ఆటోనగర్ కేంద్రంగా భీమవరం తరలించేందుకు లారీలో సిద్ధంగా వున్న 42.55 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు.
42 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
Nov 10 2013 11:35 PM | Updated on Sep 5 2018 1:38 PM
పెదకాకాని, న్యూస్‌లైన్ :ఆటోనగర్ కేంద్రంగా భీమవరం తరలించేందుకు లారీలో సిద్ధంగా వున్న 42.55 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. శ్రమనే నమ్ముకున్న అమాయక రైతులను మోసం చేసేందుకు లారీలో తరలుతున్న విత్తనాలను నోబుల్ వేబ్రిడ్జి వద్ద శనివారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. నకిలీ పత్తి విత్తనాలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళుతున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా దాడుల్లో పాల్గొని నోబుల్ వేబ్రిడ్జి వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న నకి లీ పత్తి విత్తనాల లారీని శనివారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు.
సరుకు యజమాని పేర్ల సాయికుమార్, లారీడ్రైవర్ నల్లపాటి రాజును అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా గుళ్ళపల్లి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోండ్రుపాడు, ఆటోనగర్ సూర్య సీడ్స్ కంపెనీల నుంచి ఎక్కువ భాగం శుద్ధిచేసిన విత్తనాలను సేకరించినట్లు గుర్తించారు. పలు కంపెనీ బిల్లులు సరుకు యజమాని వద్ద ఉన్నప్పటికీ వాటితో ఎటువంటి సంబంధం లేదు. రైతులకు అమ్మడానికి వీలుగా ప్యాకింగ్ చేసేందుకు తరలిస్తున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. నకిలీ పత్తి విత్తనాలు తరలించడం, కంపెనీలకు సంబంధం లేని బిల్లులు ఉండడం వెనుక నకిలీ విత్తనాల ర్యాకెట్ జిల్లాలో నడుస్తోందని,
కొందరి సిబ్బంది ప్రమేయం ఉందా అనేది అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆటోనగర్‌లో గతంలో కూడా న కిలీ విత్తనాలు తయారుచేయడంపై కేసు నమోదైంది. నకిలీ పత్తి విత్తనాల లారీని సీజ్ చేసి, నిందితులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. గుంటూరు వ్యవసాయ అధికారి వి.జగదీశ్వరరెడ్డి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.శ్రీనివాసరావు తెలిపారు. దాడుల్లో గుంటూరు ఏడీఏ సీహెచ్ రవికుమార్, విజిలెన్స్‌ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏవో బి.రవిబాబు,పెదకాకాని ఏవో బి.అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement