
విదాముయార్చి తర్వాత స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ యాక్షన్ థ్రిల్లర్ వఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపపరంగా దూసుకెళ్తోంది.
ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల మార్కును దాటేసింది. తొలి రోజే రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును చేరుకుంది. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది. నెట్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఇండియా వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.62.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.
అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్‌లో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' భారీ అంచనాల థియేటర్లలో విడుదలైంది. దర్శకుడు మగిజ్ తిరుమేని 'విదాముయార్చి' తర్వాత ఈ ఏడాదిలో అజిత్ కుమార్‌కి ఇది రెండో మూవీ కావడం విశేషం. ఈ చిత్రం అజిత్ కుమార్ గ్యాంగ్‌స్టర్‌గా అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో అర్జున్ దాస్, త్రిష కృష్ణన్, ప్రభు, ప్రియా ప్రకాష్ వారియర్, రఘు రామ్, కార్తికేయ కీలక పాత్రలు పోషించారు.