రాష్ట్రంలో ఒకవైపు సమైక్యాంధ్ర ఆందోళనలు తీవ్రస్థాయిలో ఉన్నా.. ఒకేసారి 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి... రఘునందన్ రావును కృష్ణా జిల్లా కలెక్టర్గాను, జె.మురళిని అదే జిల్లాకు జాయింట్ కలెక్టర్గాను పంపారు. స్మితా సబర్వాల్‌ను మెదక్ కలెక్టర్‌గాను, పి.ఉషాకుమారిని శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గాను, వివేక్ యాదవ్‌ను గుంటూరు జాయింట్ కలెక్టర్‌గాను, వి.వినయ్‌చంద్‌ను పాడేరు ఐటీడీఏ పీవోగాను నియమించారు.
అలాగే, పి.బసంత్‌కుమార్‌ను చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గాను, పి.భాస్కర్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవోగాను, టి.వెంకట్రామిరెడ్డిని కాకినాడ డీసీటీవోగాను, పౌసమిబసును వరంగల్ జాయింట్ కలెక్టర్‌గాను, దినకర్‌బాబును మార్క్‌ఫెడ్ ఎండీగాను నియమించారు. కాడ్మియల్‌ను ఆగ్రోస్ వీసీ అండ్ ఎండీగాను, జ్యోతి బుద్ధప్రకాశ్‌ను రూరల్ హెల్త్ మిషన్ డెరెక్టర్‌గాను, మహ్మద్ ఇక్బాల్‌ను మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
Published Tue, Oct 8 2013 8:14 PM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM
Advertisement