విజయనగరం: డెంగీతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో గురువారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన నర్సమ్మ(52) కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. అయితే ఆమెకు డెంగీ సోకినట్లు బుధవారం వైద్యులు తెలిపారు. కాగా, గురువారం నర్సమ్మ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది.