రెండు రాష్ట్రాల మధ్య 8 చోట్ల చెక్‌పోస్టులు | 8 check posts between the two states | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల మధ్య 8 చోట్ల చెక్‌పోస్టులు

Published Thu, Jul 17 2014 1:35 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

8 check posts between the two states

హైదరాబాద్: ఏపీ, తెలంగాణల మధ్య ఎంత విలువైన సరుకు రవాణా అవుతుందో తెలుసుకునేందుకు ఆరు నెలలపాటు తాత్కాలికంగా ఎనిమిది చోట్ల సరిహద్దు చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారమిక్కడ తెలిపారు. హైదరాబాద్-కర్నూలు రోడ్డులో కర్నూలు వద్ద, కల్వకుర్తి-శ్రీశైలం రహదారిలో సున్నిపెంట వద్ద, మాచర్ల-దేవరకొండ మార్గంలో మాచర్ల వద్ద, మిర్యాలగూడ-ఒంగోలు మార్గంలో దాచేపల్లి వద్ద, నందిగామ-హైదరాబాద్ రోడ్డులో గరికపాడు వద్ద, ఖమ్మం-విజయవాడ మార్గంలో తిరువూరు, కొండపల్లి దగ్గర, ఖమ్మం-రాజమండ్రి మధ్య జీలుగుమల్లి వద్ద ఈ చెక్‌పోస్టులు పదిహేను రోజుల్లో ఏర్పాటవుతాయని పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement