ఎడ్లపాడు(గుంటూరు): అక్రమంగా తరలిస్తున్న 1500 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఒంగోలు నుంచి గుంటూరుకు ఐదు లారీల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు బోయపాలెం గ్రామం వద్ద లారీలను స్వాధీనం చేసుకున్నారు.
ఐదు లారీల్లో సుమారుగా 1500 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, ముగ్గురు లారీ డ్రైవర్లు తప్పించుకోని పోగా, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.
1500 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
Published Mon, Feb 16 2015 1:50 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM
Advertisement
Advertisement