ఏపీ ట్రాన్స్‌కోలో ప్రమోషన్ల వ్యవహారం దుమారం రేపుతోంది.
హైదరాబాద్ : ఏపీ ట్రాన్స్‌కోలో ప్రమోషన్ల వ్యవహారం దుమారం రేపుతోంది. పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరిగిందంటూ ఇటీవల ఏపీ వ్యాప్తంగా ట్రాన్స్‌కో సబ్ ఇంజినీర్లు చేపట్టిన ఆందోళన క్రమక్రమంగా అన్ని జిల్లాలకు వ్యాపిస్తోంది.
సోమవారం ఒకటీ, రెండు జిల్లాలకే పరిమితమైన నిరసన మంగళవారానికి మిగతా ప్రాంతాలకూ పాకింది. మంగళవారం అనంతపురం, వైఎస్సార్ , కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన దాదాపు 630 మంది సబ్ ఇంజినీర్లు సామూహిక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు.