Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Slams Nara Lokesh Chandrababu Over 10th Valuation Errors1
బాబుగారూ.. ‘టెన్త్‌’లో మీరు, మీ కొడుకు ఫెయిల్‌: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యా వ్యవస్థే ఇలా ఉంటే మిగతా వాటిని ఎంత ఘోరంగా నడుపుతున్నారోనని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) చురకలంటించారు. ఈ మేరకు నాలుగు పాయింట్లతో కూడిన సందేశాన్ని ఆయన తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌(Nara Lokesh) టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని(10th Papers Valuation) కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది.సుమారు 6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్‌కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తంచేసే పరిస్థితిని తీసుకు వచ్చారు. మీరు చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్‌ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 1.@ncbn గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2025 .. చంద్రబాబుగారూ(Chandrababu Gaaru) దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు.చంద్రబాబుగారూ… మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్‌ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్‌ మార్క్స్‌ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను’’ అని జగన్‌ తన పోస్టులో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీ టెన్త్‌ ఫలితాలు సరైనవేనా?

Covid-19 In India: Active Cases Reach 3,3952
దేశంలో కోవిడ్‌ కలకలం.. 3,395కు చేరిన యాక్టివ్‌ కేసులు

ఢిల్లీ: దేశంలో మళ్లీ కోవిడ్‌ కలకలం సృష్టిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. 3,395కు యాక్టివ్‌ కేసులు చేరాయి. గత 24 గంటల్లో కోవిడ్‌తో నలుగురు మృతి చెందారు. యూపీ, ఢిల్లీ, కర్ణాటక కేరళలో ఒక్కొక్కరు మృతి చెందారు. కోవిడ్‌ నుంచి కోలుకుని 1435 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.8 రాష్ట్రాలలో కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో 375, గుజరాత్‌లో 265, కర్ణాటకలో 254, కేరళలో 1336, మహారాష్ట్రలో 467, తమిళనాడులో 185, వెస్ట్ బెంగాల్‌లో 205, ఉత్తరప్రదేశ్‌లో 117 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. రద్దీ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కరోనా కలకలం రేపింది. పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారంలో విధులు నిర్వహించే వెంకట్ అనే వ్యక్తి కరోనా వచ్చినట్లు కేటీపీఎస్ హాస్పిటల్ వైద్యులు నిర్థారించారు. కాగా, ఏపీలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నా కానీ.. ప్రజలను అప్రమత్తం చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఏలూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కలెక్టరేట్‌లోని ముగ్గురు ఉద్యోగులకు వైరస్‌ సోకింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న ముగ్గురికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటిట్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు.. వైద్యుల సూచన మేరకు ఆ ముగ్గురు ఉద్యోగుల్ని ఐసోలేషన్‌కి పంపించారు.వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తమను అప్రమత్తం చేయకుండా అధికారులు ఇలా వ్యవహరించడం ఏంటని మండిపడుతున్నారు. ఏపీలో విశాఖపట్నం, కోనసీమ, పశ్చిమగోదావరి, గుంటూరు.. ఇలా కేసులు వెలుగు చూశాయి. కడపలో కరోనా కేసు వెలుగు చూస్తే.. దానిని అధికారులు దాచిపెట్టే ప్రయత్నం చేయడం తెలిసిందే.

Miss World 2025 Grand Finale Hyderabad Updates3
ఎవరికో ఆ ‘అందాల’ కిరీటం.. హైటెక్స్‌లో మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే

సాక్షి, హైదరాబాద్‌: హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది. ఫినాలేకు రాష్ట్ర టూరిజం శాఖ, మిస్ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ భారీ ఏర్పాట్లు చేసింది. గ్రాండ్ ఫినాలేకి 3,500 మంది గెస్ట్‌లుగా హాజరయ్యారు. గ్రాండ్ ఫినాలేకి టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు వచ్చారు.2016 మిస్ వరల్డ్ విన్నర్ స్టేఫినీ డెల్ వాలే, సచిన్ కుంభర్‌.. ఫినాలే ఈవెంట్‌ను హోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ స్పెషల్ లైవ్ షో నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ న్యాయనిర్ణేతలుగా నటుడు సోను సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కరీనా టర్రెల్ వ్యవహరించారు. 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.ఫినాలేలో మిస్ వరల్డ్ హ్యూమానిటరియన్ అవార్డును సోనుసూద్‌ అందుకోనున్నారు. మిస్ వరల్డ్ చైర్ పర్సన్ జూలియా మోర్లీ.. విన్నర్‌ను ప్రకటించనున్నారు. 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా.. విజేతకు 6.21 కోట్ల విలువ గల బ్లూ క్రౌన్ అలంకరించనున్నారు. విశ్వసుందరికి 8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. 40 మంది సుందరీమణులు ఫినాలేలో పోటీపడుతున్నారు. టాప్ 40లో ఇప్పటికే 16 బెర్త్‌లు ఖరారు కాగా, ఈ రోజు జరిగే క్వార్టర్స్ ఫైనల్స్‌లో 24 మందిని జూరీ మెంబర్లు ఎంపిక చేయనున్నారు.బ్యూటీ విత్ ఎ పర్సస్‌లో మిస్ ఇండోనేషియా, మిస్ వేల్స్, మిస్ ఉగాండ విజేతలుగా నిలిచారు. బ్యూటీ విత్ ఎ పర్సస్, టాలెంట్ ఈవెంట్ రెండింట్లోను మిస్ ఇండోనేషియా మోనిక కేజియా గెలిచారు. స్పోర్ట్స్ ఈవెంట్ లో విజేతగా మిస్ ఎస్తోనియా నిలిచారు. హెడ్-టు-హెడ్ రౌండ్‌లో మిస్ టర్కీ విన్ అయ్యారు. ఫ్యాషన్ గ్రాండ్ ఫినాలేలో మిస్ ఇండియా నందినీ గుప్తా టాప్ మోడల్‌గా నిలిచారు.

Reason Behind Laying Off 6000 Employees Microsoft CEO Satya Nadella Reveals4
6000 మంది ఉద్యోగుల తొలగింపు అందుకే: సత్య నాదెళ్ళ

మైక్రోసాఫ్ట్ ఇటీవల దాదాపు 6,000 మంది ఉద్యోగులను, అంటే దాని ప్రపంచ శ్రామిక శక్తిలో దాదాపు 3 శాతం మందిని తొలగించింది.. అసలు కంపెనీ ఇంతమందిని ఎందుకు తొలగించింది అనే విషయాన్ని సీఈఓ సత్యనాదెళ్ళ వివరించారు.ఇటీవల ఉద్యోగులతో జరిగిన టౌన్ హాల్‌ సమావేశంలో సత్యనాదెళ్ళ మాట్లాడుతూ.. ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం పనితీరు సరిగ్గా లేకపోవడం కాదు. సంస్థ పునర్వ్యవస్తీకరణలో భాగంగానే ఉద్యోగుల తొలగింపులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.పోటీ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ తన కోపైలెట్ ఏఐ అసిస్టెంట్‌లను మరింత వేగంగా వినియోగదారులకు చేర్చడం మీద కూడా దృష్టి సారించింది. దీనికోసం కొన్ని సంస్థలతో.. ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. ఏఐ టూల్స్ వాడకం మాత్రమే కాకుండా.. ఇందులో ఉద్యోగులకు సైతం శిక్షణ ఇవ్వాల్సిన ఉందని సత్యనాదెళ్ళ వివరించారు.మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం ఏఐ మౌలిక సదుపాయాలలో 80 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇందులో ఏఐ సామర్థ్యాలను విస్తరించడం మాత్రమే కాకుండా.. వివిధ ప్లాట్‌ఫామ్‌లు, సేవలలో దాని కోపైలట్ ఏఐ అసిస్టెంట్‌లను ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం: చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామామైక్రోసాఫ్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ 'అపర్ణ చెన్నప్రగడ' కూడా ఇదే కార్యక్రమంలో పాల్గొన్నారు. కోడింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ అధ్యయనం వాడుకలో లేకుండా పోతుందనే ఆలోచనలను గురించి మాట్లాడుతూ.. "కంప్యూటర్ సైన్స్ చదవకూడదనే లేదా కోడింగ్ చనిపోయిందనే భావన ఏ మాత్రం సరైంది కాదు, ఇందులో ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేదని.. భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆమె భరోసా ఇచ్చారు.

Karun Nair hits double hundred for India A Against England Lions5
డబుల్‌ సెంచరీతో చెలరేగిన కరుణ్ నాయర్‌..

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌నను టీమిండియా వెట‌రన్ ఆట‌గాడు క‌రుణ్ నాయ‌ర్ ఘ‌నంగా ఆరంభించాడు. కాంట‌ర్‌బ‌రీ వేదిక‌గా ఇంగ్లండ్ ల‌య‌న్స్‌తో జ‌రుగుతున్న తొలి అనాధికారిక‌-ఎ టెస్టులో క‌రుణ్ నాయ‌ర్‌.. భార‌త-ఎ జ‌ట్టు త‌ర‌పున అద్బుత‌మైన డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఫ‌స్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన నాయ‌ర్‌.. 272 బంతుల్లో తన డ‌బుల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 26 ఫోర్లు, ఒక సిక్స‌ర్ ఉన్నాయి. ఓవ‌రాల్‌గా 204 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. నాయ‌ర్‌కు ఇది నాలుగో ఫ‌స్ట్ క్లాస్ ద్విశ‌త‌కం కావ‌డం గ‌మ‌నార్హం.కోహ్లి వారసుడు ఫిక్స్‌..?కాగా విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డంతో టెస్టుల్లో అత‌డి స్దానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తార‌న్న చ‌ర్చ ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. కొంత‌మంది సాయిసుద‌ర్శ‌న్ పేరును సూచిస్తుంటే.. మ‌రి కొంత‌మంది కరుణ్ నాయ‌ర్‌ను పేరును చెబుతున్నారు.ఇటువంటి స‌మ‌యంలో కోహ్లి స్ధానానికి త‌నే స‌రైనోడ‌న‌ని నాయ‌ర్ డ‌బుల్ సెంచ‌రీతో చాటుకున్నాడు. కాగా కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తుండడంతో నాయర్‌కు సెలక్టర్లు తిరిగి పిలుపునిచ్చారు. నాయర్‌ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్‌ది కీల‌క పాత్ర‌. ఈ టోర్నీలో 16 ఇన్నింగ్స్‌లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నాయర్‌ చివరసారిగా భారత జట్టు తరపున 2017లో ఆడాడు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కరుణ్‌ నాయర్ కొన‌సాగుతున్నాడు.భారీ స్కోర్‌ దిశగా భారత్‌-ఎఇక అనాధికరిక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌-ఎ జట్టు భారీ స్కోర్‌ దిశగా దూసుకువెళ్తోంది. 112 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 510 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు సర్ఫరాజ్‌ ఖాన్‌(92), ధ్రువ్‌ జురెల్‌(94) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయారు.

Will Pawan Kalyan Priority Decrease In The Coalition Government6
పొత్తుపై పవన్ పునరాలోచన!.. వైరాగ్యమా.. వికారమా!!

పవన్ కళ్యాణ్‌కు అధికారం సంపాదించడంలో ఉన్నంత ఆరాటం.. నేడు ప్రజల కోసం చేస్తున్న పోరాటంలో కనిపించడంలేదు.. ఏదో చేసేద్దాం అనుకుని వచ్చాను.. ఏమీ చేయలేకపోతున్నానంటున్నారు. తనకు జ్ఞనోదయం అయిందా?. విషయం అవగతమైందా?. చంద్రబాబు నీడలో తన ఉనికి తనకే కనిపించక కళ్లు మసకలు.. బైర్లు కుమ్ముతున్నాయా తెలియని పరిస్థితుల్లో పవన్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తనలోని నైరాశ్యాన్ని నిర్వేదాన్ని వెళ్లగక్కారు..వాస్తవానికి ఆయన ప్రభుత్వ పరంగా డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయనకు ప్రభుత్వ నిర్ణయాలు.. పాలసీలతో సంబంధం లేకుండా పోతోంది. ఎంతసేపు లోకేష్‌ను ఎలివేట్ చేసి రేపు ఆయన్ను సీఎంగా తీర్చిదిద్దే పనిలో ఉన్న చంద్రబాబు పవన్ను జస్ట్ పెయిడ్ రౌడీ మాదిరిగా మాత్రమే వాడుకుంటూ పక్కన పెట్టేస్తున్నారు. అంటే పాత సినిమాల్లో సత్యనారాయణ జస్ట్ ఇలా చప్పట్లు కొట్టి జగ్గూ అనగానే పెద్ద కండలతో ఒక రౌడీ వచ్చి హీరో మీద దాడి చేస్తాడు కదా.. ఆ టైప్ పాత్రకు తనను వాడుకుంటున్నట్లు పవన్ గ్రహించారు.ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిణామాలు ఎదురైనప్పుడు మాత్రమే తనను వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టేస్తున్న విషయం పవన్ గ్రహించారు.. అందుకే తన అసంతృప్తిని తాజాగా వెళ్లగక్కారు. తన 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్నాను కానీ పరిస్థితులు చూస్తుంటే మాట మార్చాల్సి వచ్చేలా ఉందని చెప్పేశారు. రాష్ట్రంలో క్రైమ్ పెరిగిపోతుందని అంటూ అధికారులు ఇంకా ప్రభుత్వానికి సహకరించడం లేదని పవన్ నిందారోపణ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో అధికారం మొత్తం చంద్రబాబు.. లోకేష్ చేతిలో మాత్రమే ఉంది వారు చెప్తే తప్ప పూచిక పుల్ల కూడా కదలని పరిస్థితి.ఆఖరికి తన పంచాయతీరాజ్ అటవీ శాఖల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంది. లోకేష్ చెబితే తప్ప పవన్ శాఖలో కూడా ఏమీ జరగడం లేదు. అంటే కేవలం తన ఇమేజ్ ద్వారా ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు ఇప్పుడు తన కొడుకు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు పాటలు వేస్తున్నారు తప్ప తనకు ఏ రకమైన గౌరవ మర్యాదలు రాజకీయ ప్రాధాన్యం దక్కనివ్వడం లేదని పవన్ కళ్యాణ్ ఎప్పటికీ తన అంతరంగికుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తుంది. తనను కేవలం ఓట్ల తెచ్చే యంత్రంగా వాడుకొని ఇప్పుడునట్లు లూజ్ చేసి పక్కన పడేస్తున్నారు అని పవన్ గ్రహించారు. అందుకే పొత్తుల విషయమై ఆయన బరస్ట్ అయినట్లుగా తెలుస్తుంది.దీంతోపాటు రాష్ట్రంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఆగడాలు రౌడీయిజం కూడా పవన్‌లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ హత్యలు. అత్యాచారాలు సాధారణమైనాయి.. ఉద్యోగుల పట్ల కూడా తెలుగుదేశం నాయకులు అమర్యాదగా ప్రవర్తిస్తూ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేస్తున్నారు. వాస్తవానికి అధికరణకు వచ్చిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కక్ష పూర్తి రాజకీయాలు చేయబోనని.. వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై దాడులకు తాను వ్యతిరేకం అని చెప్పారు. కానీ నేడు జరుగుతున్నది దానికి విరుద్ధంగా ఉన్నది. పల్లెలు పట్టణాలు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు పూర్తిగా ఆధిపత్యం సాధించే దిశగా వెళుతూ ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మీద దాడులు హత్యలకు పాల్పడుతున్నారు.ఇదంతా పవన్ కళ్యాణ్ గమనించి తన అసంతృప్తిని ఇలా వెళ్లగక్కారని అంటున్నారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని ఆరోపించారు. నేడు అంతకుమించి దారుణాల జరుగుతున్నాయి దీనికి పవన్ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. అందుకే తాను 15 ఏళ్ల పాటు పొత్తులో ఉందామని అనుకున్న పరిస్థితులు అలా లేవంటూ ఇప్పుడు తాను పునర్ ఆలోచిస్తున్నట్లుగా ఆయన మాటలు చెబుతున్నాయి.వచ్చే నాలుగేళ్లలో పవన్ పరిస్థితి ప్రభుత్వంలో మరింత దిగజారితే.. లోకేష్ ప్రాబల్యం ప్రాధాన్యం పెరిగితే అప్పుడు జనసేన ని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం తనను డిప్యూటీ సీఎం హోదాలో ప్రోటోకాల్.. బుగ్గ కారు.. ఓ ఆఫీసు ఓ పదిమంది స్టాఫ్ మినహా ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యం పాలసీల విషయంలో తన సంప్రదించకపోవడం వంటి అంశాలు పవన్ను ఇబ్బంది పెడుతున్నాయి. తనకు రాజకీయంగా జీరో నాలెడ్జ్ అని భావించడం వల్లనే చంద్రబాబు కూడా తనను చిన్నచూపు చూస్తున్నారని పవన్ లోలోన మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన మనసులోని ఆవేదనను ఈ విధంగా వెళ్లగక్కి చంద్రబాబుకు ఇండికేషన్ పంపించినట్లుగా జన సైనికులు భావిస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న

Doubts Raised On AP SSC Results 2025 Amid Revaluation Row7
బిగ్‌ న్యూస్‌: ఏపీ టెన్త్‌ ఫలితాలపై సర్వత్రా అనుమానాలు!

సాక్షి, విజయవాడ: ఏపీ టెన్త్‌ మూల్యాంకనంలో ఈసారి మామూలు తప్పులు చోటు చేసుకోలేదు. రీవాల్యూయేషన్‌లో.. విద్యాశాఖ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా మార్కుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఏకంగా 50, 60 మార్కుల వ్యత్యాసం వస్తుండడంతో అంతా కంగుతింటున్నారు. ఈ ఘోర నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూలేని రీతిలో టెన్త్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పులు చోటు చేసుకున్నాయి. రీవాల్యూయేషన్‌ ద్వారా మార్కుల్లో భారీ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. నారా లోకేష్‌ (Nara Lokesh) సారథ్యంలో విద్యాశాఖ తొలి ఏడాది ఘోర వైఫల్యం చెందిందని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. రికార్డ్‌ టైం కోసం మొత్తం మూల్యాంకనం గందరగోళంగా మార్చేశారనే విమర్శ బలంగా వినిపిస్తోంది.ఏపీలో మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ దాకా టెన్త్‌ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్‌ 23వ తేదీన ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. మొత్తం 4,98,585 మంది పాసైనట్లు( 81.14 శాతం) ప్రకటించి అభినందనలు తెలిపారు. అయితే.. రీవాల్యూయేషన్‌ కోసం ఏకంగా 60% మంది దరఖాస్తు చేసుకోవడంతో బోర్డు కంగుతింది. దరఖాస్తు చేసుకున్న 66,363 మందిలో.. ఇప్పటిదాకా 11,175 మంది విద్యార్థుల మార్కుల్లో మార్పులు జరిగాయి. ఇక అధికారులు పర్సంటేజీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం 16.8 శాతమే అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. విషయం మీడియా ద్వారా బయటపడడంతో.. టీచర్లను సస్పెండ్‌ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు.. ఈ పరిణామంతో అసలు టెన్త్‌ఫలితాలపై ఇప్పుడు కొందరు పేరెంట్స్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు.. గతంలో రీవాల్యూయేషన్‌ కోసం ఐదు వేలకు మించి దరఖాస్తులు రాలేదని గణాంకాలతో సహా మాజీ విద్యాశాఖ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ఇదే విషయాన్ని అధికారులు మీటింగ్‌ పెట్టి పిలిచి అడిగినా చెబుతానని, ఆ సమావేశంలో మూల్యాంకనంలో తప్పులు ఎలా జరిగాయో వివరించేందుకు తాను సిద్ధమని బొత్స అంటున్నారు.రికార్డు స్థాయి టైంలో రిజల్ట్స్‌ వెల్లడించాలని నారా లోకేష్ చేసిన ఒత్తిడి ఫలితమే తప్పుల తడకగా ఫలితాలు వెల్లడయ్యాయని, పాసైన వాళ్ళు కూడా ఫెయిలయ్యాయరనే వాదన వినిపిస్తోంది. ఇక ఈ ఫలితాలతో వేల మంది విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ఇంత ఘోరంగా వైఫల్యం చెందినా.. తప్పు జరిగిందంటూ లోకేష్‌ ఈ అంశంపై కనీసం ఒక ట్వీట్‌ చేయకపోవడం ఇంకా దారుణం.

YSRCP Sajjala Predicts Chandrababu Future Unpredictable8
బాబు భవిష్యత్తుపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు

సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో వ్యవస్థలు కూటమి పాలనలో దారుణంగా విఫలమయ్యాయని, ఆధారాల్లేకుండానే మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డిని జైలుకు పంపించారని వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. శనివారం నెల్లూరు జైల్లో కాకాణితో ములాఖత్‌ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్‌సీపీ నేతలపై వరుసపెట్టి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. కల్పిత కథనాలు సృష్టించి.. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇది పరాకాష్టకి చేరింది. అక్రమంగా అరెస్ట్ చేస్తే.. బయటకు వచ్చాక వాళ్లు మరింత రాటు తేలుతారు. వైఎస్సార్‌సీపీలో ఉండే సీనియర్‌ నేతలను టార్గెట్‌ చేశారని మేం ముందే అనుకున్నాం. అయితే ఎంత అణగతొక్కాలని చూస్తే అంతే బలంగా వైఎస్సార్సీపీ పైకి లేస్తుంది. చంద్రబాబు(Chandrababu) దీనిని మొదలుపెట్టారు. కానీ, దీని పరిణామాలు భవిష్యత్తులో ఘోరంగా ఉండబోతున్నాయి. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం. దేనికైనా సిద్ధం.రాష్ట్రంలో సిస్టమ్‌ ఫెయిల్‌ అయ్యింది. పబ్లిక్‌గానే బట్టల్లేకుండా డ్యాన్సులు వేయిస్తున్నారు. ఖాకీ డ్రెస్సు వేసుకున్న పోలీసులు.. తెనాలిలో ముగ్గురిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు అని అన్నారాయన. గతంలో చంద్రబాబును పక్కా ఆధారాలతో మా ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. లిక్కర్‌ కేసులో బెయిల్‌ మీద ఉన్న చంద్రబాబు.. మేనేజ్‌ చేసుకుంటూ వస్తున్నారు. వైఎస్‌ జగన్‌(YS Jagan) అనుకుని ఉంటే చంద్రబాబును మరోసారి జైలుకు పంపేవారు. చంద్రబాబుకి రాజకీయ ఉనికి లేకుండా చేయాలని రాష్ట్ర ప్రజలు సిద్దమయ్యారు. కూటమికి పాడె కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబులో మార్పు వస్తే మేలు. రాకపోతే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది’’ అని హెచ్చరించారాయన. ఇదీ చదవండి: కూటమివారి నవమోసాలు

 Kolkata taxi driver harasses and scams American YouTuber viral video9
బొక్కలిరుగుతాయ్‌.. అమెరికా టూరిస్ట్‌కు చేదు అనుభవం, వీడియో వైరల్‌

భారత దేశ పర్యటనకు వచ్చిన అమెరికన్‌ యూట్యూబర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఊహించని ఈ పరిణామానికి హతాశుడైన అతను తన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. కోల్‌కతాలో పర్యటిస్తున్న యూట్యూబర్ డస్టిన్‌ పట్ల స్థానిక టాక్సీ డ్రైవర్‌ దారుణంగా ప్రవర్తించాడు. ఉద్దేశపూర్వకంగా అతన్ని వేరే హోటల్‌కు తీసుకెళ్లి, ఎక్కువ ఛార్జీ వసూలు చేయాలని చూశాడు. దీంతోతనకు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియోను డస్టిన్‌ తన యూట్యూబ్ (Youtube) ఛానల్‌లో అప్‌లోడ్ చేయగా ఇది వైరల్‌గా మారింది.ఆనందనగరం కోల్‌కతాను వీక్షించాలని వచ్చిన పర్యాటకుడి మొదటి రోజు పీడకలగా మారిపోయింది.అమెరికన్ వ్లాగర్ డస్టిన్ అనే కోల్‌కతా దర్శించేందుకు వచ్చాడు. కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న డస్టిన్ పార్క్ స్ట్రీట్‌లోని గ్రేట్ వెస్టర్న్‌ హోటల్‌కు వెళ్లేందుకు స్థానికంగా ఓ టాక్సీ ని బుక్‌ చేసుకున్నాడు. ప్రయాణ ప్రారంభమైన కొద్దిసేపటికే డ్రైవర్ దారి మళ్లించి, దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని రాజార్హాట్ ప్రాంతంలోని ది వెస్టిన్ అనే వేరే హోటల్‌కి తీసుకెళ్లాడు. పైగా అతనితో వాగ్వాదానికి దిగాడు. అసలు చార్జీరూ.700 బదులుగా రూ.900 డిమాండ్ చేశాడు.ఇదీ చదవండి: నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్‌ యోగాసనాలుఇక్కడితో అయిపోలేదు....మరో వ్యక్తి (ఎర్ర చొక్కా ధరించిన వ్యక్తి) కల్పించుకొని డస్టిన్‌ను బెదరించడం మొదలు పెట్టాడు. మాఫియాతో తనకు సంబంధాలున్నాయ్‌.ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి బొక్కలు ఇరగదీస్తానంటూ రెచ్చిపోయాడు. అయినా డస్టిన్‌ బెదరలేదు. విషయాన్ని పూర్తిగా వివరించే ప్రయత్నం చేశాడు. అయినా రూ. 1000 డిమాండ్ చేశాడురెండోవాడు. ఆ తరువాత వారు డస్టిన్‌కోసం మరో టాక్సీని బుక్‌ చేశారు. అయితే ఈ సారి "పార్కింగ్ , పెట్రోల్" కోసం అదనంగా రూ. 100 చెల్లించాలని పట్టుబట్టడంతో మొత్తం చార్జీ రూ. 800కి పెరిగింది. ఇందదులో కొత్త డ్రైవర్‌కు కేవలం రూ.400 మాత్రమే ఇస్తున్నామని మాట్లాడుతుండగా డస్టిన్ తన వీడియోలో రికార్డ్ చేశాడు. అలాగే 50 నిమిషాలు పట్టాల్సిన ప్రయాణాన్ని 1 గంట 20 నిమిషాలకు పొడిగించారంటూ డస్టిన్‌ అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఈ సంఘటన తన భారత్‌పై తనకున్న అభిప్రాయాన్ని మార్చలేదని, ఇండియా అద్భుతమైన దేశమంటూ పేర్కొన్నాడు. చదవండి: నటి భర్త, టైగర్‌ మ్యాన్‌ వాల్మీక్‌ థాపర్‌ ఇకలేరు.. ఎవరీ థాపర్‌? ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దేశానికి ప్రతిష్టకు భంగం అంటూ వ్యాఖ్యానించారు. విదేశీ పర్యాటకుల పట్ల ఇలా ప్రవర్తించడం మాకు సిగ్గుచేటు అని ఒకరు, మ“నేను వీడియో లింక్‌తో కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశా,లాంటి పోకిరితనంపై వెంటనే చర్య తీసుకోవాలని అభ్యర్థించాను’’ అని మరొకరు కమెంట్‌చేశారు. ఆ బెంగాలీ వాలా చాలా మొరటుగా తిట్టుగాడు బెంగాలీని, సారీ అంమూ మరో యూజర్‌ వ్యాఖ్యానించాడు. మరోవైపు వీడియో వైరల్ కావడంతో బిధన్‌నగర్ పోలీసులు స్పందించి ఇద్దరిని అరెస్టు చేశారు. డ్రైవర్ అలంగీర్ మొల్లా (34), అతడి సహచరుడు మనోజ్ కుమార్ రాయ్ (52)లపై బెదిరింపు, మోసం, క్రిమినల్ కుట్ర కేసులు నమోదు చేశారు. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.

Bedtime Yoga: The best yoga asanas for good sleep10
Bedtime Yoga : నిద్ర ముంచుకు రావాలంటే.. బెస్ట్‌ ఆసనాలు

రాత్రి నిద్రించడానికి ముందు చేసే కొన్ని యోగాసనాల వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగ్గా ఉంటుంది. గ్యాస్ట్రిక్, పొట్ట భాగంలో అధిక కొవ్వు సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. భోజనం చేసిన రెండు గంటల తర్వాతనే ఈ ఆసనాలను సాధన చేయాలి. అప్పుడే నిద్ర, ఉదరకోశ సమస్యలకు సరైన ఫలితాలను పొందుదుతారు. పవన ముక్తాసన యోగా మ్యాట్‌పైన వెల్ల్లకిలా పడుకోవాలి. మోకాళ్ళను వంచి, వాటిని ఛాతీ వైపు తీసుకురావాలి. మోకాళ్ళను చేతులతో కౌగిలించుకుని, 20 నుండి 30 సెకన్ల పాటు అదే స్థితిలో ఉండాలి. తర్వాత సాధారణ స్థితికి రావాలి. ఈ ఆసనాన్ని 3 నుండి 5 సార్లు పునరావృతం చేయాలి.సేతు బంధాసనమ్యాట్‌పైన పడుకొని పాదాల మధ్య కొంత స్పేస్‌ ఉంచుతూ, తుంటి భాగాన్ని పైకి ఎత్తాలి. రెండు చేతులతో కాలి మడమలను పట్టుకోవాలి. ఈ భంగిమలో శరీరం వంతెన భంగిమను తలపిస్తుంది. 20 నుండి 30 సెకన్ల ΄ాటు అలాగే ఉండి, తర్వాత తుంటిని తిరిగి కిందకు దించాలి. ఈ ఆసనాన్ని 3 నుంచి 5 సార్లు పునరావృతం చేయాలి. చదవండి: Yoga 9 ఏళ్లకే గిన్నిస్‌ రికార్డు‘యోగం’వజ్రాసనమోకాళ్లను వంచి,పాదాల మీదుగా హిప్‌ భాగం వచ్చేలా కూర్చోవాలి. వెన్నును నిటారుగా ఉంచాలి. రెండు చేతులను పొట్ట దగ్గరగా ఉంచాలి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ, వదలాలి. ఈ ఆసనంలో సౌకర్యంగా ఉన్నంత సేపు కూర్చోవచ్చు. ఇదీ చదవండి: NMACC లో బాలీవుడ్‌ స్టార్‌ కిడ్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement