చిత్తూరు : చిత్తూరు జిల్లాలో సమైక్యపోరు 36వ రోజుకు చేరింది.సమైక్యాంధ్రకు మద్దతుగా 14 డిపోల్లోని 1200 బస్సులు నిలిచిపోయాయి. అయితే తిరుమలకు మినహాయింపు ఇచ్చారు. మరోవైపు జేఏసీ దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. కాగా జిల్లావ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విడిపోతే చెడిపోతాం అంటూ నిరసనకారులు ఊరూవాడా కదం తొక్కుతున్నారు.