మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: 50,250 ఎకరాలకు సాగునీరు అందించేందుకు జలయజ్ఞం పథకంలో భాగంగా 2005లో కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. నిధుల కొరత, పాలకుల నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రి యదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా సుమారు 40 కిలోమీటర్లు తీసుకొచ్చి కోయిల్‌సాగర్ రిజర్వాయర్‌ను నింపడమే ఈ పథకం ప్రధాన ఉ ద్దేశం. రూ.359 కోట్ల అంచనావ్యయంతో పనులు చేపట్టి నిధులన్నీ ఖర్చుచేశారు.
అప్రోచ్ చానల్ 9.90 కి.మీ మేర, టన్నెల్ 10.25 కి.మీ, గ్రావిటీకాల్వ 28.75 కిలోమీటర్ల మేర తవ్వాలని నిర్ణయించారు. రెండు లిఫ్టుల ద్వారా 3.90 టీఎంసీల నీటిని వినియోగించాల్సి ఉంది. ఈ పథకం ద్వారా 72 గ్రామాలు లబ్ధిపొందనున్నాయి. కాగా, 2009 చివరి నాటికి పనులు పూర్తిచేసి 2010 ఖరీఫ్ నుంచి ఆయకట్టుకు సాగురు అందించాలనే ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులు కొరత లేకుండా మంజూరు చేశారు.
ఆయన మరణానంతరం ప్రాజెక్టుపై పర్యవేక్షణ కొరవడటంతో మరో ఏడాది గడిచినా పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఇప్పటివరకు స్టేజ్-1, స్టేజ్-2లో 90 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం పిల్లకాల్వల నిర్మాణం కోసం 720 ఎకరాలు సేకరించాల్సి ఉండగా అదీ జరగలేదు. ముఖ్యంగా పథకం ట్రయల్న్ ్రకోసం విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని అధికారులు పదేపదే నివేదికలు పంపుతున్నా ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం లేదు. 2009లో పనులు పూర్తిచేస్తామని కాంట్రాక్టర్ ఒప్పందంలో పేర్కొన్నా.. వాయిదాలు వేస్తూ 2011 మార్చి, 2012 మార్చి, 2012 జూన్ అంటూ చివరికి 2013 మార్చి నాటికి పనులు పూర్తి చేయనున్నట్లు కొత్త తేదీని ప్రకటించారు. గడువు దాటి ఆరునెలలు గడిచినా పట్టించుకునేవారు లేరు.
పెండింగ్ పనులు
రెండు సర్జ్‌పూల్స్‌తో పాటు రెండు లిఫ్టులను వినియోగించాల్సి ఉంది. స్టేజ్- 1 కింద మొదటి లిఫ్టు నర్వ మండలం ఎల్లంపల్లి వద్ద, స్టేజ్-2 కింద రెండో లిఫ్టును మరికల్ మండలం తీలేరు శివారులో ఏర్పాటు చేశారు. 40 కిలోమీటర్ల మార్గంలో 10.25 కిలో మీటర్ల మేర టన్నెల్స్ ద్వారా నీటిని పంపిస్తారు. ముఖ్యంగా ఒక్కో పంపునకు 7.5 మెగావాట్ల చొప్పున ప్రాజెక్టుకు మొత్తం 30 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. కేవలం వర్షపాతంపై ఆధారడిన కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నిండిన సందర్భాలు లేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కోయిల్‌సాగర్ ఆయకట్టు, అదనపు ఆయకట్టును కలిపి మొత్తం 50,250 ఎకరాలకు సాగునీరు ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు. విద్యుత్ కనెక్షన్‌కు ప్రభుత్వం అనుమతిస్తే ప్రాజెక్టు పరిధిలోని దేవరకద్ర మండలంలో 11,420 ఎకరాలు, చిన్నచింతకుంట మండలంలో 6,420 ఎకరాలు, ధన్వాడ మండలంలో 21,940 ఎకరాలు, కోయిల్‌కొండ మండలంలో 70 ఎకరాలు, మక్తల్ మండలంలో 3,100 ఎకరాలు, నర్వ మండలంలో 7,300 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది.
నివేదికలు పంపాం..
ఇప్పటివరకు 95 శాతం పనులు పూర్తయ్యాయి. విద్యుత్ కనెక్షన్ కోసం ప్రభుత్వ అనుమతి కోసం నివేదికలు పంపాం. అనుమతి ఇచ్చి విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన 45 రోజుల్లోనే ట్రయల్న్ ్రపూర్తిచేస్తాం.
- పురుషోత్తం, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
నిర్లక్ష్యం చేసిన పాలకులు
కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం విషయంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ఖరీఫ్‌కు నీళ్లు ఇవ్వాల్సి ఉన్నా కెనాల్‌లో ఉన్న ముళ్ల కంపలు తొలగించేందుకు కనీసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు. ప్రాజెక్టులో 32 అడుగులు నీళ్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 10 అడుగులు మాత్రమే ఉన్నాయి. ప్రాజెక్టు కింద ఉన్న భూములకు సంబంధించి రైతుల నుంచి వసూలు చేసిన శిస్తు కూడా ప్రభుత్వానికి జమ చేయలేదు. మోటార్లు ఏర్పాటు చేసినా డ్రై ట్రయల్న్ ్రచేసేందుకు కనీసం విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసినా ఫలితం లేకపోయింది.
నత్తే నయం
Published Sat, Sep 14 2013 4:24 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement