చిత్తూరు జిల్లా శేషాచల కొండల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీశాఖ అధికారులపై దాడి చేసిన నేపథ్యంలో వారి ఆట కట్టించేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా రంగంలోకి దిగారు. అందులోభాగంగా రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో పలు చెక్పోస్ట్లు, జాతీయ రహదారులపై ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తు, దాడులు చేస్తున్నారు. అందులోభాగంగా వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట సమీపంలో అక్రమంగా రెండు వాహనాల్లో తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు.
ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. అనంతరం స్మగ్లర్లతోపాటు లారీలను పోలీసు స్టేషన్కు తరలించారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసి, లారీలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ. కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ రోజు నిర్వహించిన తనిఖీల్లో 10 ఎర్రచందనం దుంగలను పోలీసు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.