రియల్‌ఎస్టేట్‌లో తగ్గిన ‘పీఈ’ పెట్టుబడులు | PE Investments in Real Estate Declined Amid Global Challenges | Sakshi
Sakshi News home page

రియల్‌ఎస్టేట్‌లో తగ్గిన ‘పీఈ’ పెట్టుబడులు

Published Sat, Apr 19 2025 7:39 AM | Last Updated on Sat, Apr 19 2025 9:19 AM

PE Investments in Real Estate Declined Amid Global Challenges

సాక్షి, సిటీబ్యూరో: దేశీయ స్థిరాస్తి రంగంలోకి వచ్చిన ప్రైవేట్‌ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు కాస్త తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3 శాతం మేర తగ్గినట్లు రియల్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ క్యాపిటల్‌ వెల్లడించింది.

2024–25లో ఈ పెట్టుబడులు 3.7 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది. అంతకుముందు ఏడాది ఇవి 3.8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఆఫీసు భవనాలకు ఇన్వెస్ట్‌మెంట్స్‌ తగ్గడమే ఈ క్షీణతకు కారణం. 2020–21లో అత్యధికంగా 6.4 బిలియన్‌ డాలర్ల పీఈ పెట్టుబడులు రాగా.. 2021–22లో ఇవి 4.3 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.

అయితే 2022–23 కల్లా 4.4 బిలియన్‌ డాలర్లకు పెరిగినప్పటికీ.. తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఐదేళ్లుగా దేశీ రియల్టీలో పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తగ్గుతూ వచ్చాయి. 6.4 బిలియన్‌ డాలర్ల నుంచి 3.7 బిలియన్‌ డాలర్లకు అంటే 43 శాతం మేర క్షీణించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement