శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద ఆయనను 8 నెలల కింద గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు, ఆయన మద్దతుదారులు ఆయన ఇంటి ముందు మాస్కులు ధరించి ఎదురుచూశారు. 370 అధికరణ కింద జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన అనంతరం గతేడాది ఆగస్టు 5 నుంచి ఆయన ఆ రాష్ట్ర గెస్ట్ హౌస్ హరినివాస్‌లో ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కూడా 221 రోజుల నిర్బంధం నుంచి ఈ ఏడాది మార్చి 13న విడుదలయ్యారు. అయితే పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ నిర్బంధం మాత్రం ఇంకా కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment