Chiranjeevi Honours Oscar Winners MM Keeravaani, SS Rajamouli On Ram Charan's Birthday - Sakshi
Sakshi News home page

Chiranjeevi : రామ్‌చరణ్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆస్కార్‌ విజేతలకు చిరు సన్మానం

Mar 28 2023 4:08 PM | Updated on Mar 28 2023 4:50 PM

Chiranjeevi Honours Oscar Winners MM Keeravaani, SS Rajamouli On Ram Charan Birthday - Sakshi

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 38వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్‌కు ఈ బర్త్‌డే మరింత ప్రత్యేకం. ఆస్కార్‌ విజయంతో పాటు త్వరలోనే చరణ్‌ తండ్రిగా ప్రమోట్‌ కానున్నాడు. దీంతో ఈ పుట్టినరోజు ఉపాసన మరింత స్పెషల్‌గా నిర్వహించింది. ఈ పార్టీకి రాజమౌళి కుటుంబం, నాగార్జున, వెంకటేశ్‌, కాజల్‌ అగర్వాల్‌, అడివి శేష్‌ సహా పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు.

ఇక కొడుకు పుట్టినరోజును పురస్కరించుకొని చిరంజీవి ఆస్కార్‌(నాటు నాటు)విజేతలను సత్కరించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దర్శకుడు రాజమౌళి,నిర్మాత డీవీవీ దానయ్య,సంగీత దర్శకుడు కీరవాణి, నాటునాటు కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరలతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ టీంలోని రమ, శ్రీవల్లి, ఎస్ఎస్ కార్తికేయలకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువా కప్పి సత్కరించారు.

దీనికి సంబంధించిన ఫోటోలను చిరు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.  రామ్ చరణ్ పుట్టినరోజున అయినవాళ్లు, ఆత్మీయుల సమక్షంలో ఆస్కార్ విజేతలను సన్మానించడం నిజంగా ఓ వేడుకలా జరిగిందంటూ చిరంజీవి పోస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement