'బాబు... తన ఎమ్మెల్యేలు, మంత్రులకు శిక్షణ ఇవ్వాలి' | 14th assembly sessions very sad, says YSR CP MLA Rajanna dora | Sakshi
Sakshi News home page

'బాబు... తన ఎమ్మెల్యేలు, మంత్రులకు శిక్షణ ఇవ్వాలి'

Published Thu, Sep 11 2014 1:24 PM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

'బాబు... తన ఎమ్మెల్యేలు, మంత్రులకు శిక్షణ ఇవ్వాలి' - Sakshi

'బాబు... తన ఎమ్మెల్యేలు, మంత్రులకు శిక్షణ ఇవ్వాలి'

విజయనగరం: 14వ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు బాధాకరమని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు రాజన్న దొర ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయనగరంలో మీడియా సమావేశంలో రాజన్న దొర మాట్లాడుతూ... ఇటీవల ముగిసిన సభలో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహారించిన తీరుపై రాజన్న దొర తీవ్ర ఆక్షేపణ తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆయన సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు.

అందుకు అవసరమైతే వారికి తగిన శిక్షణ ఇప్పించాలని బాబుకు హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రతిపక్షంపై అధికారపక్షం దాడి చేయడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభలో ఏవైనా ప్రశ్నలు లేవనెత్తితే .... జవాబులు చెప్పకుండా ప్రతిపక్ష సభ్యుల వ్యక్తిగత అంశాల్లోకి జోక్యం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని రాజన్న దొర ఈ సందర్బంగా అధికార పక్ష సభ్యులను ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement