Top Stories
ప్రధాన వార్తలు

బాబు కవరింగ్ భలే!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వైఖరంతా అదోటైపు!. ఎప్పుడు ఎవరిపై విరుచుకుపడతారో.. దూషణలకు దిగుతారో ఆయనకే తెలియనట్లు ఉంటుంది వ్యవహారం. కావాలంటే తాజా మహానాడును ఉదాహరణగా తీసుకోండి. ‘ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదులను ఏరివేస్తా’ అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఏంటో.. దానికి రాష్ట్ర రాజకీయాలకు సంబంధం ఏమిటో ఆయనకే తెలియాలి!. రాసిచ్చిన స్క్రిప్ట్లేమైనా చదువుతారేమో తెలియదు కానీ.. బాబు గారి ప్రసంగాలు వినేవారికి బీపీ పెరిగిపోవడమైతే గ్యారెంటీ!.2019 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు వదలుకుని ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శిస్తున్న రోజులవి. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదన్న గట్టి నమ్మకంతో చెలరేగి పోయారు బాబుగారు!. దేశ ప్రధానిని పట్టుకుని ఉగ్రవాది అన్నారు. ముస్లింలను బతకనివ్వడన్నారు.. అవినీతిపరుడన్నాడు.. ఇంకా ఏమేమో అనేశాడు! భార్యను ఏలుకోలేనివాడు దేశాన్ని ఏమి ఏలుతాడని ప్రశ్నించారు. ప్రధానిని ఉగ్రవాది అనడమేమిటా? అని అప్పట్లో అందరం బాధపడ్డాం. ఆ మాటకొస్తే మోదీ కూడా బాబు మాటలకు ధీటైన సమాధానమే ఇచ్చారు. అది వేరే సంగతి. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ ఇక అస్సలు కలవలేవని అందరూ అనుకున్నారు. కానీ, ఐదేళ్లు గడిచేసరికి ఆ దూషణలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. రెండు పార్టీలూ మళ్లీ కలిసిపోయాయి. రాజకీయమంటే ఇంత నిస్సిగ్గుగా చేస్తారా? అని అందరూ అనుకునేలా చేశాయి. అప్పటిదాకా తిట్టిన బాబు నోరే పొత్తు కుదిరాక ఇంద్రుడు, చంద్రుడని ప్రశంసల రాగం ఎత్తుకుంది. మోదీ కూడా తన వంతుగా చంద్రబాబును భుజానికైతే ఎత్తుకున్నాడు!.ఈ సంగతి అలా ఉంచితే, చంద్రబాబు ఇప్పుడు ఉగ్రభాష వాడుతున్నారు. కాకపోతే ఈ సారి ఆయన గళమెత్తింది.. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పైనే. పోటీదారు కనుక ఏవైనా విమర్శలు చేయవచ్చు. అందులోనూ ఇచ్చిన హామీలు ఎగ్గొట్టిన విషయం ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు లేదంటే.. ప్రజల అసంతృప్తి పెరిగి పరిస్థితులు జగన్‌కు అనుకూలంగా మారుతున్నాయన్న కోపమూ కారణం కావచ్చు. అయితే మాట్లాడే మాటలకు కొంత విచక్షణ ఉండాలి. జగన్ ఆర్థిక ఉగ్రవాది అనేందుకు ఆయనకున్న ఆధారమేమిటి?.2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అప్పుల గురించి చంద్రబాబు ఎన్ని మాటలు మార్చారు?. ఒకసారేమో రూ.14 లక్షల కోట్లని.. ఇంకోసారి రూ.పది లక్షలు అని ఊరూరా అబద్ధాలు ప్రచారం చేసింది ఈయనే. కానీ, తాజా బడ్జెట్లో ఈ లెక్క కేవలం రూ.ఆరు లక్షల కోట్లేనని స్పష్టమైంది కదా?. ఈ మొత్తంలోనూ తాను గతంలో చేసిన అప్పులూ ఉన్నాయన్న విషయం కూడా చెప్పకపోవడం మోసం చేసినట్టే కదా?. జగన్ ముఖ్యమంత్రిగా సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తే.. చంద్రబాబు ఏడాది కాలంలోనే లక్షన్నర కోట్ల రూపాయల అప్పు చేశారు కదా?. దీన్ని కదా అనాల్సింది ఆర్థిక ఉగ్రవాదం అని?. జగన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం ఉగ్రవాదం అవుతుందా?. ఒకటి అర మాత్రమే అమలు చేసి అడిగిన వారిపై నోరేసుకోవడం ఉగ్రవాదం అవుతుందా?.చంద్రబాబు తన ప్రసంగంలో ఇంకో మాటా అన్నారు.. ఒకసారి గెలవడం.. ఒకసారి ఓడటం ఉండకూడదట. అలా అయితే అభివృద్ది జరగదట.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కూడా వక్కాణించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం కావాలి.. ప్రభుత్వంలో ఉన్న వారిపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయాలి.. ప్రజలను రెచ్చగొట్టాలి. హింసను సైతం ప్రేరేపించాలి.. అభాండాలు వేయాలి.. కార్యకర్తలను కేసులు పెట్టించుకోవాలని కూడా అంటారు. అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యం వద్దు.. నియంతృత్వం కావాలి. తనను వ్యతిరేకించే పార్టీలను, మీడియాను అణచివేయాలి. ఏం చేసినా, చేయకపోయినా అంతా అభివృద్ది చేసేసినట్లు బాజా వాయించుకోవాలి. గతంలో ‘జయము, జయము చంద్రన్న’ అంటూ, లేక ఇప్పుడు ‘చంద్రబాబూ నువ్వే కావాలి’ అంటూ సినీ ఫక్కీలో పాటలు పాడించుకోవాలి. ఒక పార్టీనే అధికారంలో ఉండాలంటే ఆ స్థాయిలో పని కూడా చేయాలి కదా?.వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేస్తున్నారని గమనించి, అంతకు మూడురెట్లు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని, ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయల విలువైన సంక్షేమం ఇస్తానని, అసత్య వాగ్ధానాలు చేసి, అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకపోయినా ఇచ్చేసినట్లు దబాయించినా జనం ఓట్లు వేయాలన్నది చంద్రబాబు సిద్ధాంతం. చంద్రబాబు మామ ఎన్టీఆర్‌ను తోసేసి గద్దెనెక్కిన తరువాత ఎన్ని సార్లు వేర్వేరు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారో అందరికీ తెలుసు. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబు పాలనే సక్రమంగా ఉండి ఉంటే ఇన్ని రకాల పొత్తులు అవసరమై ఉండేవా? అన్నది ఆయన ఆలోచించుకోవాలి.అభివృద్ది అన్నది నిరంతర ప్రక్రియ. కానీ, తాను లేకపోతే అభివృద్ది ఉండదని ప్రజలకు చెప్పడం అంటే అతిశయోక్తులు చెప్పడమే. హైదరాబాద్ తానే అభివృద్ది చేశానని ఈ ప్రాంతంతో సంబంధాలు తెగిపోయిన 21 ఏళ్ల తర్వాత కూడా చెబుతున్నారంటే ఏమనాలి!. హైటెక్ సిటీ భవనం ఒక్క దానిని కట్టి ఆ ప్రాంతం అంతా తానే కట్టేశానని చెప్పగలిగిన సమర్థత ఆయనది. నిజానికి హైదరాబాద్ పడమటి ప్రాంతంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కుకు శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్ధన రెడ్డి ప్రభుత్వమే. అంతకుముందు ఎన్టీ రామారావు హయాంలో మెహిదీపట్నం మీదుగా బీహెచ్ఈఎల్ వరకు హైదరాబాద్ రింగ్ రోడ్డు వేశారు. ఆ రోడ్డు పక్కన పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయి. అయినా అంతా తన ఘనతని ప్రచారం చేసుకుంటారు చంద్రబాబు. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహారావు హైవే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదలైనవి వచ్చాయి. కేసీఆర్ పాలన సమయంలో పలు వంతెనలు, కొత్త ఐటి కంపెనీలు వచ్చాయి.ఏపీలో టీడీపీ పాలనకు, వైఎస్సార్సీపీ పాలనకు ఉన్న తేడాను కేస్ స్టడీ చేయాలని చంద్రబాబు అనడం బాగానే ఉంది. ఎన్నికల మేనిఫెస్టోతో పోల్చుతారా? లేక చంద్రబాబు, జగన్ టైమ్లలో తెచ్చిన అప్పులతో పోల్చుతారా?. జగన్ తీసుకు వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటిని ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పోల్చుతారా?. జగన్ తెచ్చిన ఓడరేవులు, గ్రామ, గ్రామానా జగన్ నిర్మించిన భవనాలు, చంద్రబాబు టైమ్‌తో పోల్చుతారా?. విద్య, వైద్య రంగాలు ఎవరి కాలంలో ఎలా ఉన్నాయో పోల్చుతారా?. ప్రజల ఇళ్ల వద్దకు సేవలు అందించడంలో కూడా పోల్చవచ్చు!. సెకీతో చౌకగా రూ.2.49లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న జగన్ పాలనను, అధిక ధరకు రూ.4.60లకు కొనుగోలు చేసిన చంద్రబాబు ప్రభుత్వంతో పోల్చుతారా?. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల వ్యయాన్ని కూడా కేస్ స్టడీగా తీసుకుంటే బాగానే ఉంటుంది.నీటిపారుదల రంగంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ హయంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా కేస్ స్టడీ చేయవచ్చు. ఇక్కడ ఒక్క సంగతి చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఇప్పటికి సుమారు 15 ఏళ్లు పాలన పూర్తి చేశారు. కానీ, వైఎస్సార్ ఐదేళ్లు, జగన్ మరో ఐదేళ్లు పాలన చేశారు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని కేస్ స్టడీ చేస్తే నిజంగానే మంచి పరిశోధనే అవుతుంది. చంద్రబాబు వాదనలలోని డొల్లతనం, ఎన్ని రకాలుగా ఆయన మాటలు మార్చింది. ఆయన టైమ్‌లో జరిగిన అవినీతి, స్కామ్‌లు అన్ని విషయాలు బయటకు వస్తే ఆయనకే అప్రతిష్ట అవుతుంది.జనం ఎవరూ అడగరు కనుక మహానాడులో ఏవో ఉపన్యాసాలు చెప్పి, అవే నిజాలని ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తే అది ఎల్లకాలం సాధ్యం కాకపోవచ్చు. చివరిగా ఒక మాట. ఈ మహానాడు జరిగిన తీరు ఎలా ఉన్నా ఎల్లో మీడియా మహానాడులో నాలుగు లక్షల మందికి మహా భోజనం అని ప్రచారం చేసింది. అది కూడా సరిగా జరగలేదని, చాలామంది భోజనం దొరక్క ఇబ్బంది పడ్డారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇలా కవరింగ్ ఇచ్చుకున్నారన్న మాట. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

భారత్‌లో 3వేలకు చేరువలో యాక్టివ్ కేసులు.. ఏపీలో కోవిడ్ లెక్కలపై దాపరికం!
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కోవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలకు చేరువయ్యింది. గత 24 గంటల్లోనే ఏడుగురు వైరస్‌తో మరణించడం ఆందోళన రేకెత్తిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసులు వెలుగు చూస్తున్నప్పటికీ.. దాపరికాలు పాటిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఏపీలో కోవిడ్ కేసులు(AP Covid Cases) పెరుగుతూ వస్తున్నా.. అధికార యంత్రాంగం నిస్తేజంలో ఉండిపోయింది. వైరస్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుండడం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా.. ఏలూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్లోని ముగ్గురు ఉద్యోగులకు వైరస్ సోకింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ముగ్గురికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటిట్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు.. వైద్యుల సూచన మేరకు ఆ ముగ్గురు ఉద్యోగుల్ని ఐసోలేషన్‌కి పంపించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తమను అప్రమత్తం చేయకుండా అధికారులు ఇలా వ్యవహరించడం ఏంటని మండిపడుతున్నారు. ఏపీలో విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమగోదావరి, గుంటూరు.. ఇలా కేసులు వెలుగు చూశాయి. కడపలో కరోనా కేసు వెలుగు చూస్తే.. దానిని అధికారులు దాచిపెట్టే ప్రయత్నం చేయడం తెలిసిందే. టీడీపీ మహానాడు నేపథ్యంలోనే ప్రభుత్వ సూచన మేరకు అధికారులు అలా చేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది కూడా. ఇదీ చదవండి: మహానాడు కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటంరాష్ట్రంలో పలు చోట్ల కోవిడ్ కేసులు నమోదు అవుతున్నా.. ఆ సంఖ్యను ఇంకా సింగిల్ డిజిట్‌గానే ప్రభుత్వం ప్రకటిస్తుండడం గమనార్హం. ఇంకోవైపు విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కోవిడ్‌తో ఒకరు మరణించినట్టు ప్రచారం జరగ్గా.. ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం దానిని కొట్టిపారేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ లెక్కలుకేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ గణాంకాల ప్రకారం.. భారత్‌లో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య(Covid Active Cases) 2,710కి చేరింది. కిందటి వారంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. తాజా డాటా ప్రకారం కేరళలో రికార్డు స్థాయిలో 1,147 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223 కేసులు రికార్డు అయ్యాయి. కర్ణాటక, తమిళనాడులో చెరో 148 కేసులు, పశ్చిమ బెంగాల్లో 116 కేసులు వెలుగు చూశాయి.గత 24 గంటల్లో.. కోవిడ్‌తో ఏడుగురు(India Covid Deaths) మరణించారు. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. వీళ్లలో 50 ఏళ్ల పైబడిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. గత ఐదు నెలలో మొత్తంగా వైరస్ ధాటికి 22 మంది మృతి చెందారు. అయితే.. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో తీవ్రత అంతగా ఉండడం లేదని, పాజిటివ్‌గా నిర్ధారణ అయిన నాలుగైదు రోజుల్లోనే బాధితులు కోలుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో.. జ్వరం, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయన్నారు. జ్వరం తీవ్రంగా ఉన్నవారు మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. అయితే..ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రాకున్నా.. జాగ్రత్తలు మాత్రం కచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలని, అవసరమైతే తప్ప.. ప్రయాణాలు చేయరాదని, ఫంక్షన్లకు హాజరు కావొద్దని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: భారత్‌లో కోవిడ్: శరవేగంగా వ్యాప్తి.. ఎందుకో తెలుసా?

'హరి హర వీరమల్లు'తో పక్కదారి పట్టించారు: ఆర్ నారాయణమూర్తి
జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ ఉంటుందని ప్రకటన వచ్చిన తర్వాత చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ఎంట్రీతో చిత్ర పరిశ్రమ ఆ నిర్ణయాన్ని సడలించుకుంది. తాజాగా ఇదే అంశంపై నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి పలు వ్యాఖ్యలు చేశారు.మల్టీఫ్లెక్స్ మాదిరే సింగిల్ థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని ఆయన కోరారు. అయితే, కొందరు అసలు విషయాన్ని దాటేసి ఇదంతా 'హరి హర వీరమల్లు' సినిమాకు నష్టం చేసేందుకు కుట్ర అంటూ తెరపైకి తీసుకురావడం చాలా దుర్మార్గం అని పేర్కొన్నారు. సింగిల్ థియేటర్స్ మనుగడ కోసమే వారు బంద్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఇలా అన్నారు. 'నేను చాలా ఏళ్ల క్రితమే సింగిల్ థియేటర్లకు కూడా పర్సంటేజీ సిస్టమ్ ఉండాలని, లీజ్ సిస్టమ్ వద్దని కోరాను. చాలామంది నిర్మాతలు కూడా ఇదే కోరుకుంటున్నారు. పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. కానీ, హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పర్సంటేజీలు ఖరారైతే నా లాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుంది. పవన్ కల్యాణ్‌పై ఎవరు కుట్ర చేస్తారు..? పవన్ కార్యాలయం నుంచి ఆ ప్రకటన రావడం సమంజసంగా లేదు. హరిహర వీరమల్లు కోసం కాకుండా సినీ పరిశ్రమలోని సమస్యలపై చర్చిద్దాం.. రావాలని పిలిస్తే పవన్‌పై గౌరవం మరింత పెరిగేది. పర్సంటేజీ సిస్టమ్ అన్ని థియేటర్స్‌కు లేకపోవడం వల్ల నిర్మాతలు అందరూ నాశనం అయిపోతున్నారు. సింగిల్ థియేటర్స్ మూత పడుతున్నాయి. మల్టీఫ్లెక్స్‌ల మాదిరే వాటికి కూడా ఇదే పద్ధతి ఉండాలి. దీని కోసం మేము చాలా ఏళ్లపాటు పెద్ద ఉద్యమం చేశాం. థియేటర్స్ 'లీజ్ సిస్టమ్' వల్ల తీరని నష్టం జరుగుతుంది. దీనిని అందరూ గుర్తించాలి. 'బంద్ అనేది బ్రహ్మాస్తం లాంటిది. సింగిల్ థియేటర్ల మనుగడ నేడు ప్రశ్నార్థకరమైంది. భారతదేశంలో సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి దొరికే వినోదం. పర్సంటేజి విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒక్కణ్ణి. ఈ విషయంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు చేశాం. ఎంతో మంది ఛాంబర్ ప్రెసిడెంట్లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. పర్సంటేజి విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లుకు లింకు పెట్టడం సరికాదు. పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలువాలని అనడంలో తప్పులేదు. మేం మీ బిడ్డలం. ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి పర్సంటేజి అంశాన్ని పక్కదారి పట్టించవద్దు. కార్పొరేట్ సిస్టమ్‌లకు వంతపాడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి. సింగిల్ థియేటర్లు దేవాలయాల లాంటివి. కానీ, నేడు సింగిల్ థియేటర్లు కళ్యాణ మండపాలవుతున్నాయి. పర్సంటేజిని బతికించి నిర్మాతలను కాపాడాలి. ఇదే జరిగితే ప్రేక్షకులు ఓటీటీలలోనే సినిమాలు చూస్తారు. ఆ పొరపాటు జరిగితే ఇండస్ట్రీ నాశనమవుతుంది. పవన్ సినిమా రిలీజ్ అవుతుందటే థియేటర్స్ బంద్ చేయడం చాలా దుర్మార్గం అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆయన మాటలు చాలా తప్పు. ఈ పోరాటం ఇప్పటిది కాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి.' అని నారాయణమూర్తి అన్నారు.

అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
సాక్షి, అన్నవరం: అన్నవరం దేవస్థానం ఏఈఓ కొండలరావు.. మహిళా భక్తులతో అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇలా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా కొండలరావును ఆలయ విభాగం నుండి గోశాల, గార్డెన్స్ విభాగాలకు బదిలీ చేశారు. ఇక, కొండలరావుపై ఇప్పటి వరకు ఇద్దరు మహిళా భక్తులు ఫిర్యాదు చేయడం గమనార్హం.వివరాల ప్రకారం.. తెలంగాణలోని మంచిర్యాల నుంచి సత్యదేవుని సన్నిధిలో సేవ చేయడానికి వచ్చిన తమ పట్ల కొండలరావు దురుసుగా ప్రవర్తించారని మహిళా సేవకులు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై మండిపడిన దేవదాయ శాఖ కమిషనర్ ఈ వ్యవహారంపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావును ఆదేశించారు. ఈ మేరకు కొండలరావుకు షోకాజ్ నోటీసు కూడా జారీ అయ్యింది. ఈ వివాదం ఇంకా ముగియక ముందే ఆయనపై మరో భక్తుడు తీవ్ర స్థాయి ఆరోపణలతో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో) ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.ఏం జరిగిందంటే..హైదరాబాద్‌కు చెందిన భక్తుడు హోతా కామేశ్వరశాస్త్రి ఈ నెల 13వ తేదీ రాత్రి జరిగిన సత్యదేవుని శ్రీపుష్పయాగం కార్యక్రమానికి అన్నవరం వచ్చారు. రూ.రెండు వేల టికెట్‌తో సత్యదేవుని వ్రతం ఆచరించి, స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పురోహితుడు రాత్రి స్వామివారి శ్రీపుష్పయాగ మహోత్సవం జరుగుతుందని చెప్పడంతో కామేశ్వరశాస్త్రి దంపతులు హైదరాబాద్ ప్రయాణం రద్దు చేసుకున్నారు. అనంతరం, సత్యదేవుని శ్రీపుష్పయాగానికి హాజరయ్యారు. ఈ ఉత్సవం ముగిసిన తరువాత ప్రసాదం తీసుకునేందుకు అర్చకుని వద్దకు వెళ్లగా, తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి తన భార్య భుజంపై చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు.దీంతో, తాను ఒక్కసారిగా షాక్‌కు గురైనట్టు తెలిపారు. అయితే, ఆ వ్యక్తి దేవస్థానం ఏఈఓ కొండలరావుగా అక్కడి సిబ్బంది ద్వారా తెలుసుకున్నానని పేర్కొన్నారు. వెంటనే ఈ విషయమై ఈవోకు ఫిర్యాదు చేద్దామనుకున్నాను. కానీ, అప్పటికే ఈవో కొండ దిగువకు వెళ్లిపోయారని తెలిసి హైదరాబాద్ వచ్చేశామని పేర్కొన్నారు. తన భార్యతో పాటు ఇతర భక్తుల పట్ల అతడి ప్రవర్తన అదేవిధంగా ఉందని ఆ ఫిర్యాదులో కామేశ్వరశాస్త్రి చెప్పుకొచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదు కాపీని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి గురువారం దేవస్థానానికి పంపించి, దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈవోను ఆదేశించారు. దీనిపై విచారణాధికారి ద్వారా విచారణ చేయించనున్నట్లు ఈవో తెలిపారు.

అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం నిజంగా అద్బుతం: గిల్
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ ప్రయాణం ముగిసింది. శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైన గుజరాత్.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో గుజరాత్ విఫలమైంది. సాయిసుదర్శన్(81), వాషింగ్టన్ సుందర్(48) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ మిగితా బ్యాటర్లు తేలిపోవడంతో గుజరాత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. లక్ష్య చేధనలో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పయి 208 పరుగులు చేయగల్గింది. ఇక ఈ హార్ట్‌బ్రేకింగ్ ఓటమిపై మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పందించాడు. తమ పేలవ ఫీల్డింగ్ కారణంగానే ఓడిపోయాము అని గిల్ తెలిపాడు."క్రికెట్ అనేది నిజంగా ఒక అద్బుతమైన గేమ్. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఈ మ్యాచ్‌లో మేము ఆఖరి వరకు పోరాడి ఓడిపోయాము. చివరి మూడు, నాలుగు ఓవర్లలో మాకు కలిసి రాలేదు. అయినప్పటికి మేము బాగానే ఆడాము. కచ్చితంగా క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.ఈ మ్యాచ్‌లో మేము మూడు సునాయస క్యాచ్‌లు జారవిడిచాము. ఈజీగా క్యాచ్‌లను వదిలిస్తే బౌలర్లకు పరుగులను నియంత్రించడం అంత సులభం కాదు. సాయిసుదర్శన్, వాషింగ్టన్ సుందర్‌కు మేము ఒకటే మెసేజ్ పంపాము. ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తిగా స్వేచ్ఛగా ఆడాలని వారికి చెప్పాం. జట్టును గెలిపించడమే వారద్దరి లక్ష్యం.మంచు కారణంగా వికెట్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. ఈ సీజన్లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. గత మూడు మ్యాచ్‌లలో మేము స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాము. కానీ జట్టులోని ప్రతీ ఒక్కరూ కూడా మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా సాయిసుదర్శన్ ఒక అద్బుం. ఈ సీజన్లో అతడు ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: సంతోషంగా ఉంది.. అతడి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: హార్దిక్

గోల్డ్ లోన్ నిబంధనల సడలింపు ప్రతిపాదనలు
బంగారు రుణాల కొత్త ముసాయిదా నిబంధనల నుంచి చిన్న రుణగ్రహీతలకు మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వశాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను కోరింది. బంగారం తనఖా పెట్టి రూ.2 లక్షల వరకు రుణాలు పొందేవారికి నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తోపాటు కొందరు ఆర్థిక నిపుణుల నుంచి అభ్యర్థనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆర్థిక శాఖ ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే అదనంగా కొన్ని మార్గదర్శకాలను జనవరి 1, 2026 నుంచి అమలు చేయాలని మంత్రిత్వ శాఖ ఆర్బీఐకి సిఫార్సు చేసింది.ప్రతిపాదిత మార్పులు ఇలా..ఆర్బీఐ ముసాయిదా నిబంధనల్లో రుణగ్రహీతలను గణనీయంగా ప్రభావితం చేసే రెండు కీలక మార్పులను ప్రతిపాదిస్తున్నారు. అందులో లోన్-టు-వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తి తగ్గింపు నిర్ణయం కీలకంగా ఉంది. అంటే రుణగ్రహీతలు తాకట్టు పెట్టే బంగారం విలువలో ఇప్పటివరకు 80% వరకు రుణాలు వచ్చేవారు కాస్తా దీన్ని 75% కి తగ్గించాలనే ప్రతిపాదనలున్నాయి. దీని ద్వారా రుణగ్రహీతలు బంగారంపై తక్కువ డబ్బును పొందుతారు. తాకట్టు పెట్టిన బంగారానికి యాజమాన్య రుజువును అందించాలనేలా మరో ప్రతిపాదన ఉంది.ఇదీ చదవండి: టర్కీ ఎయిర్‌లైన్స్ డీల్ ప్రశ్నార్థకంఆ నిబంధనలను ఖరారు చేయడానికి ముందు ఆర్బీఐ ప్రస్తుత బ్యాంకింగ్, బ్యాంకింగేతర రంగాలతో సహా ఇతర వాటాదారుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను సమీక్షిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నిరంతరాయంగా రుణ సదుపాయం లభించేలా చూడటం ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ విధుల్లో ప్రాథమిక అంశమని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

OP shield: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళే మాక్ డ్రిల్స్
న్యూఢిల్లీ, సాక్షి: పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇవాళ ఆపరేషన్ షీల్డ్(Operation Shield) కొనసాగనుంది. జమ్ము, పంజాబ్, రాజస్థాన్, హర్యానాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఎయిర్రైడ్ సైరన్ డ్రిల్ నిర్వహించనున్నారు. మొత్తం 244 జిల్లాల్లో సాయంత్రం 5గం. నుంచి 9గం. దాకా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. యుద్ధంలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని భద్రతా బలగాలు ఎలా వ్యవహరించాలి, మరీ ముఖ్యంగా పౌర రక్షణ నేపథ్యంతో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఈ నెలలో.. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) కంటే కొన్ని గంటల ముందు(మే 7వ తేదీన) తొలిసారి పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇవాళ మరోసారి కేంద్ర హోం శాఖ నిర్వహించబోతోంది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరి యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అనే అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర హోం శాఖ మాక్ డ్రిల్స్(Mock Drills) నిర్వహించింది. సైరన్ వినగానే ప్రజలు అప్రమత్తమైన చెవులు మూసుకుని కింద పడుకోవడం, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం లేదంటే భద్రతా బలగాలే వాళ్లను తరలించడం.. దాడుల్లో గాయపడిన వాళ్లను రెస్క్యూ చేయడం తరహా చర్యలు ఈ డ్రిల్స్‌లో ఉంటాయి. అప్పుడు.. మళ్లీ ఇప్పుడుఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం గమనార్హం. 1971లో తూర్పు పాకిస్థాన్(ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్థాన్‌లో పోరాడాల్సి రావడంతో దేశ వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకు ముందు 1962, 65 యుద్ధాల సమయంలో కూడా నిర్వహించారు. అయితే.. కార్గిల్ యుద్ధం అప్పుడు జరిగినా.. అది పరిమిత ప్రాంతాల్లోనే జరిగింది.ఇదీ చదవండి: ప్రముఖ యూట్యూబర్‌పై కోర్టు ధిక్కార చర్యలు!

శశిథరూర్ దౌత్య విజయం.. వైఖరి మార్చుకున్న కొలంబియా
న్యూఢిల్లీ: భారత్ మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన సమయంలో పాకిస్తాన్లో చోటుచేసుకున్న మరణాలపై దక్షిణ అమెరికాలోని కొలంబియా సంతాపం ప్రకటించింది. అయితే దీనిపై ఎంపీ శశిథరూర్(MP Shashi Tharoor) కొలంబియాకు అవగాహన కల్పించడంతో, తాను గతంలో చేసిన ప్రకటనను ఆ దేశం ఉపసంహరించుకుంది. అలాగే ఉగ్రవాదంపై పోరు సాగిస్తున్న భారత్‌కు మద్దతిస్తున్నట్లు స్పష్టం చేసింది.కొలంబియా పర్యటనలో ఉన్న అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మీడియాతో మాట్లాడుతూ కొలంబియా(Colombia) ఇటీవల పాక్ మరణాలపై చేసిన ప్రకటనను ఉపసంహరించుకున్నదని, త్వరలోనే భారత్ వైఖరికి మద్దతు పలుకుతూ, మరో ప్రకటన చేయనున్నదని తెలిపారు. ఈ సందర్భంగా యునైటెడ్ స్టేట్స్‌లోని మాజీ భారత రాయబారి, బీజేపీ నేత తరంజిత్ సింగ్ సంధు మాట్లాడుతూ తమ ప్రతినిధి బృందం భారత్-పాక్ యుద్ధంపై సరైన వివరణ ఇవ్వడంతో, అది కొలంబియా వైఖరిలో మార్పు వచ్చేందుకు సహాయపడిందని అన్నారు.దీనిపై కొలంబియా ఉప విదేశాంగ మంత్రి రోసా యోలాండా విల్లావిసెన్సియో మాట్లాడుతూ తమకు భారత్- పాక్‌ల మధ్యనున్న వాస్తవ పరిస్థితులు తెలిశాయని, కశ్మీర్లో ఏమి జరిగిందనే దానిపై అవగాహన ఏర్పడిందన్నారు. ఇకపై తాము స్పష్టమైన ప్రకటన చేయగలమన్నారు. కాగా ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో పాక్‌లో చోటుచేసుకున్న మరణాలపై కొలంబియా సంతాపం ప్రకటించడాన్ని ఎంపీ శశిథరూర్ ఖండించారు. ఇది కూడా చదవండి: అణు విపత్తును ఆపేశా: ట్రంప్ నోట అదే పాట

ఉక్కు ఉద్యమంపై కూటమి ఉక్కు పాదం
సాక్షి, విశాఖపట్నం: ఉక్కు ఉద్యమంపై(Vizag Steel Plant Movement) కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. ఉద్యమాన్ని అణచివేసే కుట్రలో భాగంగా.. సంఘాల నాయకులను లక్ష్యంగా చేసుకుంది. తాజాగా.. యూనియన్ నేతలపై కేసులు బనాయించడంతో కార్మికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.వైజాగ్ స్టీల్‌ప్లాంట్(VSP) అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి ప్రయత్నించారంటూ 8 మంది కార్మిక నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో.. వైఎస్సార్సీపీ హయాంలోనూ యూనియన్లు ఉద్యమాలు, రాస్తారోకోలు చేశాయి. కానీ, ఆ టైంలో ఏ ఒక్కరి మీదా కేసులు పెట్టలేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam)లో ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు పెట్టడం గురించి కార్మికులు చర్చించుకుంటున్నారు. ఇదీ చదవండి: ఈ రిమార్క్ ఎవరిది లోకేశా?

Bedtime Yoga : నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్ ఆసనాలు
రాత్రి నిద్రించడానికి ముందు చేసే కొన్ని యోగాసనాల వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటుంది. గ్యాస్ట్రిక్, పొట్ట భాగంలో అధిక కొవ్వు సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. భోజనం చేసిన రెండు గంటల తర్వాతనే ఈ ఆసనాలను సాధన చేయాలి. అప్పుడే నిద్ర, ఉదరకోశ సమస్యలకు సరైన ఫలితాలను పొందుదుతారు. పవన ముక్తాసన యోగా మ్యాట్‌పైన వెల్ల్లకిలా పడుకోవాలి. మోకాళ్ళను వంచి, వాటిని ఛాతీ వైపు తీసుకురావాలి. మోకాళ్ళను చేతులతో కౌగిలించుకుని, 20 నుండి 30 సెకన్ల పాటు అదే స్థితిలో ఉండాలి. తర్వాత సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనాన్ని 3 నుండి 5 సార్లు పునరావృతం చేయాలి.సేతు బంధాసనమ్యాట్పైన పడుకొని పాదాల మధ్య కొంత స్పేస్ ఉంచుతూ, తుంటి భాగాన్ని పైకి ఎత్తాలి. రెండు చేతులతో కాలి మడమలను పట్టుకోవాలి. ఈ భంగిమలో శరీరం వంతెన భంగిమను తలపిస్తుంది. 20 నుండి 30 సెకన్ల ΄ాటు అలాగే ఉండి, తర్వాత తుంటిని తిరిగి కిందకు దించాలి. ఈ ఆసనాన్ని 3 నుంచి 5 సార్లు పునరావృతం చేయాలి. చదవండి: Yoga 9 ఏళ్లకే గిన్నిస్ రికార్డు‘యోగం’వజ్రాసనమోకాళ్లను వంచి,పాదాల మీదుగా హిప్ భాగం వచ్చేలా కూర్చోవాలి. వెన్నును నిటారుగా ఉంచాలి. రెండు చేతులను పొట్ట దగ్గరగా ఉంచాలి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ, వదలాలి. ఈ ఆసనంలో సౌకర్యంగా ఉన్నంత సేపు కూర్చోవచ్చు. ఇదీ చదవండి: NMACC లో బాలీవుడ్ స్టార్ కిడ్ బర్త్‌డే సెలబ్రేషన్స్
రజాకార్, మల్లేశం సినిమాలకు గద్దర్ అవార్డులు
ముంబై చేతిలో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న గిల్ సోదరి! వీడియో వైరల్
నీరుగారుతున్న ఉపాధి హామీ చట్టం లక్ష్యం
వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
కవిత లేఖ, రేవంత్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
విషాదం మిగిల్చిన విహారయాత్ర
నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్?
బాబు భవిష్యత్తుపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు
చెల్లెళ్లు ఆటపట్టించడంతో అక్క ఆత్మహత్య
అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య
జూబ్లీహిల్స్ బేబీలాన్ పబ్‌లో దారుణం
‘మా ఆయన సంసారానికి పనికి రాడు సార్’..!
1.5 అడుగుల ఎత్తులోగది నిండా నోట్లకట్టలే
టూ ఇన్ వన్! ముందు జాగ్రత్త చర్యగా కారును అలా డిజైన్ చేయించుకున్నా..!
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత
పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా
మా ఊరికి రోడ్లు, కరెంటు, స్కూలు, ఆసుపత్రులు లేవని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోనిది నువ్వే కదా!
శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్ డే' అంటూ ఫోటోలు విడుదల.. అసలు విషయం ఇదేనా?
ఈ రాశి వారికి రుణాలు తీరతాయి.. ఆప్తులతో సఖ్యత
నెత్తి మీద మంట పెట్టి వెళ్లిపోతున్నాడు సార్!
IPL 2025, Eliminator Match: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
అదేదో ఎన్నికలప్పుడు పార్టీ వాణీ కూడా వినిపిస్తే గెలిచేవాళ్లం కదా!?
‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్ ఆర్మీ చీఫ్
పెరుగుతున్న చైనా ప్రాబల్యం
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు
కాంగ్రెస్ లో శశిథరూర్ ముసలం
అప్పుడు నగ్నంగా నటించిన 'బ్రిగిడా' మరోసారి ట్రెండ్ (ఫోటోలు)
కేటీఆర్‌పై విరుచుకుపడ్డ కవిత.. నాతో పెట్టుకోవద్దు..
20 నిమిషాల పాత్రకి 20 కోట్లట..పదేళ్లలోనూ ఫ్లాపులే ఎక్కువ!
ఇంగ్లండ్ పర్యటనలో తొలి ఇన్నింగ్స్‌లోనే సత్తా చాటిన కరుణ్ నాయర్
రజాకార్, మల్లేశం సినిమాలకు గద్దర్ అవార్డులు
ముంబై చేతిలో ఓటమి.. కన్నీరు పెట్టుకున్న గిల్ సోదరి! వీడియో వైరల్
నీరుగారుతున్న ఉపాధి హామీ చట్టం లక్ష్యం
వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
కవిత లేఖ, రేవంత్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
విషాదం మిగిల్చిన విహారయాత్ర
నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్?
బాబు భవిష్యత్తుపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు
చెల్లెళ్లు ఆటపట్టించడంతో అక్క ఆత్మహత్య
అడ్డు తొలగించుకోవాలనే యువతి హత్య
జూబ్లీహిల్స్ బేబీలాన్ పబ్‌లో దారుణం
‘మా ఆయన సంసారానికి పనికి రాడు సార్’..!
1.5 అడుగుల ఎత్తులోగది నిండా నోట్లకట్టలే
టూ ఇన్ వన్! ముందు జాగ్రత్త చర్యగా కారును అలా డిజైన్ చేయించుకున్నా..!
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత
పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా
మా ఊరికి రోడ్లు, కరెంటు, స్కూలు, ఆసుపత్రులు లేవని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోనిది నువ్వే కదా!
శ్రీలీల నిశ్చితార్థం..? 'బిగ్ డే' అంటూ ఫోటోలు విడుదల.. అసలు విషయం ఇదేనా?
ఈ రాశి వారికి రుణాలు తీరతాయి.. ఆప్తులతో సఖ్యత
నెత్తి మీద మంట పెట్టి వెళ్లిపోతున్నాడు సార్!
IPL 2025, Eliminator Match: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
అదేదో ఎన్నికలప్పుడు పార్టీ వాణీ కూడా వినిపిస్తే గెలిచేవాళ్లం కదా!?
‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్ ఆర్మీ చీఫ్
కాంగ్రెస్ లో శశిథరూర్ ముసలం
పెరుగుతున్న చైనా ప్రాబల్యం
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు
కేటీఆర్‌పై విరుచుకుపడ్డ కవిత.. నాతో పెట్టుకోవద్దు..
20 నిమిషాల పాత్రకి 20 కోట్లట..పదేళ్లలోనూ ఫ్లాపులే ఎక్కువ!
'చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై జైశంకర్ మాట
ఇంగ్లండ్ పర్యటనలో తొలి ఇన్నింగ్స్‌లోనే సత్తా చాటిన కరుణ్ నాయర్
సినిమా

ఉత్తమ హాస్యనటుడు.. కామారెడ్డి కిశోరుడు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: హాస్య నటుడిగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న వెన్నెల కిశోర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ సినీ పురస్కారం–2024కి ఉత్తమ హాస్య నటుడిగా ఎంపిక చేసింది. వచ్చే నెల 14న హైదరాబాద్‌లో నిర్వహించే వేడుకలో కిశోర్‌కు పురస్కారం అందజేయనున్నారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ, యశోద దంపతులకు నలుగురు కూతుళ్లతోపాటు కుమారుడు కిశోర్. పట్టణంలోని జీవదాన్ హైస్కూల్లో పదో తరగతి వరకు చదివిన కిశోర్ ఇంటర్మీడియెట్ మాతృశ్రీ కాలేజీలో అభ్యసించారు. తరువాత హైదరాబాద్‌లో ఉన్నత చదువులకు వెళ్లారు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన వివిధ కోర్సులు అభ్యసించారు. ఇంగ్లిష్ పత్రికలు, ఇంగ్లిష్ నవలలు చదివే అలవాటున్న కిశోర్ ఆ భాషపై మంచి పట్టుసాధించారు. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లిన కిశోర్ చదువు పూర్తికాగానే అక్కడే ఉద్యోగంలో చేరారు. కామారెడ్డికి చెందిన స్నేహితులను కిశోర్ రెగ్యులర్‌గా కలుస్తుంటారు.మరో అవార్డు..రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సినీ పురస్కారాలు–2024ను గురువారం ప్రకటించింది. మత్తువదలరా–2 సినిమా లో నటించిన వెన్నెల కిశోర్, సత్యను సంయుక్తంగా ఉత్తమ హాస్యనటులుగా ఎంపిక చేసింది. గతంలో నంది, సైమా అవార్డులను కిశోర్ అందుకున్నారు. తాజాగా మరో పు రస్కారం దక్కింది. కిశోర్ కు అవార్డు దక్కడంతో ఆయన మేనల్లు డు, లిటిల్ స్కాల ర్స్ స్కూల్కరస్పాండెంట్ పున్న రాజేశ్, అక్కా, బావ అరుణ, రాజేశ్వర్ ఆనందం వ్యక్తం చేశారు.సినిమా పేరే ఇంటిపేరుగా..అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో (2005) కిశోర్‌కు ఊహించకుండానే సి నిమాలో నటించే అవకాశం వచ్చింది. ‘వె న్నెల’ సినిమాలో ఆయన నటించడంతో ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మా రింది. ఆ తరువాత మూడునాలుగేళ్లపాటు సినీ అవకాశాలు లేకపోవడంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన తన భార్యతో కలిసి కిశో ర్ ఇండియాకు వచ్చేశారు. 2009లో సినీ అ వకాశాలు రావడం మొదలుకాగా, ఆ తరువాత కిశోర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సుమారు 130కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. పూర్తి స్థాయి నటుడిగా సినీ రంగంలో స్థిరపడ్డారు.

బక్రీద్ కానుకగా ఓటీటీలో 'లాల్ సలామ్'.. అధికారిక ప్రకటన
సౌత్ ఇండియాలో భారీ అంచనాలతో రజనీకాంత్ 'లాల్ సలామ్'(Lal salaam) (2024) విడుదలైంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. అయినప్పటికీ రజనీ (Rajinikanth) అభిమానులు ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా లాల్‌సలామ్ ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించిగా రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించారుబక్రీద్ పండుగ కానుకగా జూన్ 6న ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు సన్ నెక్ట్స్(Sun NXT) ప్రకటించింది. ఎదురుచూపులకు తెర పడింది అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్ వర్షన్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సుమారు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. అయితే, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 52 కోట్లు మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా ఓటీటీ ఢీల్స్ మొదట నెట్‌ఫ్లిక్స్‌తో కుదుర్చుకుంది. అయితే, సినిమా విడుదల సమయంలో నెట్‌ఫ్లిక్స్ సూచించిన సీన్స్ కలపకపోవడంతో ఆ ఢీల్‌ను క్యాన్సల్ చేసుకున్నారు. దీంతో లాల్ సలామ్ ఓటీటీ విడుదల ఆలస్యానికి ప్రధాన కారణం అయింది.కథేంటంటే'లాల్ సలామ్' కథ మొత్తం 1990ల కాలం బ్యాక్‌డ్రాప్‌తో నడుస్తోంది. మొయిదీన్ భాయ్ (రజనీకాంత్) కుమారుడు సంషి (విక్రాంత్), గురు (విష్ణు విశాల్) స్నేహితులు. షంషుద్దీన్ (విక్రాంత్)ను క్రికెటర్‌ను చేయాలన్నది తండ్రి కల. అనుకున్నట్లు గానే సంషి రాష్ట్ర రంజీ జట్టుకు ఆడటానికి ఎంపికవుతాడు. ఈ క్రమంలో ఆ ఊళ్లో త్రీస్టార్ - ఎంసీసీ టీమ్స్ మధ్య జరిగే క్రికెట్ ఆటతో రెండు మతాల మధ్య గొడవ మొదలౌతుంది. ఆ గొడవలోనే షంషుద్దీన్ చేతిని నరికేస్తాడు గురు అలియాస్ గురునాథం (విష్ణు విశాల్).. దాడి చేసిన గురు కూడా మొయిదీన్ భాయ్‌కి ప్రాణ స్నేహితుడు అయిన (ఫిలిప్ లివింగ్‌స్టోన్) కుమారుడు కావడం విశేషం. హిందూ ముస్లింలు ఐకమత్యంగా ఉండే ఆ ఊరిలో క్రికెట్ వల్ల మత కల్లోలంగా మారుతుంది. ముంబైలో వ్యాపారావేత్తగా రాణిస్తున్న మొయిద్దీన్ అ గ్రామానికి తిరిగొస్తాడు. కుమారుడి చేయి నరికిన స్నేహితుడి కుటుంబాన్ని మొయిదీన్ ఏం చేస్తాడు..? క్రికెట్లో గొడవలకు కారణం ఏంటి..? సంషి, గురు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు ఎలా మొదలైంది..? తన కొడుకు చేయి నరికిన గురును మొయిద్దీన్ ఏం చేశాడు..? అనేది తెలియాలంటే జూన్ 6న సన్ నెక్ట్స్‌లో లాల్ సలామ్ చూడాల్సిందే.

అవార్డులు గౌరవం ఇస్తాయి: మురళీమోహన్
‘‘రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదేళ్లుగా అవార్డులు ఇవ్వడం మానేశాయి. ప్రభుత్వం నుంచి ఒక అవార్డు రావాలి, ఆ అవార్డుని ఇంట్లో పెట్టుకోవాలని ఆశిస్తాం. అంతేకానీ డబ్బుల గురించి కాదు... అవార్డు లనేవి గౌరవం ఇస్తాయి’’ అని నటుడు, నిర్మాత మురళీమోహన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించనున్న ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్(Gaddar Telangana Film Awards) (2014–2023)కి సంబంధించి జ్యూరీ చైర్మన్‌గా మురళీమోహన్ వ్యవహరించారు. జూన్ 14న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ అవార్డుల వేడుక జరగనుంది.ఈ అవార్డుల వివరాలను ప్రకటించేందుకు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజుతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లోని ఎఫ్డీసీ కార్యాలయంలో మురళీమోహన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ప్రతి ఏటా అవార్డులు ఇవ్వాలని ఈ పదేళ్లల్లో ముఖ్యమంత్రులందర్నీ కలిసి విన్నవించాం. అప్పుడు అందరూ ఇద్దాం, చేద్దాం అన్నారు కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిగారు ఓ స్ఫూర్తితో ప్రజాగాయకుడు గద్దర్‌గారి పేరిట ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’ని ప్రకటించడం సంతోషం. ఈ కమిటీకి ‘దిల్’ రాజుగారు నన్ను చైర్మన్‌ని చేశారు.మా జ్యూరీలో అందరూ అనుభవం ఉన్నవారిని, సినిమాకి సంబంధం ఉన్న వ్యక్తులనే నియమించారు. అందరం కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయంతోనే అవార్డులు ఎంపిక చేశాం. గురువారం సాయంత్రం ఈ అవార్డుల జాబితాను రేవంత్ రెడ్డిగారికి సమర్పించాం. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నాం. ఈ అవార్డుల ప్రదానానికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డిగారికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున ధన్యవాదాలు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి అవార్డుల ప్రదానం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని, ఒక అవగాహనకు రావాలి. ఒక్కో ఏడాది ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటిస్తే బాగుంటుంది. ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదు. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు’’ అని పేర్కొన్నారు.తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘2014 నుంచి 2023 వరకు ప్రతి ఏడాది మూడు అవార్డుల చొప్పున (తొలి ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రం, తృతీయ ఉత్తమ చిత్రం) ఈ పదేళ్లకు సంబంధించిన సినిమాలను జ్యూరీ చైర్మన్ మురళీమోహన్‌గారి ఆధ్వర్యంలోని జ్యూరీ ఎంపిక చేసింది. అలాగే ఆరు ప్రత్యేక అవార్డులు ఇవ్వనున్నాం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నంది అవార్డుల్లో ఉన్న నాలుగు ప్రత్యేక అవార్డు (రఘుపతి వెంకయ్య, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి, ఎన్టీఆర్ జాతీయ అవార్డులు) లతోపాటు అదనంగా తెలంగాణకి చెందిన పైడి జైరాజ్, కాంతారావు పేర్లతోనూ అవార్డులను ఇవ్వనున్నాం. జూన్ 14న 2024కి సంబంధించిన ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’తోపాటు ఈ పదేళ్లకి సంబంధించిన అవార్డులను కలుపుకుని మొత్తం 11 ఏళ్లకి సంబంధించి అదే రోజు ప్రదానం చేస్తాం’’ అని తెలిపారు. ఈ సమావేశంలో జ్యూరీ సభ్యులు కె. దశరథ్, డీవీకే రాజు, ఊహ, ఉమామహేశ్వర రావు, వనజా ఉదయ్, కూచిపూడి వెంకట్, కె. శ్రీధర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డా. హరీశ్ తదితరులు పాల్గొన్నారు. అవార్డుకి ఎంపికైన చిత్రాలు2014 1. రన్ రాజా రన్ 2.పాఠశాల 3. అల్లుడు శీను 2015 1. రుద్రమదేవి 2. కంచె 3. శ్రీమంతుడు 2016 1. శతమానం భవతి 2. పెళ్ళి చూపులు 3. జనతా గ్యారేజ్ 2017 1. బాహుబలి 2, 2. ఫిదా 3. ఘాజీ 2018 1. మహానటి 2. రంగస్థలం 3. కేరాఫ్ కంచరపాలెం 2019 1. మహర్షి 2. జెర్సీ 3. మల్లేశం 2020 1. అల వైకుంఠపురములో.. 2. కలర్ ఫోటో 3. మిడిల్ క్లాస్ మెలోడీస్ 2021 1. ఆర్ఆర్ఆర్ 2. అఖండ 3. ఉప్పెన 2022 1. సీతారామం 2. కార్తికేయ 2 3. మేజర్ 2023 1. బలగం 2. హనుమాన్ 3. భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డు: ప్రజాకవి కాళోజీ ప్రత్యేక అవార్డులు... ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు: నందమూరి బాలకృష్ణ (హీరో) పైడి జైరాజ్ ఆల్ ఇండియా ఫిల్మ్ అవార్డు: మణిరత్నం (డైరెక్టర్) బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు: సుకుమార్ (డైరెక్టర్) నాగిరెడ్డి–చక్రపాణి ఫిల్మ్ అవార్డు: అట్లూరి పూర్ణచంద్రరావు (నిర్మాత) కాంతారావు ఫిల్మ్ అవార్డు: విజయ్ దేవరకొండ (హీరో) రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు: యండమూరి వీరేంద్రనాథ్ (రచయిత)⇒ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒక వైపు... ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు... నటుడిగా నేను 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకోవైపు... కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్‌తో సత్కరించిన ఇలాంటి తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ని నాకు ప్రకటించడం నా అదృష్టంగా, దైవ నిర్ణయంగా, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, నాన్నగారి చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లవేళలా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. – హీరో బాలకృష్ణ⇒ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘శ్రీమంతుడు, మహర్షి, మేజర్’ సినిమాలకు అవార్డులు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా దర్శకులకు, ఈ అవార్డులకు కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సినిమాను సెలబ్రేట్ చేసే ప్రతిష్ఠాత్మకమైన గౌరవ పురస్కారాలను ఇన్షియేట్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.– హీరో మహేశ్‌బాబు ⇒ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో నట ప్రపూర్ణ కాంతారావు ఫిల్మ్ అవార్డుకు నేను ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డుని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నాపై నమ్మకంతో ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. అదే విధంగా 2016కి సంబంధించి రెండో ఉత్తమ సినిమాగా ‘పెళ్ళి చూపులు’ ఎంపికవడంపై సంతోషంగా ఉన్నాను. ఈ చిత్రానికి నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ విజయం నా అభిమానులకు చెందుతుంది. ఎందుకంటే వారి ప్రేమ, అభిమానాలే నన్ను నిరంతరం ముందుకు నడిపిస్తున్నాయి. ఈ ప్రయాణంలో భాగమైన నా దర్శక–నిర్మాతలు, కుటుంబ సభ్యులు, ఇతర చిత్రయూనిట్‌కి థ్యాంక్స్. – హీరో విజయ్ దేవరకొండ⇒ 2015వ సంవత్సరానికిగాను మా గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద రాగిణి గుణ, నీలిమ గుణ, యుక్త గుణ నిర్మించిన ‘రుద్రమ దేవి’కి ఉత్తమ చిత్రంగా గద్దర్ సినిమా అవార్డుని ప్రకటించడం ఆనందంగా,ప్రోత్సాహకరంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, జ్యూరీ చైర్మన్ మురళీమోహన్గారికి, మిగతా సభ్యులకు కృతజ్ఞతలు. రుద్రమ దేవిగా అనుష్క అద్భుతంగా నటించారు. గోన గన్నారెడ్డిపాత్రలో మెప్పించిన అల్లు అర్జున్ తెర ముందు, తెర వెనక మా చిత్రానికి వెన్నెముకగా నిలిచారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. – దర్శక–నిర్మాత గుణశేఖర్⇒ తెలుగు సినిమా మార్గదర్శకులలో బీఎన్ రెడ్డిగారు ఒకరు. ఆయన పేరు మీద అవార్డు అందుకోనుండటం చాలా గౌరవం. నన్నెంతగానో స΄ోర్ట్ చేస్తున్న నా నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవ జ్యూరీకి నా ధన్యవాదాలు. – దర్శకుడు సుకుమార్

టీవీల్లో పుష్పరాజ్.. ఎప్పుడు.. ఎక్కడ చూడాలంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1896 కోట్లు రాబట్టింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాహుబలి, కేజీఎఫ్ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. కేవలం దంగల్ మూవీ రికార్డ్‌ను మాత్రమే అధిగమించలేకపోయింది. ఇటీవల ఈ మూవీలో నటనకు గానూ అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ వరించింది.ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. జనవరి 30 నుంచి ఓటీటీలో సందడి చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా తెలుగులో బుల్లితెరపై కూడా సందడి చేసింది. థియేటర్లలో విడుదలైన తర్వాత టీవీల్లోనూ పుష్ప-2 ప్రసారమైంది.తాజాగా హిందీ ప్రేక్షకులను కూడా టీవీల్లో అలరించనున్నారు పుష్పరాజ్. ఈనెల 31 వ తేదీన జీ సినిమాలో ప్రసారం చేయనున్నట్లు పుష్పటీమ్ వెల్లడించింది. శనివారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు జీ సినిమాలో ప్రసారం కానున్నట్లు ట్వీట్ చేశారు మేకర్స్. మొదటిసారి బుల్లితెరపై పుష్పరాజ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ ప్రకటనతో టీవీల్లో పుష్ప-2 వీక్షించేందుకు బాలీవుడ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా.. పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. 31 May ki shaam,Har ghar goonjegi ek hi awaaz, Pushparaj!Dekhiye #TVParPehliBaar 'Pushpa 2: The Rule', 31 May, shaam 7:30 baje, sirf #ZeeCinema par. @zeecinema #Pushpa2TheRule #TVParPehliBaar #Pushpa2OnZeeCinema #Pushpa2OnZeeCinemaOn31May #WildFirePushpa… pic.twitter.com/aFarZPGepn— Pushpa (@PushpaMovie) May 30, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల బదిలీల్లో విచ్చలవిడిగా వసూళ్ల దందా... నిబంధనలు, అర్హతలు పక్కనపెట్టి అంతా ఇష్టారాజ్యం

ఆంధ్రప్రదేశ్‌లో దేవుడి భూములకు దేవుడే దిక్కు... ఖరీదైన ఆలయ భూములను అస్మదీయులకు కట్టబెడుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం

మహానాడు నాటకం, చంద్రబాబు పాలన పచ్చిబూటకం... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఆంధ్రప్రదేశ్‌లో ఎకరం వంద రూపాయలకే మెడికల్ కాలేజీ లీజు... నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను బేరం పెట్టిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల బహిరంగ దాడి

ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ పేరుతో రైతుల భూములు స్వాహా.... బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవడానికి ప్రైవేట్ కంపెనీ ఎత్తుగడలు

అమరావతి నిర్మాణ పనుల్లో ముడుపుల దందా... భారీగా పెంచేసిన అంచనా వ్యయంపై ఇంజినీరింగ్ నిపుణుల విస్మయం.. ముఖ్య నేత జేబుల్లోకి కమీషన్ల సొమ్ము చేరుతున్నట్లు ఆరోపణలు

ఈశాన్య రాష్ట్రాల్లో అసాధారణ అభివృద్ధి జరుగుతోంది... అక్కడ పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి... ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు

చంద్రబాబుదే మద్యం కుంభకోణం... గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అబద్ధపు వాంగ్మూలాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్... మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మృతి... ఇది అసాధారణ విజయం అంటూ స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ
క్రీడలు

ప్రిక్వార్టర్స్‌లో సబలెంక, స్వియాటెక్
పారిస్: ప్రపంచ నంబర్‌వన్ అరియాన సబలెంక, డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. వీరిద్దరితో పాటు నాలుగో సీడ్ పావొలిని, ఎనిమిదో సీడ్ క్విన్వెన్ జెంగ్, 12వ సీడ్ రిబాకినాలు కూడా ప్రిక్వార్టర్స్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ లారెంజో ముసెట్టి, పదో సీడ్ హోల్గర్ రూన్లు కూడా ప్రిక్వార్టర్స్ సమరానికి అర్హత సంపాదించారు. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ తన అమెరికన్ భాగస్వామితో కలిసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అలవోక విజయంతో... మహిళల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్ పోటీల్లో నిరుటి క్వార్టర్ ఫైనలిస్ట్, తాజా ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్ సబలెంక (బెలారస్) 6–2, 6–3తో సెర్బియన్ ప్లేయర్ ఓల్గా డానిలోవిచ్ అలవోక విజయం సాధించింది. కేవలం గంటా 19 నిమిషాల్లోనే సెర్బియన్ ప్రత్యర్థి ఆట కట్టించింది. గతేడాది ప్రిక్వార్టర్ ఫైనల్ దాకా పోరాడిన ఓల్గా ఈసారి మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో హ్యాట్రిక్ చాంపియన్ (2022, 2023, 2024), పోలండ్ స్టార్ స్వియాటెక్ వరుసగా నాలుగో టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది. మూడో రౌండ్లో ఐదో సీడ్ స్వియాటెక్ 6–2, 7–5తో జాక్వెలైన్ క్రిస్టిన్ (రొమేనియా)పై గెలుపొందగా, నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ) 6–4, 6–1తో ఉక్రెయిన్‌కు చెందిన యులియా స్టారొడుత్సెవాను ఓడించింది. 12వ సీడ్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) 6–2, 6–2తో జెలీనా ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలుపొందగా, ఆ్రస్టేలియన్ ఓపెన్ మాజీ రన్నరప్, చైనా స్టార్ క్విన్వెన్ జెంగ్ 6–3, 6–4తో విక్టోరియా ఎం»ొకొ (కెనడా)పై విజయం సాధించింది. చెమటోడ్చిన రూన్ పురుషుల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో హోల్గర్ రూన్ (డెన్మార్క్) 4–6, 6–2, 5–7, 7–5, 6–2తో క్వెంటిన్ హలైస్ (ఫ్రాన్స్)పై చెమటోడ్చి నెగ్గాడు. ఎనిమిదో సీడ్ లారెంజో ముసెట్టి (ఇటలీ) 4–6, 6–4, 6–3, 6–2తో మరియానో నెవొన్ (అర్జెంటీనా) గెలుపొందగా, 12వ సీడ్ టామీ పాల్ (అమెరికా) 6–3, 3–6, 7–6 (9/7), 3–6, 6–3తో కరెన్ కచనొవ్ (రష్యా)పై పోరాడి గెలిచాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ జోడీ భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో యూకీ–గాలోవే (అమెరికా) ద్వయం 6–7 (4/7), 7–6 (7/4), 6–3తో ఏడో సీడ్ నికోల మెక్టిక్ (క్రొయేషియా)–మైకేల్ వీనస్ (ఆ్రస్టేలియా) జంటపై ఆఖరిదాకా పోరాడి గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ–గాలోవే జోడీ... అమెరికాకు చెందిన తొమ్మిదో సీడ్ క్రిస్టిన్ హ్యరీసన్– ఇవాన్ కింగ్ జంటతో తలపడుతుంది.

సెమీస్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట
సింగపూర్: భారత స్టార్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో భాగంగా శుక్రవారం క్వార్టర్స్‌లో సాత్విక్–చిరాగ్ జంట 21–17, 21–15తో ప్రపంచ నంబర్‌వన్ జోడీ గోహ్ జీ ఫెయి–నూర్ ఇజుద్దీన్ (మలేసియా)పై గెలుపొందింది. గాయాల కారణంగా మూడు నెలల విరామం అనంతరం బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత జంట అదరగొడుతోంది. క్వార్టర్స్‌లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ వరల్డ్ నంబర్‌వన్ జోడీని వరుస గేమ్‌ల్లో చిత్తుచేసింది. ‘ఇది పెద్ద గెలుపు. ప్రస్తుతం మేం 27వ ర్యాంక్‌లో ఉన్నాం. అగ్ర స్థానంలో ఉన్న ప్లేయర్లపై గెలవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. మా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాం. మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇదే తీవ్రత కొనసాగిస్తూ టైటిల్ అందుకోవాలనుకుంటున్నాం’ అని సాత్విక్–చిరాగ్ వెల్లడించారు.

ముంబై ముందుకు... గుజరాత్ ఇంటికి
ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లు ఆడటంలో ఆరితేరిన ముంబై ఇండియన్స్... గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసి క్వాలిఫయర్–2కు చేరింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ దూకుడుకు... బెయిర్‌స్టో, సూర్యకుమార్ మెరుపులు తోడవడంతో మొదట భారీ స్కోరు చేసిన ముంబై... ఆ తర్వాత బౌలింగ్‌లోనూ ఆకట్టుకొని ముందంజ వేసింది. టాప్–3 ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడిన గుజరాత్... కీలక ఎలిమినేటర్ పోరులో అది సాధ్యపడక పరాజయంతో లీగ్ నుంచి నిష్క్రమించింది. ముల్లాన్‌పూర్: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ క్వాలిఫయర్–2కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ పోరులో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. మొదట ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (50 బంతుల్లో 81; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) దుమ్మురేపగా... జానీ బెయిర్‌స్టో (22 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (20 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 80; 10 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2... బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వని కుమార్ తలా ఒక వికెట్ తీశారు. ఆదివారం జరగనున్న క్వాలిఫయర్–2లో పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. దంచుడే దంచుడు... టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్, బెయిర్‌స్టో మెరుపు ఆరంభాన్నిచ్చారు. రికెల్టన్ అందుబాటులో లేకపోవడంతో... ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన బెయిర్‌స్టో తన విలువ చాటుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లో ఫోర్‌తో దూకుడు పెంచిన బెయిర్‌స్టో... ప్రసిధ్ కృష్ణ వేసిన నాలుగో ఓవర్లో పరుగుల పండగ చేసుకున్నాడు. వరసగా 6, 4, 6, 6, 4... 26 పరుగులు పిండుకున్నాడు. సిరాజ్ ఓవర్లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన రోహిత్ సాయి కిషోర్ బౌలింగ్‌లో 6, 4, 4తో గేర్ మార్చాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను కోట్జీ వదిలేయగా... 12 పరుగుల వద్ద మెండిస్ మరో సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. దీన్ని పూర్తిగా వినియోగించుకున్న రోహిత్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై జట్టు 79/0తో నిలిచింది. స్పిన్నర్ల రాకతో స్కోరు వేగం మందగించగా... బెయిర్‌స్టోను అవుట్ చేసి సాయి కిషోర్ గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చాడు. రషీద్ ఓవర్లో 4, 6 ద్వారా ఐపీఎల్లో 7 వేల పరుగులతో పాటు 300 సిక్స్‌లు పూర్తి చేసుకున్న రోహిత్... 28 బంతుల్లో హాఫ్‌సెంచరీ మార్క్ అందుకున్నాడు. క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లతో విరుచుకుపడిన సూర్యకుమార్‌ను సాయి కిషోర్ పెవిలియన్ పంపగా... ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (11 బంతుల్లో 25; 3 సిక్స్‌లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. స్లో బంతితో రోహిత్‌ను ప్రసిధ్ కృష్ణ బుట్టలో వేసుకోగా... చివరి ఓవర్లో మూడు సిక్స్‌లు కొట్టిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 22 నాటౌట్; 3 సిక్స్‌లు) జట్టుకు భారీ స్కోరు అందించాడు. సుదర్శన్ పోరాడినా... భారీ లక్ష్యఛేదనలో గుజరాత్‌కు శుభారంభం లభించలేదు. కెప్టెన్ గిల్ (1) ఇన్నింగ్స్ నాలుగో బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో మరో ఓపెనర్ సుదర్శన్ బాధ్యతగా ముందుకు సాగాడు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడిన కుశాల్ మెండిస్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కాస్త సహకరించగా... సుదర్శన్ క్లాస్ కవర్ డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యం కళ్లముందు ఉన్నా... ఏమాత్రం వెరవని టైటాన్స్ పవర్‌ప్లే ముగిసేసరికి 66/1తో నిలిచింది. గ్లీసన్, హార్దిక్, బుమ్రా, సాంట్నర్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టిన పసుదర్శన్ 28 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మెండిస్ వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా ఆకట్టుకున్నాడు. ప్రమాదక బుమ్రా బంతులను కాచుకున్న ఈ జంట... మిగిలిన ఓవర్లలో ధాటిగా పరుగులు రాబట్టింది. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి టైటాన్స్ 148/2తో నిలిచింది. విజయానికి 42 బంతుల్లో 81 పరుగులు కావాల్సిన దశలో... బుమ్రా అద్భుత యార్కర్‌తో సుందర్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో పరిస్థితి మారిపోయింది. సుదర్శన్‌ను గ్లీసన్‌ను అవుట్ చేయగా... రూథర్‌ఫోర్డ్ (24; 4 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. చివర్లో రాహుల్ తెవాటియా (16; 1 ఫోర్, 1 సిక్స్), షారుక్ ఖాన్ (13; 1 సిక్స్) మెరుపులు జట్టును గెలిపించలేకపోయాయి. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ కృష్ణ 81; బెయిర్‌స్టో (సి) కోట్జీ (బి) సాయి కిషోర్ 47; సూర్యకుమార్ (సి) సుందర్ (బి) సాయి కిషోర్ 33; తిలక్ (సి) మెండిస్ (బి) సిరాజ్ 25; హార్దిక్ (నాటౌట్) 22; నమన్ ధీర్ (సి) రషీద్ (బి) ప్రసిధ్ కృష్ణ 9, సాంట్నర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 228. వికెట్ల పతనం: 1–84, 2–143, 3–186, 4–194, 5–206. బౌలింగ్: సిరాజ్ 4–0–37–1; ప్రసిధ్ కృష్ణ 4–0–53–2; సాయి కిషోర్ 4–0–42–2; రషీద్ ఖాన్ 4–0–31–0; కోట్జీ 3–0–51–0; సుందర్ 1–0–7–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (బి) గ్లీసన్ 80; గిల్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 1; మెండిస్ (హిట్ వికెట్) (బి) సాంట్నర్ 20; సుందర్ (బి) బుమ్రా 48; రూథర్‌ఫోర్డ్ (సి) తిలక్ (బి) బౌల్ట్ 24; తెవాటియా (నాటౌట్) 16; షారుక్ ఖాన్ (సి) సూర్యకుమార్ (బి) అశ్వని కుమార్ 13; రషీద్ ఖాన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 208. వికెట్ల పతనం: 1–3, 2–67, 3–151, 4–170, 5–193, 6–208. బౌలింగ్: బౌల్ట్ 4–0–56–2; బుమ్రా 4–0–27–1; గ్లీసన్ 3.3–0–39–1; హార్దిక్ పాండ్యా 3–0–37–0; సాంట్నర్ 1–0–10–1; నమన్ ధీర్ 1–0–9–0; అశ్వని కుమార్ 3.3–0–28–1.

IPL 2025 Eliminator Match: ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై ముంబై ఇండియన్స్ గెలుపు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 30) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ముంబై రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించగా.. గుజరాత్ ఇంటిబాట పట్టింది.ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (81), బెయిర్‌స్టో (47), సూర్యకుమార్ యాదవ్ (33), తిలక్ వర్మ (25) ఇరగదీయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా (21 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు. మూడు సిక్సర్లు బాదాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, సాయికిషోర్ తలో రెండు వికెట్లు తీయగా.. సిరాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ముంబై ఇండియన్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ముఖ్యంగా సాయి సుదర్శన్ (80) ఆకాశమే హద్దుగా చెలరేగి ముంబై ఇండియన్స్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. సాయి క్రీజ్‌లో ఉన్నంత సేపు మ్యాచ్ గుజరాత్ చేతుల్లో ఉండింది. అయితే సాయి ఔటయ్యాక పరిస్థితి మెల్లగా చేజారుతూ వచ్చింది. చివరి ఓవర్ వరకు పోరాడినా గుజరాత్‌కు విజయం దక్కలేదు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ (48) రాణించాడు. శుభ్‌మన్ గిల్ ఒక్క పరుగుకే ఔట్ కాగా.. రూథర్‌ఫోర్డ్ 24, తెవాతియా 16 (నాటౌట్), షారుఖ్ ఖాన్ 13 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ 2, బుమ్రా, గ్లీసన్, సాంట్నర్, అశ్వనీ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. ముంబై ఇండియన్స్ జూన్ 1న జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్లో ఆర్సీబీని ఢీకొంటుంది.
బిజినెస్

మహీంద్రా థార్ రాక్స్: డాల్బీ అట్మాస్‌తో తొలి ఎస్యూవీ ఇదే..
మహీంద్రా థార్ రాక్స్ ఎస్యూవీ ఆటోమోటివ్ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించింది. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీని పొందిన ప్రపంచంలోని తొలి ఎస్‌యూవీగా ఇది నిలిచింది. మహీంద్రా, డాల్బీ ల్యాబొరేటరీస్ మధ్య కుదిరిన భాగస్వామ్యం ఈ అద్భుతమైన ఫీచర్‌ను థార్ రాక్స్ ఏఎక్స్7ఎల్ వేరియంట్‌కు తీసుకువచ్చింది. సాహసోపేతమైన థార్ రాక్స్ డ్రైవింగ్‌కు డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్ తోడై థ్రిల్లింగ్ అనుభవాన్ని జోడిస్తుంది.ఈ ఎస్యూవీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో గానా యాప్ అనుసంధానం చేశారు. దీని ద్వారా వినియోగదారులు పాటలను నిరంతరాయంగా వినవచ్చు. ప్రీమియం 9-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టంతో నాలుగు ఛానెళ్ల లీనమయ్యే ఆడియో డాల్బీ అట్మాస్ సమకూర్చింది.థార్ రాక్స్ భారత విపణిలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. గత సంవత్సరం ఆగస్టులో విడుదలైన దీని ఉత్పత్తిని మహీంద్రా గణనీయంగా పెంచింది. థార్ రాక్స్, మూడు డోర్ల థార్ కలిపి 2.5 లక్షల యూనిట్లకు పైగా విక్రయాలు నమోదు చేశాయి. ఉత్పత్తి పెరగడం వల్ల థార్ రాక్స్ వేచి ఉండే సమయం 18 నెలల నుండి గరిష్టంగా ఆరు నెలలకు తగ్గింది.థార్ రాక్స్ ధరలు రూ.12.99 లక్షల నుండి రూ.23.39 లక్షల వరకు ఉంటాయి (రెండు ఎక్స్-షోరూమ్ ధరలు). ఇది రెండు శక్తివంతమైన పవర్ట్రైన్ ఎంపికలు అందిస్తుంది: 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ 161.8బిహెచ్పి శక్తి 330ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ 176.8బిహెచ్పి శక్తి 380ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.డీజిల్ ఇంజిన్ కూడా రెండు ట్రాన్స్మిషన్ ఎంపికలతో లభ్యమవుతోంది. మాన్యువల్ 152.1 బీహెచ్పీ శక్తి 330ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఆటోమేటిక్ రెండు ట్యూన్లలో వస్తుంది. ఒకటి మాన్యువల్ శక్తిని ఇస్తే, ఇంకొకటి 174.8 బీహెచ్పీ శక్తి 370ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్లు కేవలం ఆర్డబ్ల్యూడితో వస్తే, డీజిల్ వినియోగదారులు ఆర్డబ్ల్యూడీ, ఫోర్డబ్ల్యూడీలను ఎంపిక చేసుకోవచ్చు.

పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు..
గత దశాబ్ద కాలంలో భారత్ 17 కోట్ల ఉద్యోగావకాశాలను సృష్టించిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. సీఐఐ యాన్యువల్ బిజినెస్ సమ్మిట్ 2025లో పాల్గొని మాట్లాడారు. దేశంలో నిరుద్యోగ రేటు 3.2 శాతంగా ఉందని, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇదే స్థాయిలో ఉందన్నారు. భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారినందున గణనీయంగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘గత దశాబ్ద కాలంలో భారత్‌లో 17 కోట్ల ఉద్యోగావకాశాలు లభించాయి. అంతకుముందు దశాబ్దంలో ఇచ్చిన 4.5 కోట్ల ఉద్యోగాల కంటే ఎంతో అధికం. భారత్ పారదర్శక ప్రజాస్వామ్య దేశం. మెరుగైన న్యాయవ్యవస్థ, పటిష్టమైన విధానాల వల్లే ప్రపంచంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ మారింది. దాంతోపాటు దేశంలో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతోంది. అందుకే గ్లోబల్ ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు’ అన్నారు.దేశంలోని ప్రతి యూనివర్సిటీలో ‘ఎడ్యుకేషన్ టు ఎంప్లాయిమెంట్ లాంజ్(విద్య తర్వాత ఉద్యోగం వచ్చేలా విధానాలు)’ ఉంటుందని, దీన్ని పారిశ్రామిక సంస్థలు నిర్వహిస్తాయని మంత్రి తెలిపారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు, విశ్వవిద్యాలయాల సహకారంతో దీన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కెరియర్ లాంజ్‌లో యువతకు వారి అర్హతను బట్టి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.ఇదీ చదవండి: గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ అవసరాన్ని నొక్కిచెప్పిన మంత్రి, సీఐఐ వంటి పారిశ్రామిక సంస్థలు ప్రజలకు శిక్షణ ఇవ్వడంలో, వారి అవసరాల గురించి వివరాలను పంచుకోవడంలో ప్రభుత్వానికి సహాయపడతాయని అన్నారు. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను బట్టి విశ్వవిద్యాలయాలు లేదా విద్యాసంస్థలు యువతకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తాయని, తద్వారా వారు ఉద్యోగాలు పొందడానికి దోహదపడుతుందని వివరించారు.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కొత్త రికార్డులు
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కోకాపేట, మోకిలలో రికార్డు స్థాయిలో భూములు అమ్ముడుపోగా.. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలో మరో మైలురాయిని సాధించింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు ఐదేళ్లలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పెరిగాయని ఓ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైంది. – సాక్షి, సిటీబ్యూరో హైదరాబాద్‌లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చ.అ.కు రూ.7,450గా ఉండగా.. ప్రస్తుతం ఏకంగా రూ.10,580కి పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాలలో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర పెరిగాయి. కరోనా తర్వాత నుంచి లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్ పెరగడమే ఈ వృద్ధికి కారణం. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చ.అ.కు రూ.10,210గా ఉండగా.. ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.దేశంలోని సగటు చూస్తే.. 2018 నుంచి 2024 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే.. విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధి నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చ.అ.కు సగటున 2018లో రూ.12,400గా ఉండగా.. 2024 నాటికి రూ.15,350కి పెరిగాయి.👉ఇది చదివారా? హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్..అందుబాటు గృహాలలో 15 శాతం ఏడు ప్రధాన నగరాలలో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.3,750గా ఉండగా.. ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్ కేటగిరీలో అత్యధికంగా ఎన్సీఆర్లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగంలో ధరల వృద్ధిలో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.4 వేలుగా ఉంది.మధ్యతరగతిలో 18 శాతం ఐదేళ్ల కాలంలో టాప్–7 నగరాలలో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్యతరగతి విభాగంలోని ఇళ్ల విలువలలో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.6,050లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. మన నగరంలో మిడ్‌సైజ్ గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.5,780గా ఉంది.

గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్
బులియన్ మార్కెట్‌తోపాటు నిత్యం స్టాక్ మార్కెట్, కరెన్సీ విలువలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. అందుకు అంతర్జాతీయ అంశాలు, భౌగోళిక అనిశ్చితులు, యుద్ధ భయాలు కారణం కావొచ్చు. క్రితం మార్కెట్ల ముగింపు సమయానికి బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ సూచీలు, కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు కింద తెలియజేస్తున్నాం.బంగారం, వెండి ధరలు..స్టాక్ మార్కెట్ సూచీలుకరెన్సీ విలువ
ఫ్యామిలీ

కృష్ణుడి వెన్నబంతి: సైన్స్‌కే అందని మిస్టరీ..!
భారతదేశం సహజమైన అద్భుతాలకు నెలవు. ఈ నేలపై ఎన్నో ఆద్యాత్మికతకు సంబంధించి..సైన్సుకే అందని మిస్టరీలు దాగున్నాయ. అలాంటి వాటిలో ఒకటి..కృష్ణుడి బటర్‌బాల్‌గా పిలిచే వెన్నబంతి. ఇదెక్కడ ఉంది..?. దాని కథా కమామీషు గురించి సవివరంగా చూద్దామా..!.తమిళనాడు రాష్ట్రం అద్భుతమైన దేవాలయాలకు ప్రసిద్థి. ఆ దేవాలయ శిల్పకళా సంపద పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆ రాష్ట్రానికి హృదయంగా పిలిచి మహాబలిపురం పురాతన శిల్పకళ, రాతి గుహలు, ఏకశిల నిర్మాణాలకు ప్రసిద్ధిగాంచిన పట్టణం. అక్కడ అన్నింట్లకంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది కృష్ణుడి బటర్‌బాల్. ఇది మేథావులకు, శాస్త్రవేత్తలకు ఓ పట్టాన అర్థం కానీ చిక్కుప్రశ్నలా మిగిలింది. ఎందుకంటే..యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ఈ బండరాయిలాంటి వెన్నముద్ద 45 డిగ్రీల నిటారు కొండ వాలుపై ఉండటం విశేషం. పైగా ఇది 250 టన్నుల భారీ బండరాయి. అయినా అంత వాలులో ఏదో గమ్ లేదా ఆయస్కాంత మాదిరిగా అతుక్కుపోయినట్లుగా ఉంటుంది. గత 12 వందల ఏళ్లల్లో ఒక్క ఇంచు దాని ప్రదేశం నుంచి కదలకపోడం మరింత ఆశ్చర్యకరమైన అంశం. చెప్పాలంటే అక్కడ గురుత్వాకర్షణ పనిచేస్తుందా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే అంత భారీ బండరాయి ఏటావాలుగా ఉన్నవైపు నుంచి అమాంతం పడిపోతుంది. కానీ ఇది మాత్రం ఏదో మ్యాజిక్ చేసినట్లుగా నిలబడి ఉంటుంది. పౌరాణిక ప్రాముఖ్యత..ఈ భారీ గ్రానైట్ రాయి గణేష్ రథం సమీపంలోని ఒక చిన్న కొండ వాలుపై ఉంది. ఇది సుమారు ఆరు మీటర్ల ఎత్తు, ఐదు మీటర్ల వెడల్పు ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం..కృష్ణుడికి ఇష్టమైన వెన్న ముద్ద ఆకృతిలో ఉంటుంది ఈ శిల. అందుకే దీనికి కృష్నుడి బటర్ బాల్ లేదా వెన్నబంతి అనే పేరొచ్చింది. ఎందరో కదిలించాలని చూసి పరాజితులయ్యారు..పల్లవ రాజు నరసింహవర్మన్ I ఏనుగులతో ఈ గ్రానైట్ బండరాయిని తరలించడానికి ప్రయత్నించాడు. ఒక్క ఇంచు కూడా కదపలేక విఫలమయ్యాడు. అలాగే 1908లో, మద్రాస్ గవర్నర్ ఆర్థర్ లాలీ కొండ నుంచి రాతిని తొలగించేందుకు ప్రయత్నించాడు. ఆయన 42 టన్నులను అవలీలగా లాగే ఏడు ఏనుగులను తీసుకొచ్చాడు, కానీ ఫలితం శూన్యం దాగున్న సైన్స్..కృష్ణుడి బటర్ బాల్ అనేది ఎక్స్ఫోలియేషన్కి సంబంధించిన అరుదైన భౌగోళిక సంఘటనగా శాస్త్రవేత్తలు విశ్వసిస్తారు. శతాబ్దాలుగా గాలి, అగ్ని, నీరు తదితరాలేవి దాన్ని కదలించడం లేదా గాట్లు పడటం వంటివి చేయలేకపోయాయి. ఇది గ్నిస్ అనే ప్రత్యేకమైన గ్రానైట్‌తో నిర్మితమైనదని, అందువల్ల ఏది దీని ఆకారాన్ని పాడు చేయలేనంత దృఢంగా ఉంటుందని వెల్లడించారు. శిల ఆకారం, కొండ వాలు మధ్య సహజ ఆకర్షణ అది పడిపోకుండా ప్రత్యేకంగా ఉండటానికి దోహదం చేసిందనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ కృష్ణుడి వెన్నబంతిని తప్పక సందర్శంచండి మరీ..!.(చదవండి: చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై జైశంకర్ మాట)

NDA శిక్షణ పూర్తిచేసుకున్న 17 మంది మహిళా క్యాడెట్లు
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) 148వ కోర్సు నుండి తొలి బ్యాచ్ మహిళా క్యాడెట్లు రికార్డ్ సృష్టించారు. కఠినమైన తమ శిక్షణనువిజయవంతంగా పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ తర్వాత 17 మంది మహిళా క్యాడెట్లు జోష్ పుష్-అప్‌లతో ఔరా అనిపించారు. 300 మందికి పైగా పురుష క్యాడెట్లతో పాటు పదిహేడు మంది మహిళా క్యాడెట్లు అకాడమీ నుండి గ్యాడ్యుయేట్ కావడం విశేషం.పుణేలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఆర్మీ చీఫ్ , మిజోరాం ప్రస్తుత గవర్నర్ జనరల్ వీకే సింగ్ పాసింగ్ అవుట్ పరేడ్ సమీక్ష అధికారిగా ఉన్నారు. అకాడమీ క్యాడెట్ కెప్టెన్ ఉదయవీర్ నేగి 148వ కోర్సు కవాతుకు నాయకత్వం వహించారు. "ఈ రోజు అకాడమీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన రోజు, ఎన్‌డిఎ నుండి మహిళా క్యాడెట్ల తొలి బ్యాచ్ శిక్షణను పూర్తి చేసుకుందని, ఇదిమరింత మంది మహిళలు చేరడానికి, వారి సాధికారత వైపు సాగేలా చారిత్రాత్మక మైలురాయి లాందని జనరల్ సింగ్ ఈ సందర్భంగా అన్నారు.వీరు "నారి శక్తి"కి బలమైన చిహ్నం, ఇది మహిళల అభివృద్ధిని మాత్రమే కాకుండా మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని కూడా ప్రతిబింబిస్తుందన్నారు. అంతేకాదు ఇది ఈ క్యాడెట్ల అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానన్నారు. #WATCH | Maharashtra | Female cadets celebrate after their 'Passing Out Parade’ held at Pune, which was reviewed by Mizoram Governor and former Chief of the Army Staff VK SinghThe first batch of 17 female cadets graduated from the National Defence Academy (NDA) along with over… pic.twitter.com/yCnDU3SiLL— ANI (@ANI) May 30, 2025తమకు జెండర్ అనేది తమకు ఎపుడూ అడ్డంకి కాలేదనీ క్యాడెట్ ఇషితా శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ఒకరికొకరం కష్టనష్టాల్ని పంచుకుంటూ అచంచలమైన విశ్వాసం, వైఖరితో ఐక్యతా స్ఫూర్తిని స్వీకరించా మన్నారు. 2021లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యుపీఎస్సి (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) మహిళలు డిఫెన్స్ అకాడమీకి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించిన తర్వాత ఎన్డీఏలో మహిళా అభ్యర్థుల ప్రవేశానికి మార్గం సుగమం అయింది. 2022లో మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్ 2022లో ఎన్‌డిఎ 148వ కోర్సులో చేరిన సంగతి తెలిసిందే. ప్రవేశ పరీక్ష ద్వారా ఈ మహిళా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు NDA లో మూడు సంవత్సరాల పాటు శిక్షణ పొందుతారు. శఙక్షణ అనంతరం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలలో ఎంపిక చేయబడతారు. View this post on Instagram A post shared by Defence Squad™ | YouTube (@defencesquad)

Jeff Bezos మెకంజీ షాక్, ప్రియురాలితో రెండో పెళ్లికి ముందే జాగ్రత్తపడుతున్న బెజోస్
అమెజాన్ వ్యవస్థాపకుడు, భూమిపై అత్యంత ధనవంతులలో ఒకరైన జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఇది బిజినెస్ వ్యవహారమో, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించో కాదు. ప్రియురాలితో రెండో పెళ్లికి ముందే బిలియన్ డాలర్ల తన సంపదను కాపాడుకునేందుకు న్యాయపరంగా ఒక కీలకమైన చర్య తీసుకోబోతున్నాడు. అమెరికన్ టీవీ, రిపోర్టర్ లారెన్ సాంచెజ్ (Lauren Sánchez)తో 2023లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వచ్చే నెలలో గ్రాండ్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు నెట్టింట్ హల్ చల్ చేస్తున్నాయి. మొదటి భార్యతో విడాకులు, భారీ భరణం నేపథ్యంలో బెజోస్ తాజా ఏర్పాట్టు మరింత ఆసక్తి కరంగా మారాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న తమ వివాహం ఇప్పటికే చాలా అలస్యమైన కారణంగా వీలైనంత త్వరగా తమ వివాహాన్ని చేసుకోవాలని 61 ఏళ్ల జెఫ్ బెజోస్ (Jeff Bezos) ప్లాన్ చేస్తున్నాడట. అయితే జెఫ్ 220 బిలియన్ డాలర్ల సంపదను ( సుమారు 18.84 లక్షల కోట్ల రూపాయలు) భద్రపరచడానికి ఐరన్ క్లాడ్ ప్రెనప్‌కు సన్నాహాలు చేసుకున్నాడని అంతర్జాతీయ మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది. వివాహానికిముందే చేసుకోబోయే ఈ పటిష్ఠ ఒప్పందాన్ని సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నందున పెళ్లికి సమయం తీసుకుంటున్నాడట. అటు గ్లోబల్ న్యాయనిపుణులు దీనిపై భారీ కసరత్తే చేస్తున్నారు.అసలేంటీ ప్రెనప్వివాహానికి ముందు ఒక జంట వ్రాతపూర్వకంగా చేసుకునే ఒప్పందం. విడాకులు లేదా మరణానికి సంబంధించిన సంభావ్య ఆర్థిక సంక్లిష్టతలను నిర్వహించడానికి ఇది ఒక మార్గం, విడాకుల సందర్భంలో ఆస్తులు , అప్పులు ఎలా విభజించబడతాయో ఇందులో పొందుపరుస్తారు. ముఖ్యంగా ఆయా జంటలు రాష్ట్రం లేదా దేశంలోని నియమ నిబంధనలపై ఆధారపడకుండా వారి స్వంత నిబంధనలను ఏర్పరచుకోవడానికి వీలు కల్పిస్తుంది.సర్టిఫైడ్ ఫ్యామిలీ లా అటార్నీ ఆల్ఫోన్స్ ప్రొవిన్జియానోను సంప్రదించిన జెఫ్ త్వరలోనే దీనిపై సంతకం చేయనున్నాడు. ప్రస్తుత ఆస్తులు, ఆస్తులు, హోల్డింగ్ పెట్టుబడులు మొదలైన వాటి జాబితా ఉండవచ్చని , వాటిని ప్రత్యేక సంస్థలుగా లేబుల్ చేయవచ్చని వివరించారు. కాబట్టి, భవిష్యత్తులో లారెన్ సాంచెజ్ జెఫ్ వ్యాపార సంస్థల వృద్ధికి తోడ్పడటానికి ముందుకు వచ్చినప్పటికీ, ఒక వేళ విడిపోతే, ఆ సందర్భంలో వాటి యాజమాన్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఈ జాగ్రత్త. అయితే, వ్యాపారవేత్త తన ఆర్థిక , ఆస్తులన్నింటినీ బహిర్గతం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ లీగల్ అగ్రిమంట్ డ్రాఫ్టింగ్ కష్టతరంగా మారిందట. ముఖ్యంగా అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు, ఆర్థిక సలహాదారుల బృందంతో సంప్రదింపులు జరగాల్సి ఉంటుందని అంచనా. అంతేకాదు ఇది సాధారణంగా రెండు వైపులా న్యాయవాదుల బృందాలను కలిగి ఉండే సుదీర్ఘ ప్రక్రియ. దీనికి చెల్లింపులు కూడా భారీ మొత్తంలోనే ఉంటాయి. ఇరు పార్టీల అంగీకారంతో జరిగే ఈ ముందస్తు ఒప్పందానికి చర్చోపచర్చలు, అంగీకారాలు అవసరమంటున్నారు నిపుణులు. కేన్స్ సమీపంలో 500 మిలియన్ డాలర్ల సూపర్‌యాచ్‌లో లారెన్‌కు జెఫ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఈ జంట 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుండి, ఈ జంట అనేక ఈవెంట్లకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. రూ. 5 వేల కోట్లు ఖర్చుతో అత్యంత ఘనంగా జెఫ్ రెండోపెళ్లి జరగనుందని సమాచారం.ఇదీ చదవండి: అమెరికా నుంచి 1,080 మంది భారతీయుల బహిష్కరణఅమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ 1993లో మెకంజీ స్కాట్‌ను పెళ్లి చేసుకున్నాడు.. వీరికి నలుగురు పిల్లలు పుట్టారు. అయితే 25 ఏళ్ల దాంపత్యం జీవితం తరువాత 2019లో విడాకుల ప్రకటన చేయడం యావత్ ప్రపంచాన్ని విస్మయపర్చింది. అయితే మెంకజీతో విడాకులకు ముందు (2018) నుంచే జెబోస్, 54 ఏళ్ల మహిళా జర్నలిస్ట్ లారెన్ శాంచెజ్‌తో డేటింగ్లో ఉన్నాడు. కొన్నాళ్లకు విలాసవంతమైన నౌకలో 2.5 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.21 కోట్ల) డైమండ్ రింగ్‌తో ఆమెకు ప్రపోజ్ చేశాడు. అటు లారెన్ శాంచెజ్‌కు ఇప్పటికే రెండుసార్లు వివాహమైంది. పాట్రిక్ వైట్ సెల్ తో, పెళ్లి ఇద్దరు పిల్లలు తరువాత విడాకులు తీసుకుంది. ఆ తరువాత మాజీ ఎన్ఎఫ్ఎల్ ఆటగాడు టోనీ గోంజెలెజ్‌ను పెళ్ళాడింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. చదవండి: గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్ భర్తలందరూ డ్రైవర్లేగా! మెకెంజీతో జెఫ్ బెజోస్ ఖరీదైన విడాకులుచరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకులు అంటే జెఫ్, మెకంజీదే. అమెజాన్ కేవలం ఆన్లైన్ పుస్తక రిటైలర్‌గా ఉన్నప్పుడు వివాహం, అమెజాన్ విజయంలో అండగా నిలిచిన అతని మాజీ భార్యకు కంపెనీలో నాలుగు శాతం వాటా లభించింది. దీంతో ఆమె అత్యంత ధనవంతురాలైన మహిళల జాబితాలో చేరింది.

'చాలా ఏళ్లుగా ఆ అలవాటు ఉంది'! వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై జైశంకర్ మాట
భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌కు ఉన్న కుటుంబ నేపథ్యం ఏ మంత్రికీ ఉండకపోవచ్చు. ఆయన తండ్రి కే.సుబ్రహ్మణ్యం.. 1951 ఐఏఎస్ బ్యాచ్ టాపర్. ఆయన్ను చాలామంది కె.ఎస్ అని, సుబ్బు అని పిలుస్తుంటారు. అంతేగాదు భారత దౌత్య రంగానికి గురువు అని కూడా పిలుస్తారు. ఆ నేపథ్యం నుంచి వచ్చిన జై శంకర్ కూడా అంతే చురుకుగా ఉంటూ.. దూకుడుతో నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి జీవనశైలి ఎలా ఉంటుందో తెలుసా?.. వృత్తిపరంగా అత్యంత బిజీగా ఉండే జైశంకర్ రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచే మొదలైపోతుందట. ఎందుకంటే వివిధ దేశాలకు సంబంధించిన అంతర్జాతీయ కాల్స్, వార్తపత్రికలు సమాచారం తెలుసుకోవడం, ఆ రోజు ఉన్న ఈవెంట్లు, హాజరుకావల్సిన కార్యక్రమాలు షెడ్యూల్ చూసుకోడం వంటి గందరగోళంతో ఉంటుందట. అంత ఫుల్‌బిజీలో కూడా తనకున్న ఒక్క అలవాటే తన ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందట. అదే తన ఆరోగ్య రహస్యమని అంటున్నారు జైశంకర్. ఎప్పుడే ఏ దేశంలో ఉంటామన్నది తెలియని పరిస్థతి కాబట్టి కచ్చితంగా వ్యాయామాలు, యోగా వంటివి చేయడం కుదరదని చెబుతున్నారు. అందువల్ల ఆయన దినచర్య తానున్న ప్రాంతాన్ని బట్టి మారిపోతుంటుందట. సాధారణ రోజుల్లో మాత్రం చాలామటుకు తన రోజు.. ఉదయం ఆరుగంటల నుంచి మొదలవ్వుతుందట. అయితే కచ్చితంగా ఉదయం స్క్వాష్ గేమ్ ఆడతారట. ఎంత బిజీ షెడ్యూల్ అయినా..ఓ అరగంట అది ఆడాల్సిందేనని చెబుతున్నారు. అలాగే తప భార్యతో కలిసి ఓ అరగంట వాక్ చేస్తానన్నారు. ఎందుకంటే తన భార్యతో స్పెండ్ చేసేందుకు అదే తనకు తగిన సమయమని చెబుతున్నారు. అదీగాక నిత్యం పర్యటించే జై శంకర్‌కు కుటుంబంతో గడపడం, ఫిట్‌నెస్‌పై దృష్టిసారించడం అనేవి అత్యంత సవాలుతో కూడినవి. కాబట్టి తన లైఫ్‌స్టైల్‌కి అనుగుణంగా ఆరోగ్యకరమైన అలవాట్లకు సంబంధించి కనీసం రెండు అలవాట్లను తప్పనిసరిగా తన దినచర్యలో భాగం చేసుకుంటారట. అలాగే కుటుంబంతో గడపటం కోసం..భార్యతో సంభాషిస్తూ చేసే వాకింగ్ అనేది కూడా తప్పనిసరి అని అన్నారు. పర్యటనలో లేకపోతే..తన భాగస్వామితో గడపటానికి తప్పనిసరిగా అరగంట సమాయాన్ని కేటాయిస్తానని చెప్పారు. అలాగే తన వర్క్ లైఫ్ ఉదయం 9.30 గంటలకు మొదలవుతుందట. ఇక అక్కడ నుంచి ఉన్నత స్థాయి సమావేశాలు, సమీక్షలు, మంత్రిత్వ శాఖ ఫైళ్లను క్లియర్ చేయడం, పాశ్చాత్య దేశాలతో ఫోన్లో దౌత్య సంభాషణలు జరపడం వంటి కార్యక్రమాల్లో మునిగిపోతానని చెప్పారు. ఇక సినిమాలు చూసే ఛాన్సే లేదని అన్నారు. ఎందుకంటే.. రెండు గంటల్లో అయిపోయే సినిమా ఉండదు కదా అని నవ్వేశారు. చివరగా ఆయన విదేశాంగ మంత్రిగా వర్క్‌కి సంబంధించి..24/7 అత్యంత బిజీగా ఉండాల్సిన పరిస్థితి అయినప్పటికీ.. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యానికి సంబంధించిన ఆ అలవాట్లను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో మిస్ అవ్వనని చెప్పారు. అంతేగాదు ఎంత పని గందరగోళంతో ఉన్నా..జీవితాన్ని అందంగా ఓ నిర్షిష్ట పద్ధతిలో నిర్మించుకోవడంలో విఫలమవ్వకూడదని అన్నారు జైశంకర్. బిజీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే కానీ, జీవితాన్ని అందంగా మలుచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంటుందని తేల్చి చెప్పారు విదేశాంగ మంత్రి జైశంకర్. చెప్పాలంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే అసలైన అర్థం మన విదేశాంగ మంత్రి లైఫ్‌స్టైలే కదూ..! సో.. మనం కూడా పని జీవితం తోపాటు..మన కుటుంబ జీవితానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇద్దాం..ఆనందకరమైన జీవితాన్ని సొంతం చేసుకుందాం. (చదవండి: మహిళా సైనికులకు ఇన్ని ఆరోగ్య సవాళ్లు ఉంటాయా..? అందుకే ఇజ్రాయెల్..)
ఫొటోలు


విశాఖ, విజయవాడలో దంచికొట్టిన వర్షం (ఫొటోలు)


‘భైరవం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)


GT Vs MI: కీలక మ్యాచ్‌లో రఫ్ఫాడించిన ముంబై.. గుజరాత్‌కు ఝలక్ (ఫొటోలు)


'ప్రేమమ్' జ్ఞాపకాలు.. సాయిపల్లవి అప్పట్లో ఇలా (ఫొటోలు)


బిగ్‌బాస్ ప్రియాంక బ్లాక్ బస్టర్ పోజులు (ఫొటోలు)


చాహల్‌తో విడాకులు.. లండన్‌లో చిల్ అవుతోన్న ధనశ్రీ వర్మ (ఫొటోలు)


పెళ్లయి పదేళ్లు.. అల్లరి నరేశ్ భార్య-కూతుర్ని చూశారా? (ఫొటోలు)


కొడుకు బారసాల జ్ఞాపకాలతో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)


2024 'గద్దర్ అవార్డ్స్'తో ట్రెండ్ అవుతున్న తెలుగమ్మాయి (ఫోటోలు)


అప్పుడు నగ్నంగా నటించిన 'బ్రిగిడా' మరోసారి ట్రెండ్ (ఫోటోలు)
అంతర్జాతీయం

ముంచుకొస్తున్న ముప్పు
న్యూఢిల్లీ: హిమాలయ పర్వతాలు భారతదేశానికి పెట్టని కోటలాంటివి. హిమాలయాల్లోని 800 కిలోమీటర్లకుపైగా పొడవైన హిందూకుష్ పర్వత శ్రేణిలో ఎన్నెన్నో హిమానీనదాలు(గ్లేసియర్స్) ఉన్నాయి. ఎన్నో నదులు, సరస్సులకు ఇవే ఆధారం. మధ్య, దక్షిణాసియాలో హిందూకుష్ గ్లేసియర్స్ నుంచి వచ్చే నీటిపై ఆధారపడి 200 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. పారిశ్రామిక యుగానికి ముందున్న ఉష్ణోగ్రతల కంటే మరో 2 డిగ్రీల సెల్సియస్‌కుపైగా పెరిగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి హిందూకుష్ హిమానీనదాల మంచులో 75 శాతం అంతమైపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. 200 కోట్ల మంది జీవనం ప్రమాదంలో పడుతుందని తేలింది. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. భూగోళంపై మానవ మనుగడ కొనసాగాలంటే వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాలన్నీ తక్షణమే దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. → 10 దేశాలకు చెందిన 21 మంది శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకుపైగా గ్లేసియర్లలో మంచు కరుగుతున్న తీరును పరిశీలించడానికి 8 గ్లేసియర్ మోడల్స్ ఉపయోగించారు. → ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా స్థిరంగా ఉన్నప్పటికీ గ్లేసియర్లలో మంచు కరగడం ఇప్పట్లో ఆగదని అధ్యయనకర్తలు స్పష్టంచేశారు. రాబోయే కొన్ని దశాబ్దాలపాటు ఈ పరిమాణం కొనసాగు తూనే ఉంటుందని పేర్కొన్నారు. → ఉష్ణోగ్రత కేవలం అర డిగ్రీ పెరిగినా సరే దాని ప్రభావం హిమానీనదాలపై కచ్చితంగా ఉంటుందని, ఈ మేరకు మంచు కరిగిపోతుందని సైంటిస్టు డాక్టర్ హ్యారీ జెకొల్లారీ చెప్పారు. మనం ఈ రోజు తీసుకొనే నిర్ణయాలు మన భవిష్యత్తు తరా ల బతుకులను నిర్ణయిస్తాయని అన్నారు. రాబోయే తరాలు బాగుండాలంటే గ్లేసియ ర్లను కాపాడుకోవాలని సూచించారు. → పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం.. భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తే హిమాలయాలు, కాకస్ పర్వతాల్లో 40–45 శాతం మంచును కాపాడుకోవచ్చు. → ఒకవేళ ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంచు కరిగిపోతుంది. ఈ శతాబ్దం ఆఖరు నాటికి కేవలం 25 శాతమే మిగిలి ఉంటుంది. → యూరప్‌లో ఆల్ఫ్స్, ఉత్తర అమెరికాలో రాకీస్‌తోపాటు ఐస్‌ల్యాండ్‌లోని గ్లేసియర్లు మానవులకు జీవనాధారం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం వీటికి ముప్పు పొంచి ఉంది. భూగోళం మరో రెండు డిగ్రీలు వేడెక్కితే.. ఇక్కడ మంచు 10–15 శాతమే మిగులుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 90 శాతం మంచు కనుమరుగైతే పరిస్థితి తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక స్కాండినేవియా ప్రాంతంలో మంచు పూర్తిగా కరిగిపోతుందన్న అంచనాలున్నాయి. → హిమానీనదాలపై ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు ప్రస్తుతం తజకిస్తాన్‌లోని దుషాన్బేలో జరుగుతోంది. 50కిపై దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. → గ్లేసియర్లు వేగంగా కరిగిపోతుండడం వల్ల ఆసియాలో 200 కోట్ల మందికి కష్టాలు రాబోతున్నాయని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు యింగ్‌మింగ్ యాంగ్ హెచ్చరించారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో తీవ్రమైన వరదలు, కరువులు సంభవించే ప్రమాదం ఉందని, సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల తీర ప్రాంతాలు మునిగిపోతాయని చెప్పారు. → మంచు కరిగిపోవడాన్ని ఆపాలంటే శిలాజ ఇంధనాలను పక్కనపెట్టాలని, క్లీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలని యింగ్‌మింగ్ యాంగ్ స్పష్టంచేశారు. భూమిని అగ్నిగుండంగా మారుస్తున్న కాలుష్య ఉద్గారాలకు కళ్లెం వేయాలన్నారు.

బాల్య వివాహ నిషేధ చట్టం తెచ్చిన పాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తీసుకువచ్చింది. అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుక్రవారం ఇందుకు సంబంధించిన బిల్లుపై సంతకం చేశారు. పాకిస్తాన్లో ఇకపై 18 ఏళ్ల లోపు బాలబాలికలకు వివాహం చేయడం చట్ట విరుద్ధం. ‘ఇస్లామాబాద్ కేపిటల్ టెర్రిటరీ చైల్డ్ మ్యారేజీ రిస్ట్రెయింట్ బిల్లు’ను పార్లమెంట్‌లోని ఉభయసభలు ఈ నెల 27వ తేదీన ఆమోదించాయి. బిల్లుపై అధ్యక్షుడు జర్దారీ సంతకం చేసిన విషయాన్ని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)సెనేటర్ షెర్రీ రెహ్మాన్ ‘ఎక్స్’లో ప్రకటించారు. ‘బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ముఖ్యమైన చట్టాన్ని రూపొందించడంలో పాకిస్తాన్ ఒక మైలురాయిని అధిగమించింది’అని ఆమె పేర్కొన్నారు. అయితే, మత సంస్థలతోపాటు ఇస్లామిక్ చట్టాలకు భాష్యం చెప్పే కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ(సీఐఐ)సైతం ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 18 ఏళ్లలోపు వివాహాన్ని అత్యాచారంగా పరిగణించడం ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకమని సీఐఐ వాదిస్తోంది. సమాజంలో అరాచకాన్ని నిరోధించాలంటే అధ్యక్షుడు జర్దారీ ఈ బిల్లుపై సంతకం చేయరాదని సీఐఐ సభ్యుడు మౌలానా జలాలుద్దీన్ అంతకుముందు వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్ దాడుల్లో 44 మంది మృతి
డెయిర్ అల్ బలాహ్: గాజాపై ఇజ్రాయెల్ తాజా దాడుల్లో 44 మంది మరణించారు. అల్–బురైజ్లో ఒక్కఇంటిలోనే ఏకంగా 23 మంది మరణించారు. దక్షిణ గాజాలోని అమెరికా సహాయ కేంద్రం సమీపంలో ఇజ్రాయెల్ కాల్పుల్లో ఇద్దరు మరణించగా చాలామంది గాయపడ్డారు. హమాస్‌కు సహాయ సామగ్రి అందకుండా చేసేందుకు అమెరికా మద్దతుతో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్) ఈ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. దీన్ని ఐరాసతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇజ్రాయెల్ అన్ని నైతిక, చట్ట పరమైన హద్దులు దాటుతోందని జోర్డాన్ మండిపడింది. ఒక సంచి పిండి కోసం కూడా ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాజా అంతటా డజన్ల కొద్దీ ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇంకా ఆకలి కేకలే రెండు నెలల పై చిలుకుకు దిగ్బంధం తర్వాత గాజాలోకి ఇప్పుడిప్పుడే మానవతా సాయం చేరుతోంది. ఇజ్రాయెల్ పరిమిత అనుమతితో ట్రక్కులు గాజాలోకి ప్రవేశిస్తున్నట్టు ఐరాసలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ భద్రతా మండలికి తెలిపారు. దాని పంపిణీకి తమ వంతు కృషి చేస్తున్నట్లు ఐరాస తెలిపింది. అయినా గాజాలో ఎటు చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. విరమణకు మరో ప్రతిపాదన గాజాలో కాల్పుల విరమణ కోసం చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరోసారి కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దాని ప్రకారం హమాస్ తన వద్ద సజీవంగా ఉన్న 10 మంది ఇజ్రాయెలీ బందీలను అప్పగించాలి. 18 మంది బందీల మృతదేహాలను రెండు దశల్లో ఇజ్రాయెల్‌కు ఇవ్వాలి. బదులుగా ఇజ్రాయెల్ 60 రోజుల కాల్పుల విరమణ పాటిస్తుంది. పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది.

నైజీరియా: ముంచెత్తిన వరదలు.. కూలిన డ్యామ్.. 111 మంది మృతి
అబుజా: నైజీరియాలో విషాదం చోటుచేసుకుంది. కుండపోత వర్షాల కారణంగా సెంట్రల్ నైజీరియాలో మోక్వా మార్కెట్ పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. వరదలు కారణంగా 111 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు సమీపంలోని డ్యామ్ కూలిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వెల్లడించారు.వరదలు కారణంగా అధిక సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా మృతదేహాలను వెలికితీస్తూనే ఉన్నారు. 88 మంది మరణించగా.. 23 మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 111కి చేరుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.At least 30 killed after torrential rains triggered flooding chaos in Niger, Mokwa #Nigeria#Africa #Flood #Mokwa #Flashflood #Rain #Climate #Weather #Viral pic.twitter.com/x2dI0JsoE8— Earth42morrow (@Earth42morrow) May 30, 2025
జాతీయం

వారిద్దరూ కవలలు.. వారి వెంటే అరుదైన సందర్భం!
జైపూర్: కవలలు.. ఇద్దరు పిల్లలు కలిసి పుడితే కవలలు అంటాం. కొన్ని సందర్భాల్లో కవలలు ఒకే పోలికలతో పుడితే.. మరికొన్ని సందర్భాల్లో వేరే పోలికలతో కూడా పుడతారు. కవలలు జంటగా పుట్టినంత మాత్రాన వారి వ్యవహారశైలి ఒకేలా ఉండే అవకాశాలు చాలా తక్కువ. అలాగని కొన్ని సందర్బాల్లో వారిద్దరూ చేసే పనులు చాలా దగ్గరగా ఉండే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ప్రధానంగా చదువుకునేటప్పుడు కవల పిల్లల తరగతుల్లో మార్పులు పెద్దగా ఉండవు. ఒకే ఏజ్‌లో ఉంటారు కాబట్టి.. వారి క్లాస్‌లు ఎప్పుడూ ఒకే రకంగా సాగడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగని వారిద్దరూ ఒకేలా చదువుతారని చెప్పలేం. కానీ అలా జరిగితే మాత్రం అది చాలా అరుదైన, ప్రత్యేకమైన సందర్బంగానే చెప్పాలి. ఇప్పుడు అదే జరిగింది. రాజస్తాన్‌లోని నాగ్‌పూర్ జిల్లాకు చెందిన కనిష్క, కార్తీకలు.. కవలలుగా పుట్టడమే కాదు.. జంటగానే విద్యలో దూసుకుపోతున్నారు. రాజస్తాన్ బోర్డు నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో వారిద్దరూ ఒకే పర్సంటేజ్‌ను సాధించడమే ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఎస్ఎస్సీ పరీక్షల్లో వారిద్దరూ 97. 17 శాతం మార్కులతో ఉత్తీర్ణీత సాధించారు. వీరిద్దరూ సాధించిన వ్యక్తిగత మార్కుల్లో స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పటికీ పర్సంటేజ్ పరంగా ఒకేలా రావడంతో ఆ కవలలే వెంటే అరుదైన సందర్భం అనుకోవడం మనవంతైంది. మెర్టా రోడ్డులోని కల్పనా చావ్లా ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్లో చదవిన వీరిద్దరూ.. ఒకే పర్సంటేజ్ సాధించడంతో తల్లి దండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. తమ పిల్లలు కలిసి పుట్టడమే కాదు.. కలిసి సాదించిన మార్కుల్లో కూడా తేడా లేకుండా ఉండటంతో వారు మరింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజస్తాన్ రోడ్డు రవాణా సంస్థలో కండెక్టర్‌గా పని చేస్తున్న శివన్నారాయణ చౌదరి, సుమన్ చౌదరిల కుమార్తెలే కనిష్క, కార్తీకలు. వీరి సాధించిన మార్కులపై అటు స్కూల్ యాజమాన్యంతో పాటు ఇటు స్నేహితులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. శభాష్ కనిష్క, కార్తీక అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.

‘వారికి నిద్రలేని రాత్రులు ఎలా ఉంటాయో చూపెట్టాం’
కాన్పూర్: ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కు వణుకు పుట్టించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గుర్తు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు ఎలా ఉంటాయో చూపెట్టామన్నారు మోదీ. ఈ రోజు(శుక్రవారం) యూపీలోని కాన్పూర్ పర్యటనలో భాగంగా మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.‘ఆపరేషన్ సిందూర్.. దేశ రక్షణ వ్యవస్థ ఎంత బలంగా ఉందో ప్రపంచానికి తెలిసేలా చేసింది. బ్రహ్మోస్ క్షిపణి తరహా రక్షణ వ్యవస్థ కల్గిన మనదేశ సామర్థ్యంతో పాక్ ను చావుదెబ్బ కొట్టాం. ఉగ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ మూలాల్లోకి పోయి మరీ విధ్వంసం సృష్టించాం. ప్రధానంగా బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగంతో పాక్ కు ఊపిరి సలపలేదు. ఇది భారత్ దేశ శత్రువులకు ఒక హెచ్చరిక లాంటిది. మమ్మల్ని తక్కువ అంచనా వేసే వారికి కూడా ఇది ఒక గుణపాఠం. ఆపరేషన్ సిందూర్ అనేది ఒక ఆరంభం మాత్రమే.. ఇది ఇంకా ముగిసిపోలేదు. దీన్ని మరిచిపోవద్దు’ అంటూ ప్రధాని మోదీ హెచ్చరించారు. పాకిస్తాన్ పాత కాలంలో రాష్ట్ర, రాష్ట్రేతర సంస్థల మధ్య తేడాను చూపించే ఆట ఇకపై పనిచేయదు’ అని మోదీ క్లియర్ మెసేజ్ ఇచ్చారు.

సీబీఐ వలలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రఘువంశీ
ఒడిశా: లంచం తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీ సీబీఐ వలకు చిక్కారు. రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి అయిన రఘువంశీ, ఓ మైనింగ్ కేసుకు సంబంధించి.. భువనేశ్వర్‌కు చెందిన ఓ వ్యాపారి వద్ద నుంచి రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు.ఏడాదిన్నరగా రఘువంశీ భువనేశ్వర్ జోనల్ కార్యాలయంలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రఘువంశీని అరెస్ట్ చేసిన అధికారులు.. భువనేశ్వర్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు. ధెంకనల్‌కు చెందిన స్టోన్ మైనింగ్ ఆపరేటర్ రతికంత రౌత్‌పై గతంలో ఒక ఈడీ కేసు నమోదైంది.ఈ కేసులో అతని వద్ద నుంచి రఘువంశీ రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రూ.5 కోట్ల లంచంలో భాగంగా మొదటి వాయిదా కింద రూ.20 లక్షలు.. రఘువంశీకి రౌత్ ఇస్తున్నట్లు సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు.. వల వేసి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.

రేవంత్ రెడ్డికి సంబీత్ పాత్రా చురకలు
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సంబీత్ పాత్రా(Sambit Patra) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ను శంకించే బదులు.. పోయి పాకిస్తాన్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోవాలంటూ చురకలంటించారు. శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ విషయంలో కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (Revanth Reddy) తదితరులు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ, ఆయన పార్టీ నేతలు.. పాకిస్తాన్లో ఎన్ని ఎయిర్‌బేస్‌లు ధ్వంసం అయ్యాయి?. ఉగ్రవాదులు ఎంతమంది చనిపోయారు? అని వాళ్లు అడగడం లేదు. కేవలం ఎన్ని రఫెల్స్ యుద్ధ విమానాలు పాక్ నేల కూల్చిందని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు రెండు వర్గాలు తయారయ్యాయి. ఒకటి పాకిస్తాన్‌కు మద్దతు తెలిపేది. రెండో వర్గం.. వీళ్ల కారణంగా భారత్‌కు మద్దతు గళం వినిపించలేకపోతున్నది... మీ జై హిందూ యాత్ర(Jai Hind Yatra).. పాకిస్తాన్ హింద్ యాత్రలా తయారైంది. మీరు మీ యాత్రను ఆపేస్తే మంచిది. అలాగే వెళ్లి పాకిస్తాన్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించుకోండి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంబీత్ పాత్రా ఎద్దేవా చేశారు.అలాగే అఖిలపక్ష ఎంపీల బృందాన్ని.. టెర్రరిస్టులతో పోలుస్తూ(ఎంపీలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.. ఉగ్రవాదులూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు అనే కామెంట్) జైరామ్ రమేష్ వ్యాఖ్యలు చేశారు. వాళ్లేం సరదా పర్యటనలకు వెళ్లలేదు. ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరును ప్రపంచానికి తెలియజేసేందుకే వెళ్లారు. అందులో మీ ఎంపీలు కూడా ఉన్నారనే విషయం గుర్తిస్తే మంచిది’’ అని జైరామ్‌ను ఉద్దేశించి సంబీత్ పాత్రా అన్నారు.ఇదిలా ఉంటే.. ఉగ్రవాదంపై పోరు, పీవోకేను తిరిగి భారత్‌లో విలీనం చేసే చర్యలకుగానూ కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాదు పాక్‌ను రెండు ముక్కలు చేయడానికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని తెలిపారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబితేనే మోదీ ప్రభుత్వం యుద్ధాన్ని ఆపేసి వెనక్కి వచ్చిందన్న అంశంపై రేవంత్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.‘‘ప్రధాని మోదీ వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి రఫెల్ యుద్ధ విమానాల(Rafale Fighter Jets)ను కొనుగోలు చేశారు. అలాంటప్పుడు ఆ యుద్ధ విమానాల్లో ఎన్నింటిని పాక్ నేల కూల్చింది? ఈ విషయంపై చర్చ జరగదా?. వీటికి సమాధానాలు తెలియాల్సిందే’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో బీజేపీ చేపట్టిన తిరంగా ర్యాలీని ఆయన తప్పుబట్టారు. బీజేపీ తన చర్యలతో భారత సైనికుల్లో మనోస్థైర్యాన్ని దెబ్బ తీసిందని, ఆ పార్టీ చేపట్టిన తిరంగా ర్యాలీకి కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ ‘జై హింద్ యాత్ర’ చేపడుతోందని తెలంగాణ సీఎం అన్నారు.ఇదీ చదవండి: తప్పు చేసి ఉంటేనే క్షమాపణలు చెబుతా!
ఎన్ఆర్ఐ

హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ తగ్గిందా? నాలుగేళ్ల కనిష్టానికి అప్లికేషన్లు
అమెరికాలో హెచ్ 1 బీ వీసా సాధించాలనేది ఐటీ ఉద్యోగుల కల. భారతీయ IT నిపుణులు, టెక్ సంస్థల నిపుణులైన విదేశీ ఉద్యోగులకు అమెరికా ఇచ్చే హెచ్1 బీ వీసాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. తాజాగా హెచ్ 1 బీ వీసాలకు డిమాండ్ దారుణంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత వీసా దరఖస్తులు నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది.యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డేటా ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరానికి H-1B వీసా దరఖాస్తుల సంఖ్య నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. 2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 26.9 శాతం తగ్గిందని యూఎస్సీఐఎస్ తెలిపింది. ఈ సంవత్సరం కేవలం 358,737 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి - ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 480,000లతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2025 లో 470,342 అర్హత గల రిజిస్ట్రేషన్లు 343,981 చేరాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ దరఖాస్తుల 308,613గా ఉంది.ప్రత్యేక లబ్ధిదారులు 442,000 నుండి 339,000 కు తగ్గారు ఒక్కో దరఖాస్తుదారుని సగటు రిజిస్ట్రేషన్లు 1.06 నుండి 1.01 కి తగ్గాయి. బహుళ రిజిస్ట్రేషన్లు కలిగిన లబ్ధిదారుల తరపున కేవలం 7,828 దరఖాస్తులు మాత్రమే దాఖలు కాగా గత ఏడాది ఈ సంఖ్య 47,314గా ఉంది. అయితే, పాల్గొనే కంపెనీల సంఖ్య 57,600 వద్ద సాపేక్షంగా స్థిరంగా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు, అనిశ్చితులే దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వాదనలను కొట్టిపారేసిన యూఎస్సీఐఎస్ రిజిస్ట్రేషన్ శాతం తగ్గడానికి కారణం ట్రంప్ విధానాలు, వీసా నిబంధనలు కాదని వెల్లడించింది.. మోసాలు, అన్యాయమైన రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు తాము తీసుకుంటున్న చర్యలే కారణమని పేర్కొంది.ఇదీ చదవండి: 138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో ట్రంప్ పరిపాలనలో విధానాలు, యుఎస్ చట్టాన్ని ఒక్కసారి ఉల్లంఘించిన వ్యక్తుల వీసాలను రద్దు చేసే "క్యాచ్-అండ్-రివోక్" నియమాన్ని తిరిగి ప్రవేశపెట్టడం. వీసా సంబంధిత రుసుము పెంపు, ప్రక్రియను మరింత క్లిష్టంగా మార్చిందంటున్నారు టెక్ సంస్థ యజమానులు. జనవరిలో, H-1B రిజిస్ట్రేషన్ రుసుమును 10 డాలర్ల నుంచి 215 కు పెంచిన సంగతి తెలిసిందే. ఈ చర్య ముఖ్యంగా స్టార్టప్‌లు. చిన్న సంస్థలకు చాలాఎక్కువగా ప్రభావితం చేసిందని గ్రాడింగ్.కామ్ వ్యవస్థాపకురాలు మమతా షెఖావత్ అన్నారు. అయితే హెచ్ 1-బి వీసాల డిమాండ్ గత సంవత్సరంతో పోలిస్తే స్వల్పంగా తగ్గినా, 2026లో అందుబాటులో ఉన్న 85,000 వీసాల కోసంరిజిస్ట్రేషన్ల సుమారు 3.5 లక్షలకు చేరుకోవడం గమనార్హం.చదవండి: అల్జీమర్స్‌ను గుర్తించే రక్తపరీక్ష : వచ్చే నెలనుంచి అందుబాటులోకి

అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణహత్య, షాకింగ్ రీజన్!
అమెరికాలోని టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఒక పబ్లిక్ బస్సులో హెల్త్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు దారుణ హత్య విషాదాన్ని నింపింది. భారత సంతతి కి వ్యాపారవేత్త అక్షయ్ గుప్తా (30)ని తోటి భారతీయుడే పొడిచి చంపాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై అనూహ్యంతా కత్తితో విరుచుకు పడ్డాడు. దీంతో అక్షయ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.అక్షయ్ గుప్తా మే 14వ తేదీన ఆస్టిన్లోని ఒక బస్సులో ప్రయాణిస్తుండగా, బస్సు వెనుక సీట్లో కూర్చుని ఉన్నట్టుండి ఎటాక్ చేశాడు. వేట కొడవలి లాంటి కత్తాడో పొడిచి పారిపోయాడు. నిందితుడిని 31 ఏళ్ల దీపక్ కండేల్గా గురించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్ గుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది..గుప్తా సంఘటన స్థలంలోనే మరణించినట్లు ఆస్టిన్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది.అక్షయ్ గుప్తాకు, నిందితుడు దీపక్ కండేల్‌కు మధ్య ఎలాంటి ఘర్షణ కానీ, వాగ్వాదం కానీ జరగలేదనేది సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అప్పటివరకు కామ్‌గా కూర్చున్న నిందుతుడు వేటకత్తితో బాధితుపై దాడి చేశాడన్నారు. ఫుటేజీ ఆధారంగా నిందితుడు కండేల్‌ను గుర్తించి అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.దీపక్ నేర చరిత్రస్థానిక మీడికా కథనం ప్రకారం, కాండెల్కు 2016 నుండి నేర చరిత్ర ఉంది. తీవ్రమైన నేరాలు సహా విస్తృతమైన అరెస్టు చరిత్ర ఉందని, కానీ ఎప్పుడూ విచారణ జరగలేదు. ప్రాసిక్యూటర్లు అతనిపై అనేకసార్లు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. గతంలో 12 సార్లు అరెస్ట్ అయినట్టు సమాచారం. హత్యకు షాకింగ్ రీజన్అక్షయ్పై ఎటాక్ చేసిన కాండెల్ ఇతర ప్రయాణీకులతో కలిసి వాహనం నుండి దిగి వెళ్ళిపోయాడు. వెంటనే పెట్రోల్ అధికారులు కాండెల్ను పట్టుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన మామను పోలి ఉండటం వల్ల గుప్తాను పొడిచి చంపినట్లు నిందితుడు అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వైఎస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ సమావేశంలో ఆలూరు సాంబశివారెడ్డి
వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను అడ్డుకుంటూ.. సోషల్ మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియజేద్దామని ఆ పార్టీ ఎన్నారై గ్లోబల్ వింగ్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆక్లాండ్ (న్యూజిలాండ్)లోని మౌంట్ రోస్కిల్ వార్ మెమోరియల్ హాల్లో గ్లోబల్ కనెక్ట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై సోషల్ మీడియా పోస్టింగ్‌లు.. ఇప్పుడు ప్రజలకు నిజం చెప్పే ఆయుధాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్పడంతో పాటు.. వైఎస్ జగన్ అందించిన సుపరిపాలన, నాయకత్వాన్ని ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు. నిజం మాట్లాడే గొంతులుగా, అభివృద్ధిని ప్రదర్శించే వేదికలుగా ఎన్నారైలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ యెద్దుల, బుజ్జె బాబు నెల్లూరి, సమంత్ డేగపూడి, విజయ్ అల్లా, బాల శౌర్య, రాజా రెడ్డి, గీతారెడ్డి, సంకీర్త్ రెడ్డి, రమేశ్ పానాటి, జిమ్మీ, బాలవేణు బీరం, కృష్ణారెడ్డి, జగదీశ్వరరెడ్డి, రఘునాథరెడ్డి, గోవర్ధన్ మల్లెల తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తల కోం ఇక్కడ క్లిక్ చేయండిచదవండి: మెట్రోలో ఇన్ఫ్లూయెన్సర్ సందడి మాములుగా లేదు! వీడియో వైరల్

యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు
లండన్: ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. హౌస్ ఆఫ్ లార్డ్స్ గా పిలువబడే యూకే పార్లమెంట్ ఎగువ సభలో రోహాంప్టన్ విశ్వవిద్యాలయ చాన్సలర్, యూకే మాజీ మంత్రి బారోనెస్ వర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు.. ఈ కార్యక్రమానికి చిలీ, బెలిజ్ జపాన్ తదితర దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, రాయబారులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు.ఈ సందర్బంగా వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన కళాకారులు ప్రార్థన నృత్యం, మోహినీ అట్టం, కరగట్టం, మిథిలా, జిజియా నృత్యం, గోవా సాంగ్స్ తో అలరించారు. దీనిలో భాగంగా భారత మాజీ రాయభారి అభయకుమార్ రాసిన ఆన్ ఎర్త్ గీతానికి హైదరాబాద్‌కు చెందిన రాగసుధ వింజమూరి భరతనాట్యం ప్రదర్శించారు. ఇక చిలీ సంప్రదాయ నృత్యాన్ని డేనియల్ పెరెజ్ మున్స్టర్ ఆధ్వర్యంలో ఆ దేశ రాయబార కార్యాలయం అధికారులు ప్రదర్శించారు. దీనిలోభాగంగా బారోనెస్ వర్మ ప్రసంగిస్తూ.. సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంతో పాటు, అందులో శాంతిని పెంపొందించడానికి దోహద పడే అంశాల గురించి ప్రస్తావించారు. ఇందుకు వివిధ దేశాలకు చెందిన భిన్న సంస్కృతులను ఏకతాటిపై తీసుకురావడానికి చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఇది ప్రస్తుత సమాజంలో ఆహ్వానించదగ్గ పరిణామమని ఆమె స్పష్టం చేశారు.
క్రైమ్

గచ్చిబౌలి: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. 13 మందికి తీవ్ర గాయాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. గోపనపల్లి(Gopanpally) సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం(Road Accident) సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు స్థానికుల సాయంతో క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది.ఇదీ చదవండి: భర్తకు మెసేజ్ పెట్టి బలవన్మరణం

మినీ సిలిండర్‌తో కొట్టి యువకుడి హత్య
రాజేంద్రనగర్(హైదరాబాద్): తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు తన భార్య తన నుంచి దూరమయ్యేందుకు కారణమని భావించిన ఓ యువకుడు మరో యువకుడిని మినీ సిలిండర్‌తో తలపై మోది హత్య చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మామిడి కిశోర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రాంతానికి చెందిన సాయి కార్తీక్ (31), నవీన్ స్నేహితులు. ఇద్దరూ ఓ నెట్వర్క్ కంపెనీలో పని చేస్తూ అద్దె గదిలో ఉంటున్నారు. అదే ప్రాంతంలో సిద్ధార్థ్ రెడ్డి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. సిద్ధార్థ్ రెడ్డి ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. సిద్ధార్థ్ రెడ్డి, సాయి కార్తీక్, నవీన్‌లకు స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం సాయి కార్తీక్ సిద్ధార్థ్ రెడ్డి నుంచి రూ. 8 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా కాలయాపన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ రెడ్డి భార్య గత నెలలో అతడితో గొడవ పడి వెళ్లిపోయింది. సాయి కార్తీక్ ఇందుకు కారణమని సిద్ధార్థ్ రెడ్డి భావించాడు. గురువారం రాత్రి ముగ్గురు కలిసి సాయి కార్తీక్ రూమ్‌లో మద్యం తాగారు. ఈ సందర్భంగా సాయి కార్తీక్, సిద్ధార్థ్ రెడ్డి మధ్య మాట మాట పెరిగింది. దీంతో నవీన్ జోక్యం చేసుకుని వారికి నచ్చజెప్పాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి మళ్లీ వైన్స్ షాప్ వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేసి గదికి వచ్చి మద్యం తాగారు. అనంతరం మరోసారి సాయి కార్తీక్, సిద్ధార్థ్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నవీన్ సముదాయించేందుకు ప్రయతి్నంచగా సిద్ధార్థ్ రెడ్డి అతడిని బయటికి పంపించాడు. అర గంట తర్వాత నవీన్ రూమ్ గదికి వెళ్లి చూడగా సాయి కార్తీక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పక్కనే కూర్చుని ఉన్న సిద్ధార్థ్ రెడ్డిని ఏం జరిగిందని ప్రశ్నించగా మినీ సిలిండర్‌తో కొట్టి చంపేశానని... నిన్ను కూడా చంపుతానని దాడి చేసేందుకు ప్రయతి్నంచగా నవీన్ బయటికి పరుగులు తీశాడు. బుద్వేల్ ప్రధాన రహదారిపైకి వచ్చి స్థానికులకు ఈ విషయం చెప్పాడు. దీంతో వారు అక్కడికి వెళ్లి సిద్దార్థ్ రెడ్డిని పట్టుకుని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహన్ని మార్చురీకి తరలించారు. సిద్ధార్థ్ రెడ్డిని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్టాక్ మార్కెట్ పేరుతో ఘరానా మోసం..150 కోట్లతో పరార్
జీడిమెట్ల(హైదరాబాద్): పెట్టుబడి పెట్టిన సొమ్ముకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశచూపి ది పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థ టోకరా వేసింది. మూడు నెలలుగా రిటర్న్స్ ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు శుక్రవారం జీడిమెట్ల పీఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు క్యూ కట్టారు. సదరు సంస్థ చేతిలో మోసపోయిన బాధితులు ఇప్పటికే 13 మంది ఫిర్యాదు చేయగా రూ.6.5కోట్ల మోసం జరిగినట్లు తెలిసింది.బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాధితులు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గిరినగర్‌కు చెందిన బాలాజీ, మెదక్ జిల్లా, అల్లాదుర్గ్ ప్రాంతానికి చెందిన స్వాతి మూడేళ్ల క్రితం చింతల్ గణేష్ నగర్‌లోని ఓ కాంప్లెక్స్‌లో ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలిస్తామంటూ ప్రచారం చేసుకున్నారు. పెట్టుబడి పెట్టిన వారికి రూ.100 స్టాంప్ పెపర్లపై నోట్ రాసి ఇవ్వడంతో చాలా మంది వారిని నమ్మారు. కొందరు వీరి వద్ద పెట్టుబడి పెట్టగా వారు ఇచి్చన మొత్తానికి 20నెలల్లో రెట్టింపు డబ్బులు చెల్లించారు. చిన్న మొత్తాలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లు లాభం ఇస్తున్నారని నమ్మి డబ్బు పెద్ద మొత్తంలో పెట్టడమే గాక ఇతరులతో పెట్టించారు. సదరు సంస్థవారు ఇతరులతో పెట్టుబడులు పెట్టిస్తే వారికి 5శాతం కమీషన్ సైతం ఇచ్చేవారు. దీంతో వారు తమ వ్యాపారాన్ని విస్తరించి మూడే బ్రాచీలను ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు సైతం పెట్టుబడులు పెట్టారు. అయితే గత మూడు నెలలుగా సదరు సంస్థ ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆపేసింది. ఈ విషయమై పలువురు సంస్థ కార్యాలయానికి వచ్చి ప్రశ్నించగా ఈనెల షేర్ మార్కెట్ బాగాలేదు త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. శుక్రవారం డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో కొందరు ఇన్వెస్టర్లు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే ఆఫీసుకు తాళం వేసి ఉండటంతో నిర్వాహకులను ఫోన్ చేయగా ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు డిపాజిట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితులు సంఖ్య పెరిగితే కేసును ఈవోడబ్ల్యూఎస్కు బదిలీ చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా 1500 మందికి పైగా సదరు సంస్థలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుసాక్షి,సిటీబ్యూరో: లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్లలో అర్హులైన డాక్టర్లు , అనుమతి పొందిన స్కానింగ్ మిషన్లు మాత్రమే ఉండాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలపై డేకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, ఇందుకోసం 15 ప్రత్యేక బందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.సికింద్రాబాద్ లోని న్యూ లైఫ్ ఆసుపత్రిలో అనుమతి లేని స్కానింగ్ మిషన్ ను గుర్తించి సీజ్ చేసి యాజమాన్యంపై సు నమోదు చేయాలని, సైదాబాద్‌లోని వివేకాసుపత్రిలో అనుమతి లేకుండా రెండు స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసినందుకు రూ.2లక్షలు జరిమానా విధించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన 26 స్కానింగ్ సెంటర్లకు రూ.50 వేల చొప్పున జరిమానా విధించాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలన్నారు. సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు జిల్లా ప్రోగ్రాం అధికారులు అన్ని స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షల సమాచారంపై టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 3366 ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ వెంకటి, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వందన, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్లు, జిల్లా మీడియా అధికారి జక్కుల రాములు, టి నరసింహ, అంజయ్య గౌడ్ పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇల్లు ఇక రాదని..
యాచారం: ఇందిరమ్మ ఇల్లు తనకు ఇక రాదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ల గ్రామానికి చెందిన దొడ్డి అశోక్ (45) ప్లంబర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామంలో ఆయనకు ఇంటి స్థలం లేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు అర్హుడైనప్పటికీ స్థలం లేకపోవడంతో మొదటి విడతలో ఇల్లు మంజూరు కాలేదు. ఈ నెల 23న స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి యాచారంలో లబి్ధదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసే సమయంలో లిస్టులో తన పేరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.ఆ రోజు నుంచి మనోవేదనకు గురయ్యాడు. ‘స్థానిక కాంగ్రెస్ నేతలు ఇల్లు రాకుండా అడ్డుకుంటున్నారు. ఎమ్మెల్యేకు చెప్పుకొందామంటే కలవనీయరు. పిల్లలు పెద్దవుతున్నా సొంత ఇల్లు లేదాయే’అంటూ కొద్ది రోజులుగా ఇక తాను చస్తానని గ్రామస్తులతో చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో తనకు ఇల్లు రాకపోవడానికి, తన చావుకు కారణం స్థానిక కాంగ్రెస్ నాయకుడు, తన బావ యాదయ్యనేనని చేతిపై రాసుకుని శుక్రవారం ఉదయం అద్దెకుంటున్న ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్దామనే సరికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతదేహంతో ఆందోళన అశోక్ మృతికి సర్కారే కారణం అంటూ అతని కుటుంబీకులు, గ్రామస్తులు మృతదేహంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ నందీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ అయ్యప్ప, ఎంపీడీఓ శైలజ గ్రామానికి చేరుకున్నారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి సూచన మేరకు మృతుడు అశోక్ కుటుంబానికి గ్రామంలో ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు, ముగ్గురు కూతుళ్ల చదువు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని తహసీల్దార్ అయ్యప్ప హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు.
వీడియోలు


పద్దతి మార్చుకో పవన్.. నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు


పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్


కోరలు చాస్తున్న కరోనా.. దేశవ్యాప్తంగా 2710 కేసులు


ఎంతకైనా తెగిస్తావా.. మహానాడుపై ఎన్టీఆర్ ఆత్మ ఘోష


ఇవాళే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే


జగన్, కేసీఆర్ పై నర్సిరెడ్డి కామెంట్స్.. ఏకిపారేసిన అంబటి రాంబాబు


గుజరాత్ పై 20 రన్స్ తేడాతో గెలిచిన ముంబై


భారతీయ విద్యార్థిని మేఘా వేమూరి సాహనం


కూటమి సర్కారు వసూళ్ల పర్వం.. బేరంకుదిరితేనే బదిలీ


విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి వల్లభనేని వంశి