మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: శీతల్ దేవికి గిఫ్ట్ | Indian paralympic Archer Sheetal Devi Buys Scorpio And Anand Mahindra React | Sakshi

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: శీతల్ దేవికి గిఫ్ట్

Jan 28 2025 3:52 PM | Updated on Jan 28 2025 9:01 PM

Indian paralympic Archer Sheetal Devi Buys Scorpio And Anand Mahindra React

పారిస్ పారాలింపిక్స్ 2024లో.. 'శీతల్ దేవి' (Sheetal Devi) మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. ఆ సమయంలో పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) శీతల్‌కు కారు బహుమతిగా ఇస్తానని వాగ్దానం చేశారు, అది ఇప్పుడు నిలబెట్టుకున్నారు.

శీతల్ దేవిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె అద్భుతమైన సంకల్పం, దృఢత్వం, దృష్టిని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె ఒక బాణాన్ని బహుమతిగా ఇచ్చింది. ఒక ఆర్చర్‌గా ఇది తన గుర్తింపు. శీతల్ మనందరికీ స్ఫూర్తిదాయకం.. ఆమె కొత్త ఎత్తులకు ఎదుగుతున్నప్పుడు.. స్కార్పియో ఎన్ (Scorpio N)తో చూడటం గర్వంగా ఉందని ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

శీతల్ దేవి కేవలం 17 సంవత్సరాల వయస్సులో.. 2024 పారిస్ పారాలింపిక్స్‌లో మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. 2022 ఆసియా పారా గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజతం.. ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లలో ఒక స్వర్ణం, రజత పతకాలను సొంతం చేసుకుంది. క్రీడా రంగంలో ఆమె చేసిన సేవలకు గానూ.. భారత ప్రభుత్వం ఈమెను అర్జున అవార్డుతో సత్కరించింది.

మహీంద్రా స్కార్పియో ఎన్
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అధిక అమ్మకాలను పొందిన మహీంద్రా కార్లలో 'స్కార్పియో ఎన్' ఒకటి. దీని ధర రూ. 13.99 లక్షల నుంచి రూ. 24.54 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఐదు వేరియంట్లు.. మూడు ఇంజిన్ ఆప్షన్స్ కలిగిన ఈ కారు, మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న మహీంద్రా స్కార్పియో ఎన్.. డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్‌తో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా, ఆటో స్టార్ట్ / స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 12 స్పీకర్ 3డి సోనీ సౌండ్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ ఫీచర్‌లు వంటి ఎన్నో ఫీచర్స్ పొందుతుంది.

ఇదీ చదవండి: ఐఫోన్ 15 రేటు ఇంత తగ్గిందా.. ఇప్పుడెవరైనా కొనేయొచ్చు!

మహీంద్రా స్కార్పియో ఎన్ కారులో.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డీసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు 6, 7 సీటింగ్ ఆప్షన్లలో లభిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement