2011 గ్రూప్–1 ఇంటర్వ్యూలు ఫిబ్రవరి 13 నుంచి 15వ తేదీ వరకు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
సాక్షి, హైదరాబాద్: 2011 గ్రూప్–1 ఇంటర్వ్యూలు ఫిబ్రవరి 13 నుంచి 15వ తేదీ వరకు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శి సాయి శుక్రవారం తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011 గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించారు. ఈ ఫలితాలను గురువారం విడుదల చేశారు. 2,780 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,691 మంది అర్హత సాధించారు. 151 పోస్టులకు 290 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు.