షార్ట్‌సర్క్యూట్‌తో 35 గుడిసెలు దగ్ధం | 35 huts burnt with short circuit | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో 35 గుడిసెలు దగ్ధం

Published Wed, Aug 5 2015 3:10 PM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

35 huts burnt with short circuit

సీతానగరం (తూర్పుగోదావరి జిల్లా): షార్ట్‌సర్యూట్ కారణంగా 35 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కూలీలందరూ ఊరి చివరలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. కాగా, బుధవారం అందరూ కూలీ పనులకు వెళ్లిన సమయంలో షార్ట్‌సర్య్కూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది.

దీంతో గుడిసెలన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలిసిన గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టం సంభవించిందని రెవిన్యూ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement