సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 15 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలంటూ ఉన్నత విద్యా మండలి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. తెలంగాణ, సీమాంధ్రల్లో ఇప్పటిదాకా ఇంజనీరింగ్ కాలేజీలు లేని జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేయాలని పేర్కొంది. ప్రత్యేకంగా రెండు మహిళా ఇంజనీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాలని, వీటిని వరంగల్‌లో కాకతీయ వర్సిటీకి, తిరుపతిలో పద్మావతి మహిళా వర్సిటీకి అనుబంధంగా నెలకొల్పాలని విన్నవించింది. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా)లో భాగంగా వచ్చే మూడేళ్లలో ఇలా దాదాపు రూ. 2,701 కోట్లతో పలు విద్యా సంస్థలను రాష్ట్రంలో నెలకొల్పాలని విన్నవించింది.'
హైదరాబాద్, శ్రీకాకుళం, కర్నూలుల్లో క్లస్టర్ వర్సిటీలు ఏర్పాటు చేయాలి. వీటిలో భాగంగా 25 కి.మీ. పరిధిలోని కనీసం 3 కాలేజీలను కలిపి ఒక్కో వర్సిటీగా మారుస్తారు
పూర్తిస్థాయి యూనివర్సిటీలు: ఒంగోలు, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, మెదక్ జిల్లా సిద్దిపేట, విజయనగరం, ఖమ్మంలో మైనింగ్ యూనివర్సిటీ, హైదరాబాద్ నిజాం కాలేజీలో స్కిల్స్ యూనివర్సిటీ, అమలాపురంలో పెట్రోలియం యూనివర్సిటీ, తాడేపల్లిగూడెంలో యూనివర్సిటీ
11 కొత్త మోడల్ డిగ్రీ కాలేజీలు: ఎల్లారెడ్డి (నిజామాబాద్), నారాయణ్‌ఖేడ్ (మెదక్), కల్వకుర్తి (మహబూబ్‌నగర్), లక్సెట్టిపేట్ (ఆదిలాబాద్), ఆత్మకూరు (కర్నూలు), గుత్తి (అనంత పూర్), పాతపట్నం (శ్రీకాకుళం), చీపురుపల్లి (విజయనగరం), జగ్గంపేట (తూర్పుగోదావరి), కామవరపుకోట (పశ్చిమగోదావరి), ఎర్ర గొండపాలెం (ప్రకాశం)
మోడల్ డిగ్రీ కాలేజీలుగా 11 పాత కాలేజీలు: మంచిర్యాల (ఆదిలాబాద్), మోర్తాడ్ (నిజామాబాద్), పటాన్‌చెరు (మెదక్), షాద్‌నగర్ (మహబూబ్‌నగర్), ఎర్రగుంట్ల (కర్నూలు), అనంతపూర్, వీరఘట్టం (శ్రీకాకుళం), విజయనగరం, ఎల్లేశ్వరం (తూర్పుగోదావరి), బుట్టాయగూడెం (పశ్చిమగోదావరి), కంభం (ప్రకాశం)
కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు: జోగిపేట (మెదక్), కలికిరి (చిత్తూరు), కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, గద్వాల (మహబూబ్‌నగర్), కర్నూలు, కడప, శ్రీకాకుళం, నర్సరావుపేట (గుంటూరు), మచిలీపట్నం (కృష్ణా), నెల్లూరు, అనంతపూర్, మహిళా కాలేజీ-వరంగల్, మహిళా కాలేజీ-తిరుపతి