గుడ్‌న్యూస్‌ అంటూ వీడియో రిలీజ్‌ చేసిన హేమ | Actress Hema Comments On Drugs Case Chargesheet | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసు ఛార్జ్‌షీట్‌పై స్పందించిన నటి హేమ.. ఎవ్వర్నీ వదిలిపెట్టను!

Sep 12 2024 10:51 AM | Updated on Sep 12 2024 9:02 PM

Actress Hema Comments On Drugs Case Chargesheet

బెంగళూరు రేవ్‌పార్టీ ఛార్జ్‌షీట్‌లో తన పేరు రావడంపై టాలీవుడ్‌ నటి హేమ స్పందించారు. తాను ఎలాంటి డ్రగ్స్‌ తీసుకోలేదన్నారు. బెంగళూరు పోలీసులు  బ్లడ్‌ షాంపిల్స్‌ కూడా తీసుకోలేదని పేర్కొన్నారు. డ్రగ్స్‌ తీసుకున్నట్లు వారు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమేనని హేమ ప్రకటించారు. అయితే,ఛార్జీషీట్‌లో తన పేరు ఉన్నట్లు సమాచారం వచ్చిందన్నారు.

డ్రగ్స్‌ తీసుకున్న హేమ
బెంగళూరు పోలీసులు మాత్రం నటి హేమ డ్రగ్స్‌ తీసుకున్నారని మరోసారి ఛార్జ్‌షీట్‌ ద్వారా తెలిపారు. ఈ మేరకు 1086 పేజీలతో ఛార్జ్‌షీట్‌ను రెడీ చేసిన పోలీసులు కోర్టుకు అందించారు. హేమ ఫ్రెండ్‌ వాసు అనే వ్యక్తి ఆహ్వానించడం వల్లే ఆమె రేవ్‌ పార్టీకి వెళ్లినట్లు బెంగుళూరు పోలీసులు పేర్కొన్నారు.

చార్జిషీట్‌లోనూ నెగెటివ్‌
తాజాగా హేమ.. గుడ్‌న్యూస్‌ అంటూ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అఫీషియల్‌ చార్జిషీట్‌లోనూ నాకు నెగెటివ్‌ వచ్చిందని రాశారు. అనవసరంగా నాపై కొందరు నిందలు వేస్తున్నారు. నేను ఎవర్నీ వదిలిపెట్టను. చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటాను అని వీడియోలో మాట్లాడారు. ఈ వీడియో కింద నెటిజన్లు ఈ కన్ఫ్యూజన్‌ ఏంట్రా బాబూ అని కామెంట్లు పెడుతున్నారు.

 


 నటి హేమ డ్రగ్స్‌ సేవించినట్లు ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement