అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు ఆదివారం ఉదయం చెరువులోని దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో నలుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. దాంతో అదే రహదారిపై వెళ్తున్న స్థానికులు వెంటనే స్పందించారు. స్థానికుల సహాయంతో ప్రయాణికులను ఒడ్డుకు తీసువచ్చారు.
గాయపడిన ప్రయాణీకులను హిందూపురంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్టీసీ బస్సులో 30 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. బస్సు అదుపు తప్పడం వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. స్థానికుల సహాయంతో చెరువులోకి దూసుకెళ్లిన బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.