి ఉన్న ఒక ఫొటో, వీడియోను రాయల్ ప్యాలెస్ విడుదల చేసింది. -
గజదొంగల నవ్వులు
‘‘హౌస్ అరెస్ట్’ సినిమా స్టార్ట్ కావడానికి కారణం అనూప్ రూబెన్స్. చిన్నపిల్లల సినిమా ఫుల్ కామెడీతో చేయాలని చెప్పాడు. అలా ఈ స్క్రిప్ట్ అనుకున్నాను. పిల్లల దృష్టి కోణంలో సాగే ఈ చిత్రంలో ఆరంభం నుంచి చివరి వరకు నవ్వులు ఉంటాయి. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఇది’’ అని డైరెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు ప్రధాన పాత్రల్లో ‘90ఎంఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకులు చంద్రమహేష్, ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్మాత అశోక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, ‘హౌస్ అరెస్ట్’ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘హౌస్ అరెస్ట్’ సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇందులో సప్తగిరి, నేను, రఘు, రమేష్ గజదొంగలుగా నటించాం. కడుపుబ్బా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ‘‘లాక్డౌన్ తర్వాత నేను ఒప్పుకున్న తొలి చిత్రమిది. కచ్చితంగా హిట్ సాధిస్తాం’’ అన్నారు సప్తగిరి. -
ఒమర్ అబ్దుల్లా కుటుంబం గృహనిర్బంధం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ పోలీసులు తనని, తన కుటుంబ సభ్యుల్ని, తన తండ్రి ఎంపీ అయిన ఫరూక్ అబ్దుల్లాని గృహ నిర్బంధంలో ఉంచార ని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శ్రీనగర్‌లోని గుప్కార్ ప్రాంతం లో తన ఇంటి బయట ఉన్న పోలీసు వాహనా లకు సంబంధించిన ఫోటోల ను కూడా ఆయన షేర్ చేశారు. ‘‘ఆగస్టు, 2019 తర్వాత కనిపిస్తున్న కొత్త కశ్మీర్ ఇది. ఎలాంటి కారణం లేకుండా మమ్మల్ని మా ఇంట్లో ఉంచి తాళాలు వేశారు. పార్లమెంటు సభ్యుడైన నా తండ్రిని కూడా నిర్బంధించడం దారుణం. నా సోదరి, పిల్లల్ని కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు’’ అని ఒమర్ అబ్దుల్లా ఆ ట్వీట్లో వెల్లడించారు. తమ ఇంట్లో పని చేసే సిబ్బం దినెవరినీ కూడా లోపలికి రానివ్వడం లేదని తెలిపారు. ‘‘ఎలాంటి కారణాలు లేకుండానే ఇంట్లో బంధించి ఉంచారు. ఇంటిలో పనులు చేసుకునే వారిని లోపలికి రానివ్వడం లేదు. మీ కొత్త ప్రజాస్వామ్యం అంటే ఇదేనా’’ అని ఒమర్ ప్రశ్నించారు. అయితే పోలీసులు మాత్రం పుల్వామా దాడి జరిగి రెండేళ్లయిన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా, కొందరు వీఐపీలు, భద్రత కల్పించాల్సిన వారిని గృహనిర్బంధంలో ఉంచినట్టుగా తెలిపారు. వాళ్లు బయటకొచ్చి తిరిగితే ఎలాంటి వ్యతిరేకత వస్తుందోనని అలా చేసినట్టుగా శ్రీనగర్ పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. -
ఒకే దేశం రెండు పేర్లు
బాంకాక్: మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం, అక్కడ తిరిగి సైనిక పాలనకు అంకురార్పణ చేయడమే కాక గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ఆంగ్‌సాంగ్ సూకీ, ఆమె అనుచరులను గృహనిర్భంధంలో ఉంచింది. పైగా మయన్మార్‌లో సైనిక పాలన విధించడం సబబేనని, ఆంగ్‌సాంగ్ సూకీ ప్రభుత్వం నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడడమే అందుకు కారణమని తన చర్యలను మయన్మార్ సైన్యం సమర్థించుకుంది. సుదీర్ఘ సైనిక పాలన అనంతరం నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాంగ్ సూకీ ప్రభుత్వం విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. మయన్మారా? బర్మానా? నిజానికి ఈ సైనిక తిరుగుబాటు ఎక్కడ జరిగింది? అధికారికంగా ఈ దేశాన్ని మయన్మార్ అనాలా? లేక ఇప్పటికీ అమెరికా సంభోదిస్తున్నట్టు బర్మా అని పిలవాలా? దీనికి సమాధానం క్లిష్టమైన విషయమే. మయన్మార్‌లో ప్రతిదీ రాజకీయమే. భాషతో సహా. ఒకే దేశానికి రెండు పేర్లు ఎందుకు? ► ఆధిపత్య జుంటాలు, బర్మన్ జాతి ప్రజల ప్రజాస్వామిక తిరుగుబాటుని అణచివేసిన తరువాత, 1989లో ఈ దేశం పేరుని బర్మాకి బదులుగా మయన్మార్‌గా మార్చారు. అక్కడి ప్రభుత్వాన్ని సైనిక పాలకులు ‘‘యూనియన్ ఆఫ్ బర్మా’’కి బదులుగా ‘‘యూనియన్ ఆఫ్ మయన్మార్’’గా మార్చారు. పాత పేరు అనేక పురాతన జాతులెన్నింటినో విస్మరించిందన్న విమర్శలున్నాయి. ► నిజానికి ఈ పేరులో పెద్ద తేడా ఏమీ లేదు. అయితే సాహిత్యపరంగా చిన్న తేడా వుంది. ‘మయన్మార్’ ‘బర్మా’ అధికారిక వర్షన్. రెండు పేర్లూ అంతిమంగా అతిపెద్ద జాతి సమూహమైన బామర్ ప్రజలు మాట్లాడే భాషకి సంబంధించినవే. ఒకటి రెండు బామర్ కాని సమూహాలు ముఖ్యంగా బామర్ మైనారిటీలు ఇందులో మినహాయింపు. మన్మా అనే శబ్దం ఎలా ఉద్భవించింది అనే విషయంలో స్పష్టత లేదు. అయితే 9వ శతాబ్దంలో సెంట్రల్ ఇర్వాడి నదీ లోయలోకి ప్రవేశించిన ‘‘బామాస్’’ పాగన్ రాజ్యాన్ని స్థాపించారు. అలాగే తమని తాము మన్మా అని సంభోదించుకున్నారు. ఆ తరువాత 1989లో ఈ దేశం పేరుని ఇంగ్లీషులో మయన్మార్‌గా మార్చారు. ప్రపంచంలోని చాలా మంది ఈ పేరుతో పిలవడాన్ని తిరస్కరించారు. ఈ మార్పు ఎప్పుడు జరిగింది? ► దేశం ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తోన్న తరుణంలో దశాబ్దం క్రితం ఈ పేరుని మార్పు చేశారు. బర్మాలో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకొని, అత్యధిక రాజకీయాధికారాలను దక్కించుకుంది. అయితే ప్రతిపక్ష నాయకులు జైలు నుంచి విడుదలై గృహనిర్భంధంలో ఉన్నారు. ఈ సందర్భంలో ఎన్నికలకు అనుమతిచ్చారు. సుదీర్ఘకాలంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతోన్న ఆంగ్‌సాంగ్ సూకీ ఈ ఎన్నికల్లో దేశానికి నాయకురాలయ్యారు. ► చాలా ఏళ్ళ పాటు చాలా దేశాలు, అసోసియేషన్ ప్రెస్‌తో సహా మీడియా అంతా ఈ దేశాన్ని అధికారికపు పేరుతోనే పిలవడం ప్రారంభించారు. నిర్భంధం, ఆంక్షలు తగ్గి, మిలిటరీ పాలనకు అంతర్జాతీయంగా పెద్దగా వ్యతిరేకత లేకపోవడంతో ‘‘మయన్మార్’’ పేరు కామన్‌గా మారిపోయింది. దేశంలోని ప్రతిపక్షాలు మాత్రం తమకు ఈ విషయంలో పెద్ద పట్టింపు లేదని తేల్చి చెప్పారు. అయితే మొత్తం ప్రపంచానికి భిన్నంగా అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ దేశాన్ని ‘బర్మా’ పేరుతోనే పిలుస్తూండడం విశేషం. ► 2012లో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఈ దేశాన్ని సందర్శించినప్పుడు బర్మా, మయన్మార్ రెండు పేర్లతో సంభోదించారు. మయన్మార్ అధ్యక్షులు దీన్ని చాలా అనుకూలంగా భావించారు. ఇప్పుడేంటి? సైనిక తిరుగుబాటుపై అమెరికా విమర్శలు కురిపిస్తోంది. అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్, అధ్యుడు జో బైడెన్లు దేశం యొక్క చట్టబద్దమైన పేరుని కావాలనే విస్మరిస్తున్నారని భావిస్తున్నారు. బర్మాలో ప్రజాస్వామ్య పురోగతి నేపథ్యంలో బర్మాపై దశాబ్ద కాలంగా అమెరికా ఆంక్షలను సడలించింది. అయితే తిరిగి ఆ ఆంక్షల కొనసాగింపు అవసరాన్ని అమెరికా పునరాలోచిస్తోంది. -
ప్రజలు ఎన్నుకున్నా పవర్లో లేరెందుకు!
జీవిత భాగస్వామి గానీ, పిల్లలు గానీ విదేశీ పౌరులై ఉంటే ఆ వ్యక్తికి ఎంతటి ప్రజాదరణ ఉన్నా, ఎన్నికల్లో ఘన విజయం సాధించినా మయన్మార్ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. ఆ పవర్ లేనందు వల్లనే మయన్మార్ సైన్యం తాజాగా మరొకసారి దేశంలోని ‘ప్రజా పాలన’ను∙చేజిక్కించుకుంది. సూకీని నిర్బంధించింది. సూకీకి అప్పుడు 43 ఏళ్లు 8–8–88. ఆగస్టు 8, 1988. రంగూన్లో ప్రజలు ఎక్కడికక్కడ గుమికూడుతున్నారు. పిడికిళ్లు ఎక్కడివక్కడ బిగుసుకుంటున్నాయి. నలు దిక్కులా ప్రజాస్వామ్యం కోసం నినాదాలు! విశ్వవిద్యాలయాల విద్యార్థులు, బౌద్ధ భిక్షువులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, యువకులు, గృహిణులు, చిన్నపిల్లలు... ‘విప్లవం వర్థిల్లాలి’ అంటూ ఇళ్ల నుంచి, మఠాల నుంచి, పాఠశాలల నుంచి, ప్రభుత్వ కార్యాలయాల నుంచి పరుగులు తీస్తూ బయటికి వస్తున్నారు. ఉద్యమ ప్రకంపనలు దేశంలో ప్రతిచోటా ప్రతిధ్వనించడం మొదలైంది. వక్తలు ఆవేశంగా ప్రసంగిస్తున్నారు. బుద్ధుడిని, మార్క్స్‌ని కలిపి బర్మాను సోవియెట్ యూనియన్‌లా మార్చేందుకు ‘కమ్యూనిస్టు నియంత’ నెవిన్ చేసిన ప్రయోగాలు వికటించి బర్మాకు తిండి కరువైంది. చివరికి తిరుగుబాటు ఒక్కటే ప్రజలకు మిగిలిన తిండీబట్టా అయింది. ఆ తిరుగుబాటు కు నాయకత్వం వహించడానికి సూకీ బయటికి వచ్చారు. ఆ తర్వాత బర్మా సైనిక పాలకులు ఆమెను దాదాపు పదిహేనేళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆరేళ్ల వయసులో (1951) సూకీ సూకీ వయసిప్పుడు 75 ఏళ్లు 2020 నవంబర్ 8. మయన్మార్ పార్లమెంటు ఎన్నికల్లో సూకీ పార్టీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ (ఎన్.ఎల్.డి.) ఘన విజయం సాధించింది. సూకీ అధ్యక్షురాలు అవ్వాలి. కానీ కాలేరు! అయ్యేపనైతే అంతకుముందు 2015లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించినప్పుడే కావలసింది. ఆంగ్‌సాన్ సూకీ ఎప్పటికీ అధ్యక్షురాలు కాకుండా ఉండడం కోసం 2008లో మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. దాని ప్రకారం.. జీవిత భాగస్వామి గానీ, పిల్లలు గానీ విదేశీ పౌరులై ఉంటే ఆ వ్యక్తి మయన్మార్ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. సూకీ ఇప్పుడు అధ్యక్షురాలు అవాలంటే ఆ క్లాజును రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ తేవాలి. అందుకు మిలటరీ ఒప్పుకోవాలి. మిలటరీ ఒప్పుకునే పనైతే మొన్న సోమవారం సూకీని, మయన్మార్ దేశ అధ్యక్షుడిని, మరికొంతమంది ఎన్.ఎల్.డి. నేతల్ని సైన్యం నిర్బంధించి, దేశాన్ని తన అధీనంలోకి తీసుకునే వరకు పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మొన్నటి నవంబర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి కనుక, ఏడాది ఆగి సక్రమ ఎన్నికలు జరిపిస్తామని సైన్యం అంటోంది. అంతవరకు సూకీ నిర్బంధంలోనే ఉండే అవకాశం అయితే ఉంది. 88కి ముందు సూకీ ఎక్కడున్నారు? పెద్ద చదువులు చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ దాదాపు నలభై ఏళ్ల పాటు విదేశాల్లో గడిపి, 1988లో మయన్మార్ వచ్చిన ఏడాదే ఉద్యమ శక్తిగా అవతరించారు సూకీ. ‘ఆ శక్తి నాకు నా తండ్రి, బర్మా ప్రజలు ఇచ్చిన శక్తి’ అని చెప్తారు సూకీ. ఆమె తండ్రి దేశభక్త విప్లవకాý‡ుడు. అసలు ఆంగ్ సాన్ సూ కీ అన్న పేరులోనే మూడు తరాల శక్తి ఉంది. ‘ఆంగ్ సాన్’ అన్నది ఆమె తండ్రి పేరు. ‘సూ’ అన్నది తాతగారి (నాన్న నాన్న) పేరు. ‘కీ’ అన్నది అమ్మ పేరు. సూకీ రంగూన్లో జన్మించారు. పాలిటిక్స్, ఫిలాసఫీ చదివారు. బ్రిటిష్ పౌరుడు మైఖేల్ ఆరిస్ ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు కొడుకులు. తర్వాత మయన్మార్ వచ్చి ఉద్యమం బాట పట్టారు. ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఫలితంగా గృహ నిర్బంధానికి గురయ్యారు. సొంత రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. 2015 పార్లమెంటు ఎన్నికల్లో, తిరిగి మొన్నటి 2020 ఎన్నికల్లో భారీ మెజారిటీతో నెగ్గారు. తొలి ఎన్నికలు (2015) ఆమె సాధించిన నోబెల్ శాంతి బహుమతి కంటే గొప్ప విజయంగా చెబుతారు అక్కడి ప్రజలు. ఇక ఏం జరగబోతోంది? కుట్రపూరితంగా తిరుగుబాటు చేసి ఈ సోమవారం (ఫిబ్రవరి 1) మయన్మార్‌ను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్న సైన్యం ఏడాది లోపే తిరిగి పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతవరకు సూకీ సహా ముఖ్య నేతలందరూ నిర్బంధంలోనే ఉండొచ్చు. అయితే సూకీ ఆరోగ్య పరిస్థితి కొంతకాలంగా బాగుండటం లేదని వార్తలు అందుతున్నాయి. 2003 లోనే.. గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు.. ఆమెకు స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యకు అత్యవసర శస్త్ర చికిత్స జరిగింది. తర్వాత 2013లో పాదానికి, 2016 లో కంటికి శస్త్ర చికిత్సలు జరిగాయి. సూకీని నిరంతరం పర్యవేక్షిస్తుండే డాక్టర్ టిన్ మియో విన్ ఆమె మరీ 48 కిలోల బరువు మాత్రమే ఉన్నారని, రక్త పీడనం కూడా బాగా తక్కువగా ఉంది కనుక తేలికగా ఆమె బలహీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని అప్పట్లోనే జాగ్రత్తలు చెప్పారు. ప్రస్తుతానికి సూకీ ఆరోగ్యంగానే ఉన్నారు. సూకీ భర్త 1999 లో 53 ఏళ్ల వయసులో మరణించారు. కొడుకులిద్దరూ బ్రిటన్ నుంచి వచ్చి పోతుంటారు. -
మిలటరీ గుప్పెట్లో మయన్మార్
నేపిదా: స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే బర్మాలో ప్రజాస్వామ్యం కనిపించింది. అధిక కాలం మిలటరీ గుప్పెట్లోనే బర్మా గడిపింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మయన్మార్‌లో జరిగిన కీలక సంఘటనల సమాహారం పరిశీలిస్తే.. 1948, జనవరి 4: బర్మాకు బ్రిటీష్ వారినుంచి స్వాతంత్రం లభించింది. 1962: మిలటరీ నేత నీ విన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పాలనా పగ్గాలు చేపట్టారు. 1988: ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఆంగ్‌సాన్ సూకీ విదేశీ ప్రవాసం నుంచి స్వదేశానికి వచ్చారు. దేశంలో జుంటా(మిలటరీ సమూహం)పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో జరిగిన నిరసనలపై మిలటరీ కాల్పులు జరపగా వందలాది మంది మరణించారు. 1989, జూలై: జుంటాపై తీవ్ర విమర్శలు చేస్తున్న సూకీని హౌస్ అరెస్టు చేశారు. 1990, మే 27: ఎన్నికల్లో సూకీ పార్టీ ద నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ బంపర్ మెజార్టీ సాధించింది. కానీ పాలనా పగ్గాలు అందించేందుకు జుంటా నిరాకరించింది. 1991, అక్టోబర్: సూకీకి శాంతియుత పోరాటానికిగాను నోబెల్ శాంతి బహుమతి దక్కింది. 2010, నవంబర్ 7: ఇరవై సంవత్సరాల తర్వాత జరిపిన ఎన్నికల్లో జుంటా అనుకూల పార్టీకి అత్యధిక సీట్లు దక్కాయి. 2010, నవంబర్ 13: దశాబ్దాల హౌస్ అరెస్టు అనంతరం సూకీ విడుదలయ్యారు. 2012: పార్లమెంట్ బైఎలక్షన్లో సూకీ విజయం సాధించారు. 2015, నవంబర్ 8: సూకీ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కీలక పదవులను జుంటా తన చేతిలో ఉంచుకొని సూకీకి స్టేట్ కౌన్సిలర్ పదవి కట్టబెట్టింది. 2017, ఆగస్టు 25: రోహింగ్యాలపై మిలటరీ విరుచుకుపడింది. దీంతో వేలాదిమంది బంగ్లాదేశ్‌కు పారిపోయారు. 2019, డిసెంబర్ 11: జుంటాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో సూకీ తమ మిలటరీకి మద్దతుగా నిలిచారు. 2020, నవంబర్ 8: ఎన్నికల్లో సూకీ పార్టీ ఎన్ఎల్డీకి మరోమారు మెజార్టీ దక్కింది. 2021, జనవరి 29: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న జుంటా ఆరోపణలను బర్మా ఎన్నికల కమీషన్ తోసిపుచ్చింది. ఇందుకు సరైన ఆధారాల్లేవని తెలిపింది. 2021, ఫిబ్రవరి 1: దేశాన్ని ఒక సంవత్సరం పాటు ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు మిలటరీ ప్రకటించింది. ఓటింగ్ అక్రమాలపై సూకీ ప్రభుత్వ స్పందన పేలవంగా ఉందని, కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని సూకీ పట్టించుకోలేదని ఆరోపించింది. మరోమారు సూకీని హౌస్ అరెస్టు చేస్తున్నట్లు తెలిపింది. -
మయన్మార్‌లో సైనిక పాలన
నేపిదా: మయన్మార్ పాలన మరోసారి సైనిక జుంటా చేతుల్లోకి వెళ్లిపోయింది. దేశం ఏడాది పాటు సైన్యం ఆధీనంలో ఉంటుందని సైన్యం ఆధీనంలోని ‘మ్యావద్దీ’టీవీ సోమవారం ప్రకటించింది. దేశ కీలక నేత, కౌన్సిలర్ హోదాలో ఉన్న అంగ్‌సాన్ సూకీ(75) సహా సీనియర్ రాజకీయ నేతలను గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల సమయంలో ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం కావడం, కరోనా సంక్షోభ సమయంలో ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేయలేకపోయినందునే అధికారం చేజిక్కించుకుంటున్నట్లు ‘మ్యావద్దీ’తెలిపింది. కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హ్లయింగ్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారని తెలిపింది. దేశ సుస్థిరతకు ప్రమాదం వాటిల్లినందున, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కమాండర్ ఇన్ చీఫ్‌కు బదిలీ అయ్యాయని పేర్కొంది. సోమవారం ఉదయం నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యులతో పార్లమెంట్ సమావేశాలు మొదలు కావాల్సిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అధికారం చేజిక్కించుకున్న సైనిక నేత సోమవారం వేకువజాము నుంచే రాజధాని నేపిదాతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ టెలివిజన్ ప్రసారాలు, ఫోన్, ఇంటర్నెట్ వంటి సమాచార సంబంధాలను నిలిపివేశారు. దేశ అగ్రనేత, కౌన్సిలర్ హోదాలో ఉన్న అంగ్‌సాన్ సూకీ, అధ్యక్షుడు విన్ మియింత్లను గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఎన్ఎల్డీ ప్రతినిధి తెలిపారని ఆన్లైన్ మీడియా వెల్లడించింది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, ప్రాంతీయ కేబినెట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధరంగాలకు చెందిన ప్రముఖులను కూడా సైనిక పాలకులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కమాండర్ ఇన్ చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఔంగ్ హ్లయింగ్ సారథ్యంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మింట్ స్వే ఉంటారని మిలటరీ టీవీ తెలిపింది. ఏడాదిలో ఎన్నికలు జరిపి, గెలిచిన వారికి అధికారం అప్పగిస్తామని ప్రకటించింది. దీనిపై సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్ఎల్డీ) ఒక ప్రకటన విడుదల చేసింది. సైనిక జుంటా చర్య అక్రమం, రాజ్యాంగానికి, ప్రజల అభీష్టానికి వ్యతిరేకం. సైనిక తిరుగుబాటును, నియంతృత్వ పాలనను వ్యతిరేకించాలి’అని కోరింది. అయితే, ఈ పోస్టును ఎవరు పెట్టారో తెలియరాలేదు. ఎన్ఎల్డీ నేతలెవరూ ఫోన్‌కాల్స్‌కు సమాధానం ఇవ్వడం లేదు. దేశీయ విమాన సర్వీసులన్నిటినీ రద్దు చేస్తున్నట్లు యంత్రాంగం తెలిపింది. దేశంలోని అతిపెద్ద యాంగూన్ విమానాశ్రయాన్ని మూసివేశారని మయన్మార్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది. ఖండించిన ప్రపంచ దేశాలు దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దాదాపు ఐదు దశాబ్దాల పాటు సైనిక పాలన కొనసాగడం, 1962 నుంచి అంతర్జాతీయంగా ఏకాకిగా మారడం..2015లో ఎన్నికలు జరిగి, ప్రజాస్వామ్యం దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం దేశ భవిష్యత్తును మరోసారి ప్రశ్నార్థ్ధకంగా మార్చాయి. ప్రజాస్వామ్యం కోసం అనేక ఏళ్లపాటు గృహ నిర్బంధంలో గడిపిన, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సూకీని సైనిక జుంటా అధికారం నుంచి తొలగించి తిరిగి నిర్బంధంలోకి పంపడంతో ప్రపంచ దేశాలు షాక్‌కు గురయ్యాయి. మయన్మార్‌లో సైన్యం రాజకీయ నేతలను నిర్బంధించడంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ స్పందించారు. అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘నిర్బంధంలో ఉంచిన రాజకీయ నేతలు, ప్రభుత్వాధికారులను సైనిక పాలకులు వెంటనే విడుదల చేయాలి. ప్రజాభీష్టానికి లోబడి వ్యవహరించాలి’అని కోరారు. మయన్మార్‌తో బలమైన ఆర్థిక సంబంధాలు నెరపుతున్న పొరుగు దేశం చైనా ఆచితూచి స్పందించింది. అక్కడ జరుగుతున్న పరిణామాలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ పార్టీల నేతలు తమ మధ్య విభేదాలను రాజ్యాంగానికి లోబడి పరిష్కరించుకోవాలంది. మయన్మార్‌లో పరిణామాలు ప్రజాస్వామ్య సంస్కరణలకు తీవ్ర విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి చీఫ్ గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. కారణం ఏమిటి? గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూకీకి చెందిన ఎన్ఎల్డీ ఘన విజయం సాధించగా సైన్యం మద్దతు ఉన్న ప్రతిపక్ష యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఓటమి పాలు కావడం గమనార్హం. సైనిక తిరుగుబాటుకు అవకాశాలున్నాయంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలు నిజమేనని దీంతో తేలిపోయింది. దేశ రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు.. అత్యవసర పరిస్థితుల్లో పాలనా బాధ్యతలను సైన్యం హస్తగతం చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నాయని సైనిక నేతలు సమర్థించుకుంటున్నారు. అయితే, ఇది సైనిక తిరుగుబాటు కిందికే వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల్లో తాము మద్దతిచ్చిన రాజకీయ పార్టీలు ఓటమి పాలుకావడం జీర్ణించుకోలేకే సైనిక నేతలు ఈ క్లాజ్‌ను ఉపయోగించుకున్నారని చెబుతున్నారు. అంగ్‌సాన్ సూకీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంతో సైనిక పాలన మద్దతుదారులు, ప్రతిపక్ష పార్టీల శ్రేణులు యాంగూన్‌లో ర్యాలీలు చేపట్టాయి. -
ఇంట్లో అరెస్ట్ అయ్యారు
హాస్యనటులు సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి హీరోలుగా ‘హౌస్ అరెస్ట్’ అనే సినిమా ప్రారంభమైంది. ‘90 ఎంఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి యెర్ర దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బాబీ క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులకు విభిన్నమైన, చక్కని వినోదాన్ని అందించే సినిమాలు అందిస్తూ భవిష్యత్తులో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో మా ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ కంపెనీ అడుగులు వేస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: చైతన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె. యువరాజ్. -
గృహ నిర్బంధంలో కేజ్రీవాల్: ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారని ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్ మంగళవారం ఉదయం సింఘు వద్దకు వెళ్లి అక్కడ నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు తెలిపారు. తిరిగి తన నివాసానికి చేరుకున్నారు. అయితే, కేజ్రీవాల్‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారనీ, ఆయనకు స్వేచ్ఛ ఇవ్వాలంటూ కొందరు ఆప్ ఎమ్మెల్యేలు ఆయన నివాసం వద్ద నినాదాలు చేశారు. సీఎం ఇంట్లోకి పోలీసులు తనను వెళ్లనివ్వలేదని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. ఈ సందర్భంగా ఆప్ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర హోం శాఖ సూచనల మేరకే ఢిల్లీ పోలీసులు సీఎం కేజ్రీవాల్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. సీఎం ఇంట్లోకి ఎవరినీ వెళ్లనివ్వలేదు. లోపలి నుంచి బయటకు వచ్చేందుకు సీఎంను అనుమతించలేదు. మా ఎమ్మెల్యేలు సీఎంను కలిసేందుకు వెళ్లగా పోలీసులు వారిని కొట్టి, బయటకు నెట్టారు’అని తెలిపారు. ఢిల్లీ నార్త్ జోన్ స్పెషల్ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా ఈ ఆరోపణలను ఖండించారు. ‘ఢిల్లీ సీఎం కదలికలపై పోలీసులు ఆంక్షలు విధించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారాలు’ అని మీడియాకు తెలిపారు. ఆప్ ఆరోపణలను బీజేపీ, కాంగ్రెస్ ఖండించాయి. అవన్నీ రాజకీయ డ్రామాలని కొట్టిపారేశాయి. కేజ్రీవాల్ తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా ఆ పార్టీ నేతలు గృహ నిర్బంధమని చెబుతున్నారని బీజేపీ వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ మోసాలకు పాల్పడుతున్నారని విమర్శించింది. -
భారత్ బంద్: సీఎం హౌజ్ అరెస్ట్..
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు పిలునిచ్చిన ‘భారత్ బంద్’ కొనసాగుతుంది. రైతులకు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రైతులకు మద్దతుగా పలు సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ‘భారత్ బంద్’ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్లో ఓ పోస్ట్ చేసింది. సింఘా సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి వచ్చినప్పటీ నుంచి ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్ నివాసం నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ, బయటవారు లోనికి ప్రవేశించడానికి కానీ పోలీసులు అనుమతించడం లేదని ఆరోపించింది. ఈ మేరకు ఆప్ లీడర్ సౌరవ్ భరద్వాజ్ ‘ఆయనను బయటకు రానీవ్వడం లేదు.. మమ్మల్ని ఎవరిని లోనికి అనుమతించడం లేదు. నిన్న ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యేలను పోలీసులు కొట్టారు. పని వారిని కూడా లోనికి వెళ్లనివ్వడం లేదు. ఆయన నివాసం బయట బీజేపీ నాయకులు బైఠాయించారు’ అంటూ ట్వీట్ చేశారు. (మా రాష్ట్రంలో బంద్ పాటించం: సీఎం) No one is allowed to go inside, he is not allowed to come out. MLAs, who had a meeting with CM yesterday, were beaten up by Police when they went to meet him. Workers were not allowed to meet him either. BJP leaders are being made to sit outside his residence: Saurabh Bharadwaj https://t.co/uuz6HrR6xd — ANI (@ANI) December 8, 2020 అయితే ఆప్ వ్యాఖ్యలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. కేజ్రీవాల్‌ను గృహ నిర్భంధంలో ఉంచామని చెప్పడం అవాస్తమని అన్నారు. తాము ఆప్, ఇతర పార్టీల మధ్య ఘర్షణ తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టుగా తెలిపారు. ఈ క్రమంలోనే ట్విటర్లో కేజ్రీవాల్ నివాసం వద్ద ఎలా ఉందో చూడండి అని ఓ ఫొటోను పోస్ట్ చేసింది.దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్పందించింది. పోలీసులకు, ఆప్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరుగుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆప్.. ఆధారాలను తారుమారు చేయవద్దని కోరింది. ఈ వీడియో ఏమిటో చెప్పాల్సిందిగా పోలీసులను ప్రశ్నించింది. తమ ఎమ్మెల్యేలను సీఎం కేజ్రీవాల్‌ను కలవడానికి అనుమతించకుండా ఎందుకు లాగివేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది. (చదవండి: పాత చట్టాలతో కొత్త శతాబ్దం నిర్మించలేం) Important : BJP's Delhi Police has put Hon'ble CM Shri @ArvindKejriwal under house arrest ever since he visited farmers at Singhu Border yesterday No one has been permitted to leave or enter his residence#आज_भारत_बंद_है#BJPHouseArrestsKejriwal — AAP (@AamAadmiParty) December 8, 2020 ఇక, సోమవారం రోజున సింఘా సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను క్రేజ్రీవాల్ కలిశారు. రైతుల డిమాండ్లు సమ్మతమైనవేనని, వారి డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. కనీస మద్దతు ధర అంశాన్ని వ్యవసాయ చట్టాల్లో చేర్చాల్సిందిగా ఆప్ పార్లమెంట్లో కేంద్రాన్ని కోరిన విషయన్ని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. -
గృహ నిర్బంధంలోకి ముఫ్తీ
శ్రీనగర్: ఉగ్రవాద కేసులో అరెస్టయిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడు వహీద్ పర్రా కుటుంబాన్ని పరామర్శించడానికి అనుమతినివ్వడం లేదని పీడీపీ నాయకురాలు, జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. "చట్టవిరుద్ధంగా నన్ను మరోసారి అదుపులోకి తీసుకున్నారు. నా కుమార్తె ఇల్టిజాను గృహ నిర్బంధంలో ఉంచారు" అని తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ నవీద్ బాబుతో సంబంధం ఉన్న వహీద్ పర్రాను బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. వహీద్ పర్రా ముఫ్తీకి అత్యంత సన్నిహితుడు. ఈ సందర్బంగా ముఫ్తీ పుల్వామాలోని వాహిద్ కుటుంబాన్ని సందర్శించడానికి రెండు రోజుల నుంచి ప్రయత్నిస్తుండగా అధికారులు అనుమతిని నిరాకరిస్తున్నారని తెలిపారు. కాగా.. బీజేపీ మంత్రులు వారి సహాచరులు రాష్ట్రంలోని ప్రతి మూలకు తిరగడానికి అనుమతి ఉంది కానీ మేము వెళ్లాలంటే భద్రత సమస్య ఉందంటూ సాకులు చెప్తున్నారని ముఫ్తీ శుక్రవారం ట్వీట్టర్లో పేర్కొన్నారు. తన ఇంటి ముందు ఉన్న పోలీసు వాహనం ఫోటోను కూడా జత పోస్ట్ చేశారు. దక్షిణ కశ్మీర్లో ముఖ్యంగా ఉగ్రవాద బారినపడిన పుల్వామాలో పీడీపీ పునరుద్ధరణలో వహీద్ పర్రా కీలక పాత్ర పోషించారు. అక్కడి జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మొదటి దశ ఎన్నికలు నవంబర్ 28న జరుగనున్నాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలో శ్రీనగర్-జమ్మూ హైవేపై ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను వాహనంలో తీసుకెళ్తుండగా అరెస్టయిన డీఎస్పీ డేవిందర్ సింగ్ కేసు దర్యాప్తులో వహీద్ పర్రా పేరు బయటపడింది. నిరాధార ఆరోపణలపై వహీద్ పర్రాను అరెస్టు చేశారన్నారు. ముఫ్తీ ఈ మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక హోదా ఆర్టికల్ 370 తొలగించినప్పుడు ఆమెను అదుపులోకి తీసుకుని అక్టోబర్‌లో విడుదల చేశారు. -
ముఫ్తీని కలిసిన ఫరూఖ్, ఒమర్
శ్రీనగర్: పద్నాలుగు నెలల నిర్బంధం తరువాత విడుదలైన జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని, మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు శ్రీనగర్‌లోని ఆమె నివాసంలో కలిసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫరూఖ్ అబ్దుల్లా గురువారం ఏర్పాటు చేసిన గుప్కర్ డిక్లరేషన్ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పీడీపీ నాయకురాలు ముఫ్తీని కోరామని, అందుకు ఆమె సమ్మతించినట్లు ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఆగస్టు 4, 2019న జరిగిన అఖిల పక్ష సమావేశం గుప్కర్ డిక్లరేషన్ తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ, కశ్మీర్ స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదాను, గుర్తింపులను కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఒక రోజు ముందు జరిగిన సమావేశంలో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. ఈ యేడాది ఆగస్టులో సమావేశమైన పార్టీలు తమ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి గురువారం ఏర్పాటు చేయనున్న సమావేశానికి అన్ని పార్టీలను ఫరూఖ్ అబ్దుల్లా ఆహ్వానించారు. నిర్బంధం నుంచి విడుదలైన ముఫ్తీ మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు 5న అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా మన నుంచి లాగేసుకున్న జమ్మూకశ్మీర్‌ని తిరిగి సాధించుకోవడానికి ప్రతిజ్ఞ పూనాలని అన్నారు. -
మాలీలో సైనిక తిరుగుబాటు
బమకో: ఆఫ్రికా దేశం మాలిలో సైనిక తిరుగుబాటు జరిగింది. సైన్య నిర్బంధంతో ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో చాలా నెలలుగా ఇబ్రహీం దిగిపోవాలని కోరుతూ అందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా మంగళవారం సైన్యం తిరుగుబాటు చేసి ఇబ్రహీంను ఇంట్లో నిర్బందించింది. దీంతో ఆయనతోపాటు ప్రధాని బౌబు సిస్సే సైతం రాజీనామా చేశారు. ఈ పరిణామాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఐరాస నేతృత్వంలో 15,600 మంది సైనికులు శాంతిపరిరక్షక విధులు నిర్వహిస్తున్నారు. మాలిలో పరిణామాలపై చర్చించేందుకు ఐరాస భద్రతామండలి సమావేశమైంది. మాలీలో నివాసముంటున్న భారతీయులు ప్రస్తుతానికి ఇళ్లకే పరిమితం కావాలని ఆక్కడి భారత రాయబార కార్యాలయం సూచించింది. అత్యవసర సాయం కావాల్సివస్తే ఎంబసీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని ట్విటర్లో ప్రకటించింది. -
మెహబూబా నిర్బంధం మరో 3 నెలలు
శ్రీనగర్: పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. గత ఏడాది ఆగస్టులో కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన సందర్భంగా ప్రజా భద్రత చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న వారిలో మెహబూబా కూడా ఒకరు. ఆగస్టు 5వ తేదీ నాటికి ఆమె నిర్బంధకాలం ఏడాది పూర్తవుతుంది. దీంతో, మెహబూబా గృహ నిర్బంధాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన అధికార నివాసం శ్రీనగర్‌లోని ఫెయిర్‌వ్యూ బంగళాలో ఉన్నారు. మరోవైపు, జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజ్జాద్ గనీ లోన్‌ను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని లోన్ కూడా ట్విట్టర్ ద్వారా నిర్ధారించారు. ఆయన కూడా దాదాపు ఏడాదిపాటు నిర్బంధంలో ఉన్నారు. పలువురు ప్రధాన రాజకీయ నేతలు సహా నేషనల్ కాన్ఫరెన్స్ అగ్ర నేతలు ఫరూఖ్ అబ్దుల్లా ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. -
సీఎంను కలుస్తామంటే అరెస్టులా..?
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్లో కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించిన బీజేపీ ప్రతినిధి బృందాన్ని శుక్రవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితులను వివరించడానికి బీజేపీ నేతలు అపాయింట్మెంట్ కోరారు. అయితే సీఎంను కలవడానికి అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో బీజేపీ నేతృత్వంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌లతో కూడిన బృందం నేరుగా ప్రగతి భవన్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రగతి భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించి బీజేపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తుగా ప్రగతి భవన్‌కు వెళ్లే అన్ని దారుల్లోనూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. హౌస్ అరెస్ట్‌లపై బీజేపీ నేత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎంను కలుస్తామంటే అనుమతివ్వకుండా హౌస్ అరెస్ట్ చేయడం దారుణం. రాష్ట్రంలో పాలన ఉందా..? అంటూ ప్రశ్నించారు. కరోనా పరీక్షలు దేశంలోనే అత్యల్పంగా తెలంగాణలో జరగడం దారుణం. గాంధీలో కరోనా రోగులకు కనీస వసతులు కూడా లేవు. గాంధీ వెళ్లే కంటే స్మశానానికి వెళ్లడం మంచిదనే భావన కలుగుతోంది. చనిపోయిన శవాలను కూడా సరిగా ఇవ్వడం లేదంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగడం పరిపాటిగా మారింది. తెలంగాణలో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా..? ఆర్టికల్ 370 లాంటిది తెలంగాణలో అమలు జరుగుతోందా..? అంటూ మండిపడ్డారు. చదవండి: వారిని స్వదేశానికి తీసుకురండి డెత్ రేట్ దేశ సగటుకంటే తెలంగాణలో అధికంగా ఉంది. గచ్చిబౌలి టిమ్స్ ఏమైంది. ప్రస్తుతం అందులో పిల్లలు క్రికెట ఆడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలను పెంచి పేదల నడ్డి విరుస్తున్నారు. విద్యుత్ చార్జీలను రద్దు చేసి ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై కేంద్ర హోం శాఖ మంత్రికి లేఖ రాశాము. ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపించాలని లేఖలో కోరాము. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ' బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. చదవండి: గాంధీలో మళ్లీ అదే సీన్ -
కాంగ్రెస్ ‘చలో సెక్రటేరియట్’ భగ్నం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం, కరెంటు బిల్లుల మోత, నియంత్రిత సాగు పేరుతో సీఎం కేసీఆర్ నియంతృత్వ విధానానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్’కార్యక్రమం భగ్నం అయింది. గురువారం ఉదయం నుంచే హైదరాబాద్‌లో నివాసమున్న టీపీసీసీ ముఖ్య నేతలను వారివారి నివాసాల్లో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్రావు తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి దాదాపు సాయంత్రం వరకు పోలీసులు నాయకుల ఇళ్ల వద్దనే కాపలా ఉండి బయటకు రానీయలేదు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం: కేసీఆర్‌పై భట్టి ఫైర్ ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను కలవాలని అపాయింట్మెంట్ కోరిన తమను నిర్బంధించడం పట్ల సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. ప్రజాసమస్యలపై వారితరఫున ముఖ్యమంత్రిని, మంత్రులను అపాయింట్మెంట్ తీసుకుని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలవడం ప్రజాస్వామ్యంలో సర్వ సాధారణమని, కానీ ఇందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నయా ఫ్యూడలిస్ట్‌లా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. మూడు నెలలుగా తెలంగాణ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, తాజాగా కరెంట్ బిల్లుల మోతతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, కరోనాతో తెలంగాణ కల్లోలంగా మారుతోందని, రైతు బంధుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొందని, వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం తమ బాధ్యత అని చెప్పారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్, వ్యవసాయ శాఖ మంత్రులను కలిసేందుకు ఈ నెల 11న అపాయింట్మెంట్ కోరుతూ 9న లేఖ రాశామని, అపాయింట్మెంట్ ఇవ్వకపోగా పోలీసులను ఉపయోగించి తమ హక్కులను కాలరాసే ప్రయత్నం చేశారని విమర్శించారు. తాము ప్రజలచేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలమని, సచివాలయం కశ్మీర్ సరిహద్దుల్లో లేదని, తామేమీ ఉగ్రవాదులం కాదని భట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న నాయకులు మాత్రమే ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తారని, సీఎల్పీ నాయకుడిగా ప్రజల గొంతును, ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న తనను అణచివేసే కుట్రలను సహించేది లేదని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధుల హక్కులను హరించివేస్తున్న ఈ ప్రభుత్వంపై శాసనసభలో హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తానని చెప్పారు. దీనిపై సభలో న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. గురువారం బంజారాహిల్స్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసం వద్ద మోహరించిన పోలీసులు -
ఛలో సెక్రటేరియెట్‌కు కాంగ్రెస్ పిలుపు
-
కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బిల్లు పంపును నిరసిస్తూ కాంగ్రెస్ నేడు చలో సెక్రటేరియేట్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ సచివాయం వద్ద పోలీసులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు పోలీసులు భారీగా మోహరించారు. ముందస్తుగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, భట్టి విక్రమార్క, మల్రెడ్డి రంగారెడ్డి లను గృహ నిర్బంధం చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలపై కరెంట్ బిల్లుల భారం వేయడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. స్లాబులు పేరుతో అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. (కరోనా: జూలై నెలాఖరుకు పరిస్థితి తీవ్రం) కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన సాగిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అడ్డగోలు విద్యుత్ బిల్లులు, నియంతృత్వ వ్యవసాయ విధానం, కరోనాపై ముఖ్యమంత్రితో కలిసి చర్చించేందుకు అపాయిమెంట్ మాత్రమే అడిగామని, సచివాలయం ముట్టడికి పిలుపు ఇవ్వలేదన్నారు. కనీస సమాచారం కూడా లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంత అనాలోచిత పాలన ఎక్కడా లేదని దుయ్యబట్టారు. తాము ప్రజల పక్షాన మాట్లాడుతుంటే.. పాలన నిర్బంధం కొనసాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. నిర్బంధం ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడతారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. (స్వయం ప్రకటిత లాక్డౌన్లో ఐటీ) -
ప్రభుత్వానిది క్రూరమైన చర్య
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం గడువును మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఆమె మరో మూడు నెలలపాటు గృహ నిర్బంధంలోనే ఉండనున్నారు. ఈ నిర్ణయంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ఆమె ఏమీ చేయకపోయినా, నోరు విప్పి ఎలాంటి సందేశాలివ్వకపోయినా ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడమే కాక తన చర్యను సమర్థించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మడానికి కూడా వీలు లేనంత కౄరమైన చర్యగా అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని దశాబ్ధాల వెనక్కు నెట్టివేసిందనడానికి నిర్బంధం పొడిగింపే సజీవ సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. (ఒమర్ అబ్దుల్లా నిర్ణయం, ప్రధాని మోదీ ప్రశంసలు) జమ్ము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ప్రజా భద్రతా చట్టం కింద పలువురు నేతలకు గృహ నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. అందులో మెహబూబా ముఫ్తీతో పాటు ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లా, తదితరులు ఉన్నారు. వీరందరికీ పలు దఫాలుగా నిర్బంధం నుంచి విముక్తినిచ్చిన ప్రభుత్వం మెహబూబా ముఫ్తీతోపాటు అలీ మహమ్మద్ సాగర్, సర్తాజ్ మదానీల నిర్బంధం గడువును మూడు నెలలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా ఈ చట్టాన్ని ఒమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందించారు. కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. (‘మళ్లీ డిటెన్షన్..! ఇదంతా పక్కా ప్లాన్’) -
కరోనా పాజిటివా అయితే ఇంటికి తాళమే
సాక్షి, ముషీరాబాద్ : గతంలో ఏ ప్రాంతంలోనైనా ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలితే అధికారులు ఆ ఇంటి పరిసరాలను కంటైన్మెంట్గా ప్రకటిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించేవారు. వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను జీహెచ్ఎంసీ సిబ్బందే అందజేసేవారు. తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు ఈ విధానానికి స్వస్తి పలికారు. ప్రస్తుతం ఏ ఇంట్లోనైతే కరోనా పాజిటివ్ అని తేలిందో వారందరినీ ఇంట్లోనే ఉంచి బయట నుంచి తాళం వేసి, నిత్యావసర వస్తువుల కోసం సమీపంలోని కిరాణా షాపు, పాలబూత్‌ల ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. తాజాగా కవాడిగూడలోని భాగ్యలక్షి్మకాలనీలో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. (కిరాణ షాపులే కేంద్రంగా కరోనా విజృంభణ) -
నిర్బంధం నుంచి ఒమర్ అబ్దుల్లా విడుదల
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద ఆయనను 8 నెలల కింద గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు, ఆయన మద్దతుదారులు ఆయన ఇంటి ముందు మాస్కులు ధరించి ఎదురుచూశారు. 370 అధికరణ కింద జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన అనంతరం గతేడాది ఆగస్టు 5 నుంచి ఆయన ఆ రాష్ట్ర గెస్ట్ హౌస్ హరినివాస్‌లో ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కూడా 221 రోజుల నిర్బంధం నుంచి ఈ ఏడాది మార్చి 13న విడుదలయ్యారు. అయితే పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నిర్బంధం మాత్రం ఇంకా కొనసాగనుంది. -
నిర్బంధం నుంచి ఫరూక్ విడుదల
శ్రీనగర్: ఏడు నెలల నిర్బంధం అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా(82)కు విముక్తి లభించింది. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, ఐదుసార్లు పార్లమెంటు సభ్యుడూ అయిన ఎంపీ ఫరూక్ అబ్దుల్లాపై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్(పీఎస్ఏ)ను ప్రభుత్వం తొలగించింది. ఆర్టికల్ 370ని కేంద్రం ప్రభుత్వం రద్దుచేసిన అనంతరం ఆగస్టు 5వ తేదీన ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత సెప్టెంబర్ 15వ తేదీ నుంచి పబ్లిక్ సేఫ్టీ యాక్టు కింద ఫరూక్ అబ్దుల్లా గృహ నిర్బంధంలో ఉన్నారు. పీఎస్ఏ చట్టం ప్రయోగించిన తొలి ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాయే. పీఎస్ఏ చట్టం కింద నిర్బంధంలో ఉంచినట్టయితే మూడు నెలలపాటు ఎటువంటి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉండదు.అలాగే ఈ నిర్బంధాన్ని 2 ఏళ్ల పాటు కొనసాగించే అవకాశం కూడా చట్టం ఇస్తుంది. శ్రీనగర్‌లోని గప్కార్ రోడ్డులోని తన నివాసం నుంచి బయటికి వచ్చిన ఫరూక్ అబ్దుల్లా.. నిర్బంధంలో ఉన్న తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘ఈ రోజు నేను విముక్తిడినయ్యాను. ఈ స్వేచ్ఛ సంపూర్ణం కాదు. ఒమర్, మెహబూబా ముఫ్తీ సహా ఇతర జైళ్ళల్లో నిర్బంధించిన వారందరినీ విముక్తి చేసినప్పుడే అది సంపూర్ణం అవుతుంది’అని మీడియాతో అన్నారు. ‘నా విడుదల కోసం ప్రార్థించిన ప్రతి వ్యక్తికీ కృతజ్ఞతలు. మిగిలిన వారంతా విడుదలయ్యే వరకూ ఏ రాజకీయాలను గురించీ మాట్లాడను. ఇటీవలే కంటికి సంబంధించిన సర్జరీ చేయించుకున్న ఫరూక్ అబ్దుల్లా ప్రజల గొంతుకను వినిపించేందుకు పార్లమెంటు సమావేశాలకు హాజరవుతానన్నారు. ఫరూక్ అబ్దుల్లా విడుదలను స్వాగతించిన నేషనల్ కాన్ఫరెన్స్ నిర్బంధంలో ఉన్న మిగిలిన వారిని విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. -
‘మాజీ సీఎంల విడుదల కోరుతూ తీర్మానం’
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ నిర్బంధంలో మగ్గుతున్న ముగ్గురు జమ్ము కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఎనిమిది విపక్ష పార్టీలు సంయుక్త తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాయి. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో గత ఏడాది ఆగస్ట్ నుంచి ముగ్గురు మాజీ సీఎంలతో పాటు పలువురు రాజకీయ నేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. నరేంద్ర మోదీ పాలనలో ప్రజాస్వామ్యయుతంగా వెలిబుచ్చే నిరసనలపై ఉక్కుపాదం మోపుతున్నారని, రాజ్యాంగ హక్కులైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వ హక్కులను కాలరాస్తున్నారని తీర్మానం ఆందోళన వ్యక్తం చేసింది. జమ్ము కశ్మీర్లో గృహనిర్బంధంలో మగ్గుతున్న ముగ్గురు మాజీ సీఎంలతో పాటు ఇతర రాజకీయ నేతలందరినీ తక్షణమే విడుదల చేయాలని తీర్మానం కోరింది. చదవండి : ఒమర్ నిర్బంధంపై సుప్రీం నోటీసులు -
కశ్మీర్ నేతలకు మరోషాక్!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ(పీడీపీ)లపై కఠినమైన ప్రజా భద్రత చట్టం(పబ్లిక్ సేఫ్టీ యాక్ట్–పీఎస్ఏ) కింద గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. వారిద్దరి ఆరు నెలల ముందస్తు నిర్బంధం ముగియడానికి కొన్ని గంటల ముందు వారిపై ఈ కేసు పెట్టడం గమనార్హం. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన 2019, ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆ ఇద్దరు నేతలు గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. పోలీసులతో పాటు వచ్చిన మెజిస్ట్రేట్ సంబంధిత నోటీసులను వారి నివాసాల్లో ఆ ఇద్దరు నేతలకు అందించారు. ఆ ఇద్దరితో పాటు శ్రీనగర్‌లో మంచి పట్టున్న నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అలీ మొహమ్మద్ సగర్‌పై, పీడీపీ కీలక నేత సర్తాజ్ మదానీపై కూడా పీఎస్ఏ కింద నోటీసులు జారీ చేశారు. మదానీ మెహబూబా ముఫ్తీకి మామ అవుతారు. పీఎస్‌ఏలోని ‘పబ్లిక్ ఆర్డర్’ సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా ఆరు నెలలు, ‘రాజ్య భద్రతకు ప్రమాదం’ అనే సెక్షన్ ప్రకారం విచారణ లేకుండా రెండు సంవత్సరాల వరకు అనుమానితులను నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ చట్టం ఒమర్ అబ్దుల్లా తాత షేక్ అబ్దుల్లా హయాంలో 1978లో రూపొందింది. ముఖ్యంగా కలప స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. -
ఒమర్, ముఫ్తీలను వీడనున్న చెర..
శ్రీనగర్ : స్టేట్ గెస్ట్ హౌస్‌లో గృహ నిర్బంధంలో ఉన్న జమ్ము కశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను వారి ఇళ్లకు తరలించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్ట్ 5న మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దును ప్రకటించినప్పటి నుంచి వీరిని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా ఈ వారాంతంలో ఇరువురు నేతలను వారి ఇళ్లకు తరలించే ప్రక్రియ చేపట్టవచ్చని భావిస్తున్నారు. అయితే వీరిని ఇంకా హౌస్ అరెస్ట్‌లో ఉంచుతారా లేక విడుదల చేస్తారా అనేది అధికారులు ధ్రువీకరించలేదు. మరోవైపు ఎమ్మెల్యే హాస్టల్ నుంచి నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలు సజద్ లోన్, వహీద్ పరాలను బుధవారం విడుదల చేశారు. వీరితో పాటు సీనియర్ ఎన్సీ నేత అలి మహ్మద్, పీడీపీ నేత సర్తాజ్ మద్నీలను ఎమ్మెల్యే హాస్టల్ నుంచి మరో ప్రాంతానికి తరలించారు. అధికారుల నిర్బంధంలోకి వెళ్లిన తర్వాత తొలిసారిగా జనవరి 25న బహిర్గతమైన ఒమర్ అబ్దుల్లా తెల్లని గడ్డంతో ఉన్న తొలి ఫోటో ఆయనను గుర్తు పట్టలేనంతగా ఉండటంతో నెటిజన్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చదవండి : ఈ మాజీ సీఎం ఎవరో గుర్తుపట్టారా? -
ఈ గడ్డం మనిషిని గుర్తుపట్టారా?
న్యూఢిల్లీ: బారు గడ్డంతో చిరునవ్వు చిందిస్తున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా..? ఈయన ఒమర్ అబ్దుల్లా. జమ్మూ, కశ్మీర్ మాజీ సీఎం. ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో యువకుడిలా ఉండే ఒమర్ తాజా ఫొటో ఇది. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి (ఆర్టికల్ 370)ని కేంద్రం గతేడాది ఆగస్టులో తొలగించడం తెల్సిందే. అప్పట్నుంచి కశ్మీర్ ముఖ్యనేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. వారిలో ఒమర్ ఉన్నారు. అప్పట్నుంచి గడ్డం తీయకపోవడంతో ఒమర్ ఇలా కొత్త వేషంలో కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ఈ మాజీ సీఎం ఎవరో గుర్తుపట్టగలరా?
న్యూఢిల్లీ: తెల్లటి గుబురు గడ్డం, ముడతలు పడిన కళ్లు వయసు మళ్లిన వ్యక్తిలా కనిపిస్తున్న ఈ నాయకుడిని గుర్తు పట్టారా? ముఖంతో చిరునవ్వుతో ఈ ఫొటోలోని వ్యక్తిని మొదట చూసినవారు ఎవరైనా ఆయన సాహసికుడని అనుకుంటారు. మంచు కొండల్లో చిక్కుపోయి చాలా కాలం తర్వాత వెలుగులోకి వచ్చినట్టు కూడా అనిపించవచ్చు. అయితే ఇందులో కొంతమేరకు వాస్తవం ఉంది. ఈ ఫొటోలో ఉన్నది మరెవరో కాదు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఎప్పుడూ నున్నటి గడ్డంతో కనిపించే ఆయనను ఇలా పోల్చుకోవడం కష్టమే. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన ఫొటో బయటి ప్రపంచానికి కనిపించింది. కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత గతేడాది ఆగస్టు నుంచి శ్రీనగర్‌లో ఆయనను గృహనిర్బంధంలో ఉంచారు. అప్పటి నుంచి బయట ప్రపంచంతో ఆయనకు సంబంధాలు లేకుండా పోయాయి. అక్టోబర్‌లో కొంచెం పెరిగిన గడ్డంతో ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అప్పుడు ఆయనను గుర్తుపట్టేలా ఉన్నారు. కానీ ఇప్పుడు గడ్డం ఎక్కువగా పెరగడంతో ఆయనను పోల్చుకోవడం కష్టం. గృహనిర్బంధం నుంచి బయటకు వచ్చే వరకు గడ్డం తీయరాదని ఒమర్ నిర్ణయించుకున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మార్చి 10న ఆయన 50వ పడిలోకి అడుగుపెట్టనున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫొటోలో మాత్రం ఆయన వయసు మళ్లిన వృద్ధుడిలా కన్పిస్తున్నారని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. ‘ఒమర్ అబ్దుల్లా ఆరు నెలలుగా నిర్బంధంలో ఉన్నారు. కానీ తాజా ఫొటోలో ఆయనను చూస్తుంటే 30 ఏళ్లు గడిచిపోయినట్టుగా కన్పిస్తున్నార’ని సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ అశోక్ దామిజా పేర్కొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్, ఒమర్ అబ్దుల్లాతో రాజకీయ విభేదాలున్నా ఆయనను ఇంతకాలం నిర్బంధంలో ఉంచడాన్ని ఖండిస్తున్నానని ప్రముఖ కాలమిస్ట్, రాజకీయ విశ్లేషకుడు జునైద్ ఖురేషీ అన్నారు. ఎటువంటి నేరారోపణలు లేకుండా మాజీ ముఖ్యమంత్రిని ఆరు నెలలుగా నిర్బంధంలో ఉంచడాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీ మద్దతుదారులు మాత్రం ఒమర్ ఫొటోపై వ్యంగ్యంగా స్పందించారు. కశ్మీర్లో జరుగుతున్న పరిణామాలపై ఆయన సంతోషంగా ఉన్నారనడానికి ఒమర్ ముఖంలో చిరునవ్వే రుజువని వ్యాఖ్యానిస్తున్నారు. నిర్బంధంలో ఉన్న ఒమర్ మళ్లీ ట్విటర్‌లోకి వచ్చారని చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేత సల్మాన్ సోజ్ ఖండించారు. ప్రధాన రాజకీయ నాయకులకు కశ్మీర్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేదని వెల్లడించారు. కాగా, ఒమర్‌తో పాటు ఆయన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు కూడా గృహనిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. (చదవండి: భూతల స్వర్గం నరకంగా మారిన వేళ..) -
ముగ్గురు ఆడపిల్లలను కనడమే నేరమైంది..
బొమ్మలసత్రం: ముగ్గురు ఆడపిల్లలకు జన్మనివ్వటమే ఆమె పాలిట శాపమైంది.. మూడు రోజులుగా ఆమెకు అన్నం, నీళ్లు ఇవ్వకుండా భర్త గృహ నిర్బంధంలో ఉంచాడు. చివరికి బంధువుల రాకతో ఆమె ప్రాణాలతో బయటపడింది. కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాబోలుకు చెందిన మీసమ్మకు, బేతంచర్ల మండలం సిమెంట్‌నగర్‌కు చెందిన సుధాకర్‌తో 18 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురూ ఆడపిల్లలు పుట్టడంతో భార్యను భర్త వేధింపసాగాడు. పదేళ్ల కిందట సుధాకర్.. భార్య, పిల్లలతో కాపురాన్ని నంద్యాల పట్టణంలోని బొమ్మలసత్రానికి మార్చి ఓ టైలర్‌షాపులో పనిచేస్తున్నాడు. పిల్లలకు, తనకు మాత్రమే భోజనం వండుకుని భార్యను పస్తులుంచేవాడు. విషయం తెలుసుకున్న మీసమ్మ తండ్రి.. సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో ఆమెను పనిలో పెట్టాడు. మీసమ్మ కూడా తన అన్నం తానే వండుకు తినేది. ఈ క్రమంలో మీసమ్మ మానసిక పరిస్థితి దెబ్బతింది. ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలని ఆమె తల్లిదండ్రులను వేధించసాగాడు. మంగళవారం భార్యను ఇంట్లో నిర్బంధించి పిల్లలను బడికి పంపి తానూ టైలర్‌షాప్‌నకు వెళ్లిపోయాడు. మీసమ్మ గట్టిగా కేకలు వేసినా తలుపులు తీయకుండా అలాగే ఉంచాడు. గురువారం మీసమ్మ బంధువులు ఇంటికి రావడంతో విషయం వెలుగులోకొచ్చింది. కూడూనీళ్లూ లేకుండా పడి ఉన్న మీసమ్మను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భర్త వేధింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఫరూక్ అబ్దుల్లా నిర్బంధం పొడిగింపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా గృహనిర్బంధాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. సబ్‌జైలుగా ప్రకటించిన ఆయన నివాసంలోనే మరో మూడు నెలలపాటు ఫరూక్ అబ్దుల్లా నిర్బంధంలో ఉంటారని అధికారులు చెప్పారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని ఎత్తివేస్తూ, ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర నిర్ణయం తీసుకున్నాక ఫరూక్‌ను ఆగస్టు 5వ తేదీ నుంచి గృహ నిర్బంధంలో(ప్రజా భద్రతా చట్టం కింద) ఉంచారు. -
తొలిరోజే ఆందోళనలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికింది. లోక్ సభ సభ్యుడు, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఫరూఖ్ అబ్దుల్లాను గృహ నిర్బంధం చేయడం సహా పలు అంశాలను విపక్షాలు లేవనెత్తాయి. సభ ప్రారంభం కాగానే, కొత్తగా ఎన్నికైన నలుగురు సభ్యులు ప్రిన్స్ రాజ్(ఎల్జేపీ), హిమాద్రి సింగ్(బీజేపీ), శ్రీనివాస్ దాదాసాహెబ్ పాటిల్(ఎన్సీపీ), డీఎం కాతిర్ ఆనంద్(డీఎంకే) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, ఇటీవల మృతి చెందిన మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రామ్ జెఠ్మలానీ సహా 10 మంది పార్లమెంటు సభ్యులకు నివాళులర్పించారు. ఆ వెంటనే, కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఆపేయాలని నినాదాలు చేశారు. వారితో పాటు ఎన్సీ సభ్యులు తమ నేత ఫరూఖ్ అబ్దుల్లాను ఆయన ఇంట్లోనే నిర్బంధించడంపై నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తరువాత సభ్యులకు అవకాశమిస్తామని స్పీకర్ ఓం బిర్లా చెప్పినా వారు పట్టించుకోలేదు. ఈ గందరగోళం మధ్యనే ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత నేషనల్ కాన్ఫరెన్స్ సహా విపక్ష నేతలను గృహ నిర్బంధం చేయడాన్ని పలువురు సభ్యులు ప్రశ్నించారు. తక్షణమే ఎన్సీ నేత ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేసి, సభకు హజరయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. కశ్మీర్‌లోకివిపక్ష సభ్యులను అనుమతించకుండా.. ఈయూ పార్లమెంటేరియన్లను అనుమతించడాన్ని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి ఖండించారు. పీడీపీ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీపై పోలీసులు దాడిచేసి, అమానవీయంగా ప్రవర్తించారని ఆమె కుమార్తె చెప్పారని డీఎంకే సభ్యుడు బాలు ప్రస్తావించారు. గత సమావేశాలు అద్భుతం పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ శీతాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగుతాయన్న విశ్వాసం తనకుందన్నారు. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘భారత రాజ్యాంగం ఐక్యత, సమగ్రత, వైవిధ్యతల సమాహారం. దేశాన్ని ముందుకు నడిపే చోదక శక్తి రాజ్యాంగం’ అని పేర్కొన్నారు. గత సమావేశాలు అద్భుతంగా జరిగాయని పేర్కొన్నారు. -
టీఎస్ఆర్టీసీ జేఏసీ నేతల హౌస్ అరెస్ట్
-
ఉద్రిక్తం: జేఏసీ నేతల హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల జేఏసీ శనివారం తలపెట్టిన బస్‌రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. కార్మికులు కార్యక్రమానికి పోలీసు శాఖ నుంచి అనుమతులు రాలేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని బీఎన్‌రెడ్డి నగర్లో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. మరోనేత రాజిరెడ్డి సైతం గృహ నిర్బంధం చేశారు. నేతల ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు వారి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరకుంటున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే బస్‌రోకోకు ఎలాంటి అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగానే పలువురు నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్‌ల పరంపర కొనసాగుతోంది. దీనిపై సిటీ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. నగరంలోని బస్ భవన్‌తో పాటు డిపోల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఇది శనివారం తెల్లవారుజామున 3గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3గంటల వరకు వర్తిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రూపులుగా ఏర్పడి ఆందోళన చేయొద్దని, బస్సుల రాకపోకలు అడ్డుకుంటే ఉపేక్షించబోమన్నారు. నగరంలో ఇలాంటి చర్యల వల్ల విద్య, వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులు కలుగుతాయని, నిబంధనలు పాటించాలని సూచించారు. -
ఫరూక్‌తో ఎన్సీ బృందం భేటీ
శ్రీనగర్/ ఇస్లామాబాద్: కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు తర్వాత తొలి కీలక రాజకీయ పరిణామం సంభవించింది. గవర్నర్ సత్యపాల్ మాలిక్ అనుమతి మేరకు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేతలు గృహ నిర్బంధంలో ఉన్న పార్టీ అగ్ర నేతలు ఫరూక్, ఒమర్ అబ్దుల్లాలతో ఆదివారం ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. జమ్మూ ప్రొవెన్షియల్ ఎన్సీ చీఫ్ దేవీందర్ సింగ్ రాణా నేతృత్వంలోని 15 మంది నేతల బృందం వారితో రాష్ట్రంలో పరిణామాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించింది. కేంద్రం ఆర్టికల్ 370 రద్దు ప్రకటన విడుదల చేసిన తర్వాతి రోజు ఆగస్టు 5 నుంచి మాజీ సీఎంలు, ఎన్సీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా తదితర ప్రధాన పార్టీల నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఎన్సీ నేతలు మొదటగా ఒమర్ అబ్దుల్లాతో అరగంటపాటు సమావేశమయ్యారు. గడ్డంతో కొత్తగా కనిపించిన తమ నేతతో వారంతా సెల్ఫీలు తీసుకున్నారు. ఆ తర్వాత ఫరూక్ అబ్దుల్లాను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం రాణా మీడియాతో మాట్లాడుతూ.. తమ నేతలు ప్రజలపై ఆంక్షల విషయంలో కలత చెందుతున్నారని తెలిపారు. ‘రాష్ట్రం మొత్తం దిగ్బంధంలో ఉంది. మా పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) చట్టం కింద నిర్బంధించారు. ఆయన లేకుండా ఎన్నికల మేనిఫెస్టో ఎలా సాధ్యం? నేతలను వెంటనే విడుదల చేయాలి’అని పేర్కొన్నారు. నేడు మెహబూబాతో సమావేశం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీతో సోమవారం భేటీ అయ్యేందుకు ఆ పార్టీకి చెందిన 10 మంది నేతల బృందానికి నిర్బంధంలో ఉన్న పార్టీ గవర్నర్ అనుమతించారు. -
హౌస్ అరెస్ట్ నుంచి నేతలకు విముక్తి
శ్రీనగర్ : స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో జమ్ములో గృహనిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలను బుధవారం విడుదల చేశారు. వీరిపై నెలకొన్న నియంత్రణలనూ అధికారులు ఎత్తివేశారు. బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్‌కు ఎన్నికలు ప్రకటించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 370 కరద్దు అనంతరం జమ్మూ కశ్మీర్లో మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు రాజకీయ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో దేవేందర్ సింగ్ రాణా (నేషనల్ కాన్ఫరెన్స్) హర్షదేవ్ సింగ్ (నేషనల్ ప్యాంథర్స్ పార్టీ) రామన్ భల్లా (కాంగ్రెస్) సహా పలువురు నేతలు బుధవారం విడుదలయ్యారు. స్ధానిక ఎన్నికల్లో పాల్గొనేందుకు రాజకీయ నిర్బంధంలో ఉన్న నేతలందరినీ విడుదల చేయాలని జమాతే ఇస్లామి హింద్ మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జమ్ము కశ్మీర్‌లోని 310 బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిళ్లకు అక్టోబర్ 24న ఎన్నికలు జరగనున్నాయి. -
ఫరూక్‌ను చూస్తే కేంద్రానికి భయమా!?
సాక్షి, న్యూఢిల్లీ : గత నెల పదిహేను రోజులుగా గృహ నిర్బంధంలో ఉంచిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లాపై కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా సోమవారం కశ్మీర్‌కే పరిమితమైన ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగించింది. ఆయన్ని అరెస్ట్ చేసి, ఆయన ఇంటినే జైలుగా మార్చింది. ఆయన తరఫున దాఖలైన ‘హబియస్ కార్పస్’ పిటిషన్ విచారణకు రానున్న ఒక రోజు ముందు కేంద్రం ఈ చర్య తీసుకోవడం ప్రజాస్వామ్య వాదులకు ఆశ్చర్యం కల్గిస్తోంది. ఈ ప్రజా భద్రత చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా ఎవరినై రెండేళ్లపాటు జైల్లో ఉంచొచ్చు. ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా హయాంలో (1978లో) కలప స్మగ్లర్లను అణచివేయడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే రానురాను కశ్మీర్ వేర్పాటువాదులను అణచివేసేందుకు దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు. ముఖ్యంగా 1990, 2008, 2010, 2016లలో కశ్మీర్లో జరిగిన ఆందోళనలను అణచివేసేందుకు కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఆ సందర్భంగా దాదాపు ఆరువేల మందిని అరెస్ట్ చేసి వారిలో 327 మంది వేర్పాటువాదులపై చార్జిషీట్లను కూడా దాఖలు చేశారు. ఈ చట్టాన్ని సుప్రీం కోర్టు ‘లాలెస్ లా (చట్టరహిత చట్టం)’ అని వ్యాఖ్యానించింది. ఈ చట్టం కింద అదుపులోకి తీసుకున్న వారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో పది రోజుల వరకు కూడా పోలీసులు వెల్లడించాల్సిన అవసరం లేదు. 1989లో శ్రీనగర్‌లో జరిగిన అల్లర్ల దశ్యం ‘ప్రజా భద్రత’ పేరిట ఆ తర్వాత కూడా ఎలాంటి కారణం చూపకుండానే పొడిగించవచ్చు. అయితే నాలుగు వారల లోపల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బోర్డు ముందు నిర్బంధితులను హాజరు పరిచి కేసును సమీక్షించాలి. ఈ బోర్డులో అర్హత కలిగిన జడ్జీలను లేదా అర్హత లేని జడ్జీలను కూడా నియమించవచ్చు. బోర్డులోని జడ్జీలు లేదా సభ్యుల వివరాలను బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు. నిర్బంధితులకు తమ తరఫున న్యాయవాదులను నియమించుకునే అవకాశం కూడా లేదు. సాధారణంగా ‘జాతీయ భద్రత’ పేరిట ఎవరినైనా ఆరు నెలలపాటు నిర్బంధించవచ్చు. దీన్ని రెండేళ్లపాటు ఏకపక్షంగా పొడిగించవచ్చు. ఈ నిర్బంధాన్ని కోర్టు ఎన్నిసార్లు కొట్టివేసినా తాజా ఉత్తర్వుల ద్వారా నిర్బంధాన్ని ఎంతకాలమైనా పొడిగించవచ్చు. 20 ఏళ్లకుపైగా జైల్లో ఉన్న మసరత్ ఆలమ్ భట్ 1990 దశకంలో ముస్లిం లీగ్ నాయకుడు, వేర్పాటు వాది మసరత్ ఆలమ్ భట్‌పై 37 సార్లు ఈ ప్రజా భద్రతా చట్టాన్ని (పీఎస్ఏ)ను ప్రయోగించడంతో ఆయన ఏకంగా 20 ఏళ్లపాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. కలప దొంగల అణచివేత కోసం తీసికొచ్చిన ఈ చట్టం కింద రాజకీయ నాయకులతోపాటు కశ్మీర్ బార్ అసోసియేషన్ చైర్మన్ సహా న్యాయవాదులను, కశ్మీర్ వాణిజ్య మండలి సభ్యులు సహా వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వీరిలో ఎవరు ప్రజాందోళనలు నిర్వహించిన వారు కాదు, ప్రజా భద్రతకు ముప్పు తెచ్చిన వాళ్లు కాదు. ముదుసలి వయస్సులో ఫారూక్ అబ్దుల్లాను అరెస్ట్ చేయడం అంటే మున్ముందు ఆయన ఏ ముప్పు తెస్తాడో ఏమోనని కేంద్రం భయపడుతుండడమేనని ప్రజాస్వామ్య వాదులు వ్యాఖ్యానిస్తున్నారు. -
బాపురావు గృహ నిర్బంధం అన్యాయం
సాక్షి, ఆసిఫాబాద్: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును గృహ నిర్భందించడం అన్యాయమని ఆదివాసీలు, తుడుందెబ్బ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కెరమెరి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ దిష్టిబొమ్మణు దహనం చేశా రు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ సమస్యల పరిష్కారం, ఆత్మీయ సభకు వెళ్తున్న ఎంపీ బాపూరావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇది ప్రభుత్వ కుట్రలో భాగమేనన్నారు. ప్రభుత్వం లంబాడాలకు వత్తాసు పలుకుతుందని పేర్కొన్నారు. అనాథి నుంచి ఉంటున్న ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. గిరిజన శాఖ మంత్రిగా ప్రమా ణం స్వీకరాం చేసిన ఒక్క రోజులోనే సత్యవతి రాథోడ్ తన ప్రతాపాన్ని చూపుతున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఈ ఆందోళనలో నాయకులు కోవ విజయ్, భీంరావు, తుకారాం, ప్రభాకర్, దర్మూ, భీంరావు తదితరులున్నారు. -
సూడాన్‌లో సైనిక తిరుగుబాటు
ఖార్టూమ్: ఆఫ్రికా దేశం సూడాన్‌లో సైనిక తిరుగుబాటు జరిగింది. దేశాన్ని దాదాపు మూడు దశాబ్దాలపాటు పాలించిన అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్(75)ను పదవీచ్యుతుడిని చేసి, గృహ నిర్బంధంలో ఉంచినట్లు గురువారం సైన్యం ప్రకటించింది. ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ రాజధాని ఖార్టూమ్ వీధుల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సైన్యంలో బ్రిగేడియర్‌గా ఉన్న బషీర్ 1989లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దె దింపి, అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆఫ్రికాలో ఎక్కువ కాలం అధికారం చెలాయించిన పాలకుల్లో ఒకరైన బషీర్.. ఇస్లామిక్ తీవ్రవాదుల అండతో నియంతృత్వ విధానాలను అవలంభించారు. అల్‌ఖాయిదా చీఫ్ బిన్‌లాడెన్ వంటి వారు 1996 వరకు సూడాన్‌లోనే ఆశ్రయం పొందారు. బషీర్ విధానాల కారణంగా దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది. దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఊచకోతకు గురికాగా, 2.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అనంతరం దేశం నుంచి ఉత్తర సూడాన్ విడిపోయింది. -
సాక్షి ఫొటోగ్రాఫర్‌పై పోలీసుల నిర్బంధకాండ
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో ఉన్న సాక్షి ఫొటో జర్నలిస్టుపై పోలీసులు నిర్బంధకాండకు పాల్పడ్డారు. తాను సాక్షి ఫొటోగ్రాఫర్‌నని చెప్పినా.. అందుకు సంబంధించిన గుర్తింపు కార్డులు చూపినా పోలీసులు వినిపించుకోలేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశాలతో శుక్రవారం మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి గంటల తరబడి అక్రమంగా నిర్బంధించారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు పోలీసుస్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో పోలీసులు దిగివచ్చారు. సాక్షి ఫొటోగ్రాఫర్ విజయకృష్ణను విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేయాలని శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు విధుల నుంచి రిలీవ్ కావాల్సి ఉంది. అదే సమయంలో ఇంటెలిజెన్స్ పోలీసుల వాహనాల్లో టీడీపీ అభ్యర్థులకు భారీఎత్తున డబ్బుల సంచులు చేరవేస్తున్నారనే సమాచారం రావడంతో అక్కడ సాక్షి ఫొటోగ్రాఫర్ విజయకృష్ణ కెమేరాతో వేచి ఉన్నారు. అతన్ని గమనించిన ఇంటెలిజెన్స్ సిబ్బంది కెమేరా లాక్కొని కార్యాలయంలోనికి తీసుకెళ్లి నిర్బంధించారు. కెమేరాలోని ఫొటోలన్నీ డిలీట్ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఫొటోలతోపాటు మరికొన్ని ముఖ్యమైన ఫొటోలున్నాయని ఫొటోగ్రాఫర్ బదులిచ్చారు. అయినా బెదిరించిన ఇంటెలిజెన్స్ సిబ్బంది కెమేరా లాక్కొని వారి సొంత ఫొటోగ్రాఫర్‌తో చిప్ ఫార్మెట్(ఫొటోలు డిలీట్) చేయించారు. అక్కడితో ఆగకుండా ఫొటోగ్రాఫర్ నుంచి గుర్తింపు కార్డులను, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. లోకల్ పోలీసులకు అప్పగించాం.. విషయం తెలుసుకున్న సాక్షి స్టేట్బ్యూరో ఇన్చార్జి ఎన్.వెంకటరెడ్డి ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు. సాక్షి ఫొటోగ్రాఫర్‌ను ఇంటెలిజెన్స్ ఆఫీసు వద్ద పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారని, ఎందుకు తీసుకున్నారో చెప్పాలంటూ మాట్లాడుతుండగానే.. మేము లోకల్ పోలీసులకు అప్పగించాం. అక్కడ మాట్లాడుకోండంటూ ఫోన్ కట్ చేశారు. అనంతరం విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును ఫోన్లో సంప్రదించగా తనకు సమాచారం లేదని, తెలుసుకుంటానని జవాబిచ్చారు. బాస్‌ల డైరెక్షన్.. పోలీసుల యాక్షన్.. మాచవరం పోలీసులు ఇంటెలిజెన్స్ పోలీస్ బాస్ డైరెక్షన్లో ఓవరాక్షన్ చేశారు. గుర్తింపు కార్డులు పరిశీలించిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగానే నిర్బంధించారు. విషయం తెలిసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన పలువురు జర్నలిస్టులు ఫొటోగ్రాఫర్‌ను నిర్బంధించడాన్ని తప్పుబట్టారు. ఫొటోగ్రాఫర్‌ను వదిలిపెట్టడానికి పోలీసులు నిరాకరిస్తూ.. తమ బాస్‌ల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. జర్నలిస్టులు సీఐ వచ్చాక మాట్లాడగా.. అక్కడకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో లెటర్ రాసిస్తే విడిచిపెడతామని ఆయన మెలికపెట్టారు. ఏ తప్పూ లేనప్పుడు ఎందుకు లెటర్ రాసివ్వాలని ప్రశ్నించిన జర్నలిస్టులు అక్రమ నిర్బంధానికి నిరసనగా మాచవరం పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఫొటోగ్రాఫర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో సీఐ శ్రీనివాస్ యాదవ్.. పోలీస్ కమిషనర్, ఇతర పోలీస్ బాస్‌లతో మాట్లాడి ఫొటోగ్రాఫర్‌ను విడిచిపెట్టారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి... ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకట్రావు తప్పుబట్టారు. మాచవరం పోలీస్‌స్టేషన్ ఎదుట జరిగిన ఆందోళన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ఫొటో జర్నలిస్టును కావాలనే నిర్బంధించారని, తాను జర్నలిస్టునని గుర్తింపుకార్డు చూపాక కూడా దౌర్జన్యానికి పాల్పడటం సరైంది కాదని అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శాంతిశ్రీ,, సాక్షి స్టేట్ బ్యూరో ఇన్చార్జి ఎన్.వెంకటరెడ్డి, సాక్షి ఫొటో ఎడిటర్ కె.రవికాంత్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు సి.మాణిక్యాలరావు, మల్లు విశ్వనాథరెడ్డి, ఆకుల అమరయ్య, సీహెచ్ శ్రీనివాసరావు, జీపీ వెంకటేశ్వర్లు, వనం దుర్గాప్రసాద్, డొక్కా రాజగోపాల్లతోపాటు పలువురు జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులు, స్థానిక విలేకరులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుల గృహ నిర్భందం
సాక్షి, దెందులూరు(పశ్చిమ గోదావరి): ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు వ్యవహరశైలి పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు హద్దుమీరి ప్రవర్తిస్తున్న కూడా పట్టించుకుని పోలీసులు.. ప్రతిపక్ష పార్టీ నాయకులు నిరసన కూడా తెలుపకముందే వారిని నిర్భందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరు ఇదే విధంగా కొనసాగుతుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఇలాంటి ఘటనే పునరావృతమైంది. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం జరిగిన ఓ సభలో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్సీపీ నాయకులను అసౌకర్యానికి గురిచేస్తున్నారు. వారి కార్యకలాపాలకు అడ్డుపడుతూ ఇబ్బంది కలిగిస్తున్నారు. తద్వారా పార్టీ శ్రేణులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. బుధవారం ఉదయం వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అబ్బయ్య చౌదరిని ఏలూరులోని పార్టీ కార్యాలయానికి బయలుదేరుతుండగా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సరైన కారణం లేకుండా తనను హౌజ్ అరెస్ట్ చేయడంపై అబ్బయ్య చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేని అరెస్ట్ చేయకుండా.. తనను హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన పోలీసులను సూటిగా ప్రశ్నించారు. చింతమనేని వ్యాఖ్యలపై తాము ఎటువంటి నిరసనలకు పిలువునివ్వకపోయినప్పటికీ.. ఏదో ఊహించుకుని ఇలా వ్యవహరించడం దారుణమని అన్నారు.(మరోసారి రెచ్చిపోయిన చింతమనేని.. ఉద్రిక్తత) -
పిల్లలు పుట్టడం లేదని భార్యను..
సాక్షి, వైఎస్సార్: కడపలో అమానుషం చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని గౌసియా అనే మహిళను ఆమె భర్త ఇంట్లో బంధించాడు. గౌసియాకు ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు పిల్లలు పట్టకపోవడంతో భర్త మరో వివాహం కూడా చేసుకున్నాడు. తన మొదటి భార్య గురించి ఎవ్వరికీ తెలియకూడదని బూత్ బంగ్లా లాంటి ఇంట్లో ఒంటరిగా బంధించాడు. భర్త బంధించడంతో గతకొద్ది రోజులుగా ఆమె చీకటి జీవితం అనుభవిస్తోంది. విషయం తెలుసుకున్న గౌసియా కుటుంబ సభ్యులు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రంగ ప్రవేశం చేసిన అధికారులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
వైఎస్ఆర్సీపీ నేతల హౌజ్ అరెస్ట్
-
పోలీస్ వలయంలో సిర్రాజుపల్లి..
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని సిర్రాజుపల్లి గ్రామంలో అదివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చట్టాలను గౌరవించాల్సిన పోలీసు యంత్రాంగం వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎం హర్షవర్థన్రెడ్డిలను హౌస్ అరెస్టు చేశారు. ఇప్పటి వరకు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులుగా చెలామణి అవుతున్న రంగసాయిపు గ్రామంలోని ఒకరిద్దరు మంత్రి ఆదినారాయణరెడ్డి వర్గంలో చేరాలని నిర్ణయించారు. గ్రామంలో ఆదివారం విందు ఏర్పాటు చేసి మంత్రిని ఆహ్వనించారు.పక్కనే సిర్రాజుపల్లి గ్రామ ఉంది. ఇది మాజీ మంత్రి డాక్టరు మైసురారెడ్డి స్వగ్రామం. వైఎస్సార్ సీపీ నాయకులు డాక్టరు సుధీర్‌రెడ్డి, హర్షవర్థన్‌రెడ్డి నిడుజివ్వి గ్రామం నుంచి వారి స్వగ్రామమైన సిర్రాజుపల్లికి వెళ్లేందుకు బయలుదేరారు. అప్పటికే గ్రామం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మా స్వగ్రామానికి వెళ్లేందకు అభ్యంతరం ఏమిటని డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం హర్షవర్థన్‌రెడ్డి పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.ఎట్టకేలకు పోలీసు వలయాన్ని ఛేదించుకొని సుధీర్‌రెడ్డి, హర్షవర్థన్‌రెడ్డి సిర్రాజుపల్లి గ్రామానికి వెళ్లారు. అనంతరం పోలీసులు వారి వద్దకు వెళ్లి మంత్రి ఆదినారాయణరెడ్డి ఇదే గ్రామానికి వస్తున్నారని, అందువల్ల మీరు గ్రామాన్ని వదిలి వెళ్లాలని పట్టుపట్టారు.సుధీర్‌రెడ్డి, హర్షవర్థన్రెడ్డిలను నిడుజివ్వి గ్రామానికి తీసుకెళ్లి అక్కడే హౌస్ అరెస్టు చేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి రంగసాయిపురం గ్రామం నుంచి వెళ్లిన తర్వాత వైఎస్సార్ సీపీ నేతలను విడిచిపెట్టారు. -
నిర్బంధాలు.. అరెస్టులు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన సందర్భంగా ప్రజావ్యతిరేకత కనిపించకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులను ముందస్తు అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు చేశారు. రెండురోజులుగా అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తుండడంపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అనంతపురం సెంట్రల్: అనంతపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఇంటి వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేయాలని బయల్దేరిన ఎమ్మెల్సీ తనయుడు, వైఎస్సార్సీపీ రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డిని అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నల్లబ్యాడ్జిలతో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ మహాత్మగాంధీ ఉపాధిహామీ పథకంలో రూ.500 కోట్లకు పైగా అవినీతి జరిగిందని తెలిపారు. అవినీతి లేకుండా చేస్తానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు గురివింద గింజ సామెతను గుర్తుకు తెస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక నిరంకుశ పాలనలో ఉన్నామా అని నిలదీశారు. చింతకుంట మధు గృహ నిర్బంధం: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి చింతకుంట మధును శుక్రవారం అర్దరాత్రి నుంచే గృహం నిర్బంధం చేశారు. మారుతీనగర్‌లోని ఆయన నివాసానికి నాల్గవ పట్టణ ఎస్ఐ అల్లాబకాష్, పోలీసు సిబ్బంది చేరుకున్నారు. గృహ నిర్బంధం చేయడంపై చింతకుంట మధు మండిపడ్డారు. మేమేమైనా ఉగ్రవాదులమా.? టెర్రరిస్టులమా అని ప్రశ్నించారు. పలువురు నేతల అరెస్ట్ సీఎం పర్యటన సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసి టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, విద్యార్థి విభాగం అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు రాజేష్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్‌యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తం, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జేఎం బాషా, రైతు విభాగం జిల్లా కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి వలిపిరెడ్డి శివారెడ్డి, గోగుల పుల్లయ్య, వెంకటేశ్వరరెడ్డి, రాంప్రసాద్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకులు మునీరా, భారతి తదితరులను వేర్వేరు చోట్ల అరెస్ట్ చేసి టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాసమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోవాలనుకున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. నాయకుల పరామర్శ అక్రమ అరెస్టులను వైఎస్సార్సీపీ నాయకులు ఖండించారు. టూటౌన్ పోలీసుస్టేషన్లో నిర్బం ధించిన కార్యకర్తలను ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై.వి శివారెడ్డిలు పరామర్శించారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. ప్రజాస్వామ్య దేశంలో భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా టీడీపీ ప్రభుత్వం చూస్తుండడం బాధాకరమన్నారు. ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు పోలీసులను అడ్డుపెట్టుకొని అరెస్ట్‌లు చేయిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అక్రమ అరెస్టులు దారుణం అనంతపురం సప్తగిరి సర్కిల్: సీఎం పర్యటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడి తెలిపారు. ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన సందర్భంగా వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు శంకరనారాయణ, రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులను అరెస్టు, హౌస్ అరెస్టులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. పోలీసుల పహారాతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నాయకుల అక్రమ అరెస్టులకు కారణమైన కలెక్టర్, ఎస్పీలపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. -
పోలీసుల అత్యుత్సాహం: వైఎస్సార్సీపీ నేతల హౌజ్ అరెస్ట్
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ కడప జిల్లాలో పోలీసులు అత్యుత్యాహం ప్రదర్శిస్తున్నారు. పార్టీ కార్యక్రమానికి హాజరు కావాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను పోలీసులు బుధవారం హౌజ్ అరెస్ట్ చేశారు. పులివెందులలో వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలను, కడపలో మేయర్ సురేశ్ బాబును, ఎర్రగుంటలో జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్‌రెడ్డిలను పోలీసులు వారి ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్భంధించారు. వివరాల్లోకి వెళితే.. జమ్మలమడుగు మండలం గొరిగేనూర్‌కు చెందిన చాలా మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరేందుకు బుధవారం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం వైఎస్సార్ సీపీ నాయకులు అవినాశ్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, సురేశ్‌బాబు, శంకర్‌రెడ్డిలను తమ గ్రామానికి ఆహ్వానించారు. ముందుగా అనుకున్న ప్రకారం నేతలు నేడు ఆ గ్రామంలో పర్యాటించాల్సి ఉంది. కాగా, పోలీసులు మాత్రం మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రాబల్యం ఉన్న గ్రామం అంటూ వైఎస్సార్ సీపీ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు. నేతలు మాత్రం చట్టానికి లోబడి శాంతియుతంగా తమ పర్యటన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం తమకు దేశంలో ఎక్కడికైన వెళ్లే హక్కు ఉందని గుర్తుచేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో.. హౌజ్ అరెస్ట్‌ల పేరుతో ప్రతిపక్ష నేతల హక్కులను కాలరాయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
అక్రమ మైనింగ్‌కు ఖాకీ సహకారం
తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ పనులు నిరాటంకంగా కొనసాగడానికి పోలీసులు తమవంతు సహకారం అందిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి బయల్దేరుతున్న తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశారు. మైనింగ్ పనుల వద్దకు వెళ్లరాదంటూ ఆంక్షలు విధించారు. అక్రమాలకు సహకరిస్తున్న పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యల్లనూరు: యల్లనూరు మండలం కూచివారిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మూడు నెలల నుంచి అక్రమంగా నిర్వహిస్తున్నారు. అనుమతులు లేకపోయినా మైనింగ్ జరుపుతున్నారని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అధికారుల దృష్టికి వెళ్లినా చర్యలు తీసుకోలేదు. శనివారం అక్రమ మైనింగ్ పనులను అడ్డుకోవడానికి 600 మంది కార్యకర్తలు, కూచివారిపల్లి చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో కలిసి బయల్దేరడానికి సిద్ధమైన తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తిమ్మంపల్లిలో హౌస్ అరెస్ట్ చేశారు. మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. పెద్దారెడ్డితోపాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులను కూడా గృహనిర్బంధం చేశారు. ఎవ్వరూ మైనింగ్ ప్రాంతానికి వెళ్లకుండా తిమ్మంపల్లి, కూచివారిపల్లితో పాటు అటువైపు వెళ్లే అన్ని అన్ని గ్రామాల దారుల వద్ద పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. జేసీ బ్రదర్స్ అక్రమాలపై మండిపాటు అక్రమ మైనింగ్ పనులను అడ్డుకునేందుకు వెళుతున్న తమను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. ఆయన తిమ్మంపల్లిలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ జేసీ సోదరుల అక్రమాలపై మండిపడ్డారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దాదాపు 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని, కానీ ఆయన ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ విధంగా బ్లాక్‌మేల్ చేశావో అదే తరహాలో తాడిపత్రి ప్రాంతంలోని చెరువులన్నింటినీ నీటితో నింపి ప్రజలకు మేలు చేయాలని సూచించారు. అనుమతులు లేకుండానే మైనింగ్ ఎటువంటి అనుమతులు లేకుండానే ఎంపీ జేసీ మైనింగ్ నిర్వహిస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. ఇదివరకే తాడిపత్రి ప్రాంతంలోని కోనుప్పలపాడు దేవాలయ ప్రాంతంలో మైనింగ్ నిర్వహించడంతో దేవాలయం చీలికలు ఏర్పడిందన్నారు. దేవాదాయ, అటవీ భూములను సైతం వదిలిపెట్టకుండా అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ముచ్చుకోటలో కూడా అక్రమ మైనింగ్ నిర్వహిస్తూ.. ఇటీవలే అనుమతులు తీసుకున్నారన్నారు. జూటూరు ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల భూములను పేదల నుంచి దౌర్జన్యంగా లాక్కున్నారని ఆరోపించారు. తాడిపత్రి సమీపంలోని పెన్నా పరిసర ప్రాంతాల్లో మైనింగ్ నిర్వహిస్తూ రోజూ వందలాది లారీల రాయిని అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. తాడిపత్రి ప్రాంతంలో చాలా మందికి మైనింగ్ చేసుకోవడానికి అనుమతులు ఉన్నప్పటికీ జేసీ దివాకర్‌రెడ్డి వారిని అడ్డుకుంటున్నారన్నారు. తను మాత్రం మైనింగ్ జరుపుకుంటున్నారన్నారు. కూచివారిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్ గురించి అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని పెద్దారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ పనులకు పోలీసులు కూడా సహకరిస్తుండటం బాధాకరమన్నారు. జేసీ ఆదేశాల మేరకే తనను మైనింగ్ ప్రదేశానికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారని, పోలీసుల ఏకపక్షంగా వ్యవహరించడం తగదని అన్నారు. -
మణిక్యాలరావును హౌస్అరెస్ట్ చేసిన పోలీసులు
-
హైకోర్టు లో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన వరవరరావు
సాక్షి, హైదరాబాద్ : మహారాష్ట్ర పోలీసులు జారీ చేసిన ట్రాన్సిట్ వారెంట్‌ను కొట్టివేయాలని విరసం నేత వరవరరావు హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. భీమ్ కోరేగామ్ అల్లర్ల ఘటనలో భాగంగా వరవరరావు గృహనిర్భందంలో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల తన ఆరోగ్యం దెబ్బతింటోందని కోర్టుకు తెలిపారు. పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. వరవరరావు ఆరోగ్యంపై నిమ్స్ సూపరింటెండెంట్ నేతృత్వంలో ఆయన ఇంటికి వెళ్లి వైద్యం అందించాలని నోటీసుల్లో పేర్కొంది. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది. -
కాపు రామచంద్రారెడ్డి హౌస్ అరెస్ట్
-
జమ్మూ కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్
-
ఎన్నికల వేళ.. నేతల గృహనిర్భందం
శ్రీనగర్ : కట్టుదిట్టమైన భద్రత నడుమ జమ్మూ కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యాయి. మొదటి విడతగా 12 జిల్లాల్లోని 30 మున్సిపాలిటీలో గల 400 వార్డులకు ఎన్నికలు జరుగునున్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకుండా వేర్పాటువాదల నాయకుల్ని ముందస్తుగా గృహనిర్భందంలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా మీర్వాజ్ ఉమర్ ఫరూఖ్, సయ్యద్ అలీ షా గిలానీ, యాసీన్ మాలిక్ వంటి కరుడుగట్టిన వేర్పాటువాద నాయకుల్ని గృహనిర్భందం చేసి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. 13 ఏళ్ల అనంతరం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను.. ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌స్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) బహిష్కరించిన విషయం తెలిసిందే. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 35(ఎ)పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆ రెండు పార్టీలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఇదివరికే ప్రకటించాయి. ప్రధాన పార్టీలు రెండూ బరిలో నుంచి తప్పుకోవడంతో.. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. జమ్మూ ప్రాంతంలో బలమైన క్యాడర్ గల బీజేపీ.. ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేస్తామని ఈ రాష్ట్ర మాజీ సీఎం కవీంద్ర గుప్తా ధీమా వ్యక్తం చేశారు. కాగా 400 స్థానాలకుగాను 1283 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. పలు ప్రాంతాల్లో అలర్లు జరిగే అవకాశం ఉన్నందున్న కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని భద్రత దళాలు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయగా, మరోకొన్ని ప్రాంతాల్లో 2జీ సేవలు అందిస్తున్నారు. -
నవలఖ విడుదలపై సుప్రీంకు మహారాష్ట్ర
న్యూఢిల్లీ: హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖ(65)ను గృహనిర్బంధం నుంచి విడుదలచేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిశాంత్ కట్నేశ్వర్ బుధవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద పిటిషన్ దాఖలుచేశారు. సీఆర్పీసీలోని సెక్షన్ 167(1), (2)లను తప్పుగా అర్థం చేసుకున్న హైకోర్టు పొరపాటున నవలఖను విడుదల చేసిందని, అతని ట్రాన్సిట్ రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేసిందని మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో తెలిపింది. సెక్షన్ 167(1) ప్రకారం నిందితుడిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలంటే సంబంధిత పోలీస్ అధికారులు కేస్ డైరీని రూపొందించాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే తమ న్యాయపరిధిలో లేని నిందితుల ట్రాన్సిట్ రిమాండ్ కోరేటప్పుడు కేస్ డైరీని సమర్పించాల్సిన అవసరంలేదని పేర్కొంది. -
గౌతమ్ నవ్‌లఖాకు విముక్తి
న్యూఢిల్లీ: గృహ నిర్బంధంలో ఉన్న హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్‌లఖాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. భీమా–కోరెగావ్ హింసకు కారణమంటూ గౌతమ్ నవ్లఖా సహా అరెస్టయిన ఐదుగురు హక్కుల కార్యకర్తలు ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటు మేరకు ఆయన తరఫున ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ ఎస్.మురళీధర్, జస్టిస్ వినోద్ గోయెల్‌ల ధర్మాసనం విచారించింది. నవ్‌లఖాను ట్రాన్సిట్ రిమాండ్‌కు ఆదేశిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆగస్టు 29న వెలువరించిన ఉత్తర్వులను కోర్టు కొట్టి వేసింది. ‘రాజ్యాంగంలోని ప్రాథమిక నియమాలకు వ్యతిరేకంగా, నేర శిక్షా స్మృతికి వ్యతిరేకంగా ఆ ఉత్తర్వులు ఉన్నాయి. చట్ట ప్రకారం నవ్లఖా 24 గంటల గృహ నిర్బంధం పూర్తయింది. ఫలితంగా ఆయన గృహ నిర్బంధం ముగిసినట్లే. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాబోవు’ అని కోర్టు స్పష్టం చేసింది. -
పౌరహక్కుల నేతల గృహనిర్భందం పొడిగింపు
న్యూఢిల్లీ: భీమ్-కోరేగావ్ అల్లర్ల కేసులో వరవరరావు సహా పౌరహక్కుల నేతల గృహనిర్భందాన్ని సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల పాటు పొడిగించింది. సిట్ దర్యాప్తు జరిపించాలన్న పిటిషనర్ల డిమాండ్‌ను తోసిపుచ్చుతూ, పుణె పోలీసులు దర్యాప్తు కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. అరెస్టయిన నేతలు ఉపశమనం కోసం విచారణ కోర్టుకు వెళ్లవచ్చని కూడా తెలిపింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత నెల 28న విరసం నేత వరవరరావు సహా పౌర హక్కుల నేతలు వెర్నన్ గొనెసాల్వేన్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవ్‌లఖాలను పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరంతా కోర్టు ఆదేశాల మేరకు గృహనిర్బంధంలో ఉన్నారు. -
వరవరరావు కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: కోరేగావ్–భీమా అల్లర్ల కేసులో గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావుతో పాటు మరో నలుగురు సామాజిక కార్యకర్తలను విడుదల చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రముఖ చరిత్రకారుడు రొమిల్లా థాపర్‌తో పాటు మరికొందరు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్, పోలీసుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో జరుగుతున్న విచారణకు సంబంధించి వివరాలను 24 లోపు తమ ముందుంచాలని మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది. వరవరరావు, అరుణ్ ఫెర్రీరా, వెర్నాన్ గొన్సాల్వేస్, సుధా భరద్వాజ్, గౌతం నవ్‌లఖాలు ఆగస్టు 29 నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు. -
ఆ కేసును డేగకళ్లతో పరిశీలిస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ: కోరెగావ్–భీమా అలర్లకు సంబంధించి గృహనిర్బంధంలో ఉన్న ఐదుగురు హక్కుల కార్యకర్తలపై ఆరోపణలు వచ్చిన కేసును డేగ కళ్లతో పరిశీలిస్తామని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. వ్యతిరేకత–అసమ్మతిలకు, సమాజంలో కల్లోలం సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించే చర్యలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుందని మహరాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలియజెప్పింది. హక్కుల కార్యకర్తలు వరవరరావు, అరుణ ఫెరీరా, వెర్నన్ గోన్సాల్వెజ్, సుధ భరద్వాజ్, గౌతమ్ నవ్లఖలను భీమా–కోరెగావ్ కేసులో తొలుత అరెస్టు చేసి అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో గృహనిర్బంధంలో ఉంచడం తెలిసిందే. వారి గృహ నిర్బంధం బుధవారంతో ముగుస్తున్నందున సుప్రీంకోర్టు గడువును మరోరోజు పొడిగించింది. ‘అసమ్మతి, వ్యతిరేకతలను కూడా పరిగణలోకి తీసుకునేలా మన ప్రజాస్వామ్య వ్యవస్థలు దృఢంగా ఉండాలి. అది ఈ న్యాయస్థానమైనా సరే. ఊహలు, కల్పనల కారణంగా స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడటాన్ని మేం సహించం’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాయిబాబా పేరుతో కథలు అల్లారు మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా పేరును వాడుకుని ఐదుగురు హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా పోలీసులు కథలు అల్లుతున్నారని కొందరు ప్రముఖులు సుప్రీంకోర్టుకు తెలిపారు. -
19 వరకూ గృహనిర్బంధం
న్యూఢిల్లీ: కోరెగావ్–భీమా అల్లర్ల కేసులో ఐదుగురు హక్కుల కార్యకర్తల గృహనిర్బంధాన్ని సెప్టెంబర్ 19 వరకూ సుప్రీంకోర్టు పొడిగించింది. అరెస్టు సందర్భంగా పోలీసులు పేర్కొన్న ఆధారాల్ని పరిశీలించాల్సిన అవసరముందని, ఆ ఆధారాలు కల్పితమని కనుగొంటే సిట్ విచారణకు ఆదేశిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘ఆరోపణల ఆధారంగానే ప్రతీ నేర దర్యాప్తు సాగుతుంది. తగినన్ని ఆధారాలు ఉన్నాయా లేదా అని మనం చూడాల్సి ఉంది. మహారాష్ట్ర పోలీసుల వాదన వినకుండా, ఆధారాల్ని పరిశీలించకుండా.. స్వతంత్ర దర్యాప్తుపై ఎలా నిర్ణయం తీసుకుంటాం. పోలీసుల వద్ద ఉన్న ఆధారాల్ని మేం చూడాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. గత నెల్లో మహారాష్ట్రకు చెందిన పుణే పోలీసులు హక్కుల కార్యకర్తలు వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొంజాల్వేస్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖాల్ని అరెస్టు చేయగా.. వారిని గృహనిర్బంధంలో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
పౌరహక్కుల నేతల గృహనిర్భందం పొడగింపు
న్యూఢిల్లీ: భీమ్-కోరేగావ్ అల్లర్ల కేసులో వరవరరావు సహా పౌరహక్కుల నేతలకు గృహనిర్బంధాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 19 వరకు పొడిగించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోరారు. దీనిపై దిగువ కోర్టులే నిర్ణయం తీసుకుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పౌరహక్కుల నేతలకు గృహనిర్బంధం కేసు వరకే తాము విచారిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం, మావోయిజం అనేది చాలా తీవ్రమైన సమస్య అని తెలిపారు. అరెస్టయిన వ్యక్తులు అసాంఘిక కార్యాకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. -
వరవరరావుకు గృహనిర్బంధం పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో పౌర హక్కుల నేతల గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. భీమా-కొరేగావ్ అల్లర్లతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న పౌర హక్కుల నేతలకు గృహ నిర్బంధ గడువు పెంచుతూ మరోసారి వారికి భారీ ఊరట కల్పించింది. ఈ గడువు నేటితో (సెప్టెంబరు 12) ముగియనున్న నేపథ్యంలో సెప్టెంబరు 17వ తేదీవరకు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆగస్టు 28న విప్లవ కవి వరవరరావు సహా మరో అయిదుగురి నేతల ఇళ్లలో పుణే పోలీసుల సోదాలు నిర్వహించడంతో పాటు అరెస్ట్ చేసి పుణేకు తరలించారు. ఈ అరెస్టును సవాలు చేస్తూ చరిత్రకారులు రొమిల్లా థాపర్‌తో పాటు ఐదుగురు మేధావులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం పౌర నేతలను జైల్లో కాకుండా గృహనిర్బంధంలో ఉండాలని ఆగస్టు 30న ఆదేశించింది. మొదట సెప్టెంబరు 6వరకు, ఆ తరువాత 12వ తేదీవరకు వరుసగా పొడిగిస్తూ వచ్చింది. తాజాగా మరో అయిదురోజులపాటు వారిని కేవలం గృహ నిర్బంధంలోనే ఉంచాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ప్రధాని హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలకు సంబంధించి వరవరరావుతో సహా మరో నలుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడం తదనంతర పరిణామాల నేపథ్యంలో వారిని గృహ నిర్బంధంలోనే ఉంచాలని ఆదేశించింది. అంతేకాతు గత విచారణ సందర్భంగా పుణే పోలీసుల వ్యవహారంపై జస్టిస్ దీపక్ మిశ్రా తదితరులతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
12 వరకూ గృహనిర్బంధం
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్న ఆరోపణలతో అరెస్టయిన ఐదుగురు హక్కుల కార్యకర్తల గృహనిర్బంధాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 12 వరకూ పొడిగించింది. ఈ సందర్భంగా పోలీసులు మీడియా సమావేశాలు ఏర్పాటుచేసి కేసు వివరాలను వెల్లడించడంపై కోర్టు మండిపడింది. పుణె ఏసీపీ మీడియా సమావేశం ఏర్పాటుచేసి అత్యున్నత న్యాయస్థానానికే దురుద్దేశాలు అంటగడుతున్నారని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న అంశాలపై మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మీ పోలీసులకు చెప్పండి. ఈ కేసు విచారణ ఇప్పుడు మాముందు ఉంది. మేము తప్పు చేస్తున్నామని పోలీసుల నోటి నుంచి వినాలనుకోవడం లేదు’ అని మహారాష్ట్ర తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది. పుణెలోని భీమా కొరేగావ్‌లో గతేడాది డిసెంబర్ 31న జరిగిన ఎల్గర్ పరిషత్ సభ సందర్భంగా మావోలతో కలసి హింసకు కుట్ర పన్నారని విరసం సభ్యుడు వరవరరావు, వెర్మన్ గంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖా వంటి హక్కుల కార్యకర్తలను మహారాష్ట్ర పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి సంగతి తెలిసిందే. -
ఈ ‘నేరపూరిత కుట్ర’ ఎక్కడిది?
సాక్షి, న్యూఢిల్లీ : విరసం సభ్యుడు వరవరరావు సహా గృహ నిర్బంధంలో ఉన్న ఐదుగురు సామాజిక కార్యకర్తలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంతో పాటు ‘నేరపూరిత కుట్ర’ సెక్షన్‌ను కూడా పుణె పోలీసులు బనాయించారు. బ్రిటీష్ కాలం నాటి నుంచి అంటే, 1860 నుంచి భారతీయ శిక్షాస్మృతిలో ఉన్న ఈ సెక్షన్ దుర్వినియోగం అవుతూనే ఉంది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎక్కడ ఏకాస్త ఆందోళన చెలరేగినా అణచివేసేందుకు బ్రిటిష్ పాలకులు ఈ చట్టాన్ని ఉపయోగించేవారు. ఈ చట్టంలో ఉన్న ఓ వెసులుబాటు ప్రకారమే ఈ చట్టం దుర్వినియోగం ఎక్కువగా జరుగుతోంది. దేశంలో ఏదో ఓ మూల ఎవరిపైనో ఒకరిపైన ‘నేరపూరిత కుట్ర’ కేసును బనాయించి ఇదే కేసులో దేశంలో ఎక్కడైనా, ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండడమే ఆ వెసులుబాటు. చరిత్రలో నిలిచిపోయిన 1923 నాటి కాన్పూర్ కుట్రకేసు, 1929 నాటి మీరట్ కుట్ర కేసులు ‘నేరపూరిత కుట్ర’ దుర్వినియోగానికి నిలువెత్తు దర్పణం. అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీని అణచివేసేందుకు బ్రిటీష్ పాలకులు ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఇలాంటి చీకటి లేదా రాక్షస చట్టాలను ప్రపంచంలోని అనేక దేశాలు ఎత్తివేయగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎత్తివేయక పోవడం ఆశ్చర్యం, అర్థంకాని అంశం. 1972లో, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని తీసుకునేందుకు అన్నామలై యూనివర్శిటీకి వెళ్లినప్పుడు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉదయ్‌కుమార్ అనే విద్యార్థి మరణించారు. దానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరై విచారణ కమిషన్‌ను నియమించింది. పోలీసులు తమ చర్యను సమర్థించుకునేందుకు ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే కుడమురుట్టి వంతెన పేల్చివేసేందుకు ‘నేరపూరిత కుట్ర’ పన్నారని కమిషన్ ముందు పేర్కొంటూ అందుకు సాక్ష్యంగా ఓ ‘షెల్’ను చూపించారు. కుట్ర పన్నిన వారు మావోయిస్టులని మధ్యాహ్నం చెప్పిన పోలీసులు సాయంత్రానికల్లా వారిని నక్సలైట్లను చేశారు. లాఠీచార్జిలో మరణించిన ఉదయ్ కుమార్ అనే విద్యార్థి తండ్రి కూడా విచారణ కమిషన్ ముందు హాజరై తీవ్రవాద గ్రూపులతో కలిసి తన కుమారుడు అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడంటూ పోలీసుల బలవంతం వల్ల తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. ఈ ‘నేరపూరిత కుట్ర’ థియరీని విచారణ కమిషన్ బొత్తిగా విశ్వసించకుండా కొట్టి వేసింది. నాడు లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ కేసు కారణంగా తన ప్రభుత్వం ప్రతిష్ట మరింత పెరుగుతుందని కరుణానిధి భావించారుగానీ ఆ తర్వాత మూడేళ్లలో అవినీతి ఆరోపణల వల్ల ఆయన ప్రభుత్వం భ్రష్ట్రుపట్టి ఎమర్జెన్సీ కాలంలో అర్ధంతరంగా డిస్మిస్ అయింది. ఇప్పుడు కూడా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, సామాజిక కార్యకర్తలపై మోదీ ప్రభుత్వం కూల్చివేతకు ‘నేరపూరిత కుట్ర’ కోణాన్ని జోడించి 2019 సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందుదామని ఆయన ప్రభుత్వం చూస్తోందని, నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాడినట్లే రానున్న ఎన్నికల్లో ‘మహా కూటమి’ పేరిట ప్రతిపక్షాలు ఏకమై మోదీ ప్రభుత్వాన్ని మట్టి కరిపిస్తాయని సామాజిక కార్యకర్తలు ఆశిస్తున్నారు. -
రాజకీయ ప్రముఖులే టార్గెట్
పుణే: ఐదుగురు వామపక్ష కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని పుణే పోలీసులు సమర్థించుకున్నారు. రాజకీయ ప్రముఖులను వీరు లక్ష్యంగా చేసుకున్నట్లు ఆధారాలున్నాయని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారికి మావోయిస్టులతోపాటు కశ్మీర్ వేర్పాటువాదులతోనూ సంబంధాలున్నట్లు వెల్లడించారు. ఎల్గార్ పరిషత్‌కు మావోయిస్టులే నిధులు సమకూరుస్తున్నారన్నారు. మావోయిస్టులు ఇచ్చిన డబ్బులతోనే డిసెంబర్ 31న ఎల్గార్ పరిషత్ సదస్సును నిర్వహించినట్లు తమ విచారణలో తేలిందని పుణే పోలీసు జాయింట్ కమిషనర్ శివాజీ రావ్ బోడ్ఖే వెల్లడించారు. అరెస్టయిన వారు రాజకీయ ప్రముఖులను అంతమొందించే కార్యాచరణపైనా మాట్లాడుకున్నారని సేకరించిన ఆధారాల ద్వారా తేలిందన్నారు. ‘ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై వీరికి బలమైన అసహనం ఉంది. అందుకే ప్రభుత్వ సంస్థలు, అధికారులు, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారు’ అని పుణే పోలీస్ డిప్యూటీ కమిషనర్ శిరీశ్ సర్దేశ్పాండే తెలిపారు. దాడులకు వ్యూహరచన చేసిన వారు, వీటిని అమలు పరిచే వారికి సంబంధించి బలమైన ఆధారాలున్నాయన్నారు. ఇందుకోసం పలు చట్టవ్యతిరేక సంస్థలతోనూ చేతులు కలిపేందుకు సిద్దమైనట్లు తమ విచారణలో స్పష్టమైందని శిరీశ్ వెల్లడించారు. నిధుల సమీకరణ, యువత, విద్యార్థులను రెచ్చగొట్టడం, ఆయుధాలను సమకూర్చుకోవడం, సీపీఐ (మావోయిస్టు) సీనియర్ కామ్రేడ్లకు శిక్షణ ఇవ్వడం తదితర అంశాలపై ఆధారాలున్నాయన్నారు. భద్రతా బలగాలు, అమాయక ప్రజలను చంపిన పలు ఇతర సంస్థలతోనూ చేతులు కలిపేందుకు సిద్దమయ్యారన్నారు. -
నిబంధనలకు విరుద్ధం: ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, న్యూఢిల్లీ: వరవరరావు సహా ఐదుగురు మానవహక్కుల కార్యకర్తల అరెస్టులన్నీ నిబంధలనలకు విరుద్ధంగా, మానవ హక్కులను ఉల్లంఘిస్తూ జరిగాయని కేంద్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీచేసింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. ‘మీడియాలో వార్తల ఆధారంగా చూస్తే.. ఈ ఐదుగురి గృహనిర్బంధం నిబంధలకు విరుద్ధంగా జరిగిందని కమిషన్ భావిస్తోంది. ఈ అరెస్టులను మానవ హక్కుల ఉల్లంఘనగానే చూస్తున్నాం’ అని ఎన్‌హెచ్చార్సీ సీనియర్ సభ్యుడొకరు తెలిపారు. నవలఖా ట్రాన్సిట్ రిమాండ్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఈ అరెస్టుల విషయంలో కోర్టుకు పోలీసులు సరైన వివరణ ఇవ్వలేదనేది సుస్పష్టమైందన్నారు. ‘ఫరీదాబాద్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు సుధా భరద్వాజ్ ట్రాన్సిట్ రిమాండ్ పెండింగ్‌లో ఉంది. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని ఆమె కోర్టుకు వెల్లడించారు. ఎఫ్ఐఆర్లోనూ తన పేరు లేదని.. కేవలం తన సిద్ధాంతం కారణంగానే అరెస్టు చేసి హింసిస్తున్నారని చెప్పారు’ అని ఎన్‌హెచ్చార్సీ ఒక ప్రకటనలో పేర్కొంది.జెనీవాలోని ఓ ఎన్జీవో నుంచి కూడా మహారాష్ట్ర పోలీసులు ఈ ఏడాది జూన్‌లో ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తల (సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, సుధీర్ ధావ్లే, షోమాసేన్, మహేష్ రౌత్) ను అరెస్టు చేసినట్లు ఫిర్యాదు అందిన విషయాన్ని కమిషన్ వెల్లడించింది. ఈ అంశంలోనూ మహారాష్ట్ర డీజీపీకి జూన్ 29న నోటీసులు పంపామని, దీనిపై సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొంది. -
ట్విట్టర్లో ‘మీటూ అర్బన్ నక్సల్’ ట్రెండింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల కార్యకర్తలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. వీరిపై అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లో పలువురు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. దీంతో ట్విట్టర్లో ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. తొలుత బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ..‘అర్బన్ నక్సల్స్‌కు మద్దతు ఇస్తున్నవారి జాబితా రూపొందించేందుకు చురుకైన యువతీయువకులు కొందరు నాకు కావాలి. సాయం చేయాలనుకున్నవారు నాకు సందేశం పంపండి’ అని ట్వీట్ చేశారు. దీంతో జర్నలిస్టులు, విద్యార్థులు, హక్కుల కార్యకర్తలు సహా చాలామంది అగ్నిహోత్రిపై మండిపడ్డారు. హక్కుల కార్యకర్తలకు తమ మద్దతును తెలియజేసేందుకు వేలాది మంది ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాగ్‌ట్యాగ్‌ను ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 55,000 మంది ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్వీట్ చేశారు. 128 సంస్థలకు మావోలతో సంబంధాలు! మావోలతో సంబంధాలున్నాయని భావిస్తున్న 128 సంస్థలతో 2012లో యూపీఏ ప్రభుత్వం జాబితా రూపొందించిందని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కొందరు ఆ సంస్థల సభ్యులు ఉన్నారన్నారు. మావోలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో పౌరహక్కుల కార్యకర్తలను అరెస్ట్‌చేయడంతో విమర్శలు వస్తున్న నేపథ్యంలో అధికారులు యూపీఏ నాటి జాబితాను తెర మీదికి తెచ్చారు. ‘మావోయిస్టులతో సంబంధాలున్నాయని భావిస్తున్న 128 సంస్థలను 2012లోనే యూపీఏ ప్రభుత్వం గుర్తించింది. వాటి కోసం పనిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆనాడే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు పంపింది. జాబితాలో ఉన్న సంస్థల కోసం పనిచేస్తున్న వారిలో వరవరరావు, సుధా భరద్వాజ్, సురేంద్ర గాడ్లింగ్, రోనా విల్సన్, అరుణ్ ఫెరీరా, వెర్నన్ గొన్సాల్వెజ్, మహేశ్ రౌత్‌లు కూడా ఉన్నారు’ అని తన వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. -
వరవరరావుకు గృహనిర్బంధం..
న్యూఢిల్లీ: భీమా–కోరేగావ్ హింస కేసులో అరెస్టయిన ఐదుగురు మానవహక్కుల కార్యకర్తలకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అరెస్టు చేసిన వారిని సెప్టెంబర్ 6 వరకు గృహనిర్బంధంలో ఉంచాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశించింది. భిన్నాభిప్రాయాన్ని వెల్లడించడం ప్రజాస్వామ్యంలో భాగమని, దీన్ని అణగదొక్కడం సరికాదని పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. భీమా–కోరేగావ్ హింస జరిగిన 9 నెలల తర్వాత వీరిని అరెస్టు చేయడంపై మహారాష్ట్ర పోలీసులను ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. ‘ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు సేఫ్టీ వాల్వ్ వంటిది. దీన్ని మీరు అణచాలని చూస్తే ఎప్పుడో ఓసారి అది బద్దలవుతుంది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ అరెస్టులను ఖండిస్తూ.. చరిత్రకారురాలు రోమిలా థాపర్, ప్రభాత్ పట్నాయక్, దేవికా జైన్ సహా ఐదుగురు వేసిన పిటిషన్ ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కాగా, నవలఖా అరెస్టుపై ఇచ్చిన ట్రాన్సిట్ రిమాండ్‌ను పరిశీలిస్తామని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సరైన ఆధారాలు చూపకుండానే నవలఖాను ఎలా అరెస్టు చేశారని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అటు ఎన్‌హెచ్చార్సీ కూడా ఈ అరెస్టులపై వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అరెస్టు చేసిన వారందరినీ వారి ఇళ్లకు పంపించాలని పుణే కోర్టు ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కోర్టుకు మహా విన్నపం అరెస్టయిన ఐదుగురిని విడుదల చేయాలంటూ దాఖలయ్యే పిటిషన్లను విచారణకు అంగీకరించవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇప్పటికే పలువురు ఈ అంశంపై వివిధ హైకోర్టులను ఆశ్రయించిన నేపథ్యంలో మహా సర్కారు ఈ అంశాన్ని లేవనెత్తింది. హైదరాబాద్ నుంచి వరవరరావు, ముంబై నుంచి అరున్ ఫెరీరా, వెర్నాన్ గంజాల్వేస్, హరియాణాలోని ఫరీదాబాద్ నుంచి సుధా భరద్వాజ్, ఢిల్లీ నుంచి గౌతమ్ నవలఖాలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. డిసెంబర్ 31న భీమా–కోరేగావ్ గ్రామంలో జరిగిన ‘ఎల్గార్ పరిషత్’ సభ కారణంగానే దళితులు, అగ్రవర్ణాల మధ్య హింస ప్రజ్వరిల్లిందనే కేసులో ఈ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నవలఖా అరెస్టుపై ఢిల్లీ హైకోర్టు.. హక్కుల కార్యకర్త నవలఖా అరెస్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కేసుకు సంబంధించిన దస్తావేజులను మరాఠీలోనే ఉంచడాన్ని ప్రశ్నించింది. ‘తననెందుకు అరెస్టు చేస్తున్నారో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటప్పుడు అరెస్టు పేపర్లను ఇంగ్లిషులోకి తర్జుమా చేసి నవలఖాకు ఎందుకు ఇవ్వలేదు?’ అని కూడా ప్రశ్నించింది. దస్తావేజులు వేరే భాషలో ఉన్నప్పటికీ మెజిస్టీరియల్ కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ ఎలా జారీ చేసిందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసు దస్తావేజులను వెంటనే ఇంగ్లిష్‌లోకి మార్చాలని కోర్టు ఆదేశించింది. నవలఖా అరెస్టులో న్యాయపరమైన అంశాలు, పుణే కోర్టుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ట్రాన్సిట్ రిమాండ్‌ను పరిశీలిస్తామని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చదివిన తర్వాతే ఈ దిశగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. భీమా–కోరేగావ్ వివాదానికి సంబంధించి మిగిలిన అరెస్టులు సరైనవే అని వెల్లడైతే.. నవలఖా విషయంలోనూ స్పష్టత వస్తుందని కోర్టు పేర్కొంది. కాగా, మరాఠీలో ఉన్న పత్రాలను ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి నవలఖా లాయర్లకు ఇస్తామని మహారాష్ట్ర పోలీసుల తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ అమన్ లేఖీ కోర్టుకు తెలిపారు. ప్రజాగొంతుక నొక్కేస్తున్నారు: అంబేడ్కర్ ప్రజల గొంతుకను నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. భారతీయ రిపబ్లిక్ పార్టీ బహుజన్ మహాసంఘ్ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ఆరోపించారు. వామపక్ష భావజాలమున్న నేతలను అరెస్టు చేయడం.. ప్రజల గొంతుకను నొక్కడమేనన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్న ఎన్జీవోలు, రాజకీయేతర సంస్థలు లక్ష్యంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన ముంబైలో విమర్శించారు. సనాతన్ సంస్థపై దాడులు జరుగుతున్న సమయంలో కావాలనే ఎల్గార్ పరిషత్ సభ్యులపైనా దాడులు నిర్వహిస్తున్నారన్నారు. అటు శివసేన కూడా భీమా–కోరేగావ్ హింసకు అసలైన సూత్రధారులను ఇంకా అరెస్టు చేయకపోవడం దారుణమని పేర్కొంది. మావోయిస్టులతో సంబంధాన్ని అంటగడుతూ అరెస్టులు జరిపే సంస్కృతి దేశవ్యాప్తంగా జరుగుతోందని విమర్శించింది. భారతీయ శిక్షాస్మృతి 153 (ఏ) కింద (మతం, జాతి, పుట్టిన ప్రాంతం, భాష ఆధారంగా వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని పెంచేలా వ్యాఖ్యానించడం) ఐదుగురిని పుణే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, అరెస్టులకు ముందు చట్టపరమైన అన్ని నిబంధనలు అమలుచేశామని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి దీపక్ సర్కార్ తెలిపారు. అన్ని ఆధారాలు ఉన్నందునే అరెస్టులు జరిగాయన్నారు. -
మైనింగ్‌లో చంద్రబాబుకు వాటా ఉన్నందునే వారికి భయం
-
ఏపీ బంద్: అనంత వెంకట్రామిరెడ్డి హౌస్ అరెస్ట్
-
ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ సీపీ నేత, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం అల్లూరు మండలం ఇసుకపల్లెలో ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించకుండా పోలీసులు అడ్డుకున్నారు. మత్స్యకార గ్రామాలకు వెళ్లకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం ముందు భారీగా భద్రతా దళాలు, పోలీసులు మోహరించారు. ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధిని పర్యటించకుండా అడ్డుకోవటం దారుణమన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పీఠాధిపతి అరెస్ట్.. శైవ క్షేత్రంలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, అమరావతి : శైవక్షేత్ర పీఠాధీపతి శివస్వామిని మరో సారి పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. హిందూ సంస్థలపై జరుగుతున్న దాడులకు నిరసనగా గురువారం తెలుగు రాష్ట్రాల్లో జాతీయ రహదారుల దిగ్భంధానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసలు శివస్వామిని హౌజ్ అరెస్ట్ చేశారు. శైవక్షేత్రం చుట్టూ భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు భక్తులకు మధ్య వాగ్వివాదం జరిగింది. శివస్వామిని ఎందుకు హౌజ్ అరెస్ట్ చేసి వేధిస్తున్నారని భక్తులు పోలీసులను నిలదీశారు. శివస్వామి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనను మానసికంగా వేధిస్తోందని తెలిపారు. క్షేత్రంలో పోలీసుల్ని చూసి భక్తులు భయపడుతున్నారని పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా తనను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. హిందుత్వంపై దాడి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చేబుతారని విమర్శించారు. కాగా ఈ నెలలో శివస్వామిని హౌజ్ అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. హిందులపై కత్తి మహేశ్ చేసిన వాఖ్యల పట్ల చర్యలు తీసుకోవాలంటూ తహశీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వడానికి యత్నించిన శివస్వామిని ఈ నెల 16న హౌజ్ అరెస్ట్ చేశారు. -
బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గృహ నిర్బంధం
-
పరిపూర్ణానంద బహిష్కరణ.. ‘ఛలో ప్రగతిభవన్’కు పిలుపు!
సాక్షి, హైదరాబాద్ : శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కణ చేయడంపై బీజేపీ ఆందోళన తీవ్రతరం చేసింది. పరిపూర్ణానంద స్వామిపై విధించిన నగర బహిష్కరణను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. మంగళవారం ‘ఛలో ప్రగతిభవన్’కు బీజేపీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యేలంతా ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయానికి చేరుకునేందుకు సిద్ధమవుతున్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావులను పోలీసులు వారి నివాసంలోనే గృహ నిర్బంధం చేశారు. పోలీసుల చర్యలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చలో ప్రగతిభవన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన బీజేపీ శాసనపక్ష నేత కిషన్‌రెడ్డిని పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద అరెస్ట్ చేసి కిషన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అసెంబ్లీ వైపు వెళ్తున్నారన్న సమాచారం పోలీసులకు అందడంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద అరెస్ట్ చేసి రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బద్దం బాల్‌రెడ్డిని అసెంబ్లీ గేటు ముందు అరెస్ట్ చేసిన పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. -
వైఎస్ఆర్సీపీ నేత మేరుగ నాగార్జున హౌస్ అరెస్ట్
-
మేరుగ నాగార్జున గృహనిర్బంధం.. ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు : వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జునను సోమవారం ఉదయం పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పోతర్లంక ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అయితే, మేరుగ నాగార్జున ఆదివారం పోతర్లంక ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించి.. అందులోని అవకతవకలు, ప్రాజెక్టు నుంచి నీళ్లు లీక్ కావడాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనను పోలీసులు గృహనిర్బంధం చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు పర్యటన ముగిసే వరకు మేరుగ నాగార్జునను గృహనిర్బంధంలో ఉంచనున్నట్టు సమాచారం. పోతర్లంక ఎత్తిపోతల పథకంలోని అవకతవకలు బయటపెట్టినందుకే.. పోలీసులు అక్రమంగా మేరుగను హౌస్ అరెస్టు చేశారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడుతున్నారు. -
‘అనుమతిచ్చారు.. లేదు ఇవ్వలేదు’
సాక్షి, హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్బంధం చేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మండిపడ్డారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చేపట్టిన ధర్మాగ్రహ యాత్రను పోలీసులు అడ్డుకుని ఆయనను గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. దీనిపై రామచంద్రరావు మంగళవారం మాట్లాడుతూ.. పరిపూర్ణానంద స్వామి యాత్రకు పోలీసులే అనుమతి ఇచ్చారని, తిరిగి పోలీసులే యాత్ర చేయకుండా గృహ నిర్బంధం చేశారని అన్నారు. కనీసం ఇతరులు కూడా ఆయనను కలవడానికి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని, ఏం నేరం చేశారని నిర్బంధించారని ప్రశ్నించారు. పోలీసులే అనుమతినిచ్చి.. తిరిగి రద్దు చేయడమేంటన్నారు. స్వామిజీ వెంట వెళ్లే 400 మందికే రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం నాలుగు కోట్ల మంది ప్రజలకు ఎలా రక్షణ ఇస్తుందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే గృహ నిర్బంధం రద్దు చేసి.. స్వామిజీపై వేధింపులు ఆపాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. కాగా, పరిపూర్ణానందకి తాము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని, తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. -
పరిపూర్ణానంద గృహ నిర్బంధం
హైదరాబాద్: హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చేపట్టిన ధర్మాగ్రహ యాత్రకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో ఆయనను గృహ నిర్బం ధం చేశారు. ఉదయం ఆయన ఉంటున్న ప్రాంతా నికి భారీగా చేరుకున్న పోలీసులు.. పరిపూర్ణానంద స్వామిని బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు. వెస్ట్‌జోన్ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పరిపూర్ణానంద ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం 8 నుంచే జూబ్లీహిల్స్ ఫిలింనగర్ రహదారులన్నీ పోలీ సు దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పరిపూర్ణానంద స్వామి భక్తులు జూబ్లీహిల్స్‌కు తరలి రావడంతో రహదారులన్నీ భక్త జనసందోహంతో కిటకిటలాడాయి. నినాదాలతో దద్దరిల్లాయి. భక్తులంతా పరిపూర్ణానందను విడుదల చేయాలంటూ గొడవకు దిగారు. పోలీసులతో పలువురు భక్తులు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 20 మంది భక్తులను పోలీసులు అరెస్ట్ చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానందను పరామర్శించేందుకు ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్వీఎస్ ప్రభాకర్ వచ్చారు. అయితే చింతలను మాత్రమే లోనికి అనుమతించారు. అలాగే పీఠాధిపతి విద్యా గణేశానంద సరస్వతి కూడా పరిపూర్ణానందను పరామర్శించారు. పెట్రోల్‌తో అర్చకుడి హల్చల్ పరిపూర్ణానంద స్వామిని గృహనిర్బంధం చేయడాన్ని జీర్ణించుకోలేని అర్చకుడు రాహుల్ దేశ్‌పాండే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆయన చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
రామ భక్తులంతా జైల్లో ఉన్నారు: పరిపూర్ణానంద
సాక్షి, హైదరాబాద్ : శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చేపట్టిన ధర్మాగ్రహ యాత్రకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. దీంతో పరిపుర్ణానందకు మద్దుతుగా పలు హిందూ సంస్థల ప్రతినిధులు నిరసన తెలపగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పరిపూర్ణానంద మాట్లాడుతూ.. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయానికి కూడా వెళ్లనివ్వడం లేదని, మంచిపై దాడి చేసే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వారి విచక్షణకే వదిలేస్తామని తెలిపారు. రామ భక్తులంతా జైల్లో ఉన్నారని, బేషరతుగా విడిచిపెట్టాలన్నారు. తన ఒక్కడికైనా పాదయాత్ర అనుమతి ఇవ్వాలని ఆయన డీజీపీకి విజ్ఞప్తి చేశారు. తాము ఏవరిపైనా విమర్శలు చేయమని అనుమతివ్వాలన్నారు. దాడి చేయొచ్చని అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారని.. అమరనాథ్ యాత్రికులపై దాడులు జరుగుతున్నాయని భక్తులను అడ్డుకుంటారా ప్రశ్నించారు. చదవండి : పరిపూర్ణానంద హౌస్ అరెస్టు! కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు! -
స్వామి పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్
-
పరిపూర్ణానంద నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత!
సాక్షి, హైదరాబాద్ : ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన స్వామి పరిపూర్ణానందను పోలీసులు గృహనిర్బంధం చేసిన నేపథ్యంలో జుబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిందూత్వవాదులు, ఆయన అనుచరులు పెద్దసంఖ్యలో ఇంటివద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో స్వామి పరిపూర్ణనంద ఇంటి వద్ద ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పెట్రోల్ డబ్బాతో వచ్చిన అతను.. స్వామిజీ మద్దతుగా ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. అతను ఒంటిపై పెట్రోల్ పోసుకుంటుండగా అడ్డుకున్న పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. బీజేపీ ఖండన శ్రీరాముడిపై కత్తిమహేష్ వ్యాఖ్యలకు నిరసనగా ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన స్వామి పరిపూర్ణానందను గృహనిర్బంధం చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపూర్ణానంద హౌజ్ అరెస్టును ఆయన ఖండించారు. స్వామీజీలను అరెస్టు చేయడం మంచిది కాదని తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మణ్ హితవు పలికారు. పరిపూర్ణానందను వెంటనే గృహనిర్బంధం నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చేయడం, నిరసనలు ప్రదర్శించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఈ హక్కును ప్రభుత్వాలు కాలరాయకూడదని ఆయన పేర్కొన్నారు. హిందూ సంస్థల ఆందోళన స్వామి పరిపూర్ణానంద హౌజ్ అరెస్టును వ్యతిరేకిస్తూ తిరుమల అలిపిరి వద్ద హిందూ దేవాలయాల పరిరక్షణ సేవాసంస్థ నిరసన ప్రదర్శన చేపట్టింది. గోవింద నామస్మరణతో సంస్థ ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టగా.. విజిలెన్స్ అధికారులు వారిని అడ్డుకున్నారు. చదవండి : పరిపూర్ణానంద హౌస్ అరెస్టు! కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు! -
పరిపూర్ణానంద హౌస్ అరెస్టు!
సాక్షి, హైదరాబాద్ : స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహయాత్రకు బ్రేక్ పడింది. శ్రీరాముడిపై కత్తిమహేష్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేశారు. జుబ్లీహిల్స్‌లోని స్వామీజీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. శ్రీరాముడిపై కత్తిమహేష్ వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి వరకు స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర నేపథ్యంలో వేలమంది హిందువులు యాదాద్రికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా రాచకొండ కమిషనరేట్ పోలీసులు ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. -
లేళ్ల అప్పిరెడ్డి హౌస్ అరెస్ట్
-
జోగుళాంబదేవినే మరిచారు!
అలంపూర్ రూరల్ : జోగుళాంబ గద్వాలలో శుక్రవారం పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, తన ప్రసంగంలో అలంపూర్ నియోజకవర్గం, జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధి గురించి ప్రస్తావించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కృష్ణా పుష్కరాల సందర్భంగా అలంపూర్ వచ్చిన సీఎం, అనేక అభివృద్ధి అంశాలపై హామీలు ఇచ్చారు. అయితే, జోగుళాంబ ఆలయ అభివృద్ధి విషయమై కేంద్ర పురావస్తు శాఖతో మాట్లాడతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొన్నటి సభలో ఆలయాల గురించి మాట్లాడకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పుష్కరాలపై దృష్టి ఏదీ? యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో ప్రవహించే తుంగభద్ర నది పుష్కరాలకు సమయం సమీపిస్తున్నా సీఎం కేసీఆర్ ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. 2020 మార్చి 31నుంచి ప్రారంభంకానున్న తుంగభద్ర నదికి ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ వేయించడం, ఆలయాల పరిసరాలను భక్తుల రద్దీకి అనుగుణంగా ఆధునీకరించడం వంటివి చేయాల్సిఉంది. ఈనేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖతో ఈ ప్రభుత్వం అనుమతులు కోరేదెన్నడు? మాస్టర్ ప్లాన్ వేయించేదెన్నెడు? నివాస గృహాల నష్ట పరిహారాలు అందించేదెన్నడు? ఇలా అనేక రకాలుగా అలంపూర్ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లాకు ఒరిగింది ఏమీ లేదు సీఎం పర్యటనతో జిల్లాకు ఒరిగింది ఏమీ లేదు. ప్రతిపక్షాల గొంతునొక్కే విధం గా ఎమ్మెల్యే సంపత్‌ను గృ హనిర్భంధం చేశారు. జోగుళాంబ అమ్మవారి పేరు కానీ, గత హామీలు కానీ ఎక్కడా ప్రస్తావించకుండా మరొకరు ప్రశ్నించకుండా సభను ముగించారు. ఈవైఖరి సరికాదు. – జెట్టి రాజశేఖర్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రశ్నిస్తాననే గృహ నిర్బంధం సీఎం కేసీఆర్ గతంలో అలంపూర్ వచ్చిన సమయంలో ఆలయం, నియోజకవర్గ అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారు. వాటి అమలుపై ప్రశ్నించాల్సిన నైతిక బాధ్యత ఎమ్మెల్యేగా నాపై ఉంది. నేను ప్రశ్నిస్తాను అనే భయంతోనే గృహనిర్బంధం చేయించారు. – ఎస్. సంపత్‌కుమార్, ఎమ్మెల్యే అలంపూర్ అమ్మ మొక్కు మరిచారు సీఎం కేసీఆర్ బెజవాడ కనకదుర్గమ్మకు, తిరుపతి వెంకన్నకు, అంతకుముందు కొండగట్టు అంజన్న, వేములవాడ, యాదాద్రి, భద్రాద్రిలో మొక్కలు చెల్లిస్తూ వస్తున్నారు. కానీ జోగుళాంబ అమ్మ మొక్కు మరిచారు. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పిన మాటలు అడియాశలే అయ్యాయి. – బోరింగ్ శ్రీనివాస్, జోగుళాంబ సేవాసమితి అధ్యక్షుడు -
ప్రతిపక్షం గొంతు నొక్కడం దారుణం
నరసరావుపేట: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతును వినపడనీయకుండా అణచివేయాలనుకోవటం దారుణమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహంవ్యక్తం చేశారు. నరసరావుపేట నియోజకవర్గంలో అవినీతికి చిరునామాగా కోడెల కుటుంబం వ్యవహరిస్తోందన్నారు. నరసరావుపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన సభను జరగనీయకుండా తనతో పాటు కొంతమంది నాయకులను హౌస్ అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడుతో కలసి పాత్రికేయులతో మాట్లాడారు. స్థల వివాదంలో తాను లూథరన్ అంధుల పాఠశాల ఉన్న ఏఈఎల్సీ సంస్థ చైర్మన్‌ను కలిశానని చెప్పారు. ఆయన తాము ఎవ్వరికీ లీజుకు ఇవ్వలేదని చెప్పారన్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న వారు కూడా శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ తాము లీజుకు తీసుకోలేదని, కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారన్నారు. తాము లీజుకు తీసుకున్నట్లు డాక్యుమెంట్ తీసుకొస్తే వెంటనే తమ ఖర్చులతో తిరిగి రిజిస్ట్రేషన్ చేయిస్తామని వారు ప్రకటించారన్నారు. ఈ వ్యవహారంలో నకిలీ లీజు అగ్రిమెంట్‌ను టీడీపీ నాయకులు సృష్టించారని గోపిరెడ్డి ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు సాయితేజ డెవలపర్స్ పేరుపై ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధం చేసుకున్నారని, దానిలో ఏడుగురు వ్యక్తుల పేర్లు ఉండగా అందులో ముగ్గురు టీడీపీకి చెందినవారని గోపిరెడ్డి వివరించారు. వారిపేర్లు బయటపెట్టకుండా కేవలం వైఎస్సార్సీపీకి చెందిన వారి పేర్లే బయటపెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. గుంటూరులో సంగతి మాట్లాడరే ? గుంటూరులో ఏఈఎల్‌సీకి చెందిన ఆరు ఎకరాలు మంత్రి నక్కా ఆనందబాబు చేతిలో ఉన్నాయని గోపిరెడ్డి చెప్పారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు చెందిన గ్రాండ్ హోటల్ నాగార్జున ఏఈఎల్సీ స్థలంలో నిర్మించినదేనని తెలిపారు. టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు స్థలం లీజుకు తీసుకొని రమేష్ హాస్పిటల్స్ నిర్మించేందుకు ఇచ్చారన్నారు. వీరందరూ టీడీపీకి చెందినవారేనని గుర్తు చేశారు. వీరు తీసుకున్నప్పుడు ఆందోళనలు, ఉద్యమాలు ఎందుకు చేయలేదని, వాటిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇక్కడ కేవలం సంబంధం లేని వ్యవహారాన్ని తనకు చుట్టి తనపై బురదచల్లేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తనపై కల్తీ పాలు, టీటీడీ లేఖలు అంటూ అనేక ఆరోపణలు చేస్తున్నారని, అయితే ఏ విచారణకైనా తాను సిద్ధమని సవాల్ విసిరినా వారు స్వీకరించటం లేదని గోపిరెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం వారి చేతిలో ఉన్నా తనపై ఎందుకు కేసులు పెట్టటం లేదని ప్రశ్నించారు. తన ప్రమేయం లేదని తెలిసే కేసులు పెట్టలేదన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే కేసులు పెట్టాలని, ఏ స్థాయి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు. అవినీతి సామ్రాట్ శివరాం స్పీకర్ డాక్టర్ కోడెల కుమారుడు శివరామ్ అవినీతికి చిరునామాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. భూకబ్జాలు చేస్తున్న వ్యక్తే తమపై నిందలు మోపుతున్నాడన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూళిపాళ్ల గ్రామంలో సుబ్బారావుకు చెందిన 17 ఎకరాల భూమిని కబ్జా చేసి ఆ స్థలంలో ఉన్న రూ.2 కోట్ల ఆస్తిని ధ్వంసం చేశారన్నారు. ఏడు ఇళ్లు నాశనం చేసి సుమారు 10 వేల కోళ్లను తిన్నారన్నారు. నరసరావుపేట పలనాడు రోడ్డులో ఎస్ఎస్ఎన్ కళాశాల అధ్యాపకుడికి చెందిన రూ.5 కోట్ల స్థలాన్ని, నల్లపాడులో సాంబిరెడ్డి అనే వ్యక్తికి చెందిన 2.5 ఎకరాల భూమిని దౌర్జన్యంగా కబ్జా చేశారని ఆరోపించారు. తాను తిరుపతి పాదయాత్రకు వెళుతూ లక్షలు వసూలు చేశారనే శివరామ్ విమర్శలను ఎమ్మెల్యే గోపిరెడ్డి ఖండించారు. వెంకటేశ్వరస్వామి పాదయాత్రను కూడా రాజకీయం చేసిన దుర్మార్గుడు శివరామ్ అన్నారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లోఫర్స్ అంటూ శివరామ్ చేసిన వ్యాఖ్యలపై ప్రివిలేజ్ మోషన్‌కు వెళతామని స్పష్టం చేశారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేయకుండానే సత్తెనపల్లి, నరసరావుపేటలలో దోచుకున్న రూ.150కోట్ల డబ్బుతో గుంటూరులో కేఎస్పీ మాల్ నిర్మించారని తెలిపారు. ముఖ్యమంత్రి హెచ్చరించినా రైల్వే కాంట్రాక్టర్ నుంచి రూ.5కోట్లతో పాటు సత్తెనపల్లిలో బాలాజీ స్వీట్స్ నుంచి నెలకు రూ.50వేలు వసూలు చేస్తున్నాడన్నారు. చివరకి తన పార్టీ కార్యకర్తలను కూడా వదలకుండా డబ్బులు వసూలుచేస్తూ వారే తనకు బలమని చెప్పటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒక మాజీ ఎంపీపీ మట్టి తోలుకున్నాడని నాలుగు రోజుల పాటు జైలులో పెట్టించాడన్నారు. తన ఇంటిలో బాంబులు పేలి నలుగురు కార్యకర్తలు చనిపోతే ఇప్పటివరకు ఆ కుటుంబాలను ఆదుకోలేదని తెలిపారు. ఇటువంటి వ్యక్తికి ఆర్డీవో కార్యాలయం వద్ద పోలీసులు ఆరు గంటల పాటు మైకు ఇచ్చి స్టేజ్ ఏర్పాటు చేసుకుంటే తప్పు లేనిదీ... ఏ తప్పూ చేయని తాము సభ పెట్టుకుంటామంటే హౌస్ అరెస్టుచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ నేరం చేశాడని అరెస్టు చేశారు: బొల్లా వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఏ నేరం చేశాడని అరెస్టు చేశారంటూ ప్రశ్నించారు. డబ్బుల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని విధాలా ప్రజలను దోచుకుంటున్న వీరు అవినీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు నూరుల్ అక్తాబ్, పట్టణ అధ్యక్షుడు ఎస్.ఏ.హనీఫ్, జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా పాల్గొన్నారు. నరసరావుపేటలో నియంతృత్వ పాలన ? నరసరావుపేట టౌన్: నరసరావుపేటలో నియంత పాలన కొనసాగుతుందా అన్నట్లు శనివారం వాతావరణం కనిపించింది. ఎటుచూసినా ఖాకీలు గుంపులు గుంపులుగా లాఠీలు పట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దీనంతటికీ టీడీపీ నేతల అవినీతిపై ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సవాల్ విసరటమే కారణంగా కన్పిస్తోంది. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తే ఎక్కడ తమ అవినీతి పుట్ట పగులుతుందోనని కలవరపాటుతో అధికార పార్టీ కుట్ర చేసి సభను భగ్నం చేసింది. 144 సెక్షన్ అస్త్రాన్ని ఉపయోగించి నియోజకవర్గ ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేయడంతో పట్టణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహం వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేసి ఇతరులనెవ్వరిని అటుగా అనుమతించలేదు. దీంతో పాటు మల్లమ్మ సెంటర్, మున్సిపల్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయ సెంటర్, పల్నాడు బస్టాండు, ఆర్టీసి బస్టాండు వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డుగా డివైడర్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. అటుగా వచ్చే వాహనాలను దారి మళ్లించారు. దీంతో ప్రజానీకం అసౌకర్యానికి గురైయ్యారు. పోలీసుల అదుపులో పట్టణం మూడు సబ్ డివిజన్ల అధికారులు, సిబ్బందితో పాటు గుంటూరు నుంచి వచ్చిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన సెంటర్లలో 10 నుంచి 20 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 10 వాహనాల్లో పోలీసులు గస్తీ తిరిగి జనాలను చెదరగొడుతూ భయబ్రాంతులకు గురిచేశారు. మరో ఐదు రోజుల పాటు పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న దృష్ట్యా పోలీసులు ఇదే అత్యుత్సాహం ప్రదర్శిస్తే జనజీవనం అస్తవ్యస్తం అవ్వటం ఖాయం. -
గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్తత
-
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహనిర్బంధం, ఉద్రిక్తత
గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికారం విషం కక్కుతోంది. పాలక పార్టీకి ఓ రూలు, ప్రతిపక్షానికో రూలు అన్నట్టుగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి, వారికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం చేపట్టనున్న నిరసన ర్యాలీ, బహిరంగ సభ కార్యక్రమానికి 144 సెక్షన్‌తో మోకాలడ్డారు. సాక్షి, నరసరావుపేట : పట్టణంలో అధికార యంత్రాంగం, పారదర్శకతకు పాతరేసి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటోంది. పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనపై వచ్చిన విమర్శలను నిగ్గు తేల్చుకునేందుకు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడికి బహిరంగ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట పోలీసులు అధికారపార్టీకి వత్తాసు పలుకుతూ బహిరంగ చర్చకు వెళ్లకుండా గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిని గృహనిర్బంధం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. దీంతో నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అడ్డుకోవడమే లక్ష్యం : నరసరావుపేట, సత్తెనపల్లిలో జరిగిన అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని, లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఒకవేళ తనపై చేసిన ఆరోపణలు నిరూపించలేకుంటే టీడీపీ నేతలు రాజీనామాకు సిద్ధపడాలని గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. అయితే బహిరంగ సభలో ప్రతిపక్ష నాయకులు నోరు విప్పితే తమ అవినీతి ఎక్కడ బట్టబయలు అవుతుందోనన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుంది. బహిరంగ సభ, ర్యాలీలను ఎలాగైనా అడ్డుకోవాలనకున్న అధికార పార్టీనేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మూడురోజుల పాటు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అధికార పార్టీ నాయకులు నిషేధిత ప్రాంతమైన ఆర్డీవో ఆఫీసు సెంటర్లో ఆందోళన జాతర చేపట్టినప్పుడు అధికారులకు గుర్తుకురాని నిబంధనలు ప్రతిపక్షం ర్యాలీ చేస్తానన్నప్పుడు మాత్రం అకస్మాత్తుగా గుర్తుకువచ్చాయి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి 144 సెక్షన్ పేరుతో మోకాలడ్డారు. అధికారులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? 144 సెక్షన్ అమలుకు ఉత్తర్వులు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టనున్న నేపథ్యంలో ఇన్చార్జి తహసీల్దార్ జి.శ్రీనివాస్ 144 సెక్షన్ అమలు చేయాలని శుక్రవారం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సాకును అసరాగా చూపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ర్యాలీకు అనుమతులు ఇవ్వకూడదనేది అధికార పార్టీ కుట్ర. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నాయకులు మూడు రోజుల పాటు న్యాయస్థాన ప్రాంగణాలకు కూతవేటు దూరంలో గల ఆర్డీవో అఫీసు సెంటర్లో నానా యాగీ చేసినా, ప్రజలు, వ్యాపారస్తులు మూడు రోజుల పాటు ఇబ్బందులు పడినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు మాత్రం ముందస్తుగానే చర్యలు చేపడుతున్నారు. దీని వెనుక అధికార పార్టీ ఒత్తిడి ఉందని తేటతెల్లమవుతోంది. నాలుగో తేదీ వరకు 144 సెక్షన్ అమలు : ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో 144 సెక్షన్ అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖ కోరిన నేపథ్యంలో 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశా. జూన్ 30 నుంచి జూలై 4వ తేదీ వరకు ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. –శ్రీనివాస్, తహసీల్దార్ ఉన్నతాధికారుల దృష్టికి సమస్య : ఏఈఎల్సీ ఆస్తుల అన్యాక్రాంతం వ్యవహారంలో రాజకీయ సవాళ్ల వివాదం శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉంది. 144 సెక్షన్ అమల్లో వున్న కారణంగా నిరసనలు, బహిరంగ సభలు నిషేధం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. –ఏవీ శివప్రసాద్, సీఐ తహసీల్దార్ జారీచేసిన 144 సెక్షన్ ఉత్తర్వులు -
కేసీఆర్ నిరంకుశత్వానికి పరాకాష్ట
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిరంకుశత్వానికి పరాకాష్ట అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సీఎం పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే సంపత్ కుమార్ గృహ నిర్బంధం దారుణమని ఆయన మండిపడ్డారు. ఒక దళిత శాసనసభ సభ్యుడిని గృహ నిర్బంధం చేయడం దారుణమని, ఇది ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ఎమ్మెల్యే సంపత్ పోరాడి సాధించారని పేర్కొన్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి గత కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేపట్టడం లేదని ఆరోపించారు. దళిత శాసన సభ్యుడైనందువల్లే సంపత్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వేధిస్తోందని, ఇందులో భాగంగానే శాసన సభ్యత్వాన్ని రద్దు చేసిందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. హైకోర్టు రెండు సార్లు ఆదేశించినా కూడా కేసీఆర్ పట్టించుకోకుండా కోర్టు ఆదేశాలను ధిక్కరించారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యేను పాల్గొననివ్వాలని, తన నియోజకవర్గంలోని సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ క్యాంప్ కార్యాలయంలో అధికారులు భారీగా పోలీసులను మొహరించారు. ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేశారు. దీనిపై కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఒక ఎమ్మెల్యేకు తన నియోజక వర్గంలోని సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. -
భర్తకు ఆరు నెలల గృహ నిర్బంధం!
అల్లవరం (అమలాపురం): రోజూ తనతో గొడవ పడుతూ హింసిస్తున్న భర్తను మరో ఇద్దరి సాయంతో భార్య తీవ్రంగా కొట్టి, ఆరు నెలలుగా గృహ నిర్బంధంలో ఉంచింది. విషయం వెలుగులోకి రావడంతో అల్లవరం పోలీసులు ఈ ఘటనపై శనివారం కేసు నమోదు చేశారు. ఎస్సై డి. ప్రశాంత్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొక్కిరిగడ్డ వీర వెంకట సత్యనారాయణ, సూర్యకుమారి దంపతులు మండలంలోని కొమరగిరిపట్నం శివారు మిలటరీ కాలనీలో నివశిస్తున్నారు.సత్యనారాయణ చాలాకాలం దుబాయ్‌లో పనిచేసి తిరిగి వచ్చాడు. అతడు తరచూ భార్యతో గొడవ పడేవాడు. మద్యం సేవించి వచ్చి భార్యను హింసించేవాడు. దీంతో విసిగిపోయిన సూర్యకుమారి ఈ ఏడాది జనవరి ఐదో తేదీన సంగాని రాంబాబు, పొనమండ శ్రీనివాసరావు అనే మరో ఇద్దరితో కలిసి రాడ్డులతో భర్త సత్యనారాయణపై దాడి చేసింది. గాయపడిన అతడిని గృహంలోనే నిర్బంధించింది. విషయం బయట పడింది ఇలా.. ఐదు నెలలు పైబడినా తన అన్న సత్యనారాయణ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సఖినేటిపల్లిలో నివసించే అతడి సోదరుడు కొక్కిరిగడ్డ నాగమలేశ్వరరావుకు అనుమానం వచ్చింది. దీంతో అతడు అన్నను చూసేందుకు కొమరగిరిపట్నం శివార్లలోని ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి గాయాలతో బాధపడుతూ జీవచ్ఛంలా పడి ఉన్న సత్యనారాయణ కనిపించాడు. దీంతో నాగమల్లేశ్వరరావు పోలీసుల సహకారంతో అన్నను గృహ నిర్బంధం నుంచి విడిపించి అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చేర్పించాడు. శనివారం ఉదయం నాగమల్లేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సూర్యకుమారిని అరెస్టు చేశామని ఎస్సై ప్రశాంత్‌కుమార్ తెలిపారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న సత్యనారాయణకు స్థానికంగా ఉన్న పీఎంపీతో చికిత్స చేయించారే తప్ప పెద్దాస్పుత్రిలో చికిత్స అందించలేదు. ప్రస్తుతం అతడి చేతులు విరిగి వేలాడుతున్నాయని, మోకాలి చిప్ప పగిలిపోవడంతో నడవలేకపోతున్నారని ఎస్సై తెలిపారు. -
ఐదోవ రోజుకు చేరిన కేజ్రీవాల్ నిరసన
-
నాలుగో రోజుకు చేరిన కేజ్రీవాల్ నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ముగ్గురు మంత్రులు చేస్తున్న దీక్ష నాలుగో రోజుకు చేరింది. దీంతో ఎల్జీ ఇంటి నుంచే తన విధులు నిర్వహిస్తున్నారు. కాగా, దీక్ష చేస్తున్న కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఎవరినీ అనుమతించకపోవడంపై ఆప్ నేతలు మండిపడ్డారు. ‘కేజ్రీవాల్‌ను హౌజ్ అరెస్టు చేశారా?’ అని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో బైజాల్ చొరవతీసుకోవడం లేదంటూ కేజ్రీవాల్ నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అటు, ప్రధానమంత్రి, లెఫ్టినెంట్ గవర్నర్ల తీరును నిరసిస్తూ.. ఎమ్మెల్యేలు, ఆప్ కార్యకర్తలు రాజ్‌ఘాట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ‘మోదీజీ ఫర్గివ్ ఢిల్లీ’ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ప్రదర్శన కొనసాగింది. నాలుగు నెలలుగా ఆందోళన చేస్తున్న ఢిల్లీ ఐఏఎస్ అధికారుల ఆందోళన విరమించేలా ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. -
అమిత్ షా వచ్చారని.. నాకు గృహనిర్బంధం!
సాక్షి, ముంబై : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముంబైలో పర్యటిస్తున్న సందర్భంగా తనను బుధవారం పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ ఆరోపించారు. ‘ఉదయం నుంచి పెద్దసంఖ్యలో పోలీసులు నా ఇంటి చుట్టు ఉన్నారు. నా బంగళా లోపలకు కూడా వచ్చారు. మేం ఈ రోజు ఎలాంటి ఆందోళనలకు పిలుపునివ్వలేదు. అయినా పోలీసులు నా ఇంటిని చుట్టుముట్టారు’ అని నిరుపమ్ మీడియాకు తెలిపారు. తన ఇంటి చుట్టూ ఎందుకు ఉన్నారని పోలీసులను అడిగితే.. తనపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు చెప్పారని అన్నారు. ‘మేం అమిత్ షాను ఘెరావ్ చేయడం.. లేదా ఆయన ముందు ఆందోళన చేస్తామని బీజేపీ భావించినట్టు ఉంది. అందుకు నన్ను ఉదయం నుంచి ఇంట్లోనే బంధించారు’ అని ఆయన అన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని, అమిత్ షాకు భద్రత పేరిట తమ పార్టీ శ్రేణులను భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. -
బీజేపీ జిల్లా అధ్యక్షుడు హౌస్ అరెస్ట్
-
పట్టు కోసం ‘పట్టాల’ రాజకీయం
రాప్తాడు నియోజకవర్గంలో తమ ప్రాభవం కోల్పోతున్నామనే భయంతో అధికారపార్టీ నాయకులు కక్షరాజకీయాలకు తెరలేపారు. తమ వారికి మేలు చేయాలనే తలంపుతో ఇతర పార్టీ నాయకులకు ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను రద్దు చేసి తమ పార్టీ నాయకులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ మంత్రి సొంత మండలం రామగిరి వేదిక అయ్యింది. రామగిరి: రామగిరి మండలం పోలేపల్లిలో 1995లో ప్రభుత్వం దాదాపు 40 మంది రైతులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. వాటిలో కొంత మంది ఇళ్లు నిర్మించుకోగా.. మరికొంత గడ్డివాములు, పశువుల కొట్టాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ పట్టాలు పొందిన వారిలో అధికారపార్టీకి చెందిన లబ్ధిదారులు దాదాపు 90 శాతం మంది ఆయా స్థలాలను ఇతరులకు విక్రయించుకున్నారు. మిగిలిన వారు అలాగే ఉంచుకున్నారు. అయితే గ్రామంలో పట్టు సాధించాలని, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను తమవైపు తిప్పుకునేందుకు కొంత కాలంగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగకపోవడంతో ఈసారి ఏకంగా వారి ఆస్తులపై కన్నేశారు. వారి ఆర్థిక మూలాలను దెబ్బకొడితే తమవైపు వస్తారన్న భావనతో ఏకంగా గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటున్నారు. నోటీసులు కూడా ఇవ్వకనే.. వాస్తవానికి ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో సంబధిత లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. ఇటువంటి చర్యలేమీ లేకుండా మాట వినని లబ్ధిదారులను నేరుగా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వారిని భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా వారు లొంగకపోవడంతో ఏకంగా తహసీల్దార్ వద్దకు తీసుకుపోయి బైండోవర్ చేయించారు. బుధవారం ఉదయం ఏకంగా పోలీస్ భద్రతలో జేసీబీలను తీసుకువచ్చి ఆయా పట్టాలు ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకుంటామంటూ గ్రామంలోకి వచ్చేశారు. దీంతో సదరు లబ్ధిదారులు వారిని ప్రతిఘటించడంతో పోలీసులు వారందరినీ అరెస్ట్ చేశారు. అనంతరం ఆయా స్థలాల్లో ఉన్న నిర్మాణాలన్నింటినీ తొలగింపజేశారు. జేసీ నిర్ణయమూ బేఖాతర్ ఈ స్థలాల స్వాధీన విషయంలో తమ పార్టీ నాయకులకు అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిలు జేసీ డిల్లీరావును కలిసి న్యాయం చేయాలని కోరారు. అందుకు స్పందించిన ఆయన రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన మాటను కూడా పరిగణనలోకి తీసుకోని రెవెన్యూ అధికారులు అనైతికంగా పశువుల దొడ్లను, కల్లాలను ఖాళీ చేయించారు. వ్యూహాత్మకంగా.. ఈ విషయంలో అడ్డుతగులుతారన్న ఉద్దేశంతో మంగళవారం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు ఆదిరెడ్డి, నాగిరెడ్డి, ఓబిరెడ్డి, వెంకటరామిరెడ్డి, ఈశ్వరరెడ్డిలను బైండోవర్ చేశారు. తిరిగి బుధవారం హౌస్ అరెస్ట్ చేసి తమపని తాము చేసేసుకున్నారు. ఈ సంఘటన పట్ల గ్రామస్తులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ఎంత మంత్రి పదవి ఉంటే కానీ, ఇంత దౌర్జన్యంగా భూములను స్వాధీనం చేసుకుంటారా.. అయినా టీడీపీ నాయకులే లబ్దిదారులా..? ఇతర పార్టీల వారు ఉండరాదా..? ఇదెక్కడి న్యాయం’ అంటూ చర్చించుకున్నారు. -
బాల్యం.. బందీ!
తొర్రూరురూరల్(పాలకుర్తి) : ఆడుతూ.. పాడు తూ.. అల్లరి చేయాల్సిన బాలుడు.. ఏడేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు.. ముద్దుముద్దుగా మాట్లాడాల్సి ఉండగా గొంతు మూగబోయింది. మాట్లాడడమే మానేశాడు. తల్లిదండ్రులతో సహా అందరినీ మరిచిపోయాడు. ఈ పరిస్థితుల్లో విడిచిపెడితే ఎక్కడికి వెళ్తాడో.. ఎవరిని గాయపరుస్తాడో.. తెలియని పరిస్థితి. అందుకే ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు తమ కుమారుడిని ఇనుప గొలుసులతో బంధించారు.తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన గజ్జి యాకయ్య, స్వరూప దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ మూడో సంతానంగా జన్మించిన సాంబరాజు మూడేళ్ల వరకు బాగానే ఉన్నాడు. ఏమైందో ఏమో నాలుగో ఏట మతిస్థిమితం కోల్పోయాడు. ఓ రోజు ఇంట్లో బట్టలు విప్పేసుకుంటూ, నేలపై పడి బొర్లడం చేస్తుండగా తల్లి గమనించి భర్తకు తెలియజేసింది. కొడుక్కు ఏదో వ్యాధి వచ్చిందని ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. కానీ వైద్యుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏం వ్యాధో అంతకుచిక్కలేదు. అమెరికా తీసుకెళ్తే నయం అవుతుందని, లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఆర్థిక స్థోమత లేక స్వగ్రామానికి తిరిగి వచ్చారు. మతిస్థిమితం లేని బాలుడిని వదిలేస్తే ఎటైనా వెళ్లిపోతాడని, బాటసారులను గాయపరుస్తాడని ఏడేళ్లుగా చీకటాయపాలెంలోని తమ వ్యవసాయ భూమిలో గొలుసులతో కాళ్లను కట్టేసి ఉంచుతున్నారు. దాతలు ఎవరైనా స్పందించి ఆర్థికసాయం అందిస్తే తమ కుమారుడికి మెరుగైన వైద్యం చేయిస్తామని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పింఛన్ కూడా లేదు.. గొంతు చచ్చుబడి, మనుషులను గుర్తించలేని ఈ మానసిక దివ్యాంగుడికి ఆసరా పింఛన్ రావడంలేదు. పేద తల్లిదండ్రులు పలుమార్లు అధికారుల కాళ్లావేళ్లా పడ్డా అధికారులు కనికరించలేదు. దీంతో పేద తల్లిదండ్రులు కూలీ నాలి చేసి మతిస్థిమితం లేని కుమారుడిని పోషిస్తున్నారు. కలెక్టర్ చొరవ చూపి పింఛన్ అందేలా చూడాలని కోరుతున్నారు.