కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులతో వెళ్తున్న సుమో వాహనం శనివారం పాపవినాశనం సమీపంలో బోల్తా పడింది. ఆ ప్రమాదంలో 13 మంది భక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రులంతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్ వాసులని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సుమో డ్రైవర్ అక్కడి నుంచి పరారైయ్యాడని పోలీసులు చెప్పారు.