కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్ : కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ మైదానం లో ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అధికారు లుఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలుతోపాటు అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులు పాల్గొననున్నారు. జనరల్ డ్యూటీ, ట్రేడ్‌మెన్, టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్, క్లర్క్, స్టోర్ కీపర్ విభాగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆయా తేదీల్లో ఉదయం 4:30 గంటలకే మైదానంలో హాజరుకావాల్సి ఉంటుంది.
సోల్జర్ జనరల్ డ్యూటీ..
సోల్జర్ జనరల్ డ్యూటీకి సంబంధించి అభ్యర్థులు 17 నుంచి 21 సంవత్సరాల (1993 మే 28 నుంచి 1996 నవంబర్ 28 మధ్య జన్మించినవారు)వయసు కల్గి ఉండాలి. కనీసం 45 శాతం మార్కులతో టెన్త్ ఉత్తీర్ణులైఉండాలి. 166 సెం.మీ ఎత్తు, 50 కేజీల బరువుండాలి. చాతి కొల త 77 సెం.మీ. ఉండి ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ. విస్తరించాలి. 28, 29 తేదీల్లో డాక్యుమెంట్ల పరిశీలన, 29, 30 తేదీల్లో ఫిజికల్ ఫిట్‌నెస్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్టులు నిర్వహిస్తారు.
సోల్జర్ ట్రేడ్‌మెన్..
1991 మే 28 నుంచి 1996 నవంబర్ 28లోపు జన్మించినవారు ఈ విభాగం ఉద్యోగాలకు అర్హులు. హౌస్ కీపర్, మెస్ కీపర్, సాయిస్ పోస్టులకు ఎనిమిదో తరగతి, చెఫ్, వాషర్‌మెన్, డ్రసరర్, స్టీవర్డ్, టైలర్, పెయింటర్, అర్టిషాన్(మెటలర్జీ), సపోర్టింగ్ స్టాఫ్(ఈఆర్), తాపి మేస్త్రీ పోస్టులకు,10వ తరగతి/ఐటీఐ ఉత్తీర్ణులైనవారు అర్హులు. 166 సెం.మీ ఎత్తు, 48 కేజీల బరువు, 77 సెం.మీ ఛాతీ కొలత ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు చాతి 5 సెంమీ విస్తరించాలి. ఈనెల 30వ తేదీ డాక్యుమెంట్లు పరిశీలన, 31వ తేదీన దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ ఉంటుంది.
సోల్జర్ టెక్నికల్ ఉద్యోగాలకు..
1991 మే 28 నుంచి 1996 నవంబర్ 28 మధ్య జన్మించినవారు అర్హులు. ఇంటర్ మీడియట్ సైన్స్‌తో కూడిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథమెటిక్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 165 సెం.మీ. ఎత్తు, 50 కేజీల బరువు, 77 సెం.మీ ఛాతీ కొలత ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు చాతి 5 సెంమీ పెరగాలి.
సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్..
ఈ కేటగిరీ ఉద్యోగాలకు 1991 మే 28 నుంచి 1996 నవంబర్ 28మధ్య జన్మించిన వారు అర్హులు. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులను కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. మొత్తంగా 50 శాతం పైగా మార్కులు సాధించి ఉండాలి. బీఎస్సీ డిగ్రీ కలిగినవారు బాటనీ, జువాలజీ, బయోసైన్స్, ఇంగ్లీషు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. డాక్యుమెంట పరిశీలన ఈనెల 31వ తేదీ, దేహదారుఢ్య పరీక్షలు జూన్ 1వ తేదీ ఉంటాయి.
సోల్జర్ క్లర్క్/స్టోర కీపర్ ఉద్యోగాలు..
అభ్యర్థులు 1991 మే 28 నుంచి 1996 నవంబర్ 28వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్/పదో తరగతిలో ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులు 162 సెం.మీ. ఎత్తు, 50 కేజీల బరువు కల్గి ఉండాలి. జూన్ 1వతేదీన సర్టిఫికెట్ల పరిశీలన, 3వతేదీన దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయి.
28 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
Published Sun, May 25 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement
Advertisement