
రంగారెడ్డి: బెట్టింగ్ యాప్ మరో విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్ పాల్పడిన పవన్ అనే యువకుడు.. ఒకేసారి రూ. లక్ష పోగొట్టుకున్నాడు. దాంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అత్తాపూర్ రెడ్డిబస్తీలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తన వద్ద ఉన్న ఐఫోన్.. రాయల్ఎన్ ఫీల్డ్ బైక్ ను సైతం అమ్ముకుని బెట్టింగ్ కు పాల్పడ్డాడు.
తల్లి దండ్రులు పంపిన డబ్బులను సైతం బెట్టింగ్ లో పెట్టాడు. ఇందులో మొత్తం పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పవన్ స్వస్థలం గద్వాల్ జిల్లా. పవన్ మరణవార్త విని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com