
భిన్న నటులందరూ ఒకే దగ్గర సమావేశమయ్యారు. తమిళ సినీ స్టార్స్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), అరవింద్ స్వామి, మలయాళ హీరో ఉన్ని ముకుందన్, కన్నడ నటుడు ప్రకాశ్ రాజ్, తెలుగు హీరో సిద్ధు జొన్నలగడ్డ, హిందీ నటుడు విజయ్ వర్మ.. అందరూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతా
ఇందులో విజయ్ సేతుపతి సరదా వ్యాఖ్యలకు మిగిలినవారంతా పడిపడి నవ్వారు. ఎవరైనా అద్భుతంగా నటిస్తే నేను అభద్రతాభావానికి లోనవుతాను. ఫలానా సన్నివేశంలో అంత ఈజీగా ఎలా యాక్ట్ చేశారు? అని ఆలోచిస్తుంటాను.. అని విజయ్ చెప్పుకుంటూ పోతుంటే అరవింద్ స్వామి నవ్వకుండా ఉండలేకపోయాడు.
(చదవండి: Saif Ali Khan: వెన్నెముకలో విరిగిన కత్తి.. నటుడికి ప్లాస్టిక్ సర్జరీ)
అంతా ఈయన వల్లే..
అతడిని చూసి ప్రకాశ్ రాజ్ సైతం నవ్వేశాడు. ఈయన వల్లే నవ్వానంటూ ప్రకాశ్.. అరవింద్‌వైపు వేలు చూపించాడు. దీంతో సేతుపతి.. సర్.. ఈయన నన్ను మాట్లాడినవ్వట్లేదు. ఇంటర్వ్యూ మధ్యలో చెడగొడుతున్నాడు. వెంటనే ఈయన్ని బయట నిల్చోబెట్టండి అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కోరాడు. దీంతో అక్కడున్న మిగతా నటులు సైతం ఘొల్లుమని నవ్వారు.
రాత్రి సిట్టింగ్..
కొన్నిసార్లు అరవింద్ స్వామి నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. వెళ్లాక మేము తాగుతూ కూర్చుంటాం. రెండుమూడు గంటలపాటు నన్ను టీజింగ్ చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లయితే తెల్లవారేవరకు నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు అని సీక్రెట్ బయటపెట్టాడు. ఇక మరో సందర్భంలో జీవిత సత్యాన్ని బయటపెట్టాడు. జీవితం కొన్నిసార్లు మనకు పాఠాలు చెప్తుంది. దాన్ని నేర్చుకోకపోతే లైఫ్ మనకు గుణపాఠం చెప్తుందన్నాడు.
చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి!