ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట నాలుగు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న 108 ఉద్యోగులను సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేసి, చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్బంగా పోలీసులకు. ఉద్యోగలకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. అనంతరం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 31 రోజుల పాటు సమ్మె చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరం లేక నిరాహారదీక్ష చేయాల్సి వచ్చిందన్నారు.
అయితే ప్రభుత్వం జీవీకే యాజమాన్యంతో కుమ్కకై ఉద్యోగులను అరెస్టు చేసిందని ఆరోపించారు. అరెస్టులు, దీక్షల భగ్నంతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. దీక్ష చేస్తున్న పలువురి ఆరోగ్యం క్షీణంచిందని, వారికి ఏదైనా జరిగితే ప్రభుత్వం, జీవీకే యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో చదలవాడ రవి, జి. సైదులు, ఎం. శ్రీనివాసరావు, బి. వెంకటరెడ్డి, డి. రాధాకృష్ణ ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.గణపతి, కె.నర్సింహారావు, లింగయ్య, దేవి, కుమారి ఉన్నారు.
108 ఉద్యోగుల దీక్ష భగ్నం
Published Tue, Aug 20 2013 6:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement