గుంటూరు: జిల్లాలోని తాడేపల్లి మండలం కుంచిపల్లిలో శనివారం కోడిపందాలపై పోలీసులు దాడులు జరిపారు. కోడిపందాల్లో పాల్గొన్న 12 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 32వేల నగదు, 5 బైక్ లు, 2 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.