‘రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలి’ | 65years to be increased University faculty retirement | Sakshi
Sakshi News home page

‘రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలి’

Published Wed, Dec 17 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

65years to be increased University faculty retirement

సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లోని అధ్యాపకుల పదవీవిరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఏపీఎఫ్‌యూటీఏ) ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించింది. యూజీసీ రెగ్యులేషన్స్ 2010 చట్టం ప్రకారం యూనివర్సిటీ అధ్యాపకుల పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలుగా ఇదివరకే నిర్ణయించారని గుర్తుచేసింది. గతంలో వర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంటు వయసు 62 సంవత్సరాలుగా ఉండేదని, ఈ కొత్త చట్టంప్రకారమైనా రాష్ట్రప్రభుత్వం 65 ఏళ్లకు పెంచాలని పేర్కొంది. ఈమేరకు ఏపీఎఫ్‌యూటీఏ సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ కె.జాన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement